Homes for the poor
-
ఓట్ల కోసం కేసీఆర్ కపట నాటకం
మధిర: పదేళ్లు అధికారంలో ఉండి చేయలేని పనులను పదిరోజుల్లో చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం ప్రజలను మోగించడమేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం జిల్లా మధిరలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తశుద్ధితో పనిచేసే సీఎం కావాలా, ఫామ్‌హౌస్‌లో పడుకునే సీఎం కావాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు క్యాంప్ ఆఫీసులో ప్రజల సమస్యలు తెలుసుకుని, వినతిపత్రాలు స్వీకరించడమే కాక అన్ని పారీ్టల ఎమ్మెల్యేల సమస్యలు వినేవారని, సచివాలయంలో అధికారులతో సమీక్షలు చేసేవారని గుర్తుచేశారు. ఇందులో ఏ ఒక్కటీ చేయలేని కేసీఆర్, ఆరు నెలలకోసారి అసెంబ్లీని మూడు రోజులు తూతూమంత్రంగా నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరు సీఎం అయితే ఏంటీ? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎవరు సీఎం అయితే ఏంటీ.. రాజీవ్ ఆరోగ్యశ్రీ, పేదలకు ఇళ్లు, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలవుతాయా, లేదా అన్నదే ముఖ్యమని భట్టి అన్నారు. కేసీఆర్ అనవసరంగా సీఎం గోల ఎత్తుకున్నారని మండిపడ్డారు. దోపిడీ, కమీషన్లు లేకుండా ప్రతీపైసా ప్రజల కోసం ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు నిధుల సమస్య రాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో పారీ్టపరంగానే తప్ప వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని భట్టివిక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. -
50 వేల మంది ఆర్థిక శ్రేయస్సు దెబ్బతింటుంది
సాక్షి, న్యూఢిల్లీ: పేదలకు ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు ఇచ్చిన స్టే 50 వేల మందికి పైగా పట్టాదారుల ప్రయోజనాలను ప్రభావితం చేస్తుందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను అనుమతించకపోతే ఈడబ్ల్యూఎస్ పరిధిలోని వారి ఆర్థిక శ్రేయస్సు దెబ్బతింటుందని తెలిపింది. ఈ నెల 3న ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరింది. ఈ ఏడాది మే 17 నాటి హైకోర్టు ఉత్తర్వులను పరిశీలిస్తే తాజా ఉత్తర్వులు పూర్తిగా అనుచితమని పేర్కొంది. రాజధానికి సంబంధించిన తీర్పు ఈ ఆదేశాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఇది సమాజంలో వెనుకబడిన వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణానికి సంబంధించినదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ప్రకారం భూ కేటాయింపులపై వాస్తవిక పరిశీలన చేయాలని కోరింది. కేటాయింపులన్నీ రాజధాని ప్రాంతానికి చెందిన వ్యక్తులకే జరిగినట్లు వివరించింది. లాండ్ పూలింగ్ స్కీం నిబంధనలు అతిక్రమించిందనడానికి ఎలాంటి కారణాలు లేవని పేర్కొంది. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఈడబ్ల్యూఎస్ వర్గాల ప్రయోజనం కోసం భూకేటాయింపు పరిశీలన కమిటీ దరఖాస్తులకు అనుగుణంగా కేటాయింపులు ఆమోదించినట్లు తెలిపింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు భూమిని కేటాయించాలని ఏపీసీఆర్డీఏ, ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు తెలిపింది. తదనంతరం గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు భూమి అప్పగించడం జరిగిందని, ఆ జిల్లాల్లోని ప్రజలకు 529.04 ఎకరాలు, 569.46 ఎకరాల భూమిని ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేటాయిస్తూ మేజిస్ట్రేట్లు ఉత్తర్వులు జారీ చేశారని తెలిపింది. చదవండి: పుంగనూరు ఘటన: పరారీలోనే కీలక సూత్రధారి, టీడీపీ నేత చల్లా బాబు కేటాయింపుదారులకు మంజూరు చేసిన పట్టాల్లో షరతు ప్రకారం పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాల పరిష్కారంపై నిర్మాణం/తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొనడాన్ని హైకోర్టు తప్పుపట్టిందని తెలిపింది. అయితే, పట్టాలో ఉపయోగించిన భాషను హైకోర్టు తప్పుగా అర్థం చేసుకోరాదని తెలిపింది. ఈడబ్యూఎస్ వర్గాలకు చెందిన ఉచిత హౌసింగ్‌కు బయట వ్యక్తి లేదా అంతర్గత వ్యక్తి ప్రాతిపదిక తీసుకొని వివక్ష చూపరాదని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని తెలిపింది. -
పేదల ఇళ్లపై ఇవీ నిజాలు.. బాబూ పవనూ అర్థమవుతుందా?
