gray
-
లేటు వయసులో విడిపోతున్న జంటలు
భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లంటే నూరేళ్ల పంట. అందుకే దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, పొరపొచ్చాలు వచ్చినా సర్దుకుపొమ్మనే సలహా ఇస్తారు. చాలా జంటలు అలాగే సర్దుకుపోతుంటాయి. అలా కుదరని వాళ్లు విడాకులు తీసుకుని విడిపోతుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, పరిస్థితులు మారాయి, మారుతున్నాయి. పాతికేళ్లు అన్యోన్యంగా కాపురం చేసినవాళ్లు, 50 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవడమనేది ఇటీవల కనిపిస్తున్న ట్రెండ్. దీన్నే ‘గ్రే డివోర్స్’ అంటున్నారు. తాజాగా ఏఆర్ రెహమాన్–సైరాబాను విడాకులు గ్రే డివోర్స్‌పై విస్తృతమైన చర్చను రేకెత్తించాయి. అసలెందుకిలా జరుగుతోంది? లేటు వయసులో విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఎందుకొస్తోంది? భారతీయ వైవాహిక వ్యవస్థ బీటలు వారుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానం అన్వేషిద్దాం. గ్రే డివోర్స్ ఎందుకు జరుగుతాయి?సమాజంలో మారుతున్న విలువలు, పెరుగుతున్న జీవితకాలం, వ్యక్తిగత సంతోషానికి పెరుగుతున్న ప్రాధాన్యం దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. 1. వ్యక్తిగత ఎదుగుదలలో అసంతృప్తికొంతమంది చిన్న వయసులో వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత వ్యక్తిగత ఆశయాలకంటే సామాజిక బాధ్యతలకే ప్రాధాన్యం ఇస్తారు. కాలక్రమంలో, ఒకరు లేదా ఇద్దరూ తమ వ్యక్తిగత అభివృద్ధి కోసం ప్రయత్నిస్తారు. దానికి భాగస్వామిని అడ్డంకిగా భావించినప్పుడు విడాకులకు వెళ్తున్నారు. 2. ఎమ్టీ నెస్ట్ సిండ్రోమ్పిల్లలు పెద్దవారై ఇళ్ల నుంచి వెళ్లిపోయిన తర్వాత, దంపతుల బాధ్యతలు తగ్గుతాయి. అప్పటివరకు పిల్లల కోసం అడ్జస్ట్ అయినవారు స్వేచ్ఛ వచ్చినట్లుగా భావిస్తారు. భాగ స్వామితో గతంలో పరిష్కరిం చుకోని సమస్యలు పెరుగుతాయి. దాంతో వారిద్దరి మధ్య ఉన్న బంధం బలహీనపడి విడాకులకు దారితీస్తుంది. 3. ప్రేమ, సహవాసంపై మారుతున్న అభిప్రాయాలుప్రేమ, పెళ్లి, సహజీవనంపై కాలంతో పాటు అభిప్రాయాలు మారుతున్నాయి. పెళ్లంటే నూరేళ్ల పంట అనే భావన మాయమై, కలిసి ఉన్నన్నాళ్లు సంతోషంగా జీవించాలనే అభిప్రాయం పెరుగుతోంది. ఆధునిక వైద్యంతో జీవనకాలం పెరగడంతో ఏభైల తర్వాత కూడా నచ్చినవారితో జీవితం గడపాలనే భావన పెరుగుతోంది. 4. ఆర్థిక స్వాతంత్య్రంగతంలో భర్త పనిచేస్తుంటే భార్య ఇంటిపనులు చూసుకునేది. కానీ ఇప్పుడు మహిళలు ఆర్థికంగా స్వతంత్రులవుతున్నారు. దీంతో బాధాకరమైన సంబంధాలను ఏమాత్రం సహించడంలేదు. గృహహింసను భరించేకంటే వైవాహిక బంధం నుంచి బయటపడటమే మంచిదని భావిస్తున్నారు. 5. విడాకులపై సామాజిక స్వీకారంఒకప్పుడు విడాకుల పట్ల ఉన్న వ్యతిరేకత ఇప్పుడు మారిపోయింది. సెలబ్రిటీలు గ్రే డివోర్స్ తీసుకోవడం ఇతరులకు మార్గదర్శకం అవుతోంది. దాంతో సామాన్యులు కూడా గ్రే డివోర్స్ గురించి ఆలోచిస్తున్నారు. గ్రే డివోర్స్‌తో సమస్యలు.. గ్రే డివోర్స్.. విముక్తి కలిగిస్తున్నట్టు అనిపించినా, వాటి వెనుక కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ⇒ అస్తిత్వ సంక్షోభం: అనేక సంవత్సరాలపాటు ఒక భాగస్వామిగా ఉన్న తర్వాత, ఒంటరిగా జీవించడం ఒక పెద్ద మార్పు. ‘నా జీవితంలో భాగస్వామి లేకుండా నేను ఎవరు?’ అనే ప్రశ్నలతో బాధపడతారు.⇒ ఒంటరితనం: జీవితం చివరిలో ఏకాకిగా ఉండటం ఒంటరితనాన్ని మరింత పెంచుతుంది.⇒ కుటుంబ సంబంధాలు: పెద్దయిన పిల్లలు తమ తల్లిదండ్రుల నిర్ణయాన్ని అంగీకరించలేకపోవచ్చు. కొన్నిసార్లు వారు తల్లిదండ్రులపై కోపంగా ఉండవచ్చు. ·గ్రే డివోర్స్ను తప్పించేందుకు సూచనలు1. ఏ బంధానికైనా సంభాషణ ముఖ్యం. అందుకే మీ భావాలు, అంచనాలు, ఆందోళనల గురించి భాగస్వామితో క్రమం తప్పకుండా చర్చించండి.2. వయసుతో పాటు భావోద్వేగ అవసరాలు కూడా మారుతాయి. ఆలోచనలు, కలలు, భయాలను పంచుకునే సమయాన్ని కేటాయించి బంధాన్ని బలోపేతం చేసుకోండి. 3. మీ ఇద్దరికీ ఇష్టమైన కార్యకలాపాలు లేదా అభిరుచులను గుర్తించి, వాటిని తిరిగి ప్రారంభించండి. 4. చేతులు పట్టుకోవడం, ఆలింగనం చేయడం వంటి స్పర్శతో ప్రేమను గుర్తు చేస్తూ ఉండండి. 5. వ్యక్తిగత అభిరుచులకు ప్రోత్సాహం ఇవ్వడం, కలిసి ఎదగడం ద్వారా సంబంధాన్ని సజీవంగా ఉంచండి. 6. నిందించడం తగ్గించి, శ్రద్ధగా వినండి. ఇద్దరి అవసరాలను గౌరవించే పరిష్కారాలను కనుక్కోండి. 7. మీ భాగస్వామి చేసిన కృషిని గుర్తించడం, థాంక్స్ చెప్పడం వంటి చిన్న పనులు బంధాన్ని బలపరుస్తాయి. 8. సమస్యలను పరిష్కరించడానికి, సంభాషణను మెరుగుపరచడానికి, బంధాన్ని బలపరచడానికి కౌన్సెలింగ్ కూడా సహాయపడుతుంది. -
తెల్లజుట్టే అని తేలిగ్గా తీసుకోవద్దు..!
తెల్లజుట్టు వృద్ధాప్యానికి సూచిక. కాని, వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు 20 దాటి 30లోకి అడుగుపెట్టేలోపే జుట్టు పండి΄ోతోంది. ఇటీవలి కాలంలో యువతరంలో ఈ సమస్య వేగంగా పెరుగుతోందంటున్నారు నిపుణులు. అకాలంలో జుట్టు నెరిసిపోవడాన్ని ‘కానిటీస్’ అని అంటారు. దీనికి ఆహారపు అలవాట్లు, పర్యావరణ మార్పులతోపాటు ఇంకా చాలా కారణాలే ఉన్నాయి. తలలో పేనుకొరుకుడు సమస్య తీవ్రమవుతున్నప్పుడు, థైరాయిడ్ ఎక్కువవుతున్నప్పుడు కూడా తెల్లజుట్టు వచ్చే అవకాశం ఉంటుంది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలు జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను తగ్గిస్తాయి. నలుపు రంగునిచ్చే మెలనిన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తాయి. దాంతో చిన్న వయసులోనే తల నెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. పోషకాహార లోపం, పట్టణ జీవనశైలి కూడా ఈ పరిస్థితి కారణమవుతున్నాయని వారు చెబుతున్నారు. ఐరన్, కాపర్, విటమిన్ బి12 లోపంతో తెల్లజుట్టు విపరీతంగా పెరుగుతుంది. మరి యుక్తవయసులో వచ్చిన తెల్లజుట్టు తగ్గుతుందా? ఇదే ప్రశ్న నిపుణులను అడిగితే తగ్గుతుందనే అంటున్నారు. థైరాయిడ్ సమస్యలను తగ్గించుకోవడం, సక్రమంగా సమయానికి పోషకాహారం తీసుకోవడం ముఖ్యమంటున్నారు.(చదవండి: బ్రష్ మార్చి ఎంతకాలం అయ్యింది..?) -
'తగ్గేదే లే' ! అంతా బూడిద మయం..!! ఇదేం దోపిడీ..?
భద్రాద్రి: ఏదైనా మంచి విషయం సత్ఫలితాలు ఇవ్వడంలో విఫలమైతే బూడిదలో పోసిన పన్నీరు అనే సామెతను ఉపయోగిస్తాం. కానీ అలాంటి బూడిద నుంచి సైతం కాసులు దండుకునే విద్య తెలిసిన వాళ్లు జిల్లాలో ఉన్నారు. వాళ్ల జాడ తెలియాలంటే భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు వెళ్లాల్సిందే.. భారీగా బూడిద.. దేశమంతటా థర్మల్ పవర్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అయితే టీఎస్ జెన్కో మాత్రం నడుస్తున్న ట్రెండ్‌కు విరుద్ధంగా పాత కాలం నాటి సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ టెక్నాలజీ వాడటం వెనుక కారణాలు ఏమైనా.. దీంతో ప్లాంట్ నుంచి బూడిద అధికంగా విడుదలవుతోంది. ఇలా వచ్చిన బూడిదకు నీటిని కలిపి కొంత భాగం యాష్ పాండ్‌కు తరలిస్తే మరికొంత బూడిదను సిమెంట్, ఇతర పారిశ్రామిక అవసరాలకు తరలిస్తున్నారు. నిత్యం టన్నుల కొద్దీ వెలువడుతున్న బూడిదను వదిలించుకోవడం బీటీపీఎస్‌కు అనివార్యం. అయితే ఉచితంగా బూడిదను పరిశ్రమలకు ఇవ్వకుండా నామమాత్రపు ధరకే థర్మల్ పవర్ ప్లాంట్లు అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ విధానం అమల్లో ఉంది. లారీకి రూ.400 అదనం.. ఎలాంటి లెక్కాపత్రం లేకుండా యాష్ కోసం వచ్చిన లారీల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. బూడిద కొనుగోలుకు సంబంఽధించిన రసీదు ఇవ్వడం, లోడ్ చేసిన బూడిదకు తగ్గ వే బిల్లులు ఇవ్వడం వంటి పనుల్లో కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రాసెసింగ్ ఫీజు పేరుతో రూ. 200 వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత వే బిల్లులు జారీ చేసే దగ్గర రూ.100, ప్లాంటు గేటు దగ్గర ఇన్, ఔట్లకు కలిపి రూ.100 వంతున లారీల దగ్గర నుంచి డబ్బులు లాగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్లాంట్ నుంచి నిత్యం 100కు పైగా లారీల్లో యాష్ బయటకు వెళ్తుంది. అంటే ఒక్కో లారీ నుంచి రూ.400 చొప్పున రోజుకు రూ. 40,000 ఎలాంటి లెక్కా పత్రం లేకుండా జేబులో వేసుకుంటున్నారు. ఇలా నెలకు రూ.12 లక్షల వరకు యాష్ నుంచే కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఈ దందా నిత్యం జరుగుతున్నా అధికారులెవరూ ఇదేంటని ప్రశ్నించరు. అధికారుల అండదండలను ఆసరాగా చేసుకుని కాంట్రాక్టర్లు మరింతగా రెచ్చిపోతున్నారు. టన్ను బూడిద ధర రూ.109 ఉండగా వీళ్లు రూ.150 వరకు కూడా అమ్ముతున్నారు. ఇదేం దోపిడీ..? గతంలో పాల్వంచలోని కేటీసీఎస్ కేంద్రంగా బూడిద దందాలో ఖజానా నింపుకున్న కాంట్రాక్టర్లలో కొందరు ఇప్పుడు బీటీపీఎస్‌పై కన్నేశారు. బీటీపీఎస్‌లో అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ప్లాంట్ ప్రతిష్టకు మచ్చ కలుగుతోంది. దశాబ్దాల తరబడి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లలో సైతం లేని అవినీతి ఇటీవలే ప్రారంభమైన ప్లాంట్‌లో ఉండడం ఏంటని పారిశ్రామిక వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత అవినీతి జరుగుతున్నా ఇక్కడి అధికారులు, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బూడిద దందాపై వివరణ కోరేందుకు బీటీపీఎస్ డీఈకి ఫోన్ చేయగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. చెప్పిందే ధర.. బీటీపీఎస్ ఆరంభంలో టన్ను బూడిద రూ.69 చొప్పున సిమెంట్, ఇటుక పరిశ్రమలకు అమ్మేవారు. ఇటీవల ఈ ధరను రూ.109కి పెంచారు. ప్రత్యేకమైన కంటైనర్లు కలిగిన లారీల్లో బూడిదను తరలిస్తారు. సగటున ఈ ట్యాంకర్ల కెపాసిటీ 25 టన్నుల వరకు ఉంటుంది. అంటే ఒక్కో యాష్ కంటైనర్ లారీలో బూడిదను నింపుకునేందుకు రూ.2,725 నామమాత్రపు ఫీజు చెల్లిస్తే 25 టన్నుల బూడిద తీసుకెళ్లొచ్చు. అయితే సిమెంట్ కంపెనీలు లేదా లారీ కంటైనర్ల ఓనర్లు బూడిద కోసం ప్లాంట్‌కు చెల్లిస్తున్న ధర పెద్దగా లెక్కలోకి తీసుకోరు. అంతకంటే వాళ్లకు ప్రధానమైనది లోడింగ్, అన్ లోడింగ్. ఈ పనిలో ఆలస్యం జరిగితే విలువైన సమయం వృథా అవుతుంది. కంటైనర్లకు వచ్చే కిరాయి, డ్రైవర్ ఖర్చులు, క్లీనర్ బేటాలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకుని బూడిద అమ్మకాల్లో కొత్త దందాకు తెరలేపారు. -
నాలుగేళ్ల తర్వాత పాకిస్తాన్‌కు బిగ్ రిలీఫ్.. 'గ్రే లిస్ట్' నుంచి తొలగింపు
పారిస్: పాకిస్తాన్‌కు భారీ ఊరట లభించింది. ఉగ్రవాదుల ఆర్థిక విషయాలపై నిఘా వహించే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్).. ఆ దేశాన్ని నాలుగేళ్ల తర్వాత 'గ్రే లిస్ట్' నుంచి తొలగించింది. ఉగ్రవాదుల కార్యకలాపాల విషయంలో పాక్ పురోగతి సాధించిందని, తీవ్రవాద సంస్థలకు నిధుల చేరవేతలో దిగొచ్చిందని ఈమేరకు నిర్ణయం తీసుకుంది. పారిస్‌లో శుక్రవారం జరిగిన సమావేశం అనంతరం ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే అనూహ్యంగా మరో ఆసియా దేశం మయన్మార్‌ను బ్లాక్ లిస్టులో చేర్చింది ఎఫ్ఏటీఎఫ్. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, టాంజానియా, మొజాంబిక్ దేశాలను కొత్తగా గ్రే లిస్టులో చేర్చింది. పాకిస్తాన్, నికరాగ్వా దేశాలను ఈ జాబితా నుంచి తొలగించింది. ఉగ్రవాద సంస్థలకు నిధుల మళ్లించడమే గాక, తీవ్రవాదుల పట్ల సానుభూతిగా ఉండే పాకిస్థాన్‌ను వరుసగా నాలుగేళ్ల పాటు గ్రే లిస్టలో ఉంచింది ఎఫ్ఏటీఎఫ్. తాము తీవ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నామని, అనేక మంది టెర్రరిస్టులను అరెస్టు చేస్తున్నామని పాకిస్తాన్ కొద్ది సంవత్సరాలుగా చెబుతున్నా ఎఫ్ఐటీఎఫ్ దాన్ని సమర్థించలేదు. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలు తగ్గినందున ఆ దేశానికి ఊరటనిచ్చింది. చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధంలో 66,000 మంది రష్యా సైనికులు మృతి! -
గ్రే లిస్టులోనే పాకిస్తాన్
