hired
-
తప్పని తిప్పలు: జాబొచ్చినా జాయినింగ్ లేదు!
గత ఏడాదే కోర్సులు పూర్తి చేసుకున్న ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ఎంపికైనా ఉద్యోగాలు మాత్రం ఇంకా చేతికి అందలేదు. ఏడాది కింద కాలేజీలకే వెళ్లి, మెరిట్ విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి రిక్రూట్ చేసుకున్న కొన్ని కంపెనీలు ఇప్పటికీ ‘ఆన్ బోర్డింగ్ (ఉద్యోగాల్లో చేర్చుకోవడం)’ప్రక్రియను మొదలుపెట్టలే దు. పైగా మళ్లీ కొత్తవారి కోసమంటూ పలు కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేపడుతుండటం.. చిన్న కంపెనీలే కాకుండా బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ)లు కూడా ఇలాగే వ్యవహరిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఉద్యోగం వస్తుందా, రాదా? భవిష్యత్తు ఎలా ఉంటుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్/డిగ్రీ చదువు ముగియగానే క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎంపిక కావడంతో.. తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే ఊహలు తలకిందులు అవుతున్నాయని వాపోతున్నారు. – సాక్షి, హైదరాబాద్ నిరుద్యోగుల వెతలెన్నో.. ఇటీవల ‘ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (ఫైట్)’చేసిన అధ్యయనంలో ‘ఆఫర్ లెటర్ల’తో అభ్యర్థు లు ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి. భారీ సంఖ్యలో ఐటీ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్లు చేస్తూ ఆఫర్ లెటర్లు (లెటర్ ఇంటెంట్) ఇచ్చిఏడాది దాటుతున్నా ఆన్ బోర్డింగ్ సమాచారం ఇవ్వడం లేదు. దీనితో చాలా మంది ఆందోళనలో పడిపోతున్నారు. ఇక కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నా యి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగంలో చేరేందుకు నిర్ణీతకాలానికి బాండ్లు సమర్పించాలని, ఒరిజి నల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కొర్రీలు పెడుతు న్నా యి. అభ్యర్థులు ఇతర కంపెనీల్లో మంచి ఉద్యో గాలు, ఆఫర్లు వచ్చినా వెళ్లలేని పరిస్థితిని కల్పిస్తున్నాయి. కొన్ని కంపెనీలు తాము శిక్షణ, ఇతరాల కోసం వెచ్చించిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లిస్తే ఇతర కంపెనీలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నాయి. ఫైట్ నిర్వహించిన సర్వేలో వేయి మందికి పైగా ఆఫర్ లెటర్ల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇన్ఫోసిస్, ఎంఫసిస్, విప్రో, క్యాప్‌జెమిని వంటి ప్రధాన కంపెనీలు కూడా ఇందులో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఆందోళన వద్దు.. ఐటీరంగంలో ఒడిదుడుకులు సహజమేనని, యువత తమ నైపుణ్యాలు, నాలెడ్జ్‌ను పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగాల కోసం కొన్నినెలల నిరీక్షణ ఫరవాలేదని, అది ఎక్కువ కాలమైతేనే సమస్యగా మారుతుందని చెప్తున్నారు. రెండు, మూడేళ్లకోసారి కరెక్షన్ వస్తుందని, అది ఆయా రంగాలకు మంచిదే తప్ప హానికరం కాదని పేర్కొంటున్నారు. ముందే స్పష్టత తీసుకోవాలి.. ఎంఎన్‌సీలు సహా వివిధ ఐటీ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్కు వచ్చినప్పుడే ఏ తేదీ లోగా ‘ఆన్ బోర్డింగ్’చేస్తారనే దానిపై కాలేజీ యాజమాన్యాలు స్పష్టత తీసుకోవాలి. లేకుంటే కంపెనీలు తమకు నచ్చినట్టు చేస్తూ.. అవసరముంటే నెలలోనే జాయినింగ్ ఇస్తూ, లేకుంటే నెలల తరబడి జాప్యం చేస్తూ వెళుతున్నాయి. ఈ విషయంలో అటు కాలేజీలు, ఇటు కంపెనీల తప్పిదాలు ఉన్నాయి. ఐటీ కంపెనీ లు వెంటనే ఉద్యోగం ఇవ్వకపోయినా శిక్షణ ఇవ్వొ చ్చు. ఇంటర్న్‌షిప్, ట్రైనింగ్ ప్రాసెస్‌తో నడిపించవచ్చు. ఫ్రెషర్స్ కూడా ఒక కంపెనీ ఆఫర్‌కే పరిమి తం కాకుండా మరో కంపెనీలో ప్రయత్నించొచ్చు. ఆన్‌బోర్డింగ్ వచ్చేలోగా చిన్న కంపెనీలు, స్టార్టప్‌లలో చేరి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవచ్చు. – రమణ భూపతి, క్వాలిటీ థాట్ గ్రూప్ చైర్మన్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ఆఫర్ లెటర్లు ఇచ్చినా జాయినింగ్ తేదీపై కంపెనీలు స్పష్టత ఇవ్వకపోవడంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. కార్మిక శాఖ ద్వారా సర్వే నిర్వహించాలి. ఆఫర్ లెటర్లను గౌరవించని సంస్థలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వపరంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఇటీవల మా సంస్థ సర్వేలో వెల్లడైన అంశాలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్లకు అందజేశాం.. – సి.వినోద్‌కుమార్, కన్వీనర్, ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ ఆర్థిక మాంద్యం తొలగితే చక్కబడొచ్చు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య పరిస్థితి నెలకొంది. మార్కెట్ వాస్తవ పరిస్థితి ఏమిటనేది మరో మూడు నెలల్లో స్పష్టత వస్తుంది. కంపెనీలు మంచి ఉద్ధేశంతోనే ఫ్రెష్ రిక్రూట్మెంట్ చేపట్టాయి. కంపెనీ బిజినెస్ అవసరాలను బట్టి ఆఫర్ లెటర్లు ఇచ్చిన వారిని ఆన్‌బోర్డింగ్‌కు పిలుస్తుంటాయి. ఆఫర్ లెటర్లు ఇచ్చి పిలవనంత మాత్రాన అది నేరమేమీ కాదు. ఎకానమీ వృద్ధి చెంది పరిశ్రమకు సానుకూల పరిస్థితులు ఏర్పడితే అన్నీ సర్దుకుంటాయి. గత వందేళ్లలో ప్రతి ఏడెనిమిదేళ్లకోసారి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగి ఎక్కువ ప్రచారం జరగడం తప్ప ఇది కొత్తగా వచ్చిన సమస్యేమీ కాదు. యువత సమయాన్ని సద్వినియోగం చేసుకుని స్కిల్స్ పెంచుకోవాలి. – కోఫోర్జ్ వెంకా రెడ్డి, సీనియర్ హెచ్ఆర్ లీడర్ -
అక్కడ ఆడవాళ్లతో హంతక ముఠాలు
-
రెజ్యూమ్ తో జాబ్ సంపాదించాడు!
ఉద్యోగం కోసం రెజ్యూమ్ లు పట్టుకుని ఇంటర్వూల కోసం కంపెనీల చుట్టూ నిరుద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్న ఈ రోజుల్లో బెంగుళూరుకు చెందిన ఓ కుర్రాడు కేవలం రెజ్యూమ్ ని క్రియేటివ్ గా తయారుచేసి ఓ మల్టీ నేషనల్ కంపెనీలో ఇంటర్వూ లేకుండానే జాబ్ సంపాదించాడు. జైన్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ మేనేజ్ మెంట్ స్టడీస్ లో ఎంబీఏ పూర్తి చేసిన సుముఖ్ మెహతా(21) తన రెజ్యూమ్ తో బ్రిటిష్ మ్యాగజైన్ జీక్యూలో జాబ్ సంపాదించాడు. దీనిపై మాట్లాడిన మెహతా నేటి పోటీప్రపంచంలో ప్రతి ఒక్క విషయాన్ని క్రియేటివ్ గా ఆలోచించడం చాలా కష్టమని అన్నారు. తాను క్రియేటివ్ గా ఆలోచించేందుకు చాలా కష్టపడినట్లు తెలిపారు. ఎంబీఏ చదివే రోజుల్లో ఎప్పుడూ బోర్ కొట్టించే రెజ్యూమ్ లతో ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన వచ్చిందని, ఇన్ఫోగ్రాఫిక్స్ సాయంతో తయారు చేసిన వాటిని డిపార్ట్ మెంట్ డీన్ కు చూపించేవాడినని తెలిపారు. ఆయన బాగున్నాయని చెప్పి ఆ ఏడాది బీ-స్కూల్ విద్యార్థుల రెజ్యూమ్ లు అన్నీ తనతో చేయమన్నట్లు వివరించారు. కాగా, చివరిగా తనకోసం రెజ్యూమ్ తయారుచేసుకున్న'ఎక్స్-ఫ్యాక్టర్' రెజ్యూమ్ తో జీక్యూలో ఇంటర్వూ లేకుండా కొలువు సాధించాడు. -
వేలానికి ముస్తాబైన మాల్యా విమానం
న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కు చెందిన అత్యంత ఖరీదైన విమానాన్ని వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది. భారత్ లో బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా బకాయిలు పడి, వాటిని చెల్లించడంలో విఫలమై, గత నెలలో విదేశాలకు పారిపోయిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా ఆస్తులను ఇప్పటికే బ్యాంకులు స్వాధీనం చేసుకుని అమ్మకానికి పెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ శాఖ కూడా అదే దారిలో పయనిస్తోంది. సుమారు166 కోట్ల రూపాయలతో నవంబర్ 2006 కొనుగోలు చేసిన స్పెషల్ జెట్ కు మరిన్ని కోట్లు వెచ్చించి హంగులు అమర్చుకున్నాడు మాల్యా. ముఖ్యంగా బార్, భోజనాల గది, బెడ్ రూమ్, వంటగదివాష్ రూం లాంటి విలాసవంతమైన సౌకర్యాలను పొందుపరిచాడు. వజ్రాలు పొదిగిన బాలాజీ చిత్రాపటం, మరో నాలుగు పికాసో చిత్రాలు సహా ఇతర ఖరీదైన కళాఖండాలు లోపల అమర్చాడు. అయితే పన్నులు చెల్లించడంలో విఫలం కావడంతో ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుంది. అనంతరం ఎయిర్ ఇండియా ఎయిర్ భారతదేశం ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో ఎయిర్ బస్ ఎ 319 ని ముస్తాబు చేశారు. చాలా మరమ్మతులు, హంగులు అమర్చిన అనంతరం ఈ మే 12, 13 తేదీల్లో ప్రభుత్వ నిర్వహణలోని ఎంఎస్టిసి లిమిటెడ్ దీన్ని వేలానికి పెట్టనున్నారు. అయితే ఎయిర్ బస్ లోని మాల్యా పిల్లల ఫోటోలతో పాటు, ఖరీదైన చిత్రాలను మినహాయించి వేలం వేయనుంది. మాల్యా నుంచి తనకు రావలసిన రూ.370 కోట్లకు పైగా పన్ను బకాయిలను రాబట్టేందుకు సర్వీస్ ట్యాక్స్ శాఖ తాజాగా మాల్యా ప్రైవేట్ విమానాన్ని అమ్మకానికి పెట్టింది. మే 12-13 తేదీల మధ్య ఈ -133 సిజె విమానాన్ని వేలం వేయనుంది. ఇంజనీరింగ్ కంపెనీ సిబ్బంది ఇప్పటికే విమానం లోపలా, బయటా శుభ్రం చేసిందనీ, 22 సీట్లు ఎయిర్‌బస్ 319 ని అందంగా తీర్చిదిద్దారని విమానాశ్రయం అధికారి ఒకరు వెల్లడించారు. కాగా దాదాపు 18 నెలల క్రితం ఆదాయపన్ను శాఖ కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్ ప్రైవేట్ జెట్ సర్వీసులను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. పాస్ పోర్టును రద్దు చేసినట్టుగా విదేశాంగ శాఖ ప్రకటన, అరెస్ట్ వారెంట్ జారీ చేయనున్నారనే వార్తల నేపథ్యంలో మాల్యా వ్యవహారం నానాటికీ దిగజారిపోతున్నట్టు కనిపిస్తోంది. -
హెలికాప్టర్లను తిరిగిచ్చేస్తున్న బీజేపీ!