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొన్ని కార్యకమాలు చేపట్టడం ప్రభుత్వానికి మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏ స్కీమ్‌ను విమర్శించడానికి ప్రయత్నిస్తారో దానిపై ఆయనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆపై, ప్రజలలో ఆ స్కీమ్ గురించి మంచి చర్చ జరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. పవన్ కల్యాణ్ సినిమా నటుడు కావడం, ఆయన ఎక్కడకు వెళ్లినా కొంతమంది అభిమానులు అక్కడకు వెళ్లడం, ఆయనను తెలుగుదేశం పార్టీ మీడియా భుజాన వేసుకోవడంతో కనీసం ఇప్పుడైనా ఆ స్కీమ్ గురించి ప్రజలకు మరింతగా తెలియచేసే అవకాశం వస్తోంది. చదవండి: అబద్ధాలపై పేటేంట్ చంద్రబాబుకే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. పేదలకు ఇళ్లు ఇస్తే అక్కసా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలకు 31లక్షల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం సంకల్పించారు. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఎక్కడా ఈ స్థాయిలో పేదలకు స్థలాలు మంజూరు చేయలేదన్నది వాస్తవం. ఆ స్థలాలలో కేంద్ర ప్రభుత్వం స్కీంను కొంత వాడుకుని, తద్వారా వచ్చే నిధులకు తోడు రాష్ట్ర నిధులను జత చేసి ఇళ్లనిర్మాణం చేపడుతోంది. జగనన్న కాలనీల పేరుతో సాగుతున్న ఈ నిర్మాణాలు ఒకరకంగా చరిత్ర సృష్టిస్తున్నాయని చెప్పాలి. దీంతో ప్రతిపక్ష తెలుగుదేశంకు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాకు తేళ్లు, జెర్రులు పాకుతున్నట్లయింది. ఇది జగన్‌కు మంచి పేరు తెచ్చే స్కీమ్ కావడంతో దానిని ఎలా బదనాం చేయాలా అని ప్లాన్ చేసి రకరకాల ప్రచారాలు చేపట్టారు. ఆవ భూములని, స్కామ్‌లని, వర్షం పడితే నీళ్లు నిలుస్తాయని, కాలనీలపై ఒకటి కాదు.. అనేక రకాలుగా విషం కక్కుతూ తెలుగుదేశం మీడియా వార్తా కథనాలు ఇచ్చింది. టీడీపీ నేతలు పలు ఆరోపణలు చేస్తూ కథ నడిపారు. కాని దానివల్ల తమకు నష్టం కలుగుతుందని భావించారో,లేక మరే కారణమో తెలియదు కానీ, ఇళ్ల స్థలాలపై విమర్శల జోరు తగ్గించినట్లు అనిపించింది. రెడీ.. కెమెరా.. యాక్షన్ అదే సమయంలో తమకు పరోక్ష మిత్రుడుగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆ బాధ్యత అప్పగించినట్లు ఉన్నారు. ఆయన ఒక రకంగా అమాయకుడు, అంత పరిజ్ఞానం కూడా లేని వ్యక్తి కావడంతో, లేచిందే లేడీకి ప్రయాణం అన్నట్లుగా ఈ స్కీమ్ స్థలాలను పరిశీలించేందుకు వెళ్లారు. ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఆయా కాలనీలలోకి వెళ్లి లబ్ధిదారులను పట్టుకుని ఇంటర్వ్యూలు చేసి విమర్శల వర్షం కురిపించాలని భావించారు. కానీ వారికి విధి వక్రీకరించిందన్నట్లుగా వారు వెళ్లిన ఎక్కువ చోట్ల లబ్ధిదాదారులు నిలదీశారు. దీనికి సంబంధించి వచ్చిన కథనాలు, ప్రత్యేకించి సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు ఆసక్తి కలిగించాయి. కొందరు మహిళా లబ్దిదారులను జనసేన కార్యకర్తలతో మాట్లాడుతూ, తమకు వస్తున్న సదుపాయాన్ని చెడగొట్టవద్దని నిర్మొహమాటంగా చెప్పారు. ఒక్కో చోట పట్టణాన్ని బట్టి లబ్ధిదారులకు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు విలువైన స్థలాలు దక్కాయి. ఆ విషయాన్ని వారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. చివరికి పవన్ కల్యాణ్ ప్రోగ్రాంలో సైతం ఆయన ఊదరకొట్టిన ఉపన్యాసం తప్ప, లబ్దిదారులు ఎవరూ వచ్చి ఫిర్యాదు చేయలేదట. దాంతో ఆయన