Homoeo counseling
-
హోమియో కౌన్సెలింగ్స్
ఫైబ్రాయిడ్స్‌కు పరిష్కారం ఉందా? నా వయసు 43 ఏళ్లు. గత కొంతకాలంగా గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని చెప్పారు. అయితే భవిష్యత్తులో అవి మళ్లీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. హోమియో చికిత్సతో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? – ఎమ్. రమాదేవి, హైదరాబాద్ గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా ఈ యుటెరైన్ ఫైబ్రాయిడ్స్‌ను మూడు రకాలుగా విభజించవచ్చు. 1) సబ్‌సీరోజల్ ఫైబ్రాయిడ్స్ 2) ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ 3) మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. కారణాలు : ఈ ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి. లక్షణాలు : గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి లక్షణాలు ఉంటాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో, నడుములో నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడి మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. చికిత్స: జెనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. - డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ గ్యాస్ట్రిక్ అల్సర్ తగ్గుతుందా? నా వయసు 37 ఏళ్లు. ఇటీవల కండుపులో మంట, వికారంతో డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేయించి, అల్సర్ ఉందని చెప్పారు. నా సమస్యకు హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – పి. రాజారావు, మిర్యాలగూడ మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో ఆమ్లం (యాసిడ్) అవసరం. అందుకే ఆమ్లం ఎక్కువైతేనే కాదు... తక్కువైనప్పుడూ అల్సర్లు తయారవుతాయి. జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్స్‌ను గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్‌కు కారణమవుతుంది. సాధారణంగా ఇతర ఏ బ్యాక్టీరియా అయినా కడుపులోని ఆమ్లంలో చనిపోతుంది. కానీ ఈ ఒక్క బ్యాక్టీరియా మాత్రమే ఆమ్లాన్ని తట్టుకొని జీవిస్తుంది. పైగా ఆమ్లం అధిక ఒత్తిడికి కూడా దోహదం చేస్తుంది. దాంతో జీర్ణశయంలో ఆల్సర్లు పెరుగుతాయి. కారణాలు : ♦ 80 శాతం మందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అల్సర్లు వస్తాయి. ♦ చాలామందిలో కడుపులో పుండ్లు రావడానికి హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ముఖ్యమైనది. ♦ మానసిక ఒత్తిడి, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ♦ మద్యపానం, పొగతాగడం ∙వేళకు ఆహారం తీసుకోకపోవడం ♦ కలుషితమైన ఆహారం, నీరు వంటి ద్వారా క్రిములు చేరి, అవి జీర్ణవ్యవస్థలో విషపదార్థాలను విడుదల చేసి పుండ్లు రావడానికి కారణమవుతాయి. లక్షణాలు : ♦ కడుపులో నొప్పి, మంట, ఉబ్బరం ♦ ఛాతీలో నొప్పి, పుల్లటి తేన్పులు, మలబద్దకం ♦ తలనొప్పి, బరువు తగ్గడం, రక్తవాంతులు, రక్త విరేచనాలు ♦ కొంచెం తిన్నా కడుపు నిండినట్లు ఉండటం, ఆకలి తగ్గడం ♦ నోటిలో ఎక్కువగా నీళ్లు ఊరడం. నివారణ జాగ్రత్తలు : ♦ పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవాలి ♦ మద్యపానం, పొగతాగడం అలవాట్లు మానేయాలి ♦ కారం, మసాలా ఆహారాల విషయంలో జాగ్రత్త వహించాలి ♦ కంటినిండా నిద్రపోవాలి ♦ ఒత్తిడి తగ్గడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి ♦ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. చికిత్స : గ్యాస్ట్రిక్ అల్సర్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆర్సనిక్ ఆల్బ్, యాసిడ్ నైట్రికమ్, మెర్క్‌సాల్, గ్రాఫైటిస్, ఫాస్ఫరస్ వంటి మందులు ఈ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వీటిని తీసుకోవాలి. - డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఒంటినిండా తెల్లమచ్చలు తగ్గుతాయా? నా శరీరమంతా తెల్లమచ్చలు వచ్చాయి. నలుగురిలో వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బొల్లి అని చెప్పారు. ఇది ఎందుకు వస్తుంది. హోమియో మందులతో తగ్గుతుందా? – కె. నాగమల్లేశ్వరరావు, సత్తెనపల్లి చర్మంలో రంగునిచ్చే మెలనోసైట్స్ అనే కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్’ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైమ్ అనేక కారణాల వల్ల క్షీణిస్తుంది. ఫలితంగా మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ఈ టైరోసినేజ్ అనే ఎంజైమ్ తగ్గుదలకు ఈ కింది పరిస్థితులు కారణం కావచ్చు. కారణాలు : ♦ దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి ∙కొన్నిసార్లు కాలిన గాయాలు ∙పోషకాహారలోపం ♦ జన్యుపరమైన కారణాలు ♦ దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు ∙మందులు, రసాయనాలు ♦ కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్లలో లోపాలు ♦ వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం వంటి అంశాలు బొల్లి వ్యాధి వచ్చేందుకు కొన్ని కారణాలు. లక్షణాలు : మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. మానసికంగా, శారీరకంగా రోగిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న తర్వాత డాక్టర్లు మందును సూచిస్తారు. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు చికిత్సను అందించవచ్చు. - డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
పొద్దున్నే కీళ్లు పట్టేస్తున్నాయి... ఎందుకిలా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. నేను పదేళ్లుగా కీళ్లనొప్పుల సమస్యతో బాధపడుతున్నాను. పొద్దున్న లేవగానే కీళ్లన్నీ పట్టేసి జ్వరం వచ్చినట్లుగా ఉండి, మధ్యాహ్నానికి ఉపశమనం కలుగుతోంది. ఈఎస్ఆర్ పెరిగి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చిందన్నారు. ఈ కీళ్లనొప్పులకు హోమియోలో చికిత్స ఉందా? – సుమతి, కర్నూలు మీకు వచ్చిన వ్యాధిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో ఒకర కం. మన శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడటానికి, వాటితో పోరాడటానికి ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఆ రక్షణ వ్యవస్థ ఒక్కోసారి పొరబడి తన సొంత శరీరం పైనే దాడి చేస్తే వచ్చే సమస్యల్లో ఇది ఒకటి. ఈ వ్యాధి శరీరంలోని ఇరుపక్కలా సమాంతరంగా వ్యాప్తి చెందుతుంది. కీళ్లు తీవ్రమైన వాపునకు గురికావడంతో వాటి కదలికలు పూర్తిగా స్తంభిస్తాయి. దాంతో కీళ్లు వైకల్యానికి గురికావడం, కీళ్లనొప్పులు, వాపు, కీళ్లు పట్టివేయడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. కీళ్లతోబాటు కళ్లు, నోరు, ఊపిరితిత్తులకు కూడా వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఒక్కోసారి ఒకటి కంటే ఎక్కువ కీళ్లలో కనిపిస్తుంది. అయితే మొదట చేతివేళ్లు, కాలివేళ్ల వంటి చిన్న చిన్న కీళ్లలో మొదలై ఆ తర్వాత మోచేయి, మోకాలు, తుంటి వంటి పెద్ద కీళ్లలోకి పాకుతుంది. కారణాలు : ∙శరీరంలోని జీవక్రియల్లో అసమతుల్యత, రోగ నిరోధక వ్యవస్థలోని మార్పుల వల్ల ఈ జబ్బు వస్తుంది. ∙శారీరక, మానసిక ఒత్తిడి ∙పొగతాగడం, మద్యం అలవాటు ఉన్నవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. ∙ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అస్సలు పాటించని వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. లక్షణాలు : ∙నిరాశ, అలసట, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం ∙మడమలు, చేతి ఎముకలపై చిన్న గడ్డలు రావడం ∙ఉదయం లేచిన వెంటనే కీళ్లు బిగపట్టినట్లుగా ఉండి, నొప్పి ఉండటం ∙ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం, ఊపిరితిత్తులు గట్టిపడటం ∙రక్తహీనత, జ్వరం వంటివి. నిర్ధారణ పరీక్షలు : సీబీపీ, ఈఎస్ఆర్, ఎక్స్–రే, ఎమ్మారై, ఆర్.ఏ. ఫ్యాక్టర్, ఏఎన్ఏ, ఎల్ఎఫ్టీ. చికిత్స : రోగి మానసిక, శారీరక లక్షణాలను అనుసరించి చికిత్స చేయాల్సి ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రయోనియా, రస్టాక్స్, కాల్చికమ్, ఆర్సినికమ్, లైకోపోడియమ్, నేట్రమ్మూర్ మొదలైన మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే వ్యాధి సంపూర్తిగా నయమవుతుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ మైగ్రేన్ పెద్ద సమస్యగా మారిపోయింది..? నా వయసు 32 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నాకు కొంతకాలంగా తలలో ఒకవైపు విపరీతమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే మైగ్రేన్ అన్నారు. దీంతో ఏ పనిపైనా శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. నా ఈ సమస్యకు హోమియోలో పూర్తి పరిష్కారం లభించే అవకాశం ఉందా? సలహా ఇవ్వగలరు. – సురేశ్, హైదరాబాద్ సాధారణంగా ఈ సమస్య 15 – 45 ఏళ్ల వారిలో ఎక్కువగా ఉంటుంది. యువకులతో పోలిస్తే యువతుల్లో మరీ ఎక్కువ. పార్శ్వపు నొప్పి అని కూడా పిలిచే ఈ మైగ్రేన్ తలనొప్పిలో తలలో ఒకవైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. సాధారణంగా ఇది మెడ వెనక ప్రారంభమై కంటివరకు వ్యాపిస్తుంది. కారణాలు: పార్శ్వపు నొప్పికి నిర్దిష్ట కారణాలేమిటనే విషయం ఇప్పటికీ స్పష్టంగా తెలియనప్పటికీ, తలలోని కొన్ని రకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావడం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుందని తెలుస్తోంది. ఇక శారీరక, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, చాలాసేపు ఆకలితో ఉండటం, సమయానికి భోజనం చేయకపోవడం, సైనసైటిస్, అతి వెలుగు, గట్టి శబ్దాలు, ఘాటైన సువాసనలు, పొగ, మద్యం వంటి అలవాట్లు, మహిళల్లో నెలసరి సమయాల్లో, మెనోపాజ్ సమయాల్లో స్త్రీలలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వంటివి ఈ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు. లక్షణాలు : పార్శ్వపు నొప్పిలో చాలారకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటిని మూడు రకాలుగా విభజించవచ్చు. 1. పార్శ్వపు నొప్పి వచ్చేముందు కనిపించే లక్షణాలు : ఇవి పార్శ్వపునొప్పి వచ్చే కొద్ది గంటలు లేదా నిమిషాల ముందు వస్తాయి. చికాకు, నీరసం, అలసట, నిరుత్సాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల తినుబండారాలు ఇష్టపడటం, వెలుతురు, శబ్దాలను తట్టుకోలేకపోవడం, కళ్లు మసకబారడం, కళ్ల ముందు మెరుపులు కనిపించడం జరగవచ్చు. వీటినే ‘ఆరా’ అంటారు. 2. పార్శ్వపునొప్పి సమయంలో కనిపించే లక్షణాలు: అతి తీవ్రమైన తలనొప్పి, తలలో ఒకవైపు వస్తుంటుంది. ఇది 4 నుంచి 72 గంటల పాటు ఉండవచ్చు. 3. పార్శ్వపు నొప్పి వచ్చాక కనిపించే లక్షణాలు: చికాకు ఎక్కువగా ఉండటం, నీరసంగా ఉండటం, వికారం, వాంతులు, విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స / నివారణ : కొన్ని అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. మనకు ఏయే అంశాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించి, వాటికి దూరంగా ఉండటం ద్వారా మైగ్రేన్‌ను నివారించవచ్చు. అలాగే కాన్స్టిట్యూషన్ పద్ధతిలో ఇచ్చే ఉన్నత ప్రమాణాలతో కూడిన హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ మాటిమాటికీ జలుబు... వాసనలు తెలియడం లేదు నా వయసు 29 ఏళ్లు. నాకు గత ఆర్నెల్లుగా తుమ్ములు, ముక్కుకారడం, ముక్కులు బిగదీసుకుపోతున్నాయి. ఇలా తరచూ జలుబుచేస్తూనే ఉంది. వాసనలు తెలియడం లేదు. చాలా మంది డాక్టర్లను కలిశాను. ఈ సమస్య తగ్గినట్టే తగ్గి, మళ్లీ వస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? హోమియోలో దీనికి పరిష్కారం చెప్పండి. – సుధాకర్‌రావు, నల్లగొండ మీరు వివరించిన లక్షణాలను బట్టి మీరు ‘అలర్జిక్ రైనైటిస్’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీకు సరిపడనివి తగిలినప్పుడు (దుమ్ము, ధూళి, పుప్పొడి, ఘాటువాసనలు) మీకు అలర్జీ మొదలవుతుంది. దాంతో ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్లుగా అయి, ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కు బిగదీసుకుపోవడం వంటివి కనిపిస్తాయి. లక్షణాలు : ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కుకారడం వంటి లక్షణాలే గాక... వాటిని నిర్లక్ష్యం చేస్తే సైనస్లకు ఇన్ఫెక్షన్ సోకి తలబరువు, తలనొప్పి వంటివి కనిపించవచ్చు. ముక్కుపొరలు ఉబ్బడం వల్ల గాలి లోపలికి వెళ్లక వాసనలు కూడా తగ్గిపోతాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు సైనసైటిస్, నేసల్ పాలిప్స్, వంటి పెద్ద పెద్ద సమస్యలూ వచ్చేందుకు అవకాశం ఉంది. వ్యాధి నిర్ధారణ కోసం ఎక్స్–రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. నివారణ: ∙అలర్జీ కారకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం ∙సరైన పోషకాహారం తీసుకోవడం ∙ముక్కుకు సంబంధించిన వ్యాయామాలు చేయడం చల్ల్లని వాతావరణానికి, పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం. చికిత్స: హోమియోలో వ్యక్తిగత లక్షణాలనూ, మానసిక స్వభావాన్ని బట్టి కాన్స్టిట్యూషన్ చికిత్స ఇవ్వవచ్చు. దీనివల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. క్రమక్రమంగా వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ పోయి, అలా సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ ఉంటే అలర్జిక్ రైనైటిస్ పూర్తిగా తగ్గుతుంది. హోమియోలో కాన్స్టిట్యూషనల్ ప్రక్రియ ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
చేతుల వరకూ పాకే మెడనొప్పి... ఎందుకిలా?
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 58. కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకుగురయ్యాయని చెప్పారు. మందులు వాడితే తగ్గుతోంది, ఆపేస్తే నొప్పి వస్తోంది. నా సమస్య హోమియో మందులతో శాశ్వతంగా తగ్గుతుందా?– సీహెచ్ వెంకటేశ్వరరావు, ఖమ్మం మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. దీనినే సర్వైకల్ స్పైనల్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. కారణాలు: ∙వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం ∙డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం ∙వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ∙ఎక్కువ సమయం పాటు మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ∙ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ∙ఎల్తైన దిండ్లు వాడటం ∙మెడకు దెబ్బతగలడం ∙మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశముంది. లక్షణాలు:సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి ∙నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం ∙మెడ బిగుసుకుపోవడం ∙తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం ∙నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం ∙చిన్న బరువునూ ఎత్తలేకపోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్ఆర్, ఎక్స్–రే సర్వైకల్ స్పైన్, ఎమ్మారై పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించి మెడనొప్పిని పూర్తిగా తగ్గేలా చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ సోరియాసిస్ తగ్గుతుందా? నా వయసు 38 ఏళ్లు. గత పదేళ్ల నుంచి సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని పూతమందులు, మాత్రలు వాడినా పూర్తిగా తగ్గడం లేదు. మళ్లీ వస్తోంది. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? - సురేశ్, నిజామాబాద్ సోరియాసిస్ చాలా మందిని బాధపెడుతున్న సమస్య. ప్రపంచ జనాభాలో దాదాపు మూడు శాతం మంది స్త్రీ, పురుషులు దీనితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉంది. చాలామంది దీన్ని కేవలం చర్మసమస్యగా భావిస్తారు. కానీ ఇది దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ సమస్య. అంటే మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పరిణమించడం వల్ల వచ్చే సమస్య. ఇందులో చర్మ కణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతోపాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడతాయి. ఇలా పొరలుగా ఏర్పడటం వల్ల వెండి రంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న దద్దుర్ల వస్తాయి. దురద కూడా ఉంటుంది. సోరియాసిస్ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న 15 శాతం మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. కారణాలు: ∙వంశపారంపర్యం ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అస్తవ్యస్తత ∙దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం. లక్షణాలు: ∙చర్మం ఎర్రబారడం ∙తీవ్రమైన దురద ∙జుట్టు రాలిపోవడం ∙కీళ్లనొప్పులు ∙చర్మం పొడిబారినప్పుడు చర్మంపై పగుళ్లు ఏర్పడి రక్తస్రావం కూడా అవుతుంది. నిర్ధారణ పరీక్షలు: స్కిన్ బయాప్సీ, ఈఎస్ఆర్, సీబీపీ, ఎక్స్–రే పరీక్షలు. చికిత్స: సోరియాసిస్ నివారణ/చికిత్సలకు హోమియో ఎంతగానో సహాయపడుతుంది. ఈ వ్యాధి విషయంలో వెంటనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి సోరియాసిస్‌కు సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఒత్తిడితో గుండెపోటు ఎందుకు వస్తుంది? కార్డియాలజీ కౌన్సెలింగ్స్ నా వయసు 38 ఏళ్లు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మార్కెటింగ్ విభాగంలో డిప్యూటీ మేనేజర్‌గా చేస్తున్నాను. ఆఫీసులో టార్గెట్లు, ఇంట్లో టీనేజీ అబ్బాయి చదువుతో బాగా ఒత్తిడికిలోనవుతున్నాను. స్ట్రెస్ వల్ల గుండెజబ్బులు వస్తాయని విన్నాను. అసలు స్ట్రెస్‌తో గుండెజబ్బులు ఎందుకు వస్తాయి? అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలపండి. – సురేశ్‌కుమార్, విజయవాడ పెరిగే ఒత్తిడి నేరుగా గుండెపైనే ప్రభావం చూపిస్తుంది. ఆధునిక నగర జీవితంలో కొంత ఒత్తిడి సహజమే. అయితే ఆఫీసులో పని, కుటుంబ కలహాలు, పిల్లల భవిష్యత్తు, ఆప్తుల అనారోగ్యవం వంటివి ఒత్తిడిని మరికొంత పెంచుతుంటాయి. ఉద్యోగస్తుల్లో ఒత్తిడికి సంబంధించి ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. పై అధికారుల ప్రవర్తన, నిర్వణశైలి, సహచరుల మధ్య పోటీ వంటి వాటితో పాటు ఏ క్షణమైనా ఉద్యోగం పోతుందన్న ఆందోళన వంటి అంశాలు మిగతావారితో పోలిస్తే గుండెపోటు ముప్పును 20 శాతం పెంచుతున్నట్లు తేలింది. ఒత్తిడి... గుండెపైన ఏ విధంగా ప్రభావం చూపిస్తుందన్నది ఆసక్తికరమైన అంశం. సాధారణంగా ఒత్తిడి శరీరంలో అత్యవసర పరిస్థితిని సృష్టిస్తుంది. దాంతో అవయవాలలో వాచే తత్వం పెరుగుతుంది. రక్తపోటు పెరగడం, రక్తంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) తగ్గడం వంటిటి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నిరంతరాయం ఉండే ఒత్తిడి గుండెకు మరింత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఒత్తిడి, విచారం వల్ల నిద్ర దూరం అవుతుంది. వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంలో లోటుపాటు పెరుగుతాయి. ఈ రకమైన మార్పులన్నీ కలిసి గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి మొదట చేయాల్సిందల్లా ఒత్తిడితో గుండెకు ప్రమాదం ఉందన్న అంశాన్ని గుర్తించడమే. అలాగే గుండె వ్యాధులకు కారణమయ్యే అధిక రక్తపోటు, డయాబెటిస్, ఊబయాకం వంటి వాటికి చికిత్స తీసుకుంటూ ఉండాలి. ఇక రోజూ కనీసం ముప్ఫయి నిమిషాల పాటు వ్యాయామం గుండె ఆరోగ్యంతో పాటు పూర్తిస్థాయి ఒంటి ఆరోగ్యానికీ ఉపయోగపడుతుంది. అలాగే యోగా, ధ్యానం వంటివి ఒత్తిడి నుంచి దూరమయ్యేందుకు సహాయపడతాయి. డాక్టర్ టి. శశికాంత్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, యశోద హార్ట్ ఇన్స్టిట్యూట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
శ్వాస కష్టంగా ఉంది!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. ఈ మధ్య మాట్లాడుతున్నా, నడుస్తున్నా ఆయాసంగా ఉంటోంది. మగతగా ఉండటం, త్వరగా అలసిపోవడం, శ్వాస కష్టంగా జరుగుతోంది. చర్మం పాలిపోయినట్లు ఉంది. డాక్టర్ రక్తం తక్కువగా ఉందని అన్నారు. నా సమస్యకు పరిష్కారం ఉందా? – సంధ్యారాణి, నిర్మల్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు అనీమియా (రక్తహీనత)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మన రక్తం ఎర్రగా ఉండటానికి అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం కారణం. మన శరీరంలో 100 గ్రాముల రక్తంలో హీమోగ్లోబిన్ పరిమాణం మగవారిలోనైతే 13 గ్రాములు, మహిళల్లోనైతే 12 గ్రాములు, ఆరు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో 12 గ్రాములు ఉండాలి. హీమోగ్లోబిన్ ఇంతకంటే తక్కువ ఉంటే రక్తహీనతగా పరిగణించవచ్చు. అనీమియా లక్షణాలు కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో తీవ్రంగా ఉంటాయి. రక్తహీనత వచ్చిన వారిలో ఎర్రరక్తకణాల (రెడ్ బ్లడ్ సెల్స్ / ఎరిథ్రోసైట్స్) సంఖ్య తగ్గిపోతుంది. దాంతో వాళ్లలో పాలిపోయిన చర్మం, తెల్లబడ్డ గోళ్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తహీనత అన్నది ప్రధానంగా మహిళల్లో, పిల్లల్లో ఎక్కువ. పౌష్ఠికాహార లోపం దీనికి ఒక ప్రధాన కారణం. లక్షణాలు: ∙శ్వాస కష్టంగా ఉండటం ∙అలసట ∙చికాకు ∙మగత ∙తలనొప్పి ∙నిద్రపట్టకపోవడం ∙పాదాలలో నీరు చేరడం ∙ఆకలి తగ్గడం మొదలైనవి. చికిత్స : వ్యాధికి కారణమయ్యే అంశాలను శరీరం నుంచి తొలగించడం ద్వారా వ్యాధిని తగ్గించవచ్చు. హోమియో విధానంలో ఈ ప్రక్రియలో మందులు జన్యుస్థాయికి వెళ్లి అక్కడ రోగకారణాన్ని కనుగొని, దాన్ని అంకురం నుంచి తొలగిస్తాయి. ఇలా ఈ మందులు సదరు జబ్బు పట్ల మన శరీరానికి పూర్తి రోగనిరోధకత కల్పిస్తాయి. రక్తహీనత సమస్యకు హోమియోలో నేట్రమ్మూర్, ఫెర్రమ్‌ఫాస్, కాల్కేరియా ఫాస్, నక్స్‌వామికా, అల్యుమినా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని డాక్టర్ పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ తెల్లమచ్చలు వస్తున్నాయి! హోమియో కౌన్సెలింగ్ నా శరీరమంతా తెల్లమచ్చలు వచ్చాయి. నలుగురిలో వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బొల్లి అన్నారు. ఇది హోమియో మందులతో తగ్గుతుందా? – సంపత్‌కుమార్, విజయనగరం చర్మంలో రంగునిచ్చే మెలనోసైట్స్ అనే కణాలు తగ్గినప్పుడు తెల్ల మచ్చలు వస్తాయి. దీనిని బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్’ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. ఈ ఎంజైమ్ అనేక కారణాల వల్ల క్షీణిస్తుంది. ఫలితంగా మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంంది. ఈ టైరోసినేజ్ అనే ఎంజైమ్ తగ్గుదలకు ఈ కింది పరిస్థితులు కారణం కావచ్చు. కారణాలు: – దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి – కొన్నిసార్లు కాలిన గాయాలు – పోషకాహారలోపం – జన్యుపరమైన కారణాలు – దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు – మందులు, రసాయనాలు – కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్లలో లోపాలు – వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం లేదా నిరోధక కణాలు మనపైనే దాడి చేయడం వంటివి బొల్లి వ్యాధికి కొన్ని కారణాలు. లక్షణాలు: మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాళ్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అదే పరిమాణంలో ఉండిపోవచ్చు. చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స ఉంది. ఇందుకు దీర్ఘకాలిక చికిత్స తీసుకోవాలి. మానసికంగా, శారీరకంగా రోగిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న తర్వాత వ్యాధికి అవసరమైన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్‌ను ఇస్తారు. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలను తగ్గించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ మెడనొప్పి తగ్గుతుందా? హోమియో కౌన్సెలింగ్ నా వయసు 32 ఏళ్లు. గత ఏడాది కాలం నుంచి తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే స్పాండిలోసిస్ అన్నారు. మందులు వాడుతున్నాను. నొప్పి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోంది. దీనికి హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – కె.ఆర్.ఆర్., నెల్లూరు స్పాండిలోసిస్ అనేది వెన్నెముకకు సంబంధించిన సమస్య. స్పాండిలోసిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్. ఇది మెడ భాగంలో వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. కారణాలు: ∙కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా జాయింట్స్ ఉంటాయి. ఈ జాయింట్స్ అరుగుదల వల్ల నొప్పి రావచ్చుజాయింట్స్లో వాటర్ తగ్గడం వల్ల కూడా నొప్పి రావచ్చు ∙వెన్నుపూసలు దెబ్బతిని కూడా నొప్పి రావచ్చు ∙వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో వ్యాపించడానికి దారి ఉంటుంది. ఆ దారి సన్నబడితే నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. లక్షణాలు: మెడనొప్పి, తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు ఉంటుంది. నిర్ధారణ: ∙వ్యాధి లక్షణాలను బట్టి ∙ఎక్స్–రే ∙ఎమ్మారై, సీటీ స్కాన్ నివారణ: వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయడం, మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం, ఒక్కసారిగా కూర్చోవడం లేదా నిల్చోవడం వంటివి చేయకపోవడం, దూరప్రాంతాలకు వాహనం నడపడం వంటివి చేయకపోవడం. చికిత్స: హోమియో ప్రక్రియలో రోగి వ్యక్తిగత లక్షణాలను బట్టి వారి శారీరక, మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకొని చికిత్స ఇస్తారు. ఇలా కాన్స్టిట్యూషనల్ చికిత్స అందిస్తే క్రమంగా రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధి తీవ్రత క్రమంగా తగ్గుతుంది. దాంతో క్రమక్రమంగా పూర్తిగా వ్యాధి నివారణ జరుగుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
హైపోథైరాయిడిజమ్‌ను పూర్తిగా నయం చేయవచ్చు
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 32 ఏళ్లు. నేను ఈ మధ్య బరువు పెరుగుతున్నాను. నా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వల్ల టీఎస్‌హెచ్ పరీక్ష చేశారు. హైపోథైరాయిడిజమ్ ఉందని తెలిసింది. నేను జీవితాంతం మందులు వాడాల్సిందేనా? హోమియోలో మందులు ఉన్నాయా? – మనస్విని, హైదరాబాద్ మానవ జీవక్రియలకు సంబంధించి థైరాయిడ్ గ్రంథి చాలా ప్రధానమైనది. ఇది అనేక కార్యకలాపాలలో తనదైన ముఖ్య భూమిక పోషిస్తుంది. శరీరంలోని వివిధ రకాల జన్యుక్రియల సమతౌల్యతకు టీ3, టీ4, టీఎస్‌హెచ్ హార్మోన్లు ఉపయోగపడతాయి. హైపోథైరాయిడ్ కండిషన్లో బరువు పెరుగుతుంది. హైపోథైరాయిడిజమ్ అనేది మానవ శరీరంలో థైరాయిడ్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఈ ఆధునిక కాలంలో సుమారు మూడు శాతం మంది హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నారు. ఆకస్మికంగా బరువు పెరగడం ఈ సమస్యను సూచిస్తుంది. థైరాయిడిజమ్ నుంచి తగినంత మోతాదులో హార్మోన్ టీ3, టీ4 ఉత్పన్నం కావడానికి మన శరీరంలో శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్‌హెచ్ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుంచి ఉత్పన్నమయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) అవసరం. అయోడిన్ లోపించడం వల్ల హైపోథైరాయిడిజమ్ సమస్య వస్తుంది. లక్షణాలు : ∙బరువు పెరగడం, కాళ్లు చేతుల్లో నీరు చేరడం జుట్టు రాలడం, చర్మం పొడిబారినట్లు ఉండటం, మలబద్దకం గొంతు బొంగురుపోవడం, తొందరగా అలసిపోవడం, కండరాల నొప్పి ∙కోపం, అలసట, నిరాశ, కీళ్లనొప్పి ∙రుచి, వాసన, స్పర్శ తగ్గడం సంతానలేమి, నీరసం, డిప్రెషన్ నిర్ధారణ పరీక్షలు : రక్తపరీక్షలు, థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్. చికిత్స : హైపోథైరాయిడిజమ్ సమస్యను అదుపు చేసే ఔషధాలు మందులు హోమియో విధానంలో అందుబాటులో ఉన్నాయి. అయితే అవి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. హోమియోపతిలో సాధారణంగా కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్, అయోడమ్, థైరాడినమ్, స్పాంజియా వంటి మందులను రోగుల లక్షణాలను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడటం వల్ల హైపోథైరాయిడిజమ్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ -
మొలల సమస్యను తగ్గించవచ్చు!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి మలద్వారం వద్ద బుడిపెలా ఏదో బయటకు వస్తోంది. మల విసర్జనలో రక్తం పడుతోంది. సూదితో గుచ్చినట్లుగా నొప్పి కూడా ఉంటోంది. డాక్టర్‌ను కలిస్తే పైల్స్ అని చెప్పారు. హోమియోలో శాశ్వత పరిష్కారం ఉందా? – ఎన్. శ్రీహరి, విశాఖపట్నం మలద్వారపు గోడల మార్పుల వల్ల ఆ చివరన ఉండే రక్తనాళాలు (సిరలు) ఉబ్బి అవి మొలలుగా ఏర్పడతాయి. ఇవి మలాశయం లోపల, వెలుపల చిన్న చిన్న బుడిపెల రూపంలో ఏర్పడి ఇబ్బంది పెడతాయి. మొలల దశలు: ∙గ్రేడ్–1 దశలో మొలలు పైకి కనిపించవు.నొప్పి కూడా ఉండదు. కానీ రక్తం మాత్రం పడుతుంది ∙గ్రేడ్–2లో రక్తం పడవచ్చు, పడకపోవచ్చు కానీ మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి. వాటంతట అవే లోపలకు వెళ్లిపోతుంటాయి ∙గ్రేడ్–3లో మల విసర్జన చేసేటప్పుడు మొలలు బయటకు వస్తాయి. కానీ మల విసర్జన తర్వాత లోపలికి పోకుండా, వేలితో నెడితే లోనికి వెళ్తాయి ∙గ్రేడ్–4 దశలో మొలలు మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు. కారణాలు: ∙మలబద్దకం ∙మలవిసర్జన సమయంలో గట్టిగా ముక్కడం వల్ల అక్కడే ఉండే కండరబంధనం సాగిపోతుంది. తద్వారా మొలలు బయటకు పొడుచుకుని వస్తాయి ∙సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం ∙స్థూలకాయం (ఒబేసిటీ) ∙చాలాసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగులకు ఈ సమస్య ఎక్కువ ∙మలబద్దకం మాత్రమే గాక అతిగా విరేచనాలు కావడం కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు ∙మంచి పోషకాహారం తీసుకోకపోవడం ∙నీరు తక్కువగా తాగడం ∙ఎక్కువగా ప్రయాణాలు చేయడం ∙అధిక వేడి ప్రదేశంలో పనిచేస్తుండటం ∙మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు: నొప్పి, రక్తస్రావం, కొన్నిసార్లు దురద, ఏదో గుచ్చుతున్నట్లుగా నొప్పి ∙మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలగడం. నివారణ: ∙మలబద్దకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ∙ సమయానికి భోజనం చేయడం ముఖ్యం ∙ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ∙కొబ్బరినీళ్లు ∙నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవడం ∙మసాలాలు, జంక్‌ఫుడ్, మాంసాహారం తక్కువగా తీసుకోవడం ∙మెత్తటి పరుపు మీద కూర్చోవడం వంటివి పైల్స్ నివారణకు తోడ్పడే కొన్ని జాగ్రత్తలు. హోమియోలో రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఇచ్చే మందులు ఇచ్చి వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. – డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష ఎందుకు?