icchapuram
-
ఇచ్చాపురంలో మరోసారి బయటపడ్డ జనసేన, టీడీపీ విభేదాలు
-
ఆక్రమణ కట్టడాలను కూల్చివేతను అడ్డుకున్న టీడీపీ వర్గీయులు..
సాక్షి,ఇచ్ఛాపురం : ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను రక్షించుకోవాలన్న ప్రభుత్వ ఆశయానికి టీడీపీ వర్గీయులు తూట్లు పొడుస్తున్నారు. స్థానిక మహిళలను రెచ్చగొడుతూ అధికారులు, పాలకవర్గాలపైకి ఉసుగొల్పుతున్నారు. ఇటువంటి సంఘటన శనివారం కొఠారీ పంచాయతీలో చోటుచేసుకుంది. కొఠారీ కాలనీ వద్ద సర్వే నంబర్ 133, 135–12లో ప్రభుత్వ స్థలంలో ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ‘మిషన్ ప్రభుత్వ భూమి సంరక్షణ’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎంఆర్ఐ మద్దిలి కృష్ణమూర్తి, మండల సర్వేయర్ తవిటినాయుడుతో పాటు సర్పంచ్ దుక్క ధనలక్ష్మి, వీఆర్వో, సచివాలయ సర్వేయర్, స్థానికులు కొంతమంది కలసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఆక్రమణ కట్టడాల వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే టీడీపీ నేతలు రెచ్చగొట్టడంతో స్థానిక మహిళలు కొందరు సంఘటనా స్థలం వద్దకు చేరుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చింపేశారు. చదవండి:Bhola Shankar: చిరుకు సోదరిగా కీర్తి సురేశ్.. రాఖీ వీడియో వైరల్ అక్కడితో ఆగకుండా అధికారులు, సర్పంచ్ ధనలక్ష్మి, ఆమె భర్త ఆనంద్, కుమారుడుపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సర్పంచ్ ధనలక్ష్మి స్వల్ప గాయాలతో బయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో రెవెన్యూ సిబ్బంది అక్కడ నుంచి వెళ్లిపోయారు. దాడికి పాల్పడిన దువ్వు పోతయ్య, దుక్క దీనబందు, సావిత్రి, జయ, దువ్వు జానికమ్మలపై సర్పంచ్ ధనలక్ష్మి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఆయన సంఘటనా స్థలానికి చేరుకొని కాలనీ వాసులతో మాట్లాడారు. తహసీల్దార్ దాసరి చిన్న రామారావుకు ఫోన్‌చేసి ఇటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు కలుగజేసుకోకూడదంటూ హెచ్చరింపు ధోరణిలో మాట్లాడినట్లు తెలిసింది. చదవండి:లోకేష్ తీరుపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం -
క్షణమొక యుగం.. ఎటుచూసినా నీరే.. బోటు వెళ్లిపోతోంది!
గంగమ్మ తల్లి తన బిడ్డల్ని కాచుకుంది. దారీ తెన్నూ తెలీక నడి సంద్రంలో చిక్కుకున్న వారికి అపాయం రాకుండా కాపు గాసింది. కనుచూపు మేర నీళ్లు, కళ్లల్లో కన్నీళ్లతో బతుకుపై బెంగ పెట్టుకున్న గంగ పుత్రులను క్షేమంగా తీరానికి చేర్చింది. అధికారులు, నాయకులు, కోస్టుగార్డులు సమష్టిగా పనిచేసి వారి ప్రాణాలు కాపాడారు. బెస్త పల్లెల కన్నీరు తుడిచారు. వేటకెళ్లిన వారంతా శుక్రవారం కాశిమీడు తీరానికి చేరుకున్నారు. తమ కోసం పని చేసిన వారికి, ప్రార్థించిన వారికి మనసారా కృతజ్ఞతలు తెలిపారు. సాక్షి,సోంపేట/కవిటి: తేదీ: జూలై 7.. సమయం: రాత్రి 7 గంటలు ప్రదేశం: చెన్నైలోని కాశిమీడు ఫిషింగ్ హార్బర్ చేపల వేటకు సముద్రంలోకి సాగిపోయే పడవల సందడితో కళకళలాడుతోంది. IND-TN-02-MM-106 నంబర్ బోట్ కూడా సోంపేట, కవిటి మండలాలకు చెందిన ఏడుగురు మత్స్యకారులతో పాటు మరో ఐదుగురితో కలిసి గంగమ్మకు పూజలు చేసి తీరానికి బైబై చెప్పింది. కోడ సోమేశ్వరరావు రథసారథి. హుషారుగా బోట్‌ను నడిపిస్తున్నాడు. మొత్తం 25 రోజుల ప్రయాణం. ఆహారం, తాగునీరు ఇతర పూర్తి సదుపాయాలతో ఉన్న ఓడ వేట సాగిస్తూ ముందుకు సాగుతోంది. 9 రోజుల పాటు హుషారుగా సాగిన బతుకు పయనంలో జూలై 16 శుక్రవారం అనుకోని ఘటన. ఉన్నట్టుండి నడి సంద్రంలో పడవ ఆగిపోయింది. సముద్రపోటుకు పడవ అదుపు తప్పుతోంది. వలలన్నీ సముద్రంలోనే ఉన్నాయి. బోటులో ఉన్న వారంతా అలర్టయ్యారు. ఇంజిన్‌ను చెక్ చేశారు. పంఖా ఎక్కడో జారిపడిపోయింది. యజమానికి సమాచారం తెలియజేస్తూనే.. ప్రత్యామ్నాయాలకు ప్రయత్నించారు. సాధ్యం కాలేదు. సాయం కోసం చుట్టూ చూశారు. కనుచూపుమేర ఏమీ కనబడలేదు. సమాచార మార్పిడి కోసం బోట్లో వినియోగించే జీపీఎస్ మూగబోయింది. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ‘దేవుడా ఏమిటీ పరిస్థితి..’ అంటూ నిట్టూర్చడమే తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆ పన్నెండు మంది వలసజీవులది. పగలంతా ధైర్యంగానే గడిపారు. సాయంత్రమవుతున్న కొద్దీ ఆందోళన పెరిగింది. చుట్టూ నీరు తప్ప ఓడ గానీ.. మనిషి జాడగానీ కానరాలేదు. ‘నీదే భారం తల్లీ..’ అంటూ గంగమ్మ మీద భారం వేశారు. నిమిషాలు యుగాల్లా గడుస్తున్నాయి. ఎదురుగానే తిండి.. కానీ సహించదు. ఏమైపోతామనే ఆందోళన ముందు దాహం వేయడం మానేసింది. బోటు మాత్రం అదుపు తప్పింది. వాలుగా అండమాన్ వైపుగా వెళ్లిపోతోంది.. హెలికాప్టర్‌తో గాలింపు సమాచారం అందుకున్న బోటు యాజమాని స్థానిక మత్స్యకార నాయకులతో కలిసి విషయాన్ని చెన్నైలోని స్థానిక అధికారులకు వివరించారు. ప్రయత్నాల ఫలితంగా కోస్ట్‌గార్డ్‌ను అలెర్ట్ చేశారు. జూలై 17న రంగంలోకి దిగిన కోస్ట్‌గార్డ్ గాలించినా ఫలితం దక్కలేదు. విషయాన్ని పైఅధికారులకు తెలియజేయడంతో హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. బోటు ఆచూకీని అండమాన్ సమీపంలో ఎట్టకేలకు కనిపెట్టారు. సమాచారాన్ని కోస్ట్‌గార్డుకు అందజేశారు. రంగంలోకి దిగిన కోస్ట్‌గార్డు నౌక.. బోట్‌ను చేరుకుని మత్స్యకారులకు ధైర్యం చెప్పింది. బోట్‌ను తీరానికి చేర్చేందుకు పరిసరాల్లోని ఓడల కోసం యత్నించింది. ‘ఎస్కే’ అనే బోటుకు సమాచారం అందించడంతో సాయమందించేందుకు ముందుకొచ్చింది. మొరాయించిన బోటును తాళ్లసాయంతో తీరంవైపునకు తీసుకెళ్లే ప్రయత్నం మొదలుపెట్టింది. కోస్ట్‌గార్డు నౌక ఈ రెండింటిని అనుసరించింది. 36 గంటల తరువాత ‘విన్నర్’ అనే మరో బోటు రంగంలోకి దిగింది. 36 గంటల ప్రయాణం తరువాత 12 మంది మత్స్యకారులతో కూడిన బోటును శుక్రవారం రాత్రి కాశిమీడు తీరానికి క్షేమంగా చేర్చింది. తమ వారంతా ఒడ్డుకు చేరారని తెలుసుకుని సిక్కోలు మత్స్యకార పల్లెలు ఊపిరి పీల్చుకున్నాయి. మత్స్యకారులు గల్లంతయ్యారని సమాచారం అందినప్పటి నుంచి మంత్రి సీదిరి అప్పలరాజు, ఇచ్ఛాపురం వైఎస్సార్సీపీ నేత పిరియా సాయిరాజ్ తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి చెన్నై అధికారులతో సంప్రదింపులు జరిపేలా చేశారు. మత్స్యకారులను రక్షించడానికి ప్రభుత్వం చేసిన కృషి ప్రశంసనీయమని మత్స్యశాఖ డైరెక్టర్ మడ్డు రాజారావు అభినందించారు. ధైర్యం కోల్పోలేదు.. జూలై 16 మరిచిపోలేని రోజు. రాత్రంతా జాగారమే. బోటు వాలు వైపుగా వెళ్లిపోతోంది. ఎటు పోతున్నామో మాకే తెలియని పరిస్థితి. అయినప్పటికీ ధైర్యం కోల్పోలేదు. హెలికాప్టర్‌ను చూసిన తరువాత ప్రాణం లేచొచ్చింది. కొద్ది గంటల తరువాత కోస్ట్‌గార్డ్ మమ్మల్ని సేవ్ చేసే పనిలో పడింది. కోడ సోమేశ్వరరావు, బోటు డ్రైవర్ భయం వేసింది.. వేట సాగుతోంది. ముందుకు వెళుతున్నాం. ఉన్నట్టుండి పంఖా జారిపడిపోయింది. ఆందోళన చెందాం. దేవుడి మీదే భారం వేశాం. కోస్టుగార్డ్, ఇతర బోట్ల సిబ్బంది సాయంతో ఒడ్డుకు చేరాను. ఒకనొక దశలో చాలా భయం వేసింది. కోడ జగన్నాథం, మత్స్యకారుడు -
అమ్మ కడుపు నుంచి ముళ్ల పొదల మధ్యకు..
