Ignorance
-
సందిగ్ధ జ్ఞానం
జ్ఞానానికి, అజ్ఞానానికి మధ్య ఉన్నది ‘అ’భేదమే కదా అనుకుంటాం కానీ, ఆ రెండింటికీ మధ్య ఏడు సముద్రాలంత దూరం ఉంది. అజ్ఞానమనే చీకటి ఒడ్డు నుంచి, జిజ్ఞాస అనే అలల మీదుగా, జ్ఞానమనే వెలుగుల తీరం వైపు సాగే ప్రయాణంలో ఆనందమే మనకు తెప్పవుతుంది. అందుకే జ్ఞానానందమనే మాట పుట్టింది. అయితే, ఆ ఆనందాన్ని అంటిపెట్టుకుని ఒక విషాదమూ ఉంటుంది. అది ఏమిటంటే... మన ఊహకు అందనంత వయసున్న ఈ అనంతవిశ్వంలో భూమి ఒక గోళీకాయ కన్నా కూడా చిన్నదనుకుంటే, దానిపై జీవించే మనిషి నలుసుపాటి కూడా చేయడు. అతని అస్తిత్వాన్ని కాలం కొలమానంతో కొలిస్తే అది కొన్ని క్షణాలను మించదు. కనుక అనంతవిశ్వం గురించిన జ్ఞానం సంగతలా ఉంచి, ఈ భూమి గురించి, ఈ భూమి మీద తన మనుగడ గురించిన జ్ఞానం మొత్తాన్నే ఒక మనిషి తన జీవితకాలంలో సంగ్రహించుకోవడం అసాధ్యం. అదీ అసలు విషాదం. మనిషిలో మెదడు ఎప్పుడు వికసించిందో అప్పుడే అతనిలో విశ్వం గురించిన జ్ఞానాన్వేషణ మొదలై, వేలసంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. చంద్రుడి వృద్ధి, క్షయాలను అనుసరించి కాలగణనాన్నీ, ఋతుభ్రమణాన్ని అనుసరించి వేటజంతువుల గుర్తింపునూ మనిషి ప్రారంభించి వాటిని ఒక పొడవాటి ఎముకపై నమోదు చేయడం నక్షత్రాలు, రాశులతో ముడిపడిన జ్యోతిర్విజ్ఞానానికి నాంది అయిందంటారు. ఆపైన మొక్కల సేకరణ నుంచి, పెరటిసాగుకు; అక్కడి నుంచి వ్యవసాయానికి సాగే క్రమంలో ఆహారవిజ్ఞానాన్ని బహుముఖాలుగా విస్తరించుకుంటూ వెళ్ళాడు. రాతిపనిముట్ల తయారీలో సాంకేతికజ్ఞానాన్ని, ఏదో అతీతశక్తి ఈ విశ్వాన్ని సృష్టించి నడిపిస్తోందన్న ఊహ నుంచి మత, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని; నియమ నిబంధనలు, కట్టుబాట్లతో కలసి జీవించడం నుంచి సంస్కృతిని సంతరిస్తూ, నిర్మిస్తూ వచ్చాడు. ఇందులో ప్రతిదీ జ్ఞానాన్వేషణలో మేలి మలుపే; జ్ఞానపు నిచ్చెన నధిరోహించడంలో నిశ్చయాత్మకమైన మెట్టే. నగరాల నిర్మాణం మీదుగా నాగరికతాదిశగా సాగిన ఈ యాత్రలో ఇంతవరకు మనిషి ఎక్కడా మడమ తిప్పింది లేదు; ఆకాశమే హద్దుగా ఆ యాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయినా సరే, సంపూర్ణజ్ఞానం మనిషికి ఎప్పటికీ అందని ఎండమావిలా ఊరిస్తూనే ఉంది. కనిపించని జ్ఞానచంద్రుడి చీకటిపార్శ్వం అదే. సంకేతాల నుంచి లిపిని అభివృద్ధి చేసుకుని జ్ఞానాన్ని పుస్తక రూపంలో భద్రపరచడం ఈ క్రమంలో మరొక మెరుపుల మజిలీ. మొదట్లో విశ్వసృష్టి, దేవుడు, మతం, ఆధ్యాత్మికత, శాస్త్ర విజ్ఞానం, సాంకేతికజ్ఞానం వగైరా వింగడింపు లేకుండా తనకు తెలిసిన జ్ఞానం మొత్తాన్ని, తనకు తెలిసిన ప్రక్రియలో ఒకేచోట రాశిపోసిన ఉత్సాహం మనిషిది. అందుకే గణితశాస్త్రాన్ని కూడా పద్యాల్లో చెప్పిన పావులూరి మల్లన్నలు మన దేశంలో, మన సాహిత్యంలో కనిపిస్తారు. తర్వాత తర్వాత జ్ఞానం అనేక శాఖలు గల మహావృక్షంగా ఎదిగిపోయి, ఒక మనిషి తన జీవితకాలంలో ఏ ఒక్క శాఖనూ పూర్తిగా తేరి చూసే వీలుకుండా నిలువుగా అడ్డంగా విస్తరించిపోయింది. తన కళ్ళ ముందే ఉన్న, తన నిత్యజీవనంతో ముడిపడి ఉన్న, తన అనుభవంలోకి వచ్చే అనేక విషయాల ఆనుపానులు తెలియకుండానే మనిషి తన జీవితకాలాన్ని ముగించవలసి రావడం కన్నా పెనువిషాదం ఇంక ఏముంటుంది? ప్రసిద్ధ కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘ఇంగువ’ అనే కథలో ఈ విషాదాన్నే ఒకింత హాస్యగంభీరస్ఫోరకంగా చిత్రిస్తారు. అందులో రాజశేఖరం అనే వ్యక్తిని ఇంగువ ఎలా తయారవుతుందనే ప్రశ్న చిరకాలంగా వేధిస్తూ ఉంటుంది. అతను వృద్ధాప్యంలో మంచం పడతాడు. ఒక మిత్రుడు అతణ్ణి చూడడానికి వెడతాడు. రాజశేఖరం అతి కష్టం మీద నోరు తెరచి అదే ప్రశ్న అడుగుతాడు. దానికి సమాధానం తెలుసుకోకుండానే జీవితం చాలిస్తానేమోనన్న బెంగ అతని ముఖంలో కనిపిస్తుంది. మిత్రుడు వెంటనే వెళ్ళి ఇంకో మిత్రుని కలసి సమాధానం కనుక్కొని తిరిగి వస్తాడు. కానీ అప్పటికే రాజశేఖరం కన్నుమూస్తాడు. ఇప్పటిలా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి, గూగుల్ శోధించి ఉంటే, ‘ఫెరులా’ అనే మొక్క నుంచి పుట్టే జిగురే గట్టిపడి ఇంగువగా తయారవుతుందనీ, ‘అసాఫోటిడా’ అనేది దాని శాస్త్రీయ నామమనీ, ఈ మొక్క ఎక్కువగా ఇరాన్ ఎడారుల్లో, అఫ్ఘానిస్తాన్, ఉజ్బెకిస్తాన్ పర్వతప్రాంతాలలో సాగవుతుందనీ రాజశేఖరం తెలుసుకుని ఉండేవాడు.అలాగని అతనికా అదృష్టం లేకపోయిందనడానికీ వీల్లేదు. ఇంటర్నెట్ ఆధారిత బహుళ మాధ్యమాలతో సమాచారవిప్లవం కొత్తపుంతలు తొక్కిందనుకునే ఈ రోజున కూడా చిన్న చిన్న సందేహాలు తీరకుండానే దేహం చాలించే రాజశేఖరాలు ఉంటూనే ఉన్నారు. జ్ఞానతీరానికి ఏ కొంచెమైనా దగ్గరవడానికి ఏ అత్యాధునిక సాధనాలూ సాయపడడం లేదు. పరిమిత జీవితకాలం అతని నిస్సహాయతను ఇప్పటికీ గుర్తుచేసి వెక్కిరిస్తూనే ఉంది. మరోవైపు సమాచార ఉల్బణం నుంచి నిక్కమైన సమాచారానికి బదులు అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలు పుట్టుకొచ్చి జ్ఞానాన్వేషణను అజ్ఞానాన్వేషణగా మార్చివేశాయి. అలా వ్యాప్తిలోకి వచ్చినదే ‘ఫేక్’ లేదా నకిలీ సమాచారమనే మాట. నేటి రాజశేఖరాలను వేధిస్తున్నది కేవలం సమాచార రాహిత్యం కాదు, నిజమో, అబద్ధమో తెలియని సమాచార సందిగ్ధం. జ్ఞాన, అజ్ఞానాల మధ్య ఆ మాత్రపు అక్షరభేదాన్ని కూడా తుడిచేసి పూర్తి అభేదాన్ని స్థాపించే యుగంలో ఉన్నాం. అదీ విషాదం! -
అజ్ఞాన జ్ఞానం
‘ఆదియందు అక్షరమున్నది’(జాన్ 1:1) అని బైబిల్ వాక్కు. అజ్ఞానం అనాది నుంచి ఉన్నది. సృష్టిలో అజ్ఞానానికి ముందు ఏముందో ఎవరికీ తెలీదు. అజ్ఞానం అమేయమైనది; అజ్ఞానం అప్రమేయమైనది; అజ్ఞానం అనాదినిధనమైనది; అజ్ఞానం అప్రయత్నలబ్ధమైనది; అజ్ఞానం అగాధమైనది; అజ్ఞానం అనంతమైనది; అజ్ఞానం అజరామరమైనది. విచిత్రంగా జ్ఞానాజ్ఞానాల నడుమ ఒక సారూప్యత ఉంది. ఇవి రెండూ అగోచరమైనవే! రెండింటికీ ఒక భేదం కూడా ఉంది. జ్ఞానానికి అవధులు ఉంటాయేమో గాని, అజ్ఞానానికి ఎలాంటి అవధులూ ఉండవు.అజ్ఞానం నుంచి మానవాళికి అప్రయత్నంగా దొరికే ఆస్తి– మూర్ఖత్వం. అజ్ఞానం నుంచి ఉద్భవించడం వల్ల మూర్ఖత్వమూ అనంతమైనదే! ‘అనంతమైనవి రెండే రెండు. ఒకటి: ఈ విశ్వం, రెండు: మనుషుల మూర్ఖత్వం; విశ్వం సంగతి నాకింకా పూర్తిగా తెలీదు’ అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అల్బర్ట్ ఐన్స్టీన్. మానవ మూర్ఖత్వానికి గల అనంత తత్త్వం అవగతమయ్యే నాటికి పాపం ఆయన తలపండితుడైపోయాడు. అనంతమైన అజ్ఞాన సాగరాన్ని ఈదులాడి ఒడ్డున పడితే తప్ప జ్ఞానమేమిటో తెలియదు. చాలామందికి అజ్ఞానసాగరంలో ఈదులాడుతూ ఒడ్డునున్న వాళ్ల మీదకు అజ్ఞాన తరంగాలను వెదజల్లుతుంటారు. వాళ్లకదో వేడుక!అజ్ఞానానికి గల అనేక పర్యాయపదాల్లో ‘మాయ’ ఒకటి. ఎవరి అజ్ఞానం వారికి తెలీదు. ఎదుటివారి అజ్ఞానాన్ని గుర్తించడంలో మాత్రం ప్రతి ఒక్కరూ జ్ఞానులే! ప్రవచన ప్రసంగాల్లో అజ్ఞానాన్ని నేరుగా ప్రస్తావిస్తే, శ్రోతల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రవచనకర్తలు అజ్ఞానాన్ని ‘మాయ’ అని సున్నితంగా చెబుతుంటారు. ‘తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మన/ ఛిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత’– (4:42) అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించాడు. అంటే, ‘అజ్ఞానం కలిగిన బుద్ధిలో నిలకడగా ఉన్న ఆత్మ గురించిన సందేహాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఖండించి, తత్త్వజ్ఞానానికి సాధనమైన కర్మయోగాన్ని స్వీకరించు’ అని అర్థం. బుద్ధిలో అజ్ఞానం ఉన్నట్లు శ్రీకృష్ణుడు గుర్తించి చెప్పాడు. కాబట్టి ఆయన జ్ఞాని. అజ్ఞానాన్ని ఖండించడానికి జ్ఞానఖడ్గాన్ని ప్రయోగించాలని ఆయన ఉద్బోధించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి గీతబోధ విన్న అర్జునుడు మొదలుకొని ఎందరెందరో జ్ఞానఖడ్గానికి పదునుపెట్టి అజ్ఞానాన్ని ఖండిస్తూనే ఉన్నారు. ఖండఖండాల అజ్ఞానం కొన్ని మెదళ్లలోకి చేరి, అఖండంగా పెరిగిపోతుండటమే విడ్డూరం. బహుశా, ఇదే మాయ కావచ్చు!‘ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్’ అని ఇంగ్లిష్ నానుడి. అంటే, అజ్ఞానమే ఆనందమన్నమాట! ఈ నానుడినే కొంత విస్తరిస్తూ, ‘అజ్ఞానమే ఆనందం అంటుంటారు గాని, అజ్ఞానం మన విధికృతం’ అని చెప్పింది అమెరికన్ రచయిత్రి, పాత్రికేయురాలు గేయిల్ లైండ్స్. విధికృతమైన వాటిని ఎవరు మాత్రం తప్పించుకోగలరు? కాబట్టి అజ్ఞానాన్ని కూడా ఎవరూ తప్పించుకోలేరు. అజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలంటే, జ్ఞానులు ఎంతో ప్రయాసతో ప్రయత్నించవలసి ఉంటుంది. అజ్ఞానులకు ఆ బెడద లేదు. తమకు అప్రయత్నలబ్ధమైన అజ్ఞానానందాన్ని నిక్షేపంగా ఆస్వాదిస్తుంటారు. అజ్ఞానాన్ని గురించి అసలు ఎందుకు తెలుసుకోవాలి? అంటే, జ్ఞానాన్ని పెంచుకోవడానికి అని చెబుతారు చాలామంది. పాపం వాళ్లు చాలా అమాయకులు. అసలు సిసలు ముదురు జ్ఞానులు కొందరు ఉన్నారు. వాళ్లు అజ్ఞానాన్ని గురించి నానా రకాల అధ్యయనాల్లో మునిగి తేలుతూ ఉంటారు. జనబాహుళ్యంలో అజ్ఞాన విస్తరణకు పనికొచ్చే పద్ధతులకు రూపకల్పన చేస్తుంటారు. వాటిని జనాల మీద ప్రయోగిస్తుంటారు. ఇదొక ప్రత్యేక శాస్త్రం. ఇంగ్లిష్లో దీనినే ‘ఆగ్నటాలజీ’ అంటారు. అంటే, అజ్ఞానాధ్యయన శాస్త్రం అన్నమాట! మన దేశంలోని విశ్వవిద్యాలయాలు ఈ శాస్త్రం మీద ఇంకా దృష్టి సారించలేదు గాని, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లోని పలు విశ్వవిద్యాలయాలు ఈ శాస్త్రం మీద అధ్యయనాలు కొనసాగిస్తున్నాయి. ‘ఆగ్నటాలజీ’ అనే అజ్ఞానాధ్యయన శాస్త్రానికి ఆ పేరుతో పిలవడం ఆలస్యంగా మొదలైంది గాని, అజ్ఞానానికి సంబంధి«ంచిన పరిజ్ఞానం అంతకంటే ముందు నుంచే ఆచరణలో ఉంది. స్కాటిష్ సామాజిక చరిత్రకారుడు అయాన్ బోల్ 1992లో తొలిసారిగా ‘ఆగ్నటాలజీ’ అనే మాటను ప్రయోగించాడు. అమెరికన్ సిగరెట్ తయారీ కంపెనీలు 1969లో ఉద్ధృతంగా చేసిన ప్రచారం ఆగ్నటాలజీకి ఉదాహరణగా నిలుస్తుందని శ్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాబర్ట్ ప్రోక్టర్ తేల్చిచెప్పాడు. కార్పొరేట్ సంస్థల నుంచి రాజకీయ పార్టీల వరకు నానా వర్గాలు ఆగ్నటాలజీ పద్ధతులను ఉపయోగించుకుంటూ, ప్రజల అజ్ఞానానికి జ్ఞాన ఖడ్గాల వల్ల ముప్పు లేకుండా కాపాడుతూ తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నాయి.ఇది హైటెక్కు టమారాల యుగం. జ్ఞానం జనాలకు అందుబాటులో లేని సరుకేమీ కాదు. అందుబాటులో ఉన్నంత మాత్రాన జనాలందరూ జ్ఞానాన్ని పొందినట్లు కాదు. ఈ కృత్రిమ మేధ కాలంలో కూడా రాజకీయ, తాత్త్విక అంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని జనాలు విశ్వాసాలు, మతాచారాలు, ప్రచారం ద్వారా మాత్రమే పొందుతున్నారు. ఇది విపరీత అజ్ఞాన శకం. పత్రికలు, ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాలు ఆగ్నటాలజీ ప్రయోగాలకు సాధనాలుగా మారుతున్నాయి. ప్రజలను మాయలో ముంచెత్తుతున్నాయి. ‘మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అన్న గురజాడ ఆశయం ఎక్కడ? అజ్ఞానంపై శాస్త్ర పరిశోధనలు సాగిస్తున్న నేటి పరిస్థితులెక్కడ? -
