Honor killings
-
ప్రేమిస్తే చంపేస్తారు!
యశవంతపుర: ప్రేమిస్తే కుటుంబ పరువు ప్రతిష్టల పేరుతో కన్నబిడ్డలనే ప్రాణాలు తీసే ఉదంతాలు రాష్ట్రంలో విస్తరిస్తున్నాయి. తాజాగా ప్రేమ జంట హత్యకు గురైన సంఘటన బాగలకోట జిల్లాలో జరిగింది. జిల్లాలోని బేవినమట్టి గ్రామంలో బాలికను, ఆమె ప్రియున్ని బాలిక కుటుంబ సభ్యులే హతమార్చారు. వివరాలు.. గ్రామంలో నివసించే బాలిక, విశ్వనాథ నెలగి (22) అనే యువకుడు ప్రేమలో పడ్డారు. ఇది బాలిక కుటుంబానికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అతన్ని ప్రేమించవద్దని బాలికకు పలుమార్లు నచ్చజెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఆమె తండ్రి పరసప్ప, సోదరుడు రవి హుల్లణ్ణవర(19), బావ హనుమంత మల్నాడద (22), మరో బంధువు బీరప్ప దళవాయి(18)లు కలిసి ఆ జంటను హత్య చేయాలని పథకం వేశారు. పెళ్లి చేస్తామని నమ్మించి దారుణం తమ కుట్ర ప్రకారం ప్రేమ జంటకు పెళ్లి చేస్తామని నమ్మించారు. అక్టోబరు 1వ తేదీన గదగ జిల్లా నరగుందలో ఉన్న విశ్వనాథ నెలగిని, బేవినమట్టిలో ఉన్న బాలికను నిందితులు కారులో తీసుకెళ్లారు. వాహనంలోనే బాలిక గొంతుకు చున్నీతో బిగించి, యువకున్ని తీవ్రంగా కొట్టి బండరాయితో బాది ప్రాణాలు తీశారు. అనంతరం శవాల నుంచి వ్రస్తాలను తొలగించి ఆలమట్టి రోడ్డులోని వంతెనపై నుంచి కృష్ణానదిలో పడేసి ఊరికి వెళ్లిపోయారు. విచారణలో వెలుగులోకి కొడుకు కనిపించకపోవడంతో యువకుని తండ్రి ఈ నెల 3న నరగుంద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు 11వ తేదీన కూతురు మిస్సయిందని ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఈ నెల 15 బాగల్‌కోట గ్రామీణ పోలీసులు అనుమానం వచ్చి రవి హుల్లణ్ణవరను అదుపులోకి తీసుకొని విచారించారు. తమ కుటుంబ పరువు పోతుందని భావించి హత్య చేశామని ఒప్పుకున్నాడు. దీంతో మిగతా నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. కృష్ణానదిలో పడవేసిన ఇద్దరి మృతదేహాలు ఇప్పటికీ దొరకలేదు. (చదవండి: చీకటి గదిలో బంధించి, బలవంతంగా పెళ్లి) -
మాకు ప్రాణహాని ఉంది: అవంతి
సాక్షి, హైదరాబాద్: పరువు హత్యకు గురైన హేమంత్ భార్య అవంతి డీసీపీ వెంకటేశ్వర్లును కలిశారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న అవంతి, పోలీసుల వద్దనున్న తన భర్త వస్తువులను తీసుకోనున్నారు. ఆమె వెంట హేమంత్ తల్లిదండ్రులు, సోదరుడు కూడా ఉన్నారు. కాగా గతంలో తన పట్ల వ్యవహరించిన తీరు, హేమంత్‌ను దారుణంగా హత్య చేయించిన క్రమంలో తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ అవంతి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి తమకు భద్రత కల్పించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేయనున్నారు.(చదవండి: హేమంత్‌ది పరువు హత్య: గచ్చిబౌలి పోలీసులు) కాగా అవంతిని ప్రేమించి పెళ్లిచేసుకున్న హేమంత్ ఈ నెల 25న అత్యంత దారుణ పరిస్థితుల్లో హత్యకు గురైన విషయం విదితమే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసులో మొత్తం 22 మంది నిందితులను గుర్తించిన పోలీసులు.. దీనిని ‘పరువు హత్య’ గా తేల్చారు. పక్కా పథకం ప్రకారమే, తమ పరువు తీశాడనే పగతోనే అవంతి తల్లిదండ్రులు అతడిని హత్య చేయించినట్లు పేర్కొన్నారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే లోకల్ గ్యాంగ్‌తో కలిసి అతడి హతమార్చినట్లు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మామ యుగంధర్ తమ ముందు అంగీకరించినట్లు వెల్లడించారు. -
ప్రేమ మాయలో యువత
గద్వాల క్రైం: పిల్లలు ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో గౌరవంగా బతకాలని తల్లిదండ్రులు కోటి ఆశలు పెట్టుకుంటారు. అయితే ఇక్కడే యువత ప్రేమనే మాయలో పడి తప్పటడుగు వేస్తారు. అమ్మాయిలు, అబ్బాయిలు స్నేహభావంతో మెలగాల్సిన క్రమంలో చెడు ఆలోచనలకు దారి తీస్తోంది. దీంతో విద్యాభ్యాసానికి చెక్ పెడుతున్నారు. కన్నవారి కలలు దూరం చేస్తూ కష్టాల సుడిగుండంలో పడుతున్నారు. పరువు హత్యలే.. ప్రేమ మాయలో పడిన యువత పెద్దల మాటలు వినకుండా రహస్యంగా రిజిస్ట్రేషన్ కార్యాలయం, ఆలయాల్లో స్నేహితుల సమక్షంలో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ కులం, మతం కాని వాడిని పెళ్లి చేసుకుందని తీవ్ర మనోవేదనకు లోనవుతారు. సమాజం, బంధువులు, ఇరుగు పొరుగు వారు తమను చిన్నచూపు చూస్తారనో, కుటుంబ పరువు, ప్రతిష్ట దిగజారిందనే ఆవేశంలో సొంత బిడ్డలను సైతం హత్యచేసి పరువు దక్కిందని భావిస్తుంటారు. చివరకు కుటుంబ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారు. కట్టుబాట్లంటూ.. జాతి, మతం, కులమంటూ ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఈ ఆధునిక కాలంలోనూ చాలామంది కట్టుబాట్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పట్టణాల్లో అంతగా కనిపించకపోయినా పల్లెల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుంది. తమ పిల్లలు తప్పు చేస్తే పరువు పోతుందనే ఆలోచనలో ఉంటారు. ఇటీవలే జిల్లాలోని మానవపాడు మండలం కల్లుకుంట్లకు చెందిన దివ్య(22) పరువు హత్యకు బలైంది. పేగు బంధం కంటే పరువు, కులమే ముఖ్యమనే ధోరణిలో తల్లిదండ్రులే ఆమెను హతమార్చారు. చివరికి వారు జైలు పాలయ్యారు. జిల్లాలో ఈ సంఘటన కలకలం రేగింది. పెద్దల ఆలోచనల్లో మార్పు రావాలి.. కుల వ్యవస్థ కంటే మానవ సంబంధాలు చాలా ముఖ్యం. మారుతున్న కాలనుగుణంగా యువత మార్పు కోరుకుంటున్నారు. వారి ఆలోచనలకు పెద్దలు మద్దతివ్వాలి. నవ సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. వేరే మతం, కులం అంటూ బేధాభిప్రాయాలు లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న అనుబంధాలను గౌరవించాలి. మూర్ఖత్వంతో పరువు పోతుందని సొంత బిడ్డలను హత్య చేయడం నేరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం కల్పించిన స్వేచ్ఛకు విఘాతం కల్పిస్తే చర్యలు తప్పవు.– యాదగిరి, డీఎస్పీ, గద్వాల ప్రజల్లో చైతన్యం రావాలి.. సమాజంలో అందరం సమానమే. కులం, మతం, ఆచారాలు, కట్టుబాట్లు అంటూ అనాగరికులుగా ప్రజలు సమాజంలో జీవనం సాగిస్తున్నారు. కులాంతర వివాహాలతో ప్రజల్లో భేషజాలు తగ్గుముఖం పడుతాయి. ఒకరిపై ఒకరు ప్రేమతో మెలుగుతారు. నేడు పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో కులం, మతం అడ్డుగోడలుగా ఉన్నాయి. ప్రభుత్వం అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి.– జ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి, చైతన్య మహిళా సంఘం, గద్వాల -
