holi wishes
-
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ హోలీ శుభాకాంక్షలు
-
Holi 2023: రంగు వెనక రహస్యం
హోలీ పండుగ పూట రంగుల్ని ఒకరిపై ఒకరు చల్లుకోవడం వెనుక ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ రంగు వెనకాల ఒక్కో రహస్యం దాగి ఉంది. ఒక్కో రంగు ఒక్కో భావాన్ని ప్రేరేపిస్తుంది. హోలీలో వాడే ప్రధాన రంగుల గురించి పురాణాల్లో, తత్వ, మానసిక శాస్త్రాల్లో ఆ రంగుల గురించి ప్రస్తావన ఉంది. ఎరుపు: ప్రమాదానికి సంకేతంగా భావించే ఎరుపు రంగుకి ‘హోలీ’ ప్రత్యేక గుర్తింపును అందించింది. అనంతమైన ప్రేమకి ఇది చిహ్నం. సున్నితత్వం, కోరిక, సంతోషాలకు ప్రతీకగా చెప్తారు. పైగా ఎరుపు ఏకాగ్రతను ఆకర్షిస్తుంది. ఈ రంగు జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. గులాబీ: ప్రేమను తెలియజేసే రంగు ఇది. లేత గులాబి రంగుతో ఆనందం వెల్లివిరిస్తుంది. మనిషికి మధురమైన భావనలను కలిగిస్తుంది. గులాబీ, నలుపు రంగును మేళవిస్తే ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. హోలీలో గులాబీ రంగుకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తుంటారు. పసుపు: ఆధ్యాత్మిక ధోరణిలో పసుపు పవిత్రతకు సూచిక. శక్తికి, వెలుగుకు ప్రతీక. తెలివిని సూచించేదని పెద్దలు చెప్తుంటారు. సహజ సిద్ధంగా తయారు చేసే ఈ రంగు వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చేస్తుంది. అందుకే హోలీలో ఈ రంగును ఎక్కువగా ఉపయోగించాలని సూచిస్తుంటారు. కాషాయం: ఎరుపు, పసుపు ఛాయలు కలిగిన నారింజ రంగు స్థిరత్వాన్ని కలిగిస్తుంది. మనం ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ ఉండేలా చేస్తుంది. అయితే సరదాని పంచే ఈ రంగుకి హోలీలో ప్రాధాన్యం తక్కువగా ఉంటుంది. నీలం: దైవత్వంతో ముడిపడి ఉన్న రంగు. ప్రశాంతత, నెమ్మదితనాలను సూచిస్తుంది. మనలో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ రంగు ఉపయోగపడుతుందని.. తద్వారా జీవితాన్ని ఉత్సాహంగా గడపవచ్చని పెద్దలు చెప్తారు. ఆకుపచ్చ: ప్రకృతితో సన్నిహితం కలిగిన రంగు. దుష్ట గ్రహాలకు, శక్తులకు వ్యతిరేకంగా పచ్చదనం పనిచేస్తుందని పెద్దలు చెప్తుంటారు. శాంతి, పవిత్రతలకు సూచిక. అలిసిపోయిన శరీరాలకు విశ్రాంతిని అందిస్తుంది. ఊదా: పసుపు, ఎరుపు రంగుల మిశ్రమం. నాణ్యత, సంపదలకు సంకేతం. రంగుల్లో రాజసమైనది. మనిషిలో ఉద్వేగాలను, ఉద్రేకాలను రేకెత్తించడంలో ఉపయోగపడుతుంది. నలుపు: రహస్యానికి గుర్తుగా నలుపు రంగును అభివర్ణిస్తుంటారు. అదేవిధంగా శక్తి, భయాలకు గుర్తుగా చెప్తుంటారు. అధికారాన్ని సూచించే రంగు నలుపే. ఈ రంగు మనిషి విలాసానికి ప్రతీకగా భావిస్తారు. -
సీఎం వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు
-
సీఎం వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రంగుల పండుగ హోలీ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువు ఆగమనాన్ని తెలియజేసే విధంగా హోలీని దేశవ్యాప్తంగా ఆనందంగా, ఉల్లాసంగా జరుపుకుంటారని సీఎం పేర్కొన్నారు. ‘‘ఇంద్ర ధనుస్సులోని రంగులు ఇంటింటా వసంతంగా కురిసే ఆనందాల పండుగ హోలీ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు’ అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఇంద్రధనుస్సులోని రంగులు ఇంటింటా వసంతంగా కురిసే ఆనందాల పండుగ హోలీ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు.#Holi — YS Jagan Mohan Reddy (@ysjagan) March 18, 2022 చదవండి: హోలి హోలీల రంగ హోలీ... మంచి రంగులే మంచిది చమ్మకేళీ! -
హోలీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో పేర్కొన్నారు. ‘ఆప్యాయత, ప్రేమ, సంతోషాల హరివిల్లు హోలీ! ప్రతి ఒక్కరి జీవితం ఆనందాలతో నిండాలన్న ఆకాంక్ష హోలీ! ఈ హోలీ పండుగ వేళ రాష్ట్రంలోని ప్రతి ఇంటా సంతోషాల సప్త వర్ణాలు వెల్లివిరియాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను!’ అని ట్వీట్ చేశారు. ఆప్యాయత, ప్రేమ, సంతోషాల హరివిల్లు హోలీ! ప్రతి ఒక్కరి జీవితం ఆనందాలతో నిండాలన్న ఆకాంక్ష హోలీ! ఈ హోలీ పండుగ వేళ రాష్ట్రంలోని ప్రతి ఇంటా సంతోషాల సప్త వర్ణాలు వెల్లివిరియాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను!#HappyHoli — YS Jagan Mohan Reddy (@ysjagan) March 29, 2021 -
హోలీ శుభాకాంక్షలు చెప్పిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : హోలీ పండుగ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలుగు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. సుఖ సంతోషాలతో హోలీ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రంగుల పండుగ ప్రజల జీవితాలను రంగుల మయం చేయాలని, రానున్న రోజుల్లో ప్రజలకు అంతా మంచే జరగాలన్నారు.ఈ మేరకు వైఎస్ జగన్ గురువారం ఉదయం ట్విట్ చేశారు. On this Holi, wishing you and your family, happiness and prosperity always. #HappyHoli2019 — YS Jagan Mohan Reddy (@ysjagan) 21 March 2019 కాగా గత ఏడాది ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తిలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను పలువురు విద్యార్థులు కలిసి...ఆయనకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు హోలీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ ప్రజల మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తుందని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలకు దోహదపడుతుందని అన్నారు. జాతీయ సమగ్రతను ఈ పండుగ పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ రంగుల పండుగ ప్రజల జీవితాలను రంగుల మయం చేయాలని, రానున్న రోజుల్లో ప్రజలకు అంతా మంచే జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ ఒక ప్రకటనలో విడుదల చేసింది. -
వారి జీవితాలను రంగులమయం చేయండి : హీరో
దేశవ్యాప్తంగా హోలీ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే వీరిలో సాయిధరమ్ తేజ్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ‘అందరికీ హోలీ శుభాకాంక్షలు. ప్రతిజ్ఞ తీసుకోండి’ అంటూ అవయవధానానికి సంబంధించిన పోస్టర్‌ను ట్వీట్ చేశాడు సాయి. ‘మీకు అంధ ప్రపంచాన్ని రంగులమయం చేయగలిగే శక్తి ఉంది. ప్రతిజ్ఞ చేయండి’ అన్న కామెంట్స్ ఉన్న పోస్టర్‌ను ట్వీట్ చేశాడు సాయి ధరమ్ తేజ్. పండుగ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్‌పై అభిమానులు, సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇంటిలిజెంట్ సినిమాతో నిరాశపరిచిన సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. Wishing everyone a very happy #holi #takeapledge 🙏🏼 pic.twitter.com/pgzXA38kDz — Sai Dharam Tej (@IamSaiDharamTej) 2 March 2018 -
తెలుగు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు : వైఎస్ జగన్
సాక్షి, ప్రకాశం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు హోలి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రంగుల పండుగ ప్రజల జీవితాలను రంగుల మయం చేయాలని, రానున్న రోజుల్లో ప్రజలకు అంతా మంచే జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన పేరిట వైఎస్సార్ సీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక నేటి నుంచి ఏపీ ప్రత్యేక హోదా సాధన కోసం చేపట్టిన పోరాటానికి మద్ధతుగా నేటి ప్రజాసంకల్పయాత్రకు ఆయన విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఉపరాష్ట్రపతి, ప్రధాని హోలీ శుభాకాంక్షలు
దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ సందర్భంగా వాడే రంగులన్నీ మన దేశ భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నాలని వారు పేర్కొన్నారు. దేశంలో వయోభేద తారతమ్యం లేకుండా ఈ పండుగను జరుపుకొంటారని, హోలీ అనేది ఏ ఒక్కరికో సంబంధించినది కాదని చెప్పారు. మన జీవితాలన్నీ చక్కటి సంతోషాలతో ఆనందమయం కావాలని పేర్కొన్నారు.