అజ్ఞానం కంటే అహంకారం ప్రమాదం
సంవత్సరం ఇప్పుడే ప్రారంభమైంది. మనం ఇప్పటికీ కాసింత సరదాగా ఉండేందుకు అర్హులమే అని నా అభిప్రాయం. నిస్సందేహంగా మిగిలిన 357 రోజుల్లో అంటే మున్ముందు జరిగే కార్యక్రమాలు మనల్ని ఉద్వేగంతో ముంచెత్తుతాయి. కానీ ఇప్పటికైతే మనం కాస్త తేలిగ్గానే ఉండగలం. కాబట్టి ఇంటర్నెట్ నుంచి నేను కూడబెట్టిన కొన్ని రత్నాలను మీతో పంచుకోనివ్వండి. నాకు బాగా నచ్చే అంశాల్లో ఒకటి అల్బర్ట్ ఐన్స్టీన్ పలుకులు. ‘ఈ=ఎంసీ స్క్వేర్’ అనే ఆయన సుప్రసిద్ధ సూత్రీకరణను నేను ఇప్పటికీ అర్థం చేసుకోలేక పోయాను. కానీ ఆయనకు సంబంధించిన ఇతర వివే కంతో నేను అనుసరించి సాగుతాను. ఆయనకు చెందిన ఈ కోణం మనకు పెద్దగా తెలియకపోవడం సిగ్గుచేటు. కాబట్టి ఈరోజు మనకు పెద్దగా తెలియని ఐన్స్టీన్ గురించి మీకు చెప్పనివ్వండి. ఐన్స్టీన్ చెప్పారంటూ కీర్తిస్తున్న కొన్ని అద్భుతమైన విషయాల్లోని విశేషమైన ఉదాహరణలతో నేను దీన్ని ప్రారంభిస్తాను. ఈ సమయంలో నా మనసును విశే షంగా ఆకర్షించిన ఉల్లేఖనలను నేను ఎంపిక చేసుకుంటాను. ‘అజ్ఞానం కంటే ప్రమాదకరమైన ఒకే ఒక్క అంశం ఏమిటంటే అహంకారం’. ‘ఏ మతిహీనుడైనా తెలుసుకోవచ్చు, విషయమేమిటంటే దాన్ని అర్థం చేసు కోవాలి’. ‘బలహీనులు ప్రతీకారం తీర్చుకుంటారు, బలవంతులు క్షమిస్తారు, తెలివైనవారు పట్టించుకోకుండా ఉంటారు’. ‘నేను నేర్చుకునేదానికి అడ్డుతగిలే ఒకే ఒక విషయం ఏమిటంటే, అది నా చదువు మాత్రమే’. ‘మూర్ఖత్వానికీ, మేధాతనానికీ మధ్య వ్యత్యాసం ఏమిటంటే, మేధాతనానికి దానివైన హద్దులుంటాయి’. ‘విజ్ఞానానికి ఏకైక వనరు అనుభవమే’. నాకు బాగా ఇష్టమైనవాటిల్లో రెండు మరీ సార వంతంగా ఉండి, ముక్కుసూటిగా ఉంటాయి. మొదటిది ఇదీ: ‘మీరు దాన్ని సులభంగా వివరించలేనట్లయితే, దాన్ని మీరు తగినంత అర్థం చేసుకోలేరు’. రెండోది ఇదీ: ‘చిలిపితనం వర్ధిల్లాలి! ఈ ప్రపంచంలో ఇదే నన్ను సంరక్షించే దేవదూత’. ఇప్పుడు ఐన్స్టీన్ చెప్పినవాటిల్లో నిర్దిష్ట విభాగాలకు చెందిన వ్యక్తులకు వర్తించే అంశాలకు వస్తాను. ఉదాహరణకు, మన రాజకీయ నేతలు వాటిని ఉపయుక్తంగా వాడుకునే సలహాలు ఆయన ఇచ్చారు. ‘సమాధానాలు ఉన్న వ్యక్తులు చెప్పేది వినవద్దు, ప్రశ్నలు ఉన్న వ్యక్తులు చెప్పేది మాత్రమే వినాలి’ అని ఆయన అన్నారు. ‘ఆలోచన లేకుండా అధికారాన్ని గౌర వించడం అనేది సత్యానికి మహా శత్రువు’ అని ఐన్స్టీన్ చెప్పింది మరింత ప్రాసంగికమైనది. ఐన్స్టీన్ వివేకంలో ఎక్కువ భాగం మన లాంటి సామాన్యులను లక్ష్యంగా చేసుకున్నది. ‘మీ జీవితాన్ని గడపడానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఏదీ అద్భుతం కాదన్నట్టుగా, మరొకటి ఏమిటంటే ప్రతిదీ అద్భుతమే అన్నట్టుగా.’ సులభంగా అలిసిపోయే వారికీ, లేదా ఎదురుదెబ్బలు, వైఫల్యాలతో నిస్పృహ చెందేవారికీ కూడా ఒక హామీ ఉంటుంది. ‘మీరు నిజంగా ఏం చేయాలని అనుకుంటున్నారో దాన్ని ఎన్నటికీ వదిలిపెట్టొద్దు. అన్ని వాస్తవాలు చేతిలో ఉన్న వ్యక్తులకంటే పెద్ద స్వప్నాలు కనే వ్యక్తి చాలా శక్తి మంతుడు.’ బహుశా, తడబడటాన్నీ, పడిపోవడాన్నీ అధిగమించాలంటే ఇదే మార్గం. ‘జీవితం అనేది సైకిల్ స్వారీ లాంటిది. మీ సమతౌల్యాన్ని సాధించాలంటే, మీరు ముందుకు కదులుతూనే ఉండాలి.’ ఐన్స్టీన్ చెప్పిన కొన్ని విషయాలను తీసుకుంటే, ఆయన 2023 నాటి భారతదేశాన్ని మనసులో ఉంచుకుని చెప్పారా అని మీరు ఆశ్చర్యపడేలా చేస్తుంది. దీన్ని గురించి ఆలోచించండి: ‘హాని తలపెట్టేవారి వల్ల ప్రపంచం ప్రమాదకరంగా లేదు, దానికేసి చూస్తూ కూడా ఏమీ చేయకుండా ఉండటం వల్ల ప్రమాదం ఉంటోంది’. ఇది కూడా చూడండి: ‘నిత్యం విశ్రాంతి లేనితనంతో వచ్చే విజయం కంటే కూడా ప్రశాంతమైన, నిరాడంబర జీవితం మరింత సంతోషాన్ని తీసుకొస్తుంది’. బహుశా, ఐన్స్టీన్ని ప్రపంచం కనీవినీ ఎరుగనంత గొప్ప శాస్త్రవేత్తగా భావిస్తున్నారు. అయినా సరే, భౌతిక శాస్త్రం మీద ఉన్నంత గ్రహణ శక్తి ఆయనకు దేవుడి మీదా ఉంది. ‘యాదృచ్ఛికత అనేది దేవుడు అజ్ఞాతంగా ఉండిపోవడానికి ఎంచుకున్న మార్గం’. అలాగే చిన్న పిల్లల గురించీ, వారికి ఏది ప్రేరణ కలిగిస్తుందో ఆయన బాగా అర్థం చేసుకున్నారు. ‘మీరు మీ పిల్లలు తెలివైన వారిగా ఉండాలని కోరుకుంటున్నట్లయితే, జానపద సాహస గాథలు చదివి వినిపించండి. మీరు వారిని మరింత తెలివైనవారిగా ఉండాలని కోరుకుంటు న్నట్లయితే, వారికి మరింత ఎక్కువ అద్భుత గాథలను చదివి వినిపించండి’. మానవుల గురించిన ఐన్స్టీన్ గ్రహణశక్తి ఎంత లోతైనదో, ఎంత పదునైనదోనని నాకులాగే మీక్కూడా ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగించినట్లయితే– ఆయనకు తనపట్ల తనకు ఉన్న అవగాహన కూడా అంతే సరిసమానంగా పదునుగా ఉంటుందని నేను చెబుతాను. ‘ఒక గొప్ప శాస్త్రవేత్తను రూపొందించేది మేధస్సేనని చాలామంది జనం చెబుతుంటారు. వారి అభిప్రాయం తప్పు. నడవడికే దానికి కారణం’. దీన్నే ఐన్స్టీన్ మరింత స్పష్టంగా చెబుతారు: ‘సహజాతా లనూ, ప్రేరణనూ నేను విశ్వసిస్తాను. ఒక్కోసారి, నాకు కారణం తెలియకుండానే నేను చెప్పినది సరైనది అని భావిస్తుంటాను’. పైగా, ప్రపంచాన్ని అర్థం చేసుకోవ డానికి ఆయన ఊహాశక్తే ఆయనకు అంతర్ దృష్టిని ఇచ్చి ఉంటుందనిపిస్తుంది. ‘నా ఊహాశక్తి ఆధారంగా స్వేచ్ఛగా చిత్రించే కళాకారుడిగా నేను ఉంటాను. జ్ఞానం కంటే ఊహ ముఖ్యమైనది. జ్ఞానం పరిమితి కలది, ఊహాశక్తి ఈ ప్రపంచాన్ని చుట్టేస్తుంది’. చివరగా, మహాత్మాగాంధీ గురించి ఐన్స్టీన్ ఇలా చెప్పారు: ‘రక్తమాంసాలు కలిగిన ఇలాంటి వ్యక్తి ఒకరు భూమ్మీద నడియాడి ఉంటారనే విషయాన్ని రాబోయే తరాలు నమ్మలేవు’. గాంధీని ఇప్పటికే మర్చిపోతున్న తరుణంలో, అలా మర్చిపోతున్న తరాల్లో మనమే మొదటివాళ్లుగా ఉంటున్నామా? (క్లిక్ చేయండి: బంగారు బాల్యంలో నేర ప్రవృత్తి) - కరణ్ థాపర్ సీనియర్ జర్నలిస్ట్ -
పంచ భూతాధికారి ప్రాణవాయువుపై పర్యవేక్షణ
ఏ తల్లి అయినా తన సంతానాన్ని కేవలం ప్రేమిస్తూ మాత్రమే పెంచలేదు. తన అనురాగంతో పాటు వాళ్లు గనుక తెలియనితనం(అజ్ఞానం)తో తప్పు చేసినా కావాలని ఓ మొండితనంతో తెలిసి తెలిసి (జ్ఞానం) తప్పు చేసినా తప్పక దండించి తీరుతుంది. ఆ దండన కారణంగా సంతానానికి ఏది చేస్తే అది తప్పు అవుతుందో, ఎలా ప్రవర్తిస్తే అది తప్పుకాదో అమ్మ అనురాగానికి పాత్రతని పొందగల ప్రవర్తన అవుతుందో వాళ్లకి అర్థమైపోతుంది. గత భాగంలో పంచభూతాల మీదా ఆధిపత్యం ఉన్న సాయి తన అంతేవాసి (తన వద్దే ఉంటూ సాయినే సర్వస్వంగా భావించేవాడు) అయిన శ్యామాని ఎలా ప్రాణి(వాయువు) పోకుండా రక్షించాడో తెలుసుకున్నాం కదా! పైన చెప్పుకున్న తల్లి ఉదాహరణలో తల్లి అనుగ్రహంతో పాటు ఆగ్రహాన్ని కూడా చూపిస్తుందనుకున్నాం కదా! అదే తీరుగా సాయి కొందరి విషయంలో ప్రాణ (వాయు) రక్షణ చేయడంతో పాటు కొందరిని తన సమక్షంలోనే ప్రాణ(వాయు) త్యాగం చేసేలా కూడా చేశాడు. ఈ విషయాన్ని వింటూనే సాయి కళ్లముందే చచ్చిపోతుంటే కళ్లారా చూస్తూ కూడా మంత్రం వేసి రక్షించకుండా చంపేశాడా? అనుకుంటారు కొందరు. అందుకే పెద్దలంటారు. స్పష్టమగ్రే భవిష్యతి– ఏ విషయమైనా పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆది నుండి తుది దాకా శ్రద్ధతో వినాలి అనీ. అప్పుడే లోవిషయం స్పష్టంగా అవగాహనకి వస్తుందనీను. నేటికాలంలో వారికి ఏదో ఓ కథకి సంబంధించిన నీతి అనే సూచిక పక్కన ఉన్న వాక్యాన్ని చదివేసి – కథలో నీతి ఇదన్నమాట అనుకుంటూ కథని చదవకుండా పెదవి విరిచేసినట్టు, ఓ విషయాన్ని ఓ వాక్యంలో వినేసి ఓ నిర్ణయానికొచ్చేయడం అలవాటైపోయింది. కాబట్టి సాయి సమక్షంలో ఎవరెవరి ప్రాణాలు పోయాయో ఆ సంఘటనలని కూడా తెలుసుకున్న పక్షంలో సాయితత్త్వం మనకి బోధపడి తీరుతుంది. నీ సంగతి చూసుకో! మద్రాసు నుంచి మానససరోవరానికి యాత్రకి బయలుదేరాడు విజయానందుడనే సన్యాసి. తోవలో షిర్డీకి వచ్చాడు. హరిద్వారం నుండి వచ్చిన ఓ స్వామితో మాట్లాడుతుంటే ఆయన మానససరోవర ప్రయాణపు కష్టాలనీ, అక్కడి చలినీ, పైగా అక్కడి భూటాన్ ప్రజలు కావాలని పెట్టే ఇబ్బందుల్నీ వివరించి చెప్పగానే ఈ సన్యాసి మానససరోవర యాత్రకి స్వస్తి చెప్పి బాబా దర్శనం చేద్దామని సాష్టాంగపడ్డాడు సాయి మందిరానికి వెళ్లి. బాబా ఈ విజయానందుడు సాష్టాంగపడుతుండగానే కోపంతో ఇతడో పనికిమాలిన సన్యాసి. అతని సాంగత్యం, సాహచర్యం మనకి మంచిది కాదు. ఇతడ్ని ఎందుకు రానిచ్చారు. పంపించివేయండి అన్నాడు. భక్తులకేమీ అర్థం కాలేదు. విజయానంద సన్యాసి తనని అలా సాయి అవమానించినా ఏ మాత్రం చలించకుండా మందిరంలోనే కూచుని సాయికి భక్తులు జరుపుతున్న అర్చనలని చూస్తూ అలాగే కూచుండిపోయాడు. ఎందుకో తెలియని ఆనందం, ఆకర్షణ బాబా విషయంలో కలిగిన విజయానందుడు షిర్డీని విడువకూడదని నిశ్చయించుకుని రెండు మూడు రోజులు అలాగే ఉండిపోయాడు. బాబా దగ్గరే ఉండిపోవాలనే కోరిక బలంగా కలిగిన విజయానందునికి తల్లి నుండి ఉత్తరం వచ్చింది. ఆమెకి జబ్బు చేసిందని. ఇష్టం లేకున్నా షిర్డీ నుంచి వెళ్లాలంటే బాబా అనుమతిని పొంది వెళ్లాల్సిందేనని భావించిన విజయానందుడు సాయి అనుమతి కోసం ప్రార్థించాడు. సాయి ఆ సన్యాసిని చూస్తూ ‘నువ్వో సన్యాసివా? కేవలం కాషాయవస్త్రాలని ధరించినంత మాత్రాన సన్యాసివి అయిపోయినట్లేనా? నీ తల్లి మీద అంత ప్రేమ ఉండి వెంటనే ఆమెకి సపర్య చేయాలని భావించేవాడివైతే ఎందుకు సన్యాసాన్ని తీసుకున్నావు? భవబంధాలని తెంచుకోవడమంటే ఇదేనా? ఓపిక పట్టి కొన్ని రోజులు ఇక్కడే ఉండు! అయినా ముందు నీ సంగతి చూసుకో! (ఈ వాక్యం మరాఠాభాషలో ఉన్న ‘ఓవీ’ల్లో ఉంది) ఇక్కడ దొంగలున్నారు. తలుపు గడియ వేసుకో! ధనం, అధికారం... వంటివన్నీ నిత్యం కాదు. శ్రీహరి చరణాలని పట్టుకో! శాశ్వత సుఖమైన మోక్షాన్ని పొందగలవు. నీ పూర్వ పుణ్యం ఎక్కువైన కారణంగా ఈ పవిత్ర స్థలానికి, నిత్యం దైవభక్తిపరులే ఉండే ప్రదేశానికి రాగలిగావు. మిగిలిన కోరికలన్నింటినీ వీడి.. రేపటి నుండి భాగవత పారాయణాన్ని చేస్తూ ఉండు. ఇదిగో! శ్రద్ధగా విను! ఒక్కో వారం రోజులకి ఓ మారు పారాయణంచొప్పున చేస్తూ మూడు సప్తాహాలని (ఏడు రోజులు) చేస్తే భగవంతుడు ఆనందపడి నీకున్న విచారాలని పోగొడతాడు. నీకు చెప్పలేని శాంతి లభిస్తుంది’’ అన్నాడు.