Inter cast marriage
-
‘రాప్తాడు’లో పరువు హత్య
రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరువు హత్య జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని భార్య తరఫువారు గొంతుకోసి చంపేశారు. బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి ప్రాణాలు తీశారు. తన తల్లి ఈ హత్య చేయించిందని హతుడు చిట్రా మురళి (27) భార్య వీణ ఆరోపిస్తోంది. పోలీసులు, వీణ కథనం మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లికి చెందిన కురుబ చిట్రా నాగన్న, ముత్యాలమ్మ దంపతుల ఏకైక కుమారుడు చిట్రా మురళి, అదే గ్రామానికి చెందిన ములుగూరు రామానాయుడు (లేట్), యశోదమ్మల ఏకైక కుమారై వీణ పదోతరగతి వరకు కలిసి చదువుకున్నారు. మురళి డిగ్రీ, వీణ బీటెక్ పూర్తిచేశారు. ప్రస్తుతం మురళి పెనుకొండ సమీపంలోని కియా కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, వీణ కనగానపల్లి మండలం ఎలక్కుంట్ల గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్‌గా పనిచేస్తున్నారు. పదో తరగతి నుంచి ప్రేమించుకుంటున్న వీరి పెళ్లికి కులాలు వేరుకావడంతో ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి గతేడాది జూన్ 23న ఉరవకొండ మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. 4 నెలలు అనంతపురంలో తలదాచుకున్నారు. తర్వాత రాప్తాడు ఎస్సీ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. అక్కడి నుంచే విధులకు వెళ్లసాగారు. కిడ్నాప్ చేసి హత్య మురళి ఉద్యోగానికి వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటినుంచి ద్విచక్ర వాహనం మీద బయలుదేరాడు. ఆ వాహనాన్ని రాప్తాడులోని 44వ నంబరు జాతీయ రహదారి పక్కనున్న పెట్రోలు బంకులో పార్కుచేసి, కంపెనీ బస్సు కోసం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో వేచి ఉన్నాడు. అంతలోనే ఆటోలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు అతడిని బలవంతంగా ఎక్కించుకున్నారు. రాప్తాడు నుంచి లింగనపల్లి రోడ్డు మీదుగా బొమ్మేపర్తి పొలాల్లోకి తీసుకెళ్లి గొంతుకొసి హత్యచేశారు. శుక్రవారం ఉదయం ఆ పొలాల్లోకి క్రికెట్ ఆడేందుకు వెళ్లిన యువకులు మృతదేహాన్ని చూసి 100కు డయల్ చేసి సమాచారమిచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, వీణ తల్లి యశోదమ్మను, పెదనాన్న, పెద్దమ్మ, ఇద్దరు బాబాయిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మా అమ్మే చంపించింది మా పెళ్లికి మా అమ్మ యశోదమ్మ ఒప్పుకోలేదు. పెళ్లయిన తర్వాత కూడా మమ్మల్ని పలుమార్లు బెదిరించింది. ‘నాకు మొగుడు లేడు.. నీకూ లేకుండా చేస్తా’ అనేది. అన్నట్లుగానే నా భర్తను హత్య చేయించింది. – వీణ, హతుడి భార్య యశోదమ్మే హత్య చేయించింది నా కొడుకును యశోదమ్మే హత్య చేయించింది. నా బిడ్డను వదిలి పెట్టకపోతే నీ కొడుకును హత్య చేయిస్తానని పలుమార్లు మా ఇంటి దగ్గరకు వచ్చి బెదిరించింది. ఇప్పుడు అనుకున్నట్టే చేసింది. ఒక్కగానొక్క కొడుకును పొట్టనబెట్టుకుంది. ఇక మేమెలా బతకాలి? – ముత్యాలమ్మ, హతుడి తల్లి -
హంతకులను ఉరి తీయాలి.. నీరజ్ పన్వార్ భార్య సంజన డిమాండ్
అబిడ్స్/నాంపల్లి: నీరజ్ పన్వార్‌ను తన బంధువులే చంపారని, హత్య చేసిన వారిని ఉరి తీయాలని మృతుడి భార్య సంజన డిమాండ్ చేశారు. తాను, నీరజ్.. ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరమా అని ప్రశ్నించారు. తన కజిన్ బ్రదర్సే నీరజ్‌ను చంపారని వెల్లడించారు. ఫాస్ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణ జరపాలని, నిందితులపై పీడీయాక్ట్ నమోదు చేయాలని కోరారు. నీరజ్ హత్యను నిరసిస్తూ.. సంజన, స్థానిక వ్యాపారులు శనివారం ఆందోళనకు దిగారు. దీంతో బేగంబజార్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది వ్యాపారులు దుకాణాలను మూసివేసి ఆందోళన చేశారు. షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ ముందు 2 నెలల పసికందుతో సంజన, ఆమె బంధువులు, వ్యాపారులు దాదాపు 3 గంటల పాటు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. హంతకులను ఉరితీయాలని, అంతవరకు ఆందోళన చేస్తామని బైఠాయించారు. వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం సంజన మీడియాతో మాట్లాడారు. హంతకులు తన 2 నెలల కొడుకును కూడా చంపుతారన్న భయాందోళన వ్యక్తం చేశారు. వాళ్లు గతంలో తనను, నీరజ్‌ను చాలాసార్లు బెదిరించారని చెప్పారు. తనకు, అత్తామామలకు, తన కొడుకుకు పోలీసులు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారికి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తన కళ్లెదుటే నీరజ్‌ను పొడిచేశారని అతని తాత జగదీశ్ పన్వార్ వాపోయారు. తను, నీరజ్ బేగంబజార్ ఫిష్‌మార్కెట్ వద్ద వెళ్తుండగా, వెంబడించిన ఐదుగురు దుండగులు తమ ముందుకొచ్చి కళ్లల్లో ఏదో చల్లారన్నారు. దీంతో తమకు ఏమీ కనిపించలేదని చెప్పారు. దుండగులు నీరజ్ తలపై బండరాయితో కొట్టి కత్తులతో పొడిచారని పేర్కొన్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించగా తనపై కూడా దాడి చేశారన్నారు. చంపుతామని బెదిరిస్తున్నారని ఏడాది క్రితమే అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇలా జరిగిందని రోదిస్తూ వెల్లడించారు. కులాంతర వివాహం నచ్చకే.. బేగంబజార్ పరువు హత్య కేసును షాహినాయత్‌గంజ్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నీరజ్‌ను హత్య చేసిన ఆరుగురిలో నలుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. అరెస్టయిన వారిలో ఒక మైనర్ బాలుడు ఉన్నట్లు పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం గోషామహల్‌లోని షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు హత్య వివ రాలు వెల్లడించారు. ‘కోల్సావాడికి చెందిన రాజేంద్రప్రసాద్ పన్వార్ కుమారుడు నీరజ్(20) వృత్తిరీత్యా వేరుశనగ గింజల వ్యాపారం చేస్తుంటారు. అదే బస్తీలో ఉండే సంజనను నీరజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే సంజన తల్లిదండ్రులు ఈ వివాహాన్ని వ్యతిరేకించారు. దీంతో పాతబస్తీలో ఫలక్‌నుమాలోని శంషీర్‌గంజ్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నీరజ్, సంజన జీవిస్తున్నారు. అయితే నీరజ్ వ్యాపారం బేగంబజార్‌లో ఉండటంతో రోజూ ఫలక్‌నుమా నుంచి వచ్చి పోతుండేవారు. కులాంతర వివాహం చేసుకున్న నీరజ్‌ను అంతమొందించాలని 15 రోజుల నుంచి సంజన బంధువులు బేగంబజార్‌కు వచ్చి రెక్కీ నిర్వహించారు. కోల్సావాడికి చెందిన సంజన బంధువులైన మదన్‌లాల్ కుమారుడు అభినందన్ యాదవ్ అలియాస్ నందన్(26), యాదవ్లాల్ యాదవ్ కుమారుడైన కె.విజయ్(22), జై చరణ్ యాదవ్ కుమారుడు కె.సంజయ్(25), శ్రవణ్ యాదవ్ కుమారుడు బి.రోహిత్(18), అఫ్జల్‌గంజ్ నివాసి మహేష్ అహీర్ యాదవ్ అలియాస్ గోటియా(21), మరో మైనర్ బాలుడితో కలసి హత్యకు కుట్రపన్నారు. ఇందులో భాగంగా జుమేరాత్ బజార్లో కత్తులు కొనుగోలు చేశారు. శుక్రవారం సాయంత్రం పీకల దాకా మద్యాన్ని సేవించారు. నీరజ్‌ను చంపేందుకు 2 ద్విచక్ర వాహనాలపై బేగంబజార్‌కు చేరుకున్నారు. నీరజ్ తన తాతతో కలసి వెళ్తుండగా అడ్డగించి కత్తులతో పొడిచి పారిపోయారు. నీరజ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో హత్య కేసు నమోదు చేసుకుని ఏడు బృందాలను రంగంలోకి దించాం. నగర శివార్లలో తలదాచుకున్న నలుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అభినందన్ యాదవ్, మహేష్ యాదవ్‌ను త్వరలోనే పట్టుకుంటాం’అని డీసీపీ వెల్లడించారు. -
కూతురి నిర్వాకం... అవమానంతో అత్యంత దారుణానికి పాల్పడ్డ తండ్రి
