Infrastructure status
-
ఐటీ శ్లాబ్స్ హేతుబద్ధీకరించాలి..
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిసెంబర్ 15 నుంచి 21వ తేదీ వరకూ వివిధ వర్గాలతో జరిపిన 2022–23 బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) శ్లాబ్‌ల హేతుబద్దీకరణ నుంచి డిజిటల్ సేవలకు మౌలిక రంగం హోదా కల్పన వరకూ వివిధ వినతులు అందాయి. ఆర్థికశాఖ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. హైడ్రోజన్ నిల్వకు ప్రోత్సాహకాలు, ఫ్యూయెల్ సెల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి, ఆన్లైన్ రక్షణ చర్యలపై పెట్టుబడుల వంటి అంశాలూ పారిశ్రామిక వర్గాల విజ్ఞప్తుల్లో ఉన్నట్లు ప్రకటన వెల్లడించింది. ప్రకటనలోని ముఖ్యాంశాలు.. ► డిసెంబర్ 15 నుంచి 21వ తేదీ వరకూ వర్చువల్‌గా జరిగిన ఎనిమిది సమావేశాలలో ఏడు రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 120 మందికి ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో వ్యవసాయం–వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమ–మౌలిక సదుపాయాలు, వాతావరణ మార్పు, ఆర్థిక రంగం–మూలధన మార్కెట్లు, సేవలు–వాణిజ్యం, సామాజిక రంగం, కార్మిక సంఘాలకు చెందిన ప్రతినిధులుసహా పలువురు ఆర్థిక వేత్తలు ఉన్నారు. ► ప్రధాని నరేంద్ర మోడీ 2.0 ప్రభుత్వానికి అలాగే సీతారామన్‌కు నాల్గవ బడ్జెట్. కోవిడ్–19 మహమ్మారి దెబ్బకు కుదేలయిన భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటున్న నేపథ్యంలో రూపొందుతున్న బడ్జెట్ ఇది. ► ఈ ఆర్థిక సంవత్సరం 8.3–10% వరకూ వృద్ధి ఉండొచ్చని అంచనా. ఆర్బీఐ అంచనాలు 9.5%. ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు అంచనా (జీడీపీలో) 6.8%గా ఉంది. 2021–22కి వివిధ వర్గాల అంచనా 7–7.5 శాతం వరకూ ఉంది. -
రియల్టీకి మౌలిక రంగ హోదా ఇవ్వండి!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై దేశీయ డెవలపర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి మౌలిక రంగ హోదాను ఈ బడ్జెట్లో ప్రకటిస్తారని డెవలపర్ల సంఘాలు ధీమావ్యక్తం చేస్తున్నాయి. ప్రాపర్టీలకు డిమాండ్ పెంచేలా, కొనుగోలుదారులకు, డెవలపర్లకు పన్ను మినహాయింపులు ఉండేలా ఈ బడ్జెట్ ఉంటుందని ఆశాభావంవ్యక్తం చేశారు. సింగిల్ విండో ద్వారా ప్రాజెక్ట్‌ల అనుమతులు, లిక్విడిటీని పెంచే చర్యలతో పాటు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) లభ్యత వంటివి ఆశిస్తున్నట్లు టాటా రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ అండ్ సీఈఓ సంజయ్ దత్ తెలిపారు. రియల్టీ రంగ వృద్ధి రాబోయే ఆర్ధిక సవరణల మీద ఆధారపడి ఉందని, ప్రాజెక్ట్‌లు వేగవంతంగా పూర్తి చేయడానికి ఒకే విండో క్లియరెన్స్ యంత్రాంగాన్ని మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఒకటే స్టాంప్ డ్యూటీ లేదా అన్ని రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చార్జీల తగ్గింపు వంటి సిఫారసులను చేపట్టాలని, దీంతో ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గి గృహ కొనుగోలుదారులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తారని వివరించారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలను జీఎస్టీ పరిధిలోకే తీసుకురావాలని గౌర్స్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ మనోజ్ గౌర్ తెలిపారు. ఐటీ చట్టం, 1961లోని 80సీ కింద గృహ రుణాల్లో పన్ను మినహాయింపు పరిమితులను పెంచాలని, ప్రాపర్టీ అమ్మకం మీద దీర్ఘకాలిక పన్నుల్లో సంస్కరణలు చేపట్టాలని, నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీల మీద జీఎస్టీని హేతుబద్దం చేయాలని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ కోరారు. అఫర్డబుల్ మరియు మిడ్–ఇన్‌కం ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి కేటాయించిన ప్రత్యేక ఫండ్ (ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్)ను రూ.25 వేల కోట్లకు పెంచాలని కోరారు. బంగారం రుణ సంస్థలను ప్రోత్సహించాలి వ్యవస్థలో కీలక పాత్రను పోషిస్తున్న తమను ఇతర ఎన్బీఎఫ్సీలతో పోలిస్తే ప్రత్యేకంగా చూడాలని బంగారంపై రుణాలను అందించే ఎన్బీఎఫ్సీలు కేంద్రాన్ని కోరాయి. ‘‘2021–22 బడ్జెట్ నుంచి వృద్ధి అనుకూల విధానాలను ఆశిస్తున్నాము. అప్పుడే రానున్న సంవత్సరాల్లో సామర్థ్యం మేరకు మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందగలదు. గోల్డ్ లోన్ ఎన్బీఎఫ్సీలు ఎంఎస్ఎంఈలు, వ్యక్తులకు వేగంగా రుణ సాయాన్ని అందిస్తున్నాయి. కనుక ఇతర ఎన్‌బీఎఫ్‌సీలకు భిన్నంగా చూడాలి. ఎందుకంటే రూ.1,500 మొత్తాల నుంచి సామాన్యులకు రుణాలను అందిస్తున్నాయి. ఇళ్లలోని బంగారాన్ని మానిటైజ్ చేసి ఆర్థిక వ్యవస్థకు సాయంగా నిలుస్తున్నాయి. కనుక పారదర్శకమైన, వృద్ధికి అనుకూలంగా ఉండే నియంత్రణ పరమైన వాతావరణాన్ని కోరుకుంటున్నాము. అలా చేస్తే కస్టమర్లకు మరింత మెరుగ్గా, వేగంగా సేవలు అందించడానికి వీలు పడుతుంది. బ్యాంకులు, గోల్డ్ ఎన్‌బీఎఫ్‌సీల మధ్య ఎల్టీవీ విషయంలో అంతరాన్ని తొలగించాలి. బ్యాంకుల మాదిరే బంగారం కాయిన్లపై రుణాలకు అనుమతించాలి. ఆర్బీఐ నుంచి శాశ్వత రీఫైనాన్సింగ్ విండో ఉండాలి. అలాగే, వడ్డీపై టీడీఎస్ నుంచి మినహాయింపునివ్వాలి’’ అంటూ ముత్తూట్ ఫైనాన్స్ ఎండీ అలెగ్జాండర్ ముత్తూట్ బడ్జెట్ నుంచి తామేమి ఆశిస్తున్నామో తెలియజేశారు. ద్రవ్యలోటు కాకుండా... వృద్ధే లక్ష్యం కావాలి! ఇండియా రేటింగ్స్ బడ్జెట్ ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు సంబంధించిన నికర వ్యత్యాసం ద్రవ్యలోటు కట్టడిపైన మరీ అంత దృష్టి పెట్టకుండా, ఆర్థిక రివకరీ, వృద్ధిపైనే చర్యలు తీసుకోవాలని ఇండియా రేటింగ్స్ గురువారం విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. ఇండియా రేటింగ్స్ చీఫ్ ఎకనమిస్ట్ దేవేంద్ర పంత్ నివేదికలోని అంశాలను వెల్లడించారు. -
ఇళ్లకు డిమాండ్ కల్పించండి
కేంద్ర బడ్జెట్ 2021–22లో ఇళ్లకు డిమాండ్ సృష్టించే చర్యలకు చోటివ్వాలని రియల్ ఎస్టేట్ రంగం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. వ్యక్తిగత ఆదాయపన్ను ఉపశమనానికి తోడు, ఇళ్ల కొనుగోలుపై పన్ను రాయితీలను ఫిబ్రవరి 1న బడ్జెట్లో భాగంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. అదే విధంగా వడ్డీ రాయితీని కొనసాగించాలని, జీఎస్టీని ఎత్తివేయాలని, రియల్ ఎస్టేట్ పరిశ్రమకు మౌలికరంగ హోదా కల్పించాలని, ఈ రంగానికి నిధుల లభ్యతను సులభతరం చేయాలంటూ క్రెడాయ్ బెంగాల్ శాఖా పలు డిమాండ్లు వినిపించింది. వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో వినియోగించే సిమెంట్ తదితర ముడి సరుకుల కోసం చెల్లించిన జీఎస్టీని అద్దె ఆదాయంలో సర్దుబాటు చేసుకునేందుకు అనుమతించాలని కోరింది. దీనివల్ల ద్వంద్వ పన్నులను నిరోధించడంతోపాటు.. దేశంలో ఆఫీస్ స్థలాలకు డిమాండ్‌ను పెంచినట్టు అవుతుందంటూ పారిశ్రామిక మండలి సీఐఐ సైతం కేంద్రానికి సూచించింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను రియల్ ఎసేŠట్ట్కు తిరస్కరించడం వల్ల డెవలపర్ల నిధులు బ్లాక్ (నిలిచిపోతాయని) అవుతాయని పేర్కొంది. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల ప్రాజెక్టుల పూర్తికి గాను రూ.25,000 కోట్ల నిధుల సాయాన్ని (స్ట్రెస్డ్ ఫండ్) కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆఫర్ చేసిన విషయం గమనార్హం. అలాగే, ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 43(సీఏ) కింద రిజిస్ట్రేషన్, ఒప్పంద విలువ (సర్కిల్)ల మధ్య అంతరాన్ని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. 2021 జూన్ 30 వరకు ఇవి అమలు కానున్నాయి. మద్దతుగా నిలవాలి.. ‘‘మానవ చరిత్రలోనే 2020 ఎంతో అసాధారణమైనది. సాధారణ జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈ మహమ్మారి ప్రవేశించిన నాటి నుంచి రియల్ ఎస్టేట్ పరిశ్రమ తీవ్ర నిధుల సమస్యను, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు 8 శాతం వాటాను అందిస్తున్న రియల్ ఎస్టేట్‌కు రంగాన్ని మరింత పెంచి పోషించాల్సి ఉంది. దాంతో వచ్చే పదేళ్లలో ఈ రంగం పెద్ద ఎత్తున దూసుకుపోతుంది’’ అంటూ క్రెడాయ్ పశ్చిమబెంగాల్ శాఖ ప్రెసిడెంట్ సుశీల్ మెహతా పేర్కొన్నారు. చౌక గృహ రుణంపై చెల్లిస్తున్న వడ్డీలో వార్షికంగా రూ. 2 లక్షల వరకు పన్ను రాయితీ ఉండగా, దీన్ని రూ. 5 లక్షలకు పెంచాలి. ఇంటి రుణంలో అసలుకు చెల్లించే మొత్తాలను సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.5లక్షల వరకు చూపించుకునేందుకు అనుమతిస్తుండగా.. ఇలా సెక్షన్ 80సీ కింద కాకుండా ప్రత్యేకంగా రూ. 1.5లక్షలపై పన్ను ఆదాకు అవకాశమివ్వాలి. వాహనాల విలువ క్షీణతపై ప్రయోజనాలు కావాలి ఆటోమొబైల్ పరిశ్రమ డిమాండ్ వాహనాల వినియోగంతో తరిగిపోయే విలువపై పన్ను ప్రయోజనాలు కల్పించాలంటూ ఆటోమొబైల్ పరిశ్రమ కేందాన్ని కోరింది. మరో వారంలో కేంద్ర ఆర్థిక బడ్జెట్ రానున్న నేపథ్యంలో ఆటోమొబైల్ పరిశ్రమ పలు డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులకు వాహనాల తరిగే విలువను క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించాలని కోరింది. అలాగే, కార్పొరేట్లకు తరుగుదల కాలాన్ని పొడిగించాలని డిమాండ్ చేసింది. వాహన డీలర్లు వార్షికంగా 0.1 శాతం టీసీఎస్ (మూలం వద్దే పన్ను వసూలు)ను పక్కన పెట్టడం అన్నది ఆర్థికంగా వాహన రిటైల్ పరిశ్రమపై ఎంతో భారాన్ని మోపుతుందంటూ, దీన్ని తొలగించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) కోరింది. ఖరీదైన కార్లవైపూ చూడాలి.. మరోవైపు.. ఖరీదైన కార్ల తయారీ సంస్థలు మెర్సిడెస్ బెంజ్, ఆడి, లంబోర్గిని బడ్జెట్లో లగ్జరీ వాహనాలపై పన్నుల భారాన్ని తగ్గించాలని కోరాయి. అధిక పన్నుల కారణంగా ఖరీదైన కార్ల విభాగం వృద్ధి చెందలేకపోతున్నట్టు పేర్కొన్నాయి. ఒకవేళ ఖరీదైన లగ్జరీ శ్రేణి కార్లపై పన్నులను తగ్గించడానికి బదులు పెంచే చర్యలకు వెళితే డిమాండ్‌ను దెబ్బతీయడమే కాకుండా, గతేడాది కరోనా కారణంగా ఏర్పడిన సమస్యల నుంచి కోలుకోకుండా చేసినట్టు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. -
విమానయాన రంగానికి మౌలిక హోదా !
