irregularaties
-
నిద్రలో తేడాలొచ్చినా టైప్-2 డయాబెటిస్ ముప్పు
టైప్ 2 డయాబెటిస్ ప్రపంచవ్యాప్తంగా కలవర పెడుతున్న సమస్య. దాదాపు 90 నుండి 95శాతం ఈ తరహా డయాబెటిస్తో బాధపడుతున్నారు. 2021లో ప్రపంచంలో 540 మిలియన్ల మధుమేహ కేసులు (ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్, 2021) ఉన్నట్లు అంచనా. ఒత్తిడి, నిశ్చల జీవనశైలి , నాణ్యత లేని, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వంటి కారణాలతో మధుమేహం విస్తరిస్తోంది. అయితే తాజా అధ్యయనం ప్రకారం అతిగా నిద్రపోవడం వల్ల కూడా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందట.మనిషి ఆరోగ్యంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అయితే సమయా పాలన పాటించని నిద్రకూడా ప్రమాదమే అంటున్నారు. హెచ్చు తగ్గుల నిద్రకు మన ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. నిద్ర వ్యవధిని తరచూ మార్చుకునే వారికి డయాబెటిస్ బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని తాజా పరిశోధన ద్వారా తెలుస్తోంది. ఈ పరిశోధన ప్రకారం తమ నిద్ర వ్యవధిని 31 నుంచి 45 నిముషాల పాటు మార్చుకోవడం (నిద్ర వ్యవధి ఎక్కువ/తక్కువ చేయడం) వల్ల 15 శాతం డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది. ఈ వ్యవధి గంటకు మించి ఉంటే ఆ ప్రమాదం 59 శాతం పెరుగుతుంది. అతి నిద్ర కారణంగా కారణంగా డయాబెటిస్ సోకే అవకాశాలు 34 శాతం అధికంగా ఉంటుంది.జూలై 2024 అధ్యయనం మరియు డయాబెటిస్ కేర్‌లో దీన్ని ప్రచురించారు. యూకే బయో బ్యాంక్ ద్వారా పరిశోధకులు యాక్సిలోమీటర్లు (స్మార్ట్ వాచ్) ద్వారా 84 వేల మంది నిద్ర నమూనాలను పరిశీలించారు. అతి నిద్ర, నిద్ర లేమి రెండూ కూడా డయాబెటిస్‌కు దారితీసే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. నిద్రలేమి కారణంగా శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలహీనం కావడమే కాక, తీవ్ర రక్తపోటు, ఊబకాయం, మానసిక ఒత్తిడి, హృద్రోగ సంబంధ వ్యాధులు సోకే అవకాశాలు అధికంగా ఉంటాయని పరిశోధన పేర్కొంది. క్రమరహిత నిద్ర అనేది ఆధునిక జీవనశైలితో ముడిపడి ఉన్న ఆరోగ్య సమస్య. వృత్తి, ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు, కుటుంబ కట్టుబాట్ల కారణంగా ప్రజలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు, ఇది వారి నిద్రపై ప్రభావం చూపుతుంది. నిద్రకు ముందు మొబైల్ ఫోన్ల వంటి డిజిటల్ పరికరాల వినియోగం పెరగడం మరో ప్రధాన అంశం. మొబైల్ ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పేలవమైన నిద్ర భవిష్యత్తులో మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. -
అచ్చోసిన క్రిమినల్