పార్టీ నేతలను తప్పు పట్టి వెళ్లిపోయారు. జనసేన నేతలు సరిగా ఆర్గనైజ్ చేయలేకపోయారన్నది ఆయన బాధ కావచ్చు. కానీ వాస్తవాలు తెలుసుకుని ఆయన వ్యవహరించకపోతే ఇలాగే చేదు అనుభవాలే మిగులుతాయి. ఇళ్ల స్థలాల స్కీము ఆలోచన చేయడమేపూర్తి సాచ్యురేషన్ మోడ్‌లో జగన్ చేశారు. అందువల్లే 31 లక్షల మంది పేదలకు ఈ స్కీమ్‌ను అమలు చేయడానికి ఆయన సిద్దమయ్యారు. దీనిని మెచ్చుకోకపోతే, పోనీ మొత్తం కుంభకోణం అంటూ ప్రచారం చేయడానికి తెగించారు. ఎక్కడైనా ఒకటి, రెండు చోట్ల ఎవైనా అవకతవకలు జరిగి ఉంటే వాటిని ప్రస్తావిస్తే తప్పు కాదు. కానీ అసలు స్కీమ్ కింద తీసుకున్న భూముల విలువకన్నా ఎక్కువ మొత్తం స్కామ్ జరిగిందని ఆరోపిస్తే ఎవరు నమ్ముతారు? మొత్తం 71 వేల ఎకరాల భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం సేకరిస్తే, అందులో ప్రభుత్వ భూమి పోను మిగిలిన 25 వేల ఎకరాల కొనుగోలుకు 11 వేల కోట్ల రూపాయల వ్యయం అయిందట. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఏకంగా పదిహేనువేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఇలాంటి ప్రకటనలే పవన్ అజ్ఞానాన్ని బయటపెడుతున్నాయని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఇక్కడ 40 ఇయర్స్ అబద్దాలు ఈ ధోరణి రాష్ట్ర రాజకీయాలలో తెలుగుదేశం ప్రవేశం తర్వాత బాగా పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడుతో పాటు, ముద్దుకృష్ణమనాయుడు వంటివారు ఆధారాలు లేని ఆరోపణలు చేయడంతో సిద్దహస్తులుగా పేరొందారు. నిజంగానే ఏ అంశంపైన అయినా పరిశీలన చేసి విమర్శ చేయదలిస్తే, క్షుణ్ణంగా అధ్యయనం చేసి వెళ్లాలి. కానీ ఎక్కువ సందర్భాలలో పవన్ అరకొర పరిజ్ఞానంతో వెళ్లి అభాసుపాలు అవుతున్నట్లు అనిపిస్తుంది. తెలుగుదేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఈనాడులో వచ్చిన విషపూరిత కథనాల ఆధారంగా ఆయన ఇలాంటి యాత్రలు పెట్టుకుంటున్నారు. ఒక కుట్ర ప్రకారం ముందుగా ఈనాడు, తదితర తెలుగుదేశం మీడియాలలో సంబంధిత ఆరోపణలతో కథనాలు ఇవ్వడం, ఆ తర్వాత తెలుగుదేశం, జనసేన వంటి పార్టీలు ప్రకటనలు చేయడం నిత్యకృత్యం అయింది. పింగళి గారు.. గమనించారా? జనసేన అధినేత వీకెండ్ షూటింగ్ లేని సమయంలో ఇలాంటి యాత్రలు పెట్టుకుని తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈనాడు మీడియా అయితే పూర్తి అయిన ఇళ్ల గురించి వార్తలు ఇవ్వదు. పూర్తి కానీ ఇళ్ల గురించే వ్యతిరేక కథనాలు ఇస్తూ, అసలేమీ జరగడం లేదేమో అన్న భావన క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజ్, నీటి సదుపాయం వంటివాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుంటే టీడీపీ మీడియా మాత్రం ప్రతిదానిని తప్పుపడుతూ, నిందలు మోపుతూ ప్రజలను గందరగోళం చేయడానికి తంటాలు పడుతోంది. ఆ సంగతి పక్కన బెడితే సోషల్ మీడియాలో పవన్ గురించి ఒక వీడియో వచ్చింది. ఆయన బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడుతున్నట్లుగా ఉంది. అందులో జాతీయ పతాకాన్ని తయారు చేసింది జవహర్ లాల్ నెహ్రూ అన్నట్లుగా ఉంది. అది ఆయన వీడియోలాగే ఉంది. దీనిని బట్టే పవన్ కల్యాణ్ రాజకీయాలలోనే కాదు.. చరిత్ర విషయంలో కూడా అంత పరిజ్ఞానంతో మాట్లాడడం లేదన్నది అర్థం అవుతుంది. రాజకీయాలలో ముఖ్యమైన భూమిక పోషించాలని అనుకుంటే, అందుకు తగ్గట్లుగా విషయ పరిజ్ఞానం పంపొందించుకోవాలన్న సంగతి పవన్ కల్యాణ్‌కు ఎప్పటికి అర్ధం అవుతుందో! -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ మరింత వేగవంతం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు సొంతిల్లు ఉండాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే జగనన్న కాలనీల్లో నిరుపేదలకు ఇళ్ల స్థలాలను అందించింది. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోని పేదలకు సైతం సొంతింటి కలను నిజం చేస్తూ వివిధ కేటగిరీల్లో టిడ్కో ఇళ్లను అందుబాటులోకి తెచ్చింది. రెండు రోజుల క్రితం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాపురంలో ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించి పట్టణ పేదల కలను నిజం చేస్తోంది. జి+3 విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 88 మునిసిపాలిటీల్లో 2,62,216 ఇళ్లను రూ.21,167.86 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటిలో 300 చ.అ. విస్తీర్ణంలో 1,43,600 ఇళ్లు, 365 చ.అడుగుల్లో 44,304 ఇళ్లు, 430 చ.అడుగుల్లో 74,312 ఇళ్లను కడుతోంది. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన యూనిట్లను లబ్ధిదారులకు అందించడంలో కీలకమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు. టిడ్కో ఇళ్లు నిర్మించిన మునిసిపాలిటీల్లోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పని ఒత్తిడికి తగ్గట్టుగా రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అన్ని పనిదినాల్లో రిజిస్ట్రేషన్లు.. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 2,62,216 ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో మార్చి చివరినాటికి 20 వేల ఇళ్లను లబ్ధిదారులకు పూర్తి హక్కులతో అందించాలన్న లక్ష్యంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. సాధారణంగా మంగళ, శుక్రవారాల్లో రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉంటాయని ఆ రోజుల్లో టిడ్కో ఇళ్లను రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా వెంకటాపురంలో శుక్రవారం శ్రీకారం చుట్టారు. అయితే, లబ్ధిదారులు ఎక్కువ మంది ఉండడంతో అన్ని పనిదినాల్లో రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించారు. ఒత్తిడి ఎక్కువగా ఉండే నగరాల్లోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వారంలో ఒకటి లేదా రెండు రోజులు, ఒత్తిడి తక్కువగా ఉండే చిన్న పట్టణాల్లోని కార్యాలయాల్లో అన్ని పనిదినాల్లో రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణం పూర్తయిన ఉభయగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నారు. కాగా 2.62 లక్షల ఇళ్లను దాదాపు రూ.800 కోట్లకు పైగా ఖర్చుతో ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు అందిస్తోంది. వేగవంతం చేయండి.. లబ్ధిదారులకు వీలైనంత త్వరగా ఇళ్లను అందజేయాలని ఏపీ టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ సూచించారు. విశాఖపట్నంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల టిడ్కో అధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. మార్చి నెలాఖరు నాటికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో పరిధిలో 3,100 రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలన్నారు. బ్యూటిఫికేషన్ కింద టిడ్కో ఇళ్ల సముదాయాల పరిసరాల్లో 35 వేల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
టీడీపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు..
