grief
-
55 ఏళ్లు.. 150 కిలోమీటర్లు
కొందరు ఓటమి నుంచి విజయాలు అందుకుంటారు. మరికొందరు తమ జీవితంలో ఎదురైన ప్రతిబంధకాల నుంచి బయటపడేందుకు ఏదో సాధించాలనే తపనతో ముందుకు సాగుతారు. ఆ కోవకు చెందిన వారే స్విమ్మర్ గోలి శ్యామల. సామర్లకోటకు చెందిన శ్యామల భర్త మోహన్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. కుమారుడితో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో యానిమేషన్ స్టూడియో పెట్టుకుని పలు సీరియళ్లు, సినిమాలకు పనిచేశారు. దురదృష్టవశాత్తూ స్టూడియో ద్వారా తీవ్రంగా నష్టపోవడంతో మానసికంగా మనోవేదనకు గురయ్యారు. దాంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. 45 ఏళ్ళ వయసులో శరీరం సహకరించని స్థితిలో మనసును మళ్ళించేందుకు హైదరాబాద్‌లో స్విమ్మింగ్ నేర్చుకున్నారు. స్వతహాగా ఆమె స్విమ్మర్ కాదు... అయితేనేం, నాటి మనోవేదనకు ఉపశమనంగా ప్రారంభించిన స్విమ్మింగ్ నేడు ఐదు పదుల వయసులో ఆమెను సముద్రాలు దాటే సాహస యాత్రికురాలిగా తీర్చిదిద్దింది.150 కిలోమీటర్లు ఏడు రోజుల్లో అలవోకగా.. డిసెంబరు 28న విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద సముద్ర తీరంలో ఈత ప్రారంభించిన శ్యామల శుక్రవారం కాకినాడ తీరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ యానిమేషన్ స్టూడియోలో నష్టం రావడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన తాను మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు స్విమ్మింగ్ప్రారంభించాననీ, కోచ్ జాన్ సిద్ధిక్ సహకారంతో జీరో లెవెల్ నుంచి 150 కిలోమీటర్ల స్విమ్ చేసేలా తయారయ్యానని సగర్వంగా చెప్పారు. 2021లో శ్రీలంక నుంచి ఇండియా వరకు రామ్‌సేతు దాటానని, తాజాగా ఫిబ్రవరిలో లక్షద్వీప్‌లో స్విమ్ చేశానన్నారు. బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈదడం ద్వారా ఆసియా స్థాయిలో ఘనత సాధించానన్నారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఈదాలని రెండేళ్ళ కిందటే నిర్ణయించుకున్నానని, అయితే రెండుసార్లు వాతావరణం అనుకూలించలేదనీ, ఎట్టకేలకు డిసెంబర్ 28న చిన్న ఫిషింగ్ బోట్, ఇద్దరు స్క్రూపర్ డ్రైవర్స్తోప్రారంభించానన్నారు. ఆర్కే బీచ్‌లో సముద్రంలో ప్రవేశించాక మళ్ళీ కాకినాడలో నేలపైకి వచ్చామన్నారు. మొదటి రోజు 7 గంటల్లోనే 30 కిలోమీటర్ల దూరం ఈదానన్నారు. తరువాత నుంచి ఈరోజు వరకు అనేక ఒడుదొడుకులను అధిగమిస్తూ ఈదుకుంటూ వచ్చానన్నారు. తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ల వరకు స్విమ్మింగ్ వల్లే ఆరోగ్యం కలుగుతుందని, స్విమ్మింగ్‌ను స్పోర్ట్‌గా కాకుండా సర్వైవల్ స్పోర్ట్‌గానే చెబుతానన్నారు. మహిళలు ఈత చేయడం వలన గైనిక్ సమస్యలు తగ్గుతాయన్నారు. హేళన చేసిన వారే పొగుడుతున్నారుసముద్రంలో ఈత కోసం తొలి ప్రయత్నం చేసినప్పుడు చాలామంది హేళన చేశారు. కొందరు యూ ట్యూబ్‌లో కామెంట్లు పెట్టారు. వాటిని పట్టించుకోలేదు. అరేబియా సముద్రం ఈదాను, శ్రీలంక నుంచి ఇండియా ఈత మరపురానిది, మేదీ స్ఫూర్తితో లక్షద్వీప్‌లో 18గంటల పాటు 48 కిలోమీటర్లు ఈదాను. వైజాగ్ నుంచి కాకినాడ 150 కిలోమీటర్లు ఈదగలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. – గోలి శ్యామల – స్విమ్మర్. – లక్కింశెట్టి శ్రీనివాసరావుసాక్షి ప్రతినిధి.. కాకినాడ.ఫోటోలు: విశ్వనాధుల రాజబాబు. కాకినాడ రూరల్ -
రతన్ టాటాకు రాష్ట్రపతి, ప్రధానిలతో పాటు ప్రముఖుల నివాళులు
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారు. ఆయనకు 86 ఏళ్లు. ఆయన మృతిపై ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. దేశంలో అతిపెద్ద బిజినెస్ ట్రస్ట్ టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దాంతో రాష్ట్రపతి, ప్రధానిలతో పాటు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారుభారత్ పారిశ్రామిక దిగ్గజాన్నికోల్పోయింది: రాష్ట్రపతిరతన్ టాటా మృతిపట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘రతన్ టాటా మృతి నిజంగా బాధాకరం. పారిశ్రామిక దిగ్గజాన్ని భారత్ కోల్పోయింది. మంచి విలువులున్న వ్యక్తి రతన్ టాటా’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు.In the sad demise of Shri Ratan Tata, India has lost an icon who blended corporate growth with nation building, and excellence with ethics. A recipient of Padma Vibhushan and Padma Bhushan, he took forward the great Tata legacy and gave it a more impressive global presence. He…— President of India (@rashtrapatibhvn) October 9, 2024 రతన్ టాటా దూరదృష్టి గల వ్యాపార దిగ్గజం: ప్రధాని మోదీప్రధాని మోదీ ట్విట్టర్లో ఇలా రాశారు - రతన్ టాటా దూరదృష్టి గల వ్యాపార దిగ్గజం. దయాహృదయం కలిగిన వ్యక్తి. అసాధారణమైన వ్యక్తి. అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. సమాజాన్ని మెరుగుపరచడంలో అతనికున్న అచంచలమైన నిబద్ధత స్ఫూర్తిదాయకమైనవి. Shri Ratan Tata Ji was a visionary business leader, a compassionate soul and an extraordinary human being. He provided stable leadership to one of India’s oldest and most prestigious business houses. At the same time, his contribution went far beyond the boardroom. He endeared… pic.twitter.com/p5NPcpBbBD— Narendra Modi (@narendramodi) October 9, 2024 మంచి స్నేహితుడిని కోల్పోయా: ముఖేష్ అంబానీరతన్ టాటా మృతిపట్ల ముఖేష్ అంబానీ సంతాపం వ్యక్తం చేశారు. మంచి స్నేహితుడిని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు: సుధామూర్తిరతన్ టాటా మరణం దేశానికి తీరని లోటన్నారు రాజ్యసభ ఎంపీ సుధామూర్తి. ఇతరుల పట్ల కరుణ చూపే వ్యక్తి రతన్ టాటా అని ఆమె కొనియాడారు.ఆయనొక వెలకట్టలేని వజ్రం: ఆర్ఎస్ఎస్రతన్ టాటా మృతిపట్ల ఆర్ఎస్ఎస్ సంతాపం వ్యక్తం చేసింది. రతన్ టాటా మృతి భారతీయులందరికీ బాధాకరమని ఆర్ఎస్ఎస్ తెలిపింది. రతన్ టాటా వెలకట్టలేని వజ్రమని కొనియాడింది.పారిశ్రామిక రంగానికి నిజమైన ఐకాన్: వైఎస్ జగన్ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ చావల్ టాటా మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దేశ పారిశ్రామిక రంగానికి నిజమైన ఐకాన్ రతన్ టాటా అని వైఎస్ జగన్ కొనియాడారు. సమాజం కోసం రతన్ టాటా పనిచేశారు. దేశ నిర్మాణానికి రతన్ టాటా సహకారం అందించడంతో పాటు, దేశానికి రతన్ టాటా సేవలు స్పూర్తిదాయకమన్నారు వైఎస్ జగన్.Deeply saddened by the loss of Shri Ratan Tata Ji. A true visionary whose kindness, integrity, and leadership will continue to inspire us and generations to come. My condolences to the Tata family .— YS Jagan Mohan Reddy (@ysjagan) October 10, 2024గొప్ప మానవతావాది: మానవతావాది: వెంకయ్య నాయుడురతన్టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. గొప్ప మానవతావాది అని వెంకయ్యనాయుడు కొనియాడారు. రతన్ టాటా జీవితం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమన్న వెంకయ్య నాయుడు.. అత్యున్నత వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. పరోపకారి రతన్ టాటా: కేసీఆర్రతన్ టాటా మృతికి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని కేసీఆర్ పేర్కొన్నారు. దార్శనిక కార్యాచరణ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రగతికి మానవీయ కోణాన్ని అద్దిన మానవతావాది, దార్శనికుడు, పరోపకారి రతన్ టాటా అని కేసీఆర్ కొనియాడారు.రతన్ టాటా నిజమైన ఆవిష్కర్త: కేటీఆర్రతన్ టాటా మృతిపట్ల కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.రతన్ టాటా నిజమైన ఆవిష్కర్త అని కొనియాడారు. రతన్ టాటా మరణం వ్యాపార ప్రపంచంలో శూన్యాన్ని మిగిల్చిందన్న కేటీఆర్.. ఆయన అందరి హృదయాల్లో ఉంటారన్నారు.రతన్ టాటా మృతిపట్ల జేపీ నడ్డా సంతాపంరతన్ టాటా సేవలు దేశం, ప్రపంచంపై చెరగని ముద్ర వేశాయినిజమైన మానవతావాది రతన్ టాటా: సీఎం చంద్రబాబురతన్ టాటా మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. నిజమైన మానవతావాదిని కోల్పోయామన్నారు సీఎం చంద్రబాబు.రతన్ టాటా దాతృత్వానికి ప్రతీక: సీఎం రేవంత్రెడ్డిరతన్ టాటా దాతృత్వానికి ప్రతీక అన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. ఆయన సేవలు చిరస్మరణీయమని సీఎం రేవంత్ కొనియాడారు.టాటా విజన్ కలిగిన వ్యక్తి: రాహుల్ గాంధీకాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ.. రతన్ టాటా విజన్ కలిగిన వ్యక్తి. వ్యాపారం, దాతృత్వం రెండింటిలోనూ చెరగని ముద్ర వేశారు.Ratan Tata was a man with a vision. He has left a lasting mark on both business and philanthropy.My condolences to his family and the Tata community.— Rahul Gandhi (@RahulGandhi) October 9, 2024ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన రతన్ టాటారక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన సంతాప సందేశంలో.. రతన్ టాటా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రసిద్ధి చెందారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని రాశారు.దూరదృష్టి గల వ్యక్తిని భారత్ కోల్పోయిందిపారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ట్వీట్లో.. ఆధునిక భారతదేశ మార్గాన్ని పునర్నిర్వచించిన, దూరదృష్టి గల వ్యక్తిని భారత్ కోల్పోయింది. రతన్ టాటా కేవలం వ్యాపార నాయకుడే కాదు.. అతను తిరుగులేని నిబద్ధతతో భారతదేశ స్ఫూర్తిని మూర్తీభవించారు.India has lost a giant, a visionary who redefined modern India's path. Ratan Tata wasn’t just a business leader - he embodied the spirit of India with integrity, compassion and an unwavering commitment to the greater good. Legends like him never fade away. Om Shanti 🙏 pic.twitter.com/mANuvwX8wV— Gautam Adani (@gautam_adani) October 9, 2024టాటా జీ మరణం చాలా బాధాకరంఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇలా ట్వీట్ చేశారు.. భారతదేశ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, 'పద్మ విభూషణ్' రతన్ టాటా జీ మరణం చాలా బాధాకరం. అతను భారతీయ పరిశ్రమకు తిరుగులేని దిగ్గజం. ఆయన మృతి తీరని లోటు. అతని జీవితమంతా దేశ పారిశ్రామిక, సామాజిక అభివృద్ధికి అంకితం అయ్యింది. రతన్ టాటా దేశానికి నిజమైన రత్నం.Saddened by the passing away of Shri Ratan Tata. He was a Titan of the Indian industry known for his monumental contributions to our economy, trade and industry. My deepest condolences to his family, friends and admirers. May his soul rest in peace.— Rajnath Singh (@rajnathsingh) October 9, 2024రతన్ టాటా సహకారం చారిత్రాత్మకంఆనంద్ మహీంద్రా తన ట్వీట్లో - దేశ అభివృద్ధికి రతన్ టాటా చేసిన సహకారం చారిత్రాత్మకమైనది. దేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు.भारत के प्रख्यात उद्योगपति, 'पद्म विभूषण' श्री रतन टाटा जी का निधन अत्यंत दुःखद है।वह भारतीय उद्योग जगत के महानायक थे। उनका जाना उद्योग जगत के लिए अपूरणीय क्षति है। उनका सम्पूर्ण जीवन देश के औद्योगिक और सामाजिक विकास को समर्पित था। वे सच्चे अर्थों में देश के रत्न थे।प्रभु…— Yogi Adityanath (@myogiadityanath) October 9, 20241991లో టాటా గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలుకాగా, రతన్ టాటా 1991లో టాటా గ్రూప్‌కు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. 2012 వరకు ఈ పదవిలో కొనసాగారు. అతను 1996లో టాటా సర్వీసెస్, 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తదితర కంపెనీలను స్థాపించారు.నేడు అంత్యక్రియలుటాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) బుధవారం రాత్రి కన్నుమూశారు. కొల్బాలోని నివాసానికి రతన్ టాటా పార్ధివ దేహాన్ని తరలించారు. ఉదయం 10.30 గంటలకు పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ మైదానంలో ఉంచనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. గురువారం సాయంత్రం 4గంటల తరువాత అధికారిక లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఇది కూడా చదవండి: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత -
ప్రధాని చిన్ననాటి గురువు మృతి...సంతాపం వ్యక్తం చేసిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ చిన్ననాటి పాఠశాల టీచర్ రాస్విహారి మణియార్(94) కన్నుమూశారు. గుజరాత్‌లోని వాద్‌నగర్‌లోని బీఎన్ విద్యాలయంలో రాస్విహారి ప్రిన్స్‌పాల్‌గా చేసి పదవీ విరమణ చేశారు. ఈ పాఠశాలలోనే ప్రధాని మోదీ చదువుకున్నారు. మోదీ ఆయన మరణం గురించి తెలుసుకుని చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు మోదీ మాట్లాడుతూ...నా గురువు మణియార్ మరణం గురించి విని చాలా బాధపడ్డాను. నాజీవితంలో ఆయన చేసిన అమూల్యమైన సహకారం ఎప్పటికీ మరిచిపోను. ‘నా జీవితంలో ఈ దశ వరకు కూడా ఆయనతో కనక్ట్ అవుతూనే ఉన్నాను. విద్యార్థిగా నా జీవితాంతం ఆయన మార్గదర్శకత్వం పొందడం పట్ల నేను సంతృప్తి చెందాను’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో మోదీ తన చిన్ననాటి గురువుని సత్కరిస్తున్న వీడియోతో పాటుగా ఆయనతో కలిసి దిగిన ఫోటోలను నెటిజన్లతో పంచుకున్నారు. మోదీ అవకాశం వచ్చినప్పుడల్లా తన గురువు గురించి తన ప్రసంగంలో ప్రస్తావిస్తుంటారు. ముఖ్యంగా గుజరాత్ పర్యటనలో ఉన్నప్పుడల్లా తన గురువులను కలిసేందుకు ప్రయత్నించేవారు. అంతేగాదు ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడూ అహ్మదాబాద్‌లోని గుజరాత్ కాలేజ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తన ఉపాధ్యాయులను సత్కరించారు కూడా. મારી શાળાના શિક્ષક રાસબિહારી મણિયારના અવસાનના સમાચાર સાંભળી ખૂબ જ વ્યથિત છું. મારા ઘડતરમાં તેમનો અમૂલ્ય ફાળો છે. હું જીવનના આ પડાવ સુધી તેમની સાથે જોડાયેલો રહ્યો અને એક વિદ્યાર્થી હોવાના નાતે મને સંતોષ છે કે જીવનભર મને તેમનું માર્ગદર્શન મળતું રહ્યું. pic.twitter.com/QmlJE9o07E — Narendra Modi (@narendramodi) November 27, 2022 (చదవండి: జోడో యాత్రలో రాహుల్ బైక్ రైడ్) -
విషాదం: కూతుళ్లకు పెళ్లి చేయలేక.. తీవ్ర మనస్తాపంతో
ధర్మవరం అర్బన్(అనంతపురం జిల్లా): పేదరికం అతని జీవితాన్ని అపహాస్యం చేసింది. కన్న బిడ్డలకు పెళ్లిళ్లు చేయలేని నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని గీతానగర్‌కు చెందిన దుస్సా రవిశంకర్ (52), దేవి దంపతులు. వీరికి లావణ్య, చందన అనే ఇద్దరు కుమార్తెలతో పాటు ఓబులేసు అనే కుమారుడూ ఉన్నాడు. చదవండి: పానీపూరి తెచ్చిన తంటా.. చివరకు పోలీస్‌స్టేషన్‌కు.. రవిశంకర్ ఓ గ్యారేజ్‌లో పనిచేస్తూ వచ్చే అరకొర సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేయడం భారంగా మారింది. కుటుంబ పోషణకే కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో కుమార్తెల పెళ్లిళ్లు చేయలేకపోతున్నానంటూ రోజూ మదనపడేవాడు. తీవ్ర మనస్తాపంతో ఆదివారం తెల్లవారుజామున అగ్నిమాపక శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ధర్మవరం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
డాలర్ శేషాద్రి మృతి పట్ల వైవీ సుబ్బారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి, తిరుపతి: డాలర్ శేషాద్రి మరణం తీరని లోటని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శేషాద్రి సేవలు మరువలేనివన్నారు. ఆయన మరణం పట్ల సుబ్బారెడ్డి సంతాపం తెలిపారు. శ్రీవారి సేవే ఊపిరిగా ఆయన పని చేశారన్నారు. ఆయన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్య జీవి అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశారన్నారు. ఆయన మరణ వార్త తానను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నానని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. చదవండి: శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత -
Heavy Rains: పొలాల్లో నీళ్లు.. రైతు కన్నీళ్లు
పై చిత్రంలోని మహిళా రైతు పేరు బొలిశెట్టి రుక్కమ్మ పాత మంచిర్యాల శివారులో 11 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట వేసింది. ఈ ఏడాది జూలైలో వచ్చిన గోదావరి వరదతో చేను నీట మునగడంతో.. రెండోసారి విత్తనాలు వేసింది. కలుపు తీసి, ఎరువులు వేసి.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. తీరా ఇప్పుడు పంట చేతికొచ్చే దశలో కురిసిన వానలు మళ్లీ దెబ్బతీశాయి. ఎల్లంపల్లి నుంచి భారీగా నీటిని వదలడంతో గోదావరి పోటెత్తి పంట మొత్తం నీట మునిగింది. ఇప్పటివరకు రూ. 4 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టామని.. రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన పంట మొత్తం నీటిపాలైందని రుక్కమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నిండా మునిగి పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటోంది. సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: రాష్ట్రంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు ఉప్పొంగి, చెరువులు అలుగులు పారి పొలాలు, చేన్లలో నీళ్లు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 6.20 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో 1.20 లక్షల ఎకరాల్లో పంటలు ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. పొలాల నుంచి నీళ్లు తొలగిస్తే.. మిగతా పంటలు గట్టెక్కే అవకాశం ఉందని అంటున్నాయి. (చదవండి: బీజేపీని గెలిపిస్తే.. వంటగ్యాస్ రూ.1,500 దాటుతుంది) 14 జిల్లాల్లో అత్యధికంగా.. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో పంటలు నీట మునిగినట్టు అధికారులు గుర్తించారు. ఇం దులో 14 జిల్లాల్లో అత్యధికంగా, నాలుగు జిల్లాల్లో పాక్షికంగా పంటలు దెబ్బతిన్నట్టు అంచనా వేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరి సిల్ల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అనేక చోట్ల పంటలు నీట మునిగినట్టు తేల్చారు. ఈ జిల్లాల్లో కుంభవృష్టి కురవడంతో వాగులు, వంకలు ఉప్పొం గాయి. పలుచోట్ల చెరువులు, ఒర్రెలు తెగడంతో నీళ్లన్నీ పొలాల్లో చేరాయి. పత్తి, వరి, పసుపుతో పాటు పునాస పంటలు మొక్కజొన్న, కందులు, నువ్వులు, వేరుశనగ దెబ్బతిన్నాయి. ► ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో పాక్షికంగా పంటలు నీట మునిగాయని అధికారులు అంచనా వేశారు. మిగతా జిల్లాల్లోనూ స్వల్పంగా పంటలు నీట మునిగాయని, కొన్నిచోట్ల దెబ్బతిన్నాయని పేర్కొంటున్నారు. అయితే ఈ వివరాలను వ్యవసాయశాఖ వర్గాలు అధికారికంగా వెల్లడించడం లేదు. పంట నష్టం వివరాలను సేకరిస్తున్నామని.. ప్రభుత్వం అడిగితే పైఅధికారులకు పంపిస్తామని చెప్తున్నారు. (చదవండి: TSRTC: కారుణ్యం లేదు.. కనికరం లేదు) 1.22 కోట్ల ఎకరాల్లో సాగు ఈసారి వానలు ముందే మొదలవడంతో జూన్ తొలివారంలోనే రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు మొదలైంది. 1.22 కోట్ల ఎకరాల్లో సాగు జరిగిందని.. అందులో 50.85 లక్షల ఎకరాలలో పత్తి, 49.87 లక్షల ఎకరాలలో వరి, 6.12 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 8.98 లక్షల ఎకరాల్లో కంది, 1.34 లక్షల ఎకరాల్లో పెసర, 3.48 లక్షల ఎకరాల్లో సోయా పంటలు వేసినట్టు అధికారులు చెప్తున్నారు. పలు జిల్లాల్లో నష్టం తీరు ► పెద్దపల్లి జిల్లాలో 450 ఎకరాల్లో పత్తి, 50 ఎకరాల్లో వరి పంటలు నీట మునిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ► సంగారెడ్డి జిల్లాలో 5,387 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో పెసర, మినుము, సోయాబీన్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తి చేన్లలో నీళ్లు నిలవడంతో మొక్కలు రంగు మారుతున్నాయి. ► మెదక్ జిల్లాలో 641 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు ► సిద్దిపేట జిల్లాలో 7,117 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 4,325 ఎకరాలు, పత్తి 1,870, మొక్కజొన్న 593, కంది 329 ఎకరాల్లో దెబ్బతిన్నట్టు పేర్కొన్నారు. ► రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6,890 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించారు. ► నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 3,729 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. మరో 7,311 ఎకరాల్లో పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో పంట నష్టం మరింత ఎక్కువగా ఉంటుందని రైతులు చెప్తున్నారు. నష్ట పరిహారం ఎలా? రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు బీమా అందే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కేంద్రం అమలు చేసే ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)’ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలగడమే దీనికి కారణం. కేంద్రం ఫసల్ బీమాను 2016–17లో ప్రారంభించింది. భారీ వర్షాలు, తుఫాన్లు వంటివాటితో జరిగే పంట నష్టాలకు పరిహారం అందుతుంది. ప్రీమియం సొమ్ములో రైతులు 2–5 శాతం వరకు చెల్లిస్తే.. మిగతా మొత్తంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం భరించాలి. తెలంగాణ ప్రభుత్వం 2020 వర్షాకాలం నుంచి ఫసల్ బీమాను రాష్ట్రంలో నిలిపివేసింది. రైతు యూనిట్‌గా ఇవ్వాలని..: ఫసల్ బీమా పథకం కొన్ని పంటలకు గ్రామం యూనిట్‌గా, మరికొన్నింటికి మండలం యూనిట్‌గా అమలవుతుంది. కొందరికే నష్టం జరిగితే బీమా పరిహారం వచ్చే అవకాశం ఉండదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. రైతు యూనిట్‌గా ఫసల్ బీమాను అమలు చేయాలని డిమాండ్ చేసింది. కానీ కేంద్రం మార్చలేదు. అంతేగాకుండా బీమా ప్రీమియం కింద ఎక్కు వగా సొమ్ము చెల్లించాల్సి రావడంతోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని ఆపేయాలన్న నిర్ణయా నికి వచ్చిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే.. ఫసల్ బీమాను వద్దనుకున్న బిహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు సొంత పథకాలను ప్రారంభించాయి. ఏపీ కూడా కేవలం రూపాయి ప్రీమియంతో ఉచితంగా కేంద్ర పథకాన్ని అమలు చేస్తోంది. కానీ రాష్ట్రంలో ఎలాంటి పంటల బీమా పథకం చేపట్టక ఇప్పుడు పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారం అందే పరిస్థితి లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. మూడుసార్లు మునిగి.. నాకు మూడెకరాల పొలం ఉంది. జూలైలోనే వరినాట్లు వేసినా అప్పట్లో కురిసిన కుంభవృష్టితో నారు మొత్తం కొట్టుకుపోయింది. వెంటనే మరోసారి నాట్లు వేశాను. మరో వారం తర్వాత కురిసిన వానలకు రెండోసారీ వృధా అయింది. నాకు వ్యవసాయమే బతుకుదెరువు. అందుకే మూడోసారి వరి నారు కొని నాట్లు వేసిన. పంట ఏపుగా పెరిగింది. కానీ ఇప్పుడు మళ్లీ కురిసిన భారీ వర్షాలతో వరి మొత్తం కొట్టుకుపోయింది. ఏం చేయాలో అర్థంకావడం లేదు. ప్రభుత్వమే ఏదో ఒక విధంగా ఆదుకోవాలి. -నిమ్మ రాజారెడ్డి, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా పంట జాడే లేకుండా పోయింది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సిత్యా తండాలో ఇసుక మేటలు వేసిన వరి పొలం ఇది. వాంకుడోతు సోమ అనే రైతు రెండున్నర ఎకరాల్లో వరి వేశాడు. ఇటీవలి వర్షాలకు బుంగ వాగు ఉప్పొంగి ఈ పంట నీట మునిగింది. ఒకటిన్నర ఎకరాల్లో ఇసుక, మట్టి మేట వేసి.. అసలు పంట వేసిన ఆనవాళ్లే లేకుండా పోయాయి. నెల రోజులైతే పంట చేతికి వచ్చేదని.. తమ శ్రమ అంతా మట్టిలో కలిసిపోయిందని సోమ ఆవేదనలో మునిగిపోయాడు. పొలంలో ఇసుక, మట్టి మేటలను తొలగించాలంటే లక్ష రూపాయలదాకా ఖర్చువుతుందని, ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన కోరుతున్నాడు. కూతురి పెళ్లి అప్పు తీర్చాలనుకుంటే.. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు మూడు వీరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం టాక్యా తండాకు చెందిన ఆయన.. నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. ఈసారి పంట బాగుంటే.. తన కుమార్తె పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చవచ్చని ఆశపడ్డాడు. కానీ భారీ వర్షాలతో పత్తి చేను నీట మునిగింది. ఇప్పుడు అప్పులెలా తీర్చాలె, బతుకెట్లా గడవాలి అంటూ ఆందోళనలో పడ్డాడు. పంట పోయింది.. ఏం చేయాలె? మెదక్ జిల్లా రేగేడు మండల కేంద్రానికి చెందిన కుమ్మరి సాయిలు పత్తి చేను ఇది. సాయిలు తనకున్న రెండు ఎకరాలతోపాటు మరో ఐదు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి వేశాడు. భారీ వర్షాలకు పంటంతా నీట మునిగింది. పత్తి కాయలు రాలిపోవటంతోపాటు రంగు మారింది. కనీసం పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేకుండా పోయిందని సాయిలు ఆందోళన చెందుతున్నాడు. ఇప్పుడేం చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బోదేపల్లికి చెందిన రైతు నోముల శ్రీధర్‌కు చెందిన మొక్కజొన్న చేను ఇది. ఆయన వేసిన రెండెకరాల మొక్కజొన్న ఇటీవలి భారీ వర్షాలకు నేలకొరిగింది. వానలు ఇంకా కొనసాగుతుండటంతో ఇక పంట ఏ మాత్రం చేతికందే పరిస్థితి లేదంటూ శ్రీధర్ ఆవేదనలో మునిగిపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. -
చిట్టీ డబ్బులివ్వలేదు.. స్థలం రిజిస్ట్రేషన్ చేయలేదు..
