jallikattu protest
-
సోషల్ మీడియా ఎంత పని చేసింది!
చెన్నై: సోషల్ మీడియా ఎంత పని చేసిందని చెన్నై పోలీసులు వాపోతున్నారు. తాము చేసిన పని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడం పోలీసులకు తలనొప్పిగా మారింది. దీంతో సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నారు. జల్లికట్టు ఆందోళనల సందర్భంగా చెన్నైలో నిరసనకారులకు ఆటోలకు నిప్పు పెడుతూ పోలీసులు వీడియోకు చిక్కారు. కమల్ హాసన్, అరవింద్ స్వామి లాంటి సినీ ప్రముఖులతో పాటు చాలా మంది ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి పోలీసుల తీరును ఎండగట్టారు. అడ్డంగా దొరికిపోవడంతో ఖాకీలు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు పూర్తి చేయడానికి వారం రోజులు పడుతుందని ఉన్నత పోలీసు అధికారి వి. బాలకృష్ణన్ తెలిపారు. వీడియోలో యూనిఫాంలో ఉన్నది నిజమైన పోలీసులా, కాదా అనే దాని గురించి పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఈ వీడియో వెంటనే ఫేస్ బుక్, వాట్సాప్, ట్విటర్ లో ప్రత్యక్షం కావడం తమ శాఖ వైఫల్యంగానే భావిస్తున్నామన్నారు. ఈ వ్యవహరం తమకు పాఠం నేర్పిందని, ఇక నుంచి సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉంటామని వెల్లడించారు. అయితే ఇది మార్ఫింగ్ చేసిన వీడియో అని అంతకుముందు పోలీసులు పేర్కొన్నారు. ఇది అసలైన వీడియోనా, కాదా అనేది దర్యాప్తులో వెల్లడవుతుందన్నారు. పోలీసు దుస్తుల్లో ఉన్న వ్యక్తులు నిరసనకారుల ఆటోలకు నిప్పు పెట్టినట్టు వీడియోలో కనబడడంతో కలకలం రేగింది. -
ఆంధ్రుల దెబ్బకి బీజేపీ దిగొస్తుందా ?
-
రేపు తమిళనాడు బంద్
చెన్నై: జల్లికట్టుకు మద్దతుగా తమిళనాడులో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సాంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టుపై నిషేధం తొలగించాలని తమిళులు భారీ స్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు. రేపు(శుక్రవారం) రాష్ట్ర బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చారు. బంద్ కు డీఎంకే మద్దతు తెలిపింది. మెరీనా బీచ్ లో గురువారం రాత్రి నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. జల్లికట్టుకు మద్దతు ఇచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. చదరంగ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ కూడా మద్దతు ప్రకటించారు. శుక్రవారం ఉపవాసం ఉంటానని సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ప్రకటించారు. జల్లికట్టుపై నిర్ణయం తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని డీఎంకే నాయకురాలు కనిమొళి విమర్శించారు. దీనిపై చర్చించేందుకు తమిళనాడు ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఢిల్లీలో అన్నాడీఎంకే ఎంపీలు ఢిల్లీలో తమ ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఎంపీలు భేటీ కానున్నారు. శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. -
అదంతా సోషల్ మీడియా పుణ్యమేనా?
-
అదంతా సోషల్ మీడియా పుణ్యమేనా?
జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడులో భారీ ఎత్తున నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. మెరీనా బీచ్ మొత్తం ప్రదర్శనకారులతో నిండిపోయింది. ఎవరు పిలుపునిచ్చారో తెలియదు, ఎలా వచ్చారో అర్థం కాలేదు గానీ.. వేలాది మంది అక్కడకు చేరుకున్నారు. వాళ్లలో ఎక్కువ మంది యువకులు, విద్యావంతులు, యువ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఎక్కడా హింసాత్మక ఘటనలు లేవు గానీ, నిరసనలు మిన్నంటాయి. ప్రశాంతంగా తమ నిరసన తెలియజేసి, జల్లికట్టుకు అనుమతులు ఇవ్వాలని గళం వినిపించారు. అప్పటివరకు బీచ్ వదిలి వెళ్లేది లేదంటూ రాత్రంతా కూడా అక్కడే పడుకున్నారు. అధికార పార్టీ అయిన అన్నాడీఎంకే సహా అన్ని పార్టీలూ జల్లికట్టుకు మద్దతు తెలిపాయి. కానీ ఏ ఒక్కరూ ఈ నిరసనలకు పిలుపు ఇవ్వలేదు, వాటిని స్పాన్సర్ చేయలేదు. విద్యార్థులు, నటీనటులు, క్రికెటర్లు, కొంతమంది సెలబ్రిటీలు ప్రధానంగా దీనికి మద్దతిచ్చారు. ఇదంతా కూడా సోషల్ మీడియా పుణ్యమే. ఫేస్బుక్, వాట్సప్ ద్వారా తమిళ సంస్కృతి అయిన జల్లికట్టును కాపాడుకోవాలంటూ ఇచ్చిన పిలుపు విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది. ఈ నిరసనలు కొనసాగుతూనే ఉండే సూచనలు కనిపించడంతో చెన్నైలోని 31 కాలేజీలు ఏకంగా సెలవులు ప్రకటించేశాయి. [ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ] ప్రధానమంత్రి మోదీని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కలిసి జల్లికట్టుకు అనుమతిస్తూ ఆర్డినెన్స్ తేవాలని కోరనున్నారు. అన్నాడీఎంకే చీఫ్ శశికళ కూడా అదేమాట చెప్పారు. పెటా మీద నిషేధం విధిస్తామని కూడా ఆమె అన్నారు. ఇతర పార్టీల వాళ్లు కూడా తప్పనిసరిగా దీనికి మద్దతు చెప్పాల్సి వచ్చింది. చెన్నైకి చెందిన టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ట్విట్టర్లో జల్లికట్టుకు మద్దతు తెలిపారు. తమిళనాడు వ్యాప్తంగా శాంతియుత నిరసనలు జరుగుతున్నాయని చెప్పాడు. ప్రముఖ హీరో విజయ్ కూడా ఒక వీడియో సందేశం పోస్ట్ చేశాడు. ప్రజల సంప్రదాయాలు, వాళ్ల హక్కులను దోచుకోడానికి చట్టాన్ని తయారు చేయలేదని, జల్లికట్టు అనేది ప్రతి ఒక్క తమిళుడి గుర్తింపని చెప్పాడు. జల్లికట్టు నిషేధానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నవాళ్లంతా తాము తమిళులమనే వచ్చారు తప్ప రాజకీయ ఒత్తిడితో కాదన్నారు. వారందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నట్లు చెప్పారు. తమిళులు ఎద్దులను తమ కన్నబిడ్డల్లా చూసుకుంటారని, వాటిని హింసించరని తమిళనాడు విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్ అన్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, మరికొందరు న్యాయమూర్తులు మాత్రం.. ఈ నిరసనల వల్ల ఈ అంశంపై కోర్టులో కొనసాగుతున్న విచారణ మీద ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. -
మేము జోక్యం చేసుకోలేం: మద్రాసు హైకోర్టు
చెన్నై: జల్లికట్టుపై నిషేధం తొలగించాలని తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యహారంలో జోక్యం చేసుకునేందుకు మద్రాసు హైకోర్టు నిరాకరించింది. జల్లికట్టు అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. మరోవైపు జల్లికట్టుపై నిషేధం తొలగిస్తూ ఆర్డినెన్స్ తేవాలని అన్నాడీఎంకే ఎంపీలు రేపు ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. ఇంతకుముందు ప్రధానమంత్రి మోదీని కలిసేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జల్లికట్టుకు మోదీ ప్రభుత్వం అనుకూలంగా ఉందని తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ తెలిపారు. ప్రజల ఆందోళనలను అర్థం చేసుకోగలమని, జల్లికట్టు అంశం సుప్రీంకోర్టులో ఉందని చెప్పారు. తమిళ ప్రజల మనోభావాలను గౌరవించాలని డీఎంకే నాయకురాలు కనిమొళి అన్నారు. జల్లికట్టుకు మద్దతుగా ఒక్క చెన్నైలోనే కాదని, రాష్ట్రమంతా ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పారు. -
మేము జోక్యం చేసుకోలేం