jalakala
-
శ్రమ విలువ తెలుసు కాబట్టే...
జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆంధ్రప్రదేశ్ సామాజిక ముఖచిత్రమే మారిపోయింది. పేదవాడి అవసరాలను తీర్చడం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. విద్య, వైద్యం ఉచితంగా అందించడం, ఆహార ధాన్యాల ఉత్పత్తికి అనువుగా పెట్టుబడి రాయితీలు ఇవ్వడం, ‘రైతు భరోసా’ కేంద్రాల ద్వారా నాణ్య మైన విత్తనాలు, ఎరువులు అందించడం, మెట్ట ప్రాంతాలలో ఉచిత బోర్లు వేసే ‘జలకళ‘ కార్య క్రమాలను చేపట్టడం; ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రారంభించడం, డ్వాక్రా రుణాలు ఇవ్వడం; పాడి పశువులు, గొర్రెలు, మేకల పెంపకానికి ‘చేయూత’ అందించడం; ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే ఏ సీజన్లో నష్టాన్ని అదే సీజన్లో చెల్లించే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం, రోజు వారీ పనులు చేసుకునే వారికి ‘ఆసరా’ ఇస్తూ నిత్యం పేదవాడి చేతిలో డబ్బు ఉండేలా చూసి ఉత్పత్తి రంగం దెబ్బతినకుండా చూడడం వంటి జగనన్న ప్రభుత్వం చేపట్టిన ఎన్నో పథకాలు పేదలకు, మహిళలకు, మైనారి టీలకు వెన్నుదన్నుగా నిలిచాయి. శ్రమైక జీవులైన వెనుకబడిన 139 కులాల వారిని 58 కార్పొరేషన్ల ద్వారా ఆదుకునే ప్రయత్నం మామూలు విషయం కాదు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 760 మందిని... అంటే ఐదేళ్లలో దాదాపు 2,000 మందికి పైగా ఈ కులాలకు చెందిన వారిని నాయకులుగా తీర్చిదిద్ది రాజకీయంగా ఎదిగే అవకాశం కల్పిస్తున్నారు. శ్రమజీవుల కోసం మరో మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అదే 35 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చి, అందరికీ గృహాలు నిర్మించి సొంత ఇంటి కలను నెరవేర్చ పూనుకోవడం. ఇది ఒక విప్లవాత్మకమైన చర్య. అంతేకాకుండా విద్యాల యాలను, వైద్యశాలలను ఆధునికీకరించడం ద్వారా నాణ్యమైన విద్య, వైద్యం పేదవాడికి అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందడానికి పాలనా వికేంద్రీకరణకు వీలు కల్పించే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. అన్ని మతాల వారినీ సమానంగా గౌరవించడంలో భాగంగా మసీదులు, మదరసాలు, దేవాలయాలు, చర్చిల... నిర్మాణాలు, పునరుద్ధరణ కార్యక్రమాలకు ప్రభుత్వ సాయం అందించడం, ఆయా ప్రార్థనా మందిరాల్లో పనిచేసే మత పెద్దలుగా లేదా పూజారులుగా ఉన్నవారికి జీతాలు ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించడం జగన్ ప్రభుత్వ చలవే. ఇవన్నీ చూసినప్పుడు పేదవాని శ్రమను గుర్తించిన వాడుగా జగన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారనిపిస్తుంది. ప్రతిపక్షం ప్రభుత్వ ప్రతిష్ఠను పలుచన చేయడా నికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా లెక్కచేయకుండా ముందుకు పోతున్నారు జగన్. – కె.వి. రమణ బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ -
‘వైఎస్సార్ జలకళ’ నిబంధనల సవరణ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జలకళ పథకంలో ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకోవడానికి ఒక రైతు కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులవుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకే కుటుంబంలో వేర్వేరు సభ్యుల పేరుతో ఒకే ప్రాంతంలో పక్కపక్కనే మూడు నాలుగు బోర్ల కోసం కొన్ని దరఖాస్తులు అందాయి. అయితే.. ఒక బోరుకు మరొక బోరుకు మధ్య కనీసం 200 మీటర్ల దూరం ఉండాలనే నిబంధన వాల్టా చట్టంలో ఉంది. దీంతో సమస్య పరిష్కారానికి పథకం అర్హత నిబంధనలలో సవరణలు సూచిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపగా.. దీనికి అనుగుణంగా ప్రభుత్వం అర్హత నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సవరణలతో కూడిన నిబంధన ప్రకారం.. ఒక కుటుంబంలో ఎవరికైనా ఈ పథకంలో ఉచిత బోరు మంజూరైతే.. ఆ కుటుంబంలో మరొకరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులవుతారని పేర్కొన్నారు. సవరించిన నిబంధనలివీ.. ► ప్రభుత్వ ఉద్యోగులు, రిటైరైన ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు ► ఈ పథకంలో ఉచిత బోరుకు దరఖాస్తు చేసుకునే రైతులకు కనీసం రెండున్నర ఎకరాల భూమి ఉండాలి. అలా లేనిపక్షంలో చుట్టుపక్కల రైతులతో గ్రూపుగా ఏర్పడి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► ఈ పథకంలో ఉచిత బోరు మంజూరై, డ్రిల్లింగ్ తర్వాత అది ఫెయిలై.. అక్కడ మరో బోరు వేయాలంటే మరోసారి హైడ్రో జియాలజికల్ సర్వే జరిపించాలి. ఎంపీడీవో, డ్వామా ఏపీడీ పర్యవేక్షణలో రెండో బోరు తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది. ► వైఎస్సార్ జలకళ పథకం కింద వేసే ఉచిత బోర్లలో కనీసం10 శాతం బోర్లు క్వాలిటీ కంట్రోల్ విభాగం తప్పనిసరిగా తనిఖీ చేయాలనే నిబంధన కూడా కొత్తగా తీసుకొచ్చారు. -
పాతాళగంగ పొలం తడవంగ..
సాక్షి, అమరావతి: అప్పులు చేసి రైతులు బోర్లు వేయాల్సిన పని ఇకలేదు. బోర్లలో నీళ్లు పడకపోతే కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇకరాదు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుర్గతి ఇక ఉండదు. రైతుల జేబుల్లోంచి పైసా పెట్టుబడి పెట్టే అవసరం లేకుండానే.. బోరు వేస్తే నీళ్లు పడతాయా లేదా అన్న సంశయం తలెత్తకుండానే.. ఆ రైతుల భూముల్లో పాతాళగంగ ఉబికివచ్చి పొంగిపొర్లింది. వైఎస్సార్ జలకళ పథకం ద్వారా రైతుల భూముల్లో ఉచితంగా వ్యవసాయ బోర్లు తవ్వించే కార్యక్రమం మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 54 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరై, తమ నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో, చిత్తూరులో తొమ్మిది, కర్నూలు జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున ఆయా జిల్లాల్లో అత్యధిక నియోజకవర్గాల్లో ఉచిత బోర్ల తవ్వకం కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాలేదని, ఆ మూడు జిల్లాలతో పాటు తొలిరోజు పథకం ప్రారంభం కాని అన్ని చోట్ల బుధవారం నుంచి పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ జలకళ పథకం ద్వారా రైతుల పొలాల్లో బోర్లు వేసే ముందు జియాలజిస్టులతో సర్వే చేయించడం వల్ల బోర్లు వేసిన ప్రతిచోట అవి విజయవంతం అయినట్టు తెలిపారు. రైతురాజ్యాన్ని తీసుకువచ్చే దిశగా అడుగులు: మంత్రి పెద్దిరెడ్డి పొలాల్లో బోర్ల తవ్వకం ఆర్థికంగా రైతులపై భారాన్ని పెంచుతున్నందున ప్రభుత్వమే ఉచితంగా ఆ బోర్లు తవ్వించడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రిగ్గును ఏర్పాటు చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రజాసంకల్ప యాత్రలో రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతుల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్ వారికి అండగా నిలుస్తానని ఆనాడు ఇచ్చిన మాట నేడు సాకారమైందని అన్నారు. అర్హత ఉన్న ప్రతి రైతు పొలంలో ఉచితంగా బోరుబావిని తవ్విస్తామని, రానున్న నాలుగేళ్లలో మొత్తం 3 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో 5 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కేవలం ఉచిత బోరుబావుల తవ్వకానికే హామీ ఇచ్చినప్పటికీ, చిన్న, సన్నకారు రైతుల ఆరి్థక పరిస్థితి తెలిసి ఉచిత బోరుతో పాటు మోటార్, దానికి అవసరమైన వైర్, ఇతర విద్యుత్ పరికరాలను కూడా ఉచితంగానే అందిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించడం ఆయనది రైతుపక్షపాతి పాలన అని చెప్పడానికి