Janjavathi river
-
అపర భగీరథుడు వైఎస్సార్.. కరువు పుత్రుడు చంద్రబాబు..!
-
‘నేరడి’పై వివాదాల పరిష్కారానికి సీఎం చొరవ
సాక్షి, అమరావతి : వంశధార, జంఝావతి నదీ జలాల్లో వాటా నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం ద్వారా వెనకబడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఒడిశా సర్కార్‌తో సంప్రదింపులు జరిపి వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2లో కీలకమైన నేరడి బ్యారేజీ.. జంఝావతి రబ్బర్ డ్యామ్ స్థానంలో స్పిల్ వే నిర్మించడం ద్వారా వాటా జలాలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. నేరడి బ్యారేజీ, ఝంజావతి ప్రాజెక్టులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. వివాదాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించి.. వివాదాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. చదవండి: రేపు రెండో విడత రైతు భరోసా ప్రారంభం నేరడిపై ఒడిశా అభ్యంతరం.. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా వంశధార స్టేజ్–2 ఫేజ్–2 పనులను దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో చేపట్టారు. భామిని మండలం నేరడి వద్ద వంశధార నదిపై 0.6 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించి ఎనిమిది వేల క్యూసెక్కులను కొత్తగా నిర్మించే సింగిడి రిజర్వాయర్ (0.686 టీఎంసీలు), పారాపురం రిజర్వాయర్ (0.404 టీఎంసీలు), హిరమండలం రిజర్వాయర్ (19.05 టీఎంసీలు)లలో నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. చదవండి: ‘ఏ ఒక్కరి నమ్మకాన్ని సీఎం జగన్ వమ్ము చేయరు’ ఒడిశా ప్రతిపాదన మేరకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, ఆర్నెల్లలోగా ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ ఫిబ్రవరి 6, 2009న సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆ మేరకు వంశధార ట్రిబ్యునల్‌ను ఫిబ్రవరి 24, 2010న కేంద్రం ఏర్పాటు చేసింది. ఒడిశా అభ్యంతరాల నేపథ్యంలో ప్రాజెక్టు డిజైన్లలో మార్పులు చేసి.. బామిని మండలం కాట్రగడ్డ వద్ద వంశధారపై తాత్కాలికంగా సైడ్ వియర్(మత్తడి) నిర్మించి.. గరిష్ఠంగా ఎనిమిది టీఎంసీలు మళ్లించే పనులను దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. జంఝావతి వివాదం ఇదీ.. జంఝావతి నదిలో 8 టీఎంసీల నీటి లభ్యతలో చెరి సగం వాడుకునేలా డిసెంబర్ 25, 1978న ఒడిశా, ఏపీ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ వాటా నీటిని వినియోగించుకోవడం కోసం విజయనగరం జిల్లాలో జంఝావతిపై కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద 3.40 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ బ్యారేజీ ద్వారా 24,410 ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించింది. ఒడిశాలో ముంపునకు గురయ్యే 1,175 ఎకరాలను సేకరించి అప్పగించడానికి అప్పట్లోనే ఒడిశా సర్కార్ వద్ద ఏపీ ప్రభుత్వం నిధులను డిపాజిట్ చేసింది. కానీ ఒడిశా సర్కార్ భూసేకరణ చేయలేదు. పూర్తిస్థాయి బ్యారేజీ నిర్మాణానికి అడ్డుతగులుతూ వచ్చింది. దాంతో జంఝావతి ఫలాలను ముందస్తుగా రైతులకు అందించడానికి 2006లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దేశంలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యామ్‌ను నిర్మించారు. సంప్రదింపుల ద్వారా వివాదాలు పరిష్కారం.. వంశధారలో 115 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసి.. ఇరు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేస్తూ సెప్టెంబర్ 13, 2017న ట్రిబ్యునల్ తుది తీర్పును ఇచ్చింది. నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఏపీకి అప్పగించాలని, ఇందుకు ఏపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఆయకట్టు ప్రాతిపదికన దామాషా పద్ధతిలో ఇరు రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఒడిశా సర్కార్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం కోర్టు, వంశధార ట్రిబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ముంపు భూమిని గుర్తించేందుకు జాయింట్ సర్వేకు కూడా ఒడిశా సర్కార్ సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. వంశధార జలాల్లో రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన 57.5 టీఎంసీలను వినియోగించుకోవడం ద్వారా శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలని నిర్ణయించారు. ఒడిశాలో ముంపునకు గురయ్యే భూమిని సేకరించడం, ముంపు గ్రామాలను ఖాళీ చేయించడంపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చర్చించి... జంఝావతిపై 3.40 టీఎంసీల సామర్థ్యంతో పూర్తి స్థాయి బ్యారేజీని నిర్మించడానికి మార్గం సుగమం చేయాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. -
సాగునీటి సంకల్పం
జిల్లాలోని రైతుల ఆశలు నెరవేరనున్నాయి. సాగునీటి సమస్యలు పరిష్కారం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ప్రాజెక్టులకు మహర్దశ పట్టనుంది. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు ఇక తెరపడనుంది. ఇన్నాళ్లు అవరోధంగా నిలిచిన పక్క రాష్టాలతో చర్చకు సీఎం సుముఖత చూపడం శుభపరిణామంగా కనిపిస్తోంది. పెండింగ్‌లో ఉన్న కాలువల ఆధునికీకరణకు ఇక మార్గం సుగమమైంది. ఇక రాబోయే కాలంలో జిల్లా మొత్తం సస్యశ్యామలంగా మారనుంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో సాగునీటి రంగానికి మంచి రోజులు రానున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గురువారం నిర్వహించిన అధికారుల సమావేశంలో జంఝావతి ప్రాజెక్టు అంతరాష్ట్ర సమస్యపై ఒడిశా సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. తోటపల్లి నీటి నిల్వ సామర్థ్యం పూర్తిగా వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీనివల్ల ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలోని రైతులకు మరింత మేలు జరగనుంది. ఇదే క్రమంలో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను గాడిన పెట్టేందుకు జిల్లా ప్రజాప్రతినిధులు నడుం బిగుస్తున్నారు. అధికారులతో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శనివారం సమీక్ష నిర్వహించనున్నారు. పథకాలున్నా... ప్రయోజనం అంతంతే... జిల్లాలో ఉన్న సాగునీటి వనరులే తక్కువ. ఉన్న కాడికి నిధులు ఏటా ఖర్చు చేస్తున్నా తూములు, మదుములు, కాలువలకు మాత్రం మరమ్మతు ల గ్రహణం వీడటం లేదు. ముఖ్యంగా లక్షా 78 వేల ఎకరాలకు పైగా భూములు చిన్న నీటి పథకాల పరిధిలో సాగవుతున్నాయి. ఏటా రైతులు ఇసుక బస్తాలు, రాళ్లు అడ్డం పెట్టుకోవడం లేదా కాలువల్లోని పూడికలు తీసుకోవడం మినహా మరే విధమయిన అవకాశమూ లేకపోతోంది. ఆధునికీకరణకు నోచని మధ్యతరహా ప్రాజెక్టులు జిల్లాలో తొమ్మిది మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులున్నాయి. ఇందులో కాలువలకు లైనింగ్లేదు. చాలా ప్రాజెక్టులకు ప్రధాన కాలువలతో పాటు షట్టర్లు సైతం మరమ్మతుల్లో ఉండటం వల్ల ఉన్న కొద్ది పాటి నీరు కూడాఏటా లీకులవుతూనే ఉన్నాయి. వీటి మరమ్మతుల కోసం వెచ్చించిన నిధులు ఏమవుతున్నాయో తెలియడం లేదు. జైకా నిధులు ఉన్నా దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మాత్రం సరిచేసి పంపించాల్సి ఉండగా నేటికీ అడుగు ముందుకు పడటం లేదు. దీంతో మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల్లో చివరి భూములకు మాత్రం నేటికీ సాగునీరందడం లేదు. ప్రాజెక్టుల మరమ్మతుకు ఈ ఏడాది ప్రతిపాదనలు కూడా చేసినట్టు లేదు. ఫలితంగా జిల్లాలోని పలు ప్రాజెక్టుల్లో సాగునీరు పారేందుకు వీలు లేకపోయింది. నీరు చెట్టు పనులకు సంబంధించి భారీ స్థాయిలో స్కెచ్ వేసిన నాయకులకు రాష్ట్ర ప్రభుత్వం ఝలక్ఇవ్వడంతో ఆ బిల్లులు నిలిచిపోయాయి. ఇప్పుడు మాత్రం పారదర్శకంగా పనులు చేస్తేనే బిల్లులిస్తామని తేలడంతో ఆదేశాలు వచ్చే వరకూ ఎటువంటి పనులూ చేయకూడదని పలువురు నిర్ణయించుకున్నారు. వారంతా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టు సా...