Hyderabad IIT
-
హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి మిస్సింగ్ కేసు విషాదాంతం
సాక్షి, విశాఖ: ఈనెల 17వ తేదీన ఐఐటీ క్యాంపస్ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతంగా ముగిసింది. వారం రోజుల క్రితం బయటకు వెళ్లిన కార్తీక్ అనే ఐఐటీ విద్యార్థి విశాఖలో ఆత్మహత్య చేసుకున్నాడు. కార్తిక్ స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడా కాగా, ఐఐటీ హైదరాబాద్‌లో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 17వ తేదీన కార్తీక్ అదృశ్యం కాగా, 19వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు అతడి తల్లిదండ్రులు. అప్పట్నుంచి పలు ప్రాంతాల్లో కార్తీక్ కోసం గాలించగా, ఈ క్రమంలో మంగళవారం ఉదయం అతని మృతదేహం లభించింది. కార్తీక్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ విశాఖలో ఉన్నట్లు లభించింది. దాంతో తల్లిదండ్రులను వెంటబెట్టుకుని విశాఖకు తీసుకెళ్లారు. అక్కడ కార్తీక్ శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఐఐటీహెచ్‌లో డార్క్ స్కై అబ్జర్వేటరీ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఖగోళశాస్త్రంలో ఉన్నతస్థాయి పరిశోధనలకు ఉపయోగపడే అడ్వాన్స్డ్ డార్క్ స్కై అబ్జర్వేటరీని హైదరాబాద్ ఐఐటీలో ఏర్పాటు చేశారు. నేషనల్ సైన్స్ డే మంగళవారం ఐఐటీలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఇస్రో మాజీ చైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ కె.రాధాకృష్ణన్ ఈ అబ్జర్వేటరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖగోళ శాస్త్ర పరిశోధనలకు ఈ అబ్జర్వేటరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్.మూర్తి, ఫిజిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం పహారి, విద్యార్థులు పాల్గొన్నారు. -
తొక్కకున్నా వెళ్లిపోయే సైకిల్ ట్రాఫిక్‌లో ఎగిరే వాహనం!
►మెట్రోరైలు దిగి స్టేషన్ పక్కనే ఉన్న సైకిల్ స్టాండ్ నుంచి ఓ సైకిల్ తీసుకుని ఇంటికి చేరుకోవడం, తర్వాత ఆ సైకిల్ ఎవరి ప్రమేయం లేకుండా దానంతట అదే తిరిగి మెట్రోస్టేషన్ చేరుకోవడం.. వింతగా ఉంది కదా. ►ట్రాఫిక్‌లో ఇరుక్కున్న మన వాహనం ఉన్న ఫళంగా గాలిలోకి ఎగిరి ముందున్న వాహనాలను దాటుకుంటూ గాలిలో అలాఅలా తేలిపోతూ గమ్యస్థానానికి చేరుకుంటే ఎంత బాగుంటుంది.. ►గమ్యస్థానం ఫీడ్ చేస్తే చాలు.. డ్రైవర్ ప్రమేయం లేకుండా కారు దానంతట అదే మనల్ని మనం చేరుకోవాల్సిన చోటుకు తీసుకెళుతుంది. ఊహించుకోవడానికి ఎంత బాగుంది కదా.. కానీ ఈ ఊహలన్నీ హైదరాబాద్ ఐఐటీకి చెందిన ప్రత్యేక పరిశోధన విభాగం.. టీఐహెచ్‌ఏఎన్ (టెక్నాలజీ ఇన్నొవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టిహాన్)) నిజం చేస్తోంది. కలలు సాకారం చేస్తోంది. మానవ ప్రమేయం లేకుండా నిర్దేశిత ప్రాంతానికి వెళ్లే సైకిల్‌ను రూపొందించింది. రోడ్డుపై వెళుతూ అవసరమైతే గాల్లోకి ఎగిరిపోయే