వేణుస్వామి నటించిన రెండు తెలుగు సినిమాలు... అవేంటో తెలుసా? | Astrologer Venu Swamy Acted Telugu Movie Jagapathi | Sakshi
Sakshi News home page

Venu Swamy: జ్యోతిష్యంతో పాటు సినిమాల్లోనూ వేణుస్వామి యాక్ట్ చేశారా?

Published Wed, Jan 3 2024 9:55 AM | Last Updated on Wed, Jan 3 2024 10:17 AM

Astrologer Venu Swamy Acted Telugu Movie Jagapathi - Sakshi

సాధారణంగా జ్యోతిష్యులు ఫేమ్ తెచ్చుకోవడం చాలా అరుదు. కానీ గత కొన్నాళ్ల నుంచి ఓ ఆస్ట్రాలజర్ మాత్రం సినిమా హీరోహీరోయిన్ల కంటే గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే వేణుస్వామి. స్టార్ హీరోల జాతకాల చెప్పడం దగ్గర నుంచి స్టార్ హీరోయిన్ల ఇంట్లో పూజల చేయడం లాంటివి ఈయన చేస్తుంటారు. ఈ మధ్య చిన్నపాటి వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. అలాంటి ఈయన తెలుగు సినిమాలోనూ యాక్ట్ చేశారా?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?)

అవును మీరు సరిగానే విన్నారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి.. జగపతిబాబు హీరోగా చేసిన 'జగపతి' అనే తెలుగు సినిమాలో చిన్న పాత్రలో అలా కనిపించారు. అయితే ఇది కూడా గుడిలోని అర్చకుడు వేషం. కాకపోతే ఈ సినిమా 2005లో రావడం, అప్పుడు వేణుస్వామి ఎవరనేది పెద్దగా తెలియకపోవడం లాంటి వాటి వల్ల ప్రేక్షకులకు పెద్దగా గుర్తుంచుకోలేకపోయారు. అలానే 'అతడు' చిత్రంలో ఓ పాటలో కనిపించారు.

ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా కాబట్టి వేణు స్వామి యాక్ట్ చేసిన మూవీ క్లిప్ అనేది వైరల్ అయింది. అలా ఈయన కూడా అప్పట్లో యాక్ట్ చేశారని జనాలకు తెలిసింది. ఇకపోతే ఈ మధ్యనే వేణుస్వామి మాట్లాడుతూ.. టాలీవుడ్‌కి చెందిన సూపర్‌స్టార్.. ఇండస్ట్రీని విడిచిపెట్టేస్తారని సెన్సేషనల్ కామెంట్స్ చేయడం విశేషం.

(ఇదీ చదవండి: కేటుగాళ్ల దెబ్బకు లక్షలు మోసపోయిన అవార్డ్ విన్నింగ్ తెలుగు హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement