growth engine
-
North East Sammelan: గ్రోత్ ఇంజిన్ ఈశాన్య రాష్ట్రాలే: కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ది చెందకపోతే దేశం అభివృద్ధి చెందదని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశానికి ఈశాన్య రాష్ట్రాలే గ్రోత్ ఇంజిన్ అని తెలిపారు. ఆదివారం ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషల్ సెంటర్లో నిర్వహించిన ‘నార్త్ ఈస్ట్ సమ్మేళన్’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్ననాటి నుంచి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యే దృష్టి సారించారని చెప్పారు. పదేళ్లుగా ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్నడూ లేని విధంగా ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. స్థిరమైన ప్రభుత్వం, నాయకుడి వల్లే నార్త్ ఈస్ట్‌లో శాంతి నెలకొందని, అభివృద్ధి సాధ్యం అవుతోందన్నారు. -
Vibrant Gujarat Global Summit 2024: విశ్వమిత్ర భారత్
గాందీనగర్: ప్రపంచవ్యాప్తంగా అనిశి్చత పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో భారత్ నూతన ఆశారేఖగా ఆవిర్భవించిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచ దేశాలు భారత్‌ను స్థిరత్వానికి ఒక ముఖ్యమైన మూలస్తంభంగా, నమ్మకమైన మిత్రదేశంగా, భాగస్వామిగా, గ్లోబల్ ఎకానమీలో గ్రోత్ ఇంజన్‌గా, గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా, టెక్నాలజీ హబ్‌గా, ప్రజాస్వామ్యసౌధంగా పరిగణిస్తున్నాయన్నారు. మారుతున్న ప్రపంచ క్రమంలో విశ్వమిత్రగా భారత్ అవతరిస్తోందన్నారు. గాం«దీనగర్‌లో బుధవారం పదో ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సు’ ప్రారం¿ోత్సవంలో మోదీ ప్రసంగించారు. త్వరలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని రేటింగ్ ఏజెన్సీలన్నీ చెబుతున్నాయని గుర్తుచేశారు. ఉమ్మడి లక్ష్యాలను నిర్దేశించడంతోపాటు వాటిని సాధించగలమన్న విశ్వాసాన్ని ప్రపంచానికి భారత్ ఇస్తోందన్నారు. పదేళ్లలో నిర్మాణాత్మక సంస్కరణలు ప్రపంచ అభివృద్ధికి, శ్రేయస్సుకు 140 కోట్ల మంది భారతీయులు ప్రాధాన్యతలు, ఆకాంక్షలు ఒక ఆధారంగా నిలుస్తున్నాయని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. ఇండియా ప్రాధాన్యతలు చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. స్థిరమైన పారిశ్రామికాభివృద్ధి, ఆధునిక మౌలిక వసతులు, నూతన తయారీ రంగం, కొత్తతరం నైపుణ్యాలు, భవిష్యత్తు టెక్నాలజీ, కృత్రిమ మేధ, నవీన ఆవిష్కరణలు, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన వనరులు, సెమీ కండక్టర్ల తయారీకి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతికి అద్భుత అవకాశాలు ఉన్నాయని వివరించారు. గత పదేళ్లలో నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టామని, మన ఆర్థిక వ్యవస్థకు ఈ సంస్కరణలే చోదకశక్తిగా మారుతున్నాయని వెల్లడించారు. కొన్ని నెలల క్రితమే 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నామని, 25 ఏళ్ల తర్వాత 100వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకోబోతున్నాయని చెప్పారు. రాబోయే 25 సంవత్సరాలు మనకు అమృత కాలమని ఉద్ఘాటించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే లక్ష్యాన్ని ఈ అమృత కాలంలో సాధించుకోవాలని ప్రజలను పిలుపునిచ్చారు. విదేశీ పెట్టుబడులకు వెల్కం మనందరి ఉమ్మడి కృషి వల్ల 21వ శతాబ్దంలో ఇండియాకు ఉజ్వలమైన భవిష్యత్తు