Internet packs
-
అన్నా.. మొబైల్ డేటా ఫాస్ట్‌గా అయిపోతోంది! ఏం చేయను..
Mobile Data Usage And Data Saving Tips In Telugu: ఎన్నిసార్లు చెప్పా.. ఇంటర్నెట్ప్యాక్ కోసం ఎక్స్ట్రా రీఛార్జ్ అడగొద్దని? అంటూ అసహనంగా చెల్లిని మందలించాడు ప్రశాంత్. ‘ఏం చేయను అన్నయ్యా.. డేటా ఫాస్ట్‌గా అయిపోతోంది. ఆ విషయం తెలియకుండానే మొబైల్ డేటా లిమిట్ దాటేసిందని అలర్ట్ వస్తోంది’ అంటూ ముఖం వేలాడేసుకుని సమాధానం ఇచ్చింది గిరిజ. ఇంతకీ మొబైల్ డేటా లిమిట్ ఆన్‌లో పెట్టుకున్నావా? అని ప్రశాంత్ అనడంతో బిక్క ముఖం వేసింది గిరిజ. స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే కోట్ల మంది ఎదుర్కొనే సమస్య.. వేగంగా మొబైల్ డేటా అయిపోవడం. వైఫై కనెక్షన్ లేని ఇళ్లలో మొబైల్ డేటానే ఆధారం. ఓటీటీ, ఇతరత్రా సోషల్ యాప్‌లను ఉపయోగిస్తూ రోజూ వారీ డేటా ఎలా అయిపోతోందో కనీసం తెలియదు కూడా. ఫుల్ సిగ్నల్ ఉందని.. ఇంటర్నెట్ జెట్ స్పీడ్‌తో వస్తోందని సంబరపడేవాళ్లు.. ఇంటర్నెట్ డేటా ఫటా ఫట్ అయిపోతుందని మాత్రం గుర్తించరు!. డేటా లిమిట్ మ్యాగ్జిమమ్ దాటి వెళ్లకుండా ఉండేదుకు పర్యవేక్షణ, పరిమితం చేయడం లాంటి మార్గాలు ఉంటాయని గుర్తిస్తే చాలు కదా!. ►మొబైల్ డేటా వాడకాన్ని మానిటరింగ్ చేయడం చాలా సులువు. ఏదైనా ఒక యాప్‌ను ఎక్కువసేపు నొక్కి పట్టుకున్నప్పుడు.. యాప్ ఇన్ఫో app info అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయగానే నేరుగా యాప్ సెట్టింగ్ పేజ్‌కి వెళ్తుంది. అక్కడ మొబైల్ డేటా&వైఫై ఆప్షన్ కనిపిస్తుంది. పైన బ్యాక్‌గ్రౌండ్-ఫోర్‌గ్రౌండ్‌లో ఆ యాప్ ఎంత డేటాను తీసుకుంటుందనే విషయం అక్కడ చూడొచ్చు. ఒకవేళ ఆ యాప్ ఎక్కువ డేటాను లాగేస్తుందని అర్థమైతే.. వెంటనే అక్కడి ఆప్షన్స్‌ను ఆఫ్ చేస్తే సరిపోతుంది. ►ఇక ఫోన్ సెట్టింగ్స్ యాప్ Settings appలో డేటాసేవర్ Data Saver అనే ఫీచర్ కూడా ఉంటుంది. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్‌లు వినియోగించుకుంటున్న డేటాను నియంత్రిస్తుంది. ►గూగుల్ ప్లే స్టోర్‌లో.. డేటా మేనేజ్మెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా మానిటర్ చేసుకోవచ్చు. పైగా ఒకేసారి ఒక్కోయాప్ ఎంతెంత డేటా తీసుకుంటున్నాయో ఒకేసారి చెక్ చేసుకోవచ్చు. గంట, రోజూ, వారాలు, నెలల తరబడి ఎంతెంత ఉపయోగిస్తున్నామో అక్కడ చూసుకోవచ్చు కూడా. ►కొన్ని ఫోన్లలో డేటా లిమిట్ ఆప్షన్ నేరుగా ఉంటుందన్నది చాలామందికి తెలిసే ఉండొచ్చు. అక్కడ ఫలానా ఎంబీ నుంచి జీబీల్లో డేటా లిమిట్‌ను సెట్ చేసుకోవచ్చు. సపోజ్ యూట్యూబ్లోగానీ, లేదంటే ఏదైనా ఓటీటీ యాప్‌లోగానీ సినిమా చూస్తూ ఉండిపోయినప్పుడు డేటా దానంతట అదే అయిపోతుంది. కానీ, లిమిట్ పెట్టుకోవడం వల్ల పరిధి దాటగానే అలర్ట్ ద్వారా అప్రమత్తం చేస్తుంది. అప్పుడు ఇంటర్నెట్ డేటాను నియంత్రించుకోవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి డేటా లిమిట్ Data limit అని టైప్ చేస్తే ఆప్షన్ కనిపిస్తుంది. మరికొన్ని ఫోన్లలో Data Warning ఫీచర్ కూడా ఉంటుంది. ►లైట్ వెర్షన్, అలర్ట్నేట్ వెర్షన్ యాప్స్‌ను ఉపయోగించడం ద్వారా కూడా ఇంటర్నెట్ డేటాను తక్కువగా వాడొచ్చు. కానీ, వీటిలో చాలామట్టుకు సురక్షితమైనవి కానివే ఉంటాయి. కాబట్టి, ప్లేస్టోర్ నుంచి అథెంటిక్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించడం ఉత్తమం. ఉదాహరణకు.. ఫేస్బుక్, ఇన్స్టలాంటి యాప్‌ల్లో స్క్రోలింగ్ చేస్తూ ఉండగానే.. డేటా అయిపోయినట్లు మెసేజ్ వస్తుంది. అవి ఎక్కుడ డేటాను లాగేస్తాయి కాబట్టి.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లైట్ వెర్షన్ యాప్‌ల ఉపయోగించొచ్చు. మొబైల్ డేటాను సేవ్ చేసుకోవచ్చు. చదవండి: ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయకుండా ఫోన్లో ఫ్రీ స్పేస్ పొందండి ఇలా.. -
ఒక్క రూపాయి ప్లాన్‌పై జియో యూటర్న్! కారణం ఏంటంటే..
కేవలం ఒక్క రూపాయికే 100ఎంబీ ఇంటర్నెట్ డేటా.. అదీ 30 రోజుల వాలిడిటీ ప్రకటనతో టెలికాం రంగంలోనే సంచలనానికి తెర లేపింది రిలయన్స్ జియో. అయితే ఒక్క రోజులోనే ఉస్సూరుమనిపిస్తూ ఆ ఆఫర్‌ను సవరించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. మంగళవారం రాత్రి దాటాక మైజియో మొబైల్ యాప్‌లో గప్‌చుప్‌గా వాల్యూ ప్లాన్ కింద ఈ ఆఫర్‌ను చేర్చింది జియో. ఒక్క రూపాయికే 100 ఎంబీ డేటాను, 30 రోజుల వాలిడిటీతో అందించింది. అయితే 24 గంటల తర్వాత ఆ ప్లాన్ మాయమైంది. దాని ప్లేస్‌లో 1రూ. రీచార్జ్‌తో కేవలం 10 ఎంబీ.. అదీ ఒక్కరోజూ వాలిడిటీతో సవరించింది. దీంతో చాలామంది రిలయన్స్ జియో ప్రకటన వార్తలను ఫేక్‌గా భావించారు. అయితే జియో ఈ ప్యాక్‌ను ఆఫర్ చేసిన విషయం వందకు వంద శాతం వాస్తవం. ప్యాక్ ఎందుకు సవరించారనే దానిపై రిలయన్స్ జియో నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, తోటి టెలికామ్ సంస్థల నుంచి వచ్చిన అభ్యంతరాలే జియో వెనక్కి తగ్గడానికి కారణమని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో టెలికాం కంపెనీలన్నీ(జియో)తో సహా టారిఫ్‌లను పెంచేశాయి. ఈ క్రమంలో ఒకదానిపై ఒకటి ఫిర్యాదులు చేసుకున్నాయి కూడా. అయితే ఏ టెలికాం సంస్థ కూడా ఇంత చీప్‌గా డేటా ప్యాక్‌ను ఆఫర్ చేయట్లేదన్న విషయాన్ని సైతం టెలికాం రెగ్యులేటరీ బాడీ ‘ట్రాయ్’ జియో మేనేజ్మెంట్ వద్ద లేవనెత్తినట్లు ట్రాయ్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ అభ్యంతరాల నేపథ్యంలో జియో తన చీపెస్ట్ ఇంటర్నెట్ ప్యాక్‌ను సైలెంట్‌గా మార్చేసింది. అయితే ఆ సమయానికి ఎవరైతే 1రూ. 100 ఎంబీ ప్యాక్‌కు రీఛార్జ్ చేశారో వాళ్లకు మాత్రం ప్లాన్‌ను వర్తింపజేస్తూ జియో ఊరట ఇచ్చింది. చదవండి: జియో యూజర్లకు 20 శాతం క్యాష్‌బ్యాక్! ఎలాగంటే.. -
జియో పెనుసంచలనం: కేవలం ఒక్క రూపాయికే..