దశాబ్దాల రాజకీయ వారసత్వాన్ని ఆయన అక్రమాలకు అనువుగా మార్చుకున్నారు.అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందినకాడికి దోచుకున్నారు. అధికారులను బెదిరించి...రికార్డులు తారుమారు చేసి... అనుచరులతో కలసి భూదందా నడిపారు. సహజసిద్ధంగా లభ్యమయ్యే గ్రానైట్‌ను అక్రమంగా తవ్వేసి అధికారుల కళ్లుగప్పి ఎగుమతి చేసుకున్నారు. తమ మాట విననివారినీ.. ఎదురు తిరిగిన వారిని మట్టుబెట్టడం.. లేకుంటే వారిని సామాజిక బహిష్కరణ చేసి బెదిరించడం అలవాటుగా చేసుకున్నారు. ఓ ప్రతిపక్షం రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన ఈయన ఓ విడత అమాత్యపదవి వెలగబెట్టి ఏకంగాపెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని ఓ తెలుగుదేశం నాయకుడి అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. రాజకీయంగా ఆయనకున్న పరపతిని భూదందాలకు, అక్రమంగా గ్రానైట్ తరలింపునకు వాడుకుంటున్నారు. అడ్డుకునే అధికారులపై విరుచుకుపడుతున్నారు. ఆయన సోదరుడు కోటబో మ్మాళి మండలం నిమ్మాడ సమీపంలో పెద్దబమ్మిడి గ్రామంలో 3.15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి గోడౌన్ నిర్మించారు. సాగునీటి కాలువ మూసేసి గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ నిర్మించారు. సాగునీటి కాలువను సైతం మూసేశారు.ఆ కాలువపై ఆధారపడిన 40 ఎకరాలకు సాగునీరు నిలిచిపోయింది. ఆక్రమించుకున్న భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులు కూడా మాయం చేశారు. అధికారంలో ఉండగా కబ్జా చేసిన భూములను తమకు తెలిసిన వ్యక్తుల పేరు మీదకు మార్చేసి మాల్ ప్రాక్టీసుకు పాల్పడ్డారు. అధికారుల స్టాంపు, డిజిటిల్ సిగ్నేచర్‌ను తమ గుప్పెట్లో పెట్టుకుని అక్రమాలను కొనసాగించారు.దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై దౌర్జన్యానికి పాల్పడేవారు. తన అనుచరులను బినామీలుగా మార్చుకుని వారి పేరున అనేక పట్టాలు సృష్టించుకున్నారు.టీడీపీ హయాంలో కోటబొమ్మాళి మండల కేంద్రంలో పెద్ద చెరువు అభివృద్ధి పేరుతో సుమారు 12 ఎకరాలను కబ్జా చేశారు. గరీబుల గెడ్డ పరీవాహక భాగంలో సుమారు 7 ఎకరాలు తన అనుచరుడి పేరున కబ్జాచేశారు. ఇవి కొన్ని ఆక్రమణలు మాత్రమే. ఇవిగాకుండా తన అనుచరులు చేసిన భూదందాలకు వెన్నుదన్నుగా నిలిచారు. గ్రానైట్ అక్రమాలతో ప్రభుత్వ ఆదాయానికి గండిఆ నాయకుడి కుటుంబ సభ్యులు గ్రానైట్‌ను అక్రమంగా తరలించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. దీనిపై మైనింగ్ అధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి పక్కా ఆధారాలతో కోటబొమ్మాళి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 379, 420, 477–ఎ, 406, 120బి, 34ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆ నాయకుడి కుమారుడి పేరున 2018 ఏప్రిల్ 23వ తేదీ నుంచి 2038 ఏప్రిల్ 22వ తేదీ వరకు దాదాపు 20 ఏళ్ల మినరల్ డీలర్ లైసెన్సు తీసుకున్నారు.