Upset over his daughter Inter Cast Marriage: ఇంకా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కులాంతర వివాహలను అంగీకరించటం లేదు. ఎన్ని చట్టాలు చేసినప్పటికీ అంతగా మార్పు రావడం లేదు. పలు చోట్ల కులాంతర వివాహం చేసుకున్న వాళ్లను చంపడం లేదా కోపంతో ఆత్మహత్య చేసుకోవడం వంటి ఘటనలు జరుగుతునే ఉన్నాయి. అచ్చం అలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... "తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో లక్ష్మణ్ అనే వ్యక్తి టీ దుకాణం నడుపుతున్నాడు. అయితే అతని పెద్ద కూతురు షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో లక్ష్మణ్ ఆగ్రహం చెందాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక తన భార్య, ఇద్దరు కూమార్తెలను చంపి తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు." అని తెలిపారు. ఈ మేరకు పోలీసు సూపరింటెండెంట్ జి జవహర్ మాట్లాడుతూ..."దుకాణం నడుపుతున్న లక్ష్మణ్ తన పెద్ద కుమార్తె షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడంపై ఆగ్రహంగా ఉన్నాడు. అందువల్లే అతను ఈ ఘటనకి పాల్పడ్డాడు. అయితే అతని పెద్ద కూతురు తన భర్త వద్ద క్షేమంగా ఉంది. ఈ దారుణ ఘటనపై విచారణ కొనసాగుతోంది. అని చెప్పారు. (చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. నాలుగేళ్ల చిన్నారిపై పైశాచికం..) -
వేరే వర్గానికి చెందిన యువకుడితో కూతురు ప్రేమ.. ప్రియుడితో కలిసి తల్లి..
సాక్షి, జహీరాబాద్ టౌన్: సంగారెడ్డి జిల్లాలో జరిగిన దళిత బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. జహీరాబాద్ మండలం హుగ్గెల్లిలో జరిగిన ఈ సంఘటనను పోలీసులు సవాలుగా తీసుకుని రెండు రోజుల్లోనే ఛేదించారు. కూతురు వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడితో ప్రేమలో పడిందన్న కోపంతో కన్నతల్లే తన ప్రియుడితో కలసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. డీఎస్పీ శంకర్రాజు, సీఐ రాజశేఖర్ బుధవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. హుగ్గెల్లికి చెందిన గడ్డం బుజ్జమ్మకు కూతురు మౌనిక (16), కొడుకు సురేశ్(22) ఉన్నారు. కూతురు జహీరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాగా, ఆమె తమ గ్రామానికే చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తల్లి, అన్నకు తెలియడంతో ఆమెను మందలించారు. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించడం వల్ల పరువు పోతుందని ఆమెకు నచ్చజెప్పారు. అయినా ఆ బాలిక ప్రియుడితో తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. దాంతో పరువు పోతుందని భావించిన బుజ్జమ్మ కూతురిని హతమార్చాలనుకుంది. చదవండి: 10 నెలల క్రితమే పెళ్లి.. పెళ్లైన 2 నెలల నుంచే వేధింపులు.. గర్భిణి ఆత్మహత్య అంతా పథకం ప్రకారమే..: ఈ నేపథ్యంలో బుజ్జమ్మ కాశీంపూర్‌కు చెందిన తన ప్రియుడు నరసింహులుతో చర్చించి ఇద్దరూ కలసి కూతురిని హత్య చేయడానికి పథకం రచించారు. ప్రియుడితో పెళ్లి జరిపిస్తామని తల్లి బుజ్జమ్మ, నరసింహులు మౌనికకు చెప్పి ఆదివారం రాత్రి గ్రామ శివారులోని మామిడి తోటకు తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత అనుకున్న పథకం ప్రకారం.. తల్లి బాలిక కాళ్లపై కూర్చోగా నరసింహులు బాలిక మెడకు చున్నీ బిగించి ప్రాణం తీశాడు. అనంతరం గ్రామస్తులను నమ్మించేందుకు కూతురు తమకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. తర్వాత మౌనిక మృతి విషయం వెలుగులోకి రావడంతో తన కూతురును ప్రేమించిన యువకుడే హత్య చేశాడని పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు తల్లే ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. నరసింహులు, బుజమ్మపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులను త్వరితగతిన పట్టుకున్న జహీరాబాద్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ రవిగౌడ్‌ను డీఎస్పీ అభినందించారు. చదవండి: రూపాయికే గులాబీ దోశ.. ఎక్కడో తెలుసా? -
మూగమనసులు ఒక్కటయ్యాయి..!
సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): వారిద్దరు మాట్లాడలేరు. వినలేరు.. కానీ వారి మనస్సులు మాట్లాడుకున్నాయి. సైగలతోనే జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరి తల్లిదండ్రులు అంగీకరించడంతో మూగమనసులు ఒక్కటయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఉలవపాడు గ్రామానికి చెందిన కంబోతుశ్రీనివాసులు, శ్రీలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ దివ్యాంగులే... వినపడదు, మాట్లాడలేరు. వీరిలో భార్గవి ఒంగోలులోని బధిరుల పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకుంది. అక్కడే ఉలవపాడు మండలం అలగాయపాలెంకు చెందిన పాదాల సత్యనారాయణ, ఈశ్వరమ్మల కుమారుడు పవన్‌కుమార్ కూడా చదివాడు. అతనికి కూడా వినపడదు, మాట్లాడలేడు. అక్కడ వారికి పరిచయం ఏర్పడింది. తరువాత తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నడిచే బధిరుల పాఠశాలలో ఐటీఐ చదివారు. అక్కడ వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. కలిసి జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నారు. ఇద్దరి కులాలు వేరయినా ఆదర్శ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు, తోటి మిత్రులకు తెలియజేశారు. తల్లిదండ్రులు కూడా సమ్మతి తెలపడంతో గురువారం శింగరాయకొండలోని లక్ష్మీనరశింహస్వామి దేవస్థానంలో వివాహం జరిపించారు. అనంతరం ఉలవపాడు సాయిబాబా గుడికి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బధిరులు ఈ వివాహానికి వాట్సప్ గ్రూప్‌ల ద్వారా తెలుసుకుని 50 మంది హాజరయ్యారు. -
పరువు హత్య
కోర్టులు కన్నెర్ర చేసినా, హెచ్చరికలు ఇచ్చినా, ఉరి శిక్షలు విధించినా రాష్ట్రంలో పరువు హత్యలు మాత్రం ఆగడం లేదు. తిరునల్వేలి జిల్లా వీరనల్లూరులో పరువు హత్య చోటు చేసుకుంది. తన ప్రియుడ్ని కిరాతకంగా కుటుంబీకులు హతమార్చిన సమాచారంతోప్రియురాలు మనో వేదనతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనఇరు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతను రేపింది. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఇటీవల కులాంతర ప్రేమ వివాహాలు పరువు హత్యలకు దారితీస్తున్న విషయం తెలిసిందే. పెద్దల పరువుకు, కుల చిచ్చుకు ఎందరో యువతీ, యువకులు హత్యలకు గురయ్యారు. కొన్ని వెలుగులోకి రాగా, మరికొన్నింటిని చాప కింద నీరులా తొక్కేస్తున్నారు. ఇటీవల కులాంతర ప్రేమ వివాహాలు చేసుకున్నందుకు, ధర్మపురిలో ఇలవరసన్, ఓమలూరులో గోకుల్ రాజ్, ఉడుమలైలో శంకర్.. ఇలా ఎందరో అతి కిరాతకంగా హత్యకు గురయ్యారు. అలాగే, తిరునల్వేలిలో తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ యువకుడ్ని మాయ మాటలు చెప్పి ఇంటికి పిలిపించి మరీ ఓ కుటుంబం దారుణంగా కడతేర్చింది. ఈ పరువుహత్యలను మద్రాసు హైకోర్టు సైతం తీవ్రంగా పరిగణించింది. కులాంతర ప్రేమ వివాహాలు చేసుకునే దంపతులకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. పరువు హత్యల కట్టడి లక్ష్యంగా ప్రత్యేక చట్టం తీసుకొచ్చే రీతిలో ఆదేశాల్ని హైకోర్టు ఇచ్చింది. అలాగే, కొన్ని పరువు హత్యలపై