నిదర్శనమని అన్నారు. ఇక నుంచి పంటలు సాగు చేసుకుంటా.. పాదయాత్ర సందర్భంగా మా కష్టాలను కళ్లారా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కాగానే ఆ హామీ అమలుకు ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద రాప్తాడు నియోజకవర్గంలోనే తొలి బోరు నా పొలంలో వేయడం అదృష్టంగా భావిస్తున్నా. వంద అడుగుల లోతులోనే రెండున్నర ఇంచుల నీరు పడింది. నాకు 4.50 ఎకరాల పొలం ఉంది. ఇక నుంచి కంది, వేరుశనగ తదితర పంటలు సాగు చేసుకుంటా. – నరసింహుడు, రైతు, కుంటిమద్ది,రామగిరి మండలం, అనంతపురం జిల్లా -
నేటి నుంచి ఉచిత బోరు తవ్వకాలు ప్రారంభం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జలకళ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతుల పొలాల్లో ఉచిత వ్యవసాయ బోర్ల తవ్వకం రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ప్రారంభమవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను పట్టణ ప్రాంతంలోని వాటిని మినహాయిస్తే 162 నియోజకవర్గాల పరిధిలోని వ్యవసాయ భూముల్లో బోర్ల తవ్వకం పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో తొలి బోరు తవ్వకం కార్యకమ్రానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పాల్గొంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జలకళ పథకం అధికారికంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో ఉచిత బోరుతో పాటు మోటార్ లేదా పంపుసెట్‌ను కూడా ప్రభుత్వం ఉచితంగానే అందజేస్తోంది. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల వ్యవసాయ బోర్లు తవ్వడం ద్వారా ఐదు లక్షల ఎకరాలను పూర్తి స్థాయిలో సాగులోకి తీసుకరావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకం ద్వారా సుమారు 3 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. బోర్లు తవ్వకానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున రిగ్గులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, వాటర్ షెడ్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి సోమవారం జిల్లాల పీడీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని చోట్ల డ్రిల్లింగ్ కార్యక్రమం ప్రారంభానికి తగిన ఏర్పాట్లు చేయాలని, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే తొలి బోరు తవ్వకం పనులు మొదలు పెట్టాలని అధికారులకు సూచించారు. -
ఉచిత బోర్లు.. పేద రైతులకు మోటార్లు
ప్రతి నియోజకవర్గంలో ఒక బోరు యంత్రం అందుబాటులో ఉంటుంది. రైతులు ఆన్లైన్ ద్వారా లేదా వలంటీర్ల ద్వారా తమ పేరు నమోదు చేసుకోవచ్చు. హైడ్రో జియోలాజికల్, జియో ఫిజికల్ సర్వే ద్వారా ఎక్కడ బోరు తవ్వాలన్నది శాస్త్రీయంగా నిర్ణయిస్తారు. ఆ తర్వాతే బోరు బావి తవ్వుతారు. ఆ సర్వే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఒక్కోసారి ఎంత సర్వే చేసినా నీరు పడకపోవచ్చు. అందుకే రెండో బోరు కూడా వేయాలని ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే ఉన్న బోరు ఒక వేళ ఫెయిల్ అయితే, అక్కడ కూడా రైతులకు బోరు వేయి స్తాము. వారు దరఖాస్తు చేసుకుంటే చాలు. –సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అర్హులైన రైతులందరి పొలాల్లో ఉచితంగా బోర్లు వేయడంతో పాటు చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా మోటార్లు కూడా బిగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ప్రణాళికలో బోర్లు వేయిస్తామని చెప్పామని, కానీ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా మోటారు కూడా ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం దాదాపు మరో రూ.1,600 కోట్లు వ్యయం అవుతున్నప్పటికీ వెనకడుగు వేయకుండా అమలు చేస్తామన్నారు. ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని, వారికి ఏనాడూ అన్యాయం చేయదని చెప్పారు. రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించే ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని సోమవారం ఆయన తన క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని రైతులనుద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ‘వైఎస్సార్ జలకళ’ను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, ఎంపీ, అధికారులు తదితరులు మాట నిలబెట్టుకుంటున్నాను ► రైతు కోసం మన ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఎన్నికల్లో ఇచ్చిన మరో మాట నిలబెట్టుకుంటున్నాం. నా 3,648 కి.మీ పాదయాత్రలో రైతుల కష్టాలు స్వయంగా చూశాను. వారికి తోడుగా ఉంటానని మాట ఇచ్చాను. ► నాడు ఇచ్చిన మాట ప్రకారం 144 గ్రామీణ నియోజకవర్గాలు, 19 సెమీ అర్బన్ నియోజకవర్గాలు.. మొత్తంగా 163 నియోజకవర్గాల్లో ఇవాళ బోరు యంత్రాలు ప్రారంభిస్తున్నాం. ► దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లనే ఇది సాధ్యం అవుతోంది. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 2 లక్షల బోర్లు తవ్వడమే కాకుండా, వాటికి కేసింగ్ పైపులు కూడా వేస్తాం. ఈ పథకంపై వచ్చే 4 ఏళ్లలో రూ.2,340 కోట్లు ఖర్చు చేస్తామని గర్వంగా చెబుతున్నాము. మరో అడుగు ముందుకు.. ► నాడు 2004లో నాన్నగారు రైతుల కోసం ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఇవాళ మరో అడుగు ముందుకు వేస్తూ, రైతులకు ఉచితంగా బోరు బావి తవ్విస్తున్నాము. తద్వారా లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. లక్షలాది మంది రైతులకు మేలు జరుగుతుంది. మెట్ట ప్రాంతాల నుంచి వలసలు తగ్గుతాయి. ► రాష్ట్రంలో దాదాపు 18 లక్షల మోటార్లు (పంపు సెట్లు) ఉన్నాయి. వాటి సగటు సామర్థ్యం 7.5 హెచ్‌పీ. అంటే గంటకు 5 యూనిట్ల విద్యుత్ కావాలి. రోజుకు 9 గంటల సరఫరా అంటే ఒక్క రోజుకు మొత్తం 45 యూనిట్లు. ఇవాళ ఒక్కో యూనిట్ ధర రూ.6.87. ఆ విధంగా నెలకు ఒక్కో రైతుకు బోరు ద్వారా రూ.9,274 మేర ప్రయోజనం కలుగుతుంది. ఫీడర్ల కెపాసిటీ పెంచాం ► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి, ఉచిత విద్యుత్‌కు సంబంధించి రూ.8,655 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆ మొత్తం చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వకుండా బకాయి పెట్టింది. అయినా చిరునవ్వుతో చెల్లించాం. ► రైతులకు పగలే ఉచితంగా 9 గంటలు విద్యుత్ ఇవ్వడం కోసం 85 శాతం ఫీడర్ల కెపాసిటీ పెంచాం. తగిన మౌలిక వసతులు కల్పించాం. రానున్న రోజుల్లో మిగతా ఫీడర్ల సామర్థ్యం కూడా పెంచుతాం. ఇందు కోసం గత 16 నెలలుగా రూ.1,700 కోట్లు ఖర్చు చేశాం. నాణ్యమైన విద్యుత్ కోసమే ► ఉచిత విద్యుత్‌కు మీటర్ల ఏర్పాటుపై విచిత్ర వాదనలు చేస్తున్నారు. లోడు తెలుసుకుని మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలి పోకుండా జాగ్రత్త పడడం కోసమే మీటర్లు బిగించాలని నిర్ణయించాం. లోడు, ఓల్టేజీ ఎంతో స్పష్టంగా తెలిసినప్పుడు ఫీడర్ల కెపాసిటీ పెంచి, నాణ్యమైన విద్యుత్‌ను రైతుకు ఒక హక్కుగా ఇస్తాం. ► రైతులు తమ చేతుల మీదుగా ఆ బిల్లులు కడతారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం రైతులకు నేరుగా అందిస్తుంది. అప్పుడు రైతులు నాణ్యమైన విద్యుత్ కోసం డిమాండ్ చేయవచ్చు. ► రైతుల ఉచిత విద్యుత్ కోసం 10 వేల మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు రూ.2.50 మాత్రమే. అందువల్ల 30 ఏళ్లు క్వాలిటీ పవర్ ఇస్తాం. రైతుల కోసం ఎన్నెన్నో.. ► గత ప్రభుత్వం వదిలి పెట్టి పోయిన రూ.960 కోట్ల ధాన్యం బకాయిలు, రూ.384 కోట్లు విత్తనాల సేకరణ బకాయిలు చెల్లించాం. ► రైతు భరోసా ద్వారా ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.13,500 సహాయం చేస్తున్నాం. సున్నా వడ్డీ రుణాలు, ఉచిత బీమా ప్రీమియమ్ అమలు చేస్తున్నాం. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ కేవలం రూ.1.50కే సరఫరా చేస్తున్నాం. గత ఏడాది ధరల స్థిరీకరణ కోసం రూ.3200 కోట్లు ఖర్చు చేశాం. ► ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. అక్కడి నుంచే నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరా చేస్తున్నాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రహదారి పన్ను రద్దు చేశాం. ► రాబోయే రోజుల్లో ఈ–క్రాపింగ్ ద్వారా రైతుల పొలం వద్దే పంటల కొనుగోలు జరుగుతుంది. ఆర్బీకేల వద్ద గోదాములు, క్వాలిటీ నిర్ధారణ కోసం అసైన్డ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తాం. ఈ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటవుతాయి. మండల కేంద్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రతి గ్రామంలో జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నాం. ► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, కె.కన్నబాబు, అనిల్‌కుమార్ యాదవ్, జి.జయరాం, సీదిరి అప్పలరాజు, ఎంపీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్, రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పథకం రైతులకు ఎంతో మేలు ఎందరో సీఎంల వద్ద ఎమ్మెల్యేగా పని చేశాను. కానీ ఏడాదిలోనే దాదాపు 90 శాతం హామీలు నిలబెట్టుకున్న సీఎంను తొలిసారి చూస్తున్నాను. ఏ రాష్టంలో కూడా ఈ స్థాయిలో పథకాలు అమలు చేయడం లేదు. వైఎస్సార్ జలకళ పథకం కింద ఇవాళ 2 లక్షల బోర్లు తవ్వబోతున్నాం. అన్ని జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల రైతులకు ఈ పథకం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నిజంగా ఇది రైతు ప్రభుత్వం వైఎస్సార్ జలకళ పథకంపై ప్రశంసలు ఉచితంగా బోర్లు వేయించడమే కాకుండా చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా మోటార్లు కూడా బిగిస్తామని చెప్పడం సంతోషంగా ఉందని పలువురు రైతులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో తమ సంతోషాన్ని పంచుకున్నారు. వైఎస్సార్ జలకళ పథకాన్ని సీఎం జగన్ సోమవారం ప్రారంభించిన అనంతరం వివిధ జిల్లాల నుంచి రైతులు నేరుగా సీఎంతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ఎంతో ఉపయోగం నేను చిన్న రైతును, రెండున్నర ఎకరాల మెట్ట భూమి ఉంది. ఆ భూమిలో కొద్దిపాటి పంటలు వేసుకుని జీవిస్తున్నాను. ఈ మూడు నెలల తర్వాత మా పంటలకు నీరుండదు. అప్పుడు ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు మీ నిర్ణయం వల్ల మా లాంటి రైతు లెందరికో ఎంతో ఉపయోగం. బోర్లు వేయించడమే కాకుండా మా లాంటి వాళ్లకు మోటార్లు కూడా ప్రభుత్వమే బిగిస్తుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. రైతులందరి తరఫున మీకు కృతజ్ఞతలు. – సింహాచలం నాయుడు, కొమరాడ మండలం, విజయనగరం ఆనందంగా ఉంది నేను గతంలో కూలి పనికి వెళ్లే దాన్ని. నాకు ప్రభుత్వమే 2.70 ఎకరాల భూమి ఇచ్చింది. ఇందులో కరువు పనుల కింద చెట్లు, రాళ్లు తీసి ఇచ్చారు. మామిడి మొక్కలు కూడా ఇచ్చారు. నాకు రైతు భరోసా కూడా వచ్చింది. మీ పథకాల పుణ్యమా అని నా ముగ్గురు పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఇప్పుడు ఉచితంగా బోర్ వేసి, మోటార్ బిగిస్తామంటే చాలా సంతోషంగా ఉంది. – లక్ష్మీదేవి బాయి, దండరాయిపల్లి తండా, బుక్కరాయసముద్రం మండలం, అనంతపురం మీ దయతో చిన్న రైతునవుతున్నా నాకు కొద్ది పాటి పొలం ఉంది. అయితే దీని వల్ల లాభం లేకపోవడంతో ఉపాధి హమీ పనులతో బతుకుతున్నాం. ఇప్పుడు