Jain family
-
ఏమీ తినకుండా 3నెలల పాటు కఠిన ఉపవాసం చేసిన బాలిక
ఉపవాసం అనేది ఒక్కో మతం ఆచారాలను బట్టి, వ్యక్తులను బట్టి ఉంటుంది. ఉపవాసం పేరుతో కేవలం దైవాన్ని ఆరాధించడమే కాదు.. దాని అంతర్లీన పరమార్థం ఆరోగ్యమనే చెప్పాలి. అందుకే చాలామంది ఉపవాసం చేయడానికి ఇష్టపడుతుంటారు. తాజాగా జైన మతానికి చెందిన ఓ బాలిక ఏకంగా 110 రోజుల పాటు కఠిన ఉపవాసం చేసి ఆశ్చర్యపరిచింది. అసలు అన్ని రోజుల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఎలా చేయగలిగింది? ఉపవాస దీక్ష వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయన్నది ఇప్పుడు చూద్దాం. జైనమతంలో ఉపవాస దీక్షను చాలా నిష్టగా చేస్తారు. ఈ క్రమంలో ముంబైలోని జైన కుటుంబానికి చెందిన క్రిష అనే 16 ఏళ్ల అమ్మాయి ఏకంగా 3 నెలల 20 రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా కఠిన ఉపవాసం చేసింది. మహా మహారుషులు ఇలాంటి తపస్సులు చేయడం చూశాం. కానీ ఇంత చిన్న వయసులో మూడ్నెళ్ల పాటు ఉపవాస దీక్షను చేపట్టడం ఆశ్చర్యమే. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులు ముంబై ఘనంగా వేడుకలు నిర్వహించడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆమె అన్ని రోజుల పాటు ఉపవాసం ఎలా చేయగలిగింది అన్న వివరాలను ఆరా తీయగా.. తొమ్మిదేళ్ల వయసు నుంచే క్రిషకు ఉపవాసం చేయడం అలవాటుగా ఉండేదని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. తొలుత 26 రోజుల ఉపవాసం తర్వాత ఆమె 31 రోజుల పాటు ఉపవాసాన్ని పొడిగించింది. ఆ తర్వాత 51 రోజుల పాటు నిరాహార దీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అనంతరం మరికొన్ని రోజులు పొడిగించుకుంటూ 110 రోజుల పాటు కఠినమైన ఉపవాసాన్ని పూర్తిచేసింది. ఈ క్రమంలో సుమారు 18 కేజీల బరువు తగ్గినప్పటికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురు కాకపోవడం విశేషం. ఇన్ని రోజుల పాటు క్రిష ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో పాటు తొలి 40 రోజులు యథావిధిగా కాలేజీకి కూడా వెళ్లిందట. అన్ని రోజుల పాటు ఉపవాసం ఎలా చేయగలిగిందంటే.. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల మధ్య మాత్రమే గోరువెచ్చని నీళ్లను మాత్రమే తాగేది. ఇలా ఆహారం తీసుకోకుండా కేవలం నీళ్లను మాత్రమే తాగుతూ చేసే ఉపవాసాన్ని వాటర్ ఫాస్టింగ్ అంటారు. కేవలం నీళ్లను మాత్రమే తీసుకునేటప్పుడు కాస్త గోరువెచ్చని నీటిని తీసుకోవడం మంచిది. అంతేకాదు.. మీరు తీసుకునే నీటిలో కాస్త నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని తాగితే మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయని డాక్టర్లు సైతం చెబుతున్నారు. మ్మరసం వల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు కరగడంతోపాటు.. శరీరం నీరసించకుండా తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుంది. ఇలా మీరు ఉపవాసం పాటిస్తున్న రోజులో 8 నుండి 10 సార్లు ఈ మిశ్రమాన్ని తాగితే మీరు ఇతర ఆహారమేమీ తీసుకోకపోయినా ఎలాంటి సమస్యలూ ఎదురుకావు. అంతేకాదు.. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థకు విశ్రాంతి లభించడంతోపాటు, శరీరంలోని వ్యర్థాలూ బయటికి వెళ్లిపోతాయి. ఉపవాసం వాళ్లు చేయకపోవడమే మంచిది ►ప్రయోజనాలు ఉన్నాయి కదా అని అదేపనిగా ఉపవాసం ఉండటమూ మంచిది కాదు. నీరసం సహా ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ► ముఖ్యంగా అస్సలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతుంటే బలహీనత, అసిడిటీ, డస్సిపోవటం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ► మధుమేహం, అసిడిటీ, బీపీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఉపవాస దీక్షను చేయరాదు. ► ముఖ్యంగా గర్భవతులు కూడా ఉపవాసం చేయకపోవడమే మంచిది. ► వేరేవాళ్లు చేస్తున్నారని మనం కూడా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మన శరీరానికి ఏది సూట్ అవుతుందన్నది చెక్ చేసుకోవాలి. అందుకే ఎక్కువరోజులు ఉపవాసం చేయాలనుకుంటే డాక్టర్ సూచనలతో చేయడమే ఉత్తమం. ఉపవాసం సమయంలో ఏం తినాలి? ఉపవాస సమయంలో మజ్జిగ, పండ్ల రసాలు, లెమన్ వాటన్, కూరగాయల సూప్ వంటి ద్రవాహారాలు తరచుగా తీసుకోవాలి. ఇలా చేస్తే అసిడిటీ బాధ కూడా ఉండదు. ఉపవాసం ముగిసిన తర్వాత కూడా కొవ్వు పదార్ధాలు కాకుండా సగ్గుబియ్యం, కూరముక్కల వంటివి కలిపిన ఖిచిడీ, పాలు, పెసరపప్పుతో చేసిన పాయసం వంటివి తీసుకోవాలి. -
వందకోట్ల ఆస్తిని వదులుకుని...