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. ఈమధ్య కాలంలో ఐదు కేజీల వరకు బరువు పెరిగాను. లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకొని డాక్టర్‌ను కలవమని ఫ్రెండ్స్ అంటున్నారు. అసలు లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏమిటి? హోమియో మందుల ద్వారా కొవ్వులు ఎక్కువగా ఉన్న స్థితిని నయం చేసుకోడానికి మార్గం ఉందా? – సుదర్శన్, రేణిగుంట లిపిడ్స్ అనేవి కొన్ని రకాల కొవ్వులు, కొవ్వులాంటి పదార్థాలు. సాధారణంగా కొవ్వులు శక్తి కోసం అవసరం. కొలెస్ట్రాల్ వంటి కొవ్వు కూడా కొంతవరకు మంచి ఆరోగ్యానికి అవసరం. అయితే ఇటీవల మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న మానసిక–శారీరక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల జీవక్రియలలో మార్పుల వల్ల మనలో రోగనిరోధక శక్తి తగ్గి రకరకాల వ్యాధులు వస్తున్నాయి. జీవన విధానంలో కృత్రిమ ఆహారాలు తీసుకోవడం, మద్యపానం వంటి అలవాట్లుతోనూ, శారీరక శ్రమ తగ్గడం వల్ల జీర్ణ వ్యవస్థలో అసమతౌల్యత ఏర్పడుతోంది. కొవ్వుల పాళ్లు పెరిగిపోయి అవి అనేక అనారోగ్యాలకూ, అనర్థాలకూ కారణమవుతున్నాయి. లిపిడ్ ప్రొఫైల్ అనే పరీక్ష ... ఎల్డీఎల్ అనే చెడు కొవ్వులు, ట్రైగ్లిజరైడ్స్ అనే హానికారక కొవ్వులు, హెచ్‌డీఎల్ అనే మంచి కొవ్వులు ఎంతెంత పాళ్లలో ఉన్నాయో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. కొన్ని రకాల కొవ్వులు... అవి ఉండాల్సిన పాళ్లు ∙హైడెన్సిటీ లైపో ప్రోటీన్ (హెచ్‌డీఎల్): సాధారణంగా దీన్ని మంచి కొవ్వు అనీ, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వుగా చెబుతారు. దీని సాధారణ విలువ 40 ఎంజీ/డీఎల్ నుంచి 60 ఎంజీ/డీఎల్ వరకు ఉండాలి. ఆరోగ్యకరమైన పాళ్లలో ఉన్నప్పుడు ఇది రక్తనాళాల్లోకి కొవ్వును చేరకుండా నిరోధిస్తుంది. అక్కడి నుంచి తొలగించి, ఆ కొవ్వు అంతా కాలేయంలోకి వెళ్లేలా చేస్తుంది. లో డెన్సిటీ లైపో ప్రోటీన్ (ఎల్డీఎల్): దీన్ని చెడుకొవ్వుగా పేర్కొంటారు. దీని సాధారణ విలువ 140–150 ఎంజీ/డీఎల్ ఉండవచ్చు. ట్రైగ్లిజరైడ్స్: ఇది కూడా హానికారకమైన కొవ్వే. దీని పాళ్లు 150 ఎంజీ/డీఎల్ వరకు ఉండవచ్చు. లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలో మొత్తం ఏడు అంశాలు ఉంటాయి. అవి... 1. మొత్తం లిపిడ్స్ 2. సీరమ్ టోటల్ కొలెస్ట్రాల్ 3. సీరమ్ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ 4. టోటల్ కొలెస్ట్రాల్ / హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ నిష్పత్తి 5. సీరమ్ ట్రైగ్లిజరైడ్స్ 6. సీరమ్ ఫాస్ఫో లిపిడ్స్ 7. విద్యుత్ అంశీకరణ... దీని వల్ల ఈ కింది అంశాల శాతాన్ని నిర్ణయిస్తారు. అవి... ∙కైలో మైక్రాన్స్ ∙లో డెన్సిటీ లైపోప్రోటీన్ ∙చాలా తక్కువ సాంద్రత (వీఎల్‌డీఎల్) ∙హైడెన్సిటీ లైపో ప్రోటీన్. చికిత్స: అధిక కొవ్వులను తగ్గించడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. సాధారణమైన మందులలో... కాల్కేరియా కార్బ్, ఫైటోలిక్కా, కొలెస్ట్రినమ్, గ్రాఫైటిస్, కాక్టస్, రావుల్ఫియా సర్పెంటీనా వంటివి కొన్ని మాత్రమే. ఇవే కాకుండా వైద్య నిపుణుల పర్యవేక్షణలో సరైన హోమియో మందులను క్రమం తప్పకుండా వాడితే మీ సమస్యకు మంచి పరిష్కారం లభిస్తుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ -
కాంబినేషన్ కీమోథెరపీతో క్యాన్సర్‌కు చికిత్స!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. నేను కొంతకాలంగా తీవ్రమైన మెడనొప్పితో బాధపడుతున్నాను. నొప్పి చేతుల వరకూ పాకుతోంది. చేతులు బలహీనంగా అనిపిస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే మెడ భాగంలోని ఎముకలు అరుగుదలకు గురయ్యాయని చెప్పారు. మందులు వాడుతున్నంత కాలం బాగానే ఉన్నా అవి ఆపేస్తే మాత్రం మళ్లీ నొప్పి వస్తోంది. హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందా? - వీరారెడ్డి, ఖమ్మం వయసు పెరగడం వల్ల వచ్చే మెడ నొప్పికి పూర్తి పరిష్కారం లభించదని చాలామంది అనుకుంటుంటారు. కానీ హోమియో చికిత్స ద్వారా ఈ సమస్యకు పూర్తి పరిష్కారం దొరుకుతుంది. మెడ భాగంలోని వెన్నెముక డిస్కులు, ఫేసెట్ జాయింట్స్‌లోని మృదులాస్థి క్షీణతకు గురికావడాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. దీనినే సర్వైకల్ స్పైనల్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. దాదాపు 85 శాతానికి పైగా ఇది 60 ఏళ్ల వయసు పైబడిన వారిలో కనిపిస్తుంది. ప్రస్తుతం జీవనశైలిలో మార్పులు రావడం వల్ల ఇది చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు: వయసు పెరగడం, వ్యాయామం లేకపోవడం క్షీణతకు గురైన ఎముకలు అదనంగా పెరగడం డిస్కులు జారిపోవడం లేదా చీలికలకు గురికావడం వృత్తిరీత్యా అధిక బరువులు మోయడం ఎక్కువ టైం మెడను అసాధారణ భంగిమలో ఉంచడం ఎక్కువ సేపు కంప్యూటర్‌పై పనిచేయడం, ఎక్కువ సమయం మెడను వంచి ఫోన్లలో మాట్లాడటం ఎత్తై దిండ్లు వాడటం మెడకు దెబ్బతగలడం మెడకు శస్త్రచికిత్స జరిగి ఉండటం తీవ్రమైన మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగతాగే అలవాటు, జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: సాధారణం నుంచి తీవ్రస్థాయి మెడనొప్పి నొప్పి మెడ నుంచి భుజాలకు, చేతులకు, వేళ్లకు పాకడం మెడ బిగుసుకుపోవడం తలనొప్పి, తల వెనక భాగంలో మొదలై నుదురు వరకు వ్యాపించడం నరాలపై ఒత్తిడి పడి, చేతులలో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం, చేతులు మొద్దుబారడం, సత్తువ కోల్పోవడం చిన్న బరువునూ ఎత్తలేకపోవడం నడకలో నిలకడ కోల్పోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు. నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్ఆర్, ఎక్స్-రే సర్వైకల్ స్పైన్, ఎమ్మారై పరీక్షలు చేయించడం ద్వారా వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శరీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించడం వల్ల మెడనొప్పిని పూర్తిగా నయం చేయవచ్చు. వెన్నెముకను దృఢంగా చేయడం ద్వారా సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ కేన్సర్ కౌన్సెలింగ్ నా వయసు 33 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. ఇటీవల తరచూ అనారోగ్యానికి గురవుతుంటే చెన్నై వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నాను. క్యాన్సర్ అని తేలింది. వెంటనే కీమోథెరపీ మొదలుపెట్టాలని డాక్టర్లు చెప్పారు. కానీ కొందరు బంధువులు, స్నేహితులు కీమోథెరపీ అంటే భయపెడుతున్నారు. అసలు కీమోథెరపీ అంటే ఏమిటి? క్యాన్సర్ చికిత్సలో దాని ప్రయోజనాలు ఏమిటి? సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి. దయచేసి నా సందేహాలకు సమాధానాలు చెప్పగలరు. - భానుప్రసాద్, కర్నూలు మందుల ద్వారా క్యాన్సర్‌కు చేసే చికిత్సనే కీమోథెరపీ లేదా కీమో అంటారు. సర్జరీ లేదా రేడియేషన్ థెరపీ ద్వారా శరీరంలోని కొన్ని ప్రాంతాలలో తిష్టవేసిన క్యాన్సర్ కణజాలాన్ని తొలగించగలుగుతాం లేదా నాశనం చేయగలం. కీమో ద్వారా శరీరంలో ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ క్యాన్సర్ కణజాలాన్ని నిర్మూలించవచ్చు. కీమోథెరపీ ద్వారా శరీరంలో ముందుగా ఏర్పడిన క్యాన్సర్ కణితి మొదలుకొని శరీరంలోని అనేక భాగాలకు విస్తరించిన క్యాన్సర్ కణజాలాన్ని సైతం ధ్వసం చేయవచ్చు. కీమోథెరపీలో 100కు పైగా మందులను వివిధ కాంబినేషన్లలో వినియోగిస్తుంటారు. ఒక్కోసారి క్యాన్సర్ చికిత్స కోసం వీటిలో ఒకే మందును సైతం వాడవచ్చు. అయితే సాధారణంగా వివిధ రకాల మందుల సమ్మేళనంతో ఒక క్రమపద్ధతిని అనుసరించి అందించే విధానాన్ని కాంబినేషన్ కీమోథెరపీ అని వ్యవహరిస్తారు. పలు రకాల మందులు, వాటి ప్రభావాల తీరు వల్ల ఉమ్మడిగా క్యాన్సర్ కణాలపై పోరాడి వాటిని సమూలంగా సంహరించగలుగుతాయి. ఒకే మందు వాడటం వల్ల క్యాన్సర్ కణాలు ఆ మందుకు లొంగకుండా తయారయ్యే ప్రమాదం ఉన్నందున కాంబినేషన్ కీమోథెరపీని వినియోగిస్తారు. మీ విషయంలో ఏ విధానం అవలంబించాలన్నది మీ డాక్టర్ నిర్ణయిస్తారు. అలాగే కీమోథెరపీలో భాగంగా మందులను ఎంత మోతాదులో, ఏవిధంగా, ఎప్పుడెప్పుడు, ఎంతకాలం ఇవ్వాలన్నది కూడా చికిత్సలో భాగమే. ఈ నిర్ణయాలన్నీ కూడా మీరు ఏ రకమైన క్యాన్సర్ కణితితో బాధపడుతున్నారు, శరీరంలో అది ఏ భాగంలో ఉంది, ఎంత పెద్దగా ఉంది, అది మీ శరీర కార్యకలాపాలను, ఆరోగ్యాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తోంది అన్న అంశాలపై ఆధారపడి ఉంటుంది. కీమోథెరపీలో భాగంగా ఇచ్చే మందులను బట్టి మీ శరీరంలో అనేక విధాలుగా అతివేగంతో విస్తరించే క్యాన్సర్ కణాల విధ్వంసం జరుగుతుంది. క్యాన్సర్‌లో చాలా రకాలున్నాయి. అవి శరీరంలో ఒక్కో భాగంలో ఒక్కో విధంగా పెరుగుతుంటాయి. కాబట్టి అవి పెరిగే విధానాన్ని అనుసరించి, వాటిని లక్ష్యంగా చేసుకొని అనేక కీమోథెరపీ మందులను రూపొందించడం జరిగింది. దయచేసి సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీరు ఎక్కువగా ఆందోళన చెందకండి. కీమోథెరపీ లాంటి అత్యాధునిక వైద్య చికిత్సలతో సైడ్ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గించగలిగారు. ఇప్పుడు క్యాన్సర్ ఎంతమాత్రమూ ప్రాణాంతక వ్యాధి కాదు. ఎంత తొందరగా క్యాన్సర్‌ను గుర్తించగలిగితే అంత సంపూర్ణంగా దాని నుంచి విముక్తి పొందే అవకాశాలున్నాయి. డాక్టర్ జి.వంశీకృష్ణారెడ్డి సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట, హైదరాబాద్ ఆర్ధోపెడిక్ కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 65 ఏళ్లు. ఏడాదిక్రితం మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ) చేయించాం. శస్త్రచికిత్స సమయంలో ఆమె నేల మీద కూడా కూర్చోగలిగేందుకు హై-ఫ్లెక్స్ ఇంప్లాంట్ అమర్చాం. కానీ ఆమె నేల మీద కూర్చోలేకపోతున్నారు. ఒకింత చిన్న స్టూల్స్ వంటి వాటి మీద కూడా కూర్చోవడం సాధ్యం కావడం లేదు. హై-ఫ్లెక్స్ ఇంప్లాంట్స్ అమర్చాక కూడా తాను కోరుకున్నట్లుగా కింద కూర్చోవడం ఎందుకు సాధ్యపడటం లేదు? - యాదగిరి, నల్లగొండ మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఎంతగా కాళ్లు ముడుచుకుంటున్నాయి అనేది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి శస్త్రచికిత్స టెక్నిక్ ఉపయోగించారు, శస్త్రచికిత్సలో నైపుణ్యం వంటి అంశాలు ఇందులో కీలక భూమిక పోషిస్తాయి. హై-ఫ్లెక్స్ ఇంప్లాంట్స్ అనేది మామూలు కంటే ఎక్కువగా ఒంగుతాయని నిపుణులు పేర్కొంటారు. అంతేగాని ఇవి నేల మీద కూర్చోడానికి మాత్రమే ఉద్దేశించినవి కాదు. ఇందులో మూడు అంశాలను మీరు గమనించాలి. మొదటిది... ఒకరు శస్త్రచికిత్స తర్వాత మోకాళ్లను ఎంతమేరకు వంచగలరు అనే అంశం వారు శస్త్రచికిత్సకు ముందు ఎంతగా వంచారనే అంశంతో పోల్చి చూడాలి. రెండో అంశం... శస్త్రచికిత్సకుల నైపుణ్యం, ఆ సర్జరీలోని క్వాలిటీ, మూడో అంశం శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ ఎంతగా వ్యాయామం చేస్తే ఫలితాలు అంతగా బాగుంటాయి. అందుకే మీ అమ్మగారు తగినంత వ్యాయామం చేసేలా జాగ్రత్తలు తీసుకోండి. దాంతో ఫలితాలు మరింతగా మెరుగుపడతాయి. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
నుదుటిపై నల్లమచ్చలు.. తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. మల విసర్జనకు వెళ్తున్నప్పుడు నొప్పి ఉంటోంది. రక్తం కూడా పడుతోంది. డాక్టర్లకు చూపిస్తే ఆపరేషన్ అవసరమని అంటున్నారు. హోమియోలో చికిత్స ఉందా? - సునీల్ కుమార్, నిడదవోలు మీరు చెబుతున్న అంశాలను బట్టి మీరు పైల్స్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్య ఉన్నవారు మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం లేదా మలబద్దకంతో బాధపడుతుంటారు. మన శరీరంలోని రక్తనాళాల మీద ఒత్తిడి పెరిగినప్పుడు రక్తం గడ్డకట్టి రక్తనాళాల్లో చిన్న బంతుల్లా తయారవుతాయి. వాటిని పైల్స్ అంటారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల ఈమధ్యకాలంలో ప్రతి ఐదుగురిలో ఒకరికి మలద్వారం వద్ద సమస్యలు ఉంటున్నాయి. మలవిసర్జన తర్వాత ఈ బాధ కొన్ని గంటల వరకు ఉంటుంది. పైల్స్‌లో రకాలు: ఇందులో ఇంటర్నల్పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అని రెండు రకాలు ఉంటాయి. మలవిసర్జన మార్గం లోపలి గోడలకు అంటి పెట్టుకొని ఉండేవి ఇంటర్నల్పైల్స్. ఇక మలవిసర్జన ద్వారం వద్ద ఉండేవి ఎక్స్టర్నల్ పైల్స్. ఇవి బఠాణీగింజ లేదా ద్రాక్షపండు పరిమాణంలో గులాబీరంగులో ఉండవచ్చు. మూడు నాలుగు కలిసి గుత్తులుగా లేదా విడివిడిగా కూడా ఉండవచ్చు. కారణాలు: దీర్ఘకాలిక విరేచనాలు వంశపారంపర్యం మలబద్ధకం తగినన్ని నీళ్లు తాగకపోవడం మాంసాహారం అధికంగా తీసుకోవడం ఎక్కువ గంటల పాటు నిలబడి ఉండటం మద్యపానం వంటివి దీనికి కారణాలు. ఇక గర్భం ధరించిన మహిళల్లోనూ, హెపటైటిస్ వల్ల కాలేయం దెబ్బతిన్నవాళ్లలోనూ పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ. వైద్య పరీక్షలు: సీబీపీ, ఈఎస్ఆర్, ఎమ్మారై, సీటీస్కాన్ వంటి పరీక్షలతో వీటిని నిర్ధారణ చేస్తారు. చికిత్స: పైల్స్ వ్యాధి ఏళ్ల తరబడి బాధిస్తూ ఉంటుంది. దీనికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రయోనియా, నక్స్‌వామికా, అల్బుమినా వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడటం వల్ల ఆపరేషన్ అవసరం లేకుండా ఈ సమస్య నయమవుతుంది. డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 54 ఏళ్లు. గత కొద్ది రోజులుగా నా నుదుటి మీద చర్మం నల్లగా, దళసరిగా మారుతోంది. కణతల వద్ద, మెడ మీద, చంకల వద్ద, నడుము దగ్గర ఇలాగే అవుతోంది. దీనికి కారణం ఏమిటి? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం సూచించండి. - సునీల్‌కుమార్, నూజివీడు మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘ఆకాంథోసిస్ నైగ్రిక్యాన్స్’ అనే కండిషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ వల్ల జరుగుతుంది. సాధారణంగా స్థూలకాయుల్లో ఇలా జరుగుతుంది. దీన్ని ‘హెచ్ఓఎమ్ఏ-ఐఆర్’ అనే పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు. చికిత్స ప్రక్రియ ఇలా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం (అంటే వేళకు ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కంటినిండా నిద్రపోవడం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం) అవసరం. దాంతోపాటు ఒంటి రంగును చక్కబరిచేందుకు మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇందుకోసం పూత మందుగా ఉపయోగించాల్సినవి... - ఆర్బుటిన్ - లికోరైస్ - కోజిక్ యాసిడ్ ♦ పైన పేర్కొన్న మందులతో పాటి క్లిగ్‌మెన్స్ రెజీమ్ అనే ప్రక్రియను రోజు విడిచి రోజు రాత్రివేళ అమలు పరచాలి. ♦ యాభైకు ఎక్కువగా ఎస్పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్‌ను రోజూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యానం రెండు వరకు రాసుకుంటూ ఉండాలి. ♦ ఒంటి లోపలి వ్యవస్థలను చక్కబరచడానికి యాంటీ ఆక్సిడెంట్ మాత్రలు, విటమిన్ సి కాప్స్యూల్ వంటివాటితో పాటు డాక్టర్ సలహా మేరకు మెట్ఫార్మిన్ -500ఎంజీ ప్రతిరోజూ వాడాలి. ♦ ఇతర ప్రక్రియలు: ఫీనాల్, టీసీఏ వంటి మందులతో కెమికల్ పీలింగ్ 4 - 6 సెషన్ల పాటు చేయించుకోవాలి. ♦ లేజర్ టోనింగ్ కూడా పిగ్మెంట్ను తగ్గించడంతో పాటు మందంగా మారిన చర్మం మామూలుగా కావడానికి, అక్కడి నలుపు తగ్గడానికి తోడ్పడుతుంది. యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. మూడు నెలల క్రితం నెలసరి ఎక్కువవుతోందని పెద్దాపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. కానీ ఆపరేషన్ అయిన పదోరోజు నుంచి మూత్రం ఆగకుండా కారిపోతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే మళ్లీ ఆపరేషన్ చేయాలంటున్నారు. ఇలా ఎందుకు జరిగింది? నా సమస్యకు తగిన సలహా ఇవ్వగలరు. - ఒక సోదరి, హైదరాబాద్ ఒక్కోసారి పెద్దాపరేషన్ చేసే సమయంలో మూత్రాశయానికి గానీ మూత్రవాహికకి గానీ ప్రమాదవశాత్తు దెబ్బ తగిలినప్పుడు ఇలా మూత్రం కారిపోయే ప్రమాదం ఉంటుంది. దీనినే యూరినరీ ఫిస్టులా అంటారు. గర్భసంచిలో లేదా అండాశయంలో పెద్దగడ్డలు ఉన్నప్పుడుగానీ, ఎండోమెట్రియాసిస్ ఉన్నవారికి గానీ, ఇంతకు ముందు సిజేరియన్ అయినవారికి ఈ ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువ. మూత్రాశయానికి లేదా యురేటర్కి ఎక్కడ దెబ్బతగిలిందో తెలుసుకొని యూరాలజిస్ట్ దీన్ని సరిచేస్తారు. నా వయసు 45 ఏళ్లు. గత రెండేళ్లుగా చాలా