Hill Areas
-
ప్రపంచ వచనాలు
‘పాప పుణ్యాలనేటటువంటివి/ మీ చేతుల్లో ఉన్నవి/ అయ్యా అంటే స్వర్గం/ ఒరే అంటే నరకం/ కూడల సంగమదేవా!’ ఇది బసవన్న చెప్పిన ఎన్నో వచనాల్లో ఒకటి. కన్నడిగుల విశిష్ట సారస్వతం వారి ‘వచనాలు’. కన్నడ ఉపనిషత్తులుగా ఇవి కీర్తినొందాయి. వీరశైవ భావధార ఉద్ధృతంగా ప్రవ హించిన పన్నెండో శతాబ్దంలో ఇవి వెలువడ్డాయి. ఈ వచనకారులు ఒక్కరు కాదు, లెక్కకు మిక్కిలి. ‘పారేనదికి/ ఒళ్లంతా కాళ్లు/ మండే నిప్పుకి/ ఒళ్లంతా నోళ్లు/ వీచే గాలికి/ ఒళ్లంతా చేతులు/ గుహేశ్వరా/ నీ వాళ్లకి/ ప్రతి అంగం లింగమే’ అన్నాడు అల్లమ ప్రభు. ఛందస్సును అనుసరించకుండా, పాండిత్య ప్రకర్ష లేకుండా, సరళంగా, భావ ప్రధానంగా రాసిన ఈ వచనాలు అందులోని పదాల తూగు వల్ల ఒక లయను కలిగివుంటాయి. కొంతమంది శాస్త్రీయ సంగీత గాయకులు వీటిని ఆలపించడం కద్దు. మానవత్వాన్నీ, కాయక ధర్మాన్నీ ఈ వచనాలు చాటిచెప్పాయి. కులాల మధ్య, స్త్రీ పురుషుల మధ్య తేడాలను నిరసించాయి. జంగముడు ఏ కులానికి, ఏ వృత్తికి చెందినవాడైనప్పటికీ శివునిలా పూజనీయుడే; సహపంక్తి భోజనాదులకు అర్హుడే. ఈ విశాల దృక్పథంతో చెప్పి నందువల్లే వచనాలు భక్తేతరుల ఆదరణనూ చూరగొన్నాయి. వీరశైవ భక్తులను ‘శరణులు’ అన్నారు కాబట్టి, వాళ్లు రాసింది ‘శరణ సాహిత్యం’ అయ్యింది. ఈ సాహిత్యాన్ని మరింతగా ప్రపంచానికి చేరువ చేసే ప్రయత్నాలను బెంగళూరులోని ‘బసవ సమితి’ చేస్తోంది. 173 మంది వచనకారుల ఎంపిక చేసిన 2,500 వచనాలను వివిధ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో భిన్న భాషల్లోకి అనువదింప జేస్తోంది. ఇప్పటికే అరబ్బీ, పర్షియన్ లాంటి సుమారు 30 జాతీయ, అంతర్జాతీయ భాషల్లోకి అనువాదమైన వీటిని 2025 జనవరి కల్లా స్పానిష్, జర్మన్, జపనీస్, చైనీస్, ఫ్రెంచ్, నేపాలీల్లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. పన్నెండో శతాబ్దంలో కళ్యాణకటకము నేలిన బిజ్జలుని కొలువులో బసవేశ్వరుడు మంత్రిగా పనిచేశాడు. వీరశైవ మతానికి ఎనలేని ప్రాబల్యాన్ని కల్పించాడు. బసవడు ఎంతటి కవియో అంతటి తాత్వికుడు. ‘ఉన్నవాళ్లు/ గుళ్లు గోపురాలు కట్టిస్తారు/ లేనివాణ్ణి/ నేనేమి చెయ్యాలి?/ నా కాళ్ళే స్తంభాలు/ కాయమే కోవెల/ శిరసే బంగారు శిఖరం/ కూడల సంగమదేవా! విను/ చెడితే స్థావరం చెడుతుంది గాని/ జంగమం చెక్కుచెదరదు’ అన్నాడు. బసవన్న స్థాపించిన ఆధ్యాత్మిక సంఘం ‘అనుభవ మంటపం’. దానికి వేదిక ఆయన ఇల్లే. దీనికి అధ్యక్షుడు అల్లమ ప్రభు. అధ్యక్ష సింహాసనం పేరు శూన్య సింహాసనం. అనుభవ మంటపం అనే ఆలోచనే మేధా మథనానికీ, ప్రజాస్వామిక భావమార్పిడికీ ఉత్తేజాన్ని ఇచ్చేది. ఇందులో సుమారు 300 మంది శరణులు పాల్గొనేవారు. వాళ్లలో ‘వీరరాగిణి’ అక్క మహాదేవి సహా 36 మంది స్త్రీలు ఉండటం విశేషం. వీరిలో రకరకాల వృత్తులవాళ్లు ఉన్నారు. ‘కట్టెలమ్ముకొనే మోళిగెయ మారయ్య, చెప్పులు కుట్టే మాదార చెన్నయ్య, తోళ్లు పదునుపెట్టే దోహర కక్కయ్య, బట్టలుతికే మడివాల మాచయ్య, వెదురు బుట్టలల్లే మేదర కేతయ్య, పడవ నడిపే అంబిగర చౌడయ్య...’ వీళ్లు ‘రామనాథా’, ‘సకలేశ్వరదేవా’, ‘అమరగుండ మల్లికార్జునా’, ‘సిద్ధ మల్లికార్జునా’ అంటూ తమ ఇష్టదైవాలను మకుటంగా చేర్చుకొని తమ వచనాలను చెప్పారు. ‘పిడకలు ఏరటంలోనే/ అయిపోతోంది బ్రతుకంతా/ ఇక నేను/ అన్నం వండేదెప్పుడు,/ తినేదెప్పుడు? కూడల సంగమదేవా’ అన్నాడు బసవన్న. ‘సువిశాలమైన కన్నడ సాహిత్య క్షేత్రంలో విహరిస్తుంటే వచనాల దగ్గరకు వచ్చేసరికి మనం ఒక తపోవనంలో అడుగు పెట్టినట్లుగా అనిపిస్తుంది. అక్కడ మనకు తారసపడేవారందరూ రుషులూ, సాధువులే! కల్మషంతో నిండిన మనుషుల అంతరంగాలు శుభ్రపడటానికి వారి బోధలు చాలు అనిపిస్తుంది’ అంటారు ఈ వచనాల్లో కొన్నింటిని ‘మాటన్నది జ్యోతిర్లింగం’గా పాతికేళ్ల క్రితమే తెలుగులోకి అనువదించిన దీవి సుబ్బారావు.తెలుగులో మొట్టమొదట మల్లికార్జున పండితుడు ‘శివతత్వ సారం’లో బసవన్నను స్తుతించాడు. పాల్కురికి సోమనాథుడు ద్విపదల్లో బసవ పురాణము రచించి వీరశైవాన్ని ప్రచారం చేశాడు. ఒక తెలుగు కవి తొలిసారిగా రాసిన స్వతంత్ర పురాణం ఇది. శివభక్తులకు శ్రీశైలం మహోజ్జ్జ్వల సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లింది. బసవన్నకు ముందువాడని చెప్పే దేవర దాసిమయ్య శ్రీశైలం వచ్చి ఆగమాలు, పురాణాలు చదువుకొన్నాడు. అల్లమ ప్రభు శ్రీశైలంలో సమాధి నొందాడు. అక్క మహాదేవి శ్రీశైల కదళీవనంలో కాలం గడిపింది. ‘కొండల్లో కాక కంచెల్లో ఆడుతుందా నెమలి? /కొలనుల్లో కాక కాలువల్లో ఈదుతుందా హంస/ ...చెన్నమల్లికార్జునుడు కాక అన్యుల్ని తలుస్తుందా నా మనస్సు?’ అంటూ తన జీవితాన్ని ఆ చెన్నమల్లికార్జునుడికే అర్పించుకుంది. ‘మిణుగురులు ఎగిరితే/ నా ఆకలిదప్పులు అణగారినాయనుకొంటా/ మబ్బులు కరిగితే/ నా స్నానం కొరకు పంపిన జలమనుకొంటా/ కొండరాయి జారిపడితే/ నా తల్లో తురిమిన పూవనుకొంటా/ నా కంఠం తెగితే/ చెన్నమల్లికార్జునా!/ అది నీకర్పితమనుకొంటా’ అని పాడుకుంది. ఆమె తపస్సు చేసిందని చెప్పే ‘అక్క మహాదేవి గుహలు’ ఏ శ్రీశైల యాత్రికుడికైనా దర్శనీయ స్థలం.‘ఆవగింజంత సుఖానికి/ సాగరమంత సంకటం/ తన్నే కోల్పోయి/ నిధిని సాధించానంటే/ అందమేముంది?/ గుహేశ్వరా’ అన్నాడు అల్లమ ప్రభు. భక్తి పరవశంలో రాసినవైనప్పటికీ, అంతకుమించిన తాత్విక చింతననూ, మానవ స్వభావాన్నీ ఈ వచనాలు ఆవిష్కరించాయి. అంతేనా? ప్రతి భాషా మేలిమి సాహిత్యాన్నీ అలా పూనిక వహించి ఎల్లలు దాటించాలన్న ప్రేరణను కూడా ఇస్తున్నాయి. -
పర్వతారోహణ చేద్దామా?
‘పర్వతాలు పిలుస్తాయి... వెళ్లాలి’ అంటారు పర్వతారోహకులు. మనకున్న ఎన్నో హాబీల్లో పర్వతారోహణ ఒకటి. చిన్న గుట్టలతో మొదలయ్యే హాబీ కొండలకు పర్వతాలకు ఎదిగి ఆఖరకు ‘ఎవరెస్ట్’ అధిరోహించడంతో ముగుస్తుంది. పర్వతారోహణ చేసేవారు జీవితంలో ఒక్కసారైనా పర్వతారోహణ చేయాలని కోరుకుంటారు. కొంతమంది ఏడు ఖండాల్లోని ప్రతి ఎత్తైన పర్వతాన్ని అధిరోహించాలనుకుంటారు. ఇంతకూ పర్వతారోహణ వల్ల ఏమవుతుంది?పర్వతాలు ఎక్కే క్రమంలో ప్రకృతి పెట్టే పరీక్షలను ఓర్చడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శిఖరం వరకూ చేరాక భూమ్మీద ఎదురయ్యే కష్టాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఇంకా ముఖ్యంగా జీవితం ఎంత విలువైనదో తెలుస్తుంది. జీవితం అంటే చిన్న చిన్న విషయాలు కాదు ఉదాత్తమైనవి ఉన్నతమైన విషయాలను సాధించడం అని తెలుస్తుంది. ‘పర్వతం వంటి వ్యక్తి’, ‘శిఖరం వంటి వ్యక్తి’ అని కొందరిని కోలుస్తారు. అంటే ఏ రంగాన్ని అయితే ఎంచుకుంటారో ఆ రంగంలో వారు అత్యున్నత విజయాన్ని సాధించినవారన్నమాట. శాస్త్రవేత్తలలో ఐన్‌స్టీన్ శిఖరం వంటి వాడు. సినిమా నటులలో అమితాబ్ బచ్చన్ శిఖరం వంటి వాడు. మనం ఒక చిత్రకారులం కావాలనుకుంటే పికాసో అంతటి వాళ్లం కావాలని లక్ష్యం పెట్టుకోవాలి. అలాంటి స్ఫూర్తి పర్వతారోహణ వల్ల కలుగుతుంది.అబ్బాయిల కంటే మేము ఎందులోనూ తక్కువ కాదు అని ఆత్మవిశ్వాసం తెచ్చుకోవడానికి అమ్మాయిలకు పర్వతారోహణ ఒక మంచి మార్గం.పర్వతారోహణలో వీపు వెనుక బరువు వేసుకుని ఎక్కాలి. జీవితంలో సవాళ్లను ఎదుర్కొనడం పెద్ద కష్టం కాదని ఈ కష్టం పడినప్పుడు తెలుస్తుంది. పర్వతారోహణలో పోదుపుగా తెలుస్తుంది. తీసుకెళ్లిన ఆహారాన్ని పోదుపుగా వాడుకోవాలి. నీళ్లను ΄÷దుపుగా వాడుకోవాలి. జీవితంలో కూడా ఉన్న నిధులను ఎలా జాగ్రత్త చేసుకోవాలో దీని వల్ల తెలుస్తుంది. అహం (ఇగో) కొన్నిసార్లు మేలు చేస్తుంది. కొన్నిసార్లు హాని చేస్తుంది. అంత ఎత్తయిన పర్వతం మౌనంగా ఉన్నప్పుడు ఆరడుగుల మనిషి ఎందుకు మిడిసి పడాలి. ఎదిగేకొద్దీ వొదగడం పర్వతం నేర్పిస్తుంది. వినయం విజయానికి తొలి మెట్టు.ఉదయాన్నే లేచి స్కూలుకు వెళుతున్నాం, ప్లేగ్రౌండ్‌లో ఆడుకుంటున్నాం అనుకుంటాంగాని కొండనో పర్వతాన్నో ఎక్కితేనే మనం ఎంత ఫిట్‌గా ఉన్నామో తెలుస్తుంది. మన ఊపిరితిత్తులు, మోకాళ్లు, పిక్కలు ఎంత బలంగా ఉన్నాయో పర్వతారోహణ తెలియచేస్తుంది. ఈ హాబీని ఫాలో అయ్యేవారు ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తారు. మరిన్ని పర్వతాలు ఎక్కేందుకు మరింత ఫిట్‌గా ఉంటారు. కాబట్టి పర్వతారోహణ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. -
వయనాడ్ విషాదం: ఈ తరహా విపత్తుల్ని ముందుగా గుర్తించలేమా? మానవ తప్పిదాలతోనే..
