Green leaves
-
ఓరి దేవుడా! నిజంగా సింహమేనా?.. ఇంతలానా!
సింహం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సాధారణంగా అది ఏ జంతువైనా వేటాడిందంటే ఇక అంతే. సింగిల్‌గా ఉన్నా దాని రాజసం, ఠీవినే వేరు. దాని గాండ్రింపుకే హడలిపోవాల్సిందే. అలాంటి సింహం సాధువుగా మారిపోవడం అంటే అస్సలు నమ్మం. ఏదో కథల్లో ఉండొచ్చేమో గానీ రియల్‌గా జరిగే అవకాశమే ఉండదు. నెట్టింట సందడి చేస్తున్న ఈ వీడియో చూస్తే మాత్రం ఇది సింహమేనా అని నోరెళ్లబెడతారు. పైగా అదే ఏం తింటుందో చూస్తే ఓరి దేవుడా! అని ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..సింహం సాధువు జంతు మాదిరి ఆకులు తింటోంది. ఏంటి అది సింహమేనా? అని ఒక్కసారిగా డౌటు వస్తుంది. చూస్తే పెద్ద పులిలానే ఉంది. కానీ ఏదో సాధువు జంతువు మాదిరిగా ఆకులు అలమలు తింటోంది. దీంతో నెటిజన్లు సడెన్‌గా సింహం శాఖహారిగా ఎలా మారిపోయిందిని ఒకరు, బహుశా శ్రావణ మాసం కదా అందుకే ఆ సింహం ఆకులు తింటుందని మరోకరు కామెంట్లు చేస్తూ ట్వీట్లు చేశారు. View this post on Instagram A post shared by @vedhamalhotra (చదవండి: సింగిల్‌గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే..) -
‘కలుపు’కొని తినాలి..
వర్షాకాలంలో పంట పొలాల్లో సహజంగా పెరిగే ఆకుకూరల గురించి క్షేత్రస్థాయిలో తెలుసుకొనేందుకు హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వచ్చిన కొందరు సందర్శకులకు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) ఆధ్వర్యంలో శనివారం అవగాహన కల్పించారు. జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్‌తండా, ఝరాసంగం మండలంలోని ఎల్గోయి గ్రామాల్లో సహజ ఆకుకూరల ప్రాధాన్యం గురించి వివరించారు. అవి ఏ మేరకు ఆరోగ్యాన్ని అందిస్తాయో సభ్యులు చెప్పారు. వర్షాకాల పంటల్లో పలు రకాల కలుపు మొక్కలు వస్తాయని.. వాటిని రైతులు తొలగిస్తుంటారని.. కానీ వాటిలోనూ ఆరోగ్యానికి అవసరమయ్యే అనేక పోషకాలు కలిగి ఉన్నాయని సందర్శకులకు మహిళా రైతులు చిందిబాయి, రాజీబాయి తెలియజేశారు. కలుపు మొక్కల్లో వందకుపైగా రకాల ఆకుకూరలను ఆహారంగా తీసుకోవచ్చని చెప్పారు. – జహీరాబాద్ ప్రదర్శన ద్వారా అవగాహన పొలాల్లో సహజంగా పండే ఆకుకూరల గురించి సందర్శకులకు ప్రత్యక్ష అనుభవం కల్పించేందుకు డీడీఎస్ సభ్యులు వారిని పొలాల్లో తిప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఏయే ఆకుకూరలో ఎలాంటి పోషకాలు ఉంటాయనే అంశాన్ని వివరించారు. చక్కెర వ్యాధి నివారణకు ఉపయోగపడే ఆకుకూరలతోపాటు చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు ఎలాంటి ఆకుకూరలు తినాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీడీఎస్ డైరెక్టర్ రుక్మిణిరావు, రాజేంద్రనగర్‌లోని కూరగాయల పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్టు అనితకుమారి, సంస్థ సభ్యులు మంజుల, పెద్ద నర్సమ్మ, చిన్న నర్సమ్మ, అల్గోల్ నర్సమ్మ, మాణిక్యం, రోజా, మయూరి పాల్గొన్నారు. నోరూరించిన వంటకాలు పొలాల్లో సహజంగా పెరిగే ఆకుకూరలతో వంట లు వండారు. ఆయా వంటకాలను సందర్శకులకు వడ్డించారు. మార్కెట్లో లభించే ఆకుకూరల కంటే ఇవి రుచిగా ఉన్నాయని పలువురు అన్నారు. కలుపు మొక్కలుగాభావిస్తున్న వాటిలో కొన్ని... అత్తిలి, పిట్టకూర, సన్న పాయలు, బంకంటికూర, చెన్నంగి, ఎన్నాద్రి, ఉత్తరేణి, గునుగు, బుడ్డకాశ, గోరిమడి, తెల్లగజ్జర, తకడదొబ్బుడు, జొన్న చెంచలి, పుల్లకూర, తగరంచ, ఎలుకచెవుల కూర, అంగిబింగి, పప్పుకూర, అడవి మెంతెంకూర, తుమ్మికూర, గురిమాసి, అడవి పొన్నగంటి అలం, నల్లకాశ, దూసరి, తలాయిలా, రేలపప్పు, తెల్లవార్జంపువ్వు, గురిమాసిగడ్డ, చిత్రమాలం, పొనగంటి, పల్లెరుకాయ, పొలపత్రం, బంకటి ఇలా అనేక రకాల ఆకు కూరలు సహజంగా లభిస్తాయి. ఆకుకూరల్లో పోషక విలువలు... ఆకుకూరలు ఆరోగ్య సంరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. దాదాపు అన్ని ఆకుకూరల్లో క్యాల్షియం, ఇనుము, కెరోటిన్, విటమిన్–సి, రైబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్, పీచుపదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. సహజ ఆరోగ్యం పొందవచ్చు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా సహజంగా ఆకు కూరలు లభ్యమవుతాయి. ఇవి సేంద్రియ విధానంలో వస్తున్నందున మన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు. ప్రతి ఒక్కరూ ఈ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. – నర్సింహారావు, రిటైర్డ్ ఉద్యోగి, హైదరాబాద్ ఎన్నో ఆకుకూరల గురించి తెలుసుకున్నాం ఆకుకూరల్లో ఇన్ని రకాలు ఉంటాయనే విషయం నాకు తెలియదు. కలుపు మొక్కలుగా భావిస్తున్న ఆకుకూరల్లో అనేక పోషకాలు నిండి ఉన్నాయనే విషయం ఇప్పుడే తెలిసింది. వీటి గురించి తగిన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. – లిఖిత, బీటెక్ విద్యార్థిని, హైదరాబాద్ ఆరోగ్యాన్ని అందిస్తాయని తెలిసింది సహజంగా వచ్చే ఆకుకూరలను తీసుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. వాటి గురించి తెలుసుకునేందుకే వచ్చా. – స్వప్న, గృహిణి, హైదరాబాద్ -
చుక్కకూర విత్తనాల సేకరణ ఎలా?
