government regulations
-
ఎవరికీ ఆదాయం రాకుండా ప్రభుత్వ నిబంధనలు
ముంబై: చెల్లింపుల సర్వీసులు అందించే సంస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదాయం ఆర్జించేందుకు వీలు లేకుండా ప్రభుత్వ నిబంధనలు ఉంటున్నాయని యాక్సిస్ బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరి వ్యాఖ్యానించారు. దీని వల్ల చిన్న సంస్థలు బతికి బట్టకట్టడం కష్టమవుతుందని పేర్కొన్నారు. ‘పేమెంట్స్ విభాగంలో మేము ఆదాయం ఆర్జించేందుకు ప్రభుత్వం ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దీన్ని అడ్డుపెట్టుకుని వేరే దగ్గరెక్కడో డబ్బు సంపాదించుకోవాలే తప్ప పేమెంట్స్ విభాగంలో ఏ సంస్థా సొమ్ము చేసుకోలేని పరిస్థితి ఉంది‘ అని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చౌదరి చెప్పరు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చినప్పటికీ ఆ సర్వీసులు ఉచితంగానే ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాలు సదరు సంస్థలకు సమస్యగా మారాయి. యూపీఐ సేవలకూ మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) విధించే అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో చౌదరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యాక్సిస్ బ్యాంకు.. ఫ్రీచార్జ్ అనే పేమెంట్స్ కంపెనీని నిర్వహిస్తోంది. ‘ఆదాయం రాని సేవలు అందించడం ద్వారా వచ్చే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు మాకు ఇతరత్రా అవకాశాలు కల్పించాలన్న సంగతి అర్థం చేసుకున్నా కూడా నియంత్రణ సంస్థలు పైసా రాని పనులెన్నో చేయాలంటూ బ్యాంకులను ఆదేశిస్తుంటాయి‘ అని చౌదరి చెప్పారు. ఈ నేపథ్యంలో బడా టెక్ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా ఆదాయాలు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, గూగుల్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. -
పేదల ఇంటికి ని‘బంధనాలు’
ప్రభుత్వ నిబంధనలతో పేదోడి సొంతింటి కల నెరవేరేలా కనిపించడంలేదు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా నియోజకవర్గంలో 1,250 ఇళ్లు నిర్మిస్తామన్న ప్రకటనతో ఆనందం వ్యక్తం చేసిన ప్రజలకు నిరాశ ఎదురవుతోంది. 300 చదరపు గజాల స్థలం ఉన్న వారికే ఇల్లు అని మెలిక పెట్టడంతో పేదలు తమ పరిస్థితి ఏంటని మదనపడుతున్నారు. అంత స్థలమే ఉంటే తామే సొంతంగా ఇల్లు నిర్మించుకునే వారమని.. ఇప్పుడేంటి ఈ ని‘బంధనాల’ని వాపోతున్నారు. శ్రీకాకుళం టౌన్ : అంబేడ్కర్ జయంత్యుత్సవాల్లో భాగంగా గురువారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకాన్ని ఆర్భాటంగా ప్రభుత్వం ప్రారంభించింది. అర్హులైన పేదలందరికి ఈ పథకం ద్వారా ఇళ్ల నిర్మిస్తామని చెప్పింది. 300 చ.గజాల స్థలం ఉన్న వారికి ఇళ్లు ఇస్తామని తెలిపింది. ఒక్కో నియోజకవర్గానికి 1,250 ఇళ్లు ఈ పథకం కింద మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఇంతవరకు యూనిట్ విలువ ఖరారు కాకపోవడం, అర్హులకు ఇళ్లు మంజూరు చేయకుండా మొక్కుబడిగా శంకుస్థాపనలు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పాతులవలసలో శంకుస్థాపనతో సరి? ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం ద్వారా ఇళ్ల నిర్మాణానికి టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస నియోజకవర్గాల్లో మూడేసి గ్రామాలు, శ్రీకాకుళం నియోజకవర్గంలో నాలుగు, పాతపట్నం నియోజకవర్గంలో రెండు గ్రామాల్లో శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలతోపాటు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలున్న పాలకొండ, రాజాంలలో ఒక్కో గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేసి అక్కడ శంకుస్థాపనలు చేయాలని అధికారులు ఎమ్మెల్యేలకు సూచించారు. అన్ని నియోజకవర్గాలకు 1,250 ఇళ్లను మంజూరు చేస్తే ఈ నాలుగు నియోజకవర్గాల్లో శంకుస్థాపనలకు ఎందుకు మోకాలడ్డుతున్నారంటూ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. కేవలం శ్రీకాకుళం నియోజకవర్గంలోని పాతులవలస గ్రామంలో మాత్రమే ఇళ్ల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేయడం విశేషం. గత లేవుట్లలోనే.