ఎక్కువ సార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. ఒక్కోసారి నేను మూత్ర విసర్జనకు వెళ్లే లోపలే దారిలోనే మూత్రం పడిపోతోంది. దాంతో నేను చాలా ఇబ్బందికి గురవుతున్నాను. ఎందుకిలా జరుగుతోంది? దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - ఒక సోదరుడు, విశాఖపట్నం మూత్రం అతిగా విసర్జన జరుగుతున్న కండిషన్‌ను ‘ఓవర్ యాక్టివ్ బ్లాడర్’ అని, దాన్ని ఆపుకోలేకపోవడాన్ని ‘అర్ట్ ఇన్కాంటిసెన్స్’ అంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ వల్ల గానీ, నాడీవ్యవస్థలో వచ్చే వ్యాధుల వల్లగానీ లేదా డయాబెటిస్తో బాధపడుతుండటం వల్ల గానీ రావచ్చు. అంతేకాకుండా ప్రొస్టేట్ లేదా బ్లాడర్ వ్యవస్థను అదుపులో ఉంచే నాడీ కండరాలు దెబ్బతిన్నా జరగవచ్చు. ఒక్కోసారి ఏ కారణాలు లేకుండా కూడా ఈ సమ స్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇందుకు తగిన కారణమేదో తెలుసుకోడానికి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. రిపోర్ట్స్‌లో వచ్చే ఫలితాలను పరిశీలించి తగిన చికిత్స చేయించుకోవాలి. మీ సమస్య చాలావరకు మందులతోనే నయమయ్యేందుకు అవకాశం ఉంటుంది. -
మూర్ఛ వ్యాధిని అదుపులో ఉంచవచ్చు
హోమియో కౌన్సెలింగ్ మా పాపకు ఆరేళ్లు. తనకు తరచు ముక్కునుంచి రక్తం వస్తుంటుంది. ఇటీవల కొంతకాలంగా మలంలో కూడా ర క్తం పడుతోంది. డాక్టర్‌కు చూపించి, మందులు వాడుతున్నాము కానీ పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - ఎన్.పుష్పకుమారి, ఆదోని పిల్లలలో ముక్కు నుంచి రక్తం పడటమనేది తరచు కనిపించేదే. ఈ సమస్య ముఖ్యంగా వేసవి, చలికాలాలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని ఎపిస్టారిస్ అంటారు. ఇంటి వాతావరణం వేడిగా లేదా చల్లగా పొడిగా తయారైనప్పుడు ముక్కురంధ్రాలు పొడిబారి చర్మం చిట్లుతుంది. చిన్నపిల్లలు ముక్కులో వేళ్లుపెట్టి కెలుక్కుంటూ ఉంటారు. దీనివల్ల ముక్కురంధ్రాలలో ఉన్న సున్నితమైన రక్తనాళాలు చిట్లి, రక్తస్రావం జరగవచ్చు. అదేవిధంగా అలర్జీలు వచ్చినప్పుడు లేదా జలుబు చేసినప్పుడు గట్టిగా తుమ్మటం, ముక్కు చీదటం, ముక్కుకు బలమైన దెబ్బ తగలటం, ముక్కులో బలపాలు, పెన్సిళ్లు వంటివి పెట్టుకోవడం వల్ల కూడా ఇలా జరగవచ్చు. నివారణ: ఇటువంటప్పుడు కంగారు పడి, ముక్కులో గుడ్డలు అవీ పెట్టడం, కదలకుండా పడుకోబెట్టడం వల్ల సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంది. మాడు మీద చెయ్యి పెట్టి గట్టిగా ఒత్తిపట్టుకోవడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. ముక్కులో వేళ్లు పెట్టుకోనివ్వకూడదు. గోళ్లు పెరగకుండా చూడాలి. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు కొబ్బరినూనె రాయడం మంచిది. మలంలో రక్తం పడటానికి కారణాలు మలద్వారం వద్ద చీలిక (ఫిషర్): ముఖ్యంగా చిన్నపిల్లల్లోనూ, పెద్దవాళ్లలోనూ ఇలా జరగడానికి కారణం మలబద్ధకం. గట్టిగా ముక్కడం వల్ల కింది భాగంలోని పేగుల నుంచి రక్తస్రావం జరగవచ్చు. అలాగే పిండదశలో ఉన్నప్పుడు తల్లి బొడ్డునుంచి గర్భస్థ శిశువు పేగుల్లోకి వెళ్లే నాళ్ల మూసుకు పోవడం వల్ల పేగుల్లో తిత్తులు ఏర్పడవచ్చు. చిన్నపేగుల్లో అల్సర్స్, పేగు చొచ్చుకురావడం, ఒక పేగులోని కొంత భాగం మరో పేగులోకి చొచ్చుకుపోతుంది. జువైనల్ పాలిప్స్: పేగుల్లో పిలకలు; రక్తనాళాల్ల లోపాలు, పేగుల్లో వాపు. హోమియోవైద్యం: చిన్నపిల్లల్లో రక్తస్రావ సమస్యలకు హోమియోలో అద్భుతమైన మందులున్నాయి. వ్యాధి కారణాలు, లక్షణాలు, పిల్లల మానసిక, శారీరక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని కాన్స్టిట్యూషనల్ విధానం ద్వారా వైద్యం చేస్తారు. దీనివల్ల ఎటువంటి దుష్ఫలితాలూ తలెత్తకుండా ఎలాంటి శస్త్రచికిత్సలూ అవసరం లేకుండా వ్యాధి సమూలంగా తగ్గిపోతుంది. సమీపంలో ఉన్న మంచి అనుభవజ్ఞుడైన హోమియో వైద్యుని సంప్రదించండి. -డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ న్యూరో కౌన్సెలింగ్ మా అబ్బాయికి 15 ఏళ్లు. వాడికి చిన్నప్పట్నుంచీ మూర్ఛ వ్యాధి ఉంది. చికిత్స చేయిస్తున్నాం. అయితే గత ఆరు నెలలుగా మూర్ఛ రావడం ఆగిపోయింది. దాంతో మందులు నిలిపివేశాం. ఇటీవల మా బాబుకు స్కూల్లో మళ్లీ మూర్ఛ వచ్చింది. ఒకసారి తగ్గిన తర్వాత కూడా మూర్ఛ వ్యాధి మళ్లీ వస్తుందా? మా బాబుకు సరైన, శాశ్వతమైన పరిష్కారం చూపించగలరు. - లక్ష్మి, విజయవాడ మీ బాబుకు మూర్ఛ తగ్గిందనుకొని మీరు మందులు వాడటం ఆపివేశారు. కానీ మీ బాబుకు మూర్ఛ వ్యాధి పూర్తిగా నయం కాలేదు. వ్యాధి కొద్దిగా తగ్గినట్లు అనిపించగానే చాలామంది మందులు వాడటం ఆపేస్తుంటారు. కానీ అది మంచిది కాదు. మూర్ఛవ్యాధికి దీర్ఘకాలిక చికిత్స అవసరం. క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ మందులు వాడటం ద్వారా మూర్ఛను అదుపులో ఉంచుకోవచ్చు. మూర్ఛలో చాలా రకాలు ఉంటాయి. వ్యాధి తత్వం, రోగి వయసు, ఇతర పరిస్థితులపై... దానికి అందించాల్సిన చికిత్స ఆధారపడి ఉంటుంది. మూర్ఛ ఉన్నవారు వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ, క్రమం తప్పకుండా మందులు వాడాలి. మీ బాబుకు మూర్ఛవ్యాధి ఎందుకు వస్తుందో తెలుసుకొని, అందుకు అనుగుణంగా చికిత్స పొందడం ఎంతో ముఖ్యం. ఒకవేళ మీ బాబుకు ఉన్న మూర్ఛ రకానికి సర్జరీ అవసరమని వైద్యులు సూచిస్తే, అప్పుడు శస్త్రచికిత్సతో దానికి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. సర్జరీ అవసరం లేకుండా మందులు వాడమని సలహా ఇస్తే, వారు సూచించిన విధంగా, మందులు మానేయకుండా, డాక్టర్లు చెప్పేవరకు వాటిని వేసుకోవాలి. ఒకవేళ ఒకపూట మందులు వేసుకోవడం మరచిపోయినా, ఏదైనా కారణాలతో వేసుకోలేకపోయినా, గుర్తుకు రాగానే రెట్టింపు మందులు (ఇది డాక్టర్ సూచన మేరకు మాత్రమే) వేసుకోవాలి. వైద్యులను సంప్రదించకుండా మీ అంతట మీరు మందులను ఎట్టిపరిస్థితులలోనూ నిలిపివేయవద్దు. మూర్ఛ అనేది అదుపులో ఉంచుకోదగిన వ్యాధి. క్రమం తప్పకుండా మందులు వాడితే మూర్ఛ ఉన్నవారు కూడా అందరిలాగే సాధారణ జీవితం గడపగలుగుతారు. మూర్ఛ వ్యాధి ఉన్నవారు కాంతిమంతమైన వెలుగు ఉన్న చోట ఉండకూడదు. కంప్యూటర్, ల్యాప్‌టాప్ ముందు ఎక్కువ సమయం గడపడం మంచిది కాదు. ధ్వనులకు దూరంగా ఉండాలి. కార్లు, ద్విచక్రవాహనాలు నడపకూడదు. స్విమ్మింగ్ చేయకూడదు. ఎత్తులకు ఎక్కడం అంత మంచిది కాదు. -డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం సీనియర్ న్యూరో సర్జన్ యశోద హాస్పిటల్స్,సికింద్రాబాద్ యాండ్రాలజీ కౌన్సెలింగ్ నాకు 20 ఏళ్లు. నేను ఏడేళ్ల నుంచి హస్తప్రయోగం చేస్తున్నాను. రోజుకు కనీసం ఒకసారైనా హస్తప్రయోగం చేసుకుంటాను. ఈమధ్య ఎంతగా ప్రయత్నించినా నాకు అంగస్తంభన కలగడం లేదు. సెక్స్ మూడ్ కూడా రావడం లేదు. పైగా పురుషాంగం మీద నరాలు పైకి తేలి కనిపిస్తున్నాయి. సెక్స్‌కు, పెళ్లికి పనికిరానేమో అని ఆందోళనగా ఉంది. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - ఆర్.వి.కె.ఎమ్., చిట్యాల పురుషాంగం మీద నరాలు కనిపించడానికీ, అంగస్తంభనకూ ఎలాంటి సంబంధం లేదు. వాస్తవానికి పురుషాంగం లోపల ఉండే కండరాల్లోకి రక్తం ప్రవహించడం వల్ల అంగస్తంభన జరుగుతుంది. ఆ ప్రక్రియకూ, పురుషాంగం పైన కనిపించే నరాలకు అస్సలు సంబంధం లేదు. మీలాగే దాదాపు యువకులందరూ యుక్తవయసుకు రాగానే హస్తప్రయోగం మొదలుపెడతారు. అది చాలా స్వాభావికమైన చర్య. అయితే పోనుపోనూ అది యాంత్రికం అవుతుంది. అలా అవుతున్న కొద్దీ మొదట్లో ఉన్నంత థ్రిల్ కనిపించకపోవచ్చు. మీరు కెరియర్‌పై దృష్టి పెట్టండి. ఏదో ఒక సమయంలో మీకు మూడ్ వచ్చినప్పుడు మీది కేవలం అపోహ అన్న విషయం మీకే అర్థమవుతుంది. మీరు వివాహానికి పూర్తిగా అర్హులు. సంతృప్తికరమైన సెక్స్ జీవితాన్ని అనుభవించగలరు. నాకు 60 ఏళ్లు. రెండేళ్ల క్రితం వరకు బాగానే సెక్స్ చేస్తుండేవాణ్ణి. ప్రస్తుతం సెక్స్ చేయాలనే కోరిక ఉన్నా అంగస్తంభన సరిగా లేకపోవడంతో సెక్స్ చేయలేకపోతున్నాను. దీనికి తోడు రాత్రిళ్లు మూత్రానికి ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తోంది. నిద్రసరిగా పట్టడం లేదు. నాకు తగిన సలహా ఇవ్వండి. - డి.కె.ఎమ్., కొత్తగూడెం అరవై ఏళ్లు పైబడ్డ వాళ్లలో సెక్స్ సంబంధిత, మూత్ర సంబంధిత సమస్యలు కనిపించవచ్చు. వయసు పెరుగుతుండటంతో చాలా మందిలో కనిపించే సాధారణమైన సమస్యలే ఇవి. ప్రోస్టేట్ గ్లాండ్ పెరగడం వల్ల మూత్ర సంబంధిత సమస్య, రక్తనాళాలు కొంత బలహీనం కావడం వల్ల అంగస్తంభన సమస్యలు వచ్చి ఉండవచ్చు. ఈ రెండింటినీ మందులతో కొంత నయం చేయవచ్చు. దాంతోపాటు శారీరక, మానసిక దారుఢ్యం (ఫిట్నెస్) కోసం కృషి చేయడం ద్వారా మరికొంత సెక్సువల్ పెర్ఫార్మెన్స్ను పెంచుకోవచ్చు. షుగర్, కొలెస్ట్రాల్ వంటి పరీక్షలు చేయించుకుని అవి ఉంటే వాటిని నియంత్రించుకునేందుకు అవసరమైన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకసారి మీ యూరాలజిస్ట్/యాండ్రాలజిస్ట్‌ను కలవండి. - డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్ ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి హైదరాబాద్ -