పాల్వంచ: కష్టపడి చిట్టీ కట్టగా, డబ్బు ఇవ్వకుండా మోసం చేశారనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాల్వంచలోని జయమ్మ కాలనీకి చెందిన మల్లిపెద్ది వెంకటేశ్వరరావు (40) దగ్గరి బంధువైన నందిగం భానుకుమార్ వద్ద రూ.25 లక్షల చిట్టీలు రెండు కట్టాడు. చివరి వరకు చెల్లించాక రూ.50 లక్షలు ఇవ్వాలని కోరితే తిప్పుతుండటంతో కేసు పెడుతామని చెప్పాడు. దీంతో బొల్లేరుగూడెం ఏరియాలోని 747 గజాల స్థలాన్ని వెంకటేశ్వరరావుకు రాసిచ్చాడు. కానీ రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేయసాగాడు. ఇదిలా ఉండగా, వెంకటేశ్వరరావుకు తెలియకుండా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెకు చెందిన మరో వ్యక్తికి కూడా ఇదే స్థలాన్ని భానుకుమార్ అగ్రిమెంట్ చేశాడు. చివరికి వీరిద్దరికి కాకుండా మల్లెల దినేష్‌కు రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ స్థలంలో దినేష్ ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ విషయమై పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయని సమాచారం. అయినా తనకు న్యాయం జరగడం లేదని భావించిన వెంకటేశ్వరరావు గురువారం రాత్రి ఇంటి వద్దే పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు వెంటనే కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటేశ్వరరావు మరణించాడు. కాగా, ఓ ఎమ్మెల్యే కుమారుడు, అధికార పార్టీ నేతలు, పోలీసులు కూడా తనకు న్యాయం జరగకుండా అడ్డుకున్నారని, ఈ కారణంగానే మనస్తాపానికి గురైనట్లు వెంకటేశ్వరరావు పురుగు మందు తాగే ముందు ఎస్పీ పేరిట 43 మంది పేర్లతో రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఈ విషయమై పాల్వంచ ఎస్ఐ రితీశ్‌ను వివరణ కోరగా.. చిటీ డబ్బు విషయంలో మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అతని భార్య శ్రావణి ఫిర్యాదు చేసిందని తెలిపారు. -
రాష్ట్రపతి భవన్‌ను సామాన్యులకు చేరువ చేశారు : మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి భవన్‌ను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ప్రణబ్ ముఖర్జీదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతించారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, మేథావిని దేశం కోల్పోయిందని అన్నారు. దేశ అభివృద్ధికి ప్రణబ్ విశేషంగా కృషి చేశారని అన్నారు. రాజకీయాలు, వర్గాలకు అతీతంగా ప్రణబ్ ముఖర్జీ అందరికీ ఆరాధ్యులని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. పలు పాలనా విధానాలపై ఆయన చేసిన సూచనలు సదా స్మరణీయమని చెప్పారు. భారతరత్న ప్రణబ్ ముఖర్జీ కన్నుమూతతో దేశం విషాదంలో కూరుకుపోయిందని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రణబ్ భరతమాత ముద్దుబిడ్డ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రణబ్ ముఖర్జీ గొప్ప రాజనీతిజ్ఞుడని, ఆయన మరణం దేశానికి తీరని లోటని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు. భరతమాత ముద్దుబిడ్డ ప్రణబ్ దేశానికి అందించిన సేవలు మరువలేనివని అన్నారు. ఇక ప్రణబ్ ముఖర్జీ క్రమశిక్షణ, అంకిత భావంతో దేశానికి సమున్నత సేవలు అందించారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దివంగత నేతకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గొప్ప నేతను కోల్పోయాం : అమిత్ షా దేశం గొప్ప రాజకీయ నేతను కోల్పోయిందని హోంమంత్రి అమిత్ షా ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భారత్ గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని, ఆయన మాతృభూమికి ఎనలేని సేవ చేశారని ప్రస్తుతించారు. రాహుల్ సంతాపం మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రణబ్ మృతి పట్ల యావత్ జాతి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తోందని రాహుల్ అన్నారు -
మొనగాడు
వాడంతే.. కడలిలో అల తలెత్తిదంటే చాలు కాళీయకృష్ణుడై పోతాడు. అల తలపై ఎక్కే ప్రయత్నం మాత్రం ఏ రోజూ సఫలం కాలేదు. వాడు పరిగెత్తి అలల్లో అలగా పడిలేవటమూ ఆగిపోలేదు. అలతో పాటు అడుక్కి చేరటం మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత వాడు కనిపించడు ఎక్కడా. నిముషం, రెండు నిముషాలు, మూడు నాలుగు నిమిషాలు చూస్తూ చూస్తూనే గడచిపోతాయి. వాడుమాత్రం కనిపించడు.సముద్రంలో మరో అల గట్టున కొండలా ఎగిసి పడుతుంది. గట్టున వాళ్లమ్మ కొండంత ఆశతో ఎదురు చూస్తూ నిలుచుంటుంది. కాని వాడి జాడ మాత్రం కనిపించదు. పైకి లేచిన అల విరిగి తిరిగి సముద్రంలో లీనమైపోతుంది. అలలాగే తల్లి గుండె కూడా ఛిద్రమై ఆగిపోతున్నంత పనౌతుంది. అప్పుడు కనిపిస్తాడు వాడు. అలచాటున మునిగి తేలుతూనో, నడుస్తూనో, ఈదుకుంటూనో గట్టుకు వస్తుంటాడు. పరిగెత్తుకుంటూ తల్లి వాడి రెండు చేతుల్ని వొడిసి పట్టుకొని గట్టుకు లాక్కొస్తుంది. ‘‘ఎహె.. వొదులొదులు..’’ అంటూ చేతులు విడిపించుకుంటాడు సముద్రంకేసి చూస్తూ.‘‘వొరే గంగులూ! నీ కెందుకురా ఈ పని.. వద్దురా మానుకోరా’’ ప్రాధేయపడుతుంది మునెమ్మ.‘‘ఆటనే.. ఆట.. సముద్రంతో ఆట. ఆడితే నీకే తెలుస్తది ఎంత సమ్మగుంటదో’’ అంటూ తల్లి చేతుల్ని విడిపించుకొని ఎగుస్తున్న అలవైపు పరుగు తీస్తున్న గంగణ్ణి నిస్సహాయంగా చూస్తూ...‘‘వొరే! తొందరగా గుడిసెకి రా. సద్దిబువ్వ తిందువుగాని’’ అంటూ దూరంగా సర్వుచెట్ల మధ్యనున్న గుడిసెల వైపుకి వెళ్లిపోతుంది మునెమ్మ. గంగడు మాత్రం సముద్రం మీద సవాలన్నట్టు నీళ్లలోకి పరుగు తీస్తాడు.మునెమ్మకి, జానయ్యకి మనువైన పదేళ్ల తర్వాత పుట్టిన బిడ్డ గంగడు. ఆ గంగమ్మ తల్లి దయవల్ల పుట్టాడన్న నమ్మకంతోనే వాడికి గంగడు అని పేరెట్టుకున్నారు. నాలుగేళ్లు నీళ్లంటే భయపడి పరిగెత్తుకొచ్చి తల్లి కాళ్లను చుట్టేసుకునే వాడు గంగడు. ఐదో యేటనే మునెమ్మ వాణ్ణి అయ్యతోపాటు పడవ మీద వేటకి పంపింది. ఆ వయసు నుండే చేపల వేట నేర్వటం పట్టపోళ్ల ఆచారం. తండ్రి సొరచేపని భుజానేసుకెళ్తున్నట్టు తీసుకెళ్తుంటే ఏడుస్తూ ఎంత భయపడ్డాడో గంగడు. పడవలో నుండి దూకి పరిగెత్తుతూ వచ్చి తల్లిని వాటేసుకున్నాడు. వాడి వెనకే పరిగెత్తుకొచ్చిన జానయ్య వాణ్ణి మళ్లీ సొరచేపలా ఎత్తుకెళ్లి పడవలో పడేశాడు.సాయంత్రం వేటకి బయలుదేరిన పడవ దాదాపు మూడు కిలోమీటర్లు సముద్రంలో కెళ్లే సరికి సూర్యుడు ఓ వైపు పడమర ఆకాశంలో దిగిపోతున్నాడు. ఇటు తూరుపు ఆకాశంలో పున్నమి చంద్రుడు చందువా చేపలా తళతళ లాడుతూ పైకొస్తున్నాడు. పడవలో జానయ్యతో పాటు వున్న గంగడు అంత ప్రకాశవంతమైన చంద్రుణ్ణి చూడటం అదే మొదటి సారి. గంగడి ఆశ్చర్యం వాడి ముఖంలో వాడి కళ్లలో కనపడుతుంటే ‘‘ఏందిరో గంగులూ! అట్టా సూత్తున్నావ్. సముద్రంలో చంద్రుడు అట్టాగే వుంటాడు’’ అన్నాడు జానయ్య. జానయ్య ఆ మాట ముగించేలోగానే కళ్లముందు ఆకాశమెత్తు అల అలా కదిలింది. ఆ క్షణాన్ని అర్ధం చేసుకొన్న జానయ్య ఎగిరి కొడుకుని గబుక్కున వాటేసుకున్నాడు. అల తాకిడికి పడవ అల్లంత పైకి లేచి దబ్బున నీళ్లలో పడింది. పడవతో పాటు అలకూడా పడవై పడటం, పడవ వొక్కసారి నీళ్లలో వొక గిరికీ తిరిగి నీళ్లపైన తేలటం జరిగిపోయాయి. కాని ఆ గిరికీ కొట్టడంలో జానయ్య చేతిల్లోంచి గంగడు ఎలా జారిపోయాడో తెలీనే లేదు. ఆ విషయం తెలుసుకొనే సరికి తండ్రి గుండె సముద్రంలో చెరువై పోయింది. నీళ్లలో మునకలేస్తూ దాదాపు గంటసేపు గంగడి జాడకోసం వెతుకుతూనే వున్నాడు.