gujjar agitation
-
గుజ్జర్ నాయకుడు కిరోరి సింగ్ బైంస్లా కన్నుమూత
జైపూర్: ప్రముఖ గుజ్జర్ నాయకుడు, గుజ్జర్ ఆరక్షన్ సంఘర్ష్ సమితి కన్వీనర్, కల్నల్ కిరోరి సింగ్ బైంస్లా(82) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. గుజ్జర్ల రిజర్వేషన్ల కోసం రాజీలేని పోరాటం చేసిన నాయకుడిగా కిరోరి సింగ్ గుర్తింపు పొందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వికీపీడియా వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లాలోని ముండియా గ్రామంలో 1940, సెప్టెంబర్ 12న కిరోరి సింగ్ బైంస్లా జన్మించారు. మొదట ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తర్వాత తండ్రి అడుగుజాడల్లో నడిచి.. భారత సైన్యంలో చేరారు. 1960 నుంచి 2000 వరకు ఆర్మీలో పనిచేశారు. 1962 ఇండో-చైనా యుద్ధం, 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో పోరాడారు. రిటైర్ అయిన తర్వాత 14 ఏళ్ల పాటు గుజ్జర్ల రిజర్వేషన్ల ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు, కుమార్తె సంతానం. కిరోరి సింగ్ భార్య రేషమ్ 1996లో చనిపోయారు. కల్నర్ బైంస్లా ఫౌండేషన్ ద్వారా రాజస్థాన్ గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్య, ఆరోగ్యంపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వివాహాల్లో ఆర్భాటపు ఖర్చులు అవసరం లేదని పదేపదే చెప్పేవారు. కిరోరి సింగ్ బైంస్లా తన కుమారుడితో కలిసి 2019లో బీజేపీలో చేరారు. -
రైలు పట్టాలపైనే టెంట్ వేసి ఆందోళన
ఢిల్లీ/రాజస్థాన్ : రిజర్వేషన్ల కోసం గుజ్జర్ల ఆందోళన రైల్వే వ్యవస్థపై ప్రభావం చూపింది. గుజ్జర్ల ఆందోళన నేపథ్యంలో 15 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేయగా, మరో అయిదు రైళ్లను దారి మళ్లించింది. రాజస్థాన్ ప్రభుత్వం అయిదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ గుజ్జర్లు రైలు పట్టాలపై టెంట్లు వేసి నిరసన తెలుపుతున్నారు. విద్యా, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ గుజ్జర్లు నిన్నటి నుంచి సవాయి మాదోపూర్ జిల్లాలో మలర్నా దుంగార్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌లపై టెంట్లు వేసుకుని ధర్నాకు దిగారు. దీంతో వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో కొన్ని రైళ్లు రద్దు కాగా, మరికొన్ని రద్దు అయ్యాయి. ఐదు శాతం రిజర్వేషన్ కోసం తాము చాలా కాలంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాము తిరిగి ఆందోళన చేపట్టామని, తమ కోటాను ప్రభుత్వం ఎలాగైనా ఇచ్చి తీరాల్సిందేనని గుజ్జర్ల నేత కిరోరి సింగ్ భైంస్లా స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం గుజ్జర్లు సహా గొదియా లొహర్, బంజారా, రైకా, గదారియా కులాల వారికి 50 శాతం కోటాలోనే అత్యంత వెనుకబడిన వర్గాల కింద ప్రత్యేకంగా ఒక శాతం రిజర్వేషన్ అమలవుతోంది. అయితే తమ కులాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్ధల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ గుజ్జర్లు జనవరిలో రాజస్ధాన్ సర్కార్‌కు ఇరవై రోజుల గడువిస్తూ అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వానికి ఇచ్చిన డెడ్‌లైన్ ముగియడంతో సవాయి మధోపూర్ జిల్లాలో గుజ్జర్లు ఆందోళన బాట పట్టారు. -
సికిందర్లో రోడ్లను నిర్భందించిన గుజ్జర్లు
-
కొనసాగుతున్న గుజ్జర్ల ఆందోళన
న్యూఢిల్లీ: గుజ్జర్లు తమ డిమాండ్ నెరవేర్చేదాకా ఆందోళన వీడేది లేదంటూ కదం తొక్కుతున్నారు. గత వారం రోజులుగా పలు రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గురువారం రాజస్థాన్ లోని మూడు జిల్లాల్లో తమ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పలు చోట్ల రైల్వే ట్రాక్‌లపై ఆందోళన చేపట్టి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించారు. ఢిల్లీ - ముంబై దారిని గురువారం స్థంబింపజేశారు. వందల కొద్ది పట్టాలపైకి చేరి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనంటూ గుజ్జర్లు ఆందోళన ప్రారంభించిన విషయం తెలిసిందే. గుజ్జర్ల ఆందోళన ప్రాంతాలకు 4500 మంది పారా మిలిటరీ బలగాలను పంపేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. -
