తరిమి కొడతం
కేసీఆర్ ప్రకటనకు నిరసనగా ఓయూలో ఆందోళనలు
భూమి కోసం ఓయూలో అడుగుపెడితే రాళ్లతో దాడి చేస్తాం
కేసీఆర్ ప్రకటనపై విద్యార్థి సంఘాల హెచ్చరిక
రెండోరోజూ ఆందోళనలతో అట్టుడికిన ఉస్మానియా యూనివర్సిటీ
రిజిస్ట్రార్ కార్యాలయం ముట్టడి.. విద్యార్థుల అరెస్ట్
సీఎం దిష్టిబొమ్మకు శవయాత్ర, దహనం
48 గంటల ఓయూ బంద్‌కు పిలుపు, 29న భారీ బహిరంగ సభ
2న జరిగే తెలంగాణ ఉత్సవాలను అడ్డుకుంటామని ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి నిర్ణయం
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన భూమిలో పేదలకు ఇళ్లు నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనపై వర్సిటీ విద్యార్థులు భగ్గుమంటున్నారు. వరుసగా రెండోరోజు కూడా ఆందోళనలతో ఓయూ అట్టుడికింది. మంగళవారం పలు విద్యార్థి సంఘాలు వేర్వేరుగా చేపట్టిన నిరసన కార్యక్రమాలతో వర్సిటీ దద్దరిల్లింది. కాగా, సీఎం నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు బుధ, గురువారాల్లో(20, 21 తేదీల్లో) 48 గంటల ఓయూ బంద్‌కు పిలుపునిచ్చాయి. అలాగే పలు ఇతర డిమాండ్లతో ఈ నెల 29న ఓయూలో లక్ష మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ వెల్లడించింది. మంగళవారం నాటి ఆందోళనల్లో ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ, తెలంగాణ విద్యార్థి జేఏసీ, ఓయూ విద్యార్థి జేఏసీ, బీసీ విద్యార్థి సంఘం, బీసీ ఉద్యమ వేదిక, టీఎన్‌ఎస్‌ఎఫ్, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ, నవ తెలంగాణ విద్యార్థి జేఏసీ, పీడీఎస్‌యూ సంఘాలు పాల్గొన్నాయి. ఆయా సంఘాల నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఏబీవీపీ కార్యకర్తలు రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడించగా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పేదల ఇళ్ల నిర్మాణాలకు తావుు వ్యతిరేకం కాదని, గ్రేటర్ పరిధిలో వేలాది ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వవచ్చని విద్యార్థి నేతలు పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా ఓయూలో ఇళ్లు నిర్మిస్తామంటూ ఓట్లు సాధించుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను బస్తీ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఓయూ భూములను ఆక్రమించాలని చూస్తే రాళ్లతో తరిమి కొడతామని ఓయూ జేఏసీ నేతలు హెచ్చరించారు.
సీఎం ప్రసంగాన్ని అడ్డుకునేందుకు విఫలయత్నం
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం బౌద్ధనగర్‌లోని కవుూ్యనిటీ హాలులో సీఎం ప్రసంగిస్తారని తెలుసుకున్న 8 మంది విద్యార్థులు వుుందుగానే అక్కడకి చేరుకున్నారు. అనువూనాస్పదంగా తిరుగుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సీఎం పర్యటన వుుగిసిన తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల జేశారు. ఓయుూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తారన్న అనువూనంతో సీఎం కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
టీఆర్‌ఎస్ నేతలను తిరగనివ్వం..
ఓయూ భూములపై సీఎం ప్రకటనకు నిరసనగా వివిధ విద్యార్థి సంఘాలు 48 గంటల ఓయూ బంద్‌కు పిలుపునిచ్చాయి. బుధవారం నవ తెలంగాణ విద్యార్థి జేఏసీ, గురువారం తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ బంద్ చేపట్టనున్నాయి. ఓయూ భూములను తీసుకోవద్దని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయొద్దని, లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న ఓయూలో భారీ బహిరంగ సభను నిర్వహించనునట్లు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కల్యాణ్ తెలిపారు. వర్సిటీ భూములపై కేసీఆర్ చేసిన ప్రకటనను ఉపసంహరించుకోకుంటే టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులను తెలంగాణలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. జూన్ 2న జరిగే ఆవిర్భావ ఉత్సవాలనూ అడ్డుకుంటామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు. ఓయూ భూముల పరిరక్షణకు కోర్టును ఆశ్రయించనున్నట్లు ఏబీవీపీ నేత రాజు వెల్లడించారు.