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క ఇళ్లు కూడా మంజూరు కాలేదు. ఎట్టకేలకు ఎన్టీఆ ర్ గృహ నిర్మాణ పథకం మొదలైనా వాటికి నిబంధనలు అడ్డుగా చూపుతున్నారు. గ్రూపు ఇళ్ల కోసం ఒకేచోట భూమినిసేకరించాలి. గత ప్రభుత్వం పేదల కు ఇళ్లు కట్టేందుకు భూమిని సేకరించి లే అవుట్లను సిద్ధం చేసింది. ఆ లేవుట్లలోనే ఇప్పుడు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంకింద ఇళ్లుమంజూర్లు చేయాల్సి ఉంది. గ్రామాల్లో స్థలాభావం ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారునికి 300 చదరపు గజాల సొంత స్థలం ఉన్నట్టయితే ఇళ్లు మంజూరవుతుంది. గ్రామాల్లో 300 చదరపు గజాల స్థలం పేదలకు ఉండడం లేదు. గిరిజన ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. మత్య్సకార గ్రామాల్లో స్థలాభావం ఉంది. దీంతో ఇక్కడ నివశిస్తున్న పేదలకు ఇళ్లు కట్టివ్వలేమని గృహ నిర్మాణశాఖ అధికారులు తేల్చి చెబుతున్నారు. నిబంధనల పేరుతో అధికారులు వివక్ష చూపుతున్నారని, ఇలాగైతే ప్రజల మద్యకు ఎలా వెళ్లగలమని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న చిన్నపాటి స్థలంలో ఇళ్లు మంజూరు చేయకుండా 1,250 ఇళ్లు ఎవరికి ఇవ్వాలో మీరే చెప్పండంటూ ఎమ్మెల్యేలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. * పలాస ఎమ్మెల్యే గౌతుశ్యామసుందర శివాజీ తన నియోజకవర్గంలోని బ్రాహ్మణతర్లా గ్రామంలో పేదలకు ఇళ్లు ఇవ్వాలని కోరారు. నిబంధనల పేరుతో అధికారులు ఆ జాబితాను తిరస్కరించారు. * మంత్రి అచ్చెన్నాయుడు తన నియోజకవర్గ పరిధిలోని టెక్కలి,కోటబొమ్మాళిమండలాల్లో మూడు చోట్ల కాలనీలు మంజూరుచేశారు. వాటికి నిబంధనల ప్రకా రం లేఅవుట్లు వేసి కాలనీ ఏర్పాటు చేయనున్నారు. * పాలకొండ నియోజకవర్గంలోని భామిని మండలం కోసలి, రాజాం నియోజకవర్గంలో దేవకి వాడ గ్రామాల్లో శంకుస్థాపనకు సిద్ధం చేశారు. మిగిలిన గ్రామాల్లో లేఅవుట్లు లేవంటూ లబ్ధిదారుల ఎంపికకు నిబంధనలు అడ్డమని అధికారులు చెబుతున్నారు. * ఇన్ని గందరగోళ పరిస్థితుల మధ్య ఎన్టీఆర్ గృహనిర్మాణం లబ్ధిదారుల దరి ఎలా చేరుతుందో వేచి చూడాలి. -
37 ప్రైవేట్ కళాశాలలకు నోటీసులు
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ నిబంధనలకు వ్యతి రేకంగా వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కళాశాలలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లాలో ఐదు టాస్క్ ఫోర్స్ బృందాలు 12,13 తేదీల్లో దాడు లు నిర్వహించారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న 37 కళాశాలల్లో తనిఖీలు నిర్వహించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న జాబితాలో పలు ప్రముఖ కళాశాలలు ఉన్నాయి. మెహిదీపట్నం తార్నాక, సంతోష్‌నగర్, న్యూనల్లకుంట, నల్లకుంటలోని నారాయణ జూనియర్ కళాశాలలు, డీడీ కాలనీ,ఎస్ఆర్నగర్, సైదాబాద్ల్లోని శ్రీచైతన్య, బర్కత్‌పురా,చార్మినార్‌లలోని గాయత్రీ, లక్డీకాపూల్‌లో తపస్వీ, మలక్‌పేట్‌లో ఎంఎస్, సైదాబాద్‌లో శ్రీనివాస, హిమాయత్‌నగర్‌లో గురు, సంతోష్‌నగర్‌లో గౌతమి, ఎస్ఆర్నగర్లో సీఎంఎస్ థామస్ జూనియర్ కళాశాలలకు నోటీసులు జారీచేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
బాల్య వివాహానికి అడ్డుకట్ట!
ఎర్రబొట్టు కార్యక్రమాన్ని నిలిపివేసిన సూపర్వైజర్, సర్పంచ్ పెళ్లి చేయమని హామీ ఇచ్చిన అమ్మారుు తల్లిదండ్రులు కెరమెరి : మరో నెల తర్వాత వివాహం.. అందుకు ఆ కుటుంబంలో సందడి నెలకొంది. పెళ్లికి ముందు నిర్వహించే కార్యక్రమం ఎర్రబొట్టును ఆదివారం ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రమీల, మోడీ గ్రామ పంచాయతీ సర్పంచ్ పెందూర్ జలపతి అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మోడి పంచాయతీ పరిధి కొలాంఝరి గ్రామానికి చెందిన టేకం భీంరావు, కన్నిబాయి దంపతుల కూతురు సోంబాయి(14)తో ముర్కిలొంక గ్రామానికి చెందిన ఆత్రం రాజు(18)కు నెల తర్వాత వివాహం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఎర్రబొట్టు కార్యక్రమం నిర్వహిస్తున్నారని అందుకున్న సమాచారంతో సూపర్వైజర్ ప్రమీల, సర్పంచ్ జలపతి ఆ గ్రామానికి వెళ్లారు. ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అబ్బాయి, అమ్మాయిల వయసు చాలా తక్కువగా ఉందని, ఇది చట్టవిరుద్దమని తెలిపారు. అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సారాల వయసు ఉండాలని, అప్పుడే వివాహానికి అర్హులని పేర్కొన్నారు.ను అతిక్రమించి పెళ్లి జరిపిస్తే రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు, రూ.2 లక్షల జరిమానా విధించనున్నట్లు చెప్పారు. అలాగే చిన్నతనంలో పెళ్లి చేస్తే భవిష్యత్తులో జరిగే అనర్థాలను వివరించారు. దీంతో వయసు నిండాకే వివాహం చేస్తామని అమ్మాయి తల్లిదండ్రులు హామి ఇచ్చారు. అమ్మాయిల చదువు కోసం చాలా చేస్తుందని పాపను చదివిస్తే సమాజంగురించి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ,ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. దీంతో ఎర్రబొట్టు కార్యాక్రమానికి వచ్చిన బంధువులతో పాటు కుటుంభ సభ్యులు ప్రమీలమాటలకు ఏకీభవించి కార్యక్రమాన్ని నిలిపివేశారు. -
కుదిరితే రాజీ .. లేదంటే టెండర్ రద్దు
