Happy New Year plan
-
జియో న్యూఇయర్ ఎఫెక్ట్ : వొడాఫోన్ కొత్త ప్లాన్స్
కొత్త ఏడాది వస్తుందంటే... రిలయన్స్ జియో న్యూఇయర్ ఆఫర్లతో టెల్కోలకు షాకిస్తోంది. ఇప్పటికే న్యూఇయర్ 2018 సందర్భంగా మరో రెండు కొత్త ప్లాన్లతో రిలయన్స్ జియో తన కస్టమర్ల ముందుకు వచ్చేసింది. జియో న్యూఇయర్ ప్లాన్ల ఎఫెక్ట్‌తో దిగ్గజ టెల్కోలు కూడా కొత్త కొత్త ప్లాన్లతో వినియోగదారులను మురిపించబోతున్నాయి. దిగ్గజ కంపెనీల్లో ఒకటైన వొడాఫోన్, జియో న్యూఇయర్ ప్లాన్లకు ఫస్ట్ సవాల్‌గా రెండు సరికొత్త ప్లాన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దానిలో ఒకటి రూ.198 ఆఫర్. మరొకటి రూ.229 ఆఫర్. రూ.199 ఆఫర్ కింద వొడాఫోన్ తన కస్టమర్లకు రోమింగ్‌తో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్లు, రోజూ 1జీబీ 3జీ/4జీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ కేవలం వొడాఫోన్ ప్రీపెయిడ్ కస్టమర్లకేనని, 28 రోజుల పాటు వాలిడిటీలో ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. రెండో వొడాఫోన్ ప్లాన్ రూ.229పై కూడా రోజుకు 1జీబీ డేటా, అపరమిత కాల్స్, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను 28 రోజుల పాటు ఆఫర్ చేస్తుంది. అయితే ఈ ప్లాన్ కేవలం వొడాఫోన్ కొత్త యూజర్లకు మాత్రమేనని తెలిసింది. ఈ రెండు ప్లాన్లు వొడాఫోన్ 4జీ సర్కిల్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంటాయి. జియో హ్యాపీ న్యూఇయర్ ఆఫర్‌ను టార్గెట్ చేసి ఈ రెండు ప్లాన్లను వొడాఫోన్ ప్రవేశపెట్టింది. న్యూఇయర్ సందర్భంగా జియో రూ.199, రూ.299తో కొత్త ప్లాన్లను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. రిలయన్స్ జియోకు టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ నుంచి కూడా గట్టి పోటీ ఎదురవుతోంది. రూ.198తో 28 రోజుల వాలిడిటీలో ఎయిర్టెల్ గత నెలలోనే సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. రూ.199 ప్లాన్‌ను కూడా ఎయిర్టెల్ లాంచ్ చేసింది. -
రేపటితో 'జియో ప్రైమ్' ఆఫర్ క్లోజ్
హైదరాబాద్ : రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన జియో ప్రైమ్ మెంబర్ షిప్ ఆఫర్ రేపటితో(మార్చి 31) ముగియనుంది. ఉచిత కాల్స్ ఉచిత డేటాతో కూడిన హ్యపీ న్యూఇయర్ ఆఫర్ ఈ నెల 31తో ముగుస్తున్న నేపథ్యంలో జియో ప్రైమ్‌కు అప్ గ్రేడ్ అవ్వాలని కంపెనీ ఇది వరకే వినియోగదారులకు సూచించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కంపెనీకి ఉన్న 10 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లలో దాదాపు 5 కోట్ల మంది ప్రైమ్ సభ్యత్వాన్ని తీసుకున్నారు. అంటే వీరందరూ రూ.99లతో రీఛార్జ్ చేసుకున్నారు. ఇంకా ఒక్క రోజులోనే ఈ ఆఫర్ ముగుస్తుండటంతో జియో సిమ్ కోసం క్యూలు కట్టిన మాదిరిగా ప్రస్తుతం ప్రైమ్ రీఛార్జ్ కోసం వినియోగదారులు క్యూలు కడుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఆఫర్ కింద ప్రస్తుతం జియో సిమ్ కలిగి ఉన్న వారు myJio యాప్ ద్వారా రూ.99 చెల్లించి ప్రస్తుతం అనుభవిస్తున్న సేవలను మరో ఏడాది పాటు కొనసాగించుకోవచ్చు. ప్రైమ్ సభ్యత్వం తీసుకున్న యూజర్లు తర్వాత అందుబాటులో ఉండే డేటా ఫ్యాక్స్ ను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వాయిస్ కాల్స్ ఉచితం. ప్రైమ్ యూజర్లకు నాన్ ప్రైమ్ యూజర్లతో పోలిస్తే కొన్ని అదనపు ప్రయోజనాలు పొందుతారని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోజనాల కింద టెలికాం రంగంలో ఎన్నడూ లేనట్టుగా ప్రతి రోజూ 1జీబీ డేటాను కేవలం 10 రూపాయలకే అందించనుంది. వినియోగదారుల తమకు అనువైన రీఛార్జ్ ప్యాకేజీని ఎంచుకోవడానికి తమ మొబైల్ లోని myJio యాప్ ని కానీ, కంపెనీ వెబ్ సైట్ www.jio.com కానీ చూడవచ్చని రిలయన్స్ జియో చెప్పింది. రూ.99 అంతకంటే ఎక్కువ ప్లాన్లను జియో మనీ వ్యాలెట్, myJio యాప్, www.jio.com వెబ్సైట్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చని పేర్కొంది. మార్కెట్లో అన్ని రీఛార్జ్ స్టోర్లలలో కూడా జియో ప్రైమ్ వివరాలు లభిస్తాయని కంపెనీ తెలిపింది.