huge public meeting
-
నేడు హైందవ శంఖారావం
సాక్షి, అమరావతి/గన్నవరం: ఆలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి కలిగించి, స్వయంప్రతిపత్తి కలిగిన ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగించేలా చట్ట సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆదివారం ‘హైందవ శంఖారావం’పేరుతో విజయవాడకు సమీపంలోని కేసరపల్లి వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. వీహెచ్‌పీ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపట్టి, ఏపీ నుంచే తొలి బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు 3.5 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా. 30 ఎకరాల పరిధిలో బహిరంగ సభ నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3,500కి పైగా బస్సులు, 7 రైళ్ల ద్వారా సభకు ప్రజలు తరలిరానున్నారు. సభకు నాలుగు వైపుల 150 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్‌కు తగిన ఏర్పాట్లు చేశారు. ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంఘాలు ఏపీలో చాలా ఏళ్ల తర్వాత ఇంతటి భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా..వీహెచ్‌పీ, ఏబీవీపీ, భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ్, భజరంగ్‌దళ్, భారతీయ వికాస్ పరిషత్ వంటి 40కి పైగా సంస్థల ప్రతినిధులు ఈ సభను విజయవంతం చేసేందుకు 3 నెలలు పాటు పనిచేసినట్లు వీహెచ్‌పీ నేతలు చెప్పారు. ఈ సభకు వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, అర్గనైజింగ్ సెక్రటరీ మిలింద్ పరందే, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి గోవిందదేవ్ గిరి మహరాజ్‌తో పాటు పెద్ద సంఖ్యలో స్వామీజీలు హాజరుకానున్నారు. సభ నేపథ్యంలో ఆదివారం విజయవాడ, చట్టుప్రక్కల ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు అమలు చేయనున్నారు. -
మిలిటెంట్ తరహాలో ముందుకు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో ఇకపై దూకుడుగా పోరాటాలు చేపట్టా లని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నిర్ణయించింది. కొత్త ప్రభుత్వం కుదురుకుని పనిచేసేందుకు సరిపడా సమయం ఇచ్చా మని భావిస్తోంది. ఇక ముందు పూర్తిస్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని.. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, మరోవైపు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిన మంచిని వివరించాలని నిర్ణయించింది.కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని.. బీఆర్ఎస్ దీనిని అనుకూలంగా మలుచుకోవాలని నేతలు, కార్యకర్తలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. రాబోయే రోజుల్లో పార్టీ కేడర్‌ను, ప్రజలను భాగస్వాములను చేస్తూ రేవంత్ ప్రభుత్వం తీరుపై ‘మిలిటెంట్ తరహా దూకుడు పోరాటాలు చేయాల’ని ఇటీవల జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీలో సూచించినట్టు తెలిసింది. పార్టీ విధానాలపై ఫోకస్.. కాంగ్రెస్ విధానాలను నిరంతరం విమర్శించడం వల్ల అధికారం కోల్పోయానే బాధతో విమర్శలు చేస్తున్నట్టుగా ప్రజలు భావించే అవకాశం ఉందని కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే దూరదృష్టితో పదేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాటి అమలు వెనుక ఉన్న తాతి్వకతను కూడా ప్రజలకు విడమరిచి చెప్పాలని సూచించినట్టు సమా చారం. ‘‘హైదరాబాద్‌లో భారీ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతులివ్వడం ఇక్కడి ఆర్థిక పటిష్టతను ప్రజలకు చాటి చెప్పాం. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని భారీ ఫార్మాసిటీ ఏర్పాటుకు భూసేకరణ చేశాం. గత ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయం వెనుక అనేక శాస్త్రీయ కోణాలు ఉన్నాయి. వాటిని సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో అసెంబ్లీలో, బయటా పార్టీ నేతలు విడమరిచి చెప్పాలి..’’అని పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది.ప్రభుత్వ తప్పులను ఎండగట్టడం, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కేవలం ప్రెస్మీట్లు, పత్రికా ప్రకటనలకు పరిమితం కాకుండా... సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని సూచించినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తు న్న ప్రజా వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా ఏమీ మారడం లేదని, దీనిని బీఆర్ఎస్ అందిపుచ్చుకోవాలని పేర్కొన్నట్టు సమాచారం. అసెంబ్లీ వేదికగా ఒత్తిడి పెంచి..: అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వేదికగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తొలిరోజున అదానీ–రేవంత్ దోస్తీ అంటూ టీషర్టులు ధరించి అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. సభ జరిగే మిగతా రోజుల్లోనూ ఏదో ఒకరకమైన వ్యూహంతో అసెంబ్లీకి వచ్చి ప్రజల్లో చర్చ జరిగేలా చేయాలని నిర్ణయానికి వచి్చ నట్టు తెలిసింది. పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ వాయిదా తీర్మానం ఇవ్వడం, లేదా స్వల్పకాలిక చర్చకు పట్టుబట్టడం దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ ఇచ్చిన 6గ్యారంటీలకు అసెంబ్లీతో చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో ఒత్తిడి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరైనా ఎలాంటి చర్చల్లో పాల్గొనే అవకాశం లేదని సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.సంస్థాగత అంశాలపై ఫోకస్.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో హైదరాబాద్, వరంగల్‌లలో కాకుండా అన్ని జిల్లాలనుంచి రాకపోకలకు అనువుగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుని భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలిసింది. ఉద్యమకాలంలో నిర్వహించిన తరహాలో భారీ జనసమీకరణతో పార్టీ సత్తా చాటేలా సభ ఉంటుందని ఇటీవల తనను కలిసిన పార్టీ నేతలతో కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. ఇక వచ్చే ఏడాది పొడవునా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కార్యవర్గాల ఏర్పాటు, సంస్థాగత శిక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. యువత, మహిళలకు చేరువ కావడం లక్ష్యంగా కార్యక్రమాలనిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. -
తుక్కుగూడ నుంచే శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు కలసివచ్చిన తుక్కుగూడ నుంచే కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఏప్రిల్ మొదటి వారంలో రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరవుతారని సమాచారం. ఈ సభలోనే కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారని, మేనిఫెస్టో తెలుగు ప్రతులను ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. కాగా, ఈ సభ నిర్వహణ కంటే ముందే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ సభ అనంతరం సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. ఆయన బస్సులో ప్రచార యాత్ర చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే, బస్సు యాత్ర చేయాలా? అలా వెళ్తే ఎంత మంది నేతలు వెళ్లాలి? లేదా ప్రతి ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభలు పెట్టి కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయాలా అన్న దానిపై పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. దీనిపై నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. -
నల్లగొండలో గులాబీ సభ
సాక్షి, హైదరాబాద్: త్వరలో నల్లగొండలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. దాదాపు రెండులక్షల మందితో సభ ఏర్పాటు చేసి, కేఆర్ఎంబీ వాస్తవాలను ప్రజలకు వివరించనుంది. సభావేదిక నుంచే పార్టీ అధినేత కేసీఆర్ శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తోంది. ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ వైఫల్యాలను వివరించి..ఇంటింటికీ పార్టీ శ్రేణులు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న నల్లగొండ నుంచి పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించాలని అనుకుంటోంది. 2018 ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నా, 2023లో జరిగిన ఎన్నికల్లో సూర్యాపేట మినహా అన్నిచోట్ల బీఆర్ఎస్ ఓటమిని చవిచూసింది. దీంతో తిరిగి కేడర్‌లో పునరుత్తేజం నింపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నది. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు కృష్ణారివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగిస్తే తెలంగాణకు ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు జరిగే అన్యాయాన్ని వివరించేందుకు సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లలో కృష్ణాజలాలపై సాగించిన పోరాటాన్ని సభావేదికగా ప్రజలకు వివరించాలని పార్టీ అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు కేఆర్ఎంబీతో ఎన్నిసార్లు సమావేశమైంది, సమావేశంలో చర్చించిన అంశాలను సభావేదిక నుంచే శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. విభజన చట్టంలోని అంశాలతోపాటు ముఖ్యంగా నీటి వాటాలపై బీఆర్ఎస్ కొట్లాడిన తీరును ప్రజలకు వివరించి వారిని, చైతన్యపర్చాలని చూస్తోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టాన్ని ప్రముఖంగా వివరించనుంది. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2లక్షల రుణమాఫీ, వరికి 500రూపాయల బోనస్ హామీలను ఎండగట్టనున్నట్టు తెలిసింది. సాగర్ ఎడమకాల్వకు నీటి విడుదల చేయకపోవడం, చివరి ఆయకట్టు రైతులు వేసిన పంట పొలాలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం వంటి అంశాలతోపాటు గత బీఆర్ఎస్ సాగునీటి విడుదలకు తీసుకున్న చర్యలు, రైతుల కోసం పాటుపడిన తీరును కేసీఆర్ వివరించేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాతే నల్లగొండ సభ జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. -
Munugode Bypoll 2022: లక్ష మందితో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మరో వారం రోజుల్లో ముగియనుండటంతో అధికార టీఆర్ఎస్ పార్టీ తన ప్రచార వ్యూహానికి మరింత పదును పెడుతోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు మునుగోడులో పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించి ప్రతి ఓటరును కలిసేలా ప్రణాళిక అమలు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు, హరీశ్‌రావుతో పాటు పలువురు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొంటున్నారు, మరోవైపు క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని సమన్వయం చేస్తున్నారు. వచ్చే నెల 1న ప్రచార పర్వం ముగియనుండగా, రెండురోజుల ముందు అంటే ఈ నెల 30న చండూరులో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభలో పాల్గొననున్నారు. మరోవైపు యూనిట్ ఇన్‌చారి్జలుగా వ్యవహరిస్తున్న నేతలంతా చివరి నిమిషం వరకు తమకు కేటాయించిన ప్రాంతంలోనే మకాం వేయాలని కేసీఆర్ ఆదేశించారు. వారి పనితీరుపై ప్రభుత్వ నిఘా సంస్థలు, ప్రైవేటు సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు కేసీఆర్, కేటీఆర్‌కు నివేదికలు అందజేస్తున్నాయి. ఈ నివేదికల ఆధారంగా అవసరమైన చోట ఇతర ప్రాంతాలకు చెందిన కీలక నేతలను మోహరించి ప్రచార లోపం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రచార సరళి, అభ్యర్థుల ప్రచారానికి వస్తున్న స్పందన, ఆయా పార్టీలు అనుసరిస్తున్న తెర వెనుక వ్యూహాలు గమనిస్తూ తక్షణమే ప్రతి వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీనిని స్వయంగా కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. నగర ఓటర్లపై దృష్టి నియోజకవర్గానికి చెందిన సుమారు 40 వేల మందికి పైగా ఓటర్లు హైదరాబాద్ శివారు కాలనీల్లో ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి సుమారు 300 నుంచి 500 వరకు ఓటర్లు నగరంలో నివాసముంటున్నట్లు తమ పరిశీలనలో తేలిందని యూనిట్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా కాలనీల్లోని మునుగోడు ఓటర్ల వివరాలు.. ఇంటి చిరునామా, ఫోన్ నంబరుతో సహా ఇప్పటికే సేకరించి పార్టీకి మద్దతు కూడగట్టే ప్రయత్నాలను టీఆర్ఎస్ పూర్తి చేసింది. పోలింగ్ రోజున వారంతా మునుగోడులో ఓటు హక్కు వినియోగించుకునలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. ప్రతి ఓటును కీలకంగా భావిస్తున్న టీఆర్ఎస్.. పోస్టల్ బ్యాలెట్లపైనా దృష్టి సారించి, వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉంది. నిరంతరం టచ్‌లో ఉండేలా.. ఓటర్లను వివిధ కేటగిరీలుగా విభజించి ప్రతి ఓటరును కనీసం అరడజను సార్లు కలిసే వ్యూహాన్ని టీఆర్ఎస్ అమలు చేస్తోంది. యూనిట్ ఇన్‌చారి్జలుగా వ్యవహరిస్తున్న నేతలు.. తమ పరిధిలోని ప్రతి వంద మంది ఓటర్లకు ఒక పార్టీ నేత చొప్పున బాధ్యతలు అప్పగించారు. పోలింగ్ రోజున ఓటు వేసి వెళ్లేంతవరకు వారితో టచ్‌లో ఉండేలా ప్రణాళిక అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, సామాజికవర్గాల సమ్మేళనం పేరిట ప్రతి కుటుంబాన్ని చేరుకునేలా టీఆర్ఎస్ ప్రచారం సాగుతోంది. సభ విజయవంతమయ్యేలా.. చండూరు సభకు సుమారు లక్ష మంది హాజరయ్యేలా చూడాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జన సమీకరణపై దృష్టి సారించింది. మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఈ మేరకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కేటీఆర్ ఇప్పటికే చౌటుప్పల్, గట్టుప్పల్, మునుగోడు మండల కేంద్రాల్లో రోడ్ షోలు నిర్వహించారు. -
నెలాఖర్లో సీఎం సభ
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ నెలాఖరున నగరం నడిబొడ్డున భారీ బహిరంగసభ నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఈ సభలో ప్రసంగిస్తారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నగరంలో పలు రోడ్ షోలు, కాలనీ సమావేశాల్లో పాల్గొంటారు. నలుగురు బీసీలకు ఎమ్మెల్సీలుగా అవకాశం వచ్చే ఏడాది ఆరంభంలో ఖాళీ అయ్యే 7 ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీ సామాజికవర్గానికి చెందిన నలుగురికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం జరిగిన భేటీలో కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరు శ్రీనివాస్‌తో పాటు నాయీబ్రాహ్మణ సామాజికవర్గం నుంచి కూడా ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పి స్తామని ప్రకటించినట్లు తెలిసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావుకు కూడా మలి విడత జాబితాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తొలి జాబితాలు వచ్చేశాయ్..! హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివిధ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అధికార టీఆర్ఎస్ తొలి జాబితాలో భాగంగా 105 డివిజన్లకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, ప్రతిపక్ష కాంగ్రెస్ 45 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక బీజేపీ 21 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది. టీఆర్ఎస్ అభ్యర్థులు.. కాప్రా– ఎస్.స్వర్ణరాజ్(ఎస్సీ); నాగోల్– చెరుకు సంగీత ప్రశాంత్‌గౌడ్(బీసీ); మన్సూరాబాద్– కొప్పుల విఠల్‌రెడ్డి(ఓసీ); హయత్‌నగర్– ఎస్.తిరుమల్‌రెడ్డి(ఓసీ); బీఎన్‌రెడ్డి నగర్– ఎం.లక్ష్మీప్రసన్నగౌడ్(బీసీ); వనస్థలిపురం– జిట్టా రాజశేఖర్‌రెడ్డి(ఓసీ); హస్తినాపురం– రమావత్ పద్మానాయక్ (ఎస్టీ); చంపాపేట్– సామ రమణారెడ్డి(ఓసీ); లింగోజిగూడ– శ్రీనివాసరావు(బీసీ); సరూర్‌నగర్– అనితా దయాకర్‌రెడ్డి(ఓసీ), ఆర్కేపురం– ఎం.విజయభారతి అరవింద్ శర్మ(ఓసీ); కొత్తపేట– జీవీసాగర్రెడ్డి(ఓసీ); చైతన్యపురి– జె.విఠల్‌రెడ్డి(ఓసీ); గడ్డిఅన్నారం– బి.ప్రవీణ్‌కుమార్(బీసీ) సైదాబాద్– సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి(ఓసీ); ముసారాంబాగ్– తీగల సునరితారెడ్డి(ఓసీ); ఓల్డ్‌మలక్‌పేట్– పి.శైలిని(బీసీ); అక్బర్‌బాగ్– ఎం.శ్రీధర్‌రెడ్డి(ఓసీ); అజంపుర– భారతి బాబురావు(ఎస్సీ); చావని– ఎండీ షవౌత్ అలీ(మైనార్టీ); డబీర్‌పుర– ఎండీ షబ్బీర్(మైనార్టీ); రెయిన్‌బజార్– అబ్దుల్ జావేద్(మైనార్టీ); పత్తర్‌గట్టి– అక్తర్మెహినోద్దీన్(మైనార్టీ); మొగల్ఫుర– ఎస్వీ సరిత(బీసీ); తలాబ్ చెంచలం– మెహరున్నీసా(మైనార్టీ), గౌలిపుర– బొడ్డు సరిత(బీసీ); లలిత్‌బాగ్– జి.