అహ్మదాబాద్ : వందల కోట్ల ఆస్తి, విలాసవంతమైన జీవితం, పెద్ద వ్యాపారం, ప్రాణంగా ప్రేమించే కుటుంబం...ఇవేవీ ఈ 24 ఏళ్ల యువకునికి సంతృప్తినివ్వలేదు. జీవితం అంటే ఇంతేనా అనిపించింది. తన జీవిత గమ్యం వ్యాపారం చూసుకోవడం కాదని తెలుసుకున్నాడు. ఈ భౌతిక సుఖాలను, వాంఛలను వదిలి దైవాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. అందుకు సన్యాసమే సరైన మార్గంగా భావించాడు. పూర్తిగా దేవుని సేవకు అంకితం అవ్వడానికి తనకున్న వందకోట్ల ఆస్తిని, వ్యాపారాన్ని వదిలి సన్యాసం స్వీకరిస్తున్నాడు అహ్మదాబాద్‌కు చెందిన మోక్షేష్ షేత్. గుజరాత్‌లోని దీసా పట్టణానికి చెందిన సందీప్ షేత్ వ్యాపార నిమిత్తం ముంబైలో స్థిరపడ్డాడు. ప్రస్తుతం సందీప్ ముంబైలో అల్యూమినియం వ్యాపారం చేస్తున్నాడు. ఇతని పెద్ద కుమారుడైన మోక్షేష్ సీఏ పూర్తి చేసిన అనంతరం కుటుంబ వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో మోక్షేష్‌కు దైవాన్ని తెలుసుకోవాలనే కోరిక కల్గింది. అందుకు సన్యాసం స్వీకరించడమే సరైన మార్గంగా తోచడంతో ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసాడు. వారి అంగీకారంతో మోక్షేష్ ఈ రోజు గాంధీనగర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో సన్యాసం స్వీకరిస్తున్నాడు. సన్యాసం స్వీకరించిన అనంతరం మోక్షేష్ పేరు ‘కరుణప్రేమ్ విజయ్ జీ’ గా మారుతుందిన అతని మామయ్య తెలిపాడు. మోక్షేష్ జైన సాంప్రదాయాలు పాటించే కుటుంబానికి చెందినవాడు. గుజరాత్‌కు చెందిన కోటీశ్వరుడైన వజ్రాల వ్యాపారి కొడుకు పన్నేండేళ్ల ‘భవ్య సాహ్’ సన్యాసం తీసుకున్న సంగతి తెలిసిందే. -
జాతీయవాద వ్యాపారవేత్త కస్తూర్భాయ్ లాల్‌భాయ్
మన దిగ్గజాలు వ్యాపారం చేయడం ఆషామాషీ కాదు. అందునా ముక్కుపచ్చలారని పదిహేడేళ్ల కుర్రాడు నష్టాల్లో ఉన్న సంస్థను గాడిలో పెట్టి లాభాలబాట పట్టించడం అంత తేలికేమీ కాదు. విదేశీయుల పాలన కొనసాగుతున్న కాలంలో స్వదేశాభిమానాన్ని, స్వాభిమానాన్ని వదులుకోకుండానే ఈ ఘనతను సాధించారు కస్తూర్భాయ్ లాల్‌భాయ్. మన దేశం గర్వించదగ్గ తొలితరం పారిశ్రామికవేత్తల్లో అగ్రగణ్యులుగా ఎన్నదగిన అతి కొద్దిమందిలో కస్తూర్భాయ్ కూడా ఒకరు. గుజరాత్‌లోని జవేరీవాడ్లో 1894 డిసెంబర్ 19న సంప్రదాయ జైన కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి లాల్‌భాయ్ దళపత్భాయ్, తల్లి మోహిని. కస్తూర్భాయ్ పూర్వీకులు మొఘల్, బ్రిటిష్ పాలకుల హయాంలో అహ్మదాబాద్ నగరానికి కొత్వాల్లుగా పనిచేసేవారు. వారి వంశంలో తొలిసారిగా కస్తూర్భాయ్ తాత బాగ్భాయ్ వ్యాపారరంగంలోకి అడుగుపెట్టారు. ఆయన వస్త్రవ్యాపారం చేసేవారు. కస్తూర్భాయ్ తండ్రి లాల్‌భాయ్ దళపత్భాయ్ 1896లో సరస్పూర్ కాటన్ మిల్లును స్థాపించారు. కస్తూర్భాయ్ విద్యాభ్యాసం అహ్మదాబాద్‌లో సాగింది. పదిహేడో ఏట కాలేజీలో చేరిన మొదటి ఏడాదిలోనే తండ్రి లాల్‌భాయ్ మరణించారు. చదువు మానేయాల్సి వచ్చింది. ఆస్తి పంపకాల్లో భాగంగా కస్తూర్భాయ్ వాటాకు రాయ్‌పూర్ మిల్లు వచ్చింది. కార్మికులతో సమానంగా... రాయ్‌పూర్ మిల్లు కస్తూర్భాయ్ చేతికి వచ్చేనాటికి మిల్లు నష్టాల్లో ఉండేది. పరిస్థితిని చక్కదిద్దడానికి కస్తూర్భాయ్ అహరహం మిల్లు అభివృద్ధికి పాటుపడ్డారు. కార్మికులతో సమానంగా కష్టపడ్డారు. వాళ్లతో కలిసే