లభించబోతోందని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గత ఏడాది జీ20 కూటమికి భారత్ సారథ్యం వహించిందని, ప్రపంచ భవిష్యత్తు కోసం ఒక రోడ్‌మ్యాప్‌ను అందించిందని తెలియజేశారు. ఐ2యూ2(ఇండియా, ఇజ్రాయెల్, యూఏఈ, యూఎస్ఏ) గ్రూప్‌తోపాటు ఇతర బహుముఖీన సంస్థలతో సంబంధాలను నిరంతరం బలోపేతం చేసుకుంటున్నామని చెప్పారు. టెక్నాలజీని సమర్థవంతంగా వాడుకుంటూ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేశామని, 40 వేలకుపైగా కాలం చెల్లిన నిబంధనలను సులభతర వాణిజ్య విధానం, జీఎస్టీ కింద రద్దు చేశామని తెలిపారు. పెట్టుబడులను ఆకర్శించడానికి, గ్లోబల్ బిజినెస్‌కు ఇండియాను గమ్యస్థానంగా మార్చడానికి మూడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై(ఎఫ్‌టీఏ) సంతకాలు చేశామని ప్రధాని మోదీ చెప్పారు. పలు కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహా్వనిస్తున్నామని అన్నా రు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టామని వివరించారు. గత పదేళ్లలో పెట్టుబడి వ్యయాన్ని 10 రెట్లు పెంచామన్నారు. టెక్నాలజీతో జీవితాల్లో మార్పు గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారత్ శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. గ్రీన్ ఎనర్జీలో మూడు రెట్లు, సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 20 రెట్లు ప్రగతి నమోదైందని తెలిపారు. గత పదేళ్లలో చౌక ధరకే ఫోన్లు, డేటా వంటివి దేశంలో సరికొత్త డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చాయని అన్నారు. ప్రతి గ్రామానికీ ఆప్టికల్ ఫైబర్, 5జీ టెక్నాలజీ రాకతో సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు వచి్చందని చెప్పారు. 2028కల్లా భారత్ 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి సంపన్న దేశంగా మారుతుందన్నారు. -
Vibrant Gujarat Summit: త్వరలో ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా భారత్
అహ్మదాబాద్/బొడేలీ: భారత్‌ను ప్రపంచ గ్రోత్ ఇంజన్‌గా మార్చాలన్నదే తన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మన దేశం త్వరలోనే ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘వైబ్రంట్ గుజరాత్’ తొలి శిఖరాగ్ర సదస్సుకు 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. 20 సంవత్సరాల క్రితం వైబ్రంట్ గుజరాత్ అనే చిన్న విత్తనం నాటామని, ఇప్పుడు అది మహా వృక్షంగా ఎదిగిందని ఆనందం వ్యకం చేశారు. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం గుజరాత్లో పారిశ్రామిక అభివృద్ధికి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వలేదని, అలాంటి సమయంలోనూ వైబ్రంట్ గుజరాత్ సదస్సు విజయవంతమైందని చెప్పారు. గుజరాత్‌ను భారత్ గ్లోత్ ఇంజన్‌గా తీర్చిదిద్దడానికి ఈ సదస్సు నిర్వహించామని తెలియజేశారు. ఆనాటి కల వాస్తవ రూపం దాలి్చందన్నారు. 2014లో తనకు దేశసేవ చేసే అవకాశం వచి్చనప్పుడు భారత్‌ను గ్లోబల్ గ్లోత్ ఇంజన్‌గా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నానని వెల్లడించారు. భారత్ త్వరలో గ్లోబల్ ఎకనామిక్ పవర్‌హౌజ్‌గా మారే దశలో ప్రస్తుతం మనం ఉన్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంస్థలతోపాటు నిపుణులు ఇదే మాట చెబుతున్నారని గుర్తుచేశారు. మరికొన్ని సంవత్సరాల్లో మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. గుజరాత్‌ను అప్రతిష్టపాలు చేసే కుట్రలు వైబ్రంట్ గుజరాత్ మొదటి సదస్సు జరిగాక ఇలాంటి కార్యక్రమాలు దేశంలో సంస్థాగతం మారిపోయాయని, చాలా రాష్ట్రాలు పెట్టుబడిదారుల సదస్సులు నిర్వహించాయని, ఇప్పటికీ నిర్వహిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. వైబ్రంట్ గుజరాత్ సదస్సులో వచ్చిన సత్ఫలితాలను ఇప్పుడు కళ్లారా చూస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ సదస్సుకు ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఎదురయ్యాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం లభించలేదని చెప్పారు. విదేశీ పెట్టుబడిదారులకు అనాటి కేంద్ర మంత్రుల నుంచి బెదిరింపులు వచ్చాయన్నారు. అయినప్పటికీ విదేశీ పెట్టుబడిదారులు ధైర్యంగా సదస్సులో పాల్గొన్నారని ప్రశంసించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయని, ప్రకృతి విపత్తులు సంభవించామని, గోద్రా ఉదంతం, ఆ తర్వాత అల్లర్లు జరిగాయని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ పరిణామాలతో గుజరాత్ కుప్పకూలుతుందని, దేశానికి పెద్ద భారంగా మారిపోతోందని చాలామంది అంచనా వేశారని తెలిపారు. అంతర్జాతీయంగా గుజరాత్‌ను అప్రతిష్టపాలు చేసే కుట్రలు సైతం జరిగాయన్నారు. అన్నింటినీ తట్టుకొని గుజరాత్ అద్భుతమైన అభివృద్ధి సాధించిందని వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో గుజరాత్ రాష్ట్రం వ్యవసాయ ఆర్థిక శక్తిగా, ఆర్థిక హబ్‌గా మారిందని ప్రధానమంత్రి కితాబిచ్చారు. తన పేరిట ఒక్క ఇల్లు కూడా లేదని, కానీ, తమ ప్రభుత్వం లక్షలాది మంది ఆడబిడ్డలను ఇంటి యజమానులుగా మార్చిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రభుత్వ పథకాల కింద సొంత ఇళ్లు నిర్మించి ఇచ్చామని, వాటితో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆడబిడ్డలు లక్షాధికారులు అయ్యారని ఆనందం వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రం చోటౌదేపూర్ జిల్లా బొడేలీ పట్టణంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. -
Brics Summit 2023: ప్రపంచానికి ‘గ్రోత్ ఇంజిన్’ భారత్
జోహన్నెస్‌బర్గ్: రాబోయే రోజుల్లో ప్రపంచానికి భారత్ ‘గ్రోత్ ఇంజిన్’గా మారబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్‌లో సంస్కరణలను మిషన్ మోడ్‌లో అమలు చేస్తున్నామని, సులభతర వాణిజ్యంలో వేగం పుంజుకుందని చెప్పారు. మంగళవారం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ బిజినెస్ ఫోరం లీడర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. భారత్ త్వరలోనే 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్‌లో ఉందన్నారు. 100కుపైగా యూనికార్న్ కంపెనీలు పని చేస్తున్నాయని వెల్లడించారు. బ్రిక్స్ సభ్య దేశాల మధ్య భవిష్యత్ సహకారానికి అనువైన రంగాలను గుర్తించడంలో 15వ బ్రిక్స్ సదస్సు సఫలమవుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం ఆయన దక్షిణాఫ్రికా చేరుకున్నారు. కాగా, ఉక్రెయిన్ యుద్ధం విషయమై అంతర్జాతీయ నేర న్యాయస్థానం రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆయన వర్చువల్‌గా పాల్గొననున్నారు. -
మోదీ సంస్కరణల స్పీడ్ అంతంతే!