ప్యాసింజర్ కార్గో డ్రోన్ (కారు లాంటి వాహన)పై కూడా పరిశోధనలు చేస్తోంది. రోడ్డు సౌకర్యం ఉండని కొండ ప్రాంతాలకు సరుకులు, అత్యవసరమైన మందులు చేరవేయడం వంటి అవసరాలకు వినియోగించే అటానమస్ డ్రోన్లపై పరిశోధన కొనసాగిస్తోంది. దీనికి రిమోట్ గానీ, ఆపరేటర్ గానీ అవసరం లేదు. గమ్యస్థానాన్ని ఫీడ్ చేస్తే అదే తీసుకెళుతుంది. అలాగే డ్రైవర్ అవసరం లేని అటానమస్ వాహనంపై కూడా ప్రయోగాలు చేస్తోంది. ఇలాంటి వాటికెన్నిటికో కేంద్రంగా మారిన హైదరాబాద్ ఐఐటీలో మానవ రహిత వాహనాలపై పరిశోధనల్లో భాగంగా టిహాన్ ఏర్పాటు చేసిన అటానమస్ నావిగేషన్ టెస్ట్ బెడ్‌ను (డ్రైవర్ రహిత వాహనాలు ప్రయోగాత్మకంగా నడిపే రోడ్డు) కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన డ్రైవర్ రహిత వాహనాల్లో ప్రయాణించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నూతన ఆవిష్కరణలకు వేదిక భవిష్యత్ సాంకేతిక ఆవిష్కరణలకు భారత్‌ను ఒక గమ్యస్థానంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జితేంద్రసింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ‘నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్‌డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్’పథకం కింద 25 టెక్నాలజీ ఇన్నొవేషన్ హబ్‌లను (సాంకేతిక ఆవిష్కరణ కేంద్రాలు) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రపంచంలో నాలుగో తరం నూతన ఆవిష్కరణలకు భారత్ వేదిౖకైందన్నారు. వ్యవసాయం, అత్యవసర రంగాల్లో ఇప్పటికే డ్రోన్లు వాడుతున్నారని, డ్రైవర్ లేకుండా అటానమస్ నావిగేషన్ ద్వారా వాటంతట అవే తమ గమ్యస్థానాలకు చేరుకునేలా పరిశోధనలు జరిపిన హైదరాబాద్ ఐఐటీని ఆయన ప్రశంసించారు. దేశవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన ఐఐటీల్లో హైదరాబాద్ ఐఐటీ పరిశోధనల్లో ముందు వరుసలో ఉందని చెప్పారు. దేశంలోనే తొలి అటానమస్ వెహికల్ టెస్ట్‌బెడ్ హైదరాబాద్ ఐఐటీలో ఏర్పాటు చేసిన అటానమస్ నావిగేషన్ టెస్ట్ బెడ్ (ఏరియల్ అండ్ టెరస్ట్రియల్) దేశంలోనే మొదటిదని ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి అన్నారు. సుమారు రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ టెస్ట్‌బెడ్‌పై మానవ రహిత వాహనాల పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. భారత దేశంలో ఉన్న పరిస్థితులు అంటే.. గ్రామీణ ప్రాంత రోడ్లు, మల్టీ లేన్లు, వర్షం పడుతున్నప్పుడు.. ఇలా రకరకాల పరిస్థితుల్లో ఈ డ్రైవర్ రహిత వాహనాల పనితీరుపై పరీక్షలు చేస్తున్నామన్నారు. మానవ రహిత ప్యాసింజర్ డ్రోన్లు సుమారు 1.50 క్వింటాళ్ల బరువున్న సరుకులను మోసుకెళ్లగలవని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి శ్రీవారి చంద్రశేఖర్, ఐఐటీ పాలకమండలి చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, టీఐహెచ్‌ఏఎన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి -
చాపర్ చిన్న సైజులో..