రాఘవేంద్రరాజు(బీసీ); కుర్మగూడ– ఎం. నవిత యాదవ్(బీసీ); ఐఎస్ సదన్– స్వప్న సుందర్‌రెడ్డి(ఓసీ); సంతోష్‌నగర్– శ్రీనివాసరావు(బీసీ); రియాసత్‌నగర్– సంతోష్‌కుమార్(బీసీ); కంచన్‌బాగ్– ఆకుల వసంత(బీసీ) బార్కస్– సరిత(బీసీ); చాంద్రాయణగుట్ట– సంతోష్‌రాణి(బీసీ); ఉప్పుగూడ– ఎం శోభారాణిరెడ్డి(ఓసీ); జంగమ్మెట్– కె.స్వరూపరాంసింగ్నాయక్(ఎస్టీ); ఫలక్‌నుమా– గిరిధర్‌నాయక్(ఎస్టీ); నవాబ్‌సాబ్‌కుంట– సమీనాబేగం(మైనార్టీ); శాలిబండ– రాధాకృష్ణ(బీసీ); ఘాన్సీబజార్– ఇషిత(బీసీ); గోషామహల్– ముకేష్‌సింగ్(బీసీ); పురానాపూల్– లక్ష్మణ్‌గౌడ్(బీసీ); దూద్‌బౌలి– షబానా అంజుమ్(మైనార్టీ); జాహనుమా– పల్లె వీరమణి(బీసీ); రాంనాస్పుర– మహ్మద్ ఇంకేషాఫ్(మైనార్టీ); కిషన్‌బాగ్– షకీల్ అహ్మద్(మైనార్టీ); జియాగూడ– కృష్ణ(ఎస్సీ); మంగళ్‌హాట్– పరమేశ్వరిసింగ్(బీసీ); దత్తాత్రేయనగర్– ఎండీ సలీం(మైనార్టీ); కార్వాన్– ముత్యాల భాస్కర్(బీసీ); లంగర్‌హౌస్– పర్వతమ్మయాదవ్(బీసీ); గొల్కొండ– ఆసిఫాఖాన్(మైనార్టీ) టోలిచౌకి– నాగజ్యోతి(బీసీ); నానల్‌నగర్– ఎస్కే హజర్(మైనార్టీ); మెహిదీపట్నం– సంతోష్‌కుమార్(మరాఠ); గుడిమల్కాపూర్– బంగారి ప్రకాష్(బీసీ); ఆసిఫ్‌నగర్– ఎం.సాయిశిరీష(బీసీ); విజయనగర్‌కాలనీ– స్వరూపరాణి(బీసీ); రహమత్‌నగర్– సారిక(బీసీ); రెడ్‌హిల్స్– ప్రియాంకగౌడ్(బీసీ); మల్లెపల్లి– ఎం.పద్మావతి(బీసీ); జాంబాగ్– ఆనంద్‌గౌడ్(బీసీ); గన్‌ఫౌండ్రీ– మమతాగుప్తా(ఓసీ); రాంనగర్– శ్రీనివాసరెడ్డి (ఓసీ); గాంధీనగర్– పద్మనరేష్(బీసీ); ఖైరతాబాద్– విజయారెడ్డి(ఓసీ); వెంకటేశ్వరకాలనీ– కవితారెడ్డి(ఓసీ); బంజారాహిల్స్– విజయలక్ష్మి(బీసీ); జూబ్లీహిల్స్– కె. సూర్యనారాయణ(ఓసీ); సోమాజిగూడ– వి.సంగీతా యాదవ్(బీసీ); అమీర్‌పేట్– శేషుకుమారి(కాపు); సనత్‌నగర్– లక్ష్మి(ఓసీ); ఎర్రగడ్డ– పి.మహేందర్‌యాదవ్(బీసీ) బోరబండ– బాబా ఫసియొద్దీన్(మైనార్టీ); కొండాపూర్– షేక్ హమీద్‌పటేల్(మైనార్టీ); గచ్చిబౌలి– ఎస్కే బాబా(బీసీ); మాదాపూర్– జగదీశ్వర్‌గౌడ్(బీసీ); మియాపూర్– ఉప్పలపతి శ్రీకాంత్(ఓసీ); హఫీజ్‌పేట్– వీపీ జగదీశ్వర్(బీసీ); భారతినగర్– సింధూ ఆదర్శ్‌రెడ్డి(ఓసీ); ఆర్సీపురం– పి.నగేష్ యాదవ్(బీసీ); పటాన్చెరు– ఎం.కుమార్‌యాదవ్(బీసీ); కేపీహెచ్‌బీకాలనీ– ఎం.శ్రీనివాసరావు(ఓసీ); బాలాజీనగర్– శీరిషబాబురావు(బీసీ); అల్లాపూర్– సబీహాబేగం(మైనార్టీ); మూసాపేట్– శ్రవణ్‌కుమార్(బీసీ); ఫతేనగర్– సతీష్‌గౌడ్(బీసీ) బోయిన్పల్లి– ఎం.నర్సింహ్మాయాదవ్(బీసీ); అల్విన్‌కాలనీ– వెంకటేష్‌గౌడ్(బీసీ); గాజులరామారం– రావుల శేషగిరి(బీసీ); జగద్గిరిగుట్ట– కె.జగన్(బీసీ); రంగారెడ్డినగర్– విజయశేఖర్‌గౌడ్(బీసీ); చింతల్– రషీదాబేగం(మైనార్టీ); సూరారం– ఎం.సత్యనారాయణ(బీసీ); సుభాష్‌నగర్– ఆదిలక్ష్మి(ఓసీ); కుత్బుల్లాపూర్– పారిజాతగౌడ్(బీసీ); జీడిమెట్ల– పద్మప్రతాప్గౌడ్(బీసీ); మచ్చబొల్లారం– జితేందర్‌నాథ్(ఎస్సీ), అల్వాల్– విజయశాంతి(ఓసీ); వెంకటాపురం– సబితా కిషోర్(ఎస్సీ); మల్కాజ్గిరి– జగదీష్‌గౌడ్(బీసీ); సీతాఫల్మండి– హేమ(బీసీ); బన్సీలాల్‌పేట్– హేమలత(ఎస్సీ); రాంగోపాల్‌పేట్– అరుణ(బీసీ); మోండామార్కెట్– ఆకుల రూప(బీసీ) కాంగ్రెస్ అభ్యర్థులు.. కాప్రా– శ్రీపతికుమార్(ఎస్సీ); ఏఎస్రావు నగర్– శిరీషారెడ్డి (ఓసీ); ఉప్పల్– ఎం.రజిత(ఓసీ); నాగోల్– ముస్కు శైలజ(ఓసీ); మన్సూరాబాద్– జక్కిడి ప్రభాకర్‌రెడ్డి(ఓసీ); హయత్‌నగర్– గుర్రం శ్రీనివాసరెడ్డి(ఓసీ); హస్తినాపురం– సంగీతానాయక్(ఎస్టీ); ఆర్కేపురం– పున్న గణేష్ నిర్మలానేత(బీసీ); గడ్డిఅన్నారం– వెంకటేష్‌యాదవ్(బీసీ); సులేమాన్‌నగర్– రిజ్వానాబేగం(బీసీ); మైలార్దేవులపల్లి– శ్రీనివాస్‌గౌడ్(బీసీ); రాజేంద్రనగర్– బి.దివ్వ(ఎస్సీ); అత్తాపూర్– భాస్కర్‌గౌడ్(బీసీ); కొండాపూర్– మహిపాల్‌యాదవ్(బీసీ); మియాపూర్– ఇలియాస్ షరీఫ్(మైనార్టీ), అల్లాపూర్– కౌసర్‌బేగం(మైనార్టీ) మూసాపేట్– రాఘవేందర్(ఓసీ); ఓల్డ్‌బోయిన్‌పల్లి– అమూల్య(ఓసీ); బాలానగర్– సత్యం శ్రీరంగం(ఓసీ); కూకట్పల్లి– వెంకటేశ్వర్రావు(ఓసీ); గాజుల రామారం– కూన శ్రీనివాస్‌గౌడ్(బీసీ); రంగారెడ్డినగర్– గిరిగి శేఖర్(బీసీ); సూరారం– వెంకటేష్(ఓసీ); జీడిమెట్ల– బండి లలిత(ఓసీ); నేరేడ్మెట్– మరియమ్మ(ఓసీ); మౌలాలి– ఉమా మహేశ్వరి(బీసీ); మల్కాజ్గిరి– శ్రీనివాస్‌గౌడ్(బీసీ); గౌతంనగర్– తపస్వినీ యాదవ్(బీసీ); బేగంపేట్– మంజులారెడ్డి(ఓసీ); మూసారంబాగ్– లక్ష్మి(ఓసీ); ఓల్డ్‌మలక్‌పేట్– వీరమణి(బీసీ) పత్తర్‌గట్టి– మూసాఖాసీం(మైనార్టీ); ఐఎస్ సదన్– కె.మంజుల(ఓసీ); సంతోష్‌నగర్– మతీన్ షరీఫ్(బీసీ); పురానాఫూల్– మహ్మద్సాహిల్ అక్బర్(బీసీ); లలితాబాగ్– అబ్దుల్ ఇర్ఫాన్(మైనార్టీ); రియాసత్‌నగర్– సయ్యద్‌ముస్తాఫా ఖాద్రీ (మైనార్టీ); కంచన్‌బాగ్– అమీనాసబా(బీసీ); బార్కస్– షహనాజ్‌బేగం(బీసీ); చాంద్రాయణగుట్ట– షేక్ అఫ్జల్(బీసీ); నవాబ్‌సాబ్‌కుంట– మెహరాజ్‌బేగం(బీసీ); శాలిబండ– చంద్రశేఖర్(బీసీ); కిషన్‌బాగ్– అసద్‌అలీ(బీసీ); బేగంబజార్– పురుషోత్తం(ఓసీ); దత్తాత్రేయనగర్– అజయ్ నారాయణ(బీసీ) బీజేపీ అభ్యర్థులు.. పత్తర్‌గట్టి– అనిల్‌బజాజ్(ఓసీ); మొగుల్‌పుర– మంజుల(ఓసీ); పురానాపూల్– సురేందర్‌కుమార్(బీసీ); కార్వాన్– కె.అశోక్(బీసీ); లంగర్‌హౌస్– సుగంద పుష్ప(బీసీ); టోలిచౌకి– రోజా(బీసీ); నానల్‌నగర్– కరణ్‌కుమార్(బీసీ), సైదాబాద్– కె.అరుణ(ఓసీ); అక్బర్‌బాగ్– నవీన్‌రెడ్డి(ఓసీ); డబీర్‌పుర– మిర్జా అఖిల్ అఫండి(మైనార్టీ); రెయిన్‌బజార్– ఈశ్వర్ యాదవ్(బీసీ);లలితాబాగ్– చంద్రశేఖర్(ఎస్సీ); కుర్మగూడ– శాంత(బీసీ); ఐఎస్ సదన్– జంగం శ్వేత(ఓసీ); రియాసత్‌నగర్– మహేందర్‌రెడ్డి(ఓసీ); చాంద్రాయణగుట్ట– నవీన్‌కుమార్(బీసీ); ఉప్పుగూడ– శ్రీనివాసరావు(బీసీ); గౌలిపుర– భాగ్యలక్ష్మి(బీసీ); శాలిబండ– నరే ష్(బీసీ); దూద్‌బౌలి– నిరంజన్‌కుమార్(బీసీ); ఓల్డ్ మలక్‌పేట్– రేణుక(బీసీ) -
గులాబీ కళ
-
కాంగ్రెస్ నేతల మధ్య కుదరని ‘ఐ’క్యత
నిర్మల్ సభ ఏర్పాట్లకు ప్రతిబంధకాలు అదేరోజు ఢిల్లీకి వెళ్లనున్న టీ-మంత్రులు డీసీసీ సదస్సుకు దూరంగా ప్రేమ్‌సాగర్ వర్గం ఎమ్మెల్యేలు మహేశ్వర్, సక్కు హాజరు రచ్చబండ వాయిదా వేస్తేనే సభకు మంచిది ఇద్దరు ఎమ్మెల్యేలకు సీఆర్ఆర్ సూచన సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జైత్రయాత్ర సభ నిర్వహణ ఏర్పాట్లు బాలారిష్టాలు దాటడం లేదు. నిర్మల్‌లో 13న నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు గడువు సరిగ్గా ఆరు రోజులే ఉంది. ఓ వైపు ఆ పా ర్టీలో కొలిక్కిరాని గ్రూపు తగాదాలు.. మరోవైపు రెండు రోజుల ముందు మొదల య్యే రచ్చబండ మూడో విడత.. 12, 13 తేదీల్లో ఢిల్లీకి టీ-మంత్రుల పయనం.. ఇవన్నీ జైత్రయాత్రకు ప్రతిబంధకాలుగా కనిపిస్తున్నాయి. నిర్మల్ కేంద్రంగా నిర్వహించే సభకు సక్సెస్ చేయడం కోసం బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డితో విభేదాలున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు దూరంగా ఉన్నారు. ఆయనతోపాటు ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ తదితరులు హాజరుకాలేదు. ఓ వైపు అధికార కార్యక్రమాలు, మరోవైపు టీ-మంత్రుల పర్యటనల నేపథ్యంలో సభను 13న నిర్వహిస్తారా? లేక మరో రోజుకు వాయిదా వేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డీసీసీ సభకు ప్రేమ్‌సాగర్ దూరం నిర్మల్‌లో 13న నిర్వహించే బహిరంగ సభ సక్సెస్ కోసం ఆదిలాబాద్ డీసీసీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు రాలేదు. అదేవిధంగా ఆ పార్టీ ఎమ్మెల్సీ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ సుల్తాన్ అహ్మద్, మాజీ మంత్రి బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ సమావేశానికి హాజరు కాలేదు. అయితే డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి వర్గంగా ఉన్న నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నడిపెల్లి దివాకర్‌రావు కార్యకర్తలతో హాజరయ్యారు. ప్రేమ్‌సాగర్‌రావు గ్రూపునకు చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, జాదవ్ అనిల్‌కుమార్‌లతోపాటు పలువురు మార్కెట్ కమిటీ చైర్మన్లు, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు సమావేశంలో పాల్గొన్నారు. రెండు వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హాజరైనా, ఆశించిన స్థాయిలో కార్యకర్తలు హాజరయ్యేలా నాయకత్వం తీసుకున్న చర్యలు కనిపించలేదు. జైత్రయాత్ర సభ సక్సెస్‌కు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని భావించి ఏర్పాటు చేసిన సమావేశానికి కేడర్ అంతంత మాత్రంగానే హాజరుకావడం, రెండు గ్రూపులకు చెందిన కొందరు నేతలు హాజరైనా ముఖ్య నేతల గైర్హాజరు కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది. జైత్రయాత్రపై రచ్చబండ ప్రభావం నిర్మల్‌లో 13న జైత్రయాత్ర సదస్సుకు కాంగ్రెస్ పార్టీ భారీ సన్నాహాలు చేస్తుండగా అంతకు రెండు రోజుల ముందే రచ్చబండ మూడో విడతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇటు జైత్రయాత్ర సభ, అటు మూడో విడత రచ్చబండ రెండు కూడా పార్టీకి ప్రతిష్టాత్మకమే. ఈ నేపథ్యంలో జైత్రయాత్ర సభ నిర్వహిస్తే రచ్చబండ ప్రభావం పడే అవకాశం ఉంది. సమైక్యాంధ్ర, తెలంగాణకు చెందిన మంత్రులు ఈనెల 12,13 తేదీల్లో వేర్వేరుగా కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)ను కలిసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రుల బృందం వేర్వేరుగా తెలంగాణ విభజనకు సంబంధించిన 11 విధివిధానాలను సూచించిన నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లడం టీ-మంత్రులకు అనివార్యం. ఈ నేపథ్యంలో జైత్రయాత్ర సభకు టీ-మంత్రులు హాజరయ్యే అవకాశం లేదని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఒకరు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేస్తేనే జైత్రయాత్ర సభను సక్సెస్ చేసుకోవచ్చని.. దీనికి నిర్మల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, ఆత్రం సక్కు చొరవ చూపి ప్రభుత్వం ప్రకటన చేయించాలని సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి సూచించడం గమనార్హం. ఈ క్రమంలో నిర్మల్‌లో సభపై స్పష్టత రావాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.