సాక్షి,ఇచ్ఛాపురం: నిశ్శబ్దంగా శ్మశానం. గాలి తప్ప ఇంకో అలికిడి లేని వాతావరణం. ఇంకా వెలుతు రు పరుచుకోని సమయం. ఎవరు వదిలి వెళ్లారో.. ఎందుకు వదిలి వెళ్లిపోయారో.. అమ్మ కడుపు గడప దాటి అప్పుడే బయటకు వచ్చిన ఓ మగ శిశువు ఏడుపు శ్మశానాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ముళ్ల పొదల మధ్య ఒళ్లంతా చీమలు కుడుతూ ఉంటే ఏడవడం తప్ప ఇంకేం చేయలేని ఆ పసి వాడి రోదన ఇచ్ఛాపురం పరిధిలోని కండ్రవీధి శ్మశానంలో అలజడి రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... బుధవారం వేకువ జామున కండ్రవీధికి చెందిన చంద్రమణి బెహరా బహిర్భూమి కోసం శ్మశానం సమీపానికి వెళ్లారు. అక్కడ ముళ్ల పొద ల మధ్య నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో అక్కడకు వెళ్లి చూడగా.. బ్యాగ్‌లో అప్పుడే పుట్టి న మగ శిశువు కనిపించాడు. బాబును పరిశీలిస్తే శరీరమంతా చీమలు కనిపించాయి. వెంటనే ఆయన బాబును ముళ్ల పొదల నుంచి బయటకు తీసి శరీరాన్ని శుభ్రం చేశారు. చుట్టుపక్కల ఎవ రూ కనిపించకపోవడంతో ఎవరో కావాలనే వది లి వెళ్లిపోయారని నిర్ధారించుకుని ఆ పసివాడిని ఇంటికి తీసుకెళ్లారు. చంద్రమణి బెహరా దంపతులకు వివాహమై 30 ఏళ్లయినా సంతానం లేదు. దీంతో ఈ మగ శిశువును పెంచుకోవచ్చని ఆశ పడ్డారు. బాబుకు స్నానం చేయించి వైద్య పరీక్షల కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. దీనిపై సమాచారం అందుకున్న చైల్డ్‌లైన్ సిబ్బంది చంద్రమణి బెహరా దంపతుల నుంచి శిశువును స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం శ్రీకాకుళంలోని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. అయితే బాబును చంద్రమణి బెహరా దంపతులకే ఇచ్చేయాలని స్థానికులంతా అధికారులను కోరినా వారు ఒప్పుకోలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం శ్రీకాకుళంలోని శిశు సంరక్షణ కేంద్రం నుంచి తెచ్చుకోవాలని గెస్ట్ చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ జాస్మిన్ వారికి సూచించారు. -
ఆధ్యాత్మిక స్థలంపై టీడీపీ నేత కన్ను
ఇచ్ఛాపురం రూరల్: ఆధ్యాత్మిక స్థలంపై టీడీపీ నేత కన్నుపడింది. దానిని చదును చేసి.. ప్లాట్లుగా విభజించి విక్రయించాలన్న దురాలోచనతో పొక్లెయిన్‌తో రంగంగలోకి దిగాడు. అడ్డొచ్చిన వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. దీంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తులసిగాం పంచాయతీ పరిధిలోని ఇన్నేశుపేట పొలిమేరలో 20 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. అందులో పాతికేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన శీర పురుషోత్తం చెట్లు నాటి గ్రామస్తుల సహకారంతో ఆధ్యాత్మిక స్థలంగా అభివృద్ధి చేశాడు. ఆయనను స్థానికులు పూజారిగా పిలుచుకుంటారు. దీనికి పక్కనే ప్రభుత్వం విశ్రాంతి భవనం నిర్మించింది. ఇదే ప్రాంతంలో ప్రస్తుతం రక్షిత మంచినీటి ట్యాంక్ నిర్మాణంలో ఉంది. ఆ స్థలం పక్కనే బలరాంపురం గ్రామానికి చెందిన లండ సూర్యనారాయణ (బగ్గేడు)కు స్థలం ఉంది. దీన్ని టీడీపీ నేత దుక్క వెంకటేష్ ఇటీవల ప్లాట్లుగా విభజించి విక్రయించే నిమిత్తం కొనుగోలు చేశాడు. రోడ్డు పక్కనే విలువైన ఆధ్యాత్మిక స్థలం ఉండటంతో దాన్ని ఆక్రమించేందుకు ఇటీవల పొక్లెయిన్‌తో చెట్లు పడగొట్టాడు. అడ్డుకోవడానికి వెళ్లిన పురుషోత్తంపై దౌర్జన్యం చేసి కొట్టాడు. దీంతో గ్రామపెద్దలు, మహిళలు టీడీపీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేసి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సిన రెవెన్యూ సిబ్బంది కూడా దుక్క వెంకటేష్‌కు వత్తాసు పలుకుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేశా గ్రామస్తుల సహకారంతో స్థలాన్ని అభివృద్ధి చేశాను. కార్తీక మాసంలో మహిళలు ఇక్కడ వన భోజనాలు చేస్తుంటారు. రోడ్డు పక్కన ఉండటంతో ఈ స్థలాన్ని వెంకటేష్ ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు. చెట్లను ధ్వంసం చేశారు. అడ్డుకుంటే నాపై దాడి చేశారు. – శీర పురుషోత్తం, ఇన్నేశుపేట -
మృత్యువులోనూ వీడని.. చిన్నారి స్నేహం