ఈ మాటల్ని వింటూన్న అందరికీ కూడా తల్లి జబ్బు గురించి ఆత్మసిద్ధినీ సాక్షాత్కారాన్ని గురించి ఆలోచించనివాడూ ఆలోచించుకోనివాడూ సన్యాసి ఎందుకు అవుతాడనే తీరు ఆలోచనలే కలిగాయి. లోఅర్థం అది కాదు. బాబా మాటలలో అర్థం బాబాకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసనేది అనేక సందర్భాల్లో మనం గమనించుకున్నాం. గోవా నుండి భక్తులొస్తే వాళ్లకి జరిగిన విశేషాలని చెప్పి 15 రూపాయలే దక్షిణగా తీసుకోవడం ద్వారా భూతకాల విశేషాలని బాబా గ్రహించగలడని అర్థం చేసుకున్నాం. చాంద్పాటిల్ గుర్రం ఎక్కడుందో చెప్పగలగడం ద్వారా వర్తమానం బాబాకి తెలుసనే విశేషాన్ని గ్రహించగలిగాం. ఇంతకు ముందనుకున్న శ్యామాకి జరిగిన పాముకాటు సంఘటన ద్వారా శ్యామాకి మరణకాలం కాలేదని తెలుసుకున్న సాయి అతనికి ఏం చేయాలో చెప్పి బ్రతికించడాన్ని స్పష్టంగా చూసి, శ్యామా మరణం ఇప్పుడు కాదనే భవిష్యత్ కాల విశేషాన్ని బాబా గ్రహించగలిగాడని సాక్ష్యపూర్వకంగా దర్శించుకున్నాం కదా! అదే తీరులో బాబా ఈ వచ్చిన విజయానందుడ్ని చూశాడు. అతనికి సంబంధించిన భూత భవిష్యత్ వర్తమానాల మూటనీ తన లోదృష్టితో పరిశీలించాడు. మానససరోవరానికి యాత్రకంటూ బయలుదేరిన సన్యాసి తన ప్రయాణమధ్యంలో ఎవరో ఒక సన్యాసి చెప్పిన మాటల్ని విని మానససరోవరయాత్రని మానుకున్నాడని అర్థమయింది బాబాకి. ‘సన్యాసమంటేనే కష్టానికి సిద్ధపడి ఉండాల్సిన పదవి’ కదా! మరి తాను తట్టుకోగలిగి వెళ్లగలుగుతాననకుండా మానుకోవడం ద్వారా సరైన సన్యాసి కాదని అర్థమైంది సాయికి. అందుకే విజయానందస్వామి తనకి సాష్టాంగపడగానే ఈ పనికిమాలిన స్వామిని ఎందుకిక్కడికి రప్పించారు? రానిచ్చారు? ఇతని సాహచర్యం, సాంగత్యం ద్వారా స్థిర బుద్ధి ఉన్న మన భక్తులు కూడా చంచల స్వభావులుగా అయిపోతారంటూ సన్యాసి సమక్షంలోనే మాట్లాడాడు. ఇందులో తప్పు పట్టుకోవాల్సిందేముంది? ఈ లోతు అర్థం కాని కొందరు భక్తులు సాయి మాటలని మరోలా అనుకుని ఉండచ్చు. లోఅర్థం తెలియని స్థాయిలో ఉన్నవాళ్లు మాత్రం సాయి ఇలా అంటున్నాడంటే ఏదో చెప్పలేని విశేషం ఉండి ఉండవచ్చని అర్థం చేసుకున్నారు. ఆ విశేషం ఇదన్నమాట. కాబట్టి విజయానందుని భూతకాల పరిస్థితి అది! ఇక వర్తమానపరిస్థితిని చూస్తే... సన్యాసి అయ్యుండీ తన తల్లి నుండి ఉత్తరం రాగానే, వెంటనే బయలుదేరి మద్రాసు వెళ్తానంటూ అనుమతిని ప్రార్థించే స్థాయిలో ఉన్నాడు ఈ సన్యాసి. ఇది కూడా సన్యాస« ధర్మవిరుద్ధమే కదా! అందుకే తల్లి గురించి ఆలోచించే నీకు భవబంధవిముక్తి ఏమైంది? ఏముందంటూ బహిరంగంగానే మాట్లాడాడు సాయి. దీంతో సాయిని ఎదుటివ్యక్తి భూతమూ వర్తమానమూ కూడా తెలిశాయనే విషయం తెలుస్తోందిగా! ఇక విజయానందుని భవిష్యత్కాలాన్ని కూడా సాయి గమనించాడు తన లోదృష్టితో. ఆశ్చర్యమనిపించింది సాయికి. ఎందుకంటే.. విజయానందునికి సరిగా ఆ రోజునుండి 3“7 (మూడు సప్తాహాలు అంటే 21 రోజులు) రోజుల్లో ఏనాడైనా మరణించవలసిన.. అంటే తన ప్రాణవాయువుని త్యాగం(విడిచివేయవలసిన) అవసరముందని గ్రహించాడు సాయి. అందుకే తల్లి వద్దకి పోవద్దని ఇటు సన్యాసధర్మం ప్రకారం చెప్తున్నట్టుగా పైకి చెప్తూ, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడాన్ని చూసుకోవాలనే ధర్మబోధని చేస్తున్నట్లుగా లోవిశేషంతో ఉపదేశిస్తూ.. నీ సంగతి చూసుకో! అన్నాడు సాయి. ఇది నిజంకాని పక్షంలో ‘న మాతుఃపరదైవతమ్ – అన్నారు కాబట్టి, తల్లికంటె మరో దైవమే లేదని ధర్మశాస్త్రం చెప్తోంది కాబట్టీ ఆ తల్లి వద్దకి పోవద్దని చెప్పిన సాయి అధర్మపరుడు అయ్యుండేవాడు కాడూ? రుషులూ సిద్ధులూ సద్గురువులూ అలాగే నేటికాలంలోనైతే పెద్దలూ అనుభవజ్ఞులూ వృద్ధులూ సరైన మార్గాన్నే ఉపదేశిస్తారు. ఎక్కడైనా జరగరానిది జరిగే పరిస్థితి గాని వాళ్లకి గోచరిస్తే ఆ విషయాన్ని కుండ పగలగొట్టినట్టుగా చెప్పకుండా వాళ్లకి మాత్రమే అవగాహనతో అర్థమయ్యే తీరులో నర్మగర్భంగా చెప్తారు. ఆ లోఅర్థం తెలియని పక్షంలో సూటిగా చెప్తారు తప్ప ముందే సూటిగా చెప్పి ఆందోళనకీ భయభ్రాంతులకీ గురిచేయరు. ఈ నేపథ్యంలో సాయి ఆ విజయానందుని అవశ్యమరణం(తప్పక మరణించవలసిన పరిస్థితి) గమనించి తాను మరణాన్ని వాయిదా వేయించగలశక్తి (శ్యామా విషయం లోలాగా) కలవాడే అయినా ఆ పనిని చేయలేదు. దానికి కారణం అతనికి రాబోయే మరణం దైవనిశ్చితం అయ్యుండటమే. సాయి ఎంత గొప్పవాడంటే తాను నిత్యం మననం చేస్తూండే ‘అల్లాహ్ హో మాలిక్!’ మంత్రాన్ని మననం చేస్తూ ఉండవలసిందని ఆజ్ఞాపించకుండా, శ్రీహరి చరణాలని ఆశ్రయించు. అందుకే భాగవతాన్ని 7 రోజుల్లో (ఆ పరీక్షిస్మహారాజులాగా) పారాయణాన్ని పూర్తి చేస్తూ 3 వారాల పాటు కొనసాగించవలసిందన్నాడు కూడా. అలా కాక 21 రోజుల్లో భాగవతాన్ని పూర్తి చేయవలసిందనిగాని సాయి ఆజ్ఞాపించి ఉంటే దురదృష్టవశాత్తూ ఏ 16వ రోజునో అతడు గాని మరణిస్తే ఇటు భాగవత పారాయణం ముగిసి ఉండేది కాదు. అతని మరణానికి ముందు సరైన మార్గదర్శనాన్ని తాను చేసినట్లు అయ్యుండేదీ కాదు. ఇంత ఆలోచించి సాయి చెప్పాడు విజయానందునికి భగవత పారాయణం చేయవలసిందని. సాయినోటి నుంచి వచ్చిన ఆ వాక్యాలు విజయానందునికి ఆజ్ఞలుగా తోచాయి. కర్తవ్యాలుగా అనిపించాయి. అంతే! ఆ మరురోజునుండే పారాయణాన్ని ప్రారంభించదలిచి ఉదయం స్నానాన్ని ముగించి లెండీ తోటకి వెళ్లి ఏకాంతంగా కూచుని భాగవతగ్రంథాన్ని తెరిచాడు. తీవ్రమైన ఏకాగ్రతతో రెండు రోజుల పాటు పారాయణాన్ని చేసి తీవ్రంగా అలసిపోయాడు. మళ్లీ మందిరానికొచ్చి ఆ మందిరం పక్కనే భక్తులందరూ వచ్చి కూర్చునే ‘వాడా’కి వచ్చి విశ్రాంతికోసం మరో రెండురోజులున్నాడు. మూడవ రోజున మళ్లీ పారాయణం చేద్దామనుకుంటూ తన పక్కనే కూచున్న ‘బడేబాబా’ అనే ఆయన తొడమీదికి ఒరిగిలపడి అక్కడే అప్పుడే ప్రాణాలని విడిచాడు.మరి ప్రాణవాయువు తన అధీనంలో ఉన్న సాయి ఇతడ్ని బతికించలేకపోవడానికి కారణం పైన అనుకున్నతీరుగా ఆయన మరణం దైవనిర్ణయమని సాయికి ముందుగానే తెలిసి ఉండటం. నిజంగా తన తల్లి నుండి ఉత్తరం వచ్చింది కాబట్టి ఈ విజయానందునికే సాయి అనుమతిని ఇచ్చి వెళ్లవలసిందన్నట్లయితే ఆ సన్యాసి శీఘ్రప్రయాణ సౌకర్యాలులేని ఆ కాలంలో ఏ మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచి ఉండేవాడు. ఇటు సాయి దర్శనానికీ, అటు తల్లి దర్శనానికీ కూడా నోచుకోగలిగి ఉండేవాడే కాకపోయేవాడు. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరమ్! యం ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ‘ఎవరైతే మరణించబోతున్న కాలంలో భగవంతుడైన తనని స్మరిస్తూ శరీరంలోని ప్రాణాలని విడుస్తూ శరీరంలోని చైతన్యాన్ని కోల్పోతారో వాళ్లు తనలో ఐక్యమవుతారంటూ ఏ శ్రీకృష్ణుడు తన గీతా ఉపదేశంలో చెప్పాడో, దానికి అనుగుణంగా ఈ విజయానంద సన్యాసి తల్లి దర్శనానికై ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో ప్రాణత్యాగం చేయడం కాకుండా, పవిత్రషిర్డీ ప్రదేశంలో, భక్తి భావం మాత్రమే కల సాయి భక్తుల సమక్షంలో మరణించగలిగాడు. అలా అంత్యకాలంలో భగవత్ స్మరణ చేస్తూ ప్రాణత్యాగాన్ని చేయగల సహాయాన్ని ఆ సన్యాసికి చేశాడు సాయి. సాయి తన తొలిమాటలలో ఈ సన్యాసితో వాడాలో ఎందరో దొంగలున్నారు, తలుపులకి గడియవేసుకోవలసిందని కూడా సూచించాడు. సాయి సంస్థానంలో కూడా దొంగలుగా భక్తులు ఉన్నట్లయితే ఇక ఆ సమాధి మందిరానికి పవిత్రత ఎక్కడున్నట్లు? భక్తుల్లో సత్ప్రవర్తన ఎక్కడున్నట్లు? అనిపిస్తుంది మనకి. సాయి మాట్లాడిన ‘దొంగలున్నారు–గడియవేసుకోవలసిందనే మాటలకి అర్థం ఉంది.వాడా అంటే ఈ శరీరమనీ, దానిలో దొంగలున్నారంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే పేర్లున్న ఆరుగురు దొంగలు ఉన్నారనీ, వాళ్లు అజాగ్రత్తగా ఉన్నవారి సంపదనంతా దోచుకుని పారిపోతారనీ ఆ మాటలకర్థం. కాబట్టి సాయి అతనిని ప్రాణ (వాయు) త్యాగం చేసేలా చేసి, అంత్యకాలంలో భగవత్స్మరణ ద్వారా మోక్షాన్ని కూడా ఇప్పించాడని చెప్పితీరాలి. ప్రాణ(వాయు)త్యాగం ఇక బాబా మరోవారం రోజులకి సమాధి అవుతారనగా కొందరు గ్రామస్థులు ఒక పులిని ఒక నాటుబండిలో బంధించి, సాయి దర్శనం కారణంగా దాన్ని జీవింపజేయాలనుకుని తెచ్చారు సాయి సమ్ముఖానికి. ఆ పులిని ఇలాగే ఒక బందిఖానా వంటి ఊచలున్న ఓ బోనులో బంధించి ఊరూరా దాన్ని తిప్పుతూ దానిమీద వచ్చే సొమ్ముతో జీవనాన్ని చేసుకుంటూ ఉండేవారు ఆ మనుష్యులు. బాగా వృద్ధాప్యం వచ్చి ఉండటం, అదీకాక ఆ పులి జబ్బుపడి ఉండటం, దాంతో ఏం చేయాలో తోచని స్థితితో పులి ముందుకీ వెనక్కీ వడివడిగా అడుగులేస్తూ అక్కడే తిరుగుతూ ఉండటం, బోను తలుపుగాని తీస్తే మీదపడి ఎందరి ప్రాణాలని తీస్తుందో లెక్కించలేని తనంతో జనం ఉండటం కారణంగా ఆ పులిని సాయి దర్శనానికంటూ తెచ్చారు. దీనిమీద మీరు సొమ్మును సంపాదించుకుంటూ దానికి ఏ మాత్రపు ఆరోగ్యపరిరక్షణనీ చేయకుండా దాదాపు విడిచేసినట్లున్నారే? అని సాయి మందలించాడు ఆ అంగడివాడ్ని. సాయికి పులిని చూపించే ఉద్దేశ్యంతో గొలుసులతో కట్టిఉంచిన ఆ పులిని సాయి ఎదురుగా ఉంచారు. పైకి బాగా కనిపిస్తున్నా దానికి మాత్రం జబ్బు ముదిరిన కారణంగా సాయి తానే ఆజ్ఞ చేశాడు పులిని తేవలసిందని. బాబాముఖ కాంతికీ తేజస్సుకీ తట్టుకోలేని పులి తనలోని చైతన్యాన్ని కోల్పోయి తలవంచి తెలివి తప్పి నేలమీద పడిపోయింది. సాయి ముఖాన్నే చూస్తూ తన తోకతో నేలని ముమ్మారు కొట్టి అంతలోనే ప్రాణ(వాయు)త్యాగం చేసింది పులి. ప్రాణవాయువుని తన అధీనంలో ఉంచుకున్న సాయి ఆ పులిని రక్షించలేకపోవడానికి కారణం... దానికి దైవాజ్ఞ ప్రకారం మరణం సిద్ధంగా ఉండి ఉండటమే. ఆ పులి తన పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం కారణంగా సాయిని చూస్తూ మరణించాల్సి ఉంది. అదే జరిగింది కూడా!యోగులూ సిద్ధులూ అయిన వారిని దర్శిస్తూ ఆ తన ప్రాణాలని విడిచినవాడు ఎంతటి ధర్మబద్ధుడో తెలియజేయడానికి సాక్ష్యం పులి. ఇంత శక్తిగల సాయి ప్రాణవాయువు తర్వాత అపానమనే వాయువు మీద ఎలా ఆధిపత్యాన్ని కలిగినవాడు అయ్యాడో తెలుసుకుందాం! – సశేషం. - డా. మైలవరపు శ్రీనివాసరావు -
ఆడుతూ పాడుతూనే అనుగ్రహిస్తాడు!
గురువుల్లో సద్గురువు సాయినాథుడు. గురుశిష్య సంబంధం, పరమేశ్వరుడికి, పరమభక్తుడికి నడుమ అనుబంధం లాంటిదని అడుగడుగునా సాయివాణిని వినిపించారు. గురువుపైనే చిత్తాన్ని, ఏకాగ్రతను చూపితే పరమార్థం సులువుగా బోధపడుతుందని విడమరచి చెప్పారు. చిత్తశాంతికి, వెలుగుదారిలో బతుకు పయనం సాగడానికి అంతకు మించిన మార్గం లేదని జీవనతత్వం బోధించారు. గురుహృదయాన్ని పసిగట్టి, దానినాయన ఆజ్ఞాపించడానికి పూర్వమే నెరవేర్చడం ఉత్తమ శిష్యుల లక్షణం. ఆయన తరచు ‘‘రాముడు, రహీము ఒక్కడే! ఏ మాత్రం తేడాలేదు. మరిక వారి భక్తులు ఎందుకు విడిపోయి పోట్లాడుకోవటం, అందరూ కలసి జాతీయ సమైక్యత సాధించండి’’ అని చెప్పేవారు. అంతేకాదు, సామాజిక సమస్యలకు సమాధానం చెప్పారు. అనేకమైన లౌకిక బాధలకు పరిష్కార మార్గం చూపారు. ఒక ఫకీరుగా, పరమయోగిగా, నిరంతర ఆత్మానుసంధానంలో మునిగి ఉండే బాబా... తన భక్తుల కోసం – మానవాళికోసం వారిలో ఒకరిగా జీవించారు. ఆడారు, పాడారు, కష్టాలు, కన్నీళ్లలో సహానుభూతిని ప్రదర్శించారు. తనవైన లీలలతో కాపాడారు. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. గురువులు మానవరూపంలో అవతరించేది మనుష్యులను ఉద్ధరించేందుకే. అందువల్ల అతని అసలయిన నిర్గుణ స్వభావం కొంచెం కూడా చెడి పోదు. వారి దాక్షిణ్యం, దైవికశక్తి, జ్ఞానం ఏమాత్రం తరగదు. శిష్యుడు కూడా అటువంటి స్వరూపం కలవాడే. అనేక జన్మల అజ్ఞానం తానే శుద్ధ చైతన్యమనే సంగతిని మరుగున పడేలా చేస్తుంది. అతను తనను తాను ‘నేను సామాన్య నికృష్ట జీవుడను’ అని అనుకుంటాడు. గురువు శిష్యుడిలోని ఆ అజ్ఞానాన్ని మూలంతో సహా తీసివేయాలి. తగిన ఉపదేశాన్ని ఇవ్వాలి. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానాన్ని గురువు నిర్మూలించి ఉపదేశించాలి. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడననుకొనే శిష్యుణ్ణి గురువు కొన్ని వందల జన్మల వరకు నీవే దైవం, ‘నీవే సర్వశక్తి మంతుడివి’ అని బోధిస్తాడు. అప్పుడు శిష్యుడు కొద్దికొద్దిగా తానే దైవమని గ్రహిస్తాడు. తాను శరీరమనే భ్రమను, తానొక జీవినని లేదా అహంకారమని, అనేక జన్మల నుంచి వస్తున్న దోషం దానిపై ఆధారపడి చేసిన పనుల నుండి సంతోషం, విచారం, ఈ రెండింటి మిశ్రమం కలుగుతుంది. -
మనసును మంచి భావాలతోనే నింపుకోవాలి
ఆత్మీయం మనం చేసే కర్మ చెడుదా లేదా మంచిదా అన్నది నిశ్చయించేది అది చేయడానికి వెన క గల భావనే అని మన సనాతన ధర్మం స్పష్టం చేస్తోంది. చూడడానికి బయటికి చెడుకర్మగా కనిపించినా, ఒక్కోసారి అది భావనని బట్టి సుకర్మ కావచ్చు. మనిషికి కర్మ చేయడానికి వెనక గల భావనని బట్టే అతనికి ఆ కర్మ తాలూకు ఫలితం లభిస్తుంది. మన భావనలన్నింటిని గ్రహించే దేవుడికి అందుకే భావగ్రాహి అనే పేరు రుషులు పెట్టారు. ఇందుకే సద్భావాన్ని ప్రసాదించమని ఒక్క హిందూమతంలోనే ప్రార్థిస్తారు. కర్మ కీలకం తెలిసిన రుషులు మా కళ్లు ఎప్పుడూ మంచినే చూచుగాక, మా చెవులు ఎప్పుడూ మంచినే వినుగాక, మా నాలుక ఎప్పుడూ మంచినే రుచి చూడుగాక అని ప్రార్థిస్తారు. మన మనసుని సద్భావాలతో నింపుకుంటే– సత్కర్మలని, దుష్టభావాలతో నింపుకుంటే దుష్కర్మలని చేస్తాం. ఆశాపరుడు అత్యంత దుష్టుడు. ఎందుకంటే ఆశపడేవాడి మనసు నిండా చెడుభావాలే ఉంటాయి. వారు చేసిన దుష్కర్మలే సరైన సమయంలో వారికి తగిన ఫలితాలనిస్తాయి. ఒకవేళ పూర్వజన్మలో వారు చేసిన సుకర్మలు ఈ జన్మలో అనుభవించాల్సిన అవసరం ఉంటే, అప్పుడు ఈ దుష్కర్మల ఫలితానుభవానికి పాత శుభకర్మల ఫలితానుభవం అడ్డుపడడంతో, అవి పై జన్మలకి వాయిదాపడి వచ్చే జన్మల్లో వారు దుర్భర కష్టాలు పడవచ్చు. కర్మ పని చేసే తీరు విషయంలో అజ్ఞానం గల సామాన్య ప్రజ ‘దుష్టులకే సుఖాలెందుకు? మంచివాళ్లకి కష్టాలెందుకు?’ అని ఆవేశంగా ఆలోచిస్తారు. దేవుడి మీద, కర్మ మీద నమ్మకాన్ని కోల్పోతారు. మనంచేసే ప్రతికర్మకి మనం జవాబుదారీ అన్న విశ్వాసం కలిగి ఉంటే చెడు చేయడానికి భయపడతారు. సమాజాన్ని దోపిడీ చేసేవారు కర్మ విషయంలో పూర్తిగా అజ్ఞానులు కాబట్టే, నిర్భయంగా చెడు పనులు చేస్తూ భవిష్యత్ జన్మలని అంధకార బంధురం చేసుకుని తమకి తాము అన్యాయం చేసుకుంటున్నారు. -
సత్యం పలికేవానికి అన్నీ సాధ్యమే
శ్లోకనీతి భాగవత పద్యం-7 మానవేంద్ర! సత్యమతికి దుష్కరమెయ్యదెరుక కలుగు వాని కిష్టమెయ్య దీశ భక్తిరతునికీరాని దెయ్యది యెరుక లేనివానికేది కీడు వ్యాఖ్యాన భావం... పరీక్షిన్మహారాజా! సత్యం పలికేవానికి అసాధ్యమనేదే ఉండదు. వానికి అన్నీ సాధ్యమే. యుక్తాయుక్త విచక్షణ కలవానికి ‘ఇది ఇష్టము - ఇది అనిష్టము’ అనే భేద భావం ఉండదు. స్థిరబుద్ధితో ఉంటారు. భగవద్భక్తుడు ఈయరానిదంటూ ఏదీ ఉండదు. (సర్వస్వాన్నీ త్యాగం చేస్తాడు). అజ్ఞానికి ‘ఇది మేలు - ఇది కీడు’ అనే జ్ఞానమే ఉండదు కదా! తనకు తోచిన విధంగా ప్రవర్తిస్తాడు. ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనే ఇంగితజ్ఞానం వానికి ఉండదు. అంటూ వసుదేవుడు సమయస్ఫూర్తిని ఉపయోగించి కంసునితో పలుకుతూ, తన మాటపై నిలిచి కొడుకును అప్పగించాడు. వసుదేవుని స్థిరబుద్ధికి కంసుడు ఎంతో సంబరపడి, ప్రశంసించాడు. ఆపదలు కలిగినప్పుడు ఆ ఆపద నుండి బయటపడటానికి ప్రయత్నించాలి. స్థిరచిత్తంతో సదాలోచన చేయాలి. వసుదేవుడు ఎంతో చాకచక్యంగా కంసునితో ప్రవర్తించాడు.... అని శుకయోగీంద్రుడు పరీక్షిన్మహారాజుకి బోధించాడు. - డా. పురాణపండ వైజయంతి -
దేవుణ్ణి తప్ప ఆత్మ దేనినీ చూడదు
అజ్ఞానం అనే ఇనుప తలుపులు మన కళ్ళను మూసేస్తాయి. కానీ ప్రేమ ఆ తలుపులను తెరుస్తుంది. తలుపు తెరిచే శబ్దం నిద్రపోతున్న సుందరాంగిని మేల్కొల్పుతుంది. జ్ఞానప్రపంచంలో తలుపులు మూసి ఉండవు. వాటిని తట్టవలసిన అవసరం ఉండదు. అవి తెరిచే ఉంటాయి. ఒక జ్ఞాని దగ్గరకు ఒకతను వచ్చి ‘‘నేను దేవుడిని చూడటం సాధ్యమేనా?’’ అని అడిగాడు. ‘‘అనుమానం ఎందుకు? నిక్షేపంగా చూడవచ్చు’’ అన్నాడు జ్ఞాని. ‘‘కానీ నేను చూడలేకపోతున్నాను స్వామీ’’ అని బాధపడ్డాడు. ‘‘ఏం ఫరవాలేదు. నువ్వు చూడగలవు. కానీ నీ కళ్ళు ప్రస్తుతం మూసుకుపోయి ఉన్నాయి. కళ్ళు తెరు. దేవుడు అంతటా ఉన్నాడు’’ అన్నాడు జ్ఞాని. ఆ జ్ఞాని చెప్పింది అక్షరాలా నిజం. మనం హృదయనేత్రాలు విప్పార్చి చూస్తే... దేవుడు ప్రతి పువ్వులోనూ ఉన్నాడు. నవ్వుతున్నాడు కూడా. ఒక్కొక్క సూర్యకిరణంతో వచ్చి ‘క్షేమమేగా’ అని పలకరిస్తుంటాడు కూడా. రాత్రి పూట నక్షత్రాలనే అక్షరాలుగా చేసుకుని ఉత్తరం కూడా రాస్తుంటాడు. మెరుపుతో సంతక ం చేస్తాడు. కోకిల అతని వేణువై ఉంది. కానీ మనమే అతనిని చూడలేకపోతున్నాం. వినలేకపోతున్నాం. ఇక్కడ అజ్ఞాన ం అడ్డుగోడై ఉంది. అయితే ఈ అడ్డుగోడను తొలగించడం ఎలా? ‘జ్ఞానమే ఈ గోడను తొలగించాలి’ అని అందరూ చెప్పేదే. కానీ కబీర్ మాత్రం ‘ప్రేమతోనే ఈ అడ్డుగోడను తొలగించవచ్చు’ అంటాడు. అజ్ఞానం అనే ఇనుప తలుపులు మన కళ్ళను మూసేస్తాయి. కానీ ప్రేమ ఆ తలుపులను తెరుస్తుంది. నిద్రపోతున్న సుందరాంగిని మేల్కొల్పుతుంది. జ్ఞానప్రపంచంలో తలుపులు మూసి ఉండవు. వాటిని తట్టవలసిన అవసరం ఉండదు. అవి తెరిచే ఉంటాయి. అజ్ఞానమే ఆ తలుపును మూస్తోంది. అజ్ఞానానికి మూయడమే తెలుసు. దాని పనే అది. తలుపును మూసేసి దేవుడి దర్శనం కలగడం లేదని బాధపడటం సబబు కాదు. అయితే ఆ తలుపును ప్రేమ తెరుస్తుంది. ప్రేమ ఒక తాళంచెవి వంటిది. అది అన్ని తలుపులను తెరుస్తుంది. ప్రేమించి చూస్తే అదేంటో తెలుస్తుంది. తలుపులు తెరిచే శబ్దం వినిపిస్తుంది. అప్పటిదాకా చూడనిది కనిపిస్తుంది. నిజానికి తలుపై అడ్డుగోడలా ఉన్నది మన అహంకారమే. తనకొక్కడికే అన్నీ తెలుసు అనే అహంకారాన్ని పెంచుతుంది. అప్పుడు తలుపు తెరచుకోదు. అంతేకాదు, తాళమూ వేస్తుంది. అయితే ఈ తలుపును ప్రేమ తెరుస్తుంది. ఎందుకంటే ప్రేమ అహంకారాన్ని రూపుమాపుతుంది. ప్రేమ అనేది ఒక అమ్మాయిని ప్రేమించడం మాత్రమే కాదు. ఎవరు ఎవరినైనా ప్రేమించవచ్చు. ఇష్టమున్న వారినే కాదు పగవారిని సైతం ప్రేమించవచ్చు. ప్రేమనేది తనను తాను మరచిపోవడం. తనను అర్పించుకోవడం. అది అహంకారాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. అందుకే కబీర్ ‘ప్రేమ తలుపులు తెరుస్తుంది’ అన్నాడు. అంతేకాదు, తలుపు తెరిచే శబ్దం నిద్రపోతున్న సుందరిని మేల్కొల్పుతుంది. ఇంతకూ ఈ సుందరి ఎవరు? అది మన ఆత్మే. అది మనలో నిద్రపోతున్నది. ప్రేమే దానిని మేల్కొల్పే సుప్రభాతం. ఓ దే శంలో ‘నిద్రపోతున్న యువరాణి’ అని ఒక రాజకుమారి కథ ఉంది. అందులో ఒక దేవత శాపం వల్ల యువరాణి నిద్రపోతుంది. దాంతో అందరూ నిద్రపోతారు. యావత్ దేశం నిద్రావస్థలో ఉంటుంది. మరో దేశపు యువరాజు అక్కడికి వస్తాడు. యువరాణి పెదవులపై ముద్దు పెడతాడు. యువరాణి మేల్కొంటుంది. దేశమూ నిద్రావస్థ నుంచి లేస్తుంది. ఇది కూడా ఒక జ్ఞానకథనమే. ఆత్మే నిద్రపోతున్న యువరాణి. ప్రేమే యువరాజు ముద్దు. ఆత్మ మేల్కొంటే మనలో అన్నీ నిద్రావస్థ నుంచి లేచి చైతన్యవంతమవుతాయి. కనులు తెరచుకుంటాయి. మన కళ్ళు దేవుడిని తప్ప మిగిలిన అన్నింటినీ చూస్తుంటాయి. ఆత్మ దేవుడిని తప్ప మరేదీ చూడదు. - యామిజాల జగదీశ్