Hunters Hyderabad
-
సింధు ఓడినా... హంటర్స్ నెగ్గింది
సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్లో హైదరాబాద్ హంటర్స్ జట్టు సొంతగడ్డపై శుభారంభం చేసింది. బుధవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన పోరులో హంటర్స్ 2–1 తేడాతో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌ను ఓడించింది. అయితే వరల్డ్ చాంపియన్ పీవీ సింధు మాత్రం తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోయింది. అభిమానుల సమక్షంలో ఆడిన తొలి మ్యాచ్‌లో తడబడి ఓటమితో నిరాశపర్చింది. తుది ఫలితం హంటర్స్‌కు అనుకూలంగా రావడం మాత్రం ఊరట.మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సింధు 8–15, 9–15 స్కోరుతో మిషెల్లీ లీ (నార్త్ ఈస్టర్స్ వారియర్స్) చేతిలో పరాజయంపాలైంది. ముందుగా జరిగిన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–ఇవనోవ్ జోడి 15–12, 8–15, 15–12తో కృష్ణ ప్రసాద్–కిమ్ హా నా పై గెలిచి శుభారంభం చేసింది. అయితే ట్రంప్ మ్యాచ్‌లో సౌరభ్ వర్మ 14–15, 14–15తో సేన్‌సోమ్‌బూన్‌సుక్ చేతిలో ఓడటంతో హంటర్స్ పాయింట్ కోల్పోవాల్సి వచ్చింది. పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్ జంట బెన్ లేన్–ఇవనోవ్ 15–7, 15–10తో బోదిన్ ఇసారా–లీ యంగ్ డేపై సంచలన విజయం సాధించింది. ఇది నార్త్ ఈస్టర్న్‌కు ట్రంప్ మ్యాచ్ కావడంతో స్కోరు 1–1తో సమమైంది. ఈ దశలో జరిగిన రెండో పురుషుల సింగిల్స్‌లో హంటర్స్ ప్లేయర్ డారెన్ ల్యూ 15–9, 15–10తో లీ చెక్ యు ను ఓడించి హైదరాబాద్ శిబిరంలో ఆనందం నింపాడు. నేటి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌స్టార్స్‌తో పుణే సెవెన్ ఏసెస్ జట్టు తలపడుతుంది. -
హంటర్స్ ఖాతాలో తొలి గెలుపు
లక్నో: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్లో హైదరాబాద్ హంటర్స్‌కు తొలి విజయం లభించింది. ఆదివారం ఇక్కడ జరిగిన పోరులో హైదరాబాద్ హంటర్స్ 2–1తో అవధ్ వారియర్స్‌పై గెలుపొందింది. పురుషుల తొలి సింగిల్స్‌లో సౌరభ్ వర్మ (హైదరాబాద్) 14–15, 15–12, 15–10తో శుభాంకర్ డే (అవ«ద్)పై గెలుపొందాడు. మిక్స్డ్ డబుల్స్‌లో ఇవనోవ్–సిక్కి రెడ్డి (హైదరాబాద్) ద్వయం 15–12, 15–14తో షిన్ బేక్–క్రిస్టీనా (అవధ్) జోడీపై నెగ్గింది. ఈ మ్యాచ్‌లో ‘ట్రంప్ కార్డు’తో ఆడిన అవధ్ వారియర్స్ ఓడిపోవడంతో... పీబీఎల్ నిబంధనల ప్రకారం వారి స్కోరుకు ఒక పాయింట్ పెనాల్టీ విధించారు. దాంతో హైదరాబాద్ 2–(–1)తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాత జరిగిన మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు (హైదరాబాద్) 15–8, 15–8తో తన్వీ లాడ్ (అవధ్)పై విజయం సాధించడంతో హైదరాబాద్ 3–(–1)తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దాంతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే హైదరాబాద్ విజయాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల రెండో సింగిల్స్‌లో ‘ట్రంప్ కార్డుతో బరిలో దిగిన హైదరాబాద్ ప్లేయర్ డారెన్ లీయూ 14–15, 9–15తో విన్సెంట్ (అవధ్ వారియర్స్) చేతిలో ఓడిపోవడంతో... ఈసారి హైదరాబాద్‌కు పెనాల్టీ ఎదురైంది. దాంతో హైదరాబాద్ ఆధిక్యం 2–0కు తగ్గింది. చివరి మ్యాచ్ అయిన పురుషుల డబుల్స్‌లో ఇవనోవ్–బెన్ లేన్ (హైదరాబాద్) జోడీ 12–15, 8–15తో కో సుంగ్ హ్యూన్–íÙన్ బేక్ (అవధ్ వారియర్స్) చేతిలో ఓడింది. నేటి మ్యాచ్‌లో పుణే 7 ఏసెస్‌తో బెంగళూరు రాప్టర్స్ తలపడుతుంది. -
సెమీస్‌లో హంటర్స్ ప్రీమియర్
బ్యాడ్మింటన్ లీగ్ న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–2) రెండో సీజన్లో హైదరాబాద్ హంటర్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంప్ ఢిల్లీ ఏసర్స్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. గురువారం ఇక్కడ జరిగిన టోర్నీ చివరి లీగ్ మ్యాచ్‌లో హంటర్స్ 5–2తో ఏసర్స్‌ను కంగుతినిపించింది. తద్వారా 14 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. పురుషుల సింగిల్స్ తొలి పోరులో సమీర్ వర్మ (హంటర్స్) 8–11, 11–3, 11–2తో సిరిల్ వర్మ (ఏసర్స్)పై గెలుపొందాడు. తర్వాత మిక్స్డ్ డబుల్స్‌లోనూ హైదరాబాద్ జోడి సాత్విక్ సాయిరాజ్– చౌ హో వా 11–3, 11–4తో వ్లాదిమిర్ ఇవనోవ్– గుత్తాజ్వాల (ఏసర్స్) జంటను ఓడించడంతో 2–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఢిల్లీ ట్రంప్ మ్యాచ్ పురుషుల సింగిల్స్‌లో జాన్ ఓ జోర్గెన్సన్ 11–5, 11–7తో రాజీవ్ ఉసెఫ్ (హంటర్స్)పై గెలిచి స్కోరును 2–2తో సమం చేశాడు. అనంతరం జరిగిన హైదరాబాద్ ట్రంప్ మ్యాచ్ మహిళల సింగిల్స్‌లో కరోలినా మారిన్ 15–14, 11–4తో నిట్చోన్ జిందపొన్ (ఏసర్స్)ను ఓడించి హంటర్స్‌కు విజయాన్ని ఖాయం చేసింది. పురుషుల డబుల్స్‌లో తన్ బూన్ హియోంగ్– తన్ వీ కియోంగ్ (హంటర్స్) 11–9, 13–11తో వ్లాదిమిర్ ఇవనోవ్–ఇవాన్ సొజోనొవ్ (ఏసర్స్) జంటపై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో అవధ్ వారియర్స్‌తో చెన్నై స్మాషర్స్, ముంబై రాకెట్స్‌తో హైదరాబాద్ హంటర్స్ తలపడతాయి. -
హైదరాబాద్ హంటర్స్‌కు రెండో విజయం
బెంగళూరు బ్లాస్టర్స్‌పై 4–3తో గెలుపు బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–2)లో హైదరాబాద్ హంటర్స్ జోరు పెంచింది. శనివారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో హంటర్స్ 4–3తో బెంగళూరు బ్లాస్టర్స్ జట్టుపై గెలిచింది. ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లాడిన హైదరాబాద్‌కు ఇది రెండో విజయం. పురుషుల సింగిల్స్ తొలిమ్యాచ్‌లో సమీర్ వర్మ (హైదరాబాద్) 11–7, 11–8తో బూన్సక్ పొన్సానా (బెంగళూరు)పై గెలిచి హంటర్స్‌కు శుభారంభాన్నిచ్చాడు. అయితే మిక్స్డ్ డబుల్స్‌లో కరోలినా మారిన్–సాత్విక్ సాయిరాజ్ (హైదరాబాద్) జోడీ 9–11, 7–11తో సిక్కిరెడ్డి–కో సంగ్ హ్యూన్ (బెంగళూరు) జంట చేతిలో