♦ చైనా అధికారిక ఆంగ్ల దినపత్రిక గ్లోబల్ టైమ్స్ తాజా వ్యాసం ♦ ప్రపంచానికి భారత్ ‘గ్రోత్ ఇంజిన్’ కాలేదు బీజింగ్: చైనా అధికారిక ఆంగ్ల వార్త దిన పత్రిక.. గ్లోబల్ టైమ్స్ మరోసారి భారత్ ఆర్థిక వ్యవస్థపై తనదైన శైలిలో విశ్లేషణ చేసింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వ సంస్కరణల స్పీడ్ అంతంతేనని ఒక వ్యాసంలో పేర్కొంది. భారత్ ‘ప్రపంచ ఆర్థిక చోదక’ శక్తిగా అవతరించే అవకాశం ఇప్పట్లో కనబడ్డంలేదని పేర్కొంది. భారత్‌తో పోల్చితే చైనా ఆర్థిక వ్యవస్థ ఐదు రెట్లు ఎక్కువని వివరించింది. అయితే భారత్ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా, స్థిరంగా వృద్ధి చెందుతోందని తెలిపింది. వృద్ధికి సంబంధించి ఇతర దక్షిణ ఆసియా దేశాలతో పోల్చితే భారత్ తనకు తగిన బాటను ఎంచుకుందని కూడా విశ్లేషించింది. భారత్ ఆర్థిక వ్యవస్థను పశ్చిమదేశాల మీడియా గొప్పచేసి చూపెడుతోందని, అయితే చైనా ఎకానమీకి భారత్ ఎన్నడూ సరికాదని గ్లోబల్ టైమ్స్ ఇటీవలే పేర్కొంది. పలు సామాజిక, ఆర్థిక సమస్యలను భారత్ ఎదుర్కొంటోందని విశ్లేషించింది. ఇన్వెస్టర్లు అన్నీ గమనిస్తారు భారత్ వృద్ధి ధోరణిని కొండంతలుగా చూపెడుతూ భారత్ అధికారులు, పశ్చిమదేశాల మీడియా... చైనా నుంచి భారత్‌కు పెట్టుబడులు తరలేటట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తాజాగా వార్తాపత్రిక పేర్కొంది. అయితే ఇలాంటి చర్యల వల్ల ఫలితం పరిమితంగానే ఉంటుందని పేర్కొంది. పెట్టుబడులకు తగిన ప్రతిఫలాన్ని కోరుకునే ఇన్వెస్టర్లు ఎక్కడ తమ లావాదేవీల వ్యయం తక్కువగా ఉందన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తుంటూనే ఉంటారని పేర్కొంది. చైనా ఆర్థికవృద్ధి... భారత్ ఆర్థికవృద్ధి ఒకదానితో ఒకటి పోల్చడం సరికాదని పేర్కొన్న పత్రిక అయితే దీనికి బదులు రెండు దేశాలూ ఒకదానితో మరొకటి అనుభవాలను పంచుకుంటూ ముందుకు కదలాల్సి ఉంటుందని సూచించింది. చైనా వృద్ధికి ఒక స్థిర నమూనా అంటూ ఏదీ లేదని వివరించింది. కనుక ఇక్కడ ‘పోలిక’ ప్రశ్నే తలెత్తబోదని అభిప్రాయపడింది. అయితే 60 సంవత్సరాల ఆర్థికపథంలో చైనా సైతం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుందని తెలిపింది. అయినా పలు రంగాల్లో విజయం సాధించగలిగిందని వివరించింది. భారత్ ఆర్థిక వ్యవస్థకు ఊపును అందించడానికి అధికారంలోకి వచ్చిననాటి నుంచీ మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ, సంస్కరణల బాటలో ముందుకు సాగింది స్వల్పమేనని వివరించింది. భారత్‌లో రాజకీయ వ్యవస్థలే భారత్ ఆర్థిక సంస్కరణలకు అవరోధంగా పేర్కొంది. పార్టీల మధ్య ఉండే పోటీ... విధాన నిర్ణయాల అమలుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటుందని పేర్కొంది. అయితే భారత రాజకీయ వ్యవస్థ గొప్పతనాన్ని వ్యాసం అంగీకరించింది. -
నిరోధం 26,687-మద్దతు 25,940
మార్కెట్ పంచాంగం ప్రపంచానికి గ్రోత్ ఇంజిన్‌గా ఉన్న చైనా వృద్ధి బాగా పడిపోయిందన్న వార్తలు, వివిధ దేశాల కరెన్సీల విలువలు క్షీణించటంతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లన్ని గతవారం కుప్పకూలాయి. అయితే ఈ పతనంతో జరిగిన నష్టాల్లో అధిక భాగాన్ని అమెరికా, జపాన్, భారత్ మార్కెట్లు వారాంతంలో పూర్చుకోగలిగాయి. ఈ సంవత్సరం ఆగస్ట్ రెండో వారం వరకు మిగిలిన దేశాల మార్కెట్లతో పోలిస్తే ఈ మూడు దేశాల మార్కెట్లు పటిష్టంగా ట్రేడ్ అవుతూ వచ్చాయి. తిరిగి ఇవే వేగంగా కోలుకోవడం విశేషం. సెప్టెంబర్ నెలలో జీఎస్టీ బిల్లును ఆమోదింపజేయడం కోసం పార్లమెంట్ ఉభయ సభల్ని సమావేశ పరుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది జరిగితే స్టాక్ మార్కెట్లకు సానుకూలాంశం అవుతుంది. ఇక వచ్చే నెల 17న అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వు కమిటీ సమావేశం ఉంది. అక్కడ వడ్డీ రేట్లు ఇప్పట్లో పెరిగేది.. లేనిది.. సమావేశం తర్వాత తేలిపోతుంది. అటు తర్వాత