housework
-
పెళ్లైన నెలకే పనిమనిషిలా మార్చారు.. ‘పనులు చేయాలనడం క్రూరత్వం కాదు’
ముంబై: ఇంట్లో పనులు చేయాలని వివాహితను ఆమె కుటుంబ సభ్యులు ఆదేశించడం క్రూరత్వం కిందకు రాదని బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. ఇంట్లో వివాహిత చేసే పనులు పనిమనిషి చేసే పనులతో సమానం కాదని వెల్లడించింది. ఇంట్లో కుటుంబం కోసం పనులు చేయాలంటూ భర్త, అత్తమామలు వేధిస్తున్నారంటూ ఓ మహిళ పెట్టిన కేసు(ఎఫ్ఐఆర్)ను న్యాయమూర్తులు జస్టిస్ విభా కంకాన్వాడీ, జస్టిస్ రాజేశ్ పాటిల్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఈ నెల 21న కొట్టివేసింది. పెళ్లయ్యాక కేవలం నెల రోజుల పాటు తనను చక్కగా ఆదరించారని, ఆ తర్వాత ఒక పనిమనిషిలా మార్చారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా రూ.4 లక్షలతోపాటు ఒక కారు ఇవ్వాలంటూ భర్త, అత్తమామలు డిమాండ్ చేశారని పేర్కొంది. శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారని వెల్లడించింది. మహిళ ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తమామలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ మహిళ భర్త, అత్తమామలు బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ‘‘ఇంట్లో వివాహితను పనులు చేయాలనడం కుటుంబం కోసమే కదా. ఇంటి మనిషికి పనులు చెప్పడం పనిమనిషిని ఆదేశించినట్లు కాదు. ఇకవేళ ఆమెకు ఇంటి పనులు చేయడం ఇష్టం లేకపోతే పెళ్లికి ముందే ఆ విషయం చెప్పాలి. అప్పుడు పెళ్లికొడుకు ఆ పెళ్లి విషయంలో పునరాలోచించుకొనే అవకాశం ఉంటుంది’’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఐపీసీ సెక్షన్ 498ఏ ప్రకారం.. శారీరకంగా, మానసికంగా వేధించారంటూ కేవలం నోటిమాటగా చెబితే సరిపోదని, అందుకు ఆధారాలు చూపాలని, తగిన వివరణ ఇవ్వాలని సూచించింది. -
గృహిణులకు యాక్సిస్ బ్యాంక్ తీపికబురు..!
న్యూఢిల్లీ: విద్యావంతులైన పట్టణ ప్రాంత గృహిణులకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ’హౌజ్వర్క్ఈజ్వర్క్(ఇంటిపని కూడా పనే)’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. ఇంటి పనులకే పరిమితమైపోతున్న మహిళలకు, ఉద్యోగాలు చేయగల సత్తా, నైపుణ్యాలు తమలో కూడా ఉన్నాయనే భరోసా కల్పించేందుకు ఇది తోడ్పడుతుందని బ్యాంక్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్) రాజ్‌కమల్ వెంపటి తెలిపారు. దీని కింద గిగ్-ఎ-ఆపర్చూనిటీస్ పేరిట వివిధ ఉద్యోగావకాశాలను యాక్సిస్ బ్యాంక్ తమ ప్లాట్‌ఫామ్‌పై ఉంచిందని వెంటి వివరించారు. దీనికి 3,000 పైచిలుకు దరఖాస్తులు రావడంతో, రాబోయే రోజుల్లో మరింత మందిని రిక్రూట్ చేసుకునేలా హైరింగ్ పరిమితిని పెంచినట్లు పేర్కొన్నారు. వేతనాల విషయానికొస్తే.. చేరే వారి నైపుణ్యాలు, అనుభవాన్ని బట్టి ఉంటాయని.. పూర్తి స్థాయి ఉద్యోగుల తరహాలోనే ఇతరత్రా ఉద్యోగ ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. (చదవండి: మదుపరులకు శుభవార్త.. ఎల్ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం..!) -
55 కోట్ల గంటలు పని చేస్తున్నారు...
వాషింగ్టన్: ఆధునిక ప్రపంచంలో కూడా ఆడ పిల్లల పట్ల పిన్న వయస్సు నుంచే లింగ వివక్ష కొనసాగుతోంది. చేసే పనులను బట్టే కాకుండా వాళ్లుచేసే పని గంటలను బట్టి కూడా లింగ వివక్ష ఎంతో ఉంటోంది. ఐదేళ్ల నుంచి 14 ఏళ్లలోపు ఆడ పిల్లలు 55 కోట్ల గంటలపాటు ఇంటిపనులు చేస్తుంటే వారికన్నా అదే వయస్సు గల మగ పిల్లలు 16 కోట్ల తక్కువ గంటల పనులు చేస్తున్నారని యునిస్కో తాజా నివేదికలో వెల్లడించింది. ఐదు నుంచి తొమ్మిదేళ్ల వయస్సుగల ఆడపిల్లలు వారానికి సగటున నాలుగు గంటలు ఇంటి పనులు చేస్తుండగా, అదే పది నుంచి 14 ఏళ్ల ఆడ పిల్లలు వారానికి సగటున తొమ్మిది గంటలు పనిచేస్తున్నారు. వీళ్లు ఎక్కువగా వంట, పాత్రలు కడగడం, ఇల్లు శుభ్రం చేయడం, వంట చెరకు సమీకరించడం, పిల్లలను ఆడించడం లాంటి పనుల్లో గడుపుతున్నారు. ఆఫ్రికా, ఆసియాలోని తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లోనే ఆడపిల్లలు ఎక్కువ గంటలపాటు పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే సోమాలియాలో ఆడ పిల్లలు ఎక్కువ గంటలు పనిచేస్తుండగా, అదే దేశంలో ఆడ పిల్లలు, మగ పిల్లలు పనిచేసే గంటల్లో ఎక్కువ వ్యత్యాసం ఉంది. ఆ తర్వాత ఆడపిల్లలు ఎక్కువ గంటలు పనిచేస్తున్న దేశాల్లో ఇతియోపియా, రువాండ, చాడ్, గినియా, బుర్కినాఫాసో, యెమెన్, బురుండి, సెనగల్, నిగర్ దేశాలు ఉన్నాయి. ఆడపిల్లలు, మగ పిల్లల పనిగంటల్లో ఎక్కువ వ్యత్యాసం ఉన్న దేశాల్లో సోమాలియా తర్వాత బుర్కినా ఫాసో, యెమన్, సెనగల్, చాడ్, బంగ్లాదేశ్, గినియా, కమోరస్, కాంగోలాంటి దేశాలున్నాయి. పైగా ప్రపంచవ్యాప్తంగా మగ పిల్లల ఇంటి పనికి ఇస్తున్న విలువను ఆడపిల్లల పనికి ఇవ్వడంలేదని యునెస్కో నివేదిక వెల్లడించింది. చిన్నప్పటి నుంచే ఆడపిల్లలు ఎక్కువగా పనిచేస్తున్న ఈ దేశాల్లోనే ఎక్కువగా ఆడ పిల్లలకు తొందరగా పెళ్లిళ్లు చేస్తున్నారు. వంటపని, ఇంటి పనితోపాటు పిల్లల ఆలన కూడా వచ్చుగనుక 17, 18 ఏళ్ల లోపు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. ఇలా త్వరగా పెళ్లి చేయడానికి ఒకరికి పెట్టే తిండి ఖర్చు తగ్గుతుందన్న భావన కూడా ఒక కారణం. ఖర్చు వేరే ఇంటికి మారుతుంది తప్ప తేడా ఉండదు. 2000 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం వరకు గణాంకాలను తీసుకొని ‘హార్నెసింగ్ పవర్ ఆఫ్ డేటా గర్ల్స్’ పేరిట యునిస్కో ఈ నివేదికను విడుదల చేసింది. -
ఇంటి పని చేయని మహిళకు జైలు శిక్ష!
ఇంటి పని సరిగా చేయడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటలీకి చెందిన మహిళ దోషిగా తేలితే గరిష్టంగా ఆరేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. లాజియో రీజియన్‌లోని సోన్నినో ప్రాంతానికి చెందిన ఓ భర్త ఇచ్చిన ఫిర్యాదుతో 40 ఏళ్ల సదరు మహిళపై కోర్టులో విచారించనున్నారు. ఇంటిపనులు కూడా ఆమె సరిగా చేయకపోవడంతో కుటంబ కష్టాలు తీవ్రమయ్యాయని తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇంటిని శుభ్రంగా ఉంచకపోవడంతో పరిశుభ్రతలేని ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని తెలిపాడు. ఆఖరికి ఆహారాన్ని కూడా ఎప్పుడో ఒకసారి వండుతుందన్నాడు. గత రెండేళ్లుగా ఇలానే కొనసాగుతుందని తెలిపాడు. వచ్చే అక్టోబర్‌లో కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆమె దోషిగా తేలితే 2 నుంచి ఆరేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని అక్కడి స్థానిక మీడియా తెలిపింది. మరోవైపు, 2014, మార్చిలో గృహహింస నియంత్రించడానికి ఇంట్లో పని చేస్తున్న మహిళలకు కూడా జీతాలు ఇవ్వాలని ఇటలీలోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అయితే ఆ ప్రతిపాదనకు అన్ని వర్గాలనుంచి మద్దతు కరువైంది. ఇంట్లోనే మహిళలకు జీతాలిస్తే ఉద్యోగాల కోసం వేచిచూసే ధోరణి తగ్గుతుందని టరిన్ యూనివర్సిటీకి చెందిన ఆర్థిక శాస్త్ర నిపుణుడు, ప్రొఫెసర్ డానియల్ డెల్ బోకా తెలిపారు.