- బల్దియాలో అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు - 50 రోజులుగా తెరవని రూ.4.5 లక్షల విలువైన టెండర్లు - కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకేనని ఆరోపణలు కోల్‌సిటీ : రామగుండం నగరపాలక సంస్థలో కాంట్రాక్టర్ల పెత్తనమే నడుస్తోంది. అధికారులు సైతం ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలి వారికే వంతపాడుతున్నారు. కాంట్రాక్టరకు లబ్ధిచేకూర్చడానికి టెండర్లు ఖరారు కాకుండా జాప్యం చేస్తున్నారు. ‘కుదిరితే సిండికేట్.. కుదరకపోతే టెండర్ల రద్దు’ చేయడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. రూ.4.5 కోట్లతో పిలిచిన టెండర్లు 50 రోజు లు గడుస్తున్నా తెరవక పోవడం ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. రామగుండం కార్పొరేషన్ అధికారులు నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఇటీవల పిలిచిన రూ.4.5 కోట్ల టెండర్లను 50 రోజులు దాటినా ఖారారు చేయలేదు. జూన్ 16న టెం డర్లు తెరవాల్సి ఉండగా ఇప్పటికీ ఆ ఊసేలేదు. ఈ టెండర్ల లో పనులు దక్కించుకోవడానికి కొందరు కాంట్రాక్టర్లు రాజీకి వచ్చారు. వీరి నుంచి కమీషన్ల రూపంలో రూ.36 లక్షల వరకు వసూలు చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే వీటి పంపకాల్లో వివాదం తలెత్తడంతో టెండర్లను తాత్కాలికంగా జాప్యం చేయాలని అధికారులపై కాంట్రాక్ట ర్లు ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. రూ.35 లక్షల టెండర్ల పరిస్థితి అయోమయం ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా ఇటీవల రూ.35లక్షల విలువై న పనులకు పిలిచిన టెండర్ల పరిస్థితి సైతం అయోమయానికి దారితీస్తోంది. ఈ టెండర్లకు గురువారం షెడ్యూళ్ల దాఖాలకు చివరి తేదీ.. నేడు ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే గతంలో పిలిచిన రూ.4.5 కోట్ల టెండర్లను ఖరారు చేయని అధికారులు, కొత్తగా పిలిచిన రూ.35 లక్షల టెండర్లను వాయిదా వేస్తారనే ప్రచారం జరుగుతోంది. నోరుమెదపని అధికారులు బల్దియాలోని అనేక టెండర్లపై ఆరోపణలు వస్తున్నా వాటి పై అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం నోరుకూడా మెదపడంలేదు. పారిశుధ్య కార్మికులకు పిలిచి న టెండర్లను తెరవడానికి మూడు నెలలపాటు ఆలస్యం చేసి చివరికి ఖరారు చేశారు. వీటికి బల్దియా పాలకవర్గం అనుమతి తీసుకోకుండానే పెండింగ్ అప్రోవల్తో జీతాలు చెల్లిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వీటితోపాటు రూ.4.5 కోట్ల టెండర్లలోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, వీటిని రద్దు చేయాలంటూ అధికారి పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు పోటీపడి ఆరోపణలు చేశారు. ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు ఇచ్చారు. వీటిపై స్పందించి విచారణ జరిపిన నాథుడు లేడు. కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం టెండర్లను తెరవాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ గందరోగళంపై పాలకవర్గం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
వాయిదాల రుణమాఫీ మాకొద్దు
- డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేయాలని తీర్మానం - ఐకేపీ అధికారిని చుట్టు ముట్టిన మహిళలు - సర్పంచ్ జోక్యంతో శాంతించిన మహిళలు రామచంద్రాపురం: వాయిదాల రుణమాఫీ మాకొద్దు,డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేయాలంటూ మండలంలోని అనుపల్లి గ్రామసమాఖ్య మహిళలు గురువారం జరిగిన గ్రామసమాఖ్యలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. డ్వాక్రా సంఘాల సభ్యులకు ఇచ్చే రూ.10 వేలను కూడా వాయిదా పద్ధతిలో ఇవ్వడాన్ని మహిళలు తీవ్రంగా వ్యతిరేకించారు. మొదటి విడత విడుదల చేసే రూ.3 వేలను కూడా సంఘంలోని రీవాల్వింగ్ ఫండ్‌గా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందుగా డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, గద్దెనెక్కిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత డ్వాక్రా రుణాలను మాఫీ చేయకపోవడం దారుణమన్నారు. గ్రామసమాఖ్య సమావేశానికి హాజరైన ఐకేపీ సీసీ జేకే రెడ్డిని మహిళలు చుట్టుముట్టారు. దీంతో స్థానిక సర్పంచ్ యద్దల చంద్రశేఖర్‌రెడ్డి జోక్యం చేసుకుని మహిళలకు సర్థి చెప్పారు. దీంతో మహిళలు శాంతించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్ర భుత్వం మహిళలను ఆర్థిక సంక్షోభం లో కి నెట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయే లా చేసిందని ఆరోపించారు. సీఎం మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గ్రామసమాఖ్య అధ్యక్షురాలు కృష్ణమ్మ, సంఘమిత్ర సుబ్బరత్న, మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
వేషాలు వేయొద్దు..