మార్కెట్ల ట్రెండ్ నిర్దేశితమౌతుంది. ఇక మన స్టాక్ సూచీల సాంకేతికాంశాలకు వస్తే.. సెన్సెక్స్ సాంకేతికాంశాలు... గత సోమవారం ఒక్కసారిగా కుప్పకూలిన బీఎస్ఈ సెన్సెక్స్ వారాంతంలో కొంత వరకు కోలుకున్నా అంతక్రితం వారంతో పోలిస్తే 974 పాయింట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. చివరకు 26,392 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం పతనంలో అతి ముఖ్యమైన 25,300 పాయింట్ల స్థాయిని పరీక్షించి, ఆ స్థాయి నుంచి వేగంగా కోలుకోవడం సాంకేతికంగా సానుకూలాంశం. క్రితం ఏడాది ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో విజయం సాధించిన రోజైన మే 16 నాటి గరిష్ట స్థాయే ఈ 25,300 పాయింట్ల స్థాయి. రానున్న వారాల్లో సెన్సెక్స్‌కు ఈ దీర్ఘకాలిక మద్దతు కీలకమైనది. ఈ వారం అప్‌ట్రెండ్ కొనసాగితే క్రితం వారం గరిష్ట స్థాయి అయిన 26,687 పాయింట్ల వద్ద తొలి అవరోధం ఏర్పడవచ్చు. అటుపైన ముగిస్తే 27,131 పాయింట్ల వద్దకు చేరవచ్చు. ఆపైన స్థిరపడితే క్రమేపి 27,400 వద్దకు చేరవచ్చు. ఈ స్థాయి గతంలో కొద్ది వారాల పాటు మద్దతునందిచడం వల్లన ఇక మీదట ఇది సెన్సెక్స్‌కు గట్టి అవరోధం కల్పించే అవకాశం ఉంది. ఈ వారం ప్రస్తుత స్థాయి నుంచి లేదా పైన పేర్కొన్న తొలి నిరోధ స్థాయి నుంచి కిందకు దిగితే వెనువెంటనే 25,940 పాయింట్ల మద్దతు స్థాయికి తగ్గవచ్చు. ఆలోపల తిరిగి 25,300 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ నిరోధం 8,090-మద్దతు 7,860 సెన్సెక్స్లా ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇంకా 2014 మే 16 నాటి గరిష్ట స్థాయి అయిన 7,563 పాయింట్ల స్థాయిని ఇంకా పరీక్షించలేదు. గతవారం 7,667 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమై, అక్కడి నుంచి రికవరీ జరగడంతో 8,000 పాయింట్ల స్థాయిని దాటింది. అంతక్రితం వారంతో పోలిస్తే 298 పాయింట్ల నష్టంతో 8,002 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం రికవరీ కొనసాగితే నిఫ్టీ 8,090 పాయింట్ల తొలి నిరోధాన్ని చేరవచ్చు. అటుపైన ముగిస్తే 8,225 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 8,300 పాయింట్ల స్థాయిని చేరే అవకాశం ఉంది. ప్రస్తుత స్థాయి వద్ద నిఫ్టీ స్థిరపడలేకపోతే 7,860 పాయింట్ల మద్దతు స్థాయి వద్దకు క్షీణించ వచ్చు. ఈ మద్దతును నిలబెట్టుకోలేకపోతే 7,660-7,560 పాయింట్ల మద్దతు శ్రేణి వద్దకు పతనం కావచ్చు. -
సీమాంధ్ర సీఎం ముందున్న సవాళ్లు - సాగర తీరం వరమా? శాపమా?
సువిశాలమైన తీర ప్రాంతం సీమాంధ్రకు దేవుడిచ్చిన వరం. తీరం, రేవులు ఉన్న రాష్ట్రం ప్రగతి రథంపై అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందన్నది ఆర్ధికవేత్తల మాట. అయితే తీరం ఘోరం కూడా చేస్తుంది. తుఫాన్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సీమాంధ్రకు అటు అవకాశం ఉంది. ఇటు పెను ముప్పూ ఉంది. సువిశాల తీరరేఖను ఒక ప్రగతి సాధనంలా ఏలా వాడుకోవాలి? ప్రకృతి ప్రకోపాలను తగ్గించి ఎలా ముందుకు సాగాలి? సముద్ర గర్భం ఇచ్చే అపార సంపదను ఎలా ఉపయోగించుకోవాలి? గోదావరి బేసిన్, సముద్ర తీరంలోని చమురు నిక్షేపాలను ఎలా వినియోగించుకోవాలి? గుజరాత్ తీరం ఈ రోజు గుజరాత్ ఆర్ధికాభివృద్ధికి యాక్సిలరేటర్. మన కోస్తా తీరంలో ఉన్న అవకాశాలేమిటి? ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రికి మీరిచ్చే సలహా ఏమిటి? సూచనలేమిటి? మాకు తెలియచేయండి. మీ అమూల్యమైన సలహా రాష్ట్రం భవిష్యత్తునే మార్చేయవచ్చు.