ఓడింది. దీంతో స్కోరు 1–1తో సమమైంది. అనంతరం జరిగిన సింగిల్స్ మ్యాచ్‌ను బెంగళూరు ‘ట్రంప్’గా ఎంచుకోగా విక్టర్ అక్సెల్సన్ (బెంగళూరు) 11–6, 11–5తో భమిడిపాటి సాయిప్రణీత్ (హైదరాబాద్)పై గెలిచాడు. ఈ విజయంతో బ్లాస్టర్స్ ఆధిక్యం 3–1కు పెరిగింది. పురుషుల డబుల్స్‌లో తన్ బూన్ హియోంగ్–తన్ వి కియోంగ్ (హైదరాబాద్) ద్వయం 5–11, 13–11, 11–8తో కో సంగ్ హ్యూన్–యూ సియంగ్ (బెంగళూరు) జోడీపై నెగ్గింది. దాంతో బెంగళూరు ఆధిక్యం 3–2కి తగ్గింది. అనంతరం మ్యాచ్ ఫలితాన్ని తేల్చే ‘ట్రంప్’ పోరులో హైదరాబాద్ ప్లేయర్, ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ 9–11, 11–5, 11–8తో అశ్విని పొన్నప్ప (బెంగళూరు)పై గెలిచింది. దాంతో హైదరాబాద్ 4–3తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఆదివారం జరిగే పోటీల్లో ఢిల్లీ ఏసర్స్‌తో చెన్నై స్మాషర్స్, బెంగళూరు బ్లాస్టర్స్‌తో ముంబై రాకెట్స్ తలపడతాయి. -
హంటర్స్‌కు వారియర్స్ షాక్
5–0తో హైదరాబాద్‌పై గెలుపు మారిన్ చేతిలో సైనా ఓటమి హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో సీజన్లో హైదరాబాద్ హంటర్స్ జట్టుకు అవధ్ వారియర్స్ చేతిలో పరాభవం ఎదురైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన తమ రెండో మ్యాచ్‌లో హైదరాబాద్ 0–5తో పరాజయం చవిచూసింది. ఈ పోరులో కరోలినా మారిన్ (హైదరాబాద్) ఒక్కరే గెలిచినప్పటికీ... హంటర్స్ జట్టు ‘ట్రంప్’ మ్యాచ్ ఓడిపోవడం ద్వారా సాధించిన ఆ ఒక్క పాయింట్ కూడా కోల్పోవాల్సివచ్చింది. పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో వాంగ్ వింగ్‌కి విన్సెంట్ (వారియర్స్) 11–13, 11–6, 13–11తో సాయి ప్రణీత్ (హంటర్స్)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్‌లో రియో ఒలింపిక్స్ చాంపియన్ మారిన్ (హంటర్స్) 15–14, 11–5తో సైనా నెహ్వాల్ (వారియర్స్)ను కంగుతినిపించింది. మిక్స్డ్ డబుల్స్‌ను అవధ్ వారియర్స్ జట్టు తమ ‘ట్రంప్’ మ్యాచ్‌గా ఎంచుకోగా... బొదిన్ ఇసారా–సావిత్రి (వారియర్స్) 11–9, 12–10తో చౌ వా– సాత్విక్ సాయిరాజ్ (హంటర్స్)లపై గెలిచారు. దీంతో రెండు పాయింట్లు లభించాయి. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ (వారియర్స్) 11–13, 11–7, 13–11తో రాజీవ్ ఉసెఫ్ (హంటర్స్)పై గెలిచాడు. చివరగా జరిగిన పురుషుల డబుల్స్‌ను హైదరాబాద్ తమ ‘ట్రంప్’ మ్యాచ్‌గా ఎంచుకుంది. కానీ ఇందులో కూడా గో వి షెమ్–మార్క్స్ కిడో (వారియర్స్) 7–11, 11–8, 13–11తో టాన్ బూన్–టాన్ వీ (హంటర్స్)లను ఓడించారు. సోమవారంతో హైదరాబాద్ అంచె లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. మంగళవారం ముంబైలో జరిగే మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్‌తో చెన్నై స్మాషర్స్ తలపడుతుంది. -
మారిన్‌కు అత్యధిక మొత్తం