బీహార్ ఎన్నికల సంరంభంలో బీజేపీ ప్రాంతీయ పార్టీల నుంచి గట్టి పోటీ ఎదుర్కోక తప్పడం లేదు. ప్రస్తుత సమయంలో పార్టీల విషయంలో భిన్నమైన వ్యూహం అవసరమని బీజేపీ గ్రహించినట్లు తెలుస్తోంది. ఇంకా మూడుదశల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా పార్టీ ప్రచారానికి హెలికాప్టర్ల వాడకం అనూహ్యంగా తగ్గించుకుంది. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగాల్సిన తరుణంలో పార్టీ.. అద్దె హెలికాప్టర్ల సంఖ్యను తగ్గించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రెండోదశ ఎన్నికల సమయంలోనే బీజేపీ తన వ్యూహాలను పూర్తిగా మార్చి వేసింది. వార్తాపత్రికల్లో ప్రకటనల దగ్గరనుంచి.. బిల్ బోర్డుల వరకూ ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాల బొమ్మలు కూడా ఎక్కడా కనపడకుండా స్థానిక నాయకులు జాగ్రత్త పడ్డారు. ఈ ఎన్నికలపై ప్రధాని ప్రభావం పడటం వల్ల అంతగా ప్రయోజనం ఉండదని, పూర్తిగా స్థానిక ఎన్నికలుగానే జరగాలన్న ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికలకు విరుద్ధంగా ఈసారి ప్రచారం కోసం హెలికాప్టర్ల వాడకాన్ని భారీగా తగ్గించినట్లు కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో హెలికాప్టర్లను ప్రచారంకోసం రోడ్డుమార్గం సరిగా లేని ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు ఉపయోగిస్తుంటారు. మొదట్లో సుమారు 16 హెలికాప్టర్లను బీజేపీ కోసం అద్దెకు తీసుకుంది. అక్టోబర్ 16 రెండోదశ పోలింగ్ పూర్తయిన తరువాత ఐదు హెలికాప్టర్లను తిరిగి ఇచ్చేసినట్లు పాట్నా ఎయిర్ పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు. రెండోదశ పోలింగ్ తర్వాత హెలికాప్టర్ల సంఖ్య తగ్గించినట్లు బీజేపీ బీహార్ శాఖ సీనియర్ నాయకుడు కూడా ధ్రువీకరించారు. అయితే ఎందుకన్న విషయాన్ని మాత్రం ఆయన వివరించలేదు. బీహార్ లోని 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటిదశ ఎన్నికలు అక్టోబర్ 12న జరుగగా... రెండో దశలో మొత్తం 32 సీట్లకు ఎన్నికలు జరిగేందుకు నిర్దేశించారు. దుర్గాపూజ, మొహర్రం పండుగల కారణంగా ఎన్నికల షెడ్యూల్ లో బాగా దూరం ఏర్పడింది. మిగిలిన 162 నియోజకవర్గాల్లో అక్టోబర్ 28, నవంబర్1, నవంబర్ 5 తేదీల్లో ఎన్నికలు జరిపేందుకు ఖరారు చేయగా నవంబర్ 8న ఫలితాలు ప్రకటిస్తారు. రెండు ఇంజన్లు ఉన్న హెలికాప్టర్ అద్దెకు తీసుకోవాలంటే సుమారు గంటకు 1.8 లక్షలు... ప్లస్ 14 శాతం సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. అదే సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ కు లక్ష రూపాయలతోపాటు సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. ఎన్నికల సమయంలో ప్రముఖ నాయకులు సుమారు రోజుకు నాలుగు గంటలు ప్రచారం నిర్వహించాల్సి వస్తుంటుంది. మొదటి విడత ఎన్నికల సమయానికి రాజకీయ పార్టీలు దాదాపు 55 మిలియన్ల మంది ఓటర్లను కలిసేందుకు రెండు డజన్ల ప్రైవేట్ హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నారు. బీజేపీ 16 మాత్రమే అద్దెకు తీసుకుంది. వీటిని పార్టీ స్టార్ ప్రచారకులు నరేంద్ర మోదీ, అమిత్ షాలతో పాటు.. ఓ డజను మంది బీహార్ కేంద్ర మంత్రుల ప్రచారం కోసం ఉపయోగించారు. బీజేపీ ప్రత్యర్థి పార్టీల నేతలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (జేడీయూ), లాలు ప్రసాద్ (ఆర్జేడీ)తో పాటు... కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరు రెండు హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నారు. ఈసారి కూడా ఈ పార్టీలు అవే హెలికాప్టర్లను వాడేందుకు నిర్ణయించుకున్నాయని పాట్నా ఎయిర్ పోర్ట్ అధికారి తెలిపారు.