Reliance Jio Becomes the First Operator to Offer a Rs 1 Prepaid Plan with 100 MB Data Valid for 30 Days: దేశీ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో మరో సంచలనానికి తెర తీసింది. ప్రపంచంలోనే అత్యంత కారుచౌక ధరకు ఇంటర్నెట్ ప్యాకేజీని అందిస్తోంది. మంగళవారం గప్‌చుప్‌గా ఈ ప్యాక్‌ను వాల్యూ కేటగిరీలో యాడ్ చేసింది జియో. ప్రీపెయిడ్ రీఛార్జిలో భాగంగా ఒక్క రూపాయికి వంద ఎంబీ ఇంటర్నెట్ డేటా అందిస్తోంది రిలయన్స్ జియో. 100 ఎంబీ 4జీ డేటా.. 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ డేటా అయిపోగానే.. 64 కేబీపీఎస్‌తో ఇంటర్నెట్‌స్పీడ్ అందుతుంది. అంటే.. వాట్సాప్‌లో సాధారణ టెక్స్ట్ మెసేజ్‌లు పంపుకోవచ్చన్నమాట. ఈమధ్యకాలంలో టెలికాం నెట్‌వర్క్‌లు అన్నీ టారిఫ్‌లు పెంచిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో జియో వేసిన ఈ అడుగు కీలకమనే చెప్పాలి. ఇక వాటర్ ప్యాకెట్ ధర కంటే తక్కువకి.. అదీ కేవలం ఒక్క రూపాయికే ఇంటర్నెట్ ప్యాకేజీని అందించడం సంచలనంగా మారింది. ప్రపంచంలో ఇంత తక్కువ ధరకే డేటా ప్యాక్‌ను అందించిన ఘనత ఇప్పుడు రిలయన్స్‌కే దక్కింది. ఇదిలా ఉంటే 15రూ. 1 జీబీ డేటా అందిస్తున్న ప్యాక్ కంటే.. ఇలా ఒక్క రూపాయి ప్యాక్ ద్వారా 10రూ.తోనే వన్ జీబీ పొందే వీలు ఉంటుంది. ఇక జియో అందిస్తున్న ఈ 100 ఎంబీప్లాన్ డేటాప్లాన్.. అన్నేసి రోజుల వాలిడిటీతో ఏ టెలికామ్ ప్రొవైడర్ అందించట్లేదు. పైగా 28 రోజుల వాలిడిటీ కాకుండా.. 30 రోజుల పరిమితితో ఇస్తోంది. నేరుగా మైజియో యాప్ ద్వారా ఈ రీచార్జ్ వెసులుబాటును కూడా అందిస్తోంది రిలయన్స్ జియో. చదవండి: జియో యూజర్లకు గుడ్‌న్యూస్ -
స్కైప్ కాల్స్‌కు ఎయిర్టెల్ చార్జీ
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ మొబైల్ డేటా ప్యాకేజీలు ఉపయోగించుకుని స్కైప్, వైబర్ తదితర యాప్స్ ద్వారా కాల్స్ చేసుకునే వారు ఇకపై మరింత అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత డేటా ప్యాకేజీలలో చేర్చకుండా వాయిస్ కాల్స్ ఓవర్ ఇంటర్నెట్ (వీఓఐపీ)కి విడిగా చార్జీలు వసూలు చేయాలని ఎయిర్టెల్ నిర్ణయించడం ఇందుకు కారణం. డిస్కౌంటు రేటుతో లభించే ఇంటర్నెట్ ప్యాక్‌లు కేవలం బ్రౌజింగ్కి మాత్రమే పనిచేస్తాయని, వీఓఐపీ వీటిలో భాగం కాబోదని ఎయిర్టెల్ తమ వెబ్సైట్లో పేర్కొంది. వీఓఐపీ వినియోగించుకునే వారు 10 కేబీకి/4 పైసలు (3జీ సర్వీసులకు), 10 కేబీకి/10 పైసలు (2జీ సర్వీసులకు) ప్రామాణిక డేటా రేటు చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. ఇలా వీఓఐపీ డేటాకు విడిగా చార్జీలు విధించడం దేశీయంగా ఇదే తొలిసారి. దీని కోసం త్వరలో ప్రత్యేక ప్యాక్‌ను కూడా ప్రవేశపెట్టబోతున్నామని ఎయిర్టెల్ వివరించింది. వాట్స్‌యాప్, లైన్, స్కైప్ వంటి ఇంటర్నెట్ ఆధారిత సర్వీసుల సంస్థలను కూడా నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలంటూ మొబైల్ ఆపరేటర్లు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.