పరువు హత్య
కోర్టులు కన్నెర్ర చేసినా, హెచ్చరికలు ఇచ్చినా, ఉరి శిక్షలు విధించినా రాష్ట్రంలో పరువు హత్యలు మాత్రం ఆగడం లేదు. తిరునల్వేలి జిల్లా వీరనల్లూరులో పరువు హత్య చోటు చేసుకుంది. తన ప్రియుడ్ని కిరాతకంగా కుటుంబీకులు హతమార్చిన సమాచారంతోప్రియురాలు మనో వేదనతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనఇరు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతను రేపింది. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఇటీవల కులాంతర ప్రేమ వివాహాలు పరువు హత్యలకు దారితీస్తున్న విషయం తెలిసిందే. పెద్దల పరువుకు, కుల చిచ్చుకు ఎందరో యువతీ, యువకులు హత్యలకు గురయ్యారు. కొన్ని వెలుగులోకి రాగా, మరికొన్నింటిని చాప కింద నీరులా తొక్కేస్తున్నారు. ఇటీవల కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్నందుకు, ధర్మపురిలో ఇలవరసన్, ఓమలూరులో గోకుల్ రాజ్, ఉడుమలైలో శంకర్.. ఇలా ఎందరో అతి కిరాతకంగా హత్యకు గురయ్యారు. అలాగే, తిరునల్వేలిలో తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ యువకుడ్ని మాయ మాటలు చెప్పి ఇంటికి పిలిపించి మరీ ఓ కుటుంబం దారుణంగా కడతేర్చింది. ఈ పరువుహత్యలను మద్రాసు హైకోర్టు సైతం తీవ్రంగా పరిగణించింది. కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే దంపతులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. పరువు హత్యల కట్టడి లక్ష్యంగా ప్రత్యేక చట్టం తీసుకొచ్చే రీతిలో ఆదేశాల్ని హైకోర్టు ఇచ్చింది. అలాగే, కొన్ని పరువు హత్యలపై కన్నెర్ర చేస్తూ నిందితులకు ఉరిశిక్షలు సైతం విధించింది. అయినా, హత్యల పరంపర మాత్రం ఆగడం లేదు. గత వారం కృష్ణగిరి జిల్లా çహొసూరులో పరువు హత్య జరగ్గా, ప్రస్తుతం తిరునల్వేలిలో మరో పరువు హత్యచోటు చేసుకుంది. మూడేళ్లుగా ప్రేమ వీరనల్లూరు వెల్లకులి గ్రామానికి చెందిన ఇసక్కి శంకర్ కలకాడులోని సహకార బ్యాంక్‌లో ఉద్యోగి. వెల్లకులికి చెందిన దళవాయి కుమార్తె సత్యభామ(21) ప్రేమలో పడ్డాడు. కొంత కాలం ఆమె చుట్టూ తిరిగి, ప్రేమను గెలిచారు. ఈ ఇదరివీ వేర్వేరు కులాలైనా, ఈ జంట మాత్రం తాము ఒక్కటే అన్నట్టుగా చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది. మూడేళ్లుగా సాగుతూ వచ్చిన ఈ ప్రేమ వ్యవహారం దీపావళి సందర్భంగా ఇంటి పెద్దల చెవిన పడింది. బీకాం మూడో సంవత్సరం చదువుతున్న సత్యభామను కాలేజీకి పంపించకుండా కుటుంబీకులు ఇంటికి పరిమితం చేశారు. దీంతో ప్రేమికుల మధ్య దూరం ఏర్పడింది. పెద్దల్ని ఎదిరించి ఈ జంటపెళ్లికి సిద్ధ పడింది. ఇది గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. శంకర్ కుటుంబీకులు సత్యభామను తమ కోడలుగా చేసుకునేందుకు సిద్ధపడ్డా, దళవాయి మాత్రం శంకర్‌ను అల్లుడిగా చేసుకునేందుకు అంగీకరించలేదు. ఇరు కుటుంబాల మధ్య ఈ ప్రేమ జంట కారణంగా గొడవలు జరగడంతో వ్యవహారం గ్రామ పంచాయతీ పెద్దలకు చేరింది. ఇరు కుటుంబాలతో పెద్దలు మాట్లాడారు. అయితే, శంకర్‌కు ఉద్యోగం ఉన్న దృష్ట్యా, ఆలోచించాలని దళవాయికి పెద్దలు హితబోధ చేశారు. కులం వేరు కావడంతో తొలుత దళవాయి నిరాకరించాడు. చివరకు గ్రామ పెద్దల హిత బోధతో మెట్టుదిగాడు. అయితే, తన కుమార్తె చదువు పూర్తయ్యాకే వివాహం అంటూ అందర్నీ నమ్మ బలికి పెద్దల పంచాయితీని సుఖాంతం చేశాడు. మరణంలో ఏకమయ్యారు తండ్రి మాటల్ని నమ్మిన సత్యభామ రోజు కళాశాలకు వెళ్లి వచ్చేది. అయితే, తనలోని కుల గజ్జి దళవాయిని వీడలేదు. పథకం ప్రకారం శంకర్‌ను మట్టుబెట్టేందుకు సిద్ధం అయ్యాడు. తన సామాజిక వర్గానికి చెందిన కొందరు యువకుల్ని ఏకం చేశాడు. వారు పథకం ప్రకారం మంగళవారం శంకర్‌ను మట్టుబెట్టేందుకు సిద్ధం అయ్యారు. ప్రతిరోజు పని ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో శంకర్‌కు తామరభరణి నదిలో స్నానం చేసే అలవాటు ఉండడంతో పథకాన్ని అక్కడే అమలుచేయడానికి సిద్ధం అయ్యారు. శంకర్ స్నానం చేయడానికి సిద్ధం అవుతున్న సమయంలో చుట్టుముట్టిన ఆ కిరాతకులు కత్తులు, వేట కొడవళ్లతో నరికి చంపేశారు. శంకర్ మరణించాడని ధ్రువీకరించుకుని అక్కడి నుంచి ఉడాయించారు. రాత్రి పది గంటల సమయంలో శంకర్ మృతదేహం నదీ తీరంలో పడి ఉన్న సమాచారం వీర నల్లూరు, వెల్లంకులి పరిసరాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. పథకం ప్రకారం దళవాయి కుటుంబం శంకర్‌ను హతమార్చిందన్న ఆగ్రహంతో రెండు సామాజికవర్గాల మధ్య వివాదం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ రెండు గ్రామాల్లో గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. దళవాయి ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు. అయితే, ప్రేమించిన వాడిని తన కుటుంబం మట్టుబెట్టడంతో సత్యభామ తీవ్ర మనోవేదనకు గురైంది. రాత్రి తన గదిలో దుప్పట్టాతో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయాన్నే గది నుంచి సత్యభామ బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు తలుపులు పగులగొట్టి చూడగా ఉరిపోసుకుని వేలాడుతున్న మృతదేహం బయటపడింది. ఆ కుటుంబం కన్నీటి పర్యంతం అయింది. సమాచారం అందుకున్న తిరునల్వేలి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటన మీద విచారణ చేపట్టారు. సత్యభామ ఆత్మహత్య చేసుకుందా? లేదా, కుటుంబీకులు హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే పనిలో పడ్డారా..? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. -
కులతత్వంపై యుద్ధారావం ‘ప్రణయ్’
రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అందించిన అవకాశాల వల్ల అన్ని కులాల బిడ్డలూ ఒకే చోట చదువుకుని, ఉద్యోగాలు చేసే అవకాశాలొచ్చాయి. దీంతో కులాల గోడలను పెకిలించుకొని స్వేచ్ఛావిహంగాలై పిల్లలు ఎగురుతున్నారు. చాలా మంది పిల్లలు తమ మనసుని చంపుకుని ఇంకా కులాల కుంపట్లోనే మాడిపోతున్నారు. కొద్ది మంది మాత్రమే ప్రణయ్, అమృతల్లాగా కులరక్కసి కోరలు పీకడానికి రక్తతర్పణకి సైతం వెనకాడటంలేదు. ఇది కులం గోడలను తునాతునకలు చేయడానికి వేసిన తొలి సమ్మెట దెబ్బ. కులం అనే మురికి అడ్డుపడినంత మాత్రాన ఆధునికతను అందిపుచ్చుకుంటోన్న యువతరం అంతరంగ మహాప్రవాహాన్ని ఎవరు మాత్రం అడ్డుకోగలరు? ‘‘1950 జనవరి 26 తేదీ నుంచి మనం వైరుధ్యాల జీవితంలోనికి అడుగుపెట్టబోతున్నాం. రాజకీయాలలో సమానత్వాన్నీ, సామాజిక ఆర్థిక రంగాలలో అసమానత్వాన్నీ ఎదు ర్కోబోతున్నాం. ఒక మనిషి, ఒక ఓటు. ఒక ఓటు, ఒక విలువ అనే సూత్రంతో రాజకీయాల్లో సమా నత్వం సిద్ధిస్తున్నా, సామాజిక, ఆర్థిక రంగాల్లో ఇంకా కొనసాగుతోన్న అసమానత్వం ఒక మనిషికి ఒక విలువ అనే సూత్రాన్ని నిరాకరిస్తోంది. ఎంతకాలం మనం ఈ వైరుధ్యాల జీవితాలను కొనసాగించాలి? ఎంత కాలం సామాజిక, ఆర్థిక రంగాల్లో సమాన త్వాన్ని నిరాకరిస్తాం. ఇదే విధానం కొనసాగితే మనం సాధించుకున్న రాజకీయ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. సాధ్యమైనంత త్వరలో మనం ఈ వైరుధ్యాలను తొలగించాలి. లేదంటే ఎంతో శ్రమకోర్చి రాజ్యాంగ సభ నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య సౌధాన్ని అసమానతలతో కుంగి, కృశించిపోతోన్న ప్రజలు పేల్చి వేస్తారు’’.. దాదాపు ఏడు దశాబ్దాల క్రితం భారత రాజ్యాంగ సభలో బాబాసాహెబ్ అంబేడ్కర్ భవిష్యత్ అసమాన సమాజాన్ని ఉద్దేశించి చేసిన హెచ్చ రిక ఇది. ఈ దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన రాజకీయ పార్టీలూ, దేశానికి దిశానిర్దేశం చేస్తామం టోన్న మేధావి వర్గాలూ ఈ హెచ్చరికను ఇసుమం తైనా లక్ష్యపెట్టలేదు. దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా దళి తులపైనా, ఆదివాసీలపైనా, మహిళలపైనా, మైనార్టీ లపైనా దాడులూ హత్యలూ, అత్యాచారాలూ కొనసా గుతూనే ఉన్నాయి. దళిత బిడ్డల నెత్తురు ఏరులై ప్రవ హిస్తూనే ఉంది. కుప్పలుపడిన శతాబ్దాల హింసా శకలాల్లో నల్గొండ జిల్లా దళిత బిడ్డ ప్రణయ్ హత్య కూడా ఒకటి. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ కుటిలత్వం తెలియని అమృత, ఈ సమాజంలో కులం కన్నబిడ్డల కంఠాలను తెగనరికేందుకు సైతం వెనకాడదని తెలియని ఓ అగ్రకుల యువతి, ప్రేమని మించింది ఈ ప్రపంచంలో మరొకటుండదని మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి, ఆధునికతతోనో, చైతన్యమో తన ప్రేమ విషయంలో అత్యంత పరిణతి ప్రదర్శించింది. తన మాట కాదన్న తల్లిదండ్రుల కుల దురహంకా రాన్ని తలదన్ని తను కోరుకున్న వ్యక్తి చెంతకు చేరింది. ఎందరో అభివృద్ధికాముకులు తమ బిడ్డల విషయంలోసైతం చేయలేని సాహసాన్ని ఆమె చేసి చూపించింది. సమాజం దృష్టిలో కులం తక్కువ వాణ్ణి చేసుకున్నానన్న అపరాధ భావన ఆమెకు ఏ కోశానా లేదు. తన కులాంతర వివాహాన్ని దాచి పెట్టాలన్న అభిప్రాయం అంతకన్నా లేదు. అందుకే తన ఆనందాన్ని రిసెప్షన్ రూపంలో పంచుకుంది. బహుశా గుట్టుచప్పుడు కాకుండా ఎక్కడో చోట పడి ఉంటే తండ్రిలోని కర్కశత్వం అంత త్వరగా బయట పడేది కాదేమో, కానీ తన కళ్లెదుటే కులం తక్కువ వాణ్ణి పెళ్ళి చేసుకొని తన హర్షాతిరేకాలను ప్రకటిం చిన కూతురి ఆనందాన్ని సహించలేకపోయాడు. డబ్బుమదంతో విర్ర వీగుతోన్న అమృత తండ్రి, కూతుర్ని నమ్మించి, మోసగించి కోటి రూపాయలు సుపారీ ఇచ్చి మరీ నడిరోడ్డుపై అల్లుడి తలను తెగ నరికించాడు. ఈ ఘటనను సమాజం తమకి నచ్చి నట్టుగా, కులం పట్ల తమతమ అవగాహనకు తగ్గ ట్టుగా అర్థం చేసుకుంది. దేశవ్యాప్తంగా ప్రగతిశీల భావాలుగలవారు దీన్ని