huge damage
-
హవాయి ద్వీపంలో కార్చిచ్చు.. బుగ్గిపాలైన నగరం (ఫొటోలు)
-
Hawaii: కార్చిచ్చు కమ్మేసి 36 మంది దుర్మరణం!
సుందర హవాయి దీవుల్లో కార్చిచ్చు ప్రాణ నష్టం.. ఊహించని రీతిలో పెను నష్టం మిగిల్చింది. నలువైపులా నుంచి అగ్ని కీలలు ఎగసి పడగా.. అదే సమయంలో పెనుగాలులు తోడవ్వడంతో పెను విషాదం మిగింది. 36 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించగా.. మృతుల సంఖ్య మరింతగా పెరిగేలా కనిపిస్తోంది. మౌయి ద్వీపంలోని రిసార్ట్ నగరం లహైనా బుగ్గిపాలైన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అడవుల్లో కార్చిచ్చు రాజుకోగా.. హరికేన్ గాలులతో ఆ మంటలు శరవేగంగా వ్యాపించాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు తలోదిక్కు పరుగులు తీశారు. మరోవైపు మంటలు ఉవ్వెత్తున్న ఎగసిపడుతూ.. గాలుల కారణంగా మరింత త్వరగా వ్యాపించుకుంటూ పోయాయి. దీంతో.. భారీ నష్టం సంభవించింది. సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి బృందాలు. ‘‘ఇప్పటివరకు చూడని ఘోరమైన విపత్తును మేము ఎదుర్కొన్నాము. లహైనా మొత్తం కాలిపోయింది. ఇది ఒక అపోకలిప్స్(ఘోర విపత్తు) లాంటిది అని ప్రాణాలు రక్షించుకున్న లహైనా వాసులు చెబుతున్నారు. చాలామంది మంటలు, పొగ నుంచి రక్షించుకునేందుకు పసిఫిక్ మహాసముద్రంలోకి దూకేశారు. ఒక బాంబు పడితే.. ఒక యుద్దం జరిగితే ఎలా ఉంటుందో.. అలా మారిపోయింది ఆ నగరం పరిస్థితి. హవాయ్ దీవుల్లోనే మౌయి Maui అతిపెద్ద ద్వీపం. చారిత్రకంగానూ దీనికి ఓ గుర్తింపు ఉంది. అందులో ప్రధాన పర్యాటక ప్రాంతం(నగరం) లహైనానే. మంగళవారం రాత్రి అడవుల్లో ప్రారంభమైన మంటలు.. వేల ఎకరాలను నాశనం చేశాయి. దీనికి తోడు తుపాను గాలుల ప్రభావంతో అగ్నికీలలు అన్నివైపులా శరవేగంగా వ్యాపించాయి. పశ్చిమ భాగం ద్వీపం దాదాపు తుడిచిపెట్టుకుపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Facebook Outage: ప్రపంచానికి కోలుకోలేని దెబ్బ !
ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలు కొన్ని గంటలపాటు నిలిచిపోవడం.. కొందరికి చికాకు తెప్పించి ఉండొచ్చు. మరికొందరికి ఇదంతా సరదా వ్యవహారంగా అనిపించి ఉండొచ్చు. కానీ, నాణేనికి మరోవైపులా.. ఇందులోనూ సీరియస్ కోణం కనిపించింది. అమెరికా, ఫేస్బుక్ ఓనర్ సంగతేమోగానీ.. మిగతా ప్రపంచానికి మాత్రం ఈ విఘాతం ఊహించని స్థాయిలో డ్యామేజ్‌నే చేసింది. ముఖ్యంగా వ్యాపార, వైద్య రంగాలతో పాటు ప్రభుత్వ విభాగాలపైనా యాప్స్ సేవల విఘాతం తీవ్ర ప్రభావం చూపెట్టింది. ఇన్స్టంట్ కాల్స్ అండ్ మెసేజింగ్ సర్వీసుల యాప్ ‘వాట్సాప్’ను.. 180 దేశాల్లో 200 కోట్ల మంది దాకా ఉపయోగిస్తున్నారు. ఇక ఫేస్బుక్-ఫేస్బుక్ మెసేంజర్ సర్వీస్‌ల్ని 300 కోట్లమందికిపైగా ఉపయోగించుకుంటున్నారు. కెన్యా, అర్జెంటీనా, మలేషియా, కొలంబియా, బ్రెజిల్ లాంటి దేశాల్లో 16 నుంచి 54 ఏళ్లలోపు 90 శాతం మంది వాట్సాప్ సేవల్ని ఉపయోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక భారత్‌లో సుమారు 50 కోట్ల మంది వాట్సాప్ సేవల్ని ఉపయోగించుకుంటుండగా.. సోమవారం రాత్రి వాటిల్లిన బ్రేక్ డౌన్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఎన్నో రంగాలు.. సోషల్ మీడియా అనేది కేవలం కమ్యూనికేషన్ కోసం మాత్రమే కాదు.. వివిధ రంగాల్లోనూ జోరుగా వీటిని వినియోగిస్తున్నారు. డెలివరీ దగ్గరి నుంచి విద్యా, వైద్య, ఇతరత్ర సేవలను అందించడంలో ఇప్పుడు ఇవే కీలక భూమిక పోషిస్తున్నాయి. ముఖ్యంగా చిరువ్యాపారుల బిజినెస్‌కు ఈ ఆరేడు గంటల విఘాతం కోలుకోలేని నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇక కరోనా టైం నుంచి భారత్‌లో వాట్సాప్ ద్వారా పేషెంట్ల కన్సల్టింగ్ ప్రక్రియ, మందుల డోర్ డెలివరీ వ్యవస్థ ఎక్కువగా నడుస్తోంది. సోమవారం నాటి అంతరాయంతో వైద్య రంగానికి నష్టంతో పాటు పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక మలేషియాలో బిజినెస్ కమ్యూనికేషన్ దాదాపుగా ఫేస్బుక్, వాట్సాప్‌లతోనే నడుస్తోంది. అలాంటిది అక్కడ భారీగానే నష్టం వాటిల్లినట్లు సమాచారం. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. ఫేస్బుక్ అండ్ కో వల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగింది మాత్రం ఫుడ్(ఇండోనేషియా,జర్మనీ లాంటి దేశాల్లో), రిటైల్(34కి పైగా దేశాల్లో) రంగాలకే కావడం చెప్పుకోదగ్గ విషయం. ప్రభుత్వ సేవలకూ.. మనీలాకు చెందిన ఫొటోగ్రాఫర్ రిచర్డ్ జేమ్స్ మెండోజా ఫేస్బుక్ సర్వీసుల విఘాతం వల్ల ఉపాధి దెబ్బతిందని వాపోతున్నాడు. ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్ కోసం, కరోనా సమాచారం అప్డేట్స్ కోసం మెండోజా పని చేస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి ఏర్పడ్డ విఘాతంతో మెండోజా తన పని సక్రమంగా నిర్వహించలేకపోయాడు. దీంతో ఇతగాడి ఫీజులో భారీ కోత పడింది. ఇలా క్యాంపెయిన్స్ కోసమే కాదు.. ప్రభుత్వాలు సోషల్ మీడియాను ‘ఇన్ఫర్మేషన్ షేరింగ్’ ప్లాట్‌ఫామ్‌గా వాడుకుంటున్నాయి కూడా. నిఘా, పౌర సేవల్ని అందించడం, అవసరమైన డాక్యుమెంట్ల చేరివేత, వెరిఫికేషన్.. ఇలా ఎన్నో ప్రక్రియలు వాట్సాప్ ద్వారా నడుస్తున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సర్వీసింగ్ సెంటర్లకు క్యూ ప్రజలకు సోషల్ మీడియా కేవలం టైం పాస్ యవ్వారం అని మాత్రమే కాదు.. సాధారణ ఫోన్‌కాల్స్ కంటే యాప్కాల్స్ యమచీప్ అనే ముద్రపడిపోయింది. అందుకే ఆ ఆరేడు గంటలు కమ్యూనికేషన్ పరమైన ఇబ్బందితో తలలు పట్టుకున్నారు. అయినవాళ్లతో బంధం కాసేపు ఆగిపోవడం.. అపార్థాలతో అలజడులు రేగాయి. కొందరు ఫోన్లు రీస్టార్ట్లుచేయగా.. మరికొందరు డేటా ప్యాక్ వాలిడిటీ పూర్తైందేమోనని కంగారు పడ్డారు. ఇంకొందరు ఆందోళనతో సర్వీస్ సెంటర్లకు, రిపేర్ షాపులకు క్యూ కట్టిన దృశ్యాలు సైతం కనిపించాయి. మార్క్ జకర్బర్గ్కు కలిగిన నష్టంతో పోలిస్తే.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఫేస్బుక్ అండ్ కో విఘాతం వల్ల జరిగిన నష్టమే ఎక్కువ. అఫ్కోర్స్.. ఈ విషయాన్ని లెక్కలతో తేల్చకున్నాఫేస్బుక్కే స్వయంగా ప్రకటించిందనుకోండి. ఇప్పుడు తెర మీదకు వచ్చిన మరో చర్చ ఏంటంటే.. ముందు ముందు ఇలాంటి అంతరాయాలు ఎదురైతే ఎలా? అని.. - సాక్షి, వెబ్‌స్పెషల్ -
తెలంగాణలో టీడీపీ ఖాళీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. వరసపెట్టి సీనియర్ నేతలంతా ఆ పార్టీని వీడుతున్నారు. నిన్న గాక మొన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. అంతకు ముందు అయిదుగురు ఎమ్మెల్యేలు ఇదే తరహాల్లో పార్టీ మారు. కాగా, పార్టీలో ముఖ్య నేతగా పేరున్న మాజీ మంత్రి కె.విజయ రామారావు టీ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల నాటి నుంచే ఆయన పార్టీతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. ఈ కారణంగానే టీడీపీ జాతీయ కమిటీలో కానీ, టీటీడీపీ రాష్ట్ర కమిటీలో కానీ ఆయనకు ఎలాంటి పదవీ దక్కలేదు. ఈ కారణాలన్నింటి నేపథ్యంలోనే ఆయన గత రెండు రోజులుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖైరతాబాద్ నియోజకవర్గం నాయకులు, తన అనుచరులతో మాట్లాడి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారికి వివరించారని సమాచారం. అన్నీ ఆలోచించుకునే, విజయ రామారావు శుక్రవారం టీడీపీకీ రాజీనామా చేస్తున్నట్లు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఒక లేఖ రాశారు. ‘ నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇన్నాళ్లూ మీరు అందించిన సహకారానికి కతజ్ఞతలు..’ అని బాబు రాసిన లేఖలో స్పష్టం చేశారు. కాగా, విజయ రామారావు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. తటస్థ కోటాలో తెరపైకి కేంద్రంలో సీబీఐ డెరైక్టర్‌గా పనిచేసిన కె.విజయ రామారావు తటస్థ కోటాలో 1999 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీలో ఖైరతాబాద్ టికెట్ పొంది గెలవడమే కాకుండా ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. రోడ్లు, భవనాలు, వాణిజ్య పన్నుల శాఖా మంత్రిగా ఆయన సేవలు అందించారు. పార్టీతో సంబంధం లేని వారిని, వివిధ రంగాల్లో పేరున్న వారిని తటస్థ కోటాలో టికెట్లు ఇస్తామని నాడు చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో పార్టీలో చేరారు. ఎన్నికల్లో పి.జనార్ధన్‌రెడ్డిని ఓడించారు. కానీ, 2004, 2009 ఎన్నికల్లో ఆయన వరసగా ఓటమి పాలయ్యారు. కాగా, 2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక ఎన్నికల్లో టీడీపీ నాయతక్వం ఖైరతాబాద్ నుంచి ఆయనకు టికెట్ ఇవ్వకుండా పొత్తులో భాగంగా బీజేపీకి అవకాశం ఇచ్చింది. దీంతో పార్టీతో ఆయనకు మరింత దూరం పెరిగింది. విజయ రామారావు కోసం... కేసీఆర్‌కు నో చెప్పిన బాబు 1999 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాటి మంత్రి వర్గంలో కె.చంద్రశేఖర్‌రావుకు అవకాశం ఇవ్వక పోవడానికి విజయ రామారావును కేబినెట్లోకి తీసుకోవడమే ప్రధాన కారణం. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం కల్పించలేమని, పార్టీలో సీనియర్ అయిన కేసీఆర్‌ను కాదని తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విజయరామారావును అక్కున చేర్చుకున్నారు. దీంతో పార్టీలో వ్యక్తమైన భిన్నాభిప్రాయాల నేపథ్యంలో కేసీఆర్‌కు డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టారు. ఆ తర్వాతి పరిణామాల్లోనే కేసీఆర్ తన డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ని ఏర్పాటు చేశారు. ఒక విధంగా టీఆర్ఎస్ ఏర్పాటుకు బీజం పడిందే విజయ రామారావు వల్ల అన్న అభిప్రాయం బలంగా ఉంది. కానీ, ఇప్పుడాయ టీడీపీని వదిలి అదే టీఆర్ఎస్లో చేరనుండడం విశేషం మూడు రోజుల కిందట హరీష్‌తో భేటీ టీ టీడీపీ క్రియా శీలక రాజకీయాలకు దూరంగా ఉంటన్న మాజీ మంత్రి విజయ రామారావును మూడు రోజుల కిందట రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు కలిసినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ పంపిన సందేశాన్నే హరీష్ తీసుకు వచ్చి పార్టీలోకి ఆహ్వానించారని తెలిసింది. ఆ తర్వాత వెనువెంటనే జరిగిన పరిణామాలతో విజయ రామారావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు లేఖ రాశారని భావిస్తున్నారు.