island resort
-
ఏమి హాయిలే హల..!
-
Australia: ఎంత చెత్త దొరికితే.. ఈ దీవిని అంత పెంచుతారట
వాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, వస్తువులను ఏం చేస్తాం?.. బయట చెత్తలో పడేస్తాం.. మరి ఈ ప్లాస్టిక్ చెత్తంతా ఎక్కడికిపోతోంది?.. అటూ ఇటూ తిరిగి అంతా సముద్రాల్లోకి చేరుతోంది. ఇటు మనుషులకు, అటు సముద్ర జీవులకు ఇదో పొల్యూషన్ సమస్య. ఈ ఇబ్బందిని ఎంతో కొంత తగ్గిస్తూనే.. అదే సమయంలో ఆహ్లాదం కలిగించేలా.. ప్లాస్టిక్ చెత్తతో సముద్రంపై ఓ రిసార్ట్ కట్టేస్తే..! అలలపై అలా అలా తేలుతూ ఎంజాయ్ చెయ్యగలిగితే..! భలే ఐడియా కదా. ఆ్రస్టేలియాకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ మార్గోట్ క్రసోజెవిక్ నీటిమీద తేలుతూ ఉండే ఈ సరికొత్త ఐలాండ్ రిసార్ట్‌ను డిజైన్ చేశారు. దీనికి ‘రీసైకిల్డ్ ఓసియన్ ప్లాస్టిక్ రిసార్ట్’గా పేరు పెట్టారు. ఆస్ట్రేలియా ఖండానికి కాస్త దూరంలో ఉన్న కీలింగ్ (కొకోస్) దీవుల దగ్గర సముద్రంలో దీన్ని కట్టేందుకు ఇప్పటికే ప్లానింగ్ మొదలుపెట్టారు. హిందూ మహా సముద్రంలో చేరిన ప్లాస్టిక్ చెత్తతో దీన్ని నిర్మించనున్నామని.. 2025 నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. చెత్త దొరికే కొద్దీ.. దీవి పెరుగుతూ.. ‘ఫ్లోటింగ్ ఐలాండ్ రిసార్ట్’ కోసం.. ముందు కలప, బయో డీగ్రేడబుల్ ఫైబర్ కాంక్రీట్ మెష్ (మెల్లగా క్షీణిస్తూ పర్యావరణంలో కలిసిపోయే ఫైబర్ వల)తో ప్రధాన నిర్మాణాన్ని కడతారు. దానికి చుట్టూ మెష్‌తో వాక్ వేలు (నడిచే దారులు) నిర్మిస్తారు. ఐలాండ్ రిసార్ట్ నీటిపై తేలుతూ, స్థిరంగా ఉండటానికి ఆయిల్ రిగ్స్ (చమురు తవ్వితీసే కేంద్రాల) తరహాలో ప్రత్యేక పరికరాలను అమర్చుతారు. ఈ ఐలాండ్ సముద్రంలో తేలుతూ కదులుతున్న కొద్దీ ఈ వలలో ప్లాస్టిక్ చెత్త చిక్కుతూ ఉంటుంది. దానిని గట్టిగా సంచుల్లో నింపి.. ఈ వాక్వేలలోనే గట్టిగా బిగిస్తారు. వాటిపై కాస్త ఇసుక, మట్టి వంటివి పరిచి, దారుల్లాగా మార్చుతారు. ఈ వాక్‌వేలు పూర్తయ్యాక చుట్టూ మరిన్ని మెష్‌లు ఏర్పాటు చేస్తారు. వాటిల్లో చిక్కుకునే ప్లాస్టిక్ చెత్తతో వాక్‌వేలను రూపొందిస్తారు. ఇలా దీవిని విస్తరించుకుంటూ వెళ్లవచ్చని రూపకర్తలు చెప్తున్నారు. చదవండి: అగ్నిపర్వతంలో పడిపోయిన డ్రోన్ కెమెరా.. దానికి ముందు -
షార్జాలో మరో అద్భుత నిర్మాణం
షార్జా : అరుదైన నిర్మాణాలకు ఖ్యాతిగాంచిన యూఏఈ మరో భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. దుబాయ్ తీరంలో ‘పామ్ ఐలాండ్’ పేరుతో నిర్మించిన దీవి.. ప్రపంచ పర్యాటకులను ఎంతగా ఆకర్షిస్తున్నదో తెలిసిందే. దాదాపు అదే తరహాలో ‘సన్ ఐలాండ్’ పేరుతో సముద్ర భాగంలో చిన్నచిన్న ఎనిమిది ద్వీపాలను కలుపుతూ ఏకంగా నగరాన్నే నిర్మించ తలపెట్టింది. మొదటి విడతలో ఖరీదైన 231 విల్లాలతో నిర్మిస్తున్న ఈ వాటర్ ఫ్రంట్ సిటీకి సన్ ఐలాండ్ గా నామకరణం చేసింది. తాజాగా ఈ సన్ ఐలాండ్ నమునా చిత్రాన్ని విడుదల చేశారు దీని డెవలపర్లు. మొదటి దశలో ఖరీదైన 231 విల్లాలో కొన్ని మూడు, నాలుగు బెడ్రూంలతో, మరికొన్ని ఐదు, ఆరు బెడ్రూంలతో నిర్మించనున్నారు. 