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన తీవ్ర బీభత్సం సృష్టించింది. ఈ ప్రకృత్తి విపత్తు కారణంగా వరద, బురద వెల్లువెత్తాయి. వాటి ప్రవాహ మార్గంలో ఉన్న ముందక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ తదితర కుగ్రామాలు సమాధయ్యాయి. సోమవారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనతో అసులు కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? వాటికి గల కారణాలేంటీ? ఏంటీ అనే దానిపై అందరూ చర్చిస్తున్నారు.. సహజంగా సంభవించే ప్రకృతి విపత్తుల్లో కొండచరియలు విరిగిపడటం ఒకటి. వానకాలంలో భారీ వర్షాల కారణంగా కొండప్రాంతం నుంచి రాళ్లు, మట్టిపెళ్లలు కిందకు పడటాన్ని కొండచరియలు విరిగిపడటం అంటాం. మన దేశంలో హిమాలయ ప్రాంతం, పశ్చిమ కనుమలు, నీలగిరి కొండల ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సంభవిస్తోంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఇవి చోటుచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కొండచరియలు విరిగిపడటానికి సహజమైన కారణాలు కంటే మానవ చర్యలే ఎక్కువ ప్రభావం చూపుతాయి. కొండ ప్రాంతాల్లో నిర్మాణాల సమయంలో ఏటవాలు(స్లోప్) సరిగా ప్లాన్ చేయకపోవటం, వృక్ష సంపదను భారీగా తొలగించటం, కొండపై పడి కిందకు జాలువారే నీరు వెళ్లే వ్యవస్థలో ఆటంకాలు.. కారణాల వల్ల కొండచరియలు విరిగిపడుతుంటాయి.సరైన గ్రేడింగ్ లేకుండా వాలు నిర్మాణం: ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో రోడ్డు, భవన నిర్మాణాల్లో ఏటవాలుకు సరైన గ్రేడింగ్ లేకుండా నిర్మించినప్పుడు అవి పటిష్టంగా ఉండవు. దీంతో కొండప్రాంతాల్లో సమానంగా లేని భూమి ఉపరితలం అధికం అవుతుంది. ఈ కారణంగా కొండచరియలు విరిగిపడతాయి. నీళ్లు వెళ్లే మార్గాల్లో..: సహజంగా కొండల మీద వాన పడినప్పుడు.. ఆ నీరు పల్లానికి వెళ్తుంది. అందుకోసం సహజంగా మార్గాలు ఏర్పడతాయి. అయితే ఆ వ్యవస్థల దిశ మార్చడం, అందులో ఏమైనా మార్పులు చేయడంతో ఆ నీరు కిందకు వెళ్లేందుకు ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా.. ఆ వాననీరుతో ల మట్టి, రాళ్లు బలహీనపడి కొండచరియలు హఠాత్తుగా విరిగిపడతాయి.పాత కొండచరియల్లో తవ్వకాలు: పాత కొండచరిచయలు ఉన్న ప్రాంతాల్లో తవ్వకాలు, భారీ నిర్మాణాలు చేపట్టం వల్ల కూడా వర్షాకాలంలో అవి విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక.. వీటితో పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం, అధిక వర్షపాతం, కొండ ప్రాంతాల్లో అడవుల నరికివేత, కొండ దిగువ ప్రాంతాల్లో గనులు, క్వారీల తవ్వకాలు వంటివి చేయటం కారణంగా తరచూ కొండచరియలు విరగిపడతాయి. మానవులు చేసే ఈ చర్యలు వల్ల కొండ పైభాగాల్లో ఉండే రాళ్లు, మట్టిలో పటుత్వం తగ్గడంతో అకస్మాత్తుగా ఈ ఘటనలు జరుగుతాయి. భూకంపాల వల్ల కూడా తరచుగా కొండచరియలు విరిగి పడుతుంటాయి.తేడాలు ఇవే..ఎక్కువగా మట్టి, ఇసుక, బండరాళ్ల మిశ్రమాలతో వదులుగా ఉంటుంది. ఫలితంగా వర్షం నీరు వదులుగా ఉండే భాగాల్లోకి సులభంగా చొచ్చుకొనిపోతుంది. అడుగున ఉండే మట్టి నీటితో తడుస్తుంది. తద్వారా కొండవాలు వెంబడి రాళ్లు దిగువ వైపు సులువుగా జారిపోతాయి. ఉత్తర భారత భూభాగం ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక.. భూభాగం శిలలతో కూడి ఉంటే ఇలాంటి ముప్పు తక్కువగా జరగొచ్చు. ఉదాహరణకు.. తెలంగాణ ప్రాంతాల్లో ఉండే గ్రానైట్ లాంటి శిలల్లో సిలికా ధాతువు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల శిలల్లో కాఠిన్యత పెరిగి గట్టిగా ఉంటాయి. పగుళ్లు సులువుగా ఏర్పడవు. అయితే..ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఖోండలైట్ లాంటి శిలల్లో అల్యూమినియం ధాతువు ఎక్కువుగా ఉండటం వల్ల శిలల్లో కాఠిన్యత తగ్గి గట్టిగా ఉండవు. పగుళ్లు సులభంగా ఏర్పడతాయి. రసానిక చర్యలతో క్రమేణా మట్టిలా మార్పు చెందుతాయి. ఈ మట్టి శిలల పగుళ్ల మధ్య కూడా ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు మట్టి తడిసి శిలలు కొండవాలు వెంబడి దిగువ భాగానికి జారడానికి దోహదపడుతుంది.ముందస్తు సూచనలుకొండచరియలు విరిగి పడటం వంటి విపత్తులు సంభవించే ముందుగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇంట్లోని తలుపులు, కిటికీలు వాటంతటవే బిగుసుకుపోవడం, నేల, గోడల్లో పగుళ్లు రావడం. స్తంభాలు, వృక్షాలు పక్కకు వంగిపోవటం, కొండల నుంచి మట్టి రాలటం వంటివి చోటు చేసుకుంటాయి. ఇలా చేస్తే..ప్రమాదాల తీవ్రత అధికంగా ఉండే కొండ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు. కొండల నుంచి మట్టి, రాళ్లు రోడ్ల మీద పడకుండా గోడలు నిర్మించాలి. ఫెన్సింగ్ ద్వారా రక్షణ కల్పించాలి. పగుళ్లు తక్కువగా ఉండే ప్రాంతాల్లో నిర్మాణాలకు సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటించాలి. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి.కొండ ఏటవాలు ప్రాంతాల్లో ఎక్కువగా మొక్కలు నాటాలి. -
ఆ కొండకు చేరాలంటే.. కొండంత గుండె కావాలి!
డార్కెస్ట్ డంజన్కు సీక్వెల్‌గా వస్తున్న డార్కెస్ట్ డంజన్ 2 ఈ నెల 15న విడుదల అవుతుంది. గత గేమ్స్లాగే తాజా గేమ్ కూడా రోగ్‌లైక్ రోల్–ప్లేయింగ్ వీడియో గేమ్. తమవైన శక్తిసామర్థ్యాలతో ఉండే విభిన్నమైన క్యారెక్టర్లు దీనిలో ఉంటాయి.ఈ గేమ్ అంతిమ లక్ష్యం కొండకు చేరడం. కొన్ని శక్తులు ప్రపంచాన్ని ఆక్రమించడంలో కీలక పాత్ర పోషించిన కొండ ఇది. కొండను అన్వేషించే క్రమంలో ప్లేయర్‌కు రకరకాల అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఈ టర్న్–బేస్డ్ గేమ్‌లో రాంగ్ స్పాట్లో ఉన్నప్పుడు ప్లేయర్ తన స్కిల్స్‌ను ఉపయోగించలేరు.డెవలపర్స్: రెడ్ హుక్ స్టూడియోస్ఇంజిన్: యూనిటీ ప్లాట్‌ఫామ్స్: విండోస్, ప్లేస్టేషన్ 4, ప్లేస్టేషన్ 5, నిన్టెండో స్విచ్, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్జానర్స్: రోల్–ప్లేయింగ్, రోగ్‌లైక్ మోడ్ సింగిల్–ప్లేయర్ఇవి చదవండి: Artificial Intelligence: ఫీచర్ జెమిని ఏఐ టూల్స్.. -
అదీ గ్లాస్ బ్రిడ్జ్..! ఎక్కారంటే ప్రాణం గుప్పిట్లోనే!!
ఎత్తయిన కొండ అంచున వాక్ వే .. అదీ గ్లాస్ బ్రిడ్జ్! రెయిలింగ్ నుంచి పక్కకు చూసినా.. నడుస్తూ కిందకు చూసినా.. గుండె జారిపోయే దృశ్యమే! ఇదేదో థ్రిల్లర్ మూవీలో సీన్ అనుకునేరు! చైనాలోని పర్యాటక ప్రాంతం. పేరు.. ఝాంగ్జాజే నేషనల్ ఫారెస్ట్ పార్క్!చైనాలో యునెస్కో గుర్తించిన ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్! భలే ఉంది కదా! చూడాలని మనసు ఉవ్విళ్లురుతోంది సరే... హార్ట్ బీట్‌ని కంట్రోల్లో పెట్టుకుని మరీ ఆ బ్రిడ్జి ఎక్కండి!ఇవి చదవండి: తొలి సజీవ కంప్యూటర్ని.. మీరెప్పుడైనా చూశారా!? -
Silent Village of India: అక్కా చెల్లెళ్ల ‘నిశ్శబ్ద’ విప్లవం
గందోహ్(జమ్మూకశ్మీర్): ఆరోగ్యంగా ఉండి కూడా ఓటేయడానికి బద్ధకించే పౌరులున్న దేశం మనది. అలాంటిది పుట్టుకతోనే చెవుడు, మూగ సమస్యలతో ఇబ్బందులు పడుతూ కూడా ఓటేయడానికి ముందుకొచ్చి మొత్తంగా గ్రామానికే ప్రేరణగా నిలిచిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల స్ఫూర్తిదాయక గాథ ఇది. గ్రామంలో సగం కుటుంబాలకు సమస్యలు జమ్మూకశీ్మర్‌లోని డోడా జిల్లాలోని భద్రవాహ్ పట్టణానికి 105 కిలోమీటర్ల దూరంలోని కొండప్రాంతంలో దధ్‌కాయ్ గిరిజన గ్రామం ఉంది. గ్రామంలో కేవలం 105 కుటుంబాలే నివసిస్తున్నాయి. ఇందులో సగానికి పైగా అంటే 55 కుటుంబాలను దశాబ్దాలుగా ఆరోగ్యసమస్యలు చుట్టుముట్టాయి. ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా మూగ, చెవిటివారిగా మిగిలిపోతున్నారు. ఇలా గ్రామంలో 84 మంది ఉన్నారు. వారిలో 43 మంది మహిళలు, పదేళ్లలోపు 14 మంది చిన్నారులు ఉన్నారు. ఎక్కువ మంది మాట్లాడలేని కారణంగా ఈ గ్రామానికి సైలెంట్ విలేజ్ ఆఫ్ ఇండియా అనే పేరు పడిపోయింది. రేహమ్ అలీ ముగ్గురు కూతుళ్లు రేష్మా బానో(24), పరీ్వన్ కౌసర్(22), సైరా ఖాటూన్(20)లకూ ఏమీ వినిపించదు. మాట్లాడలేరు కూడా. అయితే ఓటేసి తమ హక్కును వినియోగించుకోవాలనే కోరిన ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లలో బలంగా నాటుకుపోయింది. ఈసారి ఎలాగైనా ఓటేస్తామని ముగ్గురూ ఘంటాపథంగా చెబుతున్నారు. వీళ్లు ఓటేస్తుండటం ఇదే తొలిసారికావడం విశేషం. బీజేపీ నేత జితేంద్రసింగ్ పోటీచేస్తున్న ఉధమ్‌పూర్ ఎంపీ నియోజకవర్గం పరిధిలోనే ఈ గ్రామం ఉంది. శుక్రవారం జరగబోయే పోలింగ్‌లో ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నామని తమ ఊరికొచి్చన మీడియా వాళ్లకు ఈ అక్కాచెల్లెళ్లు తమ ఓటర్ ఐడీ కార్డులు చూపించిమరీ చెబుతున్నారు. ‘ మొదటిసారిగా ఓటేయనున్న మ్యూట్ మహిళల ఉత్సాహం ఊరి జనం మొత్తానికి స్ఫూర్తినిస్తోంది’ అని పొరుగింటి వ్యక్తి జమాత్ దానిష్ ఆనందం వ్యక్తంచేశారు. ‘‘ ఔత్సాహిత యువ మహిళా ఓటర్లను చూసి మొత్తం గ్రామమే గర్వపడుతోంది. ప్రతి ఇంట్లో ఇదే చర్చ. ఈ సారి ఇక్కడ 100 శాతం పోలింగ్ నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు ’’ అని గ్రామ మాజీ వార్డు సభ్యుడు మొహమ్మద్ రఫీఖ్ వ్యాఖ్యానించారు. -
Uttarakhand: భూములు కొనేందుకు వారికి నో !
డెహ్రాడూన్: పర్యాటక రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో భూములు కొనాలనుకుంటున్నారా. అయితే ఇక అది కుదరకపోవచ్చు. రాష్ట్రంలోని గ్రామీణ కొండ ప్రాంతాల్లో రాష్ట్రం బయటివారు భూములు కొనకుండా సీఎం పుష్కర్ సింగ్ దామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం త్వరలో ఒక చట్టం తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇదే తరహాలో చట్టం తీసుకువచ్చిన మరో పర్యాటక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ స్ఫూర్తిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఉత్తరాఖండ్ గ్రామీణ కొండ ప్రాంతాల్లో భూముల కొనుగోలుపై పరిమితులు విధించే విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రం బయటివారు పూర్తిగా భూములు కొనుగోలు చేయకుండా నిరోధించడం, పట్టణ ప్రాంతాల్లో భూముల కొనుగోలుపై పరిమితులు విధించాలని కమిటీ తన నివేదికలో సిఫారసు చేసింది. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానున్నట్లు అధికారులు చెబుతున్నారు. బయటివారు భూములు కొనుగోలు చేయడంపై స్థానికుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతోనే ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చేందుకు నిర్ణయించిందని తెలుస్తోంది. అయితే భూ చట్టాల్లో మార్పులు చేయడం ఉత్తరాఖండ్‌లో ఆనవాయితీగా వస్తోంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రంలో భూముల కొనుగోలుపై ఆంక్షలు విధించడం పెట్టుబడుల పేరు చెప్పి మళ్లీ వాటిని ఎత్తివేయడం చేస్తూనే వస్తుండడం విశేషం. ఇదీచదవండి..రామ మందిర వేడుకకు మమతా బెనర్జీ దూరం? -
అగుడు కదిపితే చాలు అద్భుత లోకాల్లో ఉన్న అనుభూతి..
ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పుడు కొత్త టూరిస్టు స్పాట్లు వెలుగు చూస్తున్నాయి. అగుడు కదిపితే చాలు అద్భుత లోకాల్లో ఉన్న అనుభూతిని పంచుతున్నాయి. పాల సంద్రాన్ని తలిపించే మంచు మేఘాలతో పాటు ఇప్పుడు హొయలొలికే కొత్త జలపాతాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. అంతెత్తునుంచి ఎగసిపడే జలసవ్వడులు సుమధుర సంగీత ఝరిలో జలకాలాడిస్తున్నాయి. వాటిని సందర్శించేందుకు పర్యాటకులు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు భారీగా తరలిస్తున్న సందర్శకులు అయిష్టంగానే తిరిగి ఇళ్లకు వెళుతున్నారు. గూడెంకొత్తవీధి/అరకులోయ రూరల్: జిల్లాలో కొత్తగా వెలుగులోకి వస్తున్న టూరిస్టు స్పాట్లు సైతం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఒకదానిని మించి ఒకటి అన్నట్టు ఉన్న కొత్త ప్రాంతాలను టూరిస్టులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారు. అనంతగిరి, లంబసింగి, తాజంగి, చెరువులవెనం, పాడేరులోని వంజంగి మేఘాల కొండలే కాదు. అంతకు మించిన ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలు అరకులోయ, గూడెంకొత్తవీధి తదితర మండలాల్లో చాలా ఉన్నాయి. సప్పర్ల రెయిన్ గేజ్ గూడెంకొత్తవీధి మండల కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సప్పర్ల రెయిన్‌గేజ్ ప్రాంతం సముద్రమట్టానికి సుమారు 4000 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ 24 గంటలూ అత్యంత శీతల వాతావరణంతోపాటు మంచు మేఘాలు చాలా కిందనుంచి సందర్శకులను తాకుతూ వెళుతుంటాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన దారకొండ దారాలమ్మ ఆలయంతోపాటు సీలేరు వెళ్లే పర్యాటకులంతా తప్పనిసరిగా ఇక్కడ రెయిన్‌గేజ్ వద్దకు వెళ్లి కాసేపు ఉండి ఇక్కడ అందాలను ఆస్వాదిస్తారు. గతంలో అప్పటి ఉమ్మడి విశాఖ కలెక్టర్ యువరాజ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి పర్యటకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత సీజనులో దూరప్రాంతాలనుంచి ఇక్కడకు వస్తున్న పర్యాటకులసంఖ్య పెరుగుతోంది. ఈ ప్రాంతాన్ని టెంపుల్ టూరిజం కింద అభివృద్ధి చేస్తామని పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. రణజిల్లేడలో.. ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో మరో అద్భుతమైన టూరిజం స్పాట్ చూపరులకు కనువిందు చేస్తోంది. పద్మాపురం పంచాయతీ రణజిల్లేడ జలపాతం ఇప్పటికే ప్రాచుర్యం పొందగా, దాని సమీపంలో అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాలు పర్యాటకులను పరవశింప చేస్తున్నాయి. ఇక్కడి మంచు సోయగాలు, సూర్యోదయ అందాలు ఆకర్షిస్తున్నాయి. మాడగడలో వ్యూ పాయింట్ కొద్ది రోజుల నుంచి పర్యాటకులతో సందడిగా మారిన మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ సోమవారం పర్యాటకులతో కిటకిటలడింది. వివిధ ప్రాంతల నుంచి వచ్చిన పర్యాటకులు సందడి చేశారు, తెల్లవారుజామునలో చల్లని వాతవరణంలో మంచు అందాలను వీక్షించి ఫొటోలు తీసుకుంటూ గడిపారు. మూడు కొత్త జలపాతాలు గూడెంకొత్తవీధికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లికి సమీపంలో దోనుగుమ్మల జలపాతం కొత్తగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడికి వెళ్లేందుకు కొద్దిదూరం సీసీ రోడ్డు నిర్మిస్తే చాలు ఈప్రాంతానికి పర్యాటకంగా ఆదరణ లభించే అవకాశం ఉంది. దోనుగుమ్మల జలపాతానికి రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశామని పంచాయతీరాజ్ జేఈ జ్యోతిబాబు తెలిపారు. జలపాతాలకు వెళ్లేందుకు రహదారి నిర్మాణానికి రూ.19లక్షలు మంజూరు చేసినట్టు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు. కార్యరూపం దాల్చితే త్వరలోనే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సంపంగిగొంది జలపాతం కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది. అనంతగిరి మండలం చిట్టంపాడు జలపాతం ఇటీవల వెలుగుచూసింది. అక్కడికి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో వెళుతున్నారు. -
పునాదుల్లేని ఊరు.. ఎక్కడ ఉందో తెలుసా?
దేవనకొండ(కర్నూలు జిల్లా): పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించడం సాధ్యమేనా? అవి నిలబడతాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు కరిడికొండ గ్రామస్తులు. ఈ ఊరిలో పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించుకున్నారు. దశాబ్దాలుగా అవి చెక్కుచెదరకుండా ఉన్నాయి. గ్రామ సమీపంలోని బొమ్మదేవత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గతంలో ఏనుగుల సంచారం ఉన్న ఈ గ్రామంపై ప్రత్యేక కథనం.. చదవండి: కూలుతున్న టీడీపీ కంచుకోట.. కుప్పంలో వైఎస్సార్సీపీ రెపరెపలు మండల కేంద్రమైన దేవనకొండకు నాలుగు కిలోమీటర్ల దూరంలో కరిడికొండ గ్రామం ఉంది. కొండల మధ్య చదును ప్రాంతంలో 1952 వరకు పాత ఊరు ఉండేది. ప్రజలు పూరి గుడిసెలు వేసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. కొండల మధ్య కుంట ప్రాంతంలో ఊరు ఉండడంతో కన్నపుకుంటగా పిలిచేవారు. అయితే కుంటలో నీరు తాగేందుకు ఏనుగులు వచ్చేవి. దీంతో కాలక్రమేణా ఈ ఊరికి ‘కరి’డికొండ అనే పేరొచ్చిందని పెద్దలు పేర్కొంటున్నారు. గ్రామంలో ఆంజనేయస్వామి, చెన్నకేశవస్వామి ఆలయాలు ఉండేవి. చిన్నరాళ్లపై నిలబడిన పెద్దరాయిని గ్రామస్తులు బొమ్మ దేవతగా కొలుస్తున్నారు. ప్లేగు వ్యాధి రావడంతో పాత ఊరంతా ఖాళీ చేసి కొందరు పక్క గ్రామాలకు వెళ్లారు. గ్రామానికి చెందిన తిమ్మప్ప, రామప్ప అనే కుటుంబాలకు చెందిన వారు కొండపైకి వెళ్లి పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించుకున్నారు. వారిని చూసి మిగతా వారు కూడా అక్కడే స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొండలో బండలను తొలుస్తూ, రాళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. బొమ్మదేవత ఊరిని కాపాడుకుంటూ వస్తోందని గ్రామస్తుల నమ్మకం. శ్రావణమాసంలో ఆ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కనిపించని పూరి గుడిసె గ్రామంలో ప్రస్తుతం 2,450 మంది నివసిస్తున్నారు. 1,619 ఎకరాల్లో ఉల్లి, పత్తి, వేరుశనగ పంటలు పండిస్తున్నారు. పచ్చని పైర్లతో, చుట్టుతా చిన్న చిన్న కొండలతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. పునాదులు లేకుండా ఇల్లు నిర్మించుకోవడంతో రూ.3 లక్షల వరకు ఆదా అవుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో ఎక్కడా పూరిగుడిసె లేదు. కొండపై తిమ్మప్పస్వామి దేవాలయం ఉంది. గ్రామ సమీపంలోని కొండల నుంచి రాళ్ల తొలచి, ఇళ్ల నిర్మాణాలకు తరలిస్తున్నారు. గ్రామంలో గతంలో 80 గృహాలు ఉండగా..ప్రస్తుతం వాటి సంఖ్య 210కి చేరుకుంది. ఎలాంటి ఇబ్బందులూ లేవు కరిడికొండలో పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. కొండ ప్రాంతం కావడంతో ఇళ్లు కూలే అవకాశమే లేదు. నేరుగా నిర్మాణాలను చేపట్టవచ్చు. – అవినిధ్, హౌసింగ్ ఏఈ ఇల్లు కట్టుకోవడం చాలా సులభం కొన్నేళ్ల నుంచి మేం ఇక్కడే నివాసం ఉంటున్నాం. పునాది తీయకుండా ఇల్లు కట్టుకున్నాం. గ్రామంలో డ్రెయినేజీ సమస్య లేదు. మా ఊళ్లో ఇల్లు కట్టుకోవాలంటే చాలా సులభంగా. పక్కనే రాళ్లు కూడా దొరుకుతాయి. – పీరా, కరిడికొండ గ్రామస్తుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి మా గ్రామంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రభుత్వం సీసీ రోడ్లు నిర్మించింది. గ్రామస్తులు సమీప కొండల్లో కారి్మకులుగా పనిచేస్తూ ఆదాయం పొందుతున్నారు. మా గ్రామం ఎత్తైన కొండపై ఉండడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవనకొండ మండలంలోని చాలా గ్రామాల్లో గృహ నిర్మాణాలకు కరిడికొండ నుంచే రాళ్లు తరలిస్తున్నాం. – నాగేష్, కరిడికొండ గ్రామస్తుడు -
18 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసిన సీఈసీ
చమోలి: ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మరోసారి ఆదర్శంగా నిలిచారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర చమోలీ జిల్లాలో కొండప్రాంతంలోని మారుమూల పోలింగ్ స్టేషన్‌కు ఆదివారం 18 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లారు. ‘సుదూరంగా ఉండే డుమాక్ గ్రామంలో ఈ పోలింగ్ స్టేషన్ ఉంది. ఎన్నికల సిబ్బందిని ఉత్సాహపరచాలన్నదే నా ఉద్దేశం. ఈ పోలింగ్ స్టేషన్‌కు ఎన్నికల సిబ్బంది పోలింగ్‌కు మూడురోజులు ముందుగానే చేరుకుంటారు’అని సీఈసీ ఒక ప్రకటనలో తెలిపారు. జమ్మూకశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడం సిబ్బందికి చాలా కష్టసాధ్యమైన విషయమని ఆయన అన్నారు. ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో కూడా ఆయన పలు సందర్భాల్లో రహదారి సౌకర్యం లేని పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఆదర్శంగా నిలిచారు. -
ప్రకృతి కన్నెర్ర: చూస్తుండగానే సెకన్ల వ్యవధిలో కుప్పకూలింది!
న్యూఢిల్లీ: ప్రకృతి ఎంత అందంగా, ప్రశాంతంగా ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే ప్రకృతి కన్నెర్ర చేస్తే మాత్రం పరిస్థితులు అంతే దారుణంగా ఉంటాయి. ఇందుకు సాక్ష్యాలుగా ప్రతి ఏటా వరదలు, వర్షాలు, వాతావరణ మార్పులంటూ ఆ కోపాగ్నిని మనం చూస్తునే ఉన్నారు. ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో ఎన్‌హెచ్-5పై కొండచరియలు విరిగి వాహనాలపై పడి ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఇంకా ఆ ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడకముందే తాజాగా లాహువల్-స్పితి జిల్లాలో శుక్రవారం కొండచరియలు విరిగి చంద్రభాగ నదిలో పడ్డాయి. దీంతో ఆ నది ప్రవాహాన్ని మొత్తాన్ని ఇవి అడ్డుకోవడంతో ఆ సరస్సు పరిసరాల్లో ఈ నీటి మీద ఆధారపడిన వ్యవసాయ క్షేత్రాలకు, చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 2,000 మంది ప్రజలకు నీటి సమస్య రానుంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం గానీ ఎవరికీ గాయాలు జరగలేదని అధికారులు తెలిపారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. నిన్న ఉదయం కొండలోని కొంత భాగం కింద పడి పూర్తిగా నదిని అడ్డుకుందని చెప్పారు. కాగా ప్రస్తుతం అక్కడి పరిస్థితిని పరిశీలించడానికి నిపుణుల బృందం వెళ్లిందని తెలిపారు. ఈ వీడియోను పరిమల్ కుమార్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో.. చూస్తుండగానే కొండచరియలు చంద్రభాగ నదిపై పడటంతో పాటు ఆ సరసు మొత్తాన్ని మంచుతో కప్పినట్లు మట్టి కప్పేసిన వీడియోను మనం చూడవచ్చు. బుధవారం మధ్యాహ్నం కిన్నౌర్ జిల్లాలోని నిగుల్‌సేరి ప్రాంతంలో ఎన్‌హెచ్-5పై కొండచరియలు విరిగి వాహనాలపై పడిన ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 14కు చేరింది. ఈ ఘటనలో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మొత్తం ఈ ఘటనలో 40 మంది గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹ 4 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి ₹ 50,000 పరిహారం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ప్రకటించారు. గాయపడిన వారందరికీ ఉచిత చికిత్స కూడా అందుతుందని ఆయన చెప్పారు. लाहौल घाटी के नालडा के पास भूस्खलन। लैंड स्लइड के कारण चंद्रभागा नदी का प्रवाह अवरुद्ध हो गया है। @ghazalimohammad reports pic.twitter.com/91GyXWnf7Q — Parimal Kumar (@parimmalksinha) August 13, 2021 -