గుతున్న తోటపల్లి కాలువ పనులు జిల్లాలోని పది సాగునీటి ప్రాజెక్టులున్నా ఏకైక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు తోటపల్లే. రెండు జిల్లాలకూ కలిపి పాత ఆయకట్టు 64 వేల ఎకరాలు కాగా కొత్తగా లక్షా 23 వేల ఎకరాలకు సాగునీరందించాలని నిర్ణయించినా కాలువకు లైనింగ్ లేదు. ఎన్నాళ్ల క్రితమో లైనింగ్ కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. కానీ పనులు కాక సక్రమంగా సాగునీరు వెళ్లడం లేదు. తోటపల్లి ప్రాజెక్టు వద్ద నిద్రపోయి పూర్తి చేస్తున్నానని ఆర్భాటంగా ప్రకటించిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆనాటితో ప్రాజెక్టును వదిలేశారు. ప్రాజెక్టు అంచనాలు గత ఐదేళ్లలో రూ.450కోట్ల నుంచి రూ.1127కోట్లకు పెంచేశారు. కానీ పనులు పూర్తి కాలేదు. ప్యాకేజీ–1 పనులు 75శాతం, ప్యాకేజీ–2 పనులు 90శాతం పూర్తయ్యాయి. దీనివల్ల ప్రాజెక్టులో నీరున్నా కాలువలు ద్వారా పంట పొలాలకు అందడం లేదు. ఇక్కడి ప్రధాన కాలువల నుంచి పిల్ల కాలువలకు భూ సేకరణ కూడా చేపట్టలేదు. కళ్లముందే సాగునీరు ఇతర జిల్లాలకు వెళ్తున్నా ఇక్కడి రైతులకు మాత్రం కన్నీరే గతయింది. 400 ఎకరాల సేకరణ పెండింగ్ తోటపల్లి కాలువల నుంచి పెద్ద ఎత్తున పిల్ల కాలువలు నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం 400 ఎకరాలను సేకరించాల్సి ఉంది. కానీ నేటికీ ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రెవెన్యూ అధికారులు మాత్రం ఈ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిందని చెబుతున్నా నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఇంకా పిల్ల కాలువలకు భూ సేకరణ పూర్తి కాలేదు. ఈ ఏడాది కూడా బొబ్బిలి, బాడంగి, తెర్లాం మండలాల్లోని రైతులకు తోటపల్లి సాగునీరు అందలేదు. ముందుకు కదలని వెంగళరాయ విస్తరణ జిల్లాలో వెంగళరాయ సాగర్‌ప్రాజెక్టుకు 24వేల పైచిలుకు ఎకరాల ఆయకట్టున్నా జలాశయ సామర్థ్యాన్ని బట్టి మరో 8వేల ఎకరాలకు సాగునీరందించవచ్చని గతంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దాని ప్రకారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి గొల్లపల్లిలో రూ.5కోట్లతో కొన్నేళ్ల క్రితం అదనపు ఆయకట్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులు వరుసగా అంచనాలు పెరుగుతూ రూ.12.67 కోట్లకు చేరింది. ఈ పనులను చిత్తూరుకు చెందిన ఆర్ ఆర్ కన్స్ట్రక్షన్స్ చేపట్టింది. కేవలం 13 నెలల్లోనే ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా పనులు సాగుతూనే ఉన్నాయి. నేటికి కేవలం 20 శాతం పనులు అయ్యాయని అధికారులు చెబుతున్నా అంత కూడా లేదని స్థానికులు అంటున్నారు. తారకరామకు అడ్డంకులెన్నో... తారకరామతీర్ధసాగర్ ప్రాజెక్టు మంత్రి బొత్స సత్యనారాయణ గతంలో మంత్రిగా ఉన్నప్పుడే 15శాతం పనులు జరిగాయి. అటు తరువాత ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటికి స్పిల్‌వే రెగ్యులేటర్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధాన కాలువ పనుల్లో ముఖ్యమైన టన్నెల్ సమస్య అడుగైనా కదలడం లేదు. జలాశయం పనులు కొద్దిగా జరిగాయి. 500ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. ఆర్అండ్ఆర్ పనులు కదల్లేదు. ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. ఇక ఎన్నో ఏళ్లుగా జంఝావతి సమస్య అలాగే ఉంది. దీనినే ఇప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. వెంగళరాయ, పెద్దగెడ్డ, ఆండ్ర, పెదంకలాలం, వట్టిగెడ్డ వంటి ప్రాజెక్టులు అధునికీకరణకు రూ.178కోట్లు జైకా నిధులు మంజూరైనా టెండర్లు ఖరారు కాలేదు. ముఖ్యమంత్రి చొరవతో ఈ ప్రాజెక్టులకు మహర్ద శ పట్టనుందనడంలోఎంలాంటి సందేహం లేదు. -
జంఝాటం !