మీరు ఉచితంగా బోరు తవ్వించి.. ఉచితంగా మోటారు బిగించి.. ఉచితంగా విద్యుత్ కూడా ఇస్తామని చెబుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీకు జీవితకాలం రుణపడి ఉంటాం. ఇది నిజంగా రైతు ప్రభుత్వం. నేను ఎప్పటికీ ఉపాధి కూలీగా మిగిలిపోతానేమో అనుకున్నా. కానీ మీ దయతో చిన్న రైతుగా మారుతున్నాను. – గురుస్వామి, పులిచర్ల మండలం, చిత్తూరు దేశం అంతా మీ వైపు చూస్తోంది వైఎస్సార్ జలకళ ద్వారా మీరు రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారనడంలో సందేహం లేదు. మీరు రెండు అడుగులు కాదు.. మూడు అడుగులు ముందుకు వేశారు. అడక్కుండానే మీరు రైతులకు వరాలిస్తున్నారు. మీరు అధికారంలోకి రాగానే వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి. రైతు పక్షపాతిగా ఉన్న మీ ప్రభుత్వం పదికాలాల పాటు కొనసాగాలి. దేశం అంతా మీ వైపు చూస్తోంది. – డి.ఏసుపాదం, తిరువూరు మండలం, కృష్ణా -
అర్హులైన రైతులందరికీ ‘వైఎస్సార్ జలకళ’
సాక్షి, అమరావతి: మెట్టభూములకు సాగు నీరు అందించేందుకు ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ జలకళ (ఉచిత బోర్లు) పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు ద్వారా వారి మెట్ట భూములకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ జలకళ పథకాన్ని అమలు చేయనున్నారు. శాస్త్రీయంగా భూగర్భ జల సర్వే అనంతరం బోరు వేసే ప్రాంతాన్ని గుర్తించనున్నారు. బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా చూసిన జగన్ వారికి అండగా నిలుస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. నవరత్నాల్లో భాగమైన ఆ హామీని నెరవేర్చడానికి రంగం సిద్ధం చేశారు. ► గ్రామ వలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో రైతులు సమర్పించిన దరఖాస్తులను తొలుత వీఆర్వో పరిశీలిస్తారు. అక్కడి నుంచి డ్వామా ఏపీడీకి వెళ్తాయి. ఆ దరఖాస్తులను ఆయన భూగర్భ జలాల సర్వే కోసం జియాలజిస్టుకు పంపుతారు. అక్కడి నుంచి అనుమతి రాగానే డ్వామా ఏపీడీ ఆ దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు. ► అనుమతి అనంతరం కాంట్రాక్టర్ బోరుబావులను తవ్వుతారు. ► ఒకసారి బోర్వెల్ విఫలమైతే మరోసారి కూడా బోర్ వేస్తారు. ► ఈ పథకం కింద వేసే అన్ని బోర్లకు సామాజిక ఆడిట్ నిర్వహిస్తారు. ► ఈ కార్యక్రమం సమర్థవంతంగా పర్యవేక్షణకు, అమలుకు రాష్ట్ర స్థాయిలో పీఎంయూ (ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్) ఏర్పాటు చేస్తారు. ► బోర్ వేయడం పూర్తయిన తరువాత కాంట్రాక్టర్‌తో పాటు లబ్ధిదారుడి సమక్షంలో జియో ట్యాగింగ్‌తో కూడిన డిజిటల్ ఫొటో తీస్తారు. -
మరో భారీ పథకానికి సీఎం జగన్ శ్రీకారం
సాక్షి, అమరావతి: ప్రజా సంకల్ప పాదయాత్ర సందర్భంగా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టారు. తన పాదయాత్రలో బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్ వారికి అండగా నిలుస్తానని ఆనాడు హామీ ఇచ్చారు. సాగునీటి కోసం వేల అడుగుల లోతుతో బోరుబావులను తవ్వించుకునేందుకు రైతులు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి రావడం, అందుకోసం అప్పులపాలవుతున్న వైనాన్ని గమనించిన వైఎస్ జగన్ రైతులు పడుతున్న అవస్థలను పూర్తిగా తొలగించేందుకు ఇచ్చిన హామీ కార్యరూపం దాలుస్తోంది. ఆనాడు పార్టీ మేనిఫేస్టోలో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాల్లో రైతులకు ఉచిత బోర్వెల్ పై ఇచ్చిన హామీ మేరకు ఉచిత బోరుబావుల తవ్వకం కోసం ''వైఎస్సాఆర్ జలకళ'' పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఈనెల 28న ఈ పథకాన్ని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. (చదవండి: మద్దతు ధర ఇవ్వాల్సిందే) ఈ పథకం కోసం రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. రైతులు ఈ పథకం కోసం తమ పరిధిలోని గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఆన్‌లైన్‌లోనూ దీనికోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. రైతులు చేసుకున్న దరఖాస్తులు గ్రామ సచివాలయం స్థాయిలో వీఆర్వో పరిశీలిస్తారు. అక్కడి నుంచి డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సదరు దరఖాస్తులను భూగర్భ జలాల సర్వే కోసం ముందుగా జియోలజిస్ట్కు పంపుతారు. సాంకేతికంగా దానిని జియోలజీ విభాగం పరిశీలించి అనుమతి ఇవ్వగానే డ్వామా అసిస్టెంట్ పిడి సదరు దరఖాస్తుకు పరిపాలనా అనుమతి ఇస్తారు. సదరు అనుమతి అనంతరం కాంట్రాక్టర్ డ్రిల్లింగ్ సైట్ లో బోరుబావులను తవ్వుతారు. బోరుబావుల సక్సెస్ శాతంను బట్టి కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపులు జరుపుతారు. (చదవండి: ఆ ఘటనలు పునరావృతం కాకూడదు: సీఎం జగన్) పారదర్శకత కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్.. ‘వైఎస్సాఆర్ జలకళ పథకం’ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది. ఆ సాఫ్ట్వేర్ ద్వారా రైతులు దరఖాస్తు చేసుకున్న తరువాత నుంచి దానికి అనుమతులు ఇవ్వడం, బోర్ బావి తవ్వకం, కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించడం వరకు అత్యంత పారదర్శకతతో, నిర్ణీత సమయంలోనే ప్రక్రియను పూర్తి చేస్తారు. ప్రతి దశలోనూ దరఖాస్తు చేసుకున్న రైతుకు తన దరఖాస్తుకు సంబంధించిన వివరాలు ఎస్ఎస్ఎంల ద్వారా పంపిస్తారు. అలాగే ఆన్లైన్ ద్వారా కూడా తన దరఖాస్తు ఏ దశలో వుందో రైతు తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. ఏ రోజు రైతు పొలంలో బోర్ డ్రిల్లింగ్ చేస్తారో అది కూడా అటు రైతు ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా, ఇటు వాలంటీర్ల ద్వారా కూడా సమాచారం అందిస్తారు. ఒకవేళ మొదటిసారి బోర్ డ్రిల్లింగ్ లో నీరు పడక విఫలం అయితే, మరోసారి బోర్ కోసం నిపుణుడైన జియోలజిస్ట్ నిర్ధేశించిన ప్రాంతంలో డ్రిల్లింగ్ చేసేందుకు అవకాశం కల్పించారు. రైతుల కోసం మరో అడుగు ముందుకు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంతో పాటు, ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి అన్న విషయాన్ని ఆచరణలో చూపుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నదాతల కోసం వైఎస్సాఆర్ జలకళ పథకాన్ని ప్రారంభిస్తున్నారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం రూ.2,340 కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఉచిత బోరు బావులను తవ్వడం ద్వారా దాదాపు 3 లక్షల మంది రైతులకు మేలు చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ పథకం కింద 5 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందుతుందని వెల్లడించారు. రాష్ట్రంలోని కమాండ్, నాన్ కమాండ్ ఏరియాల్లో ఎక్కడైతే భూగర్భ జలాలు వినియోగానికి అనువుగా వుంటాయో ఆ ప్రాంతాల్లో ‘వైఎస్సాఆర్ జలకళ’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో వున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, ఎక్కడైతే భూగర్భ జలాలు అందుబాటులో వుంటాయో అక్కడే బోరుబావులు తవ్వేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. పొలాల్లో హైడ్రో జియోలాజికల్, జియో గ్రాఫికల్ సర్వే ద్వారా శాస్త్రీయంగా ఎక్కడ బోరుబావులను తవ్వాలో నిపుణులు గుర్తించిన తరువాతే వాటికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు. అలాగే సంబంధిత జియోలజిస్ట్ నిర్ధేశించిన లోతులో మాత్రమే బోరు బావుల తవ్వకం జరుగుతుందని అన్నారు. ఈ పథకం కింద తవ్వే ప్రతి బోరుబావికి జియో ట్యాగింగ్ చేస్తామని, అదే క్రమంలో భూగర్భజలాలు ఎప్పటికప్పుడు రీచార్జ్ అయ్యేలా వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను కూడా కొనసాగిస్తామని తెలిపారు. పర్యావరణానికి నష్టం జరగకుండా, భూగర్భజలాలు అడిగంటి పోకుండా శాస్త్రీయ పద్దతుల్లో బోరుబావుల తవ్వకం జరుగుతుందని, దీనివల్ల రైతుకు కూడా బోర్లు వేసిన కొద్దిరోజులకే బోర్లు అడిగంటి పోవడం, తరువాత మరోసారి బోర్లు వేసుకునేందుకు వ్యయం చేయాల్సిన అవసరం వుందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. -