ఏన్కూరు: ‘చెరువు అభివృద్ధి పనుల్లో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా.. ఎన్నాళ్ల నుంచి చెరువు పనులు జరుగుతున్నాయి. పనులు పారదర్శకంగా నిర్వహించాలి. వేషాలు, డ్రామాలు వేయొద్దు’ అని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇరిగేషన్ అధికారులపై మండిపడ్డారు. మండల కేంద్రంలోని ఊరచెరువు అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. చెరువు పనులు ఎప్పుడు ప్రారంభించారు. చెరువు ఆయకట్టు కింద ఎన్ని ఎకరాలు భూమి ఉన్నది.. ఇప్పుటి వరకు ఏం పనులు చేశారు?, పనులు నాణ్యతగా చేస్తున్నారా? పనుల రికార్డులు చూపించండి అని ఇగిరేషన్ శాఖ అధికారులను అడిగారు. వారు సరైన రికార్డులు చూపించకపోవడంతో ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని సంవత్సరాలు నుంచి ఉద్యోగం చేస్తున్నారు?, డ్రామాలు, వేషాలు వేయకండి, పనులు రైతులకు ఉపయోగపడేలా చేయండి అని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు, అధికారులు చెరువు పనుల్లో భాగస్వామ్యం పెంచాలని కోరారు. చెరువు కట్టలపై రోలర్ తిరిగించాలన్నారు. తూములు, అలుగుల నిర్మాణం పటిష్టంగా ఉండాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పనులను పటిష్టంగా చేయూలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఎంపీ వెంట ఎంపీపీ బాణోత్ మాధవి, జెడ్పీటీసీ కోపెల శ్యామల, తహశీల్దార్ పూసా సాంబశివరావు, ఎంపీడీవో కె.పాపారాణి, ఇరిగేషన్ డీఈ అంజయ్య, ఏఈ భగీరథబాబు, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొర్రా రాజశేఖర్, నాయకులు సూతకాని జైపాల్, ముక్తి వెంకటేశ్వర్లు, నల్లమల వెంకటేశ్వర్లు, శివకుమార్, డి.రామారావు, లచ్చిరాంనాయక ఉన్నారు. -
రికార్డులకెక్కని రైతుల చావులు
వాతావరణ ప్రతికూల పరిస్థితులు.. కలిసిరాని ఖరీఫ్.. పంటకు అందని సర్కార్ సాయం.. పెట్టుబడికి ఆదుకోని త‘రుణం’.. కరెంటు ‘కట్’కట.. ఎండిన పంటలు.. శక్తులన్నీ ఒడ్డి, ఆస్తులనమ్మి.. కొండంత ఆశతో పంటలు సాగు చేస్తే నెర్రెలు బారిన నేలలు రైతు గుండె పగిలేలా చేశాయి. రైతులు చేసిన అప్పులు.. దిగుబడి రాని పంటలు.. గుదిబండలా మారాయి. దిక్కుతోచని స్థితిలో ఉరి వేసుకుని.. పురుగుల మందులు తాగి నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఫలితంగా ఆయా కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. పంట లేదు.. కుటుంబ యజమానీ లేడు.. ప్రభుత్వ ఆర్థిక సాయం అందలేదు.. ఉన్నదంతా గుండె నిండా బాధే.. కళ్ల నిండా కన్నీళ్లే.. - నిబంధనలతో నిరీక్షణ - ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఏదీ చేయూత..? - జాప్యంతో ఆర్థికంగా మరింత కుంగిపోతున్న బాధితులు - అధికారికంగా గుర్తించింది అత్యల్పం - గడిచిన ఎనిమిదేళ్లలో 521 మంది ఆత్మహత్య.. గుర్తించింది 116 మందినే.. - త్రీమెన్ కమిటీ జాప్యం ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ప్రభుత్వ నిబంధనలు రైతుల కుటుంబాలకు గుది బండలా మారాయి. పంటలు లేక పరలోకానికి పయనమైన రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు సర్కార్ వెనకడుగు వేస్తోంది. ఏళ్లు గడిస్తే గానీ వారికి ఆసరా అందని పరిస్థితి. కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయి ఆయా కుటుంబసభ్యులు దుఃఖాన్ని దిగమింగుకుని సాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కమిటీల నివేదికలంటూ ఏళ్లు గడిచిపోతున్నాయి. ఒకవేళ పరిహారం మం జూరైనా అది చేతికి రావడానికి మరో ఏడాది గడవాల్సిందే. గడిచిన ఎని మిదేళ్లలో ఇప్పటి వరకు 521 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడితే.. 116మందిని మాత్రమే అర్హులుగా ఎంపిక చేశారు. నివేదిక సిద్ధం చేసి మిగిలిన 270 మందిని మరోసారి చంపేశారు. ఇంకా 135చావులు విచారణలోనే కొనసా..గుతున్నాయి. ఇతర కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ ఆర్థిక సాయం అందించలేదు. తమ వాళ్లు పంట ల దిగుబడి రాకనే ఆత్మహత్య చేసుకున్నారని ఆయా కుటుం బాలు దరఖాస్తులు చేసుకున్నా.. వాటిని తిరస్కరించారు. ప్రభుత్వం గుర్తించింది.. జిల్లాలో ఖరీఫ్ నుంచి ఇప్పటివరకు 89 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. అయి నా.. ఆ ఆత్మహత్యల్లో వాస్తవం లేదంటూ అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. కేవలం 66 మంది రైతుల ఆత్మహత్యలపై విచారణ చేపట్టిన అధికారులు 17మంది రైతులు వ్యవసాయంలో సంక్షోభంతో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తేల్చారు. ఇప్పటివరకు తొ మ్మిది కుటుంబాలకు పరిహారం అందించారు. మిగతా ఎనిమిది కుటుంబాలకే ప్రభుత్వ సహా యం అందుతుందని కుండబద్దలు కొట్టారు. ఈ ఏడాది 10 మంది వరకు కౌలు రైతులు కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు నిరాసక్తత చూపుతుండడంతో ప్రైవేటు అప్పుల భారం మోయలేకపోతున్నారు. జిల్లాలో 50 వేల మంది కౌలు రైతులుండగా.. ఈ ఏడాది ఒక్క కౌలు రైతుకు గుర్తింపు కార్డు రాలేదు. రుణం ఇవ్వలేదు. ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చినా.. అన్నదాత బతుకులు మారడం లేదు. అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా రైతుల సమస్యలను పూర్తిస్థాయిలో పట్టించుకున్న దాఖలాలు లేవు. ఖరీఫ్ ఆరంభం నుంచి రుణాల మాఫీ, సాగుకు కొత్త రుణాల మంజూరు, గతేడాది దెబ్బతిన్న పంటలకు పరిహారం, పంటలకు మద్దతు ధర కల్పించడంలో విఫలమైంది. అమలు కాని జీవో 2004 జూన్ ఒకటిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆత్మహత్యలు నిర్ధారణపై జీవో 421 ప్రవేశపెట్టింది. దీని ప్రకా రం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులను నిర్ధారించేందుకు గాను త్రీమెన్ కమిటీ వేసింది. ఇందులో స్థానిక పోలీ సు, రెవెన్యూ, వ్యవసాయాధికారి సభ్యులుగా ఉంటారు. రైతును గుర్తించి, దర్యాప్తుచేసి, ఆత్మహత్యగా నిర్ధారించి వీరు ప్రభుత్వానికి నివేదిక పంపాల్సి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం ప్రాథమిక ఆర్థికసాయం కింద రూ.50వేలు మరో దఫా రూ.లక్షను ఎక్స్‌గ్రేషియా కింద మంజూరు చేస్తుంది. దీంతోపాటే కుటుంబంలో చదువుకునే పిల్లలుంటే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకోవాలి. తదుపరి ప్రభుత్వం నుంచి ఉపా ధి కల్పించాలి. మృతుని భార్యను వితంతువుగా గుర్తించి పింఛన్ ఇవ్వాలి. కానీ.. జిల్లాలో ఎక్కడా ఈ జీవో ప్రకారం అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో అర్హులైన రైతు కుటుంబాలకు సహాయం అందకుండా పోతోంది. నిబంధనలతో కన్నీళ్లు.. జీవో 421లోని నిబంధనలు రైతు కుంటుంబాలకు ఆర్థిక సాయం అందకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా జీవో ప్రకారం రైతు అయి ఉండి పంటల సాగు కోసం విత్తనాలు, ఎరువులకు అప్పులు చేసి ఉండాలి. దీనిపై నిర్దారణ కోసం వేసిన త్రీమెన్ అధికారులు ఇదే విషయాన్ని గుర్తించి నివేదిక ఇవ్వాలి. కానీ.. త్రీమెన్ కమిటీ అధికారులు జాప్యం చేస్తున్నారు. దీంతో ఆర్థిక సహాయం అందడంలో ఆలస్యమవుతోంది. జిల్లాలో బలవర్మణానికి పాల్పడిన రైతులు కేవలం ఇవే కారణాలతోనే కాదు.. ఒక ఏడాది అతివృష్టి, మరో ఏడాది అనావృష్టితో, వడగడ్ల వానలతో పంటలు తీవ్రంగా నష్టపోవడం.. పంటలు సరిగా పండక, పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఇంటి అవసరాలకు అప్పులు చేస్తున్నారు. కానీ.. జీవో ప్రకారం దర్యాప్తుతో రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక సాయం అందడం లేదు. -
నిబంధనలకు పాతర..ఇసుక జాతర
పెదపులిపాక క్వారీలోకి ప్రవేశిస్తున్న భారీ లారీలు ప్రభుత్వ జీవో 95కు తూట్లు చోద్యం చూస్నున్న అధికారులు స్టాక్పాయింటే లేదు... ర్యాంపు నిరుపయోగం పెదపులిపాక(పెనమలూరు) : తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం,అధికారుల నిర్లక్ష్యం కారణంగా పెదపులిపాకలో ప్రభుత్వ నిబంధనల అమలుకు నోచుకోవడం లేదు. .ఇసుక క్వారీల్లోకి 3 క్యూబిక్ మీటర్లకు మించి లోడ్ ఉన్న వాహనాలను అనుమతించరాదని ప్రభుత్వ జీవో 95లో స్పష్టంగా ఉన్నా.... అధికారులు భారీ వాహనాలను అనుమతిస్తూనే ఉన్నారు. అలాగే ఇసుక లోతుగా తవ్వుతుండడంతో నదిలో పర్యావరణానికి, భూగర్భజలాలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఏర్పడింది. ఇసుకకు డిమాండ్ బాగా పెరగడంతో పెదపులిపాక ఇసుక క్వారీని ఇటీవలే ప్రభుత్వం హడావిడిగా ప్రారంభించింది. అయితే ఈ క్వారీ ప్రారంభించిన ప్పటి నుంచి అనేక వివాదాలు తలెత్తుతున్నాయి. పెద్ద వాహనాల ద్వారా ఇసుక తరలించాలంటే ఇసుక క్వారీ బయట స్టాక్‌పాయింట్ ఏర్పాటు చేయాలి. అక్కడి నుంచి భారీ వాహనాల్లో గరిష్టంగా ఆరు క్యూబిక్ మీటర్ల వరకు ఇసుక తరలించడానికి పర్మిట్లు ఇచ్చి అనుమతించాలి. క్వారీలో ఏం జరుగుతోందంటే... పెదపులిపాక ఇసుక క్వారీలో నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేశారు. ఇక్కడ తెలుగు తమ్ముళ్ల హడావిడి విపరీతంగా ఉండటంతో ఆడిందే ఆట పాడిందే పాటగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. పర్యావరణం, భూగర్భ జలాలు, జీవోలోని నిబంధనలు పట్టించుకోకుండా అడ్డగోలుగా ఇసుక క్వారీయింగ్ చేస్నున్నారు. ప్రతి రోజు వంద లారీల్లో ఇసుక తరలిస్తున్నారు. ఇసుక తవ్వకాలు కూడా నదీ ప్రవాహానికంటే లోతుగా జరుగుతున్నాయి. క్వారీకి అతి సమీపంలో 10 ఎంజీడీ తాగునీరు సంప్ కూడా ఉంది. దానిని సైతం పట్టించుకోకుండా క్వారియింగ్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. స్టాక్ పాయింట్ ఏదీ..? ఈ క్వారీకి స్టాక్‌పాయింట్ ఏర్పాటు చేయాలని గతంలో పరిశీలిలనకు వచ్చిన కలెక్టర్ రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు. స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసే భారీ వాహనాలు నదిలోకి వెళ్లకుండా స్టాక్‌పాయింట్ వద్ద నుంచి మాత్రమే ఇసుక తరలించాల్సి ఉంది. అయితే తమ్ముళ్ల ఒత్తిడి మేరకు స్టాక్‌పాయింట్ పెట్టకుండా లారీలను నేరుగా నదిలోకి తీసుకు వెళుతున్నారు.దీంతో ఇక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడడమే కాకుండా... లారీల కోసం పనికిరాని ర్యాంప్ నిర్మాణం చేసి నిధులు మట్టిపాలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతా... ఈ విషయమై సెర్ఫ్ కో-ఆర్డినేటర్ మరియబాబును వివరణ కోరగా క్వారీలోకి భారీ వాహనాలు వెళ్లడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతానని ఆయన చెప్పారు. -
ఆ ఎంపీపీకి ముగ్గురు పిల్లలున్నారు !
