వంద రైళ్లు నిలిచిపోయాయి | hundred trains halts due to gujjars agition | Sakshi
Sakshi News home page

వంద రైళ్లు నిలిచిపోయాయి

Published Fri, May 22 2015 5:45 PM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM

వంద రైళ్లు నిలిచిపోయాయి

వంద రైళ్లు నిలిచిపోయాయి

రాజస్థాన్: గుజ్జర్ల ఆందోళన తగ్గలేదు. మొదటి రోజుకంటే ఎక్కువ ప్రభావంతో వారి ఆందోళన రెండో రోజుకొనసాగింది. చర్చలు జరిపేందుకు నిరాకరిస్తూ వారు ఆందోళనను రెట్టింపు చేశారు. ప్రధానంగా ఢిల్లీ-ముంబై రైలు మార్గాన్ని స్థంబింప జేశారు. దీంతోపాటు ఇతర రైలు మార్గాలను కూడా అడ్డుకొని పట్టాలపైకి వందల సంఖ్యలో చేరారు. రహదారులపై భైఠాయించారు. దీంతో రవాణా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు వంద రైళ్లు నిలిచిపోయాయి.

ప్రభుత్వోద్యోగాలలో తమకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ గతంలో చేసిన తరహాలో తమ ఆందోళనను గుజ్జర్లు పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో తమతో చర్చలకు రావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గుజ్జర్ల నాయకులకు లేఖలు పంపించింది. అయితే, వారు మాత్రం చర్చలతో లాభం లేదని, నేరుగా తమ డిమాండ్ అంగీకరిస్తే ఆందోళన ఆపుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయం కోసం తాము ఎదురు చూస్తామని చెప్తున్నారు. ఈ ఆందోళనకు గుజ్జర్ అర్కషాన్ సంఘర్ష్ సమితి నాయకత్వం వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement