human chain
-
గుడిని కాపాడేందుకు ముస్లింల మానవ హారం
-
బెంగళూరు అల్లర్లు: ముస్లింల సాహసం
సాక్షి, బెంగళూరు: ఫేస్బుక్లో షేర్ చేసిన ఓ పోస్టు బెంగళూరులో విధ్వంసం సృష్టించింది. ఆ పోస్టు పెట్టిన వ్యక్తి నవీన్.. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు కావడంతో సదరు ఎమ్మెల్యే ఇంటిపై మంగళవారం రాత్రి దాడి జరిగింది. ఆయన ఇంటిని ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పు పెట్టారు. ఆ ప్రాంతంలోని సుమారు 200-250 కార్లతో పాటు పోలీసు వాహనాలకు నిప్పంటించారు. దుండగులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగి కాల్పులు జరపగా అల్లర్లు తీవ్రరూపం దాల్చాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 60 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. (ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. చెలరేగిన హింస) దీంతో డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్ల నేపథ్యంలో డీజే హళ్లిలోని ఓ ఆలయాన్ని దుండగుల నుంచి కాపాడేందుకు కొందరు ముస్లిం వ్యక్తులు ఒకరి చేతులు మరొకరు పట్టుకుంటూ గుడి చుట్టూ మానవ హారం చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హిందూముస్లింలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని సందేశాన్నిచ్చారని నెటిజన్లు వారిని కొనియాడుతున్నారు. కాగా బెంగళూరు అల్లర్ల ఘటనలో ఇప్పటివరకు 110 మందిని అరెస్టు చేయగా, వివాదాస్పద పోస్టు చేసి ఘర్షణకు కారణమైన నవీన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో 144 సెక్షన్ అమల్లో ఉంది. (బెంగుళూరు అల్లర్లపై సీఎం సీరియస్) -
మా భవిష్యత్తుకు ఏం హామీ ఇస్తారు?
సాక్షి, బెంగళూరు: చిప్కో ఉద్యమం అందరికీ తెలిసే ఉంటుంది. జనాలు గుంపులుగా చేరి ఒకరి చేతులు మరొకరు పట్టుకుంటూ చెట్లను ఆలింగనం చేసుకుని వాటిని నరకకుండా రక్షిస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే గురువారం కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. బెంగళూరు శివారు ప్రాంతమైన సర్జపూర- అట్టిబెలె మార్గంలో ప్రభుత్వం రోడ్డు వెడల్పు చేపట్టాలని ప్రణాళికలు రచించింది. అందుకోసం టెండర్లు సైతం నిర్వహించింది. ఈ క్రమంలో కాంట్రాకర్లు ఆ ప్రాంతానికి రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న చెట్లను నరికేందుకు మార్కింగ్ చేసుకోగా సుమారు 1800 చెట్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన స్థానికులు, విద్యార్థులు గురువారం సాయంత్రం అంతా ఏకమై చెట్లను నరకడానికి వీల్లేదంటూ మానవహారం చేపట్టారు. ‘చెట్లను నరకవద్దు’ అంటూ నినాదాలిచ్చారు. ‘ఇప్పటికే రోడ్లు వెడల్పుగా ఉన్నందున ఈ పనులు అనవసరం. కాలుష్య కోరల్లో చిక్కుకున్న బెంగళూరు జీవించడానికి వీల్లేని నగరంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఉన్న కొన్ని చెట్లను కూడా నరికేసి మా భవిష్యత్తుకు ఏం హామీ ఇవ్వగలరు?’ అని ప్రశ్నించారు. (నిరసనలతో అరాచకం) చెట్లు.. బాహ్య ఊపిరితిత్తులు రోడ్డు వెడల్పు.. పర్యావరణాన్ని నాశనం చేస్తుందే తప్ప ట్రాఫిక్ సమస్యను పరిష్కరించదని నిరసనకారులు పేర్కొన్నారు. ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని కోరారు. సబర్బన్ రైళ్లు నడుపడం, బస్ సర్వీసులు పెంచడం ద్వారా ప్రజలకు కార్లు వాడాల్సిన పని తప్పుందన్నారు. బెంగళూరు ఇప్పటికే డేంజర్ జోన్లో ఉందని, కనుక మరిన్ని చెట్లను కోల్పోవడం ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలతో వాతావారణాన్ని క్షీణింపజేయడమే కాక మన ఆరోగ్యాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్జపుర గ్రామవాసి దీపాంజలి నాయక్ మాట్లాడుతూ..చెట్లు లేకుండా బతకలేం.. అవి మనకు బాహ్య ఊపిరితిత్తులు. 100యేళ్ల పైబడి వయస్సున్న చెట్లను నరకివేయడం మాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. పైగా ఇలాంటి చెట్లను మళ్లీ నాటడం ఎంతో కష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కాంట్రాకర్లు మాత్రం వాళ్లు అవేవీ పట్టించుకోకుండా నిరసన చేస్తున్న సమయంలోనే రహదారి సర్వే చేయడం గమనార్హం. (గుడ్రంగా తిరుగుతున్న మొక్క) -
రాష్ట్ర వ్యాప్తంగా వికేంద్రీకరణ మానవ హారాలు
సాక్షి, అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘాలు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మానవహారం నిర్వహించారు. ‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విశాఖపట్నం: వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ ఏయు మెయిన్ గేట్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు కామనతారావు ఆధ్వర్యంలో విద్యార్ధులు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, విశాఖ సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ఉన్మాదిలా తయారై రాష్ట్రాభివృద్దిని అడ్డుకుంటున్నారని.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలంటే వికేంద్రీకరణ జరగాలని నాయకులు, విద్యార్ధి నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైఎస్సార్: జిల్లాలోని అంబెడ్కర్ కూడలి వద్ద ముడవ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ నేతల రిలే దీక్షలు కొనసాగుతున్నయి. వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు పత్తి రాజేశ్వరి, సుబ్బమ్మ ఆధ్వర్యంలో ఈ దీక్షలు జరుగుతున్నాయి. ‘ఒక రాజదాని వద్దు మూడు రాజధానులు ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ అడ్డుకున్న వారు చరిత్ర హీనులుగా మారుతారని పలువురు నేతలు హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఖాజా రహంతుల్లా ఆధ్వర్యంలో విద్యార్ధులు మానవహారం చేపట్టారు. శ్రీహరి డిగ్రీ కళాశాల నుండి ఐటీఐ కూడలి వరకు భారీ ర్యాలీ జరిగింది. ఐటీఐ కూడలి లో మానవహారం నిర్వహించిన విద్యార్థులు.. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ నినాదాలు చేశారు. కృష్ణాజిల్లా: ‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు’ అంటూ విస్సన్నపేట పట్టణంలోవిద్యార్ధులు, ప్రజలు పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు. ఈ మానవహారం కార్యక్రమానికి ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి సంఘీభావం తెలిపారు. విజయవాడ గన్నవరం వైఎస్సార్ సీపీ ఇంచార్జి, కేడీసీసీబీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో అభివృద్ధి వికేంద్రీకరణ మద్దతు ర్యాలీ జరిగింది. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్లో పెద్దెఎత్తున మానవహారంనిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నాయకులు, విద్యార్ధులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడనే నమ్మకంతో 151 సీట్లు ఇచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు. గతంలో రెండు లక్షల 20 వేల కోట్లు ఒకేచోట కుప్పపోసి నష్టపోయాయని ఆయన అన్నారు. అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదే సీఎం జగన్ అన్ని ప్రాంతాలు అభివృద్ధికి శ్రీకారం చుట్టారని తెలిపారు. పీఎం జగన్మోహన్రెడ్డి తలపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రజలు నుంచి భారీ మద్దతు ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రకాశం: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో మంగమూరు రోడ్డులో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు సింగరాజు వెంకటరావు పాల్గొన్నారు. విజయనగరం: మూడు రాజధానులకు మద్దతుగా విజయనగరం కోట జంక్షన్లో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ మానవహారంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్సార్సీపీ నేతలు, విద్యార్ధులు శృంగవపుకోట దేవిబొమ్మ కూడలిలో మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి రఘురాజు, పినిశెట్టి వెంకటరమణ, రహిమాన్ పాల్గున్నారు. పాలన వికేంద్రీకరణకు మద్దతుగా నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. కోట జంక్షన్ నుంచి గంట స్థంభం వరకు కొనసాగిన ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, నాయీ బ్రాహ్మణులు పాల్గొన్నారు. కర్నూలు: అభివృద్ధి వికేంద్రీకరణ మద్దతుగా, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టి విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద మానవహరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్థన్ రెడ్డి, యువజన విభాగం నాయకులు అనిల్, కృష్ణకాంత్ రెడ్డి, ఆదిమోహన్ రెడ్డి, భాను తదితరులు పాల్గొన్నారు. -
బిహార్‌లో 5 కోట్ల మంది మానవహారం
పట్నా: పర్యావరణ పరిరక్షణ, సామాజిక రుగ్మతల నిర్మూలన కోసం ప్రభుత్వానికి మద్దతుగా బిహార్‌లో 5.17 కోట్ల మంది కలసి ఆదివారం భారీ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ చైన్ దాదాపు 18,034 కిలోమీటర్ల పొడవుంది. 2017, 18లలో మద్యనిషేధం, వరకట్నం–బాల్యవివాహాల నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన మానవహారం కంటే ఇదే అతిపెద్దది కావడం విశేషం. ఈ మానవహారం పొడవు 2018 కంటే 14 వేల కిలోమీటర్లు, 2017 కంటే 11 వేల కిలోమీటర్లు అధికం. 2017లో మొదటిసారి మొదలైన ఈ మానవ హారం అప్పట్లోనే గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో బంగ్లాదేశ్ రికార్డును అధిగమించిందని అధికారులు చెప్పారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా మానవహారం ఫొటోలు తీశారు. ఈ కార్యక్రమంలో ఓ అపశ్రుతిచోటు చేసుకుంది. దర్భంగా జిల్లాలో ఓ వ్యక్తి, సమస్తిపూర్‌లో ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందారు. -
మహిళల మానవహారం
-
సమానత్వం కోసం మానవహారం
తిరువనంతపురం: స్త్రీ–పురుష సమానత్వం కోసం కేరళలో మహిళలు కదంతొక్కారు. మంగళవారం 65వ జాతీయ రహదారిపై కాసర్‌గఢ్ నుంచి దక్షిణ కొన వరకు 620 కిలోమీటర్ల పొడవున మహిళలు మానవహారం చేపట్టారు. మంగళవారం సాయంత్రం ప్రారంభమైన ఈ మానవహారంలో వివిధ రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. వారికి సంఘీభావంగా పురుషులు మానవహారం చేపట్టారు. మానవహారం ద్వారా కులం, మతం అనే అడ్డుగోడలను మహిళలు కూలదోస్తారని కేరళ ముఖ్యమంత్రి విజయన్ విశ్వాసం వ్యక్తంచేశారు. కాసరగఢ్ వద్ద ఆరోగ్య మంత్రి షిలాజా, వెలయంబలమంలో సీపీఐ జాతీయ నేత బృందాకారత్ మానవహారంలో పాల్గొన్నారు. శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ మానవహారానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి ముందు సీఎం విజయన్ సామాజిక సంస్కర్త ’అయ్యంకాలి’ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మానవహారంపై బీజేపీ కార్యకర్తల దాడి కాసర్‌గఢ్ జిల్లాలోని చెట్టుకుండ్‌లో బీజేపీ–ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మానవ హారంపై దాడికి తెగబడ్డారు. మహిళలు, పోలీసులపై రాళ్లు రువ్వడంతో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. రెండు మీడియా చానల్స్ సిబ్బందిపై దాడి చేసి ఘటనకు సంబంధించిన వీడియోలను తొలగించా ల్సిందిగా బెదిరించారు. జాతీయ రహదారిపై నిలబడి ఉన్న మహిళలకు దగ్గరలోని పొదలకు కొంతమంది నిప్పు పెట్టారని, వారిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులపై రాళ్ళ దాడి చేశారని జిల్లా పోలీసు అధికారి అబ్దుల్ కరీం చెప్పారు. -
ప్రతిపక్షాల మానవహారం
న్యూఢిల్లీ: పార్లమెంట్‌ను సజావుగా నిర్వహించటంలో అధికార ఎన్డీఏ విఫలమైందంటూ ప్రతిపక్షాలు గురువారం మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపాయి. పార్లమెంట్ ఆవరణలోని మహాత్ముని విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘కాంగ్రెస్‌తోపాటు టీఎంసీ, వామపక్షాలు, ఎన్సీపీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ తదితర 17 పార్టీల నాయకులు అరగంటపాటు మానవహారంగా ఏర్పడ్డారు. వివిధ అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు..’అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ తెలిపారు. మరోమార్గం లేకనే ప్రభుత్వ వైఖరిపై ఈ నిరసన తెలిపామన్నారు. ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చు కునేందుకు.. వేల కోట్ల పీఎన్బీ కుంభకోణం, ఎస్టీ ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు, సీబీఎస్ఈ ప్రశ్నపత్రాల లీకేజీ తదితర అంశాలను తాము ప్రస్తావించకుండా అడ్డుకుం దని వివిధ పార్టీల నేతలు ఆరోపించారు. -
చేయి చేయి కలిపి.. హోదా కోసం నిలిచి..
సాక్షి నెట్వర్క్: పిల్లాజెల్లా.. ఊరూవాడా.. అందరూ రోడ్లపైకి చేరారు.. చేయీ చేయీ కలిపారు.. ఎర్రటి ఎండ చురుక్కుమంటున్నా... నిలబడడం వల్ల నీరసం వస్తున్నా మొక్కవోని దీక్షతో అలాగే నిలిచారు.. నినాదాలతో హోరెత్తించారు. ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా..రాష్ట్రవ్యాపితంగా ‘ప్రజాసంకల్ప మానవహారం’ కార్యక్రమాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంటులో పోరాడుతున్న వైఎస్సార్సీపీ ఎంపీలకు సంఘీభావంగా ఆ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ‘ప్రజాసంకల్ప మానవహారం’ కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. అన్ని జిల్లాల్లోనూ ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది. పలు చోట్ల ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు స్వచ్ఛందంగా వచ్చి ఈ మానవహారం కార్యక్రమాలను జయప్రదం చేశారు. వివిధ నియోజకవర్గ కేంద్రాలలో జరిగిన మానవహారాలలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖలో... కొమ్మూరు మానవహారంలో ప్రతిపక్షనేత.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి సోమవారం గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు గ్రామంలో గ్రామస్తులు, పార్టీ అభిమానులతో కలిసి ప్రజాసంకల్ప మానవహారంలో పాల్గొన్నారు. జగన్ పాదయాత్రగా కొమ్మూరు చేరుకొనే సమయానికి గ్రామంలో ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడి మానవహారంగా ఏర్పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చితీరాలంటూ నినాదాలు చేస్తున్నారు. పార్టీ నేతలు రావి వెంకటరమణ, మేకతోటి సుచరిత, లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి తదితరులతో కలిసి జగన్మోహన్రెడ్డి ఆ మానవహారంలో పాల్గొన్నారు. ‘ప్రత్యేక హోదా జగన్‌తోనే సాధ్యం’.. ఢిల్లీ గడ్డపై హోదా నినాదం వినిపించిన ఏకైక నాయకుడు జగన్’ అని ప్రజలు, అభిమానులు నినాదాలు చేశారు. అనంతపురంలో... -
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ప్రజాసంకల్ప మానవహారాలు
-
హోదా తీర్మానానికి మద్దతుగా జగన్ మానవహారం
-
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంకల్ప మానవహారాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్‌సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సోమవారం చర్చకు రానున్న సందర్భంగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా సంకల్ప మానవహారం కార్యక్రమాలను నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్టీ సీనియర్ నేతలతో చర్చించి నిర్దేశించిన ఈ కార్యక్రమంలో పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు భాగస్వాములయ్యారు. రాష్ట్ర ప్రజల ప్రత్యేక హోదా ఆకాంక్ష ఢిల్లీకి తెలిసివచ్చేలా ప్రజాసంకల్ప మానవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు భారీ ఎత్తున పాల్గొన్నారు. గుంటూరు: అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా జిల్లాలోని అన్నీ నియోజక వర్గాల్లో మానవహారాలు చేపట్టారు. వేమూరులో పార్టీ నేత మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో, వినుకొండ స్తూపం సెంటర్లో బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ప్రజా సంకల్ప మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు నినాదాలు చేశారు కాగా, జిల్లాలో కాకుమాను మండలం కొమ్మూరు వద్ద పార్టీ శ్రేణులు చేపట్టిన ప్రజాసంకల్ప మానవహారంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. విజయవాడ: విజయవాడలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజాసంకల్ప మానవహారాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొని అవిశ్వాస తీర్మానానికి సంఘీభావం ప్రకటించారు. కర్నూలు: జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మానవహారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్యలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం: అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా అనంతపురం క్లాక్ టవర్ వద్ద ప్రజాసంకల్స మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాల్ రెడ్డి, అనంత వెంట్రామి రెడ్డి, రాగే పరుశురాం తదితరులు పాల్గొన్నారు. విశాఖ: జిల్లాలోని ఇసుకతోటలో ప్రజాసంకల్ప మానవహారం చేపట్టారు. తూర్పు నియోజక వర్గ సమన్వయ కర్త వంశీకృష్ణ ఆధ్వర్యంలో చేసిన మానవహారంలో జిల్లా అధ్యక్షుడు తైనాల విజయ్ కుమార్ పాల్గొన్నారు. అయితే మానవహారాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తోపులాట చోటు చేసుకోవడంతో విజయ్ కుమార్‌కు గాయాలయ్యాయి. పోలీసులు నేతలను అరెస్టు చేసి ఎంవీపీ పీఎస్‌కు తరలించారు. విజయనగరం : కేంద్ర ప్రభుత్వం పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా పట్టణంలోని గంటస్తంభం వద్ద వైస్సార్ సీపీ, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. వైఎస్ఆర్ సీపీ పట్టణ అధ్యక్షుడు అశపు వేణు, సీపీఐ నాయకులు కామేశ్వరరావుతో పాటు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కురుపాంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పుష్పవాణి ఆధ్వర్యంలో ప్రజాసంకల్ప మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేత పరీక్షిత్ రాజు కూడా పాల్గొన్నారు. చిత్తూరు : కేంద్ర ప్రభుత్వం పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా జిల్లాలోని గంగాధర నెల్లురులో ఎమ్మెల్యే నారాయణ స్వామి ఆధ్వర్యంలో ప్రజాసంకల్ప మానవహారం చేపట్టారు. అలాగే పీలేరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజాసంకల్ప మానవహారం నిర్వహించారు. తూర్పు గోదావరి : కేంద్ర ప్రభుత్వం పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా జిల్లాలోని రాజానగరంలో వైఎస్ఆర్సీపీ కో-ఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో, రావులపాలెంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో, రాజోలులో వైసీపీ కో-ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజాసంకల్ప మానవహారం నిర్వహించారు. రాజోలులో నిర్వహించిన మానవహారంలో నేతలు జిల్లెల బెన్నీ, బ్రహ్మాజీ, సింహాద్రి, భగవాన్, కాశి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు : జిల్లాలోని వెంకటగిరి పాతబస్టాండ్ వద్ద ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యలో ప్రజాసంకల్ప మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ఢిల్లీ బాబు, చిట్టేటి హరికృష్ణా, నక్క వెంకటేశ్వర్లు, నెమల్లాపూడి సురేష్ రెడ్డి, గిరి రెడ్డితో ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే జిల్లాలోని గూడూరు పట్టణంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ మేరిగ మురళిధర్, సీజీసీ సభ్యులు ఎల్లసిరీ గోపాల్ రెడ్డి, నేదురుమల్లి పద్మనాభ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాస్, మల్లు విజయ కుమార్ రెడ్డి, నేదురుమల్లి ఉదయ్ శేఖర్ రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మీరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు మానవహారాలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం మానవహారాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య తెలిపారు. ప్రత్యేక హోదా కోసం సోమవారం పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రానున్నదని, ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీల పోరాటానికి మద్దతుగా మానవహారాలు చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం వారు సాక్షితో మాట్లాడుతూ.. జిల్లాలోని 14 నిమోజకవర్గాల్లో సంఘీభావ మానవ హారాలు చేపట్టాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్సార్సీపీ నిరంతర పోరాటాలతో ప్రజల్లో ఉంటుందన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల గుండె చప్పుడు ప్రత్యేక హోదా అని, దానిని ఇవ్వబోమని చెప్పడానికి ఎవరికీ హక్కు లేదన్నారు. సీఎం చంద్రబాబునాయుడు స్వలాభం చూసుకోవడంతో హోదా నాలుగేళ్లు ఆలస్యమైందన్నారు. మూడేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ వద్దని, ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగి ఉంటే వచ్చేదన్నారు. అయితే సీఎం చంద్రబాబునాయుడు ఓటుకు ఓటు కేసులో ఇరుక్కోవడం, లక్షల కోట్లు అవినీతి చేయడం తదితర కారణాలతో కేంద్రం.. రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. నాటి నుంచి నేటి వరకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసమే పోరాడుతున్నారన్నారు. నాలుగేళ్లు తరువాత సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా అంటూ యూటర్న్ తీసుకొని.. పోరాటం చేస్తున్నాని చెప్పితే నమ్మేందుకు ప్రజలెవరూ సిద్ధంగా లేరన్నారు. హోదాతో ఏమీ రావని, అది ముగిసిన అధ్యాయం అని చెప్పిన సీఎం.. ఊసరవెల్లిలా ఎన్నికలు దగ్గర పడడంతో మాటమార్చారన్నారు. కేంద్ర ప్రభుత్వంపై రెండోసారి వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వాలని, లేదంటే ప్రజలే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. -
తీరంలో అద్భుతం: మానవహారంగా ఏర్పడి..!
