irrigation canal
-
Sitarama project: ముంపు సంగతేంటి...?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలపై సునిశిత పరిశీలన చేస్తున్న గోదావరి బోర్డు.. తాజాగా సీతారామ ఎత్తిపోతలపై అనేక ప్రశ్నలు సంధించింది. ప్రాజెక్టు హైడ్రాలజీ వివరాలు, డ్రాయింగ్లు, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, నిధుల ఖర్చులు, వచ్చిన అనుమతులకు సంబంధించి అన్ని వివరాలు తమ ముందుంచాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. డీపీఆర్ ఆమోద ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా తాము కోరిన వివరాలన్నీ సమర్పించాలంటూ తాజాగా రాష్ట్రానికి లేఖ రాసింది. ఇందులో ప్రధానంగా.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లెక్కల ప్రకారం దుమ్ముగూడెం వద్ద గరిష్ట వరద 36 లక్షలుగా ఉన్నప్పుడు గోదావరి నీటి మట్టం 62.86 మీటర్లుగా ఉందని పేర్కొంది. 50 ఏళ్ల గరిష్ట వరద చూసినప్పుడు అత్యధిక నీటి మట్టం 60.43 మీటర్లు ఉందని చెప్పింది. కానీ, ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ 56.5 మీటర్లులో నిర్మి స్తున్నారని, గరిష్ట వరద నమోదైనప్పుడు హెడ్‌వర్క్ పనులు ముంపునకు గురయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోందన్న అనుమానాన్ని బోర్డు వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర వరదల లెక్కలతో తమకు నివేదించాలని కోరింది. రబీకి ఎక్కడి నుంచి మళ్లిస్తారు... ఇక గోదావరిలో వరద ఉన్న 90–120 రోజుల్లోనే గోదావరి నుంచి 70 టీఎంసీల నీటిని తీసుకుంటా మంటున్నారని, వరద ముగిశాక రబీకి అవసరమైన 29.42 టీఎంసీల నీటిని ఎక్కడి నుంచి మళ్లిస్తారో వెల్లడించాలని కోరింది. హెడ్‌రెగ్యులేటర్‌ను 400 క్యూసెక్కుల నీటిని తీసుకునేలా డిజైన్ చేయగా, కాల్వ సామర్థ్యాన్ని 256 క్యూసెక్కులకే డిజైన్ చేశారని, ఈ తేడాలెందుకో తెలపాలని కోరింది. ఇప్పటికే ప్రాజెక్టులో 50శాతం పనులు పూర్తయ్యా యని చెబుతున్నారని, అయితే ప్రస్తుతం మిగిలిన పనులు, నిధుల ఖర్చు వివరాలు తెలపాలంది. ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్ అవసరాలు, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ నిర్ధారించిన ఒక్కో యూనిట్ విద్యుత్ ధరలు, దీనికి అనుగుణంగా కాస్ట్ బెనిఫిట్ రేషియో వివరాలు అందించాలని తెలిపింది. గోదావరికి సంబంధించి తెలంగాణ, ఏపీ సరిహద్దులుగా ఉన్న కొత్త మ్యాప్‌లు, పరివా హక రాష్ట్రాలో వివిధ సందర్భాల్లో జరిగిన ఒప్పం దాల నివేదికలు తమ ముందుంచాలని తెలిపింది. కాళేశ్వరం, సీతారామ ద్వారా 307 టీఎంసీల మేర నీటిని తెలంగాణ వినియోగిస్తుందన్నందున దుమ్ముగూడెం వద్ద లభ్యతగా ఉండే మిగతా జలాలు, సహజ(ఎకో) ప్రవాహాల వివరాలు అందించాలంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు లభించిన అన్ని రకాల అనుమతులు ముఖ్యంగా పర్యావరణ, అటవీ, రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం వంటి వివ రాలను సమర్పించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. -
నలభైయేళ్లుగా నిర్మాణం, ఒక్క రోజులోనే..
రాంచీ : నలభై రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న సాగునీటి కాలువ, సీఎం చేతుల మీదుగా ప్రారంభమైన ఇరవై నాలుగ్గంటల్లోనే కొట్టుకుపోయింది. దీనికి అధికారులు చెప్పిన కారణం ఏంటో తెలుసా? ఎలుకలు పెట్టిన బొరియలు. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. వివరాలు.. నలభై రెండేళ్ల క్రితం ఉమ్మడి బిహార్‌లో హజారిబాగ్ జిల్లాలోని కోనార్ నదిపై ఈ కాలువ నిర్మాణం ప్రారంభమైంది. అప్పటి నిర్మాణ అంచనా వ్యయం రూ. 12 కోట్లు. కాలువ పూర్తయ్యేసరికి నాలుగు దశాబ్దాల సమయంతో పాటు అంచనా వ్యయం కూడా పెరిగి రూ. 2176 కోట్లకు చేరింది. ఎట్టకేలకు పూర్తైన కాలువను బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్‌దాస్ బుధవారం ప్రారంభించి, అధికారులు చేసిన కృషిని ప్రశంసించారు కూడా. అయితే గురువారం వచ్చిన వరదలకు కాలువ నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. వరదల వల్ల 35 గ్రామాలతో పాటు పంటపొలాలు మునిగిపోయాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి 24 గంటల్లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ సంఘటనపై అధికారులను వివరణ అడగ్గా నివ్వెరపోయే సమాధానం వచ్చింది. కాలువ గట్లలో ఎలుకలు బొరియలు తవ్వడం వల్ల వరద నీరు లీకై కాలువ గట్టు కొట్టుకుపోయిందని ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోందని వివరించారు. మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తూ, నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. -
నాలుగేళ్లుగా ఎదురుచూపులు..
ప్రజా సంకల్పయాత్ర బృందం: తోటపల్లి ప్రాజెక్ట్ నీటి కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నామని గజపతినగరం నియోజకవర్గ సన్న, చిన్నకారు రైతుల తరఫున డి.దేముడు, ఎంసీ నాయుడు, తదితరులు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గజపతినగరం నియోజకవర్గంలో గజపతినగరం మండలం గుడివాడ క్రాస్ వద్ద పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తోటపల్లి ప్రధాన కాలువ నుంచి గజపతినగరం బ్రాంచి కెనాల్ పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టర్, అధికారుల ఉదాసీన వైఖరి వల్లే పనులు పూర్తి కావడం లేదన్నారు. దీంతో గజపతినగరం, దత్తిరాజేరు మండలాల్లో సుమారు 15 వేల ఎకరాలకు సాగు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే బాబూ జగజ్జీవన్‌రామ్ సుజల స్రవంతి పథకాన్ని అమలు చేస్తే ఉత్తరాంధ్రలో సుమారు నాలుగు లక్షల ఎకరాల భూమికి సాగునీరందుతుందని చెప్పారు. సాగు నీటి పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు న్యాయంచేయాలని కోరారు. కార్మికుల పక్షాన నిలవాలి.. పారిశుద్ధ్య కార్మికుల పక్షాన నిలబడి న్యాయం చేయాలని గజపతినగరం డివిజన్ పారిశుద్ధ్య కార్మికుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు పి.నాగేశ్వరరావు, ఎస్.కృష్ణ, గౌరవాధ్యక్షుడు కె.అప్పలరాజు, తదితరులు కోరారు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి పురం అప్పారావు ఆధ్వర్యంలో మానాపురం వద్ద జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అర్హులైన కార్మికులకు కార్యదర్శులు, జూనియర్ అసిస్టెంట్లుగా నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు. జీఓ 151 ప్రకారం జీతాలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా అమలు కావడం లేదని వాపోయారు. వివక్ష కనబరుస్తున్నారు.. అనంతపురం జిల్లాలో గల శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల విషయంలో ప్రభుత్వం వివక్ష కనబరుస్తోందని యూనివర్సీటీ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ చాగంటి రామిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూనివర్సీటీలో 29 మంది రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి 2009లో నోటిఫికేషన్ ఇచ్చి 2010లో విధులు అప్పగించారన్నారు. అయితే డీఏ, ఇంక్రిమెంట్ల వంటి సౌకర్యాలు కల్పించడంలో యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. రెగ్యులర్ సిబ్బందితో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలన్న హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని జననేత దృష్టికి తీసుకువచ్చారు. టీడీపీ హయాంలో అన్యాయం.. చంద్రబాబు సర్కార్ గీత కార్మికులకు తీరని అన్యాయం చేసిందని ఏపీ గీతకార్మిక సంఘ జిల్లా కమిటీ అధ్యక్షుడు పురం ఫణీంద్రకుమార్ అన్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని కలిసి కార్మికుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 80 వేల కుటుంబాలు.. 100కు పైగా సంఘాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయరన్నారు. జీఓ 560 ప్రకారం ప్రతి గీత కార్మిక సొసైటీకి ఐదెకరాల భూమి ఇస్తామన్న హామీ కూడా నెరవేర్చలేదని వాపోయారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక గీత కార్మికులను ఆదుకోవాలని కోరారు. -
పంట కాలువలో శిశువు మృతదేహం
సారంగపూర్ : ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో పంట కాలువలో శిశువు మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమచారం అందించారు. ఎవరు పడేసి ఉంటారని స్థానికులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తమ్ముళ్ల జేబులు నింపేందుకే రూ.4 కోట్ల పనులు
కొడవలూరు: తెలుగుతమ్ముళ్ల జేబుల్లోకి అప్పనంగా రూ.4 కోట్ల నిధులను పంపేందుకు రంగం సిద్ధమైంది. ఆయకట్టుదారుల పేరుతో కాలువల పూడికతీత పనులను తమ్ముళ్లకు కట్టబెట్టేందుకు అధికార పార్టీ నేతలు సన్నద్ధమయ్యారు. తొలుత కాలువల పూడికతీత బాధ్యతలను టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించాలని నిర్ణయించారు. నేతల ఒత్తిళ్లతో ఆయకట్టుదారులకే ఆ పనులు అప్పగించాలనే వాదాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తెరమీదకు తెచ్చారు. సోమశిల జలాలను శనివారం విడుదల చేశారు. అయినా ఇప్పటి దాకా కాలువల పూడికతీత పనులు ప్రారంభం కాలేదు. ప్రధాన సాగునీటి కాలువల పూడికతీత పూర్తి స్థాయిలో జరగాలంటే కనీసం మూడు వారాల వ్యవధి అవసరమని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. పనుల బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న విషయమై అధికార నేతలు తర్జనభర్జన పడడం వల్లే పూడిక తీతలో తీవ్రజాప్యం చోటుచేసుకుందన్న విమర్శలున్నాయి. ఐఏబీ సమావేశంలో ఈ నెల 25 నుంచి సోమశిల జలాలను విడుదల చేస్తామని ప్రకటించారు. 4,16,640 ఎకరాలకు సాగు నీరందించాలని నిర్ణయించారు. ఆయకట్టుకు సాగునీరు సవ్యంగా అందాలంటే కాలువలు బాగుండాలి. అయితే ప్రధాన కాలువలన్నీ తూటాకు, జమ్ముతో నిండి ఉన్నాయి. వీటిని పూర్తి స్థాయిలో తొలగించని పక్షంలో చివరి ఆయకట్టుదారులకు సాగు నీరందవు. ఈ సమస్యను అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడంతో తక్షణం కాలువల మరమ్మతులకు రూ.4 కోట్లు విడుదల చేసేందుకు ఆయన అంగీకరించారు.అయితే పూడికతీత పనులు ప్రారంభం కాకపోవడంతో రబీ సాగుకు సిద్ధమవుతున్న రైతుల్లో ఆందోళన నెలకొంది. కాలువల దుస్థితిని చూసి రైతులు నారు పోసుకునేందుకు వెనుకాడుతున్నారు. తమ్ముళ్ల కోసమే.. : కాలువల పూడికతీతకు ముఖ్యమంత్రి రూ.4 కోట్ల నిధులు ఇచ్చారని,వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపడుతామని జన్మభూమి సభల్లో ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చెబుతూ వచ్చారు. నియోజకవర్గం డెల్టా ప్రాంతం కావడంతో రైతులు కూడా ఆనందించారు. అయితే జన్మభూమి చివరి రోజుల్లో కాలువల పూడికతీతపై రైతులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కాలువల కింద ఆయకట్టున్న రైతులకే పూడికతీత పనులు అప్పగించేలా అధికారులను ఒప్పించామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే సమాధానమిచ్చారు. నీటి విడుదల ప్రారంభమైనా హామీలే తప్ప పనులు మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. నీటి విడుదల జరిగాక పూడికతీత పనుల్లో నాణ్యత పాటించే అవకాశాలు లేవనే వాదన ఉంది. ఇప్పటికే పూడికతీత పనులు పూర్తి కావాల్సి ఉంది. ఆయకట్టు రైతులకే పూడికతీత పనులు అప్పగిస్తే వారు బాధ్యతతో వ్యవహరించే అవకాశం ఉంది. ఇక్కడ అధికార పెద్దల ఆలోచన మరోలా ఉందన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. తెలుగు తమ్ముళ్లకు పూడిక పనులు అప్పగించి వారు నాలుగు రూకలసంపాదించుకునేందుకే అధికారులపై ఒత్తిడి తెచ్చి టెండర్లు లేకుండా చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదీ ఆయకట్టు: సోమశిల జలాశయం నుంచి అధికారికంగా 4,16,640 ఎకరాలకు అందాల్సి ఉంది. ఇందులో పెన్నా డెల్టా కింద 2.47 లక్షల ఎకరాలుంది. కనుపూరు కాలువ కింద 33 వేల ఎకరాలు, కావలి కాలువ కింద 72,489 ఎకరాలు, ఉత్తర కాలువ కింద 34,257 ఎకరాలు, దక్షిణ కాలువ కింద 29,894 ఎకరాల ఆయకట్టు ఉంది. పెన్నా డెల్టా పరిధిలోని ఆయకట్టుకు సంగం డెల్టా కింద ఏటీఎస్ కాలువ ద్వారా 26,826 ఎకరాలకు, దక్షిణ కాలువ ద్వారా 25 వేలు, తూర్పు కాలువ ద్వారా 25,491 ఎకరాలకు సాగు నీరందుతుంది. నెల్లూరు డెల్టా కింద జాఫర్ సాహె బ్ కాలువ ద్వారా 33 వేల ఎకరాలు, సర్వేపల్లి కాలువ ద్వారా 30 వేలు, నెల్లూరు చెరువు ద్వారా 12 వేలు, సర్వేపల్లి రిజర్వాయర్ ద్వారా 14 వేల ఎకరాలకు నీరందాల్సి ఉంది.