న్యూఢిల్లీ: లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు నిధుల ప్రవాహాన్ని అడ్డుకోని పాకిస్థాన్‌ను పలు ఆంక్షలు విధించేందుకు వీలు కల్పించే గ్రే లిస్ట్‌లోనే కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌లోపు ఎఫ్ఏటీఎఫ్ ఆదేశాలను అమలు చేయకపోతే వాణిజ్యపరమైన పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పాక్‌ను హెచ్చరించింది. భారత్‌లో పలు ఉగ్రదాడులకు కారణమైన సంస్థలకు నిధులు అందకుండా చేసేందుకు 27 చర్యలు చేపట్టాలని ఆదేశించినా పాకిస్థాన్ వాటిల్లో కొన్నింటిని మాత్రమే అమలు చేసిందని గుర్తు చేసింది. పాకిస్థాన్ గ్రే లిస్టులో కొనసాగితే ఈయూ, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సాయం అందడం కష్టమవుతుంది. ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయం ఇప్పటికే అధ్వాన్న స్థితిలో ఉన్న పాక్ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ దన్నుగా నిలుస్తోందని, దానిపై చర్యలు చేపట్టాలని భారత్ ఎఫ్ఏటీఎఫ్కు ఫిర్యాదు చేయడంతోపాటు సంబంధించిన రుజువులూ అందిస్తూ వచ్చింది. -
ఎఫ్ఏటీఎఫ్ ‘గ్రే లిస్ట్’లో పాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల నిఘా సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) పాక్‌ను గ్రే లిస్ట్‌లో పెట్టింది. దీని ఫలితంగా ప్రపంచ దేశాల్లో ఆ దేశ ప్రతిష్ట దెబ్బతినడంతోపాటు విదేశీ ఆర్థిక సాయం నిలిచిపోనుంది. బుధవారం పారిస్‌లో జరిగిన ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి హాజరైన పాక్ ఆర్థిక మంత్రి షంషాద్ అక్తర్.. తమ దేశం నుంచి ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తున్న జమాత్–ఉద్– దవా సంస్థ అధినేత, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ సహా ఉగ్రమూకలకు నిధులు అందకుండా చేయటానికి వచ్చే 15 నెలల్లో అమలు చేయనున్న 26 అంశాల కార్యాచరణ ప్రణాళికను వివరించారు. దీనిపై చర్చించిన ఎఫ్ఏటీఎఫ్..పాక్ పేరును గ్రే జాబితాలో ఉంచనున్నట్లు బుధవారం రాత్రి ప్రకటించింది. ఈ నిర్ణయం ఏడాదిపాటు అమల్లో ఉంటుంది. దీనిపై పాక్ స్పందిస్తూ.. ‘ఎఫ్ఏటీఎఫ్ నిర్ణయం మాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఇది రాజకీయ పరమైన నిర్ణయం. ఉగ్రవాదంపై పోరులో పాక్‌పై ఇది ఎలాంటి ప్రభావం చూపబోదు. త్వరలోనే గ్రే జాబితా నుంచి బయటపడతాం. గతంలోనూ ఇలా జరిగింది’ అని పేర్కొంది. 1989లో ఏర్పాటైన ఎఫ్ఏటీఎఫ్ గ్రూపులో 37 దేశాలున్నాయి. మనీ లాండరింగ్ నిరోధానికి, ఉగ్ర సంస్థలకు నిధులు అందకుండా కట్టడి చేయటానికి ఇది కృషి చేస్తుంది. కాగా, గ్రే లిస్ట్‌లో ఇప్పటికే ఇథియోపియా, ఇరాక్, యెమెన్, సెర్బియా, సిరియా, శ్రీలంక, ట్రినిడాడ్ టొబాగో, ట్యునీసియా, వనౌటు దేశాలున్నాయి. గ్రే లిస్ట్‌లో ఉంటే ఏమవుతుంది? ఇప్పటికే పాక్ పలుకుబడి అంతర్జాతీయంగా మసకబారింది. ఉగ్రవాదులతో సంబంధ మున్న దేశంగా ముద్రపడితే ఈ పరిస్థితి మరింత దిగజారుతుంది. అక్కడ పెట్టుబ డులు పెట్టడానికి, కంపెనీలు నెలకొల్పేందుకు విదేశీ సంస్థలు సంశయిస్తాయి. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పు పుట్టడం కష్టం. స్టాండర్డ్ చార్టెర్డ్ బ్యాంక్ వంటి విదేశీ బ్యాంకులు దేశం నుంచి వెళ్లిపోయే అవకాశాలున్నాయి. అదే బ్లాక్‌లిస్ట్‌లో ఉంటే ప్రభుత్వాలు, సంస్థలు, కంపెనీలు ఆయా దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎటువంటి అవకాశం ఉండదు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వవు. -