► రూ. 61.5 లక్షలకు కొనుగోలు చేసిన హైదరాబాద్ హంటర్స్ ► భారత్ తరఫున ఖరీదైన క్రీడాకారుడిగా శ్రీకాంత్ ► రూ. 51 లక్షలకు కొనుగోలు చేసిన అవధ్ వారియర్స్ ► సింధుకు రూ. 39 లక్షలు, సైనాకు రూ. 33 లక్షలు న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) రెండో సీజన్ వేలం కార్యక్రమంలో విదేశీ క్రీడాకారుల హవా నడిచింది. భారత స్టార్స్‌కంటే ఎక్కువ మొత్తం వీరి ఖాతాలోకి వెళ్లడం విశేషం. రియో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ విజేత, ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్)కు అందరికంటే అత్యధిక మొత్తం లభించింది. హైదరాబాద్ హంటర్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 61.5 లక్షలు వెచ్చించి మారిన్‌ను సొంతం చేసుకుంది. మారిన్ తర్వాత దక్షిణ కొరియాకు చెందిన సుంగ్ జీ హున్‌కు భారీ మొత్తం లభించింది. సుంగ్ జీ హున్‌ను ముంబై రాకెట్స్ రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది. పురుషుల సింగిల్స్‌లో డెన్మార్క్ ఆటగాడు జాన్ జార్గెన్‌సన్ ఖరీదైన ప్లేయర్‌గా నిలిచాడు. జార్గెన్‌సన్‌ను ఢిల్లీ ఏసర్స్ జట్టు రూ. 59 లక్షలకు సొంతం చేసుకుంది. పీబీఎల్ తొలి సీజన్లో హైదరాబాద్ హంటర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన మలేసియా స్టార్ ప్లేయర్ లీ చోంగ్ వీ ఈసారి పీబీఎల్‌లో పాల్గొనడంలేదు. చైనా స్టార్స్ చెన్ లాంగ్, లిన్ డాన్ కూడా పీబీఎల్‌కు దూరంగా ఉన్నారు. భారత్ తరఫున కిడాంబి శ్రీకాంత్‌కు అత్యధిక మొత్తం దక్కింది. అవధ్ వారియర్స్ రూ. 51 లక్షలకు శ్రీకాంత్‌ను కొనుగోలు చేసింది. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధును చెన్నై స్మాషర్స్ జట్టు... సైనా నెహ్వాల్‌ను అవధ్ వారియర్స్ తమ వద్దే ఉంచుకున్నాయి. సింధుకు రూ. 39 లక్షలు, సైనాకు రూ. 33 లక్షలు లభించనున్నాయి. భారత్‌కే చెందిన ఇతర ప్లేయర్లు హెచ్ఎస్ ప్రణయ్ (రూ. 22 లక్షలు-ముంబై రాకెట్స్), గుత్తా జ్వాల (రూ. 10 లక్షలు-ఢిల్లీ ఏసర్స్), అశ్విని పొన్నప్ప (రూ. 15 లక్షలు-బెంగళూరు బ్లాస్టర్స్), పారుపల్లి కశ్యప్ (రూ. 8 లక్షలు-చెన్నై స్మాషర్స్)లను నామమాత్రం మొత్తానికే ఆయా జట్లు కొనుగోలు చేశాయి. పీబీఎల్-2 సీజన్ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 14 వరకు భారత్‌లోని పలు ప్రధాన నగరాల్లో జరగనుంది. మొత్తం ఆటగాళ్ల వివరాలు అవధ్ వారియర్స్: కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్, రితూపర్ణ దాస్, ఆదిత్య జోషి, ప్రాజక్త సావంత్, విషెమ్ గో, సావిత్రి అమిత్రపాయ్, వోంగ్ వింగ్ కీ విన్సెంట్, బోదిన్ ఇసారా, మార్కిస్ కిడో. ముంబై రాకెట్స్: అజయ్ జయరామ్, హెచ్ఎస్ ప్రణయ్, మనూ అత్రి, గుమ్మడి వృశాలి, మొహితా, అభిషేక్ యెలెగర్, లీ యోంగ్ డే, సుంగ్ జీ హున్, నాదెజ్దా జీబా, నిపిత్‌ఫోన్. ఢిల్లీ ఏసర్స్: సన్ వాన్ హో, జాన్ జార్గెన్‌సన్, గుత్తా జ్వాల, నిచావోన్ జిందాపోల్, ఇవాన్ సొజోనోవ్, వ్లాదిమిర్ ఇవనోవ్, అక్షయ్ దేవాల్కర్, కె.