Jagapathi
-
వేణుస్వామి నటించిన రెండు తెలుగు సినిమాలు... అవేంటో తెలుసా?
సాధారణంగా జ్యోతిష్యులు ఫేమ్ తెచ్చుకోవడం చాలా అరుదు. కానీ గత కొన్నాళ్ల నుంచి ఓ ఆస్ట్రాలజర్ మాత్రం సినిమా హీరోహీరోయిన్ల కంటే గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే వేణుస్వామి. స్టార్ హీరోల జాతకాల చెప్పడం దగ్గర నుంచి స్టార్ హీరోయిన్ల ఇంట్లో పూజల చేయడం లాంటివి ఈయన చేస్తుంటారు. ఈ మధ్య చిన్నపాటి వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. అలాంటి ఈయన తెలుగు సినిమాలోనూ యాక్ట్ చేశారా? (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?) అవును మీరు సరిగానే విన్నారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి.. జగపతిబాబు హీరోగా చేసిన 'జగపతి' అనే తెలుగు సినిమాలో చిన్న పాత్రలో అలా కనిపించారు. అయితే ఇది కూడా గుడిలోని అర్చకుడు వేషం. కాకపోతే ఈ సినిమా 2005లో రావడం, అప్పుడు వేణుస్వామి ఎవరనేది పెద్దగా తెలియకపోవడం లాంటి వాటి వల్ల ప్రేక్షకులకు పెద్దగా గుర్తుంచుకోలేకపోయారు. అలానే 'అతడు' చిత్రంలో ఓ పాటలో కనిపించారు. ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా కాబట్టి వేణు స్వామి యాక్ట్ చేసిన మూవీ క్లిప్ అనేది వైరల్ అయింది. అలా ఈయన కూడా అప్పట్లో యాక్ట్ చేశారని జనాలకు తెలిసింది. ఇకపోతే ఈ మధ్యనే వేణుస్వామి మాట్లాడుతూ.. టాలీవుడ్‌కి చెందిన సూపర్‌స్టార్.. ఇండస్ట్రీని విడిచిపెట్టేస్తారని సెన్సేషనల్ కామెంట్స్ చేయడం విశేషం. (ఇదీ చదవండి: కేటుగాళ్ల దెబ్బకు లక్షలు మోసపోయిన అవార్డ్ విన్నింగ్ తెలుగు హీరోయిన్) Venu Swamy in Jagapathi Movie 😂 pic.twitter.com/gJ1s4KjQ61 — AitheyEnti (@Vyavasaayam) January 2, 2024 Ikkada kuda unnaadu chillar gaadu 😝 Baabu Cinema lo Junior artist gaadivi neekendhuku ra Prabhas Future Prediction lu... 🥱 Edhainaa pani cheskora Bewakoof 😪 pic.twitter.com/QhKBC2xEC8 — Just_JanakiRam (@Just_JanakiRam_) January 2, 2024 -
పుష్ప 2 నుండి అదిరిపోయే అప్డేట్..
-
కరెంటుషాక్‌తో ఇద్దరు మృత్యువాత
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం వెల్లమిల్లి గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్‌తో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఓ రైతు పొలంలో వరికోత యంత్రంతో కోతలు జరుపుతుండగా ప్రమాదవశాత్తు పైనుంచి వెళ్తున్న కరెంటు తీగలు మిషన్‌కు తాకాయి. దీంతో షాక్‌కు గురై యంత్రం నడుపుతున్న జగపతి(26), భాస్కర్‌రావు(30) అక్కడికక్కడే చనిపోయారు. పవన్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
బుల్లితెరపై జగపతిబాబు లైఫ్ స్టోరి
-
ఖైకే పాన్ పామర్రు వాలా!
