hacking allegations
-
చాట్‌జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..?
ఓపెన్ఏఐకు చెందిన ఒక ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. క్రిప్టోకరెన్సీ స్కామర్లు సంస్థకు చెందిన చాట్‌జీపీటీ ఆధ్వర్యంలోని ‘న్యూస్‌మేకర్’ ఎక్స్ పేజీను హ్యాక్ చేసినట్లు తెలిపాయి. ఈ పేజీలో ఓపెన్ఏఐకు సంబంధించిన క్రిప్టో టోకెన్లు దర్శనమిచ్చాయని, వాటిని క్లిక్ చేసిన వెంటనే నకిలీ వెబ్‌సైట్‌కి వెళ్తుందనేలా వార్తలు వచ్చాయి.మీడియా సంస్థల కథనాల ప్రకారం..‘ఓపెన్ఏఐ వినియోగదారులందరికి ఏఐ, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ మధ్య అంతరాన్ని తగ్గించేలా $OPENAI టోకెన్ పరిచయం చేస్తున్నందుకు సంస్థ సంతోషం వ్యక్తం చేస్తోంది. $OPENAIను వినియోగించుకుని భవిష్యత్ బీటా ప్రోగ్రామ్లన్నింటికీ యాక్సెస్ చేసుకోవచ్చు’ అనేలా పోస్ట్‌లు వెలిశాయి. అది చూసిన యూజర్లు దానిపై క్లిక్ చేసిన వెంటనే క్రిప్టో పేజీకి వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై ఓపెన్ఏఐ, ఎక్స్ ప్రతినిధులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇదీ చదవండి: ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్..?ఇదిలాఉండగా, క్రిప్టోకరెన్సీని ప్రమోట్ చేస్తున్న రిప్పల్ ల్యాబ్స్ ద్వారా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానెల్‌ను హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చిన గంటల్లోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. మోసపూరిత క్రిప్టోకరెన్సీ స్కీమ్‌ను ప్రోత్సహించడానికి ఓపెన్ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎక్స్ ఖాతాను గతంలో హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అధిక ప్రజాధరణ ఉన్న ఎక్స్ ఖాతాలపై హ్యాకర్ల దాడులు పెరుగుతున్నాయి. ఇలాంటి హ్యాకర్ల వల్ల అమెరికన్లు 2023లో 5.6 బిలియన్ డాలర్ల(రూ.46 వేలకోట్లు) మేర నష్టపోయినట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. 2022తో పోలిస్తే హ్యాకర్ల వల్ల నష్టపోయిన సొమ్ము 2023లో 45 శాతం పెరిగిందని పలు నివేదికల ద్వారా తెలిసింది. -
పెగసస్‌పై ఐరాస దర్యాప్తు జరపాలి: పాక్
ఇస్లామాబాద్: భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. ఈ మేరకు పాకిస్తాన్ ఫారిన్ ఆఫీసు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సొంత పౌరులతోపాటు విదేశీయులపైనా భారత ప్రభుత్వం›గూఢచర్యం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నట్లు వెల్లడించింది. భారత ప్రభుత్వం నిఘా పెట్టిన వారి జాబితాలో తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం ఉండడం తీవ్ర ఆందోళనకరమైన విషయమని పేర్కొంది. భారత్ ఒక బాధ్యతాయుతమైన దేశంగా వ్యవహరించాలని, ఈ విషయంలో అంతర్జాతీయ నిబంధనలన పాటించాలని పాకిస్తాన్ విదేశాంగ శాఖ తెలిపింది. చట్టవిరుద్ధ గూఢచర్యానికి స్వస్తి పలకాలంది. ‘పెగసస్’పై ఇజ్రాయెల్‌లో కమిటీ ఏర్పాటు జెరూసలేం: భారత్‌లో పెగసస్ స్పైవేర్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ నుంచి భారత ప్రభుత్వం ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేసి, ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా కోసం ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. నిఘా సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గు తేల్చడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం పెగసస్ స్పైవేర్ లైసెన్సుల ప్రక్రియను సమీక్షించే పనికి ఈ కమిటీకి అప్పగిస్తామన్న సంకేతాలను ఇజ్రాయెల్ సర్కారు ఇచ్చింది. కమిటీ నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్ఎస్ఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ షాలెవ్ హులియో స్వాగతించారు. -
అమెరికా ఎన్నికల్లో హ్యాకింగ్: రష్యా ప్రోగ్రామర్ అరెస్టు
గత సంవత్సరం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలను రష్యా వాళ్లు హ్యాక్ చేశారని గగ్గోలు పుట్టింది. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఆ కేసులో ఒక రష్యన్ కంప్యూటర్ ప్రోగ్రామర్‌ను స్పెయిన్‌లోని బార్సిలోనా నగరంలో అరెస్టు చేశారు. అతడిపేరు పయోటర్ లెవషొవ్. ఈ విషయాన్ని మాడ్రిడ్‌లోని రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసిన హ్యాకింగ్ దాడుల్లో ఇతడి హస్తం ఉందని అనుమానిస్తున్నారు. అమెరికా అంతర్జాతీయ అరెస్టు వారెంటుతో అతడిని అరెస్టు చేసినట్లు రష్యా రేడియో తన వెబ్సైట్లో పేర్కొంది. అయితే లెవషొవ్ అరెస్టుకు కారణాలేంటో వివరంగా చెప్పేందుకు రాయబార కార్యాలయం ప్రతినిధి నిరాకరించారు. లెవషొవ్ను శుక్రవారమే అరెస్టు చేసినా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రిపబ్లికన అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు సాయం చేసేందుకు గాను డెమొక్రాటిక్ పార్టీ ఈమెయిళ్లను రష్యా హ్యాకింగ్ చేసిందని అప్పట్లో అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. ఎన్నికల ప్రచారం సమయంలో రష్యాకు, ట్రంప్‌కు మధ్య ఉన్న సంబంధాలు ఏంటనే విషయాన్ని అమెరికా కాంగ్రెస్ కూడా పరిశీలిస్తోంది. అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ జోక్యం ఉందన్న విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా పదే పదే ఖండించారు.