ప్రమాదపుటంచున ప్రయాణం
సాక్షి, విజయవాడ : ప్రమాదకరంగా ఉన్న కాలిబాటల్లో రాకపోకలు సాగించలేక కొండ ప్రాంత ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నడిచేందుకు వీలులేని మెట్ల మార్గంలో తరచూ ప్రమాదాలకు గురవుతున్న పేదల పరిస్థితి దయనీయంగా ఉంది. నాల్గవ డివిజన్ పరిధిలోని కార్మికనగర్ కొండ ప్రాంత ప్రజల తీరని సమస్య ఇది. ఇళ్లు కొనే స్తోమత లేక, కనీసం ఇంటి అద్దెలు కట్టుకునే పరిస్థితి లేని పేదలు కొండ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు దాదాపు మూడు దశాబ్దాలుగా ఇక్కడ జీవిస్తున్నారు. ఉదయాన్నే సద్ది మూట కట్టుకుని కూలీ పనులకు వెళ్లి సాయంత్రానికి ఇళ్లకు చేరుకుంటారు. నిత్యం వీరు రాకపోకలు సాగించే కాలిబాటలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఏళ్లు గడిచినా ఇక్కడ మెట్ల మార్గాల నిర్మాణాలే లేవు. దీంతో స్థానికులు ప్రమాదపుటంచున ప్రయాణాలు సాగిస్తున్నారు. అడుగు జారితే అఘాతంలోకే అన్నట్లుంది ఇక్కడి పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. వర్షకాలం ఇక్కడ రాకపోకలు మరింత ప్రమాదకరంగా ఉన్నాయి. పిల్లలు, మహిళలు వచ్చిపోయే సమయంలో పడిపోయి గాయాలపాలైన సందర్భాలు లేకపోలేదు. మామూలుగానే నడవలేక పోతుంటే నిత్యావసరాలకు సంబంధించిన బరువైన వస్తువులు పైకి చేరవేసేందుకు స్థానికులు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నా, ఎన్ని సార్లు తమ సమస్యలు చెప్పుకున్నా పట్టించుకున్న వారే లేరని ఇక్కడి వారు చెబుతున్నారు. ఓట్ల కోసం తప్పా నేతలు తమ సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావడంలేదని ఆరోపిస్తున్నారు. నాయకులు, అధికారులు మారుతున్నారే తప్పా తమ స్థితిగతులు మారటం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో కాలిబాటలు మెరుగు పరిచి, మెట్ల మార్గాలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. -
దాచేపల్లిలో రంగురాళ్ల వేట
దాచేపల్లి: దాచేపల్లికి ఆరు కిలోమీటర్ల దూరంలోని శంకరపురం– భట్రుపాలెం గ్రామాల మధ్య ఉన్న కొండలో రంగురాళ్ల వేట యథేచ్ఛగా సాగుతోంది. వ్యాపారులు నియమించి మధ్యవర్తుల ఆధ్వర్యంలో కొందరు వ్యక్తులు రేయింబవళ్లు తవ్వకాలు చేపడుతున్నారు. కొండలో సూమారుగా 100కి పైగా సొరంగాలు తీశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో సొరంగం 50 నుంచి 70 అడుగుల లోతులో ఉండటం విశేషం. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ కిందికి దిగి కొందరు రాళ్ల వేట సాగిస్తున్నారు. రహస్యంగా రవాణా.. రంగురాళ్లను చాకచక్యంగా గుంటూరు జిల్లా కేంద్రంతో పాటు విజయవాడ, ప్రకాశం జిల్లా తెలంగాణాలోని హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడెం, రాజస్థాన్, హిమచల్ప్రదేశ్కు తరలిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యపట్టణాలకు చెందిన వ్యాపారులు మధ్యవర్తుల సాయంతో ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం. లోకల్ కార్మికులు 10, 20 కిలో చొప్పున రంగురాళ్లను మూటలుగా కట్టి ఆటోలు, కార్లలో తరలిస్తున్నారు. కాట్రపాడు, భట్రుపాలెం గ్రామాల పరిధిలోని కృష్ణా నది నుంచి కూడా తెలంగాణాలోకి రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడికక్కడే కోవర్టులు ఏర్పాటు చేసుకుని రవాణా సాగించడం గమనార్హం. గతేడాది నవంబర్‌లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టినా తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. ఈ రాళ్లకు మస్త్ గిరాకీ.. శంకరపురం కొండలో నుంచి తీసే రంగురాళ్లకు గిరాకీ బాగానే ఉందని తెలుస్తోంది. దొరికిన రాళ్లలో అష్టముఖి, పంచముఖి ఆకారపు రాళ్లు తయారీకి పనికొచ్చేవి ఉంటే ఇక పండగే. వాటి ధర సుమారు రూ.10 వేలకు పైగా ఉంటుందని అంచనా. ఇతర వాటర్పీస్, గంజిరాళ్లయితే కిలో రాళ్లు రూ.5 వేల చొప్పున పలుకుతాయని తెలుస్తోంది. కొండ నుంచి తీసే సాధారణ రాళ్లు కూడా కిలో రూ.5 వేల చొప్పున కొనుగోలు చేస్తారని తెలిసింది. ఒకే రాయి 5 కిలోల బరువు ఉంటే దానికి ప్రత్యేక పారితోషికాలట. సదరు రాళ్లను ఇతర ప్రాంతాలకు తరలించి రాతి బొమ్మలు, కొయ్యబొమ్మలు, పూసల దండలు, ఆభరణాల మధ్యలో ధగధగ మెరిసే రాళ్లుగా మారుస్తారని సమాచారం. అధికారులకు అనధికార సవాల్.. దాచేపల్లి పరిసర ప్రాంతంలోని శంకరపురం, భట్రుపాలెం, దాచేపల్లి, కాట్రపాడు గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు తవ్వకాలు చేపడుతూ అధికారులకు అనధికార సవాళ్లు విసురుతున్నారు. అటవీశాఖ పరిధిలో సరిపడా సిబ్బంది లేకపోవడంతోనే తవ్వకాలను కట్టడి చేయలేకపోతున్నామని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఉన్న అరకొర సిబ్బందితో నిఘా పెట్టడం కష్టతరంగా మారిందని వాపోతున్నారు. ఒకవేళ తనిఖీ చేసినా తవ్వకాలు చేపడుతున్న కూలీలు దాడులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు దమ్ముంటే తమన పట్టుకోమని సవాల్ విసురుతున్నట్లు అధికారులు చెప్పడం గమనార్హం. ఇది ఇలా ఉండగా మరోవైపు ఆ శాఖ అధికారుల్లో కొందరు మామూళ్లకు అలవాటు పడి నిఘా సంగతి మరచిపోయారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. మరణాలు సంభవించాయి.. రెండేళ్ల క్రితం ఈ ప్రాంతంలో రంగురాళ్ల వేటకు సొరంగంలోకి వెళ్లిన ఓ కూలి మృతి చెందాడు. ఘటన బయటకు రాకుండా మధ్వవర్తులు జాగ్రత్తలు తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈ కొండపై వందమందికిపైగా కూలీలు విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాత్రిళ్లు టార్చిలైట్లు, జనరేటర్లనూ ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. ఈ మూడేళ్లలో సుమారు వందల టన్నుల రంగురాళ్లు హద్దులు తరలివెళ్లాయనేది ఓ అనధికార అంచనా. తవ్వకాలు జరిపితే రౌడీ షీట్లు తెరుస్తాం.,. కొండల్లో అక్రమంగా రంగురాళ్ల కోసం తవ్వకాలు జరిపే ఊరుకోం. సదరు వ్యక్తులు పట్టుబడితే రౌడీషీట్లు తెరుస్తాం. వారి వెనుక ఎంతటి వారైనా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. – అద్దంకి వెంకటేశ్వర్లు, ఎస్సై, దాచేపల్లి -