ఆ ప్రాంతంలో సాగునీటి సమస్య తీర్చడానికి ప్రాజెక్టు ఉంది. దాని ద్వారా నీరు తరలించడానికి కాలువలున్నాయి. కానీ నిర్వహణే లేదు. కాలువల్లో గుర్రపుడెక్క... పిచ్చిమొక్కలు... పెరిగిపోయాయి. చుక్కనీరైనా సాగడానికి అనువుగా లేదు. మరోచోట కాలువకు అడ్డంగా పెద్దరాయి పడింది. దానిని తొలగించకపోవడంవల్ల నీరు రావట్లేదు. దీనివల్ల వేలాది ఎకరాలకు సాగునీరు అందడం లేదు. దీనంతటికీ కారణం గత ప్రభుత్వం నిర్లక్ష్యం... అధికారుల్లో చిత్తశుద్ధి లోపం. ఇదీ జంఝావతి రిజర్వాయర్ పరిధిలోని కాలువల దుస్థితి. వీరి నిర్వాకం వల్ల పార్వతీపురం సబ్‌డివిజన్ పరిధిలోని మూడు మండలాలకు సాగునీరు అందక అవస్థలు పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుంది మన రైతన్నల పరిస్థితి. పంటల సాగుకు అవసరమైన ప్రాజెక్టులున్నాయి. నీటి వనరులున్నాయి. కాని అధికారుల పర్యవేక్షణ లోపంతో సాగునీరు సకాలంలో అందక కరువు పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తోంది. పార్వతీపురం డివిజన్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన బడుగు రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. జంఝావతి ఎగువ, దిగువ కాలువల అభివృద్ధికి రూ.28.44 కోట్లు నిధులున్నా అధికారులు సకాలంలో పూడికలు తీయకపోవడం, ఎస్టిమేట్లు వేయడంలో నిబద్ధత లోపించడంవల్ల రైతన్నలు ఈ ఏడాది ఖరీఫ్‌కు దూరమై కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దిగువ కాలువను వేధిస్తున్న అడ్డంకులు.. జంఝావతి దిగువ కాలువ పొడవు 26.09 కిలోమీటర్లు. ఇది జంఝావతి రబ్బరు డ్యాం నుంచి సీతానగరం మండలం నిడగల్లు, ఇప్పలవలస వరకు ఉంది. కాలువలో గుర్రపు డెక్క ఆకు పెరగడం, కాలువలో కొన్ని ప్రాంతాల్లో రాతి బండలు అడ్డంగా ఉండటంతో కాలువ ద్వారా రైతులకు అవసరమైన సాగునీరు రావడంలేదు. అలాగే సీతానగరం మండలం నిడగల్లు వద్ద పోతినాయుడు చెరువు వద్ద బాక్స్ కల్వర్టు నిర్మించాల్సి ఉంది. నర్సిపురం వద్ద ఒక కల్వర్టు, నర్సిపురం కనుమల చెరువు వద్ద ఒక సూపర్ పాసేజ్‌ను నిర్మించాల్సి ఉంది. మృత్యుంజయవలస వద్ద ఒక కల్వర్టు నిర్మించాల్సి ఉంది. ఈ కల్వర్టులకు నిధులు కూడా మంజూరై ఉన్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో కాలువకు అడ్డుగా ఉన్న రాయిని తొలగించడానికి, కల్వర్టులు నిర్మాణానికి, అడ్డాపుశిలనుంచి సీతానగరం మండలంలోని తామర చెరువు వరకూ కాలువ అభివృద్ధి చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చి 2017–18 ఖరీఫ్ సీజనులో నిర్దేశించిన భూములకు సాగునీరందించడానికి సిద్ధం చేయాలని మార్గదర్శకాలున్నా పనులు జరగడం లేదు. కాని కాంట్రాక్టర్ సకాలంలో వీటిని నిర్మించడంలేదు. గుర్రపు డెక్క ఆకును తొలగిస్తే చాలు నీరు దిగువకు వెళుతుంది. కాని అధికారులు నిధులు వినియోగించకుండా, పనులు చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడంతో రైతన్నలు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పడకేసిన ఎగువకాలువ.. జంఝవతి ఎగువ కాలువ జంఝావతి రబ్బర్ డ్యాం నుంచి జమదాల గ్రామం వరకు 27.29 కిలోమీటర్ల పొడవు ఉంది. నెల్లూరుకు చెందిన ఆర్‌కెఎన్ ప్రాజెక్ట్సుకు చెందిన కాంట్రాక్టరు ఈ కాలువ పనుల టెండర్ దక్కించుకున్నారు. కొమరాడ మండలం డంగభద్ర వద్ద రాయిపణుకు తగిలింది. 1300 నుంచి 1700 మీటర్ల మేర రాళ్ళను పేల్చి కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కాంట్రాక్టర్ రూ.6 కోట్ల వరకు ఖర్చు పెట్టగా అప్పటి ప్రభుత్వం రూ.3 కోట్ల వరకు బిల్లులు చెల్లించలేదు. దీనివల్ల పనులు ఆగిపోయాయి. నీరున్నా... అందని వైనం.. పార్వతీపురం మండలంలోని ఎమ్మార్‌నగర్, కృష్ణపల్లి, మరిపి, ఎల్.ఎన్.పురం, చినబొండపల్లి, వెంకంపేట, పెదబొండపల్లి, లచ్చిరాజుపేట, తాళ్ళబురిడి, జమదాల గ్రామాలకు అందాల్సిన సాగు నీరు అందకుండా పోయింది. ఒక వైపు అధికారుల పర్యవేక్షణ లోపం, మరో వైపు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా రైతన్నలకు కళ్ళముందే సాగునీరు ఉన్నా అది సాగుకు అందకుండా పోతోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి నిధులు విడుదల చేస్తే కేవలం వారం రోజుల్లోనే పనులు పూర్తి చేసి పంట చేలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. -
కలెక్టర్ అవుతాడనుకుంటే... కానరాని తీరాలకు..
♦ జంఝావతి రిజర్వాయర్‌లో పడి ఏజీబీఎస్సీ విద్యార్థి మృతి ♦ ప్రమాదం నుంచి బయటపడ్డ మరో నలుగురు ♦ కన్నకొడుకు మృతి వార్త విని కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ♦ సెలవులకోసం వచ్చి శవమవుతాడను కోలేదని రోదన చెట్టంత ఎదిగిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు ఉబ్బి తబ్బిబ్బయిపోయారు. ఎప్పటికైనా కలెక్టర్ అవుతానని చెబితే ఎంతో మురిసిపోయారు. తల్లిదండ్రులు లేని ఓ మిత్రుడిని తీసుకొచ్చి అన్నలా ఉంచుకుందామంటే కాదనలేకపోయారు. కుమారుడి ఎదుగుదలతో వారి కలలు తీరుతాయని సంబరపడ్డారు. మరో మూడు రోజుల్లో తాను చదువుకుంటున్న పంజాబ్ వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటుంటే తనకు సహకరించారు. స్నేహితులతో కలసి బయటకు వెళ్లి వస్తామంటే సరేనన్నారు. కానీ విధి వారి ఆనందాన్ని ఎంతోకాలం నిలవనీయలేదు. వారి ఆశలు తీర్చకుండానే ఆ కొడుకును మృత్యురూపంలో తీసుకుపోయింది. జంఝావతిలో పడి మృతి చెందాడన్న వార్తతో వారి కలలు కల్లలయ్యాయని గొల్లుమన్నారు. పార్వతీపురం టౌన్/కొమరాడ: పార్వతీపురం మండలం ములగ గ్రామానికి చెందిన తాన్న రామకృష్ణ, అరుణ దంపతుల కుమారుడు తాన్న ప్రవీణ్‌కుమార్(19) ఏజీబీఎస్సీ నాల్గవ సంవత్సరం పంజాబ్‌లోని లౌలీ యూనివర్శిటీలో చదువుతున్నాడు. ప్రస్తుతం వీరు పార్వతీపురం