పక్క ఫొటో చిన్నపాటి చాపర్‌ను తలపిస్తోంది కదా! వీటిని ‘పర్సనల్ ఏరియల్ వెహికల్’... క్లుప్తంగా పీఏవీలంటారు. హైదరాబాద్ ఐఐటీ పరిశోధక విద్యార్థి ప్రియబ్రత రౌటరే ఇలాంటి పీఏవీల స్కేల్ మోడళ్లు (చిన్నసైజు పీఏవీలు)బోలెడన్ని తయారు చేశారు. శుక్రవారం ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. స్కేల్ మోడళ్లే కదా అని తీసి పడేయెద్దు. ప్రాక్టీసింగ్ పీహెచ్‌డీలో భాగంగా డ్రోన్లను తలపించే ఈ పీఏవీలలో ఏమి ఉండాలి? ఎలా ఉండాలి? అన్న వివరాలను విస్తృత స్థాయిలో పరిశోధించి మరీ వీటిని తయారు చేశారు. – సాక్షి హైదరాబాద్ -
శాస్త్ర సాంకేతిక పరిశోధకులకు ఫెలోషిప్ పెంపు
సాక్షి, అమరావతి: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ (పీఎంఆర్ఎఫ్) కింద కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధకులకు ఇస్తున్న ఫెలోషిప్ మొత్తాన్ని భారీగా పెంచడంతోపాటు దీనికి జాతీయ సమన్వయకర్త బాధ్యతలను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించింది. ఫెలోషిప్‌పై విద్యార్థులకు అవగాహన కలిగించాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆయా యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలకు సూచించింది. ఈ కొత్త మార్గదర్శకాలు 2019 ఫెలోషిప్ ఎంపికలకు వర్తిస్తాయని వివరించింది. పరిశోధనాసక్తిని తెలియచేసేలా ప్రాజెక్ట్ అభ్యర్థి.. పరిశోధన చేయదలుచుకున్న అంశానికి సంబంధించి ప్రాజెక్టును రూపొందించుకొని సమర్పించాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ శాస్త్ర, సాంకేతిక అంశాలకు చెందినదై, జాతీయ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని రూపొందించి ఉండాలి. ప్రాజెక్ట్ అభ్యర్థికి పరిశోధనపై గల ఆసక్తి, పరిశీలన సామర్థ్యాలకు దర్పణం పట్టేలా ఉండాలి. అంతేకాకుండా సెలెక్షన్ కమిటీ ఫీడ్‌బ్యాక్ తీసుకునేందుకు ఈ ప్రాజెక్టుతోపాటు ఇద్దరు నిపుణుల పేర్లను రిఫర్ చేయాల్సి ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపై ఆయా అభ్యర్థులు ఎంచుకొనే సబ్జెక్టులకు ఒక్కోదానికి ఒక్కో విద్యా సంస్థను నోడల్ ఇన్స్టిట్యూట్గా కేంద్ర మానవ వనవరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎంపిక చేస్తుంది. ఆ సంస్థలు ఆయా పరిశోధనాంశాలను పర్యవేక్షిస్తాయి. ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు ఈ పీఎంఆర్ఎఫ్ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు ఈ వెబ్సైట్ ద్వారా సమర్పించిన దరఖాస్తులు సంబంధిత నోడల్ ఇన్స్టిట్యూట్లకు చేరతాయి. ఆయా నోడల్ ఇన్స్టిట్యూట్లు నియమించే నిపుణుల కమిటీలు ఇంటర్వ్యూలు చేసి అర్హులైన అభ్యర్థుల జాబితాలను రూపొందిస్తాయి. ఇంటర్వ్యూలను అవసరమైతే వీడియో కాన్ఫరెన్సుల ద్వారా కూడా నిర్వహించనున్నారు. జాబితాల్లోని వారిని మరింత వడపోసేందుకు జాతీయ సమన్వయ కమిటీ (ఎన్సీసీ) రాతపరీక్షలు, చర్చాగోష్టులు తదితర మార్గాల ద్వారా ఫెలోషిప్‌కు అర్హులను ఎంపిక చేస్తుంది. అనంతరం వారికి విద్యా సంస్థలను కేటాయించనున్నారు. ఎంపిక మార్గదర్శకాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్లు) రూపొందించనున్నాయి. అనుకున్న మేర పరిశోధన సాగితేనే