చిగురించిన ఆశలు
విజయవాడలోని రెవెన్యూ, కొండ పోరంబోకు స్థలాలకు పట్టాలు పొంది, వాటిలో నివసిస్తున్న పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటి వరకూ స్థలాలకు పట్టాలు ఉన్నా అధికారికంగా క్రయవిక్రయాలకు, తనఖాపై రుణాలు పొందేందుకు వీలు లేదు. ఇప్పుడు విక్రయాలకు, తనఖాలకు అవకాశం కల్పిస్తూ జీఓ తెచ్చేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేపట్టడంతో పేదలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. సాక్షి, విజయవాడ: ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ నగరంలో ఆకస్మికంగా పర్యటించారు. ఆ సమయంలో కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు తమ సమస్యలను ముఖ్యమంత్రికి ఏకరువుపెట్టారు. కొండప్రాంతాల్లో ఉన్న తమ ఇళ్లకు పట్టాలు ఇచ్చారని, వాటి వల్ల ఉపయోగం లేకుండాపోయిందని వివరించారు. కుటుంబ అవసరాల కోసం ఇళ్లు విక్రయించాలన్నా, కనీసం బ్యాంకులో తనఖాపెట్టి రుణం తీసుకోవాలన్నా వీలులేదని వివరించారు. సీఎం స్పందించి పేదల ఇళ్ల పట్టాల సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక జీఓ వస్తేనే సాధ్యం ప్రస్తుతం ఉన్న జీఓల ప్రకారం ప్రభుత్వ, పోరంబోకు భూములను ఆక్రమించుకుని నివసిస్తున్న ఇళ్లకు సంబంధించి పట్టాలు ఉన్నప్పటికీ విక్రయించుకునే అధికారం లేదు. గతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చినా కేవలం అనుభవ హక్కు మాత్రమే ఉండేది. ఈ తరహాలో సుమారు 50 వేల ఇళ్ల వరకు రెవెన్యూ భూముల్లో, కొండలపైనా ఉన్నాయి. పట్టాల మార్పుపై పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినా, అందుకు ప్రస్తుతం ఉన్న జీఓలు సరిపోవని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని రాష్ట్ర భూపరిపాలన శాఖ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. ప్రస్తుతం ఉన్న ఇళ్ల పట్టాలను మార్చి వాటి స్థానంలో, ఇళ్ల స్థలాన్ని విక్రయించేందుకు (సేలబుల్ రైట్స్), బ్యాంకులో తాకట్టు(లోన్లు) పెట్టి రుణం తీసుకునేందుకు వీలుగా కొత్త పట్టాల జారీ చేసేందుకు ప్రత్యేక జీఓ జారీ చేయాలని కోరినట్లు తెలిసింది. చేతులు మారిన స్థలాల విషయంలో... కొండ ప్రాంతం, పోరంబోకు భూముల్లో పేదలు నివసిస్తున్న స్థలాలకు పట్టాలు ఉన్నా విక్రయించే హక్కు లేదు. అయితే కొంతమంది తమ ఇళ్లను విక్రయించుకున్నారు. కొనుగోలుదారుడికి ఇంటి పట్టా అందజేసి, ఇంటిని స్వాధీనం చేస్తూ హామీ పత్రం రాసిచ్చేవారు. అయితే పట్టా మాత్రం విక్రయదారుడి పేరుతోనే ఉండేది. ఇటువంటి వాటిని కూడా మార్చేందుకు వీలుగా జీఓలో మార్గదర్శకాలు పొందుపరచాలని రెవెన్యూ అధికారులు భూపరిపాలన శాఖను కోరారు. చనిపోయిన వారి పేరుతో పట్టాలు ఉంటే, ప్రస్తుతం అనుభవిస్తున్న వారి పేర్లతో కొత్తగా పట్టాలు ఇచ్చేందుకు వీలుగా నిబంధనలు రూపొం దించాలని కూడా కోరినట్లు తెలిసింది. విద్యుత్ బిల్లులు, కార్పొరేషన్‌కు చెల్లించే ఇంటి పన్ను రశీదులను ఆధారంగా చేసుకుని అనుభవదారులను గుర్తించాలని సూచిం చారు. కొత్త పట్టాలు పొందిన వారు కనీసం రెండేళ్ల వరకు విక్రయించకుండా, బ్యాంకుల్లో తాకట్టు పెట్టకుండా మార్గదర్శకాల్లో పొందుపరచాలని కోరారు. ప్రత్యేక జీవో విడుదలయ్యేనా? ఇళ్ల పట్టాల సమస్య పరిష్కరిస్తామంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలుకు అవసరమైన ప్రత్యేక జీఓ జారీ సాధ్యమేనా అనే చర్చ రెవెన్యూ శాఖలో జరుగుతోంది. కొండపైన ఉన్న ఇళ్లను విక్రయించేందుకు హక్కు కల్పించాలంటే అటవీశాఖ చట్టాలు అంగీకరించవేమోనన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఒకవేళ జీఓ వస్తే కొండలపైన మరిన్ని ఆక్రమణలు పెరిగే అవకాశం ఉంది. క్రయవిక్రయాలకు అవకాశం ఇస్తే అక్కడ భూముల ధరలు కొండెక్కి కూర్చుంటాయని భావిస్తున్నారు. -
ప్రమాదపు ‘అంచుల్లో’ ప్రజలు
- 263 ప్రమాదకర కొండ ప్రాంతాలను గుర్తించిన అధికారులు - చర్యలు ప్రారంభించని ప్రభుత్వం సాక్షి ముంబై: వర్షకాలం సమీపిస్తున్న కొద్దీ కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలే వారి భయానికి ముఖ్య కారణం. గతేడాది కొండచరియలు విరిగిపడడంతో పుణే జిల్లాలోని మాలిన్ గ్రామం మొత్తం సమాధి అయ్యింది. ముంబైలోనూ పలుమార్లు కొండచరియలు విరిగిపడి, పాత భవనాలు కూలి అనేక మంది మృతి చెందిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ప్రమాదాలు జరుగుతున్నా అలసత్వం వదలని మునిసిపల్ కార్పొరేషన్, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటి వరకు నగరంలో సుమారు 263 ప్రాంతాలను ప్రమాదపు అంచున ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పుణే జిల్లా మాలిన్ గ్రామంలో జరిగినట్లు మరో ప్రమాదం జరిగితే నగరంలో భారీ ప్రాణనష్టం వాటిల్లే అవకాశం ఉంది. వందలాది మంది మృతి.... కొండచరియలు విరిగిపడి ఇప్పటి వరకు వందలాది మంది వృుతి చెందారు. 2000 జులై 13 ఘట్కోపర్లో కొండచరియలు విరిగిపడి 67 మంది మరణించారు. 2009 సెప్టెంబరు 4న సాకినాకాలో జరిగిన మరో ఘటనలో 12 మంది మరణించారు. 2012 సెప్టెంబరు 3న చెంబూర్‌లో కొండచరియలు విరిగిపడినా అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 2013 జులై 19న అంటప్‌హిల్‌లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 2014 జులైలో చెంబూర్‌లో జరిగిన ఘటనలో ఐదేళ్ల బాలుడు మరణించాడు.