తెల్లారితే మునెమ్మకి చేపల్లోపెట్టి అప్పగించాల్సిన కొడుకు. ఎంత వెదికినా జాడ కనిపించని కొడుకు. జానయ్యలో శోకం కాస్త కోపంగా, కోపం మొండితనంగా మారిపోయింది. తెల్లారగట్టా పడవ చుట్టూ మునుగుతూ తేలుతూ వెతుకుతునే వున్నాడు. కాని గంగడి జాడ మాత్రం చేతికి తగలనే లేదు. సముద్ర కెరటాల ముందు యింకా ఈదటానికి తన రెక్కల బలం చాలక పడవలోకి చేరుకున్నాడు.జానయ్యకి నమ్మకం కుదరలేదు. అసాధ్యం సాధ్యం కావటం మీద గురికూడ కుదరలేదు. రెండు చేతుల్తో తడిమి చూశాడు. తర్వాత రెండు చేతులెత్తి సముద్రుడికి చేతులు జోడిస్తూ ‘‘గంగమ్మ తల్లీ! దండాలమ్మా!’’ అంటూ గట్టిగా అరిచాడు. ఆ క్షణం రాత్రంతా అలలలతో తను చేసిన యుద్ధం, తన రెక్కలు నీలుక్కుపోయిన కష్టం అన్నీ మరిచిపోయాడు. పడవలో ఆదమరచి నిద్రపోతున్న గంగణ్ణి చూసి వందసార్లు గంగమ్మకి దండాలు పెట్టుకున్నాడు. తీరా వొడ్డుకు చేరి మునెమ్మకి విషయం చెబితే ఆమె కూడా నమ్మలేకపోయింది. ‘‘రాత్రంతా అప్ప నీ కోసం నీళ్లల్లో పునుకులాడుతుంటే ఎందుకురా సెప్పలేదు?’’ అని అడిగింది. ‘‘నాకేం ఎరుక. అప్ప చేపలు పడతూ వున్నాడనుకున్నా..’’ అన్నాడు తేలిగ్గా తీసిపారేస్తూ.అసలు అప్పుడే గంగడిలో ఆ కొత్త వింతని గమనించారు అప్ప, అమ్మ.‘‘మునిమాపనంగా ఏటకెల్లినోడివి, తెల్లారగట్ట వుత్తి సేతుల్తో తిరిగొత్తే దినమెట్టా గడిసేది మామా?’’ అని జానయ్యని నిలదీసింది మునెమ్మ.‘‘నానేం జేసేది బుడ్డోడికిట్టా అయితదని నా కెరుకనా?’’ జానయ్య బాధంతా అదే. వాళ్లిద్దరి తగువు చూస్తూ నిలబడలేదు గంగడు. వెంటనే సముద్రంలోకి పరుగు తీసాడు. అమ్మా నాన్న చూస్తుండగానే పైకెగసిన అలపైకి పరిగెత్తి మునిగిపోయాడు. మునెమ్మ గుండె ఝల్లుమంది.జానయ్య సముద్రంలోకి పరుగుపెట్టాడు.నిముషాలు గడుస్తున్నాయి. జానయ్య అలల మధ్యలో అప్పుడప్పుడూ కనిపిస్తున్నాడు. కాని గంగడి జాడ మాత్రం లేదు.తనకే తెలియకుండా మునెమ్మ కళ్లు రెండు నదులైపోయాయి. దబ్బున యిసుక అలలో కూలబడి పోయింది. రెండు పిడికిళ్లలో యిసుకను పట్టి పిసికేస్తూ వుంది. నాలుగైదు నిముషాలు నిముషాలు గడిచేసరికి మునెమ్మ ఆశ అడుగంటి పోయింది. ఇసుక పిడికిళ్లు వదిలేసి సముద్రానికి రెండు చేతులు జోడించి దండం పెట్టింది.జానయ్య తిరిగి వచ్చేస్తున్నాడు. రాత్రంతా నీళ్లలో ఈదిన అలసట మీద వున్నాడు. ఈ సారి ఎక్కువ సేపు అలల్ని ఎదుర్కోలేకపోయాడు.సరిగ్గా అప్పుడు లేచింది సముద్రంలో ఓ అల. కొండంత ఎత్తుగా. గట్టును దాటి గుడిసెల్ని మింగేస్తుందేమో అనిపించింది. ఆ లేచిన అల కింద నుండి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు గంగడు. రెండు చేతుల్లో రెండు పొడవాటి పండుగప్పలున్నాయి. మునెమ్మ పరుగున వెళ్లి వాటేసుకుంది గంగణ్ణి.‘‘అయ్యయ్యో! వదిలే.. వదిలే.. యివి జారిపోతయి’’ అన్నాడు తల్లితో. ‘‘నా తండ్రీ! అవి పోతే పోనీయ్. నువ్వొస్తివి. సాలురా తండ్రి!’’ మరింతగట్టిగా వాటేసుకుంది మునెమ్మ. ‘‘ఇయ్యాల్టికి యివి సరిపోతయి గదా!’’ గర్వంగా పండుగప్పల్ని చేతులెత్తి చూపుతూ గంగడు తల్లిని అడుగుతుంటే అంత పెద్ద చేపల్ని ఎలా మోస్తున్నాడో అర్ధం కాలేదు జానయ్యకి....రాత్రంతా కంటి మీదకి కునుకు రాలేదు. పడమటోళ్ల నాటుసారా తాగి జానయ్య గురక పెడుతున్నాడు. ఆ పక్కనే ముఖంలో ఏ భావమూ లేకుండా గంగులు పడుకున్నాడు.బక్క మునెమ్మనే నిద్ర బహిష్కరించింది. మునెమ్మ ఆలోచిస్తూ గుడ్డిదీపంవెలుతుర్లో నిట్టాణి వైపే చూస్తుంది.మనసును ఆలోచన కలచివేస్తుంది. ఒకవైపు అత్తపోరు. మరోవైపు కాయలేని కన్నెచెట్టు. తనకి తల్లికి మధ్య సర్దిచెప్పలేని పెనిమిటి. అమ్మలక్కల సలహా విని తను గంగమ్మ గుడిలో ఆ తల్లికి సారె పెట్టడం. బిడ్డ పుడితే తనపేరే పెట్టుకుంటానని మొక్కుకోవటం. ఆ రోజు రాత్రి కల లో ఆకాశం నుండి జలపాతంలా గంగమ్మ నేలకి దిగివచ్చింది. దివ్య తేజస్సుతో తన గుమ్మంలో ప్రత్యక్షమైంది. బంగరు గజ్జెలు మోగుతుంటే నిద్రిస్తున్న తనని వచ్చి తట్టి మరీ లేపింది. తన పొత్తి కడుపుని సుతారంగా తడిమింది. ఆ తల్లి తనని చూసి నవ్విన చల్లని నవ్వు యిప్పటికీ తలచుకుంటే వొళ్లంతా గగుర్పొడుస్తుంది.ఆ రోజు ఉదయం లేవగానే తను వాంతి చేసుకొంది. అత్త వచ్చి చూసి కళ్లతోనే నవ్వి, కొడుకు చేతిలో మంచుకొండలాంటి చల్లటి మాట చెప్పింది. చెప్పిందే కాని తనకు గంగడు పుట్టేనాటికి లేకుండా పోయింది. కాని వెళ్తూ వెళ్తూ పుట్టబోయే బిడ్డకి గంగమ్మ పేరే పెట్టాలని వొట్టేయించుకుని వెళ్లింది.ఆ బిడ్డే గంగడు.. అవునా? తనకే ఆశ్చర్యంగా వుంది. ఆ గంగడే గంగమ్మతల్లి వొడిలో గంటల సేపు హాయిగా నిద్రించి ఆనక నవ్వుతూ లేచి వస్తున్నాడు. రాజన్నదొర తన బుర్రకథలో చెప్పిన దుర్యోధనుని జలస్తంభన విద్య వీడికెలా అబ్బిందో? కొంపదీసి దుర్యోధనుడే తన కడుపున పుట్టలేదు కదా!అప్పుడే గుడిసె బైట రంగమ్మవ్వ కేక పెట్టింది ‘‘ఒసే మునెమ్మా! నీ గుంటడు ఆల్సిప్పలేరటానికి సముద్రంలోకెళ్లిపోయిండే.. ఎల్లే తల్లీ! ఆడు ముందే ఏబ్రాసోడు’’ అంటూ.తలతిప్పి చూస్తే గంగడు చాపమీద లేడు. తలుపుకేసి చూస్తే అప్పుడే తెల్లారిపోయింది. అసలే మైపాడు సముద్రం. ఏ అడుగులో ఎంతలోతుందో ఎవరికీ తెలీని వైనం. ఒక అడుగు మోకాటిలోతైతే రెండో అడుగు తాటి చెట్టంత లోతు.సముద్రం చూడటానికి వచ్చిన జనమెవ్వరూ నీళ్లలో అడుగు పెట్టే సాహసం చెయ్యరు. అలా సాహసించిన శవాలెన్నో పట్టపోళ్లకి కూడ దొరకనంత లోతుకు వెళ్లిపోయాయి. ఎన్ని పడవలు వెతికినా దొరకని శవాలెన్నో. వెతక్కుండానే వొడ్డుకి కొట్టుకొచ్చిన శరీరాలెన్నో. ఆ కారణంతోటే మునెమ్మ గంగడిని కాపలా కాస్తుంది.ఆ కారణంతోటే జానయ్య గంగణ్ణి వేటకి దూరంగా వుంచాడు. ఆ రోజు తర్వాత మళ్లీ వేటకి తీసుకెళ్తే వొట్టు. కాని అల ఎవరిమాట వింటుందని? గంగడు అలలాంటి వాడు. వాడికిష్టమైతే కొండంత ఎదుగుతాడు. అదే యిష్టంలేకపోతే యిసకంత వొదుగుతాడు.ఆ రోజు కూడా అంతే.వళ్లంతా యిసక పూసుకొని యిసకలో ఆడుకుంటున్నాడు గంగడు.సముద్రం చూడటానికి కాలేజీ విద్యార్ధులు ఓ పాతిక మంది వచ్చారు. వాళ్లకి మాస్టారు చెపుతుంటే వినీ విననట్టు కూచున్నాడుగంగడు.‘‘ఇదిగో యిక్కడ మోకాలే. అక్కడ మాత్రం పాతాళమంత లోతు. అడుగు పడితే పాతాళానికే’’.నలుగురు కుర్రాళ్లు సముద్రం వొడ్డున కాళ్లు కడుక్కుంటున్నారు. సముద్రం ముందు నుండి వచ్చిందో, వెనక నుంచి వచ్చిందో ఆ అల అలా ఆ నలుగుర్నీ లోపలికి లాక్కెళ్లిపోయింది. చూస్తున్న విద్యార్ధులంతా గగ్గోలు పెట్టారు. మాస్టారు బెస్త గుడిసెలకేసి పరుగు పెట్టాడు. క్షణాల్లో నలుగురు గజ ఈతగాళ్లు రంగంలో దిగారు. విద్యార్థుల జాడ మాత్రం కనిపించడం లేదు. సెల్ఫోన్లలో సమాచారం కాలేజీకిచేరిపోయింది.కాలేజీ విద్యార్ధులంతా సముద్రం చేరుకొనే సరికి గజ ఈతగాళ్లు ముగ్గురు కుర్రాళ్ల ప్రాణాలు నిలబెట్టారు. నాలుగో వాడి జాడమాత్రం లేదు. ఈ లోగా నెల్లూరు నుండి ఫైరింజన్ స్టాఫ్ దిగింది. కాలేజీ ప్రిన్సిపాల్ ముఖం కళ తప్పింది.మాస్టారైతే కన్నీరు మున్నీరౌతున్నాడు. విద్యార్ధులంతా గుండె దగ్గర షర్ట్ బటన్లను తడుముకుంటున్నారు. అంతా అయిపోయింది. బతికి బయటపడ్డ ముగ్గురూ ఆకాశం కేసి చూసి థాంక్స్ చెప్తున్నట్టుచూపులు బిగించారు. మిగతా వాళ్లందరి చూపులు సముద్రం వైపు, సముద్రంలోని అలలవైపు.సరిగ్గా అప్పుడే ఆ అద్భుతం జరిగింది. కొండెత్తు అల వొకటి లేచి వొడ్డుకేసి వచ్చిపడింది. ఆ అల మధ్యలోంచి విదార్థ్ధి కాలర్ పట్టుకొని శరీరాన్ని ఈడ్చుకొస్తున్నాడు గంగడు. అందరూ గంగడి వైపు పరిగెత్తారు.గంగడు మాత్రం ఆ విద్యార్థిని యిసక తిన్నెపైకి చేర్చి బోర్లా పడుకోబెట్టాడు. మెల్లగా అతడి వీపుని వత్తడం ప్రారంభించాడు. వత్తిడికి కడుపులోని నీళ్లు చెంబెడు చెంబెడుగా నోటి గుండా బైటికొస్తున్నాయి.ఆ తర్వాత అతణ్ణి వెల్లికిలా తిప్పాడు గంగడు. అతడి నోట్లో నోరుపెట్టి వేణువులా ఊదాడు. మెల్లగా కళ్లు తెరిచిన విద్యార్ధిని చూసి కాలేజీ కుర్రాళ్లంతా ఆనందంతో కేరింతలు కొట్టారు. చప్పట్లు కొట్టారు.ఇంత పెద్ద ప్రమాదం నుండి తమ కాలేజీని బైట పడేసినందుకు ఆనందంతో పర్సు తీసి గంగడికోసం చూశాడు.కాని యివేవీ పట్టనట్టు బెస్తగుడిసెల వైపు నడచి వెళ్తున్నాడు గంగడు. తనకు దండం పెడుతున్న తల్లిని కూడ పట్టించుకోకుండా. ‘‘నిజమే. వీడు గంగమ్మ ప్రసాదమే’’ అనుకుంది మనసులో మునెమ్మ. - ఈతకోట సుబ్బారావు -