అమెరికా ఫ్లోరిడాలోని పనామా సిటీ బీచ్‌లో మానవత్వం పరిమళించే ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. కళ్లముందే ఓ కుటుంబం నీళ్లలో కొట్టుకుపోవడాన్ని చూసి అక్కడి వారంతా క్షణాల్లో స్పందించి ఆ కుటుంబాన్ని కాపాడారు. రాబెర్టా ఉర్స్ రే అనే మహిళ బోట్ రైడ్ చేస్తుండగా అది నీటిలో మునిపోయింది. అందులోని వారు నీటిలో కొట్టుకుపోతూ 'హెల్ప్ హెల్ప్' అంటూ అరిచారు. వారికి సాయం చేసేందుకు ఓ దంపతులు ముందుకొచ్చారు. వారిని కాపాడేందుకు ఈదుకుంటూ వెళ్లారు. వాళ్లని చూసి మరో ఇద్దరు, ఇంకో నలుగురు.. ఇలా దాదాపు 80 మంది నీటిలోకి వెళ్లారు. చేయిచేయి కలిపి మానవహారంలా మారి.. కుటుంబాన్ని రక్షించారు. జులై 8న జరిగిందీ ఘటన. రాబెర్టా ఉర్స్‌రే అనే మహిళ తన కుటుంబంతో కలిసి బోట్ రైడ్ చేస్తుండగా.. బోట్ మునిగిపోయింది. నీటిలో కొట్టుకుపోతూ హెల్ప్ హెల్ప్ అంటూ అరుస్తున్న ఉర్స్‌రే కుటుంబాన్ని జెస్సికా, డెరెక్ సిమన్స్ అనే దంపతులు చూశారు. ఆ సమయంలో అక్కడ హెల్పింగ్ గార్డ్స్ గానీ.. పోలీసులు గానీ లేరు. దీంతో క్షణం ఆలస్యం చేయకుండా జెస్సికా నీళ్లలోకి దూకింది. జెస్సికాకు ఈత బాగా వచ్చు. అనంతరం డెరెక్ కూడా ఆమె వెంట వెళ్లాడు. ఇంతలో మరి కొందరు నీళ్లల్లో ఈదుకుంటూ అక్కడికి చేరారు. నా చేయి పట్టుకోండి అంటూ జెస్సికా వెనుక ఉన్నవారికి చెప్పింది. అలా ఒక్కొక్కరుగా 80 మంది మానవహారంలా ఏర్పడ్డారు. నీటిలో కొట్టుకుపోతున్న వారిని గుర్తించడం ముందు కాస్త కష్టమైంది. అయితే వారి అరుపులు.. నీటిలో మునిగిపోతుండగా వారి తలలను గుర్తించి జెస్సికా ఆ దిశగా ఈత ప్రారంభించింది. ఆమెను అనుసరించి మిగతా వాళ్లంతా చేయిచేయి పట్టుకుని ఈదుతూ వచ్చారు. అలా గంట పాటు శ్రమించి.. మొత్తం 10 మందిని రక్షించి.. తీరానికి తీసుకొచ్చారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో 67 ఏళ్ల మహిళ కూడా ఉంది. నీటిలో మునగడంతో ఆమె గుండెపోటుకు గురయ్యారు. అయితే ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఉర్స్‌రే మీడియాతో మాట్లాడుతూ.. జెస్సికానే లేకపోతే ఈ రోజు తామంతా బతికే వాళ్లం కాదని.. వారికి రుణపడి జీవితాంతం ఉంటామని చెప్పారు. ఎవరితో ఎవరికీ పరిచయం లేకపోయినా.. వారంతా ఒక్కటై తమను రక్షించారని చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
వరద ఉధృతిలో మానవహారం కట్టి..!
చెన్నై గుండె చెరువైంది. ఎటుచూసినా నీళ్లు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు. నగరం నిండా కన్నీళ్లు, కడగండ్లు నింపింది. వానలు సృష్టిస్తున్న బీభత్సంతో నగరమంతా అతలాకుతలమవుతున్న వేళ చెన్నై వాసి మొక్కవోని గుండె ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. వరద ఉధృతిలో చిక్కుకున్న ఓ వ్యక్తిని చెన్నైవాసులు సాహసోపేతంగా కాపాడారు. ఐదారుగురు వ్యక్తులు మానవహరం కట్టి.. వరద ఉధృతిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి యుట్యూబ్లో పెట్టారు. వరద ఉధృతిలో పూర్తిగా చిక్కుకున్న వ్యక్తిని వారు మానవహరంగా ఏర్పడి.. చాకచక్యంగా కాపాడారు. ఇక చెన్నైలో భారీగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగునీరు, నిత్యావసరాల వస్తువులు అందుబాటులో లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. మొబైల్, ఇంటర్నెట్ సేవలు కూడా ఆగిపోయాయి. -
అనంతపురంలో 500కిమీ మానవహారం