రఫ్ గ్రానైట్ బ్లాక్‌ల కటింగ్, పాలిషింగ్ తదితర కార్యక్రమాలను వీరి ఇండస్ట్రీ చేపడుతుంది. క్వారీల నుంచి గ్రానైట్ బ్లాక్‌లను అధికారికంగా అనుమతి తీసుకుని తమ ఇండస్ట్రీకి రవాణా చేసుకోవాల్సి ఉంది. కానీ వీరి ఇండస్ట్రీలో అందుకు భిన్నంగా వ్యవహారాలు నడుస్తున్నాయని అధికారుల తనిఖీల్లో తేలింది. 172.87క్యూబిక్ మీటర్ల బరువైన 23 బ్లాక్‌లను అక్రమంగా తరలించినట్టుగా తేల్చారు. దీనివిలువ అపరాధ రుసుంతో కలిపి రూ.6 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఇదంతా ప్రభుత్వానికి రావల్సిన ఆదాయం. ఇప్పటివరకూ వీరి ద్వారా రూ.11,43,29,120 మేర అక్రమాలు జరిగాయి. మరో రూ.3,18,72,960 మేర జీఎస్టీ చెల్లించకుండా ఎగ్గొట్టారు. అ«ధికారం లేకపోయినా అధికారులు కళ్లుగప్పి అక్రమ రవాణాకు పాల్పడ్డారంటే ఈ నాయకుడి ఫ్యామిలీ ఎంత బరితెగించిందో అర్థం చేసుకోవచ్చు. ఆయన నేర చరిత్ర చాంతాడంతఆయన మాట కాదన్నవారు ఎవరైనా అదృశ్యమైపోతారు. కారణం మాత్రం ఇప్పటికీ చిదంబర రహస్యం. తొలుత బెదిరింపులు.. ఆ తర్వాత దౌర్జన్యాలు.. అప్పటికీ లొంగకపోతే సామాజిక, గ్రామ బహిష్కరణలు..ఇంకా వినకపోతే దాడులు చేయడం ఇక్కడ పరిపాటి. ఈఎస్ఐ స్కామ్‌లోనూ కీలకంగా మారి... టీడీపీ అధికారంలో ఉండగా మంత్రి హోదాలో ఈయన చేసిన ఈఎస్ఐ స్కామ్ జిల్లాకే మాయని మచ్చగా మారింది. అడ్డొచి్చన అధికారులను బెదిరించడం, అవసరమైతే బదిలీ చేయడం, తనకు కావల్సిన వారిని తెప్పించుకుని అక్రమాలకు పాల్పడటం టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం సాగిపోయింది. అంతటితో ఆయన లీలలు ఆగలేదు. కార్మికుల కోసం కొనుగోలు చేసిన మందుల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. దాదాపు రూ.150 కోట్లకు పైగా జరిగిన స్కామ్‌లో సూత్రధారిగా నిలిచారు. మందు బిల్లులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో సొమ్ము నొక్కేశారు.బినామీలను తెరపైకి తెచ్చి నామినేటెడ్ పద్ధతిలో వందల కోట్ల రూపాయల విలువైన మందులు, పరికరాలను యథేచ్ఛగా కొనుగోలు చేసి నచి్చనట్టుగా బిల్లులు చేసేసుకున్నారు. ఈ బండారం కాస్తా విజిలెన్స్ అధికారుల విచారణలో బయటపడింది. వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లు, పనులు నామినేషన్‌పై అప్పగించాలని మంత్రి హోదాలో ఆ నాయకుడు ఇచి్చన సిఫారసు లేఖతో మొత్తం గుట్టు రట్టు అయింది. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ ప్రతినిధులు తర్వాత అనేక అక్రమాలకు పాల్పడ్డారు. వీటన్నింటిపైనా పక్కా ఆధారాలతో ఏసీబీ అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు. నమోదైన కేసుల వివరాలు► అవినీతి నిరోధక శాఖ క్రైమ్ నంబర్ 04/ఆర్సీఓ– సీఐయూ– ఏసీబీ/2020 యు/ఎస్ 13(1), (సీ), (డీ), ఆర్/డబ్ల్యూ 13(2) ఏసీబీ పీసీ సవరణల చట్టం–2018, ఏసీబీలోని