వాజ్‌పేయి మరణం: ఆనంద్ మహీంద్ర సంతాపం
సాక్షి, ముంబై: మహోన్నత నేత, బీజేపీ కురువృద్ధుడు, భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి అస్తమయంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన మృతిపై విచారం వ్యక్తం చేస్తూ ట్విటర్లో ఒక ఫోటోను షేర్ చేశారు. ఆయన ఆఖరి పుట్టిన రోజు సందర్భంగా ఈ విలువైన ఫోటోను ట్వీట్ చేశానంటూ గుర్తు చేసుకున్నారు. కాగా తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ అటల్ బిహారీ వాజ్‌పేయి(93) గురువారం సాయంత్రం కన్నుమూసారని అధికారికంగా ప్రకటించారు. దీంతో బీజేపీ శ్రేణులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు వాజ్‌పేయి మృతిపై దేశ, విదేశాలకు చెందిన పలువురు రాజకీయ నాయకులు,ఇతర ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు. అటు మాజీ ప్రధాని మరణంపై సంతాపాన్ని ప్రకటించేందుకు కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. I tweeted this prized photo on Shri Vajpayee’s last birthday. It is with enormous grief that I remember him today and mourn his passing... pic.twitter.com/uszXdKPjfy — anand mahindra (@anandmahindra) August 16, 2018 -
క్షణ క్షణం..క్షోభ
గుండె మార్పిడికి వచ్చిన దరఖాస్తులు 25 ఒక్కోఆపరేషన్కు ఖర్చు రూ.25 లక్షలు సీఎం ఒక్కో ఆపరేషన్‌కు ఇస్తానన్న నిధులు రూ.15 లక్షలు సృహృదయ ట్రస్ట్ ద్వారా జరిగిన ఆపరేషన్లు 450 ‘గుండె జబ్బు.. ప్రాణాంతకమైన రుగ్మత.. గుండె మార్పిడి తప్పనిసరి.. దిన దిన గండం.. ఇప్పుడా? అప్పుడా? అన్నట్లు ఆపరేషన్.. కనికరించని ప్రభుత్వం..’ ఇదీ బాధితుల క్షోభ..! చెప్పలేనంత బాధ ‘గుండె’ల్లో పెట్టుకుని బతుకీడుస్తున్నారు దీనులు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఆపరేషన్‌కు సాయం చేస్తామన్న సీఎం చంద్రబాబు హామీ నీటి మూటగా మిగలడంతో వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. నిధులిస్తే ఆపరేషన్ చేస్తామని ముందుకు వచ్చిన ‘సహృదయ’ ట్రస్ట్‌కు కూడా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. దీంతో ఏడాది నుంచి 25 మంది బాధితులు గుండెను గుప్పెట్లో పెట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఉన్న గుండె వైద్య విభాగంలో గతంలో గుండె రోగులకు కేవలం యాంజియోగ్రామ్, స్టంట్లు మాత్రం వేసేవారు. ఒక్క బైపాస్ సర్జరీ కూడా చేసిన దాఖలాలు లేవు. ఇదే సమయంలో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివిన ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే చదువుకున్న ఊరుకు సేవ చేయాలనే లక్ష్యంతో సహృదయ ట్రస్టు ద్వారా జీజీహెచ్‌లో పీపీపీ (పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్) విధానంలో గుండె ఆపరేషన్లు చేసేందుకు ముందుకు వచ్చారు. ఇందుకోసం 2015 మార్చిలో ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. 2015 మార్చి 18న మొట్టమొదటి బైపాస్ సర్జరీ చేసి అక్కడి నుంచి ఇప్పటి వరకు సుమారు 450 ఓపెన్ హార్ట్ సర్జరీలు నిరుపేదలకు ఉచితంగా నిర్వహించారు. అంతటితో ఆగకుండా 2016 మే 20న గుంటూరుకు చెందిన ఉప్పు ఏడుకొండలుకు గుండె మార్పిడి ఆపరేషన్ చేసి జాతీయ స్థాయిలో జీజీహెచ్ ప్రతిష్ట పెంచారు. జాతీయ స్థాయిలో గుండె మార్పిడి ఆపరేషన్లు చేసిన ఐదో ప్రభుత్వ ఆసుపత్రిగా జీజీహెచ్ రికార్డు సృష్టించేలా చేశారు. 2017 జనవరి 18వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు 50 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పిల్లల గుండె ఆపరేషన్లు చేస్తున్న తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా గుంటూరు జీజీహెచ్‌ను నిలిపారు. నీటి మూటగా హామీ.. ఏడాది నుంచి జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఒక్కో ఆపరేషన్‌కు రూ.25 లక్షలు ఖర్చు అవుతుంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ప్రభుత్వం నిధులు ఇస్తే ఆపరేషన్లు నిర్వహించేందుకు సహృదయ ట్రస్టు ముందుకు వచ్చింది. అవసరమైన నిధులు మంజూరు చేస్తామని రెండేళ్ల క్రితం ఆస్పత్రికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. కానీ.. హామీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. జీజీహెచ్‌లో పర్యటిస్తోన్న సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి మంజూరు కాలేదు.. జీజీహెచ్‌లోని గుండె శస్త్రచికిత్స విభాగాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుండె మార్పిడి ఆపరేషన్, చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్న డాక్టర్ గోఖలే బృందాన్ని అభినందించిన సందర్భంలో గుండె మార్పిడి ఆపరేషన్లకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రూ. 15 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్లు మరిన్ని జరుగుతాయని అంతా ఆశించారు. గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం సుమారు 25 మంది రోగులు తమ పేర్లు నమోదు చేసుకుని ఆశగా ఎదురు చూపులు చూస్తున్నారు. అయితే ఆపరేషన్లు జరిగి రెండేళ్లు గడుస్తున్నా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఒక్క రూపాయి మంజూరు కాలేదు. మార్చి 18వ తేదీతో ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంవోయూ ముగుస్తున్న నేపథ్యంలో సహృదయ ట్రస్టు తిరిగి తన సేవలను కొనసాగిస్తుందా? లేక ప్రభుత్వ, వైద్య విద్యాధికారుల సహకారం కొరవడిందని విరమించుకుంటుందా? అనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వ ప్రచార ఆర్భాటం ఇదీ..! ఆపరేషన్ చేయించుకున్న ఏడుకొండలు(ఫైల్ ఫోటో) సీఎం ఒక్క రూపాయి కూడా మంజూరు చేయనప్పటికీ మొట్టమొదట గుండె మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న ఉప్పు ఏడుకొండలు కేస్ స్టడీని ఎన్టీఆర్ వైద్య సేవ అధికారిక వెబ్సైట్లో పెట్టి కేవలం ప్రచారానికి వాడుకుంటున్నారు. ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా తనకు ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేసిందని, కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఏడుకొండలు మాట్లాడిన విషయాలను ఇందులో పేర్కొనడం విశేషం. డబ్బులు మంజూరు చేయకుండా, ప్రచార ఆర్భాటాలకు మాత్రం వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అధికారిక వెబ్సైట్లో ఏడుకొండలుకు జరిగిన ఆపరేషన్ వివరాలు నమోదు చేసిన దృశ్యం -
ప్రా‘ధాన్యం’ ఏదీ