సాక్షి, ఇచ్ఛాపురం: విధి వైపరీత్యమో? తల్లిదండ్రుల శాపమో? గానీ తోటివారితో కలిసి హోలీ పండగ సందర్భంగా రంగులు చల్లుకున్న చిన్నారులు నదిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. ప్రాణస్నేహితులైన ఆ చిన్నారులిద్దరూ కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఇచ్ఛాపురం పట్టణం శోకసంద్రంలో మునిగిపోయింది. ఎప్పటిలాగానే ఉదయం ఇంటిలో తల్లిదండ్రులతో సరదాగా గడిపి తోటి స్నేహితులతో కలిసి హోలీ పండగను చేసుకుని ఇంటికి వస్తానని చెప్పి ఇంటినుంచి బయటికి వెళ్లిన చిన్నారులు నగరంపల్లి జతిన్(14), కాళ్ల శ్రీనివాస్ స్నేహిత్(14)ల సంతోషం ఎంతో సేపు నిలవలేదు. వారిద్దరూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారనే వార్త వారిని కన్నవారిని శోకసంద్రంలో ముంచింది. పట్టణంలోని దానంపేటలో ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఎన్.మోహన్‌రావు, ఈశ్వరిల రెండవ సంతానమైన జతిన్, వాసుదేవ్ క్వార్టర్స్‌కు చెందిన శుభకార్యాలకు సామగ్రి అద్దెకిస్తున్న కాళ్ల.శ్రీహరి, అనూరాధల రెండవ సంతానం శ్రీనివాస్‌స్నేహిత్‌లు స్థానిక ప్రైవేట్ ఇంగ్లీషు మీడియం పాఠశాల జ్ఞానభారతిలో 9 వ తరగతి చదువుతున్నారు. వారిద్దరూ గురువారం తోటి వారితో కలిసి రంగులు పూసుకుని సరదాగా హోలీ పండగను జరుపుకున్నారు. అనంతరం స్నానాలు చేయడానికని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బాహుదానది దగ్గర రాళ్లగుమ్ము ప్రాంతానికి వెళ్లారు. స్నానం చేయడానికి నలుగురు చిన్నారులు నదిలోకి దిగారు. అయితే ఆ చిన్నారుల్లో ఎవరికీ నదిలో ఈతకొట్టడం తెలియదు. వారు స్నానాలు చేయడానికి నదిలో దిగిన ప్రదేశం చాలా లోతుగా ఉండడంతో జతిన్, స్నేహిత్‌లు నీటిలో మునిగిపోయారు. సంఘటనా స్థలంలోనే మృతి వారిద్దరూ నీటిలో మునిగి పోవడంతో మిగిలిన స్నేహితులు కేకలు పెట్టగా అక్కడికి కొంత దూరంలో స్నానాలు చేస్తున్న వారు వచ్చి నదిలో గాలించగా మొదట స్నేహిత్ దొరికాడు. వెంటనే ఆ చిన్నారిని ద్విచక్రవాహనంపై స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే స్నేహిత్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నీటిలో సుమారు 30నిమిషాలు గాలించిన తరువాత జతిన్ ఆచూకీ లభించింది. అయితే అప్పటికే జతిన్ అనంతదూరాలకు చేరిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి మృతి విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు, స్థానికులతో ఆసుపత్రి ఆవరణ నిండిపోయింది. ఈ సంఘటనతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఈ నెల 20 నుంచి పవన్ బస్సుయాత్ర
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం జిల్లా నుంచి పోరాటం ప్రారంభిస్తున్నానని, ఇందులోభాగంగా ఈ నెల 20వ తేదీన ఇచ్ఛాపురం నుంచి బస్సుయాత్ర చేపడుతున్నానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. గంగపూజ నిర్వహించి యాత్ర మొదలుపెడతామని, జై ఆంధ్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులర్పిస్తామని చెప్పారు. మొత్తం 17రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తన పర్యటన ఉంటుందని చెప్పారు. బస్సుయాత్రలో భాగంగా ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ప్రతి నియోజకవర్గంలో యువత, విద్యార్థులతో కవాతు నిర్వహిస్తామని, ప్రతి జిల్లా కేంద్రంలో లక్షమందితో ఈ కవాతు ఉంటుందని పవన్ తెలిపారు. విశాఖపట్నంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న సమస్యలేమిటో తెలుసుకోవడానికి యాత్ర చేపడుతున్నామని తెలిపారు. కొంతమంది పాలకుల నిర్లక్ష్యానికి కోట్లాదిమంది ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ప్రత్యక హోదాతోపాటు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని అమలుచేయలేదని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలు ఇలాగే వెనుకబడి ఉంటే.. ప్రాంతాల మధ్య విద్వేషాలు చెలరేగుతాయని తెలిపారు. జనసేన పార్టీ మ్యానిఫెస్టో కమిటీ కూడా బస్సుయాత్రలో పాల్గొంటుందని చెప్పారు. -
రవాణా రంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