సాక్షి, విజయవాడ: పేదలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి చేస్తుంటే ప్రతిపక్షం కుట్ర చేస్తోందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘మొదట 25 లక్షలు అనుకున్నాం, 30 లక్షలు పేదలకు ఇళ్ళు స్థలాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. భూములు స్వచ్చందంగా ఇచ్చారు. భూ సేకరణ ద్వారా పేదలకు భూమి ఇచ్చేందుకు సిద్ధం అవుతుంటే ప్రతిపక్షం అడ్డంకులు సృష్టిస్తుంది. కోర్టులు నుంచి స్టే తీసుకు వచ్చి టీడీపీ కుట్రలు చేస్తోందని’’ మంత్రి బొత్స ధ్వజమెత్తారు. టీడీపీ చేస్తున్న కుట్రలను ప్రజలను గమనిస్తున్నారని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేపట్టలేదని మండిపడ్డారు. (‘మాట వినకుంటే ఇళ్లు ముట్టడిస్తాం’) తండ్రి స్ఫూర్తితో.. నాడు దివంగత మహానేత వైఎస్సార్ ప్రతి పేదవారికి ఇళ్లను అందిస్తే.. అదే స్ఫూర్తితో నేడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ పేదలకు ఇళ్ల స్థలాలను అందించేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఈ రోజు పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలు ఆలస్యం కావచ్చేమో గానీ ఇవ్వడం మాత్రం పక్కా అని మంత్రి బొత్స స్పష్టం చేశారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు.. విజయవాడ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు బొత్స తెలిపారు. నగరంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. సింగ్‌నగర్‌లో రూ.10 కోట్ల వ్యయంతో మోడల్ పార్క్ అభివృద్ధికి శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. ఏడాది లోపు పూర్తి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. -
పేదలకు ఇంటి స్థలాలపై విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్లపై గురువారం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు విచారణ బుధవారానికి వాయిదా వేశారు. దురుద్దేశపూర్వకంగా వేసిన పిటిషన్లలో ఏమాత్రం నిజం లేదని ప్రభుత్వం తరఫున సమగ్రమైన వాదనలు వినిపిస్తామని సీనియర్ న్యాయవాది, అసెంబ్లీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ మెట్టా చంద్రశేఖర్ రావు అన్నారు. మరోవైపు ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లలో మద్యం ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. బార్ల యజమానుల పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. -
ఆ ఘనత సీఎం వైఎస్ జగన్‌దే..
సాక్షి, చిత్తూరు: తొమ్మిది నెలలకే 90 శాతం హామీలు నెరివేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. హంద్రీనీవా ద్వారా కుప్పం కు నీరందిస్తామని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో ఉపాధి హామీ పనుల్లో భారీ అవకతవకలు జరిగాయని తెలిపారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలన్నీ ఆయన అనుచరుల కోసమేనని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. -
బాబు సర్కారులో అన్నీ భారాలే..!
రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్ర బాగుపడాలంటే తానే దిక్కంటూ.. అలవికాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. ఆ తర్వాత ప్రజలను వంచించింది. ఐదేళ్లూ ‘పన్ను’ గాట్లతో సామాన్యుల రక్తం జలగలా పీల్చింది. జేబులు కొల్లగొట్టింది. ఆర్టీసీ, విద్యుత్ చార్జీలతోపాటు.. ఆస్తి, ఇతర పన్నులను భారీగా పెంచేసింది. పేద, మధ్యతరగతివర్గాల వారిపై మోయలేని భారం మోపి వారి నడ్డివిరిచింది. సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): విద్యుత్ వినియోగదారులపై 2016లో చార్జీల భారం మోపారు. ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలో కేటగిరీ బీ–2లో గృహేతర, వాణిజ్య వినియోగదారుల సర్వీసులు 73,039 ఉండగా వాటి ద్వారా ప్రస్తుతం నెలకు సుమారు 1.34 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగమవుతోంది. దీని నిమిత్తం నెలకు సుమారు రూ.12.39 కోట్లను ఆయా వాణిజ్య వినియోగదారులు చెల్లిస్తున్నారు. ఈ కేటగిరీపై యూనిట్‌కు 18 పైసలు భారం వేయడంతో నెలకు సుమారు రూ.24 లక్షలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. అలాగే జిల్లాలోని 4,331 పరిశ్రమలు ఇప్పటి వరకూ ప్రతినెలా సుమారు 1.19 కోట్ల యూనిట్ల విద్యుత్ వినయోగిస్తూ సుమారు రూ.8.23 కోట్ల మేరకు బిల్లులు చెల్లిస్తున్నారు. విద్యుత్ చార్జీల మోత పరిశ్రమల విద్యుత్ వినియోగంపై యూనిట్‌కు 13 పైసలు పెంచడంతో వారిపై సుమారు రూ.15.47 లక్షల రూపాయలు నెలకు అదనంగా భారం పడింది. ఇదిలా ఉండగా విద్యుత్ చార్జీల పెంపు విషయంలో పంచాయతీలను, మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కూడా ప్రభుత్వం విడిచిపెట్టలేదు. ప్రజలకు అత్యవసరమైన వీధిలైట్ల వినియోగం, నీటి సరఫరాకు వినియోగించే విద్యుత్‌పై సైతం పెంపుదల భారం పడింది. వాటిపైనా యూనిట్‌కు 11 నుంచి 13 పైసలు పెంచారు. దీంతో అప్పటికే సుమారు రూ.142 కోట్ల విద్యుత్ బిల్లులు తూర్పుప్రాంత విద్యుత్ సంస్థకు బకాయిపడ్డ పంచాయితీలు ప్రజాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించే అంశంలో పునరాలోచనలో పడ్డాయి. వీటితోపాటు విద్యా వ్యవస్థను కూడా చంద్రబాబు ఉపేక్షించలేదు. ప్రభుత్వ రంగ హాస్టళ్లు, పాఠశాలలపైనా యూనిట్‌కు 14 పైసలు చొప్పున భారం వేశారు. మొత్తంగా వివిధ కేటగిరీల్లో పెంచిన విద్యుత్ చార్జీల ప్రభావం జిల్లా వాసులపై నెలకు రూ.కోటి, ఏడాదికి రూ.12కోట్లు పడింది. జిల్లా ప్రజలపై ఏటా అదనపు భారం ఇలా.. రూ.కోట్లలో విద్యుత్ చార్జీలు -12 కోట్లు ఇంటిపన్ను- 33 కోట్లు ఆర్టీసీ వడ్దన - 33.60 కోట్లు ఆర్టీసీ చార్జీలు ఇలా.. ఇక సామాన్య ప్రజల రవాణా అవసరాలు తీర్చే ఆర్టీసీపైనా ప్రభుత్వం కనికరం చూపలేదు. అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే 2015లో ఆర్టీసీ ప్రయాణ టిక్కెట్ ధరలను అమాంతం పెంచేసింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ప్రయాణించే పల్లెవెలుగు (ప్యాసింజర్) బస్సుల టిక్కెట్ ధర అప్పట్లో కిలో మీటరుకు 59 పైసలు ఉండగా దానిపై 5 శాతం ధర పెంచింది. అలాగే ఎక్స్‌ప్రెస్ బస్సుల ధరలు కిలో మీటరుకు 79 పైసలుండగా దానిని 8 పైసలు పెంచి 87 చేయగా, డీలక్స్ బస్సులకు 89 పైసలుండగా 9 పైసలు పెంచి 98 పైసలు చేసింది. వీటితో పాటు సూపర్ లగ్జరీ బస్సులకు 105 పైసలుండగా 11 పైసలు పెంచి 116 పైసలు, ఇంద్ర బస్సులకు 132 పైసలుండగా 14 పైసలు పెంచి 146 పైసలు, గరుడ బస్సులకు 155 పైసలుండగా 16 పైసలు పెంచి 171 పైసలు, గరుడ ప్లస్ బస్సులకు 165 పైసలుండగా 17 పైసలు పెంచి 182 పైసలుగా నిర్ణయించి వసూలు చేయడం ప్రారంభించింది. ‘టోలూ’ వలిచింది ఇదిలా ఉంటే.. టోల్ గేట్ చార్జీలు మినహాయిస్తే ఆర్టీసీ చార్జీలు తగ్గే అవకాశం ఉన్నా.. ఆ చార్జీల బారాన్ని కూడా ప్రయాణికులపైనే మోపింది. బస్సు ప్రయాణికుడు ప్రతి టోల్‌గేట్‌పై అక్షరాలా రూ.