మనీషా, ఆకర్షి కశ్యప్, సిరిల్ వర్మ. హైదరాబాద్ హంటర్స్: కరోలినా మారిన్, వీ కియోంగ్ తాన్, చౌ హో వా, రాజీవ్ ఉసెఫ్, సాయిప్రణీత్, సాత్విక్ సాయిరాజ్, సమీర్ వర్మ, కృష్ణప్రియ, మేఘన, తాన్ బూన్ హెయోంగ్. బెంగళూరు బ్లాస్టర్స్: విక్టర్ అక్సెల్సన్, యో యోన్ సెయోంగ్, అశ్విని పొన్నప్ప, పోర్న్‌టిప్, రుత్విక శివాని, సౌరభ్ వర్మ, ప్రణవ్ చోప్రా, కో సుంగ్ హున్, సిక్కి రెడ్డి, బున్సాక్ పొన్సానా. చెన్నై స్మాషర్స్: పీవీ సింధు, పారుపల్లి కశ్యప్, టామీ సుగియార్తో, గ్యాబీ అడ్కాక్, తనంగోసక్, క్రిస్ అడ్కాక్, మాడ్స పీలెర్ కోల్డింగ్, సుమీత్ రెడ్డి, రమ్య తులసీ, అరుంధతి పంతవానె. -
హంటర్స్‌ను ముంచిన లీ చోంగ్ వీ
న్యూఢిల్లీ: ప్రపంచ మాజీ నంబర్‌వన్... కోర్టులోకి దిగితే ఎలాంటి ప్రత్యర్థినైనా చిత్తు చేస్తాడు... అందుకే లీ చోంగ్ వీ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లో ఖరీదైన క్రీడాకారుడు. హైదరాబాద్ హంటర్స్ ఏకంగా 65 లక్షల రూపాయలు ఇచ్చి చోంగ్ వీని కొనుక్కుంది. కానీ టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయిన లీ చోంగ్ వీ... ఈసారి కీలకమైన ట్రంప్ మ్యాచ్‌లో ఓటమితో హైదరాబాద్‌ను ముంచాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఏసర్స్ జట్టు 4-1తో హైదరాబాద్ హంటర్స్‌ను ఓడించింది. మహిళల సింగిల్స్‌లో సుపనిద (హైదరాబాద్) 12-15, 15-9, 15-13తో పి.సి.తులసి (ఢిల్లీ)పై గెలిచింది. అయితే పురుషుల సింగిల్స్‌లో కశ్యప్ (హైదరాబాద్) 9-15, 10-15తో రాజీవ్ ఊసెఫ్ (ఢిల్లీ) చేతిలో ఓడిపోవడం స్కోరు 1-1తో సమమైంది. మిక్స్డ్ డబుల్స్‌లో జ్వాల-కిడో (హైదరాబాద్) 15-7, 15-8తో అక్షయ్-అడ్కాక్పై గెలవడంతో 2-1కి ఆధిక్యం పెరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ ట్రంప్ మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు లీ చోంగ్ వీ 15-9, 10-15, 14-15తో సుగియార్తో (ఢిల్లీ) చేతిలో కంగు తిన్నాడు. ఇదే టోర్నీలో శ్రీకాంత్ చేతిలో ఓడిన లీ చోంగ్ వీ ఈ మ్యాచ్‌నూ నిరాశపరిచాడు. తొలి గేమ్ సులభంగా నెగ్గిన వీ... రెండో గేమ్‌లో చేతులెత్తేశాడు. మూడోగేమ్లోనూ సుగి యార్తో చెలరేగి 14-10 ఆధిక్యం లోకి వచ్చాడు. అయితే ఈ దశలో గాయపడటంతో వీ దీనిని ఉపయోగించుకుని వరుసగా నాలుగు పాయింట్లతో హైదరాబాద్ ఆశలు పెంచాడు. అయితే సుగియార్తో చివరి వరకూ పోరాడి చివరి పాయింట్‌ను గేమ్‌ను దక్కించుకున్నాడు. ట్రంప్ మ్యాచ్‌లో ఓడటంతో హైదరాబాద్ పాయింట్ ఒకటి తగ్గింది. దీంతో ఢిల్లీ 2-1 ఆధిక్యంలోకి వచ్చింది. చివరి మ్యాచ్ పురుషుల డబుల్స్‌లో కీన్-టాన్ బూన్ (ఢిల్లీ) 15-12, 14-15, 15-13తో నందగోపాల్, రిత్విక్ సాయి (ైహైదరాబాద్)పై గెలిచారు. ఇది ఢిల్లీకి ట్రంప్ మ్యాచ్ కావడంతో రెండు పాయింట్లు వచ్చాయి. దీంతో ఢిల్లీ 4-1తో ఈ మ్యాచ్‌ను గెలుచుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ ఏసర్స్ జట్టు బెంగళూరు టాప్‌గన్స్‌తో తలపడుతుంది.