మరుసటి ఏడాదికి రెన్యువల్ ఆశించిన మేర అభ్యర్థి పరిశోధన సాగిస్తేనే మరుసటి ఏడాదికి ఫెలోషిప్ రెన్యువల్ అవుతుంది. పరిశోధకుడు వారంలో ఒకరోజు తమకు సమీపంలోని ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధన చేయాలి. జాతీయ సమన్వయ కమిటీ (ఎన్సీసీ) పీఎంఆర్ఎఫ్ను అమలుచేసే వ్యవస్థగా ఉంటుంది. పరిశోధనలకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులుచేర్పులు చేసే అధికారం ఎన్సీసీకి ఉంటుంది. ఎంతమందిని పరిశోధనలకు అనుమతించాలన్న నిర్ణయమూ ఎన్సీసీ పరిధిలోనే ఉంటుంది. ఫెలోషిప్ ఇలా.. పీఎంఆర్ఎఫ్ కింద మొదటి రెండేళ్లు 70 వేల చొప్పున, మూడో ఏడాది రూ.75 వేలు, చివరి రెండేళ్లు రూ 80 వేల చొప్పున ఇవ్వనున్నారు. దీంతోపాటు రీసెర్చ్ గ్రాంట్ కింద ఏటా రూ.2 లక్షల చొప్పున ఐదేళ్లకు రూ.10 లక్షలు అందిస్తారు. ఈ పరిశోధనల కాలపరిమితి ఇంటిగ్రేటెడ్ కోర్సుల విద్యార్థులకు నాలుగేళ్లు, బీటెక్ విద్యార్థులకు ఐదేళ్లు ఉంటుంది. ఎంటెక్, ఎంఎస్, ఎంఈ కోర్సులు పూర్తిచేసినవారికి కూడా నాలుగేళ్ల కాలపరిమితి వర్తిస్తుంది. -
ఆర్మీ అధికారిగా కూలీ కొడుకు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ). శనివారం సాయంత్రం కొత్త బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్ పూర్తయింది. కార్యక్రమం పూర్తయ్యాక కొత్త ఆర్మీ ఆఫీసర్లంతా సంబరాల్లో మునిగిపోయారు. అందులో ఓ యువకుడు మాత్రం ప్రేక్షకుల్లో ఉన్న మామూలు దుస్తులు ధరించిన దంపతుల దగ్గరికెళ్లి నిలుచున్నాడు. మిలటరీ డ్రెస్సులో వచ్చిన యువకుడిని చూసి వారికి ఆనందం ఆగలేదు. అటు ఆ యువకుడి పరిస్థితీ అలాగే ఉంది. ఆ ముగ్గురూ ఆనందంగా హత్తుకుని ఉద్వేగానికి లోనయ్యారు. మొత్తం సంబరాల్లో వీరి వైపే అందరి దృష్టి మరలింది. ఆ యువకుడు తెలంగాణకు చెందిన బర్నాన యాదగిరి కాగా.. వారిద్దరూ అతని తల్లిదండ్రులు. రూ.100 కూలీయే ఆధారం బర్నాన గున్నయ్య హైదరాబాద్‌లోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో దినసరి కూలీ. రోజుకు సంపాదించే వంద రూపాయలే ఆ కుటుంబానికి ఆధారం. తల్లికి పోలియో. దీంతో ఈమె ఇంటికే పరిమితమయ్యారు. చిన్నప్పటినుంచీ చదువుల్లో ముందుండే యాదగిరి.. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేశాడు. ఇదే సమయంలో ఓ అమెరికా కంపెనీ నుంచి భారీ ప్యాకేజీతో ఉద్యోగం వచ్చినా వద్దనుకున్నాడు. క్యాట్ పరీక్షలో 93.4శాతం స్కోరు సాధించటంతో ఐఐఎం ఇండోర్ నుంచి ఉన్నత విద్య అవకాశం తలుపులు తట్టింది. దీన్నీ తిరస్కరించాడు. పేదరికం వెక్కిరిస్తున్నా మాతృభూమికి సేవచేయాలనే లక్ష్యంతో ఐఎంఏ పరీక్ష రాసి ఎంపికయ్యాడు. అంతేకాదు, ఐఎంఏ శిక్షణలోనూ ‘టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు’లో ప్రతిష్టాత్మక సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. తమ కొడుకు ఆర్మీ ఆఫీసరన్న విషయం డెహ్రాడూన్‌కు వెళ్లేంతవరకూ ఆ తల్లిదండ్రులకు తెలియదు. ‘మా నాన్న రోజుకు రూ.60కే కూలీకి వెళ్లిన రోజులు నాకు గుర్తున్నాయి. ఆర్థిక సమస్యలు డబ్బుకోసం ఆశపడలేదు. మాతృభూమికి సేవచేయటాన్ని మించిన ఆనందం ఇంకెక్కడ ఉంటుంది’ అని యాదగిరి ఉద్వేగంగా పేర్కొన్నాడు. -
ఉద్యోగాలే.. ఉద్యోగాలు..