భోంచేసేవారు. కలిసే నిద్రపోయేవారు. అనతికాలంలోనే మిల్లులోని అన్ని విభాగాలపైనా పట్టు సాధించారు. ఆయన తమలో ఒకడిలా పనిచేయడంతో కార్మికుల్లోనూ ఉత్సాహం ఇనుమడించింది. క్రమంగా మిల్లు లాభాలబాట పట్టింది. రాయపూర్ మిల్లు అనుభవం ఉజ్వలమైన ఆయన భవితవ్యానికి పునాది వేసింది. ఆయన శ్రమ వృథా కాలేదు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఉత్పత్తులకు విపరీతంగా పెరిగిన గిరాకీని అందిపుచ్చుకున్న కొద్దిమంది తొలితరం పారిశ్రామికవేత్తల్లో కస్తూర్బాయ్ కూడా ఉన్నారు. రాయ్‌పూర్ మిల్లుకు బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్‌లో ఒకరిగా 1918లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకే సొంతగా అశోకా మిల్స్‌ను స్థాపించారు. సన్నిహితుడైన దయాభాయ్ మోతీలాల్ పటేల్‌ను అశోకా మిల్స్ జనరల్ మేనేజర్‌గా నియమించుకున్నారు. దయాభాయ్ సలహాలతో సోదరులను భాగస్వాములుగా చేసుకుని, వ్యాపారాలను శరవేగంగా విస్తరించారు. 1924-38 కాలంలో నాలుగు మిల్లులను స్థాపించారు. వాటిని ఎప్పటికప్పుడు కొత్త కొత్త యంత్రాలతో ఆధునికీకరించేవారు. అప్పట్లో దేశంలోని మొత్తం స్పిన్నింగ్ పరిశ్రమలో కస్తూర్భాయ్ ఒక్కరిదే 12 శాతం వాటా అంటే ఆయన విస్తరణ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవాల్సిందే! అమెరికన్ కంపెనీ ‘సైనమిడ్’ సహకారంతో 1952లో దేశంలోనే తొలిసారిగా అధునాతన అద్దకం సంస్థ ‘అతుల్ లిమిటెడ్’ను స్థాపించారు. స్వదేశీ ఉద్యమానికి బాసట బ్రిటిష్ హయాంలో కస్తూర్భాయ్ 1923లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ పదవిలో కొనసాగిన మూడేళ్లలోనూ దేశంలోని పరిశ్రమల అభివృద్ధికి కృషి చేశారు. గాంధీజీ 1930లో స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఆయనకు బాసటగా నిలిచారు. అప్పట్లో దేశం ద్రవ్యోల్బణంతో అల్లాడేది. అలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలపై పన్నుల భారం తగ్గించేలా బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడిగా 1934లో ఎన్నికయ్యారు. మరుసటి ఏడాదే అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బ్రిటిష్ పాలన కొనసాగుతుండగానే 1937లో రిజర్వ్‌బ్యాంకు డెరైక్టర్‌గా నియమితుడై, ఆ పదవిలో పన్నెండేళ్లు కొనసాగారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా పలు గౌరవ పదవుల్లో కొనసాగారు. అహ్మదాబాద్‌లో ఐఐఎంతో పాటు ఇస్రో, ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ వంటి పలు విద్యా, పరిశోధన సంస్థలకు భూములను విరాళంగా ఇచ్చారు. అహ్మదాబాద్‌లో ఉన్నత విద్యావ్యాప్తి కోసం 1936లో అహ్మదాబాద్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. ఇప్పుడది అహ్మదాబాద్ వర్సిటీగా రూపుదిద్దుకుంది. ఆర్థిక, విద్యా, సేవారంగాలలో కస్తూర్భాయ్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను 1969లో పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆయన 1960లోనే తన వ్యాపారాలను ఇద్దరు కుమారులకు అప్పగించేసి, తర్వాతి కాలమంతా సేవారంగానికి అంకితమయ్యారు. జాతీయవాదానికి, వ్యాపార దక్షతకు, వదాన్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన కస్తూర్భాయ్ 1980 జనవరి 20న అహ్మదాబాద్‌లో కన్నుమూశారు. - దండేల కృష్ణ