నిర్ద్వంద్వంగా నిరసించారు. ప్రతిఘటించారు. అయితే ఇది మొదటిదీ, ఇదే చివ రిదీ కూడా కాదు. నల్గొండ ఘాతుకపు నీలినీడలు మనని వీడి పోక ముందే హైదరాబాదు నగరం నడి బొడ్డున కన్న తండ్రే కూతురి తలతెగనరికిన పాశవిక చర్య ఆధునిక సమాజపు ఆనవాళ్ళను మధ్యయుగా లంతటి వెనక్కి తరిమికొట్టింది. ఇక్కడ అమృత తండ్రో, లేదామరో వ్యక్తో కారణం కానేకాదు... తర తరాలుగా ఈ నేలలో ఇంకిన దళితుల నెత్తురంతా కులరక్కసి కారణంగానే. ఈ సమాజాన్ని అగాధం లోకి తోసేస్తోన్న కుల రాకాసి ప్రభావాన్ని ఇప్పటి కింకా తక్కువ చేసి చూడటం మనలో పాతుకుపో యిన అగ్రకుల భావజాలానికి నిదర్శనం. ఒక్కమా టలో చెప్పాలంటే దళిత బిడ్డల హత్యలన్నీ కుల వ్యవస్థలో దాగి ఉన్న ఆధిపత్యానికీ, నిరంకుశత్వా నికీ, హింసాప్రవృత్తికీ ప్రత్యక్ష సాక్ష్యం. అందుకే దీన్ని వ్యక్తుల నేరస్వభావంగా కాకుండా కుల వ్యవస్థ అమానుష హత్యాకాండగా అర్థం చేసుకోవాలి. కుల వ్యవస్థ పుట్టుక, విస్తరణ, ప్రభావం చివరకు దాని నిర్మూలన గురించి అంబేడ్కర్ చాలా శాస్త్రీయంగా విశ్లేషిస్తారు. తనకు తానుగా బంధించుకున్న ఒక పంజరంగా కులాన్ని వర్ణిస్తారాయన. కులం పునాదులను కాపాడుకునేందుకు తన వర్గం వారిని ఉన్నతులుగానూ, ఇతరులను నీచులుగానూ చూసే స్వభావాన్ని ఇది సంతరించుకుంది. ప్రతిష్టను, పరు వునీ ఉన్నతమైన విలువల్లో కాక కులం మూలాల్లో వెతుక్కునే స్వభావం ఎంతటి అమానుషానికైనా ఒడి గట్టే క్రూరత్వానికి కారణం. కులం హిందూ ధర్మశాస్త్రాల పునాదుల్లోంచి పుట్టింది. ఒక కులం వాడు ఇంకొక కులం వాడిని నాయకుడిగా ఒప్పు కోడు. అమృత తండ్రి మారుతీరావు తన నేరాన్ని బహిరంగంగా ఒప్పుకున్నప్పటికీ, అదే కులానికి చెందిన పెద్దలు ఊరేగింపు చేసి, కూతురిని చంపి దోషిగా నిలిచిన వ్యక్తిని పరామర్శించి, ఓ నేరస్తుడికి అండగా నిలుస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఇది ఇటీవలి కాలంలో పొడసూపుతోన్న ఓ నీచమైన సంస్కృతికి తార్కాణం. తన కులంవాడు ఎంత చెడ్డవాడైనా వాడికోసం నిలబడటమే కులం యొక్క బలంగా చలామణీ అవుతోంది. భారత రాజ్యాంగం అందించిన సమానత్వ హక్కులూ, ప్రజాస్వామ్య భావనలూ దేశపు రూపు రేఖలను మార్చబోతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగు తోన్న పరిణామాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తోన్న మార్పులు, ఆధునికతతో ప్రజాస్వామ్య భావనలను సమాజం పుణికిపుచ్చుకుంటోంది. అందులో భాగంగానే ప్రణయ్, అమృతలాంటి యువతీయువకుల కులాంతర, మతాంతర వివా హాలు ఈ కుల వ్యవస్థపై ఒక తిరుగుబాటుగానే భావించాలి. అణగారిన వర్గాలు తలలు ఎగరేస్తే తలలు తెగిపడతాయనే విషయం కొత్తది కాదు. అయినా తలెత్తుకుని తిరగడానికి దళితబిడ్డలు, వారి జీవితాల్లోకి వస్తోన్న దళితేతరుల బిడ్డలు ఒక్క క్షణం తటపటాయించడం లేదు. ఇదే కులం పునాదులను పెకిలించే ఆధునిక ప్రజాస్వామ్య ఉప్పెనై, మనువాద సనాతన సాంప్రదాయాల మురికిని తుడిచిపెట్టేం దుకు సిద్ధమౌతోంది. రాజ్యాంగ రక్షణ లేనప్పుడు, నగరాలూ, పట్ట ణాల అభివృద్ధి కానప్పుడు, పారిశ్రామిక రంగం ఉనికిలోలేనప్పుడు గ్రామాల్లో ఏ కులానికి ఆ కులం తమ తమ వృత్తులలో మునిగి ఉండేవి. కులాల మధ్య సంబంధాలకు తావేలేదు. అంటరానివారికి