ఎయిమ్స్-రిషికేష్‌లో రెసిడెంట్లు రిషికేష్ (ఉత్తరాఖండ్)లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయి మ్స్).. తాత్కాలిక పద్ధతిన వివిధ విభాగాల్లో జూనియర్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 118. ఇంటర్వ్యూ తేదీలు డిసెంబర్ 17, 18. వివరాలకు www.aiimsrishikesh.edu.inచూడొచ్చు. ‘కేశవ్’లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని కేశవ్ మహావిద్యాలయ.. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 44. ఆన్లైన్ దరఖాస్తుకు గడువు జనవరి 5. వివరాలకు keshav.du.ac.inచూడొచ్చు. హెచ్ఎంటీలో వివిధ పోస్టులు హెచ్ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ -టెక్నికల్ (ఏ/బి), సీనియర్ అసోసియేట్ (ఏ/బి), జూనియర్ అసోసియేట్ (ఏ/బి) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 24. ఇంటర్వ్యూ తేదీ డిసెంబర్ 21. వివరాలకు www.hmtmachinetools.comచూడొచ్చు. డబ్ల్యూబీఎస్ఈడీసీఎల్లో 298 పోస్టులు వెస్ట్ బెంగాల్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (డబ్ల్యూబీఎస్ ఈడీసీఎల్).. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్, జూ. ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ ఎగ్జి క్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 298. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 31. వివరాలకు www. wbsedcl.inచూడొచ్చు. ఢిల్లీ ఈఎస్ఐలో స్టెనో, యూడీసీ, ఎంటీఎస్ ఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స కార్పొరేషన్ (ఈఎస్ఐసీ).. స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 213. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 6. వివరాలకు www.esic.nic.inచూడొచ్చు. ఏఐఏలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్స అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఐఏ).. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 200. వివరాలకు www.aai.aeroచూడొచ్చు. ఈఎస్ఐసీలో 181 పోస్టులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స కార్పొరేషన్ (ఈఎస్ఐసీ).. వివిధ విభాగాల్లో స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 181. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 6. వివరాలకు www.esic.nic.inచూడొచ్చు. హైదరాబాద్ ఐఐటీలో వివిధ పోస్టులు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఎలక్ట్రికల్ సూపర్వైజర్, ఎలక్ట్రీషియన్ (హైలీ స్కిల్డ్), ఎలక్ట్రీషియన్ (హెల్పర్), ఫిట్టర్ జనరల్ మెకానిక్, మల్టీ టాస్కింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 9. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 15. వివరాలకు www.iith.ac.inచూడొచ్చు. ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్లో ప్రాజెక్ట్ ఆఫీసర్లు హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయ తీరాజ్ (ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్).. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 8. ఇంట ర్వ్యూ తేదీలు డిసెంబర్ 18, 22, 23. వివరాలకు www.nird. org.inచూడొచ్చు. నైవేలీ లిగ్నైట్‌లో గ్రాడ్యుయేట్ ట్రైనీస్ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 100. దరఖాస్తుకు చివరి తేది జనవరి 22. వివరాలకు www.nlcindia.comచూడొచ్చు. పశ్చిమ బంగాలో మెడికల్ పోస్టులు పశ్చిమ బంగా ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 75. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 15. వివరాలకు http://onlineapplication. healthyhowrah.org/చూడొచ్చు. కర్ణాటక యాంటీబయాటిక్స్‌లో పోస్టులు కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్, ఏరియా మేనేజర్, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 17. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 19. వివరాలకు www.kaplindia.comచూడొచ్చు. ఎంఎంటీసీలో మేనేజర్ పోస్టులు న్యూఢిల్లీలోని ఎంఎంటీసీ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 9. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 28. వివరాలకు www.mmtclimited. gov.inచూడొచ్చు. సీబీఎఫ్లో వివిధ పోస్టులు కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ.. కెన్‌బ్యాంక్ ఫ్యాక్టర్స లిమిటెడ్ (సీబీఎఫ్).. వివిధ విభాగాల్లో జూనియర్ ఆఫీసర్స, ఆఫీసర్స, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 17. దరఖాస్తుకు చివరి తేది జనవరి 25. వివరాలకు www.canbankfactors.comచూడొచ్చు. మిధానిలో మెల్టర్స, లాడిల్మెన్ పోస్టులు హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని).. మెల్టర్స, లాడిల్మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 9. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 23. వివ రాలకు www.midhani.gov.inచూడొచ్చు. చెన్నై ఈఎస్ఐసీలో 92 పోస్టులు తమిళనాడు రీజియన్‌లో ఈఎస్ఐసీ మెడికల్ ఇన్‌స్టిట్యూషన్‌స/హాస్పిటల్స్.. వివిధ విభాగాల్లో పారామెడికల్, నర్సింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 92. దరఖాస్తుకు చివరి తేది జనవరి 6. వివరాలకు www.esic.nic.inచూడొచ్చు. కొంకణ్ రైల్వేలో వివిధ పోస్టులు నవీ ముంబైలోని కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్, సీనియర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 16. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 21. వివరాలకు www.konkanrailway.comచూడొచ్చు. సెంట్రల్ డిజైన్ బ్యూరోలో క్యాడ్ ఆపరేటర్లు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్టమెంట్ పరిధిలోని సెంట్రల్ డిజైన్ బ్యూరో కాంట్రాక్టు ప్రాతిపదికన క్యాడ్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం ఖాళీలు 8. ఇంటర్వ్యూ తేదీ డిసెంబర్ 18. వివరాలకు www.mohfw.nic.inచూడొచ్చు.