ట్రంపైనా, కుక్కయినా జుట్టు సైన్స్ ఒక్కటే
న్యూయార్క్: అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కైనా, కుక్కకైనా వయసు మీరక ముందే జుట్టు రంగు తెల్లగా లేదా పల్లగా మారిందంటే అందుకు మానసిక ఒత్తిడి లేదా ఆందోళనే కారణమని కొలరాడో స్టేట్ యూనివర్శిటీలో యానిమల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న టెంపుల్ గ్రాండిన్ ‘అప్లైడ్ యానిమల్ బిహేవియర్ సైన్స్’ జర్నల్‌లో పేర్కొన్నారు. డెన్వర్‌లోని కెనైన్ ఎడ్యుకేషన్ సెంటర్ యజమాని, జంతువుల ప్రవర్తనపై అధ్యయనం జరిపే పరిశోధకురాలు కమిల్లే కింగ్ కొన్నేళ్ల ఏళ్లక్రితం తన వద్దకు వచ్చారని, మాటల సందర్భంలో మానసిక ఆందోళనకు గురవుతున్న కుక్కలు జుట్టు తెల్లబడుతోందని చెప్పారని తెలిపారు. అప్పుడు తనకెందుకో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన బిల్ క్లింటన్, జార్జి బుష్, ఒబామా లాంటి వారి జుట్టు వయస్సు మీరక ముందే తెల్లబడిన విషయం గుర్తొచ్చిందని, అందుకని కుక్కల జుట్టుకు, వాటి ప్రవర్తన, మానసిక స్థితికి ఉన్న సంబంధం ఏమిటో అధ్యయనం కొనసాగించాల్సిందిగా కోరానని చెప్పారు. తన సూచన మేరకు కమిల్లే 400 కుక్కలపై నాలుగేళ్లపాటు అధ్యయనం చేశారని, తాను ఊహించినట్లే మానసిక ఆందోళనకు గురైన కుక్కల జుట్టు తొందరగా తెల్లబడినట్లు ఆ అధ్యయనంలో తేలిందని గ్రాండిన్ వివరించారు. కుక్కలను ఎక్కువ గంటలు గదిలో బంధించడం వల్ల లేదా ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్లడం వల్ల, వేళకు బయటకు తీసుకొని పోకపోవడం లాంటి కారణాల వల్ల వాటి జుట్టు తెల్లపడుతుందని, వాటి మానసిక ఒత్తిడి తీవ్రతను బట్టి జుట్టు రంగుమారే తీవ్రత ఆధారపడి ఉంటుందని గ్రాండిన్ తెలిపారు. మానసిక ఒత్తిడికి గురైన కొన్ని కుక్కల్లో మాత్రం వాటి జుట్టు తెల్లబడలేదని, అందుకు వాటి జన్యువులు కారణం కావచ్చని అన్నారు. ఈ విషయంలో మనుషులకు, కుక్కలకు పెద్ద తేడా ఉండదు కనుక మానసిక ఒత్తిళ్ల కారణంగానే వారి జుట్టు కూడా తెల్లబడుతుండవచ్చని అన్నారు. అయితే ఈ విషయంలో మరిన్ని పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని అన్నారు. మానవ శరీరంలోని వర్ణద్రవ్యంలో (పిగ్మెంట్)లో మెలానిన్ శాతం తగ్గిపోవడం వల్ల జుట్టు రంగు నలుపు నుంచి తెలుపుగా మారుతుంది. వద్ధాప్యంలో మెలానిన్ సహజసిద్ధంగా మనుషుల్లో, ముఖ్యంగా మగవాళ్లలో తగ్గుతుందికనుక జట్టు రంగు మారుతుంది. మెలానిన్ త్వరగా తగ్గిపోవడానికి, మానసిక ఒత్తిడికి ఉండే ప్రత్యక్ష సంబంధం ఏమిటో పరిశోధనలో తేల్చాలి.