కన్నెర్ర చేస్తూ నిందితులకు ఉరిశిక్షలు సైతం విధించింది. అయినా, హత్యల పరంపర మాత్రం ఆగడం లేదు. గత వారం కృష్ణగిరి జిల్లా çహొసూరులో పరువు హత్య జరగ్గా, ప్రస్తుతం తిరునల్వేలిలో మరో పరువు హత్యచోటు చేసుకుంది. మూడేళ్లుగా ప్రేమ వీరనల్లూరు వెల్లకులి గ్రామానికి చెందిన ఇసక్కి శంకర్ కలకాడులోని సహకార బ్యాంక్‌లో ఉద్యోగి. వెల్లకులికి చెందిన దళవాయి కుమార్తె సత్యభామ(21) ప్రేమలో పడ్డాడు. కొంత కాలం ఆమె చుట్టూ తిరిగి, ప్రేమను గెలిచారు. ఈ ఇదరివీ వేర్వేరు కులాలైనా, ఈ జంట మాత్రం తాము ఒక్కటే అన్నట్టుగా చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది. మూడేళ్లుగా సాగుతూ వచ్చిన ఈ ప్రేమ వ్యవహారం దీపావళి సందర్భంగా ఇంటి పెద్దల చెవిన పడింది. బీకాం మూడో సంవత్సరం చదువుతున్న సత్యభామను కాలేజీకి పంపించకుండా కుటుంబీకులు ఇంటికి పరిమితం చేశారు. దీంతో ప్రేమికుల మధ్య దూరం ఏర్పడింది. పెద్దల్ని ఎదిరించి ఈ జంటపెళ్లికి సిద్ధ పడింది. ఇది గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. శంకర్ కుటుంబీకులు సత్యభామను తమ కోడలుగా చేసుకునేందుకు సిద్ధపడ్డా, దళవాయి మాత్రం శంకర్‌ను అల్లుడిగా చేసుకునేందుకు అంగీకరించలేదు. ఇరు కుటుంబాల మధ్య ఈ ప్రేమ జంట కారణంగా గొడవలు జరగడంతో వ్యవహారం గ్రామ పంచాయతీ పెద్దలకు చేరింది. ఇరు కుటుంబాలతో పెద్దలు మాట్లాడారు. అయితే, శంకర్‌కు ఉద్యోగం ఉన్న దృష్ట్యా, ఆలోచించాలని దళవాయికి పెద్దలు హితబోధ చేశారు. కులం వేరు కావడంతో తొలుత దళవాయి నిరాకరించాడు. చివరకు గ్రామ పెద్దల హిత బోధతో మెట్టుదిగాడు. అయితే, తన కుమార్తె చదువు పూర్తయ్యాకే వివాహం అంటూ అందర్నీ నమ్మ బలికి పెద్దల పంచాయితీని సుఖాంతం చేశాడు. మరణంలో ఏకమయ్యారు తండ్రి మాటల్ని నమ్మిన సత్యభామ రోజు కళాశాలకు వెళ్లి వచ్చేది. అయితే, తనలోని కుల గజ్జి దళవాయిని వీడలేదు. పథకం ప్రకారం శంకర్‌ను మట్టుబెట్టేందుకు సిద్ధం అయ్యాడు. తన సామాజిక వర్గానికి చెందిన కొందరు యువకుల్ని ఏకం చేశాడు. వారు పథకం ప్రకారం మంగళవారం శంకర్‌ను మట్టుబెట్టేందుకు సిద్ధం అయ్యారు. ప్రతిరోజు పని ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో శంకర్‌కు తామరభరణి నదిలో స్నానం చేసే అలవాటు ఉండడంతో పథకాన్ని అక్కడే అమలుచేయడానికి సిద్ధం అయ్యారు. శంకర్ స్నానం చేయడానికి సిద్ధం అవుతున్న సమయంలో చుట్టుముట్టిన ఆ కిరాతకులు కత్తులు, వేట కొడవళ్లతో నరికి చంపేశారు. శంకర్ మరణించాడని ధ్రువీకరించుకుని అక్కడి నుంచి ఉడాయించారు. రాత్రి పది గంటల సమయంలో శంకర్ మృతదేహం నదీ తీరంలో పడి ఉన్న సమాచారం వీర నల్లూరు, వెల్లంకులి పరిసరాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. పథకం ప్రకారం దళవాయి కుటుంబం శంకర్‌ను హతమార్చిందన్న ఆగ్రహంతో రెండు సామాజికవర్గాల మధ్య వివాదం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ రెండు గ్రామాల్లో గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. దళవాయి ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు. అయితే, ప్రేమించిన వాడిని తన కుటుంబం మట్టుబెట్టడంతో సత్యభామ తీవ్ర మనోవేదనకు గురైంది. రాత్రి తన గదిలో దుప్పట్టాతో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయాన్నే గది నుంచి సత్యభామ బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు తలుపులు పగులగొట్టి చూడగా ఉరిపోసుకుని వేలాడుతున్న మృతదేహం బయటపడింది. ఆ కుటుంబం కన్నీటి పర్యంతం అయింది. సమాచారం అందుకున్న తిరునల్వేలి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటన మీద విచారణ చేపట్టారు. సత్యభామ ఆత్మహత్య చేసుకుందా? లేదా, కుటుంబీకులు హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే పనిలో పడ్డారా..? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. -
వరుడి తల్లి చదువుకుంటేనే!
భారత దేశ వివాహ వ్యవస్థలో కుటుంబ నిర్ణయాలే ప్రధానం. మనదేశంలో జరుగుతున్న పెళ్లిళ్లలో వ్యక్తిగత ఇష్టాయిష్టాలకంటే కుటుంబ నిర్ణయాలకే ప్రాధాన్యం ఎక్కువ. 2011 లెక్కల ప్రకారం మన దేశంలో 73 శాతం పెళ్లిళ్లు పెద్దలు కుదిర్చినవే. వారిలో అతి కొద్ది మందికి మాత్రమే తాము చేసుకోబోయే వారితో కనీస పరిచయం ఉంటోంది. 63 శాతం మంది పెళ్లి రోజు వరకూ ఒకరినొకరు చూసుకోనివారే ఉన్నారు. తాజా అధ్యయనం మాత్రం తల్లి చదువు కులాంతర వివాహాలకు ఊతమిస్తోందని తేల్చి చెప్పింది. గత నలభయ్యేళ్లుగా మన దేశంలో కులాంతర వివాహాలు 5.82 శాతమే. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో కులాంతర వివాహాలు 5.82 శాతం మాత్రమే. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం గత నలభయ్యేళ్లుగా కులాంతర వివాహాల శాతం అదేమాదిరిగా కొనసాగడం. కులాంతర వివాహాలకు ప్రోత్సాహం.. భారత్‌లో కులాంతర వివాహాలను అమితంగా ప్రభావితం చేస్తున్న అంశం చదువేనని తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. కులాంతర వివాహాల సానుకూలతకు కారణం పెళ్లి కొడుకు చదువో, పెళ్లి కూతురు చదువో కాదట. పెళ్లి కుమారుడి తల్లి చదువేనట. పెళ్లి కుమారుడి తల్లి విద్యావంతురాలైతే కులాంతర వివాహాలకు కుటుంబాల్లో సానుకూలత ఉంటున్నట్లు ఢిల్లీకి చెందిన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. 2011–12 ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే గణాంకాల ఆధారంగా 2017లో చేసిన ఈ అధ్యయనం మనదేశంలోని కులవ్యవస్థకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది. చదువుకున్న తల్లులు కులాల కట్టుబాట్ల విషయంలో మరింత చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ♦ వరుడి తల్లి విద్యాధికురాలైతే కులాంతర వివాహాల్లో దేశం పదేళ్ల ముందుంటుందని ఈ సర్వే తేల్చింది. పెళ్లి కొడుకు తల్లి చదువుకున్న కుటుంబాల్లో 1.8 శాతం కులాంతర వివాహాలు జరిగినట్లు వెల్లడయ్యింది. అయితే పెళ్లి కూతురి తల్లి చదువు కులాంతర వివాహాలను ప్రభావితం చేయడం లేదన్నది గమనార్హం. ♦ కుటుంబాలు, దగ్గరి బంధువులు, సంబంధీకుల మధ్య వివాహాల్లో మన దేశానికి, ఇతర దేశాలకి పోలిక లేదని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. దీనికి మనదేశంలో కుటుంబ వ్యవస్థ పునాదులు బలీయమైనవి కావడమేననీ, కుటుంబాల్లో వ్యక్తిగత స్వేచ్ఛకు అంత