రోడ్లెక్కిన గుజ్జర్లు
జైపూర్: తమ డిమాండ్‌ను నెరవేర్చాలంటూ గుజ్జర్లు తమ ఆందోళనను రోజుకో తరహాలో చేస్తున్నారు. నిన్నమొన్నటివరకు రైలు మార్గాలనే ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఆందోళన నిర్వహించిన వారు ఆదివారం జాతీయ రహదారులు ఎక్కారు. సవాయ్ మాదోపుర్ జిల్లాలోని దౌసా అనే గ్రామంవద్ద రోడ్డు నెంబర్ 11(ఆగ్రా-జైపూర్ రోడ్డును)ను స్థంబింపజేశారు. వందల సంఖ్యలో రోడ్లపై చేరి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనంటూ గుజ్జర్లు ఆందోళన ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇది ఆదివారం నాటికి నాలుగో రోజుకు చేరింది. వారు రహదారులు దిగ్భందనం చేయడంతో వాహనాలను వేరు వేరు చిన్న మార్గాలకు మళ్లించారు. శాంతిభద్రతలకు భంగంకలగకుండా పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చర్చలకు ఆహ్వానించినప్పటికీ గుజ్జర్లు చర్చలు కుదరవని, తమ డిమాండ్ మేరకు స్పష్టమైన హామీ ఇస్తే సరిపోతుందని వారు ఆందోళన కొనసాగిస్తున్నారు. -
వంద రైళ్లు నిలిచిపోయాయి
రాజస్థాన్: గుజ్జర్ల ఆందోళన తగ్గలేదు. మొదటి రోజుకంటే ఎక్కువ ప్రభావంతో వారి ఆందోళన రెండో రోజుకొనసాగింది. చర్చలు జరిపేందుకు నిరాకరిస్తూ వారు ఆందోళనను రెట్టింపు చేశారు. ప్రధానంగా ఢిల్లీ-ముంబై రైలు మార్గాన్ని స్థంబింప జేశారు. దీంతోపాటు ఇతర రైలు మార్గాలను కూడా అడ్డుకొని పట్టాలపైకి వందల సంఖ్యలో చేరారు. రహదారులపై భైఠాయించారు. దీంతో రవాణా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు వంద రైళ్లు నిలిచిపోయాయి. ప్రభుత్వోద్యోగాలలో తమకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ గతంలో చేసిన తరహాలో తమ ఆందోళనను గుజ్జర్లు పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో తమతో చర్చలకు రావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గుజ్జర్ల నాయకులకు లేఖలు పంపించింది. అయితే, వారు మాత్రం చర్చలతో లాభం లేదని, నేరుగా తమ డిమాండ్ అంగీకరిస్తే ఆందోళన ఆపుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయం కోసం తాము ఎదురు చూస్తామని చెప్తున్నారు. ఈ ఆందోళనకు గుజ్జర్ అర్కషాన్ సంఘర్ష్ సమితి నాయకత్వం వహిస్తోంది. -
మళ్లీ విజృంభించిన గుజ్జర్లు
గుజ్జర్లు మళ్లీ విజృంభించారు. ప్రభుత్వోద్యోగాలలో తమకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ తమ ఆందోళనను పునరుద్ధరించారు. గతంలోలాగే.. రైలు మార్గాలను అడ్డుకోవడంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైలు పట్టాల మీద బైఠాయించిన గుజ్జర్లు.. భారీస్థాయిలో ధర్నాలకు కూడా దిగారు. గుజ్జర్ల ఆందోళన కారణంగా ఢిల్లీ-ముంబై మార్గంలో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. భరత్పూర్ ప్రాంతంలోని పిలుకాపుర వద్ద ఆందోళన తీవ్రంగా ఉందని పోలీసులు అంటున్నారు. ఈ మార్గంలో ఆరు రైళ్లపై ప్రభావం పడటంతో ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. తమ ప్రధాన డిమాండు అయిన 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తేనే ఉద్యమాన్ని ఆపుతామని గుజ్జర్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి అధికార ప్రతినిధి హిమ్మత్ సింగ్ తెలిపారు. గుజ్జర్ నాయకుడు కిరోరి సింగ్ భైంస్లా మే 11న రిజర్వేషన్ల అంశంపై 'న్యాయయాత్ర' పేరుతో ఆందోళన ప్రారంభించారు. ఈయనే గతంలో ఏడెనిమిదేళ్ల క్రితం జరిగిన ఆందోళనకు నాయకత్వం వహించారు. తమకు ప్రస్తుతం కేవలం ఒక్కశాతం రిజర్వేషనే ఇస్తున్నారని, చట్టప్రకారం 50 శాతం పరిమితికి లోబడే తాము 5 శాతం అడుగుతున్నామని ఆయన చెప్పారు.