మధురాతి మధురం
హిమబిందు కనోజ్ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన అబ్బురపరిచింది. బంజారాహిల్స్‌లోని పూరి జగన్నాథ ఆలయ ప్రాంగణంలో శనివారం రాత్రి ప్రదర్శించిన ఈ నాట్య విన్యాసం ఆహూతుల మనసు దోచింది. ప్రతి భంగిమా అద్వితీయంగా... అభినయం అతి మధురంగా... ఆ జగన్నాథుని సమక్షంలో సాగిన ఈ అపురూప తాండవం ఉగాది పర్వ దినాన ప్రతి మదినీ రంజింపజేసింది.