ఇచ్ఛాపురం రూరల్ : కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతోనే దక్షిణ భారత రాష్ట్రాల్లో రవాణా రంగం నష్టాల్లో ఉందని జిల్లా లారీ యజమానుల జేఏసీ కన్వీనర్, ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ అన్నారు. దక్షిణ భారత రాష్ట్రాల లారీల నిరవధిక బంద్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో గురువారం ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి ధనరాజులమ్మ ఆలయం వద్ద జాతీయ రహదారిపై ఇచ్ఛాపురం బోర్డర్ లారీ ఓనర్స్ అసోసియేషన్(ఐబీఎల్ఓఏ)ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర లారీ యజమానుల సంఘ అధ్యక్షుడు ముడియా జానకిరామ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన థర్డ్ పార్టీ ప్రీమియం తగ్గించాలని, రవాణా వాహనాలకు స్పీడ్ గవర్నర్ ఏర్పాటును ఉపసంహరించాలని, పెంచిన ఆర్టిఎ చలానా ఫీజులు, పెనాల్టీలను రద్దు చేయాలని, టోల్ ఫీ రద్దు చేయాలని, ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరిగా ఏసీ క్యాబిన్ ట్రక్కుల సరఫరా ఆదేశాలను ఉపసంహరించాలని, 15 ఏళ్లు దాటిన రవాణా వాహనాలను నిలుపుదల చేసే ఆలోచన విరమించుకోవాలని, ఆంధ్రా, తెలంగాణాలకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న సీఐ ఎం.అవతారం, రూరల్ ఎస్సై మీసాల చిన్నంనాయుడులు సిబ్బందితో చేరుకుని సంఘ ప్రతినిధులతో చర్చించారు. అనంతరం పరిస్థితిని చక్కదిద్దారు. నిరసన కార్యక్రమంలో ఇచ్ఛాపురం బోర్డర్ లారీ అసోషియేషన్ లీగల్ అడ్వయిజర్ జీరు కామేష్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పితంబర్ మహంతి, కార్యదర్శి ఉలాసి శ్యాంకుమార్ రెడ్డి, కోశాధికారి మద్ది రాంబాబు, సభ్యులు నందిక ప్రేమ్‌కుమార్, ఉలాసి ఉమాపతి, బృందావన్ మహంతి, సునీల్ మహంతిలు పాల్గొన్నారు. వీరికి ఆటోయూనియన్ అధ్యక్షుడు ఉలాసి యర్రయ్య, ట్రాక్టర్ అసోషియేషన్ అధ్యక్షుడు గుజ్జు జగన్నాథంరెడ్డి, ఉప్పాడ చినబాబురెడ్డిలు మద్దతు పలికారు. -
హద్దుల్లేని అవినీతి!
ఇచ్ఛాపురం, కంచిలి: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని పురుషోత్తపురం ఉమ్మడి తనిఖీ కేంద్రం (ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు)లో అవినీతికి హద్దులేకుండా పోతోంది. అక్రమాలకు చిరునామాగా మారిందనే విమర్శలున్నాయి. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేయడం, తనిఖీలు చేపడుతున్నా ఇక్కడి సిబ్బంది తీరు మారడం లేదు. తాజాగా సోమవారం వేకువజాము నుంచి మధ్యాహ్నం వరకు చెక్‌పోస్టులో ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర నేతృత్వంలో దాడులు చేపట్టి..విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 64 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. డీఎస్పీ చెప్పిన వివరాల ప్రకారం.. సేల్స్ అండ్ కమర్షియల్ శాఖ పరిధిలోని రెండు కౌంటర్ల నుంచి రూ. 30 వేలు, మార్కెటింగ్ శాఖ పరిధిలోని కౌంటర్ నుంచి రూ. 1100, ఎనిమిది మంది ప్రైవేటు వ్యక్తుల నుంచి (దళారులు) రూ. 32,900 స్వాధీనం చేసుకున్నామన్నారు. తనిఖీలో డీఎస్పీతోపాటు సీఐ, 15 మంది స్పెషల్‌పార్టీ పోలీసులు పాల్గొన్నారు. సోమవారం వేకువజామున 4:30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు చెక్‌పోస్టు ప్రాంగణంలో తనీఖీలు, రికార్డులు పరిశీలన చేశారు. అక్రమ కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపారు. తరచూ దాడులు ఉమ్మడి తనిఖీ కేంద్రంపై తరచూ ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. 2015 డిసెంబర్, 2016 జనవరి, మార్చి, జూన్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఒక్కోసారి దాడులు చేసి పలువురిని అరెస్టు చేశారు. లక్షలాది రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సోమవారం కూడా తనిఖీ చేపట్టి 64 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కొరియార్ బాయ్స్‌తో అక్రమ వసూళ్లు ఈ చెక్‌పోస్టు వ్యవహారాల్లో వాస్తవంగా ప్రభుత్వ శాఖల సిబ్బంది కంటే ప్రైవేటు వ్యక్తుల ప్రమేయమే ఎక్కువగా కన్పిస్తోంది. ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు సహాయకులుగా ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని వారితోనే ఈ దందా అంతా సాగిస్తున్నారు. సోమవారం ఏసీబీ అధికారులు చేసిన దాడిలో ఎనిమిమంది ప్రైవేటు వ్యక్తులు పట్టుబడ్డారు. ప్రైవేటు వ్యక్తులను కొరియర్ బాయ్స్‌గా పిలుస్తారని ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర పేర్కొన్నారు. వీరితోనే అన్ని అక్రమ కార్యకలాపాలు ఇక్కడి సిబ్బంది చేయిస్తున్నారన్నారు. తనిఖీలు నామమాత్రం! ఈ చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ నామమాత్రంగానే జరుగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది సిబ్బంది తనిఖీల కంటే వసూళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారనే విమర్శలున్నాయి. చెక్‌పోస్టు పరిధిలో లావాదేవీలు జరుపుతున్న పలు శాఖల కౌంటర్లలో లారీ డ్రైవర్ల నుంచి పెద్ద ఎత్తున అక్రమ వసూళ్లకు సిబ్బంది పాల్పడుతున్నారు. ఈ విషయం పలుమార్లు జరిపిన తనిఖీల్లో తేటతెల్లమయ్యింది. దీన్ని అరికట్టేందుకు ఏసీబీ, విజిలెన్స్ అధికారులు అనేకసార్లు తనిఖీలు జరిపి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. ఇక్కడ జరుగుతున్న అవినీతికి కొంతమంది ప్రముఖుల అండదండలు కూడా ఉండడమే సిబ్బందిలో మార్పు రాకపోవడానికి కారణంగా ఈ ప్రాంతీయులు చెబుతుంటారు. చెక్ పోస్టు పరిధిలో విధులు నిర్వహించే పలు శాఖల అధికారులు, సిబ్బందితోపాటు పెద్ద ఎత్తున ప్రైవేటు సైన్యం కూడా బినామీలుగా ఉద్యోగాలు చేస్తున్నారు. వాస్తవంగా వివిధ శాఖల కౌంటర్లలో ఉండాల్సిన అధికారిక సిబ్బందికంటే ప్రైవేటు వ్యక్తులే అన్ని పనులు చక్కబెడతారు. ఏసీబీ అధికారులు దాడులు చేసే సమయాల్లో ప్రతిసారీ ప్రైవేటు సైన్యం నుంచే అక్రమవసూళ్లు లభ్యమవుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చేయి తడపాల్సిందే.. పురుషోత్తపురం చెక్‌పోస్టు మీద నుంచి వివిధ రాష్ట్రాలకు వచ్చి, పోయే వాహనాలకు సంబంధించి పత్రాలు మాత్రమే సిబ్బంది తనిఖీ చేస్తారు. ఫిజికల్ వెరిఫికేషన్లు చేపట్టడం అరుదని లారీ డ్రైవర్లే చెబుతుంటారు. లారీలోని సరుకుకు సంబంధించిన పత్రాలు, వాటి అనుమతులను ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు కార్యాలయం వద్దకు తీసుకొచ్చే లారీ ఆపరేటర్లు అక్కడి సిబ్బందికి ఎంతోకొంత ముట్టచెబితే అనుమతి పత్రాలపై స్టాంప్‌లు వేస్తారనే ఆరోపణలున్నాయి. పాతుకుపోయిన ఉద్యోగులు చెక్‌పోస్టులోని కొన్ని శాఖల్లో పనిచే స్తున్న కిందిస్థాయి ఉద్యోగులు చాలా కాలంగా ఇక్కడే పనిచేస్తూ పాతుకుపోయారు. ఇక్కడ జరుగుతున్న అక్రమాలకు కర్త, కర్మ, క్రియలుగా వీరే వ్యవహరిస్తారనే ఆరోపణలున్నాయి. ఏ అధికారి వచ్చినా వారికి తలలో నాలుకలా వ్యవహరిస్తూ, అక్కడ వసూళ్లు జరిగే సమయంలోను, ఎవరైనా పరిశీలించటానికి వచ్చేటప్పుడు వీరు సీన్లోకి వచ్చి ఆ సమస్య సమసిపోయే విధంగా డీల్ చేయటం సర్వసాధారణమైన విషయంగా మారింది. ఇలాంటి వారు ఏసీబీ అధికారుల దాడుల్లో పట్టుబడడం, వీరిపై కేసులు నమోదు అవుతున్నప్పటికీ... ఇక్కడ నుంచి వారిని బదిలీ కూడా చేయడం లేదు. -
మాకేటి సిగ్గు!
ఇచ్ఛాపురం (కంచిలి): పాలనా పరమైన విషయాల్లో అవినీతిని అంతమొందిస్తున్నాం.. పారదర్శకతతో పనిచేస్తున్నామని పాలకులు చేసే ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న తంతుకు పొంతన లేకుండా పోయింది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావల్సిన ఆదాయం కొందరు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోవటం నిత్యకృత్యంగా మారింది. దీనికి ఇచ్ఛాపురం పరిధిలోని పురుషోత్తపురం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులో సాగుతున్న తంతును ఉదాహరణగా చెప్పవచ్చు. మూడేళ్లలో ఈ చెక్‌పోస్టులో అవినీతి అంతమొందించటానికి చేసిన ప్రయత్నాలేవి సఫలీకృతం కాలేదు. కానరాని సరుకుల తనిఖీలు! ఈ చెక్‌పోస్టు పరిధిలో కమర్షియల్ అండ్ సేల్స్ ట్యాక్స్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, రవాణాశాఖ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, సివిల్‌సప్లైస్, అటవీశాఖ, మైన్స్ అండ్ జియాలజీ శాఖల కౌంటర్లు ఉన్నారుు. వాహనాల్లో వచ్చే సరకులకు సంబంధించి అన్ని అనుమతులు, పన్నులు చెల్లింపు జరిపారో లేదో అనే విషయాలను తనిఖీలు చేయూలి. ఈ శాఖల ఆధ్వర్యంలో వచ్చి, పోయే వాహనాల్లో ఏం రవాణా చేస్తున్నారు, కాగితాల్లో చూపెట్టిన ప్రకారం సరుకు నిల్వలు ఉన్నాయో, అధికంగా ఉన్నాయో, ఒకదానికి బదులు మరో సరకు రవాణా అవుతోందో నిశితంగా పరిశీలించాల్సి ఉంది. కానీ ఇక్కడ చెక్‌పోస్టులో ఏ శాఖకు సంబంధించి అటువంటి నిశిత పరిశీలన జరగటంలేదనేది ఏసీబీ అధికారులు చెబుతున్నారు. పన్నుల చెల్లింపు పైనే దృష్టి ఈ చెక్‌పోస్టు వద్ద నిఘా కేవలం పన్నులు చెల్లించారా లేదా అనే అంశంపైనే దృష్టి కేంద్రీకరించేలా ఉంటుంది. దీంతో నిషేధిత వస్తువులు చెక్‌పోస్టు మీదుగా దర్జాగా రవాణా అవుతున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా గుట్కాలు, ఖైనీలు వంటివి పశ్చిమబెంగాల్, ఒడిశాప్రాంతాల నుంచి విజయనగరం మార్కెట్‌కు తరలిపోతున్నట్టు ఎప్పట్నుంచో ఆరోపణలున్నాయి. వారానికి ఒకరోజు ప్రముఖ వ్యాపారవేత్తకు చెందిన వాహనంలోనే అక్రమ రవాణా జరుగుతున్నట్టు సమాచారం. అరుుతే దీన్ని అరికట్టాల్సిన చెక్ పోస్టు సిబ్బంది అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. వాహన పత్రాలు నామమాత్రంగా తనిఖీ చేస్తుంటారు. ఈ వాహనం పాస్ చేయటానికి పెద్దమొత్తంలో చేతులు మారుతున్నట్లు స్థానికంగా ఆరోపణలున్నాయి. మరోవైపు ఒడిశా ప్రాంతానికి వెళ్లేందుకు, ఆంధ్రాలోకి వచ్చేందుకు చీకటిపేట రహదారి నల్లకుబేరులకు రాచమార్గంలా తయారైంది. ఇక్కడ ఏఎంసీకి చెందిన చెక్‌పోస్టు ఉన్నప్పటికీ అక్రమాలు ఆగడం లేదు. ఈ మార్గంలో కిరాణా సరకులు, నిషేధిత వస్తువులు, ఆంధ్రా, ఒడిశాలకు అమ్మకం పన్ను హెచ్చుతగ్గులు ఉన్నటువంటి సరకులను సునాయాసంగా రవాణా చేస్తుంటారు. ముఖ్యంగా ధాన్యాన్ని ఒడిశా నుంచి పెద్ద ఎత్తున బినామీ రైతుల గుర్తింపు పత్రాలతో వేబిల్లులు తయారు చేసి ఈ మార్గంలో రవాణా చేస్తున్నారనే ఆరోపణలు బాహాటంగా విన్పిస్తున్నాయి. ఈ దశలో ఇక్కడ మార్కెట్ కమిటీతోపాటు, కమర్షియల్ ట్యాక్స్ విభాగాల అధికారులు కాపుకాసి తనిఖీలు చేపట్టినా ఫలితం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో నంబర్‌వన్... దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అన్ని చెక్‌పోస్టులు కంటే పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్దే కొన్ని శాఖల కౌంటర్లలో అధిక మొత్తాల్లో అక్రమ వసూలు చేస్తున్నారని లారీ ఆపరేటర్లు చెబుతున్నారు. దీనిపై ఎన్నిసార్లు దాడులు, తనిఖీలు చేపట్టినా ఫలితం లేకపోయిందనే వాదనే విన్పిస్తోంది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావల్సిన ఆదాయం కంటే పక్కదారి పట్టే ఆదాయమే ఎక్కువగా ఉంటుందనే ఆరోపణలున్నారుు. ఆగని ప్రైవేటు సైన్యం దందా పురుషోత్తపురం చెక్‌పోస్టులో అధికార యంత్రాంగం అవినీతికి తోడుగా ప్రైవేటు సైన్యం దందా పెద్ద ఎత్తున సాగుతోంది. వాహనదారులు లారీలు ఆపి తమ కాగితాలు చూపించి, అనుమతులు పొంది వెళ్లాల్సి ఉండగా, ప్రైవేటు వ్యక్తులు ఆ అవకాశం ఇవ్వకుండా ద్విచక్ర వాహనాల్లో లారీల వద్దకు వెళ్లి వారే కాగితాలు తీసుకొని, కౌంటర్ల వద్ద నామమాత్రపు తనిఖీలు చేయిస్తుంటారు. వాహనదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతుండటం ఇక్కడ నిత్యకృత్యంగా జరుగుతోంది. కేవలం అక్రమ దందామీదే వందలాది మంది జీవనం సాగిస్తున్నారు. వీరిని అదుపుచేసే చర్యలు చెక్‌పోస్టు అధికారులు చేపట్టడంలేదు. శుక్రవారం రాత్రి ఏసీబీ అధికారులు దాడులు చేసి ఐదుగురు ప్రైవేటు వ్యక్తులను అరెస్టు చేశారు. అలాగే వాహన యజమానుల నుంచి అదనంగా వసూలు చేసిన 45,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. దీన్ని చూస్తే ప్రైవేటు వ్యక్తుల హవా ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
వివాహిత ఆత్మహత్య
ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని ధర్మపురం గ్రామానికి చెందిన వివాహిత ఆదివారం వేకువజామున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇచ్ఛాపురం రూరల్ ఎస్సై ఎం.చిన్నంనాయుడు తెలిపారు. కొంత కాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న సాడి సరస్వతి(23) మందులు వాడుతుండేదని చెప్పారు. శనివారం అర్ధ రాత్రి నుండి కడుపునొప్పి తీవ్రతగా ఉండటంతో తట్టుకోలేక పోయిన సరస్వతి ఆదివారం వేకువ జామున తన నివాసం మేడపైన చున్నీతో ఉరివేసుకుని చనిపోయినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఉప తహశీల్దార్ గణపతి, ఎస్సై ఎం.చిన్నం నాయుడు శవ పంచనామాకు తరలించారు. భర్త కువైట్‌లో ఉంటున్నారని, వారికి రెండు సంవత్సరాల అబ్బాయి ఉన్నట్లు తెలిపారు. -
గుండెపోటుతో తహశీల్దారు మృతి
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం తహశీల్దారుగా పనిచేస్తున్న కె.భవనమోహన్(59) శనివారం సాయంత్రం తన కార్యాలయంలోనే గుండెపోటుతో కన్ను మూశారు. దీర్ఘకాలంగా ఆయన లంగ్స్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. శనివారం జన్మభూమి - మా ఊరు కార్యక్రమానికి హాజరైన ఆయన ఆ కార్యక్రమం ముగించుకొని సాయంత్రం కార్యాలయానికి చేరుకున్నారు. కాఫీ తెప్పించుకుని తాగుతుండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుర్చీలోంచి వెనక్కు పడిపోతుండగా అక్కడే ఉన్న వీఆర్వో సీతారామస్వామి ఆయన్ను ఒడిసి పట్టుకున్నారు. తహశీల్దారు కార్యాలయ ఆవరణలో ఉన్న క్యాంప్ కార్యాలయంలోని గదికి తరలించి, వైద్యులను హుటాహుటిన తీసుకు వచ్చారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వెంటనే కార్యాలయ సిబ్బంది సర్వేయర్ కాంతారావు తదితరులు కార్యాలయానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న ఎంపీడీఓ పి.రామకృష్ణ, పట్టణ ప్రముఖులు, వివిధ విభాగాల అధికారులు కార్యాలయానికి చేరుకొన్నారు. సిబ్బంది వారిస్తున్నా... తీవ్ర ఆనారోగ్యంగా ఉన్నప్పటికీ జన్మభూమి కార్యక్రమానికి హాజరవుతున్న తహశీల్దారును సిబ్బంది వద్దని వారించినా ఆయన వినలేదు. రెండు మెట్లు ఎక్కితేచాలు విపరీతమైన ఆయాసం వచ్చేదని, విశ్రాంతి తీసుకోవాలని తాము కోరినా ప్రభుత్వ కార్యక్రమానికి ఎలా దూరంగా ఉంటామంటూ సున్నితంగా తిరస్కరించారని సర్వేయర్ కాంతారావు చెప్పారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు గత ఏడాదే వివాహం చేశారు. ఈయన స్వస్థలం శ్రీకాకుళం. టెక్కలి ఆర్డీఓ వెంకటేశ్వరరావు భౌతిక కాయాన్ని పరిశీలించారు. బౌతిక కాయాన్ని శ్రీకాకుళం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖుల సంతాపం శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇచ్చాపురం తహశీల్దారు కె.భువనమోహన్ ఆకస్మిక మృతి పట్ల జిల్లా నేతలు, అధికారులు సంతాపం తెలిపారు. జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ విప్ రవికుమర్, జిల్లా కలెక్టర్ పి.లక్ష్మినారాయణ, జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ 2 పి.రజనీకాంతరావు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. ఇంకా రెవెన్యూ సర్వీసుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కాళీ ప్రసాద్, శ్రీకాంత్, ఎన్.వెంకట్రావు, జల్లెపల్లి రామారావు, శ్రీహరి తదితరులు కూడా సంతాపం తెలిపారు. -
జగన్ అరెస్టును నిరసిస్తూ ట్రై సైకిల్ యాత్ర
ధవళేశ్వరం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ట్రై సైకిల్‌పై వెళ్లి తిరిగి ఇచ్చాపురం యాత్రగా వెళుతున్న శ్రీకాకుళం జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం కార్యదర్శి నెయ్యల ప్రసాద్‌కు ఆదివారం ధవళేశ్వరంలో పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తనది శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం గ్రామమని తెలిపారు. తాను స్టోన్‌క్రషర్ వర్క్స్‌లో పని చేస్తున్నానన్నారు. ఇచ్ఛాపురం నుంచి సుమారు నెల్లాళ్లు ప్రయాణించి ఇడుపులపాయకు చేరుకున్నానని వివరించారు. అక్కడ వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించినట్టు ప్రసాద్ తెలిపారు. యాత్ర మధ్యలో తిరుపతిలో జగన్ సోదరి షర్మిలను కలుసుకున్నానన్నారు. తిరిగి యాత్ర గా ఇచ్చాపురం వెళుతున్నానని ప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 2600 కిలోమీటర్లు ప్రయాణించినట్టు ఆయన తెలిపారు. కుట్రపురితంగా జగన్‌ను జైలులో నిర్బంధించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ప్రసాద్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వారే కుట్రదారులకు బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు తలారి వరప్రసాద్ మాట్లాడుతూ వికలాంగుడైనప్పటికి జగనన్నపై ఉన్న అభిమానంతో ఇన్ని వేల కిలోమీటర్లు యాత్ర చేయడం అభినందనీయమన్నారు. ప్రసాద్‌కు వైఎస్సార్ సీపీ నాయకులు కొంత ఆర్థికసాయాన్ని అందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోలి దేవకుమార్, కేవీ రావుకొత్తపల్లి రాజు, అమీద్, రబ్బానీ, బాలిబోయిన రమణ, గోసాల రాంబాబు, తలారి వీర్రాజు, గెడ్డం అభిమన్యు, మెండు రాంబాబు, విప్పర్తి విజయకుమార్, రేలంగి ఉమ, జెట్టి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.