► మన విత్తనాలను మనం కట్టుకోవడం మంచిది. మార్కెట్లో దొరికే విత్తనాలు ఒక్కోసారి మొలవవు. మొలిచినా బూడిద తెగులువి అయ్యుండే ప్రమాదం ఉంటుంది! చక్కని ఆరోగ్యవంతమైన విత్తనాలను మనం మన తోటలోనే కట్టుకోవడం మంచిది. ► చుక్క కూర పూత దశకు రాగానే రెండు, మూడు బలమైన ఆరోగ్యవంతమైన మొక్కలను విత్తనం కోసం వదలాలి. వాటిని కొయ్యకూడదు. ► పువ్వుల మధ్యలో విత్తనాలు ఉంటాయి. చిన్న చిన్న స్పాంజి ముక్కల్లా కనిపిస్తాయి. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తన రకం చుక్కకూర! ► పువ్వులు క్రమంగా ఎండుతాయి. బాగా ఎండిన తరువాత పువ్వుల గుత్తులను కొయ్యాలి. మరో రెండు రోజులు బాగా ఎండబెట్టాలి. తరువాత కుండలో నిల్వ చేసుకోవడం మంచిది! పైన మూత పెట్టుకోవాలి. వెంటనే కానీ తరువాత కానీ ఎప్పుడు అవసరం పడితే అప్పుడు నాటుకోవచ్చు. ఈ దిగువ విత్తనాలు వందల మందికి ఇవ్వవచ్చు. అలా ఇస్తున్నాం కూడా, మా మిద్దెతోట చూడ వచ్చిన వారికి! – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దె తోటల నిపుణులు -
పచ్చని ఆకులు తోడుంటే...
బ్యూటిప్స్ పచ్చని ఆకులు ఆరోగ్యాన్ని పదికాలాలు పచ్చగా ఉంచుతాయి. శిరోజాల అందాన్ని కాపాడటంలోనూ ఆకులు ముందున్నాయి. రసాయనాల వాడకం లేకుండా సహజసిద్ధమైన వాటితో కేశసౌందర్యాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం. జామకాయల రుచి గురించి మనందరికీ తెలిసిందే. జామ ఆకు గొప్పతనం గురించి ఎంత మందికి తెలుసు. కురుల కుదుళ్లను బలపరచడమే కాదు, నిగనిగలనూ పెంచుతుంది జామ ఆకు. లీటర్ నీటిలో గుప్పెడు జామ ఆకులను వేసి అరగంట సేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఆ నీటిని మరిగించి, పూర్తి వేడి తగ్గేంతవరకు ఉంచాలి. ఆ తర్వాత వడకట్టి, ఆకులను తీసేయాలి. ఇప్పుడు ఈ నీటిని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. జామ ఆకులో ఉండే ఔషధగుణాలు మరిగించడంతో నీటిలోకి వ చ్చేస్తాయి. ఆ నీటిని తలకు వాడటం వల్ల కుదుళ్లు బలపడి, జుట్టు రాలడం తగ్గుతుంది. షాంపూలలో ఉండే గాఢమైన రసాయనాల ప్రభావం కూడా జామ ఆకులతో తయారుచేసుకున్న నీటిని వాడటం వల్ల తగ్గుతుంది. కొబ్బరినూనెలో తగినన్ని కరివేప ఆకులను వేసి మరిగించి, చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకుదుళ్లకు పట్టించి, మసాజ్‌చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేయడం వల్ల జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలు తగ్గుతాయి. కొబ్బరినూనెలోని ప్రొటీన్లు జుట్టుకుదుళ్లకు బలాన్ని ఇస్తాయి. కరివేపాకు కేశాలు చిట్లకుండా మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది. లీటర్ నీటిలో గుప్పెడు వేప ఆకులు వేసి మరిగించాలి. ఈ నీళ్లు చల్లారాక తలకు పట్టించాలి. పది-ఇరవై నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రపరచుకోవాలి. వారానికి నాలుగుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది. తులసి ఆకులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. అలాగే మన ఆరోగ్యానికి ఉపయోగపడే వందల రకాల ఓషధులు తులసిలో ఉన్నాయి. గుప్పెడు తులసి ఆకులను ముద్దగా నూరి, అర లీటర్ నీటిలో వేసి మరిగించాలి. ఈ నీరు చల్లారిన తర్వాత తలకు పట్టించి, పది నుంచి పదిహేను నిమిషాలు ఉంచి కడిగేయాలి. వెంట్రుక చిట్లడం తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది. కుదుళ్లు బలపడి వెంట్రుకల ఎదుగుదల బాగుంటుంది. వారానికి ఒకసారైనా తులసి చికిత్స శిరోజాలకు ఎంతో మేలు చేస్తుంది.