బెనారస్ వాలాకైనా.. ఏలూరు చిన్నోడికైనా.. హైదరాబాద్ బుల్లోడికైనా.. దవడ కిందకు కారా కిళ్లీ చేరితే మెదళ్లకు పట్టిన తుప్పు వదిలిపోతుంది. అదే మృష్టాన్న భోజనం తర్వాత ఓ మీఠా పాన్ లాగిస్తే గానీ.. అంతరంగమున ఆత్మారాముడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనలేడు. అందుకే గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. పల్లె నుంచి పట్నం వరకూ పాన్‌షాప్‌లకు ఉన్నంత గిరాకీ మరే కొట్టుకూ ఉండదు. కిళ్లీ కట్టడంలో హస్తవాసికి కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. కొందరు అర నిమిషంలో కి ళ్లీ చుట్టిచ్చినా అద్భుతః అన్నట్టు ఉంటుంది. అలాంటి పాన్‌వాలానే పామర్రుకు చెందిన జగపతి. అందుకే కృష్ణా జిల్లాలో చుట్టిన ఆయన కిళ్లీ హైదరాబాద్‌లో కూడా ఫేమస్ అయింది. ఎల్లలు దాటిన ఈ కిళ్లీ రుచికి పెద్ద చరిత్రే ఉంది. ఆరు దశాబ్దాల కిందట కృష్ణా జిల్లా పామర్రులో జగపతి కిళ్లీ చుట్టడం ప్రారంభించారు. రకరకాల ఐటమ్స్‌తో రుచికరమైన కిళ్లీలు తయారు చేసేవాడు. దీంతో అనతి కాలంలోనే జగపతి కిళ్లీ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఫేమస్ అయింది. ఎంతలా అంటే సినీ ప్రముఖులు, రాజకీయ ఉద్దండులు సైతం గుంటూరు వెళ్తే జగపతి కిళ్లీ తెప్పించుకుని మరీ నోరారా తినేవారు. ఈయనగారి కిళ్లీలు తిరుపతి, నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాలు, చెన్నైకి కూడా వెళ్తుంటాయి. అదే క్రమంలో జగపతి కుమారుడు రామకృష్ణ హైదరాబాదీలకు పామర్రు కి ళ్లీ రుచి చూపిస్తున్నారు. 2001లో కూకట్పల్లి మలేసియా టౌన్షిప్ సమీపంలో చైతన్య ఫుడ్ కోర్టు ప్రారంభించారు. ఓ వైపు పసందైన భోజనంతో పాటుగా.. అంతే రుచికరమైన తీపి తాంబూలం కూడా అందిస్తున్నారు. మన్‌పసంద్ పాన్.. పామర్రులో తయారు చేసే కిళ్లీలు ప్రతిరోజూ ఇక్కడకు చేరుకుంటాయి. స్వీట్ పాన్, పీటీ కిళ్లీ, రత్న ఇలా 100 పేర్లతో రకరకాల కిళ్లీలు వీళ్లు అందిస్తున్నారు. జాజికాయ, జాపత్రి, లవంగం, మీనాక్షి లాంటి వాటితో పాటు సుగంధ ద్రవ్యాలు కలగలిపి మన్‌పసంద్ పాన్ తయారు చేస్తారు. ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలే ఇందులో వినియోగిస్తుంటారు. ఒక్క స్వీట్పాన్లోనే 30 రకాల పదార్థాలను వినియోగిస్తారు. ఇక పెళ్లిళ్ల సీజన్లో పామర్రు తాంబూలాలకు భలే గిరాకీ ఉంటుంది. పాన్లు చుట్టడానికే పామర్రులో ప్రత్యేకంగా ఓ కుటీర పరిశ్రమ నడిపిస్తున్నారు వాళ్లు. దూరప్రాంతాలకు పంపాల్సిన కిళ్లీలు పాడవకుండా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరు రూపాయల నుంచి రూ.600 వరకు ధర పలికే కిళ్లీలు ఇక్కడ దొరుకుతాయి. ఖరీదైన కిళ్లీల్లో కుంకుమపువ్వు, బంగారు ర్యాపర్ కూడా వాడుతుంటారు. పామర్రులో పకడ్బందీగా చుట్టిన ఈ కిళ్లీలతో హైదరాబాదీల నోరు పండిస్తున్నారు రామకృష్ణ. కోన సుధాకర్‌రెడ్డి -
లాయర్‌తో లవ్
‘‘ఒక లాయర్‌కి, జర్నలిస్ట్‌కి మధ్య సాగే ప్రేమకథ ఇది. లాయర్‌గా జగపతిబాబు, జర్నలిస్టుగా భూమిక అద్భుతమైన నటన కనబర్చారు. ప్రముఖ హిందీ నటుడు గుల్షన్ గ్రోవర్ ఇందులో కీలక పాత్ర పోషించారు’’ అని ‘ఏప్రిల్ ఫూల్’ చిత్ర దర్శకుడు కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పారు. జగపతిబాబు, భూమిక, రణధీర్, సృష్టి ముఖ్య తారలుగా జీఎల్ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత సురేశ్‌బాబు మాట్లాడుతూ - ‘‘ఇందులో తాగుబోతు రమేశ్, ధనరాజ్ పాత్రలు ఆద్యంతం అలరిస్తాయి. సంగీత దర్శకుడు డా. బంటి చక్కటి పాటలిచ్చారు’’ అన్నారు.