ఐపీసీ సెక్షన్ల ప్రకారం సెక్షన్ 408, సెక్షన్ 420, 120–బీ కింద అధికారులు కేసు నమోదు చేశారు. ► 2008 ఆగస్టు 11న కోటబో మ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద మూడో విడత పింఛన్ల పంపిణీని అడ్డుకున్నందుకు ఎఫ్ఐఆర్ నంబర్ 150/2008 ప్రకారం 354, 323, 506(1) అండ్ (2) రెడ్ విత్ 34 సెక్షన్ల ప్రకారం మహిళను అవమానపరిచేలా ప్రవర్తించి, గాయపర్చి, బెదిరించినందుకు తదితర కారణాలతో కేసులు నమోదయయ్యాయి. ► 2014 సార్వత్రిక ఎన్నికల్లో సంతబొమ్మాళి మండలం ఆకాశలక్కవరం గ్రామానికి ప్రచారానికి వెళ్లిన ఆయన్ను అడ్డుకున్న మహిళపై దారుణంగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై నౌపడ పోలీస్‌స్టేషన్‌లో మహిళలు ఫిర్యాదు చేయగా, 341, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తరువాత వారిని బెదిరించి రాజీ యత్నాలు చేశారు. ► 2021 ఫిబ్రవరిలో నిమ్మాడలో కింజరాపు అప్పన్న అనే వ్యక్తి సర్పంచి స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్లగా ఆ నాయకుడి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 44/2021 ప్రకారం 147, 148, 307, 324, 506, 341, 384, 188 రెడ్ విత్ 149 ఐపీసీ, సెక్షన్ 123 ఆఫ్ దీ పీపుల్ రిప్రజెంట్ చట్టం, సెక్షన్ 212 ఆఫ్ ద ఏపీ పంచాయతీ రాజ్ చట్టం 1995 కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ఆ సమయంలో 14 రోజులు రిమాండ్‌లో ఉన్నారు. ఇవిగాకుండా మరెన్నో కేసులు ఆయనపై నమోదై ఉన్నాయి. -
‘యాక్సిస్’లో అవకతవకలు.. కీలక అధికారి తొలగింపు
దేశంలోనే పెద్ద మ్యూచువల్ ఫండ్లలో ఒకటైన యాక్సిస్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫండ్ మేనేజ్మెంట్లో అవకతవకలకు పాల్పడ్డాడంటూ చీఫ్ డీలర్‌ను విధుల్లోంచి తొలగించింది యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ సంస్థ. యాక్సిస్ సంస్థ దేశంలోనే దేశంలోనే ఏడో అతి పెద్ద మ్యూచువల్ఫండ్ సంస్థగా ఉంది. దీని పరిధిలో యాక్సిస్ ఆర్బిట్రేజ్ ఫండ్, యాక్సిస్ బ్యాంకింగ్ ఈటీఎఫ్, యాక్సిస్ నిఫ్టీ ఈటీఎఫ్, యాక్సిస్ టెక్నాలజీ ఈటీఎఫ్, యాక్సిస్ కన్సప్షన్ ఈటీఎఫ్ ఫండ్లకు మేనేజర్‌గా చీఫ్ డీలర్‌గా వీరేశ్ జోషి పని చేసేవారు. అయితే ఫండ్ మేనేజ్మెంట్లో ఆయన అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. 2022 ఫిబ్రవరిలో ఆరోపణలు చుట్టుముట్టగా.. అప్పటి నుంచి విచారన జరుగుతోంది. ఈ ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టారు. చివరకు విచారణ నివేదిక ఆధారంగా వివేశ్జోషిని చీఫ్ డీలర్ పదవి నుంచి తప్పించడంతో పాటు మొత్తంగా యాక్సిస్ నుంచి తొలగించారు. చదవండి: ఎల్ఐసీ లిస్టింగ్.. ప్చ్! -
వెలుగులోకి ధూళిపాళ్ల ట్రస్ట్ అక్రమాలు
-
ఎగ్జిబిషన్ సొసైటీ అక్రమాలు : ఈటెలపై ఫిర్యాదు
-
కార్పొరేట్ కక్కుర్తి..!