3,884 చెరువులకు జలకళ
మత్తడిపోస్తున్న 1708 చెరువులు పూర్తిగా నిండినవి 1208.. 22 చోట్ల గండ్లు వరంగల్ : నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని చెరువులన్నీ జలకళ సంతరించుకున్నాయి. జిల్లాలో మొత్తం 5837 చెరువులున్నాయి. గురవారం నాటికి జిల్లాలోని 5550 చెరువుల వివరాలు అధికారులకు అందాయి. అందులో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో 3884 చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. గత వారం కురిసిన వర్షాలతో 1389 చెరువులకు మత్తళ్లు పడగా, ప్రస్తుతం 1708 చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. గత ఐదేళ్లుగా నిండని చెరువులు సైతం ఇప్పుడు నిండుకుండల్లా మారడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఐబీ డివిజన్ పరిధిలో 15, మహబూబాబాద్ డివిజన్ పరిధిలో 7 చెరువులకు గండ్లు పడ్డాయి. విస్తారంగా వర్షాలు పడడంతో గురువారం నాటికి 22 చెరువులకు గండ్లు పడినట్లు అదికారులు తెలిపారు. మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా రెండు విడతలుగా చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టడం వల్ల బండ్ పటిష్టం కావడంతో చెరువుల్లో నీటి నిల్వలు పెరిగాయి. దీంతో అన్ని చెరువుల్లో జలకళ ఉట్టిపడుతోంది. మహబూబాబాద్ డివిజన్లో భారీ సంఖ్యలో చెరువులు నిండిపోయాయి. ఈ డివిజన్ పరిధిలో 7 చెరువులకు గండ్లు పడ్డాయి. ములుగు, స్పెషల్ ఎంఐ డివిజన్ల పరిధిలోని మండలాల్లోని చెరువులే ఎక్కువగా మత్తళ్లు పోస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని చెరువులన్నీ దాదాపుగా నిండిపోయినందున మళ్లీ భారీ వర్షాలు కురిస్తే కట్టలు తెగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా నీటి ఎద్దడితో ఇబ్బంది పడిన ప్రజలకు ఇక ఆ సమస్య ఉండదు. నిండుకుండల్లా నగరంలోని చెరువులు గ్రేటర్ వరంగల్ పరిధిలోని చెరువులు నిండుకుండల్లా తయారయ్యాయి. పట్టణ ప్రాంతంలో మొత్తం 166 చెరువులు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 119 చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. ఇందులో మినీ ట్యాంక్ బండ్లుగా రూపుదిద్దుకుంటున్న భద్రకాళి, రంగసముద్రంతో పాటు పలు చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. నగర పరి««ధిలోని చెరువులన్నీ ఫుల్ ట్యాంక్ లెవల్‌కు చేరుకున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. -
కుంటలకు జలకళ
అనంతపురం టౌన్ : జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కుంటలు నిండి కళకళలాడుతున్నాయి. మూడ్రోజులుగా 35 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. మిగిలిన మండలాల్లో కూడా మోస్తరు వర్షాలు పడిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని కుంటలు నిండినట్లు డ్వామా పీడీ నాగభూషణం తెలిపారు. ఇది రైతులకు ఎంతో ఉపయుక్తమన్నారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి చేపట్టే వనం–మనం కార్యక్రమంలో భాగంగా 12.56 లక్షల మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వినట్లు ఆయన వివరించారు. ï వారం రోజుల పాటు వివిధ ప్రదేశాల్లో మొక్కలు నాటుతామన్నారు.