అధికారిక లెక్కల ప్రకారం క్వింటాల్ ధాన్యం ఉత్పత్తికి రూ.1,791 ఖర్చవుతోంది. ప్రభుత్వం మాత్రం ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,510, కామన్ వెరైటీ ధాన్యానికి రూ.1,470 మాత్రమే మద్దతు ధర ప్రకటించింది. ఈ లెక్కన చూస్తే రైతులు ఏ గ్రేడ్ ధాన్యం విషయంలో క్వింటాల్‌కు రూ.281, కామన్ వెరైటీ ధాన్యమైతే రూ.321 చొప్పున కేవలం మద్దతు ధర విషయంలోనే రైతు నష్టపోతున్నారు. ఇదిలావుంటే.. ప్రస్తుత సీజన్లో ధాన్యం కొనే నాథుడు లేకపోవడంతో ధరలు అమాంతం పడిపోయాయి. క్వింటాల్‌కు రూ.258 చొప్పున 75 కేజీల బస్తాకు రూ.200 తగ్గిపోయింది. కనీస మద్దతు ధర లభించకపోవడంతో ఎకరానికి సుమారు రూ.10 వేల వరకు నష్టం వాటిల్లుతోంది. ఉత్పత్తి ధరతో పోలిస్తే ఎకరానికి నష్టపోతున్న మొత్తం రూ.20 వేలకు పైనే ఉంటోంది. ఈ పరిస్థితుల్లో వరి సాగు చేయలేక అన్నదాతలు కాడి వదిలేసే ప్రమాదం ముంచుకొస్తోంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ధాన్యం ధరలు పతనం అవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే 75 కేజీల బస్తాకు రూ.200 వరకు ధర పడిపోయింది. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర ఏ మాత్రం సరిపోవడం లేదని రైతులు వాపోతున్న తరుణంలో గోరుచుట్టుపై రోకలి పోటులా మద్దతు ధర కూడా దక్కకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాది రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎకరానికి 40 నుంచి 50 బస్తాల వరకూ దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లాలో 234 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించినా ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ఇప్పటికే జిల్లాలో 30 నుంచి 40 శాతం వరకూ మాసూళ్లు జరిగాయి. మిగిలిన చోట్ల వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. మద్దతు ధర కూడా దక్కడం లేదు గ్రేడ్ ధాన్యం 75 కేజీల బస్తా రూ.1132.50 (క్వింటాల్ రూ.1,510), కామన్ రకం ధాన్యం బస్తాకు రూ.1102.50 (క్వింటాల్ రూ.1,470) చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిం చింది. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన తొలి రోజుల్లో బస్తాకు రూ.1,050 చొప్పున చెల్లించగా.. ఆ ధర ఇప్పుడు రూ.900కి పడిపోయింది. దీంతో బస్తాకు రూ.200 చొప్పున ఎకరానికి రూ.10 వేల వరకూ రైతు నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు మిల్లర్లు, కమీషన్ వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. కొనుగోలు కేంద్రాలు పూర్తిగా తెరుచుకోకపోవడంతో రైతు అయినకాడికి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాడు. మిల్లర్లు ఇప్పటివరకూ లారీల సమ్మెను సాకుగా చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు నగదు బదలాయింపు విషయంలో బ్యాంకులు షరతులు విధించాయంటూ కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు. ఆదుకునే వారేరి! ధాన్యానికి కనీస మద్దతు ధర లభించనప్పుడు రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దీని కోసం ఇప్పటికీ ఒక్క పైసా కూడా బడ్జెట్లో కేటా యించలేదు. మద్దతు ధర ప్రకటించేది కేంద్రమే అయినా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉంది. అయినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ధాన్యం ఉత్పత్తి ఖర్చు కంటే కనీస మద్దతు ధర తక్కువగా ఉంది. క్వింటాల్ ధాన్యం ఉత్పత్తికి సరాసరి ఖర్చు రూ.1791గా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మద్దతు ధర కేవలం రూ.50 మాత్రమే పెంచి చేతులు దులుపుకుంది. దీనివల్ల 75 కేజీల ధాన్యం ఉత్పత్తి వాస్తవ ఖర్చుకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.200 వరకూ తక్కువగా ఉంది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ప్రకటిం చాయి. ఈ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉత్పత్తి ఖర్చు క్వింటాల్‌కు రూ.1,791 ఉండగా.. దానికి 50 శాతం కలిపితే క్వింటాల్ ధాన్యానికి రూ.2,686 వరకూ చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వాలు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీనివల్ల రైతు నష్టపోతున్నాడు. బస్తాకు రూ.1,500 చెల్లించాలి ప్రభుత్వం బస్తా ధాన్యాన్ని రూ.1,500 చొప్పున కొనుగోలు చేయాలి. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇవ్వాలి. ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయిన ప్రస్తుత తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరిపించాలి. యుద్ధప్రాతిపదికన రైతుల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలి. తేమ శాతం నిబంధనలు సవరించాలి. – కె.శ్రీనివాస్, కార్యదర్శి, కౌలు రైతు సంఘం -
జయమ్మకు గందపు చెక్కల పేటిక
-
జయమ్మకు గందపు చెక్కల పేటిక
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత అంతిమయాత్ర ప్రారంభమైంది. అశేష అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తల అశ్రునయనాల మధ్య ఆమె పార్థీవ దేహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఏర్పాటుచేసిన గందపు చెక్కల పేటికలో ఉంచి మెరీనా బీచ్ వద్దకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా లక్షల్లో హాజరైన అశేష జనవాహిని జయహో అమ్మ, పురుచ్చి తలైవీ, జయమ్మ అంటూ నినాదాలు చేస్తున్నారు. జయ పార్థీవ దేహాన్ని ఉంచిన రాజాజీ హాల్ నుంచి మెరీనా బీచ్‌కు మూడు కిలోమీటర్ల దూరం ఉంది. గందపు చెక్కల పేటికలో ఉంచి ఆమెను ఖననం చేయనున్నారు. ఇప్పటికే అంత్యక్రియలు జరిగే చోట పెద్ద మొత్తంలో జనాలు చేరి ఉన్నారు. రహదారి పొడవునా ఇసుకేస్తే రాలనంతమంది జనం ఉన్నారు. -
మిగిలిపోయిన పాఠాలు ఎవరికి చెప్పాలి?
స్కూలుకెళుతున్న పిల్లలకేం తెలుసు... ఆ బస్సు కదులుతున్న శవపేటికని. ఆ ట్రైను బుసకొట్టే కాలనాగు అని. అంతా క్షణంలో జరిగిపోయింది... మాసాయిపేట దుర్ఘటన ఇంకా కలచివేస్తూనే ఉంది. సమాధుల పక్కన... ఇళ్లల్లో దండలు వేసిన ఫొటోల దగ్గర... స్కూల్లో ఆ పిల్లలు కూర్చున్న బెంచీల మీద... పేర్లు కొట్టేసిన అంటెండెన్స్ రిజిస్టర్లో... మీ మనసులలో... కన్నీరు ఓడుతున్న మా కలంలో... అంతా ఆ విషాద జ్ఞాపకాలే.మరి అంతటి నష్టం ఏమి నేర్పిపోయింది? వాళ్ల ఆయుష్షు ఇప్పుడు ఎవరికి పోయాలి? మిగిలిపోయిన పాఠాలు ఎవరికి చెప్పాలి? ఈ వృథా వృథా కాకూడదు. రేపటి నుండి స్కూళ్లు షురూ. పిల్లల్ని స్కూలుకు పంపేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు చెబితే బాగుండు అనిపించింది. ఈ జాగ్రత్తలే ఆ పిల్లలకు నివాళి అనిపించింది. రామ్ ఎడిటర్,ఫీచర్స్ మళ్లీ రావైతివి కొడకా... ‘రోజూ ఓ ముద్ద పెట్టి బడికి పంపేదాన్ని... కాని ఆ రోజు ఓ ముద్దయినా పెట్టలేదే... బస్ వచ్చేసిందమ్మా అంటూ పరుగున పోతివి... మళ్లీ రావైతివి కొడకా...! ఇప్పుడు ఏ స్కూలుకు పోతవు బిడ్డా!’ అంటూ ఈ రోజుకీ కంటికి మింటికీ ఏకధారగా ఏడుస్తూనే ఉంది ఆ తల్లి. కన్న కొడుకు రూపాన్ని విగ్ర హంలో చూసుకుంటూ ఆ బిడ్డ జ్ఞాపకాలతోనే జీవిస్తున్న ఆ తల్లి పేరు పుష్ప. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక తనూ కళ్లనీళ్లు పెట్టుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు పుష్ప భర్త స్వామి. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్ గ్రామం వీరిది. మనీష్... పుష్ప ఒక్కగానొక్క కొడుకు. ఏడవ తరగతి చదువుతున్నాడు. కిందటేడాది జరిగిన మాసాయిపేట బస్సు ప్రమాదంలో చనిపోయాడు. అమ్మా... చెల్లి ఇక రాదా! ముగ్గురు పిల్లల్లో ఓ బిడ్డను కోల్పోయారు వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన మాల్లాగౌడ్, లత. రైలు ప్రమాదం నుంచి ఇద్దరు పిల్లలు రచిత, వరుణ్‌లు తీవ్రగాయాలతో బతికి బయటపడ్డారు. చిన్న కూతురు శృతి చనిపోయింది. ‘అమ్మా చెల్ల్లెలు ఇక తిరిగి రాదా...’ అని పిల్లలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నారు ఆ అమ్మానాన్న. శోకం మిగిలింది ఇంట్లో ఏటు చూసిన ఉరుకులు, పరుగులు. చిన్నారులతో ఇల్లు సందడిగా ఉండేది. ఉన్న ఇద్దరు పిల్లలను రైలు ప్రమాదం పొట్టనపెట్టుకుంది. ఆ ఘటన మిగిల్చిన విషాదంతో నేటికీ ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన నీరజ, వీరబాబు దంపతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ‘ఆ దేవుడు మాకు తీరని శోకాన్ని మిగిల్చాడు’ అని కుమిలిపోతున్నారు.ఊరికి దూరంగా వచ్చేశారు! రైలు కూత వినగానే ఇప్పటికీ వారి గుండెల్లో భయం తన్నుకొస్తుంది. ఉన్న ముగ్గురు పిల్లల్లో ఇద్దరు పిల్లలు స్కూలు బస్సును రైలు డీకొన్న ప్రమాదంలో చనిపోయారు. బతికి బయటపడిన కూతురిలోనే పోయిన ఆ ఇద్దరినీ చూసుకుంటున్నారు గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన జక్కుల యాదగిరి, సంతోష దంపతులు. ఊళ్ల్లో ఉంటే పిల్లల జ్ఞాపకాలే వెంటాడుతాయని... ఉన్న ఒక్క బిడ్డనైనా కాపాడుకుందామని తూప్రాన్‌కు మాకాం మార్చారు. ఆరోజు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద 2014 జూలై 24న స్కూలు బస్సును రైలు డీకొన్న దుర్ఘటన నేటికీ ఈ తల్లిదండ్రులను కలిచివేస్తూనే ఉంది. బడిపిల్లల ప్రయాణ భద్రతను సమాజానికి ఒక బాధ్యతగా గుర్తుచేస్తూనే ఉంది. ఆ ప్రమాదంలో మొత్తం 16 మంది పిల్లలు చనిపోయారు. ఇలాంటి సంఘటన మరొకటి జరగకూడదు. మనం జరగనీయకూడదు.ఇల్లు మూగబోయింది గుండ్రెడ్డిపల్లి గ్రామానికే చెందిన చింతాల రాములు, వసంత దంపతులకు సుమన్, శ్రీవిద్య ఇద్దరు పిల్లలు. ఉన్న ఇద్దరు పిల్లలు అదే దుర్ఘటనలో దూరం అయ్యారు. దాంతో పదకొండు నెలలుగా ఆ ఇల్లు మూగబోయింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లల్ని ఇంగ్లిష్ చదువుల కోసమని ప్రైవేట్ పాఠశాలకు పంపితే తమకు కన్నీరే మిగిలిందని వారు రోదిస్తున్నారు. ‘పిల్లల అల్లరితో పాటు అమ్మ, నాన్న అనే పిలుపులకూ దూరమయ్యాం. వ్యవసాయం చేసుకునే జీవించేవాళ్లం. ఇప్పుడే పనీ చేయాలనిపించడం లేదు. పిల్లలు లేని జీవితం ఎందుకు?’ అని ఆ దంపతులు, వారితో పాటు పిల్లల నానమ్మ... చిన్నారుల ఫొటోలు చూసుకుంటూ మౌన వేదన అనుభవిస్తున్నారు. - ఇందూరి రవీందర్, సాక్షి, తూప్రాన్ స్కూలు ప్రయాణం పిల్లల చదువుల్లో మార్కులు, ర్యాంకులే కాదు చూడాల్సింది. అంతకన్నా ముందు ప్రయాణంలో వారి భద్రత ముఖ్యం అని తల్లిదండ్రులు గమనించాలి. రూల్: 1 పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు కలిసి ఒక కమిటీగా ఏర్పడాలి. ప్రతి 15 రోజులు/నెల రోజులకోసారి అందరూ సమావేశమై బస్సుల ఫిట్నెస్, బస్సు డ్రైవర్లు, అటెండర్ల ప్రవర్తన... సంబంధిత అంశాలను చర్చించాలి. రూల్: 2 బస్సు కండిషన్‌కు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్, డ్రైవర్ లెసైన్స్, అటెండెంట్‌ను.. చూపించమనాలి. డ్రైవర్ మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడో లేదో ఆరా తీయాలి. రూల్: 3 కొన్ని చోట్ల బస్సులు/వ్యానులలో 20 సీట్లు ఉంటే 30/35 మంది స్టూడెంట్స్‌ను సర్దుతారు. అందుకే, బస్సులో/వ్యాన్‌లో సీట్లు ఎన్ని? అందులో ప్రయాణించే విద్యార్థుల సంఖ్య ఎంత? తెలుసుకోవాలి. అలాగే డ్రైవర్, అటెండర్ ప్రవర్తన ఎలా ఉంటుంది? అని మధ్య మధ్య పిల్లలనూ అడుగుతుండాలి. రూల్:4 బస్సు ప్రమాదాలు, విపత్కర పరిస్థితులు ఎదురయ్యే సందర్భాలలో డ్రైవర్లను, అటెండర్లను అప్రమత్తం చేయాలని పిల్లలకు సూచనలను ఇవ్వాలి. ప్రయాణంలో కలిగే అసౌకర్యం గురించి పిల్లలు చెప్పినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించాలి. వారి నుంచి సరైన స్పందన రాకపోతే పోలీసులను సంప్రదించవచ్చు. రూల్:5 ఆటోలలో సీట్లకంటే పిల్లలే ఎక్కువ కనపడుతుంటారు. చిన్న కుదుపులకే జరిగే ప్రమాదాలు ఆటో ప్రయాణాలలోనే ఎక్కువ. వీలైనంత వరకు ఆటోలలో పిల్లలను స్కూల్‌కు పంపకపోవడమే మంచిది. అంతకంటే వ్యాన్లను ఎంచుకోవడం ఉత్తమం. రూల్:6 సైకిళ్ల మీద స్కూల్‌కి వెళ్లే పిల్లలూ హెల్మెట్ ధరించాలి. పిల్లలు అడుగుతున్నారని చాలా మంది తల్లిదండ్రులు స్కూల్‌కి వెళ్లడానికి బైక్స్ ఇస్తుంటారు. 18 ఏళ్లు దాటని పిల్లలకు ద్విచక్ర, త్రిచక్రవాహనాలు ఇవ్వకూడదు. తప్పనిసరిగా లెసైన్స్ ఉండాలి. డిసెంబరులోనే చెక్ చేస్తాం కొత్త బస్సు కండిషన్ ఫిట్నెస్ రెండేళ్లు ఉంటుంది. తర్వాత ఏడాదికి ఒకసారి ఫిట్నెస్ టెస్ట్ చేస్తాం. అలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి (స్కూల్ ఓపెనింగ్ సమయంలోనే కాకుండా డిసెంబర్‌లోనూ) చెక్ చేస్తుంటాం. బస్సులు, వ్యాన్లలో.. పిల్లలను ఓవర్ లోడింగ్ చేయకూడదు. బస్ ఫిట్నెస్ కండిషన్స్ పట్ల నిర్లక్ష్యంగా ఉన్నా.. పాఠశాల గుర్తింపును రద్దు చేసే అవకాశాలు ఉంటాయి. - రఘునాథ్, ఆర్.టి.ఎ.జాయింట్ కమిషనర్, హైదరాబాద్ -
గ్రంథశిరిలో విషాద ఛాయలు
గ్రంథశిరి (అచ్చంపేట): ఆసరాగా ఉంటారనుకున్న కుమారులు అర్ధంతరంగా మృత్యుఒడికి చేరడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రంథశిరి గ్రామానికి చెందిన బలిజేపల్లి దివ్యరాజు (19) చిలకా కిరణ్‌కుమార్(19, చిలకా కాలేబు ముగ్గురు అన్నాచెల్లిళ్ల సంతానం. ఆదివారం అంబడిపూడిలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు హాజరయ్యారు. మధ్యాహ్నం సరదాగా నదికి వెళ్లివస్తామని బంధువులకు చెప్పి కృష్ణా నదికి వెళ్లారు. దివ్యరాజు, కిరణ్‌కుమార్ ఈత కొట్టేందుకు నదిలో దిగగా, కాలేబు మాత్రము ఒడ్డునే ఉన్నాడు. ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు కాంట్రాక్టర్లు నదిలో లోతుగా తీసిన గోతుల వద్దకు వెళ్లి వీరిద్దరూ మునిగిపోతూ రక్షించండి అని బిగ్గరగా అరవడంతో కాలేబు నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. సమీపంలోని డింగీ పడవలలో చేపలు పడుతున్నవారు గమనించి రక్షించేందుకు నదిలోకి దూకినా ప్రయోజనం లేకపోయింది. కొద్దిసేపు గాలించి మృత దేహాలను వెలికితీశారు. కాలేబు ద్వారా గ్రామంలోని బంధువులకు, వారి ద్వారా తల్లిదండ్రులకు విషయం చేరవేశారు. హుటాహుటిన నది దగ్గరకు వచ్చిన తల్లిదండ్రులు కుమారుల మృతదేహాలను చూసి తల్లఢిల్లిపోయారు. కూలి చేసి కుమారులను చదివించామని, చేతికి అందివచ్చేంతలో ఇలా జరిగిపోయిందంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాలను స్వగ్రామమైన గ్రంథశిరికి తరలించారు. ఇద్దరూ ఇంటికి పెద్ద కుమారులే.. బలిజేపల్లి బాబు, జాన్సీలకు ఇద్దరు సంతానం. అందులో దివ్యరాజు పెద్ద కుమారుడు. ఇంటర్ వరకు చదివి, రెండు సబ్జెక్టులు తప్పడంతో ఆ సబ్టెక్టులు మళ్లీ రాసేందుకు ప్రిపేరవుతున్న తరుణంలో ఈ దారుణం జరిగింది. అలాగే చిలకా మోహనరావు, మార్తమ్మ దంపతులకు ఇరువురు సంతానం. ఇద్దరిలో కిరణ్‌కుమార్ పెద్దవాడు. ఇంటర్ పూర్తి చేసి టీటీటీ (టీచర్ ట్రైనింగ్ కోర్సు) ఎంట్రన్స్ రాసి సీటు కోసం వేచి ఉన్న తరుణంలో మృత్యువు ఇలా కబళించింది. వీరి తల్లిదండ్రులకు సెంటు భూమిలేదు. కూలిపనే జీవనాధారం. పెద్దకుమారులు చదువుకుని తమకు ఆసరాగా నిలబడతారని కష్టపడి చదివించారు. ఈ దుర్ఘటన జరగడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. -
ముండే మృతికి వైఎస్ జగన్ సంతాపం
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే మరణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి, ప్రజాభిమానాన్ని చూరగొని జాతీయ స్థాయి నేతగా ఎదిగిన ముండే అకాలమరణం పాలు కావడం మహారాష్ట్రకే కాక యావద్దేశానికి తీరని లోటని ఆయన అభివర్ణించారు. గోపీనాథ్ ముండే కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.