ఏడు చెల్లించాల్సి వస్తోదంటే ప్రభుత్వం వారిపై ఏవిధంగా చీకటి దెబ్బలు వేసిందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఆర్టీసీ పశ్చిమ రీజియన్ పరిధిలో రోజుకు సుమారు 1.08 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా వారందరిపై ఈ భారంపడుతోంది. ‘సెస్సా’దియ్యా.. మరో విచిత్రం ఏమిటంటే సేఫ్టీ సెస్ పేరిట ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులపై అదనపు భారం వేసి జేబులు గుల్ల చేస్తోంది. ప్రతి ఎక్స్‌ప్రెస్ టిక్కెట్‌పై ఒక రూపాయిని సేఫ్టీ సెస్‌గా వసూలు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం చీకటి దోపిడీలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఇంటి పన్నుపోటూ ఎక్కువే పేదలకు నిలువ నీడ కోసం గృహాలు కట్టించి ఇవ్వాల్సిన ప్రభుత్వం, రెక్కల కష్టంతో తినీ తినకా రూపాయి, రూపాయి పోగుచేసుకుని ఇల్లు కట్టుకుంటే దానిపై పన్నుల రూపంలో భారీ దోపిడీకి తెర లేపింది. గత ఏడాది తాజాగా ఇంటిపన్నును అమాంతం 20 శాతం పెంచేసింది. దీంతో సామాన్యులు సతమతమవుతున్నారు. పల్లెల్లోనూ పన్నులు భారీగా పెరిగాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఇంటి పన్ను డిమాండ్ గత ఏడాదికి పూర్వం రూ.165 కోట్లు ఉండగా, గత ఏడాది నుంచి ఆ డిమాండ్ కాస్తా మరో రూ.33 కోట్లు పెరిగి సుమారు రూ.198 కోట్లకు చేరుకుంది. ఏటా ఇది పెరిగే అవకాశం ఉంది. అద్దెలూ పెరిగాయి.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలకు గృహాలు ఇస్తామని చెప్పడం తప్ప ఇచ్చిన పాపాన పోలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ నియోజకవర్గాల్లో కొన్ని ఇళ్ళు నిర్మించిన ప్రభుత్వం వాటిని కేవలం టీడీపీ వారికే కేటాయించింది. దీంతో అర్హులు అద్దె ఇళ్లలోనే మగ్గాల్సి వస్తోంది. ఇంటిపన్నులు పెరగడంతో యజమానులు అద్దెలూ పెంచేశారు. సామాన్యులపై భారం సిగ్గు చేటు ఇంటిపన్ను రూపంలో 20 శాతం పెంచడం దారుణం. సామాన్యులపై ప్రభుత్వం ఈ విధంగా కక్ష సాధిస్తోంది. ప్రభుత్వానికి ఆదాయం కావాలంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప కష్టపడి ఇళ్ళు నిర్మించుకున్న వారిపై పన్నుల భారం మోపడం సబబు కాదు. – కడలి రామ్మోహనరావు, ఏలూరు టీడీపీ పాలనలో నరకమే.. టీడీపీ అధికారంలోకి వస్తోందంటేనే సామాన్య మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో తొమ్మిదేళ్ళ పాలనలో నరకం చూపించిన ప్రభుత్వం అనంతరం 2014 నుంచి మరోసారి తన ప్రతాపం చూపుతోంది. ఈ ప్రభుత్వాన్ని భరించడం మా వల్ల కాదని ప్రజలు లబోదిబోమంటున్నారు. – మువ్వల నాగేశ్వరరావు, ఏలూరు అభివృద్ధి శూన్యం టీడీపీ అధికారం చేపట్టిన ఏడాదికే పన్నుల మదింపు తీసుకురావడంతో ఇంటి పన్నులు పెరుగుతున్నాయి. ఏటా ఐదు శాతం చొప్పున పన్నును పెంచి వసూలు చేస్తున్నారు. భవనం, భూముల విలువను పరిగణనలోకి తీసుకుని పంచాయతీ పన్నులు విధించడంతో పేదలు, సామాన్యులకు భారంగా మారింది. రోడ్లు, డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో ఏ పని చేపట్టాలన్నా పంచాయతీ పన్నులతోపాటు, ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారపడుతున్నాయి. –గెడ్డం రవీంద్రబాబు, మాజీ ఉపసర్పంచ్, సమిశ్రగూడెం -
48 గంటల ఓయూ బంద్‌కు పిలుపు
-
తరిమి కొడతం