శ్రీధర్ ఓ ప్రైవేటు ఉద్యోగి. తన కూతురును ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివిస్తున్నారు. ప్రథమ సంవత్సరంలో రూ. 1.2 లక్షల ఫీజు చెల్లించారు. ఇప్పుడు ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. అందుకోసం ఇప్పటికే రూ. 50 వేలు చెల్లించారు. ఈ నెలాఖరులోగా మిగతా ఫీజు చెల్లించాలని యాజమాన్యం స్పష్టం చేసింది. కాలేజీల్లో ప్రత్యక్ష బోధన లేదు.. ప్రాక్టికల్స్ లేవు. అయినా మొత్తం ఫీజు చెల్లించాలనడంతో గత్యంతరం లేక తన కూతురు భవిష్యత్తు కోసం అప్పు వేటలో పడ్డారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లు ఫీజుల దందా కొనసాగిస్తున్నాయి. రాయితీ ఇస్తామని ఆశపెట్టడం లేదా పిల్లలకు పాఠాలు చెప్పబోమని బెదిరించి మొత్తం ఫీజును వసూలు చేసుకుంటున్నాయి. ప్రత్యక్ష బోధన, ప్రాక్టికల్స్ లేకపోయినా కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు ఆగడాలకు అంతులేకుండా పోతోంది. యాజమాన్యాలు చెప్పినంత ఫీజు చెల్లించాలనే డిమాండ్లతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గడువులోగా ఫీజు చెల్లించకుంటే ఆన్లైన్ క్లాసులు నిలిపేస్తామని హెచ్చరిస్తూ తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. అప్పుడెంతో.. ఇప్పుడూ అంతే రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 404 ఉంటే ప్రైవేటు కాలేజీలే 1,550కుపైగా ఉన్నాయి. అందులో 18 కార్పొరేట్ మేనేజ్మెంట్లకు చెందిన కాలేజీలు 193 ఉన్నట్లు ఇంటర్ బోర్డు లెక్కలు వేసింది. వాటిల్లోనే ఏకంగా 3.4 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. సాధారణ కాలేజీల్లో ఫీజులు రూ. 20–30 వేలు ఉండగా కార్పొరేట్ కాలేజీలు మాత్రం కాలేజీని బట్టి రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. బ్యాచ్‌ను బట్టి రూ. 50 వేల నుంచి రూ. 1.85 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నాయి. ఎంసెట్, ఐఐటీ కోచింగ్ అంటూ ప్రత్యేక బ్యాచ్‌ల పేరుతో అధిక మొత్తంలో ఫీజులు దండుకుంటున్నాయి. గతేడాది నిర్ణయించిన ఫీజునే ఇప్పుడూ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఆన్లైన్ తరగతులు కావడంతో కొంత రాయితీ ఇవ్వాలని కోరినా కాలేజీలో చేర్చినప్పుడు ఖరారు చేసుకున్న మొత్తాన్నే చెల్లించాలని పట్టుపడుతున్నాయి. ఇక ఫీజు చెల్లించని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను నిలిపేస్తున్నాయి. ప్రతి వారం నిర్వహించే స్లిప్ టెస్టులకు దూరం చేస్తున్నాయి. దీంతో ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తప్పని పరిస్థితుల్లో ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. చదవండి: (బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన ఏడుగురికి కరోనా) కాలేజీలకు భారీ లాభం.. ఓ వైపు ఫీజులను తగ్గించట్లేదు. నిర్దేశిత ఫీజులనే వసూలు చేస్తున్నాయి. ఇంకోవైపు ఖర్చు భారీగా తగ్గింది. ఉన్న సిబ్బందిని 10 శాతం కంటే తక్కువకు కుదించాయి. వంద మంది లెక్చరర్లు బోధించాల్సిన క్యాంపస్‌లలో ఆరేడు మంది లెక్చరర్లతో నడిపిస్తున్నాయి. వారితోనే వేల మంది విద్యార్థులకు ఆన్లైన్ బోధన కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి ఒక్కో క్యాంపస్‌లో ఆరేడు వందల మంది విద్యార్థులు ఉంటారు. వారికి 50 మందికిపైగా లెక్చరర్లు అవసరం. వారికి గతంలో వేతనాల రూపంలోనే నెలకు సగటున రూ.12.5 లక్షలు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఐదుగురు లెక్చరర్లకు రూ.