స్థానిక సంస్థలకు పోటీ చేసే అభ్యర్థులు 1995 తరువాత ఇద్దరికి మించి సంతానం కలిగి ఉండరాదని ప్రభుత్వం నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే అభ్యర్థులు తమ సంతానం వివరాలను ఎన్నికల అధికారులకు రాత పూర్వకంగా వివరించాల్సి ఉంటుంది. మోర్తాడ్ ఎంపీపీగా ఎన్నిక కాక ముందు దొన్కల్ ఎంపీటీసీ స్థానంకు నామినేషన్ వేసిన చిన్నయ్య తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని వెల్లడించారు. అయితే చిన్నయ్యకు ఇద్దరు ఆడపిల్లలతో పాటు ఒక కొడుకు ఉన్నాడని, చిన్న కూతురు 1995 తరువాతనే జన్మించిందని టీఆర్ఎస్ నాయకులు పేర్కొంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన చిన్నయ్యను ఎంపీపీ పదవి నుంచి తొలగిస్తూ, ఎంపీటీసీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో వారు కోరారు. చిన్నయ్యకు మొదటి భార్య ద్వారా ఒక కొడుకు ఉన్నాడని, మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత రెండో భార్యను చేసుకోగా ఇద్దరు కూతుళ్లు జన్మించారని ఫిర్యాదులో వివరించారు. 1995 తరువాత మూడో సంతానం కలుగగా ఆయన ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలను ఇచ్చారని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు అందగా వారు విచారణ జరిపి ఎన్నికల సంఘంకు నివేదిక అందించాల్సి ఉంది. కాగా దళితుడైనందుననే కొందరు అగ్రవర్ణాల నాయకులు తనపై కక్షగట్టి తప్పుడు ఫిర్యాదు చేశారని ఎంపీపీ చిన్నయ్య ఆరోపిస్తున్నారు. తనకు ఇద్దరు కూతుళ్లు మాత్రమే ఉన్నారని చెబుతున్నారు. డ్రా పద్ధతిలో ఎంపికైన ఎంపీపీ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల తరువాత ఎంపీపీ పీఠంపై కాంగ్రెస్, టీఆర్ఎస్ పట్టుబట్టి ఎవరి ప్రయత్నం వారు చేశారు. కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు ఉన్నా కొందరు ఎంపీటీసీ సభ్యులు టీఆర్ఎస్ శిబిరంలో చేరడంతో ఎంపీపీ ఎన్నికకు పోటీ అనివార్యం అయ్యింది. డ్రా పద్ధతిలో ఎంపీపీగా చిన్నయ్య ఎంపికయ్యారు. తాను ప్రతిపక్ష పార్టీ ద్వారా ఎంపీపీగా ఎన్నిక కావడం వల్లనే అధికార పార్టీ నాయకులు తప్పుడు ఫిర్యాదులు చేస్తు అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంపీపీ ఆరోపించారు. ఎలాంటి ఆరోపణలనైనా తిప్పి కొడతానని, తన పదవికి ఎలాంటి ఢోకా లేదని చెబుతున్నారు. -
సెల్ టవర్లపై విజి‘లెన్స్’
పన్నుల ఎగవేతపై ప్రభుత్వం దృష్టి ఎగ్గొడుతున్న సంస్థల వివరాల సేకరణ పనిలో నిమగ్నమైన కార్యదర్శులు నక్కపల్లి: నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా ఏర్పాటవుతూ స్థానిక సంస్థలకు బకాయిలను ఎగ్గొడుతున్న సెల్ టవర్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏళ్ల తరబడి చెల్లించాల్సిన బకాయిలను ముక్కుపిండి వసూలు చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖను రంగంలోకి దించింది. ఈ చర్యల్లో భాగంగా జిల్లాలో ఏ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఎన్ని సెల్ టవర్లున్నాయి, వాటి ఏర్పాటులో ఆపరేటర్లు నిబంధనలు పాటించారా, లేదా, ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీలకు లెసైన్స్ ఫీజు చెల్లించారా లేదా, సెల్‌టవర్ ఏర్పాటులో అన్ని అనుమతులు తీసుకున్నారా లేదా తదితర వివరాలను విజిలెన్స్, అండ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ అధికారులు ఆరా తీస్తున్నారు. వారం రోజులుగా పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని సెల్ టవర్ల నిర్మాణాల వివరాల సేకరణలో నిమగ్నమయ్యా రు. జిల్లా వ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో 311 సెల్‌టవర్లు ఉండగా గ్రామీణ ప్రాంతంలో 161, పట్టణ ప్రాంతంలో 150 ఉన్నాయి. మరో 52 టవర్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. వివిధ ప్రైవేటు సర్వీసు ప్రొవైడర్ల ఆధ్వర్యంలో మరో 2000కు పైగా సెల్టవర్లున్నాయి. వీటి ఏర్పాటుకు మార్గదర్శకాలున్నాయి. - భూ ఆధారిత, రూఫ్టాఫ్ (ఎత్తయిన భవనాలపై) సెల్ టవర్లను ఏర్పాటు చేయదలచుకుంటే ముందుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అథారిటీ నుంచి అనుమతి, అగ్నిమాపకశాఖ, చుట్టుపక్కల భవనాల యజమానులనుంచి నుంచి నిరభ్యంతర ధ్రువపత్రాలను తీసుకోవాలి. రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉండే పక్షంలో సమీప నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ఆస్పత్రులకు దూరంగా సెల్‌టవర్‌ను ఏర్పాటు చేయాలి. భూ ఆధారిత సెల్‌టవర్ ఏర్పాటు చేస్తే రైతు నుంచి ఒప్పందం తీసుకుని పంచాయతీకి దరఖాస్తు చేయాలి. లెసైన్స్ ఫీజు కింద రూ.15000 చెల్లించాలి. ఏటా రూ.వెయ్యి లెసైన్స్ నవీకరణ ఫీజు కింద చెల్లించాలి. భవనాలపై ఏర్పాటు చేస్తే రూ.12000 చెల్లించాలి. ఇప్పటివరకు ఏర్పాటైన సెల్‌టవర్లు ఎక్కడా ఈ నిబంధనలను పాటించలేదు సరికదా పంచాయతీలు, మున్సిపాలిటీలకు రుసుము చెల్లించ కుండా పన్ను ఎగవేతకు కోర్టును ఆశ్రయిస్తున్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలాంటిసెల్టవర్ల నుంచి పంచాయతీలు, మున్సిపాలిటీలకు రావలసిన బకాయిల వసూలుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను రంగంలోకి దించింది. -
పరేషాన్ డీలర్!