కేసీఆర్ ప్రకటనకు నిరసనగా ఓయూలో ఆందోళనలు భూమి కోసం ఓయూలో అడుగుపెడితే రాళ్లతో దాడి చేస్తాం కేసీఆర్ ప్రకటనపై విద్యార్థి సంఘాల హెచ్చరిక రెండోరోజూ ఆందోళనలతో అట్టుడికిన ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం ముట్టడి.. విద్యార్థుల అరెస్ట్ సీఎం దిష్టిబొమ్మకు శవయాత్ర, దహనం 48 గంటల ఓయూ బంద్‌కు పిలుపు, 29న భారీ బహిరంగ సభ 2న జరిగే తెలంగాణ ఉత్సవాలను అడ్డుకుంటామని ప్రకటన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి నిర్ణయం హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన భూమిలో పేదలకు ఇళ్లు నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనపై వర్సిటీ విద్యార్థులు భగ్గుమంటున్నారు. వరుసగా రెండోరోజు కూడా ఆందోళనలతో ఓయూ అట్టుడికింది. మంగళవారం పలు విద్యార్థి సంఘాలు వేర్వేరుగా చేపట్టిన నిరసన కార్యక్రమాలతో వర్సిటీ దద్దరిల్లింది. కాగా, సీఎం నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు బుధ, గురువారాల్లో(20, 21 తేదీల్లో) 48 గంటల ఓయూ బంద్‌కు పిలుపునిచ్చాయి. అలాగే పలు ఇతర డిమాండ్లతో ఈ నెల 29న ఓయూలో లక్ష మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ వెల్లడించింది. మంగళవారం నాటి ఆందోళనల్లో ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ, తెలంగాణ విద్యార్థి జేఏసీ, ఓయూ విద్యార్థి జేఏసీ, బీసీ విద్యార్థి సంఘం, బీసీ ఉద్యమ వేదిక, టీఎన్ఎస్ఎఫ్, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ, నవ తెలంగాణ విద్యార్థి జేఏసీ, పీడీఎస్‌యూ సంఘాలు పాల్గొన్నాయి. ఆయా సంఘాల నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఏబీవీపీ కార్యకర్తలు రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడించగా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పేదల ఇళ్ల నిర్మాణాలకు తావుు వ్యతిరేకం కాదని, గ్రేటర్ పరిధిలో వేలాది ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వవచ్చని విద్యార్థి నేతలు పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా ఓయూలో ఇళ్లు నిర్మిస్తామంటూ ఓట్లు సాధించుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను బస్తీ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఓయూ భూములను ఆక్రమించాలని చూస్తే రాళ్లతో తరిమి కొడతామని ఓయూ జేఏసీ నేతలు హెచ్చరించారు. సీఎం ప్రసంగాన్ని అడ్డుకునేందుకు విఫలయత్నం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం బౌద్ధనగర్‌లోని కవుూ్యనిటీ హాలులో సీఎం ప్రసంగిస్తారని తెలుసుకున్న 8 మంది విద్యార్థులు వుుందుగానే అక్కడకి చేరుకున్నారు. అనువూనాస్పదంగా తిరుగుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సీఎం పర్యటన వుుగిసిన తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల జేశారు. ఓయుూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తారన్న అనువూనంతో సీఎం కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ నేతలను తిరగనివ్వం.. ఓయూ భూములపై సీఎం ప్రకటనకు నిరసనగా వివిధ విద్యార్థి సంఘాలు 48 గంటల ఓయూ బంద్‌కు పిలుపునిచ్చాయి. బుధవారం నవ తెలంగాణ విద్యార్థి జేఏసీ, గురువారం తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ బంద్ చేపట్టనున్నాయి. ఓయూ భూములను తీసుకోవద్దని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయొద్దని, లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న ఓయూలో భారీ బహిరంగ సభను నిర్వహించనునట్లు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కల్యాణ్ తెలిపారు. వర్సిటీ భూములపై కేసీఆర్ చేసిన ప్రకటనను ఉపసంహరించుకోకుంటే టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను తెలంగాణలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. జూన్ 2న జరిగే ఆవిర్భావ ఉత్సవాలనూ అడ్డుకుంటామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు. ఓయూ భూముల పరిరక్షణకు కోర్టును ఆశ్రయించనున్నట్లు ఏబీవీపీ నేత రాజు వెల్లడించారు.