స్పైస్‌జెట్ ఉదంతంతో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వ యోచన న్యూఢిల్లీ: విమానయాన రంగానికి మౌలిక రంగ హోదా కల్పించే విషయమై పౌర విమానయాన శాఖ కసరత్తు చేస్తోంది. గతంలో కింగ్ ఫిషర్, ప్రస్తుతం స్పైస్‌జెట్ సంస్థలు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోవడంతో ఈ దిశగా సదరు శాఖ యోచిస్తోంది. మౌలిక రంగ హోదా కల్పిస్తే తక్కువ వడ్డీరేట్లకే రుణాలు లభిస్తాయని, నిధుల లభ్యత సమస్య తొలుగుతుందని, విమానయాన సంస్థలు ఒడ్డునపడుతాయని ఈ శాఖ ఆలోచన. దీనికి సంబంధించిన ఆర్థిక, పౌర విమానయాన మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. మరోవైపు కష్టాల్లో ఉన్న విమానయాన సంస్థలను ఆదుకోవడానికి పలు చర్యలు తీసుకోవాలని విమానయాన శాఖ ప్రతిపాదిస్తోంది. విదేశీ వాణిజ్య రుణాలు(ఈసీబీ) సమీకరణకు విమానయాన సంస్థలను అనుమతించాలని, కొన్నేళ్లపాటు పన్ను రాయితీలు ఇవ్వాలని, ఈ సంస్థలకిచ్చే రుణాలపై బ్యాంకులు 8 శాతానికి మించి వడ్డీ వసూలు చేయకూడదని, చమరు కంపెనీలకు ఉన్న బకాయిలను రీ షెడ్యూల్ చేయాలని తదితర ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ విషయమై ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక, కంపెనీ మంత్రిత్వ శాఖ అధికారుల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని, త్వరలో నిర్ణయం వెలువడవచ్చని సమాచారం. అజయ్ సింగ్ ఆసక్తి: కాగా స్పైస్‌జెట్ ఒరిజినల్ ప్రమోటర్ అజయ్ సింగ్, పౌర విమానయాన శాఖ కార్యదర్శి వి. సోమసుందరన్‌ను కలవడం పలు ఊహాగానాలకు తెర తీసింది. అంతే కాకుండా ఆయన గురువారం సాయంత్రం పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజును కూడా కలిశారు. దీంతో నాలుగేళ్ల క్రితం స్పైస్‌జెట్ నుంచి వైదొలగిన అజయ్ సింగ్ మళ్ల స్పైస్‌జెట్‌లో ఇన్వెస్ట్ చేయనున్నారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. స్పైస్‌జెట్‌లో మళ్లీ ఇన్వెస్ట్ చేసే విషయమై మాట్లాడటానికి నిరాకరించిన అజయ్ సింగ్ స్పైస్‌జెట్‌కు చాలా సత్తా ఉందని మాత్రం వ్యాఖ్యానించారు. భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలు గురువారం విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో ప్రారంభించినట్లు స్పైస్‌జెట్ ప్రకటించింది. ఆయిల్ కంపెనీలకు చెల్లింపుల్ని కంపెనీ జరపడంతో సర్వీసులు ప్రారంభించడానికి వీలుకలిగింది. అయితే బుధవారం స్పైస్‌జెట్ పూర్తిస్థాయిలో సర్వీసుల్ని నడపలేకపోవడంతో పలువురు ప్రయాణికులు స్పైస్‌జెట్ విమాన టికెట్లను రద్దు చేసుకున్నారు. దీంతో ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-బెంగళూరు రూట్లలో ఇతర విమానయాన సంస్థల విమాన టికెట్ల ధరలు 45 శాతం నుంచి 57 శాతం వరకూ పెరిగాయి. వచ్చే నెల 9 నుంచి విస్తార సర్వీసులు న్యూఢిల్లీ: టాటా-సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ విస్తార విమానయాన సర్వీసులు వచ్చే నెల 9 నుంచి ప్రారంభమవుతాయి. మొదటి సర్వీసులను ఢిల్లీ నుంచి ముంబైకు, అహ్మదాబాద్‌లకు నడుపుతామని విస్తార తెలిపింది. బుకింగ్స్ గురువారం రాత్రి పదిన్నర నుంచి ప్రారంభించామని పేర్కొంది.