
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్లపై గురువారం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు విచారణ బుధవారానికి వాయిదా వేశారు. దురుద్దేశపూర్వకంగా వేసిన పిటిషన్లలో ఏమాత్రం నిజం లేదని ప్రభుత్వం తరఫున సమగ్రమైన వాదనలు వినిపిస్తామని సీనియర్ న్యాయవాది, అసెంబ్లీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ మెట్టా చంద్రశేఖర్ రావు అన్నారు.
మరోవైపు ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లలో మద్యం ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. బార్ల యజమానుల పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment