హైలైఫ్
ట్రెండ్స్‌ను అప్డేట్ చేసే హైదరాబాదీల కోసం హై ఎండ్ ఫ్యాషన్ స్టాప్ మాదాపూర్ నోవాటెల్‌లో కొలువుదీరింది. దేశవిదేశాల నుంచి తెచ్చిన వస్త్రాభరణాలు, గృహాలంకరణ వస్తువులు, డిజైనర్ వెడ్డింగ్ ఐటెమ్స్, ఫర్నిచర్ వంటివెన్నో బుధవారం ప్రారంభమైన ఈ ‘హైలైఫ్’ ఎక్స్‌పోలో ఆకర్షిస్తున్నాయి. అందాల నటి సంజన ఆధునిక డిజైనింగ్ చీరలో సరికొత్త కాంతులీనింది.
బెంగళూరులో 15 కోట్ల రూపాయలతో నిర్మించుకున్న తన విలాసవంతమైన ‘డ్రీమ్ హోమ్’ కోసం ఇక్కడి స్టాల్స్‌లోని అపురూపాలను కొనుగోలు చేసింది. దిల్లీ, జైపూర్, రాజస్థాన్, లక్నో, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నైలకు చెందిన కళాకారుల చేతిలో రూపుదిద్దుకున్న ఖరీదైన కళాత్మక వస్తువులు ఇక్కడ మతిపోగొడుతున్నాయి. బంగారు పూత అద్దిన బుద్ధుడు, క్యాండిల్ హోల్డర్స్, ఫ్లవర్, జ్యువెలరీ బాస్కెట్లు, వాల్ హ్యాంగింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. శుక్రవారం వరకు ఎక్స్పో కొనసాగుతుంది.
- సాక్షి, సిటీ ప్లస్