మహిళలకు ఏ వయసులో గుండెజబ్బులు వస్తాయి?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 38. నేను మార్కెటింగ్ మేనేజర్‌గా పని చేస్తున్నాను. గత పదేళ్లుగా కిడ్నీలో, మూత్రనాళంలో రాళ్లతో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించట్లేదు. ఒకసారి ఆపరేషన్ కూడా అయింది. మళ్లీ రాళ్లు ఉన్నాయంటున్నారు. దీనికి హోమియోలో పరిష్కారం ఉంటే చెప్పగలరు. - బి.సురేందర్, ఆదిలాబాద్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతోంది. ఒక సర్వే ప్రకారం మన దేశంలో పురుషుల్లో 10.6 శాతం మంది, స్త్రీలలో 7.1 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, స్థూలకాయం, జన్యుపరమైన ఇన్ఫెక్షన్లు, ఎక్కువగా వేడి వాతావరణంలో ఉండటం, మూత్రనాళాల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు, వంశపారంపర్యత, కొన్ని రకాల మందుల వాడకం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా భావించవచ్చు. లక్షణాలు: పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, నీరసం, వికారం, తీవ్రమైన జ్వరం, విపరీతమైన చెమటలు, బరువు తగ్గడం, మూత్రంలో రక్తం పడటం, మూత్రంలో మంటతో కూడిన చీము పడటం. జాగ్రత్తలు * నీటిని ఎక్కువగా తాగడం, నీరుగాని ఇతర ద్రవపదార్థాలు గాని మొత్తం కలిపితే రోజుకు నాలుగు లీటర్లకు తగ్గకుండా తీసుకోవాలి. * కిడ్నీలో ఆక్సలేట్ రాళ్లు ఉంటే, ఆక్సలేట్ ఉండే పదార్థాలు అంటే చాకొలేట్, పాలకూర, సోయా, చిక్కుడు వంటివాటిని బాగా తగ్గించాలి. * కాల్షియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది కాబట్టి ఇవి శరీరానికి అందేలా ఆహార నియమాలను పాటించడం మంచిది. * కూల్‌డ్రింక్స్‌ను పూర్తిగా మానేయడం మంచిది. నిర్థారణ: కిడ్నీ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, కిడ్నీ పరీక్ష, రక్తపరీక్ష, మూత్రపరీక్ష హోమియో చికిత్స హోమియోపతిలో శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా కిడ్నీ రాళ్ల పరిమాణం, అవి ఏ వైపున ఏర్పడ్డాయో, వాటి ఆధారంగా మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బెరి బెరి వల్గారిస్, సారస్పరిల్లా, కాల్కేరియా కార్బ్, కోలోసింత్ మందులను వైద్యుని పర్యవేక్షణలో వాడాలి. స్టార్ హోమియోపతిలో రోగిలోని రోగ నిరోధక శక్తిని పెంచుతూ, ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్‌లూ లేకుండా, శస్త్రచికిత్సతో అవసరం లేకుండా కిడ్నీలు, మూత్ర నాళాలలోని రాళ్లను తొలగించే మందుల వాడకం ద్వారా సమస్యకు శాశ్వత చికిత్స లభిస్తుంది. కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. నేను ప్రభుత్వ ఉద్యోగినిని. ఇటీవల నా భర్తకు ఛాతీలో నొప్పి వచ్చిందని ఆసుపత్రికి తీసుకెళ్తే గుండె రక్తనాళాల్లో పూడిక ఏర్పడిందని చెప్పి స్టెంట్ వేశారు. తర్వాత మా ఆయన మళ్లీ సాధారణ జీవితం గడపగలుగుతున్నారు. ఇటీవల మా ఆయనకు వచ్చినట్లే నాకు కూడా ఛాతీలో నొప్పి వస్తోంది. మెట్లు ఎక్కుతున్నప్పుడు, ఎక్కువ సేపు నడిచినప్పుడు నొప్పి ఎక్కువవుతోంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే మళ్లీ సాధారణంగా అవుతోంది. అయితే నా వయసు గల మహిళలకు గుండెజబ్బులు రావని తెలిసిన వాళ్లు అంటున్నారు. నాకు గుండెజబ్బు వచ్చే అవకాశం ఉందా? దయచేసి నా సమస్యకు పరిష్కారం తెలుపగలరు. - మాధవి, కర్నూలు ఒకప్పుడు మహిళలకు త్వరగా గుండె జబ్బులు వచ్చేవి కావు. కానీ ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి కారణంగా మహిళలు కూడా పురుషులతో సమానంగా గుండెజబ్బుల బారిన పడుతున్నారు. ప్రధానంగా ఉద్యోగాలు చేసే మహిళల్లో గుండెజబ్బులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కార్యాలయలలో పనిభారంతో పాటు ఇంట్లో పనిభారం కూడా పెరిగిపోవడంతో మహిళలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. మీ కుటుంబంలోగానీ, మీ వంశంలోగాని ఎవరికైనా గుండెజబ్బులు ఉన్నా, మీకు మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు ఏమైనా ఉన్నా మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎన్ని రోజులుగా ఛాతీలో నొప్పి వస్తోందో మీరు తెలపలేదు. మీరు రాసిన లక్షణాలను బట్టి గుండెజబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. మీ ఆరోగ్యపరిస్థితిని బట్టి చికిత్స ప్రారంభిస్తారు. ఒకవేళ మీకు ఎలాంటి అనారోగ్యం లేకపోయినా ఏడాదికి ఒకసారి వైద్యపరీక్షలు చేయించుకోవడం మంచిది. ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. నా భర్త వయసు 32 ఏళ్లు. పెళ్లయి ఏడాది అయ్యింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం. మేమేమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలా? - సరళ, హైదరాబాద్ గర్భధారణ కోరుకుంటున్నప్పుడు అందుకోసం ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా ప్రధానం. ముందుగా మీరిద్దరి సాధారణ ఆరోగ్యం బాగుండేలా చూసుకోవాలి. మీకు డయాబెటిస్, హైబీపీ, గుండె సమస్యలు, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలుంటే ముందుగానే డాక్టర్‌కు చూపించుకోవాలి. ఒకవేళ ఏమైనా సమస్యలుంటే గర్భధారణ సమయంలో వాటివల్ల వచ్చే కాంప్లికేషన్లు ఏమిటో తెలుసుకోవాలి. ఇప్పటికే ఏమైనా మందులు వాడుతున్నట్లయితే, గర్భధారణ సమయంలో తల్లికీ, బిడ్డకూ అవి సురక్షితమేనా అని డాక్టర్ ద్వారా సరిచూసుకోవాలి. సాధారణంగా చాలామంది దంపతుల్లో తాము ప్లాన్ చేసుకున్న ఆర్నెల్లలో ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇక శరీర బరువు మరో ప్రధానమైన అంశం. మీ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) గనక 35 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా లేదా 19 కంటే తక్కువ ఉన్నా గర్భధారణ జరగడానికి చాలా టైమ్ తీసుకుంటుంది. అందుకే ఆరోగ్యకరంగా ఉండాల్సిన బరువు ఉంటూ బీఎమ్ఐను ఆ విలువల మధ్య ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. మీ భర్తకు పొగతాగే అలవాటు ఉంటే అది గర్భధారణపైన దుష్ర్పభావం చూపవచ్చు. మీ భర్తకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే మానేయమని చెప్పండి. ఎందుకంటే ఆల్కహాల్ వీర్యకణాల నాణ్యతను తగ్గిస్తుంది. అలాగే ఒత్తిడి నుంచి ఇద్దరూ దూరంగా ఉండండి. ఎందుకంటే ఒత్తిడి కూడా గర్భధారణ అవకాశాలను తగ్గిస్తుంది. ఇక అన్నిటి కంటే ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత ప్రతిరోజూ 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ మాత్రలను తీసుకొండి. దీనివల్ల బిడ్డ మెదడు ఎదుగుదల బాగుండటంతో పాటు బిడ్డలో వెన్నుపాము సంబంధించిన లోపాలు రాకుండా ఉంటాయి. మీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి మీ డాక్టర్‌ను సంప్రదించండి.