నందిగాం, న్యూస్‌లైన్ : నందిగాం పంచాయతీ పరిధి పెంటూరు గ్రామానికి చెందిన రేషన్ డీలర్ బొడ్డ కేశవరావు(కృష్ణారావు) బరితెగించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ తెలుగుదేశం పార్టీలో చేరారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏం జరిగినా తెలుగుదేశం పార్టీ నేతలు అండగా ఉంటారనే బరితెగింపుతోనే ఆయన ఈ విధంగా చేశారని సమాచారం. ఆయన తీరుపై గ్రామస్తులు ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పక్షపాతంతో నిత్యావసర వస్తువుల పంపిణీలో వివక్ష చూపితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లో కూడా కేశవరావు బహిరంగంగా ప్రచారం నిర్వహించారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టిం చుకోలేదని పలువురు చెప్పారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఆయన ప్రస్తుతం మళ్లీ టీడీపీ శిబిరంలో చేరారు. -
కన్నీటి సేద్యం (రౌండప్ 2013)
ఏడాది గడిచిపోయింది. కాలగర్భంలో కలిసిపోతున్న 2013లో అన్నదాతలకు అన్నీ కష్టాలే. కర్షక లోకానికి కలిసిరాని సంవత్సరంగా మిగిలిపోయింది. మొదట్లో ఊరించి, మధ్యలో ఎండగట్టి, చివరిలో ముంచేసి రైతన్నను కకావికలు చేసింది. వరుస తుపాన్లతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఏడాది పొడవునా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కష్టాలను దిగమింగి.. కన్నీటితో సేద్యం చేశారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూడటంతో సాగంటేనే భయపడే దుస్థితి దాపురించింది. ప్రకృతి ప్రకోపంతో రైతాంగానికి తీరని అన్యాయమే జరిగింది. 2013లో అన్నదాతలు ఎదుర్కొన్న కష్టాలను ఒక్కసారి అవలోకనం చేసుకుందామిలా.. -సాక్షి, విశాఖపట్నం కొంప ముంచిన నిబంధనలు ప్రభుత్వ నిబంధనలు రైతుల కొంప ముంచాయి. పంట నష్టాల విషయంలో ప్రాథమిక అంచనాకు, తుది అంచనాకు పొంతన లేకుండా పోయింది. 50 శాతం పైబడి నష్టపోతేనే లెక్కలోకి తీసుకోవాలన్న నిబంధనలతో జిల్లావ్యాప్తంగా 14,923 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్టు పేర్కొన్నారు. 59,387మంది రైతులకు రూ.13.85 కోట్ల మేరకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాల్సి ఉందని స్పష్టం చేశారు. అంటే రైతుకొచ్చేది కంటి తుడుపు సాయమే. ఉద్యానవన పంటలదీ అదే పరిస్థితి ఉద్యాన వన పంటలకు అదే పరిస్థితి ఎదురైంది. అల్పపీడనంతో కురిసిన భారీ వర్షాలకు 1132 హెక్టార్లలో కూరగాయలు, అరటి, బొప్పాయి , పువ్వులు తదితర పంటలు నీట మునిగాయి. దాదాపు రూ.5.05 కోట్లు నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. కానీ నిబంధనల కారణంగా ఎన్యూమరేషన్ పూర్తయ్యేసరికిరూ.1031 హెక్టార్లలో మాత్రమే పంట దెబ్బతిని, సుమారు రూ.4 కోట్ల నష్టం జరిగిందని లెక్క తేల్చారు. పరిహారం పరిహాసం గతేడాది నవంబర్‌లో సంభవించిన నీలం తుపాను కారణంగాా నష్టపోయిన రైతులకు రూ.30.24 కోట్లకు పెట్టుబడి రాయితీ ఇవ్వవలసి ఉండగా రెండు విడతలుగా రూ.23 కోట్లను మాత్రమే ఈ ఏడాది విడుదల చేసింది. ఈ ఏడాది జరిగిన నష్టానికైతే అతీగతి లేదు. కనీసం ఆదుకునే ప్రయత్నం చేయలేదు. వర్షాలు తెరిపిచ్చాక సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవి, జిల్లా మంత్రులు పర్యటించి హామీలిచ్చి వెళ్లిపోయారే తప్ప ఇంతవరకు ఒక్కపైసా విడుదల చేసిన దాఖలాల్లేవు. రబీ ఆలస్యం కాస్త ఆలస్యమైనా రబీ సాగు ఈ ఏడాది పెరగనుంది. భారీ వర్షాలకు పెరిగిన నీటి వనరులతో జిల్లాలో సాధారణ విస్తీర్ణం కన్నా ఎక్కువ సాగు కానుంది. ఖరీఫ్ నష్టాన్ని రబీలో కొంతైనా భర్తీ చేసుకునే అవకాశం ఉంది. 41,310 హెక్టార్లలో సాగు జరగొచ్చని అంచనా వేశారు. ఇప్పటివరకు 13,623 హెక్టార్లలో సాగు జరిగింది. భారీ వర్షాల కారణంగా నీటిలోనే పంటలు దాదాపు ఉండటంతో కోత ఆలస్యం జరిగింది. దీంతో రబీ సీజన్ నిర్దేశిత సమయానికి ప్రారంభం కాలేదు. జనవరిలో ముమ్మరంగా సాగు జరగనుంది. ఇసక మేటలు అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలతో నదులు, చెరువులు, రిజర్వాయర్లు పొంగి ప్రవహించాయి. వీటితోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరుతో నదీ పరివాహక ప్రాంతాల్లోని పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. తాండవ, వరాహ, శారద