గ్రామాల్లో ప్రవేశం లేదు. కానీ పరిస్థితి మారింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అందించిన అవకాశాల వల్ల అన్ని కులాల బిడ్డలూ ఒకే చోట చదువుకుని, ఉద్యోగాలు చేసే అవకాశాలొచ్చాయి. దీంతో కులాల గోడలను పెకలించుకుని స్వేచ్ఛా విహంగాలై పిల్లలు ఎగురుతున్నారు. చాలా మంది పిల్లలు తమ మన సుని చంపుకుని ఇంకా కులాల కుంపట్లోనే మాడి పోతున్నారు. కొద్దిమంది మాత్రమే ప్రణయ్, అమృ తల్లాగా కులరక్కసి కోరలు పీకడానికి రక్త తర్పణకి సైతం వెనకాడటంలేదు. కులాంతర వివా హాలను ఒక మార్పుగా మాత్రమే చూడటం తప్పు. ఇది కులం గోడలను తునాతునకలు చేయడానికి వేసిన తొలి సమ్మెట దెబ్బ. కులం అనే మురికి అడ్డుపడి నంత మాత్రాన ఆధునికతను అందిపుచ్చుకుంటోన్న యువతరం అంతరంగ మహాప్రవాహాన్ని ఎవరు మాత్రం అడ్డుకోగలరు? సోషల్ మీడియా సాక్షిగా కులాలకతీతంగా పెల్లుబుకుతోన్న ప్రగతిశీల భావ జాలం ఆ«ధునికతరం అంతరంగాన్ని ఆవిష్కరి స్తోంది. దీన్నే ప్రణయ్ సహచరి అమృత చేపట్టిన కులవ్యతిరేకోద్యమం రుజువుచేసింది. కానీ ప్రభుత్వాలూ, రాజకీయ పార్టీలూ, మేధావి వర్గం కుల వ్యవస్థ నిర్మూలనా కర్తవ్యాన్ని విస్మరిస్తున్నాయి. రాజ్యాంగంలో ఉన్న రక్షణల ఆధా రంగా ఎన్నో చట్టాలు రూపొందినా వాటి అమలులో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టమే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఆ చట్టం ఉద్దేశమే నేరాల నిరోధం. కానీ ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు చట్టం స్ఫూర్తినే దెబ్బతీస్తున్నారు. ప్రణయ్ విషయంలో సైతం పోలీ సులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదనేది సుస్పష్టం. దేశవ్యాప్తంగా ఇదే స్థితి. రాజకీయ పార్టీలు కులం విషయంలో తలదూర్చితే తమ ఓట్లు రాలవనే భయంతో కుల నిర్మూలన అనే రాజ్యాంగ లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మేధావి వర్గం కూడా ప్రేక్షక పాత్రనే వహించడం బాధాకరం. వందేళ్ళ క్రితం బొంబాయి ప్రెసిడెన్సీలో ఆధిపత్య కులాలకు చెందిన ఆనాటి ప్రముఖులు ‘ఆల్ ఇండియా యాంటీ అన్ టచ్బులిటీ మానిఫెస్టో’ విడుదల చేసారు. డిప్రెస్డ్ క్లాస్ మిషన్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ నాయకత్వంలో ముంబాయిలో 1918 మార్చి 23, 24 తేదీల్లో జరిగిన సభ ఆనాడు అంటరాని కులాలకు తమ మద్దతును ప్రకటించింది. ఈ సమావేశానికి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు విఠల్‌భాయ్ పటేల్, ఎమ్మార్ జైకర్, బిపిన్ చంద్రపాల్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. డాక్టర్ హరోల్డ్ మన్, రవీంద్రనాథ్ ఠాగూర్, ద్వారకాపీఠం శంకరాచార్య, డాక్టర్ కురాటకోటి లాంటి వారు అంటరానితనానికి వ్యతిరేకంగా సందేశాలను పంపారు. వీరంతా దళితే తరులేనని అర్థం చేసుకోవాలి. ఇదే స్పందన తక్షణా వసరం. కులం ఒక మానసిక రుగ్మత. కేవలం అంట రాని కులాలే దీన్ని తొలగించుకుంటే సరిపోదు. ఆధి పత్య కులాలతో సహా అందరూ కులతత్వాన్ని వది లించుకుని మానవీయ విలువలనే పరువుప్రతిష్ట లుగా భావించాల్సిన తరుణమిది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
నా తండ్రికి మరణ శిక్ష పడేలా చేశా..