2019 చివరి నాటికి ఈ వాటర్ ఫ్రంట్ సిటీ నిర్మాణం ప్రారంభం కానుంది. ఇప్పటికే కెంపిన్స్కీ, డ్యూసిట్ కంపెనీలు ఈ ప్రాజెక్టులో ఆపరేటర్లుగా చేసేందుకు సంతకాలు చేశాయి. విల్లాల్లో వాణిజ్య యూనిట్లు, షాపింగ్ మాల్స్, వాటర్ పార్కు, హోటళ్ళు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టును నిర్మించే ప్రదేశం హమ్రియయా జోన్ కిందికి వస్తుంది. 8 నుంచి 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందట. ఈ వాటర్ ఫ్రంట్ సిటీ ద్వారా ప్రక్కనే ఉన్న దుబాయ్, అబుదాబి వంటి ఎమిరేట్స్ వాసులకు వినోదం, విశ్రాంతికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ ఎమిరేట్స్‌ను ఆకర్షించే నీటి టాక్సీలను అందించే దుబాయ్ ఆర్టీఏతో డెవలపర్లు ఇప్పటికే చర్చలు జరుపుతున్నారని తెలిసింది. -
3వేల లాటరీతో.. ఐలండ్ రిసార్ట్ గెలిచాడు!
అదృష్టం అంటే అతడిదే. కేవలం 3వేల రూపాయలు పెట్టి ఓ లాటరీ టికెట్ కొంటే.. ఏకంగా ఓ ఐలండ్ రిసార్ట్ అతడికి బహుమతిగా వచ్చేసింది. అది కూడా అలాంటిది, ఇలాంటిది కాదు.. పగడాల దిబ్బలు, గుహలు, మంచి అడవులు.. ఇవన్నీ ఆ దీవిలో ఉన్నాయి. న్యూ సౌత్ వేల్స్ ప్రాంతానికి చెందిన జోషువా అనే ఆ వ్యక్తి ‘ద కోస్రే నాటిలస్ రిసార్ట్’ను గెలుచుకున్నారు. దాని యజమానులు ఆస్ట్రేలియన్ దంపతులు. వాళ్లకు మనవళ్లు, మనవరాళ్లు పుట్టడంతో.. ద్వీపం వదిలి ఆస్ట్రేలియా వెళ్లిపోదాం అనుకుని ద్వీపాన్ని లాటరీ పెట్టారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ రిసార్టును ఎవరైనా బాగా ప్రకృతి ప్రేమికులకు ఇవ్వాలని వాల్లు అనుకున్నారు. ఏదో డబ్బులు పెట్టి కొనుక్కోవడం కాకుండా.. ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించే వాళ్లయితే మేలని భావించారు. దీనికి సంబంధించి కథనాన్ని ఓ వెబ్సైట్లో చూసిన జోషువా.. మూడు టికెట్లు కొన్నాడు. అనుకోకుండా అతడికి లాటరీ తగిలేసింది. దాంతో అతడి ఆనందానికి అంతూ పొంతూ లేదు. ఐలండ్ రిసార్టు యజమానులు డౌగ్, సాలీలకు తాను ఎంతో రుణపడి ఉంటానని చెప్పాడు. కాగా, ఈ ఐలండ్ రిసార్ట్ గెలుచుకోడానికి లాటరీ నిర్వహించగా.. మొత్తం 75,485 టికెట్లు అమ్ముడుపోయాయి.150 దేశాలకు చెందినవాళ్లు వీటిని కొన్నారు. ఒకో టికెట్‌ను రూ. 3వేల చొప్పున అమ్మారు. ఎక్కువ టికెట్లు కొంటే డిస్కౌంటు కూడా ఇచ్చారు. జోషువా కావాలనుకుంటే తనంతట తానే ఈ రిసార్టును నిర్వహించుకోవచ్చు.. లేదా మేనేజర్‌ను నియమించుకోవచ్చు. దీనిమీద ఎలాంటి అప్పులు లేవు. ఇప్పటికే లాభాల్లో ఉంది, తగినంతమంది సిబ్బంది కూడా ఇందులో ఉన్నారు. మరి ఇది బంపర్ ప్రైజ్ కాక మరేమవుతుంది!!