జనశక్తి కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రవీణ్‌కుమార్ సెలవులకు ఇటీవల ఇంటికి వచ్చాడు. ఈ నెల 10వ తేదీన తిరిగి వెళ్లిపోయేందుకు ఫ్లైట్ టిక్కెట్టు కూడా బుక్ చేసుకున్నాడు. గురువారం సాయంత్రం స్నేహితులతో కలసి అలా తిరిగి వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. స్నేహితులైన గొడబసాయి, అంబటి హరీష్, ఆదిమూలం సాయిభరత్, మజ్జి విశాల్‌తో కలసి కొమరాడ మండలం రాజ్యలక్ష్మిపురం వద్ద ఉన్న జంఝావ తి రబ్బర్ డ్యామ్ వద్దకు వెళ్లారు. డ్యామ్ దిగువన ఈత కొట్టేందుకు వెళ్లిన ఆ ఐదుగురు ఓ గుంతలో పడిపోయారు. గుంతలోతుకు కూరుకుపోతున్న వారిలో గొడబ సాయి తోటి మిత్రులైన హరీష్, సాయిభరత్, విశాల్‌లను రక్షించాడు. ఇంతలో ప్రవీణ్ పూర్తిగా మునిగిపోయాడు. సంఘటనాస్థలానికి అధికారులు విషయం తెలుసుకున్న ఆర్డీఓ సుదర్శన దొర, అగ్నిమాపక సిబ్బంది, పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నా రు. చాలా సేపు అగ్నిమాప శాఖ సిబ్బంది గాలించినా ఫలితం కనిపించలేదు. చివరకు పక్క గ్రామానికి చెందిన ఓ ఈతగాడికి ప్రవీణ్ మృతదేహం లభ్యమైంది. బయటకు తీసి వెంటనే పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కన్నీరు మున్నీరైన కన్నవారు విషయం తెలుసుకున్న కన్నవారు ఆస్పత్రికి చేరుకుని గొల్లుమన్నారు. బాగా చదువుకోవాలి... ఎలాగైనా కలెక్టర్ కావాలి. మన కుటుంబంలో ఎవరూ కలెక్టర్ అవ్వలేదు. నేను కష్టపడి చదువుతాను... కలెక్టర్ అవుతాను... అని ఎప్పుడూ తల్లిదండ్రులకు చె ప్పే కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లి పోవడంతో వారంతా కన్నీరు మున్నీరై విల పించారు. ప్రవీణ్ అక్క సుధారాణి యూరఫ్‌లో ఉంటున్నారు. స్నేహితుడినే సోదరునిగా భావించి... ప్రవీణ్‌కుమార్ పంజాబ్‌లో లౌలీ యూనివర్శిటీలో చదువుతున్న చోట ప్రసన్న అనే స్నేహితుడు పరిచయమయ్యాడు. అతని తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో ప్రసన్న తనకు ఎవరూలేరని మనస్తాపం చెంది తిరుపతి కొండకు వెళ్లి అక్కడ వెంకన్నను దర్శించుకుని కొండపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. చివరిసారిగా స్నేహితుడు ప్రవీణ్‌కుమార్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పా డు. అది విన్న ప్రవీణ్ చలించిపోయాడు. తనను చనిపోవద్దని... తనకు అన్నలా ఉండాలనీ... ఒప్పించి ఆత్మహత్యనుంచి విరమింపజేశాడు. ఆ తరువాత ఆ స్నేహితుడిని ఇంటికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించాడు. అప్పటినుంచి ప్రసన్న తరచూ పార్వతీపురం వస్తూ పోతున్నాడు. ఆయన ఫీజులు కూడా ప్రవీణ్‌కుమార్ తల్లిదండ్రులే కడుతున్నారు. తాను చనిపోతానని ముందే తెలిసి ప్రసన్నను తమకు అప్పగించావా అంటూ ఆ తల్లి రోదిస్తున్న తీరు అక్కడివారిని కదిలించేసింది. -
జలసిరులెక్కడ?