ప్రాధాన్యం లేకపోవడం కూడా ప్రధాన కారణంగా ఈ సర్వే వెల్లడించింది. ♦ సహజంగా పారిశ్రామికీకరణ, విద్యాభివృద్ధి, పట్టణీకరణ, సామాజిక చైతన్యం వల్ల దగ్గరి సంబంధాల వివాహాలు తగ్గి, కులాంతర, వర్గాంతర వివాహాలు పెరుగుతాయని భావిస్తారు. కానీ వీటన్నింటిలో అభివృద్ధి కనబడుతున్నా 1970 నుంచి 2012 వరకు కులాంతర వివాహాలు మాత్రం పెరగకపోవడాన్ని బట్టి మోడర్నైజేషన్ థియరీ తప్పు అని తేలింది. గ్రామీణ ప్రాంతాలకంటే మెట్రోపాలిటన్ సిటీస్‌లో కులాంతర వివాహాలు తక్కువని కూడా స్పష్టమైంది. ♦ పెళ్లి కుమారుడు, పెళ్లికూతురి తరఫు ఆర్థిక స్తోమత సైతం కులాంతర వివాహాలను ప్రభావితం చేయట్లేదు. పైగా ఆర్థిక స్తోమత పెరిగే కొద్దీ కులాంతర వివాహాలు తగ్గుతున్నాయి. ♦ దళితుల్లో ఆర్థిక స్తోమత పెరిగే కొద్దీ కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి. ♦ అగ్రకులాల్లో ఆర్థిక స్తోమత పెరిగే కొద్దీ కులాంతర వివాహాలు తగ్గుతున్నట్టు తేల్చి చెప్పింది. -
దళితున్ని పెళ్లి చేసుకుందని కోర్టు ఆవరణలోనే..
చండీగఢ్ : పంజాబ్‌లో ఘోరం చోటుచేసుకుంది. దళిత యువకున్ని పెళ్లిచేసుకుందని అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురుని కాల్చిచంపాడో కసాయి తండ్రి. ఈ ఘటన రోహ్తక్ కోర్టు ప్రాంగణంలో చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, ఆమెకు రక్షణగా ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. బావమరిది కూతురు మమతను రమేష్ 2002లో దత్తత తీసుకున్నాడు. మమత సోంబిర్ అనే దళిత యువకున్ని ప్రేమించారు. గతేడాది ఆగస్టులో ఇంటినుంచి వెళ్లిపోయి అతన్ని పెళ్లి చేసుకున్నారు. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన రమేష్ తన మైనర్ కూతురుకు మాయమాటలు చెప్పి సోంబిర్ ఇంచి నుంచి తీసుకుపోయాడని కేసు పెట్టి అరెస్టు చేయించాడు. అయినప్పటికీ మమత ఇంటికి రాలేదు. ఇదిలా ఉండగా.. సోంబిర్‌పై కేసు విచారణ సందర్భంగా బుధవారం కోర్టుకి వస్తున్న మమతను రమేష్ ఇంటికి రావాల్సిందిగా కోరాడు. కానీ, ఆమె ససేమిరా అనడంతో కోపోద్రిక్తుడయ్యాడు. తమకళ్లెదుటే ‘మరో రెండు గంటల్లో నిన్ను చంపేస్తా’నంటూ రమేష్ హెచ్చరించినట్టు పోలీసులు వెల్లడించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన మమతపై మోటర్ సైకిళ్లపై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారనీ, పక్కనే ఉన్న ఇన్స్పెక్టర్ నరేందర్ కూడా కాల్పుల్లో గాయపడి మరణించాడని పోలీసులు వెల్లడించారు. మమత మైనారిటీ మరో కొద్దిరోజుల్లో తీరిపోనుండడంతో రమేష్ ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు. -
దంపతులపై దుండగుల దాడి: భర్త మృతి
తమిళనాడు: ఎనిమిది నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్న దంపతులపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటన తమిళనాడులోని ఉడుమాలయిపెట్టాయిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ దాడిలో భర్త తీవ్రగాయాలతో అక్కడిక్కడికే మృతిచెందగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. దాంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.