నదులను ఆనుకుని ఉన్న పొలాల్ని దాదాపు కప్పేసేలా ఇసుక చేరింది. దాదాపు 120 హెక్టార్లకు ఇసుకమేటలు ఏర్పడాయి. ఇప్పుడా ఇసుకను తొలగించాలంటే ప్రభుత్వమే ఆదుకోవాలి. కానీ ఇంతవరకు స్పందించలేదు. కరకట్టలు నిర్మించాలని ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రూ.110 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. ఖరీఫ్ ఆరంభం బాగుంది ఖరీఫ్‌కు ముందే వర్షాలు కురవడంతో రైతన్న సంబరపడ్డాడు. ఖరీఫ్‌లో పంట పండుతుందని భావించాడు. దీంతో జిల్లా సాధారణ విస్తీర్ణం 2 లక్షల 3 వేల 308 హెక్టార్లు కాగా లక్షా 91 వేల 857 హెక్టార్లలో వివిధ పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో వరి ఒక్కటే 96,682 హెక్టార్లలో సాగయ్యింది. సాధారణ విస్తీర్ణం కన్నా 15 హెక్టార్ల ఎక్కువే. కానీ సాగు మొదలు పెట్టాక వర్షాలు ఎండగట్టాయి. దీంతో దాదాపు 30 మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్నాయి. అనంతరం అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలతో అదేమీ కనిపించకుండా పోయింది. వర్షపాతం, వరదలతో నాలుగైదు మండలాలు మినహా దాదాపు ఎక్కడా కరువు లేదని అధికారులు తేల్చేశారు. ప్రభుత్వానికి అదే నివేదిక ఇచ్చారు. ఏజెన్సీలో రాజ్మాకు తీవ్ర నష్టం భారీ వర్షాలకు ఏజెన్సీలో ప్రధాన పంటైన రాజ్మా తీవ్రంగా దెబ్బతింది. 3,312 ఎకరాల్లో రూ.83 లక్షల విలువైన పంట నష్టపోయింది. అసలే ఏజెన్సీ, ఆ పై గిరిజనులు. ఇప్పుడు వార్ని ఆదుకోకపోతే నట్టేట మునగాల్సిందే. రైతుకు అందని చేయూత వ్యవసాయ యాంత్రీకరణ, ఆహార భద్రతా మిషన్ కార్యక్రమాలతో రైతులు మరింత దిగుబడులు సాధించొచ్చన్న ఉద్దేశంతో సబ్సిడీపై పలు యూనిట్లు మంజూరు చేసే అవకాశం ఉంది. ఈమేరకు యాంత్రీకరణ కింద 1400 యూనిట్లు అందజేసేందుకు జిల్లాకు .4.41 కోట్లు విడుదల అవ్వగా ఇంతవరకు రూ.7 లక్షలతో కేవలం 25 పనిముట్లను మాత్రమే అందజేశారు. ఆహార భద్రతా మిషన్ కింద ఈ ఏడాది వరి, పప్పు దినుసుల సాగు ప్రోత్సాహం కోసం 50 శాతం సబ్సిడీతో 1248 పనిముట్లు అందజేసేందుకు రూ.1.13 కోట్లు విడుదలవ్వగా ఇంతవరకు రూ.43 లక్షల విలువైన 443 యూనిట్లు మాత్రమే అందజేశారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 1097 యూనిట్లు పంపిణీ చేసేందుకు గాను 2.01 కోట్లు విడుదలవ్వగా వీటిలో 6.19 లక్షలు విలువైన 313 యూనిట్లు మాత్రమే రైతులకు అందజేశారు. ముంచేసిన అల్పపీడనం పై-లీన్..హెలెన్.. లెహర్.. మాది.. ఇలా తుపాన్ల బెడద తప్పినప్పటికీ.. మధ్యలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ముంచెత్తిన వర్షాలు పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. దాదాపు వారం రోజులపాటు వర్షాలు పడ్డాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 27,285 హెక్టార్లలో రూ.60 కోట్లు నష్టం వాటిల్లింది. 17,855 హెక్టార్లలో వరి, 6079 హెక్టార్లలో చెరకు, 1212 హెక్టార్లలో పత్తి, 143 హెక్టార్లలో జొన్న, 653 హెక్టార్లలో రాజ్మా, 255 హెక్టార్లలో పొగాకు, 70 హెక్టార్లలో వేరుశనగ, 813 హెక్టార్లలో రాగి, 155 హెక్టార్లలో పెసలు, 50 హెక్టార్లలో కంది పంటలు దెబ్బతిన్నాయి. చెరకు రైతు పరిస్థితి దయనీయం చెరకు రైతుకు సాగు వ్యయం పెరుగుతున్న స్థాయిలో కేంద్రం ఇచ్చే మద్దతు ధర పెరగడం లేదు. దీంతో సహకార చక్కెర కర్మాగారాల దయాదాక్షిణ్యాలపైన చెరకు రైతులు ఆధారపడుతున్నారు. 2012-13లో కేంద్ర ప్రభుత్వం రూ. 1700 మద్దతు ధర ప్రకటించింది. దీనికి రాష్ట్రం మరో రూ. 300 కలిపి రూ. 2వేల వరకు ఇస్తుందని ఆశించా రు. సీజన్ ముగిసినా ఎటువంటి సాయం రాలేదు. దీంతో కర్మాగారాలే తమకొచ్చిన లాభాల నుంచి కొంత మొత్తం ఇచ్చాయి. కానీ ఆ సాయం ఎటూ సరిపోలేదు. రైతులు నష్టాలనే చవిచూశారు. 2013-14లో కేంద్ర ప్రభుత్వం టన్నుకు రూ.2100 మద్దతు ధర ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈలోపే భారీ వర్షాలు పడ్డాయి. వేలాది ఎకరాల చెరకు నీట మునగడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. చోడవరంలో జరిగిన రచ్చబండలో రాష్ట్ర ప్రభుత్వం కొంతైనా సాయం చేయాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని స్థానిక ఎమ్మెల్యేలు కోరినా పట్టించుకోలేదు.