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: కులాంతర వివాహితుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని సామాజికవేత్త, తమిళనాడులో హత్యకు గురైన శంకర్ భార్య కౌసల్య డిమాండ్ చేశారు. మిర్యాలగూడలో ప్రణయ్ భార్య అమృత వర్షిణిని పరామర్శించిన ఆమె కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. నేను ఒక దళిత యువకుడిని వివాహం చేసుకున్నందుకు కక్షగట్టి నా తల్లిదండ్రులు, బంధువులు 2016 మార్చి 13న నా భర్త శంకర్‌ను హత్య చేశారని, ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన నా తలకు 36 కుట్లు పడ్డాయని చెప్పారు. నా భర్తను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని పోరాటం చేశానని, అందుకు జిల్లా కోర్టు నా తండ్రితోపాటు మరో ఐదుగురికి మరణ శిక్ష, ఒకరికి యావజ్జీవ కారగార శిక్ష విధించిందని చెప్పారు. జిల్లా కోర్టు నా తండ్రికి రెండుసార్లు ఉరిశిక్ష వేయమని తీర్పునిచ్చిందని చెప్పారు. హైకోర్టుకు వెళ్లినా వారు శిక్ష నుంచి తప్పించుకోలేకపోతున్నారని చెప్పారు. నిందితులు 58 సార్లు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నా రాకుండా చేశానని అన్నారు. ప్రభుత్వం నాకు పూర్తి రక్షణ కల్పించడంతో పాటు ముగ్గురు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌ను నా తరపున వాదించేందుకు నియమించిందని చెప్పారు. నాభర్త పేరున శంకర్ సోషల్ జస్టిస్ ట్రస్టును ఏర్పాటు చేసి 30 మంది విద్యార్థులకు విద్యా సహాయం చేయడంతోపాటు వారికి డప్పులో శిక్షణ ఇస్తున్నానని, ప్రేమికులకు మద్దతు, రక్షణ కల్పించడంతోపాటు వారి వివాహానికి సహకారం అందిస్తున్నట్లు ఆమె చెప్పారు. ప్రణయ్ భార్య అమృత వర్షిణికి పూర్తి రక్షణ కల్పించాలని ఆమెడిమాండ్ చేశారు. కేవీపీఎస్ అధ్యక్షుడు కె.భాస్కర్, ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబాబు,కృపాసాగర్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఖాప్ పంచాయతీలు చట్ట వ్యతిరేకం
న్యూఢిల్లీ: కులాంతర వివాహాలు చేసుకున్న జంటలపై పరువు హత్యలకు పాల్పడటం సామాజిక రుగ్మత అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఇది వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని హరించడమేనని.. దీని చెడు ప్రభావం సమాజంపై పడుతుందని పేర్కొంది. వెంటనే ఖాప్ పంచాయతీల చట్ట వ్యతిరేక చర్యలను పూర్తిగా ఆపుచేయాలని ఆదేశించింది. పరువు హత్యలకు పాల్పడటమనేది మనిషి హుందాతనాన్ని, చట్ట సార్వభౌమత్వాన్ని అవమానించడమేనంది. 2010లో శక్తి వాహిని అనే స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీం విచారించింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. ‘ఖాప్‌లు తాము సీజర్ పూర్వీకులు లేదా 16వ లూయీగా భావించుకుని తమకోసం తాము చట్టాలు చేసుకుంటున్నారు. ప్రేమ పెళ్లిళ్లలో ఖాప్ పంచాయతీలు జోక్యం చేసుకోవడం చట్ట విరుద్ధం. ఇష్టపూర్వకంగా కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వయోజనులను చంపేస్తామని బెదిరించడం, హింసకు దిగడం, పరువు హత్యలకు పాల్పడటాన్ని అంగీకరించబోం. వారి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఆపుచేయాలి. ఎవరిని వివాహం చేసుకోవాలో తేల్చుకునే స్వేచ్ఛ పురుషులు, స్త్రీలకు ఉంటుంది. ఇందుకు కుటుంబం లేదా కులం, లేదా సమూహం అనుమతి అవసరం లేదు’ అని పేర్కొంది. పరువు హత్యలు లేదా నేరాలను అదుపు చేసేందుకు తాము జారీ చేసే మార్గదర్శకాలను ఆరు వారాల్లోగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. -
బిహార్‌లో రెండు పరువు హత్యలు
గయ: బిహార్‌లో మరో రెండు పరువు హత్యలు చోటు చేసుకున్నాయి. ఓ మైనర్ బాలిక, పెళ్లయిన యువకుడి ప్రేమ వ్యవహారంపై ఆగ్రహించిన పెద్దలు వారిద్దరినీ కొట్టిచంపారు. తర్వాత మృతదేహాలను దహనం చేశారు. గయ జిల్లాలోని అమేథ గ్రామంలో బుధవారం ఈ సంఘటన జరిగింది. గయ సీనియర్ ఎస్పీ మనూ మహరాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమేథకు చెందిన పార్వతి దేవి(15), జైరాం మాంఝీ(25) అనే దళిత యువకుడు పరస్పరం ప్రేమించుకున్నారు. మాంఝీకి అదివరకే పెళ్లి అయింది. ఈ వ్యవహారంపై ఇరువర్గాల మధ్య వివాదం రేగడంతో బుధవారం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. రాజీకి బాలిక తరఫు వారు అంగీకరించలేదు. బాలిక కుటుంబ సభ్యులతో పాటు మరో 15 మంది గ్రామస్తులు కలిసి ప్రేమికులిద్దరినీ కొట్టి చంపారు. తర్వాత వారిని ఊరి బయటికి తీసుకెళ్లి దహనం చేశారు.