లక్ష లోపు చెల్లిస్తూ ఆన్లైన్ బోధన కొనసాగిస్తున్నాయి. ఇలా ఒక్కో కాలేజీలో 90 శాతం మంది బోధనా సిబ్బందిని (మొత్తంగా 10 వేల మందికి పైగా) రోడ్డున పడేసి, వారికి చెల్లించాల్సిన వేతనాల మొత్తాన్ని మిగుల్చుకుంటున్నాయి. అంతేకాదు ఇప్పుడు పనిచేస్తున్న సిబ్బందిలో ఒక్క శాతం మందికే పూర్తి వేతనాలు చెల్లిస్తుండగా, 2 శాతం మందికి 60 శాతం వేతనాలు, మిగతా వారికి 40 శాతం నుంచి 50 శాతం లోపే వేతనాలు చెల్లిస్తూ.. లెక్చరర్లను అర్ధాకలికి గురి చేస్తున్నాయి. ఇతర ప్రైవేటు కాలేజీల్లో బోధించే మరో 10 వేల మందికి పైగా లెక్చరర్లు రోడ్డున పడ్డారు. పట్టించుకోని విద్యా శాఖ కార్పొరేట్ కాలేజీలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా విద్యా శాఖ పట్టించుకోవట్లేదు. స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ చేపట్టాలన్న డిమాండ్ ఉన్నా దానిపై దృష్టి సారించట్లేదు. గతంలో ఒకసారి ఫీజుల నియంత్రణకు కసరత్తు ప్రారంభించినా ఆ తర్వాత గాలికి వదిలేశారు. దీంతో కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు ఆకర్షణీయ పేర్లతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. తొమ్మిది నెలలుగా ఉద్యోగం లేదు: దుబ్బాక జానకిరెడ్డి, రాష్ట్ర లెక్చరర్స్ జేఏసీ ఉపాధ్యక్షుడు ఓ కార్పొరేట్ కాలేజీలో పని చేశాను. కరోనా దెబ్బతో ఉద్యోగానికి దూరమయ్యాను. ఇప్పటికే తొమ్మిది నెలలు గడిచింది. తెలిసిందల్లా టీచింగే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సెకండ్ వేవ్ అంటున్నారు. అదే పరిస్థితి వస్తే జీవనోపాధి ఇంకా కష్టంగా మారుతుంది. ట్యూషన్లు చెబుతున్నా: మారోజు చంద్రశేఖర్, రాష్ట్ర లెక్చరర్స్ సంఘం అధ్యక్షుడు కరోనాతో కాలేజీ మూత పడినప్పటి నుంచి నో వర్క్– నో పేలోనే ఉన్నాను. ఇకనైనా పిలుస్తారని ఆశిస్తున్నాం. ఇన్నాళ్లూ పని లేదు. ఇకనైనా ఉంటుందో లేదో అర్థం కావట్లేదు. అందుకే హోం ట్యూషన్స్ చెప్పి జీవనం కొనసాగిస్తున్నా. నాకు తెలిసిన అనేక మంది లెక్చరర్లు కూలీలుగా మారిపోయారు. -
అప్పుడు కాదు.. ఇప్పుడే!
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలు రాకముందే యూనివర్సిటీల్లోని దాదాపు 1,110 పోస్టులను తమ వారికి కట్టబెట్టేందుకు అధికార తెలుగుదేశం పార్టీ ఉన్నత విద్యామండలిలోని తన మనుషుల ద్వారా పావులు కదుపుతోంది. ఈనెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక అధికారం చేజారితే ఏమీ చేయలేమన్న ఆందోళనతో అంతకు ముందుగానే ఈ పోస్టుల భర్తీని ముగించాలని హడావుడి చేస్తోంది. ఇందులో భాగంగా ఉన్నత విద్యామండలిలోని వైస్ చైర్మన్, సీఎంఓలోని కొందరు అధికారుల ద్వారా ఇప్పటికే ఏర్పాట్లు చేయించారు. వాస్తవానికి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి ఇంటర్వ్యూలు, నియామకాలు చేయడానికి వీల్లేనందున ఉన్నత విద్యామండలి ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ రాయించారు. ఈ లేఖను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించగా ఇంటర్వ్యూల నిర్వహణకు అభ్యంతరం లేదని తెలిపింది. దీని ఆధారంగా నియామకాలు చేయాలని ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం అనుమతించినా, పోస్టుల రేషనలైజేషన్, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అన్ని యూనివర్సిటీల పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ టెస్టు నిర్వహించడంపై రిట్ పిటిషన్లు, రిట్ అప్పీళ్లు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని యూనివర్సిటీలపై స్టే ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఇవేవీ పరిష్కారం కాకుండానే నియామకాలు ముగించాలని ప్రభుత్వ పెద్దలు హడావుడి చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన అనుమతి మేరకు ఇంటర్వ్యూల నిర్వహణకు నిబంధనల మేరకు ముందుకు వెళ్లవచ్చని గత నెల 25న ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి ఉత్తర్వులు జారీ చేస్తూ.. ఈ పోస్టుల భర్తీకి వీలుగా కోర్టుల్లో ఉన్న న్యాయవివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అందులోనే స్పష్టం చేశారు. ప్రభుత్వ ముఖ్యులు ఈ విషయాన్ని పక్కన పెట్టి నియామకాలు త్వరగా పూర్తి చేయించాలని ఆయా వర్సిటీలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు వీలుగా షెడ్యూళ్లు పంపించాలని ఉన్నత విద్యామండలి ద్వారా ఆయా వర్సిటీలకు ఆదేశాలు జారీ చేయిస్తున్నారు. ఆ షెడ్యూళ్లు వచ్చాక కామన్ షెడ్యూల్ ఇచ్చి భర్తీ చేయించాలని చూస్తున్నారు. భారీ మొత్తాలకు పోస్టుల అమ్మకాలు వర్సిటీల్లోని బోధనా పోస్టులను అధికార తెలుగుదేశం పార్టీ నేతలు భారీ మొత్తాలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆయా అభ్యర్థుల నుంచి డబ్బును కూడా తీసుకున్నారు. ఇందులో ఉన్నత విద్యామండలిలోని కొందరు అధికారుల పాత్ర కూడా ఉంది. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని తేటతెల్లమవుతుండడంతో వారందరి నుంచి ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు రావడంతో ఇంటర్వ్యూలు పూర్తి చేయించాలని చూస్తున్నారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వర్సిటీల్లో 1,110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై న్యాయస్థానంలో ఉన్న కేసులు పరిష్కారం కాకుండానే ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేయడం సరికాదని, దీన్ని నిలుపుదల చేయాలని ఇప్పటికే పలు యూనివర్సిటీల అధ్యాపక సంఘాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఎన్నికల సంఘం అనుమతిచ్చిందన్న సాకుతో భర్తీకి ముందుకు వెళ్తే ఆయా యూనివర్సిటీల అధికారులపై కోర్టు ధిక్కార కేసులు కూడా దాఖలు చేయాలని ఆయా సంఘాలు నిర్ణయించాయి. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఇంటర్వ్యూలు, నియామకాలు చేపడితే తదనంతర పరిణామాలకు ఆయా వర్సిటీల అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయా సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. అధికార తెలుగుదేశం నేతలు, ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు లొంగి అనవసరంగా సమస్యల్లో చిక్కుకోవద్దని వర్సిటీల అధికారులకు నిపుణులు సూచిస్తున్నారు. యూజీసీ ఉత్తర్వులూ బేఖాతర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం లేదని సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నందున తుది నిర్ణయం వెలువడే వరకు భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని కొన్ని నెలల క్రితం యూజీసీ దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు పోస్టుల భర్తీని నిలిపి వేయాలని ఉన్నత విద్యాశాఖ ఇంతకు ముందు ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. హైకోర్టు కూడా ఈ మేరకు ఆదేశించింది. అయినా ప్రభుత్వ పెద్దలు తెరవెనుక నుంచి ఉన్నత విద్యామండలి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయిస్తున్నారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ఒకరు ఫోన్ చేసి ఆయా వర్సిటీల అధికారులపై ఒత్తిడి చేస్తుండటమే ఇందుకు నిదర్శనం. అంతా అక్రమాల మయం యూనివర్సిటీ బోధనా పోస్టుల భర్తీ వ్యవహారం ఆది నుంచి అక్రమాలమయంగా మారిందన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో దాదాపు 4 వేల వరకు పోస్టులు ఖాళీగా ఉంటే, ప్రభుత్వం రేషనలైజేషన్ పేరిట 1,385 పోస్టులకు కుదించింది. ఇది కూడా సీఎంవోలో ఉన్న ఒక సలహాదారు, ఉన్నత విద్యామండలిలోని ఉపాధ్యక్షుడొకరు కలసి తమకు నచ్చిన రీతిలో తమ సామాజికవర్గ వ్యక్తులకు వీలుగా చేయించారన్న ఆరోపణలున్నాయి. రేషనలైజేషన్ అక్రమాలపై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. మొత్తం పోస్టుల్లో ప్రొఫెసర్ 101, అసోసియేట్ ప్రొఫెసర్ 174, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 1,110 ఉన్నాయి. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా వర్సిటీల పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడంపైనా కోర్టుల్లో వ్యాజ్యం నడుస్తోంది. ఇన్ని వివాదాలున్నప్పటికీ పోస్టుల భర్తీకి ప్రభుత్వ పెద్దలు హడావుడి చేస్తుండటానికి కారణం జేబులు నింపుకోవడానికేనని స్పష్టమవుతోంది. -
కట్టలు తెగిన అవినీతి
– బయటపడుతున్న శ్రీశైలం మాజీ ఈవో అక్రమాలు – కర్నూలులో లాకర్ తెరిచిన ఏసీబీ అధికారులు – రూ. 40,47,500 నగదు, ముప్పావు కిలో వెండి స్వాధీనం – గుంటూరులో మూడో లాకర్ తెరుస్తామన్న ఏసీబీ డీఎస్పీ కర్నూలు(టౌన్): శ్రీశైలం మాజీ ఈవో కంచర్ల సాగర్‌బాబు అక్రమ ఆస్తులు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. గురువారం విజయవాడలో సోదాలు నిర్వహించిన ఏసీబీ ఆధికారులు శుక్రవారం కూడా కొనసాగించారు. కర్నూలు బీక్యాంపు విజ్ఞాన మందిరం ఆంధ్రాబ్యాంకు బ్రాంచ్‌లో లాకర్‌ను తెరవగా అక్రమ ఆస్తులు వెలుగుచూసాయి. ఏసీబీ ప్రత్యేక బందానికి చెందిన డీఎస్పీ రమాదేవి నేతత్వంలో ఇద్దరు ఎస్ఐలు, సిబ్బంది, శ్రీశైలం మాజీ ఈవో సాగర్‌బాబుతో కలిసి మధ్యాహ్నం 2.50 గంటలకు బ్యాంకుకు చేరుకున్నారు. బ్యాంకు మేనేజర్ సుబ్రమణ్యాన్ని కలిసి అకౌంట్, లాకర్ వివరాలను తెలుసుకున్నారు. బ్యాంకులో సాగర్‌బాబు తన భార్యపేరు మీద జాయింట్ అకౌంట్‌తో లాకర్ ఉంచారు. దాన్ని తెరువగా వెయ్యి, ఐదువందల నోట్ల కట్టలు కనిపించాయి. ట్రేలలో తెచ్చి ఎంచేందుకు వీలు కాకపోవడంతో మనీ కౌంటింగ్ మిషన్ ద్వారా వాటిని లెక్క కట్టారు. రెండు గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. మొత్తం రూ. 40,47,500 నగదు బయట పడింది. అలాగే వెండి భరిణిలు, కప్పులు ఉన్నాయి. వీటి బరువు ముప్పావు కిలో ఉంది. వీటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరులో మూడో లాకర్ తెరుస్తాం: ఏసీబీ డీఎస్పీ రమాదేవి సాగర్‌బాబుకు సంబంధించి ఇప్పటి వరకు రెండు లాకర్లు తెరిచాం. శనివారం గుంటూరులో ఉన్న మూడో లాకర్‌ను తెరుస్తాం. సాగర్‌బాబు ఆస్తులకు సంబంధించి ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాం. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ డైరెక్టర్ జనరల్ మాలకొండయ్య ఆదేశాల మేరకు సోదాలు నిర్వహిస్తున్నాం. విజయవాడ ఆంధ్రా బ్యాంకులో రూ. 49,30,000 నగదు, 36 తులాల బంగారం బయట పడింది. రెండు లాకర్ల ద్వారా ఇప్పటి వరకు రూ. 89,50,000 నగదును సీజ్ చేశాం. మూడో లాకర్ సాగర్‌బాబుకు బినామీగా వ్యవహరిస్తున్న శ్రీశైలం ఉద్యోగి శ్రీనివాసరావు పేరు మీద ఉంది. నగదు కాకుండా ఆరు ప్లాట్లు, జిప్లస్ 1 ఇల్లు, స్కార్పియో, ఇండికా కార్లు, నాలుగు ఎకరాల పొలం ఉన్నట్లు గుర్తించాం. సాగర్‌బాబు అవినీతికి సంబంధించి ఏవైనా వివరాలు ఉంటే నిర్భయంగా ఇవ్వవచ్చు. పేర్లు గోప్యంగా ఉంచుతాం.