JC Sharma
-
‘హీరో’కు నాలా పన్ను మినహాయింపు
ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ ప్రైవేటు లిమిటెడ్‌పై ప్రభుత్వం రాయితీల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఆ పరిశ్రమకు కేటాయించిన భూమికి నాలా పన్ను నుంచి మినహాయంపును ఇస్తూ గురువారం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం మాదన్నపాలెంలో ద్విచక్ర వాహనాల పరిశ్రమ ఏర్పాటుకు హీరో మోటో కార్ప్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు 632.96 ఎకరాల భూమిని కేటాయించిన విషయం విదితమే. అక్కడ పరిశ్రమను ఏర్పాటుచేయాలంటే.. ఆ భూమిని వ్యవసాయ విభాగం నుంచి వ్యవసాయేతర విభాగం కిందకు మార్పిడి చేయాలి. ఇందుకు నాలా రూపంలో ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. ఆ పన్ను నుంచి ‘హీరో’ సంస్థకు ప్రభుత్వం మినహాయింపును ఇచ్చింది. -
ముసునూరులో ఉద్రిక్తత
‘వనజాక్షి’ ఘటన విచారణ కమిటీ ఎదుటే చింతమనేని వర్గం దౌర్జన్యం సాక్షి, విజయవాడ బ్యూరో: కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని దాడికి పాల్పడిన ఘటనలో విచారణ ఉద్రిక్తతకు దారి తీసింది. ద్విసభ్య కమిటీ సభ్యులు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ, సెర్ప్ సీఈఓ సాల్మన్ ఆరోగ్యరాజ్ గురువారం విచారణ జరిపారు. ఘటన జరిగిన ముసునూరు మండలం, రంగంపేట, పెదవేగి మండలం విజయరాయి ఇసుక రీచ్లప్రాంతాన్ని పరిశీలించేందుకు బృందం వెళ్లింది. వనజాక్షిపై దాడికి దారితీసిన పరిస్థితులను ముసునూరు నాయకుడు, మాజీ ఎంపీపీ వైఎస్సార్ చౌదరి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులకు వివరిస్తుండగా, అప్పటికే డ్వాక్రా మహిళల ముసుగున వందలాది మంది మహిళలు, అనుచరగణంతో అక్కడికి చేరుకున్న చింతమనేని వర్గం అడ్డుతగిలి దాడికి యత్నించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో కమిటీ సభ్యులు విజయవాడ సబ్-కలెక్టర్ కార్యాలయంలో విచారణ జరుపుతామంటూ అక్కడి నుంచి నిష్ర్కమించారు. విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో విచారణకు బాధితురాలు వనజాక్షి, చింతమనేని హాజరయ్యారు. దాదాపు 5 గంటలపాటు విచారణ కమిటీ అందరి అభిప్రాయాలు సేకరించింది. తనపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వనజాక్షి కమిటీ సభ్యులను కోరారు. రంగంపేట-విజయరాయి ఇసుక క్వారీ వివాదం నేపథ్యంలో రీ-సర్వే చేసి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తాను తప్పు చేసినట్టు తేలితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలుగుతానని చింతమనేని స్రవాల్ విసిరారు. -
పంతం నెగ్గించుకున్న గంటా
వచ్చిన కొద్దిరోజులకే అనకాపల్లి ఆర్డీవో బదిలీ వుడా కార్యదర్శి.. ఎస్సీ కార్పొరేషన్ ఈడీలకూ.. పోర్టు ట్రస్ట్ డిప్యూటీ ఎస్టేట్ ఆఫీసర్‌కు స్థానచలం విశాఖపట్నం : జిల్లాకు చెందిన పలువురు అధికారులను ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాదికారిక సంస్థ(సీఆర్డీఏ)కు డిప్యూటీ కలెక్టర్లుగా బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా 36 మందికి స్థానచలం కలిగించగా, వారిలో జిల్లాకు చెందిన నలుగురున్నారు. ఇటీవల బదిలీపై జిల్లాకు వచ్చిన అనకాపల్లి ఆర్డీవో బి.పద్మావతికి కూడా ఈ బదిలీల్లో వేటు పడింది. అనకాపల్లి ఆర్డీవోగా ఆమె నియామకాన్ని రాష్ర్ట మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు వ్యతిరేకించారు. అయినప్పటికీ మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చక్రం తిప్పి ఆమెను జిల్లాకు రప్పించారు. నాటి బదిలీల్లో పట్టుబట్టి మరీ పద్మావతిని అనకాపల్లి ఆర్డీవోగా పోస్టింగ్ ఇప్పించారు. నాటి నుంచి మంత్రి గంటాతో పాటు స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద్‌లు ఈమె నియామకాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఏదోవిధంగా ఆమెను సాగనంపేందుకు మంత్రి గంటా విఫలయత్నం చేశారు. ఎట్టకేలకు తనపంతం నెగ్గించుకున్నారు. నవంబర్‌లో జరిగిన సాధారణ బదిలీల్లో ఇక్కడకు వచ్చిన ఆమె అనతి కాలంలోనే బదిలీ వేటుకు గురయ్యారు. కాగా వుడా కార్యదర్శిగా పనిచేస్తున్న జీసీ కిషోర్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూ టీవ్ డెరైక్టర్ ఎఎన్ సలీం ఖాన్, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌లో డిప్యూటీ ఎస్టేట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కె.పద్మలతలు సీఆర్డీఏకు బదిలీ అయ్యారు. అదే విధంగా విశాఖపట్నం సెంట్రల్ మెడికల్ స్టోర్ ఇన్చార్జిగా అనకాపల్లి యూఎఫ్‌డబ్ల్యూసీ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎస్.ఎఫ్.రవీంద్రను నియమిస్తూ వైద్యఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. -
సమస్యలు చెప్పేందుకు..తరలుదాము రండి!
సన్నద్ధమవుతున్న జనం నేటి నుంచి జన్మభూమి-మన ఊరు ప్రత్యేకాధికారిగా జేసీ శర్మ ‘తరలుదామురండి...మనం జన్మభూమికి’ అని పదేళ్ల కిందట ఊరువాడ మార్మోగిన పాట మళ్లీ గురువారం నుంచి పల్లెసీమల్లో వినిపించనుంది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ‘జన్మభూమి-మన ఊరు’ పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులను పల్లెబాట పట్టిస్తోంది. అయితే అధికారం చేపట్టిన నాలుగు నెలల్లో ఒక్క ప్రజా ఉపయోగ కార్యక్రమం కూడా చేపట్టని ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీసేందుకు ప్రజలు సన్నద్ధమై ఉన్నారు. ముఖ్యంగా రుణమాఫీ, కొత్తగా బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడం, పింఛన్లు తీసివేత, ఆదర్శరైతుల తొలగింపు, మంచినీరు, ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల పెండింగ్.. ఇలా ప్రతి సమస్యపై జన్మభూమిలో గళం విప్పనున్నారు. సాక్షి, చిత్తూరు: ‘జన్మభూమి-మనఊరు’ కార్యక్రమాన్ని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్తూరులో ర్యాలీ ద్వారా ప్రారంభించనున్నారు. జన్మభూమి ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ అధికారి ఎస్ఎస్ రావత్ బదులు జేసీ శర్మ నియమితులయ్యారు. 20వ తేదీ వరకూ జరిగే ఈ కార్యక్రమాన్ని జేసీ శర్మ పర్యవేక్షించనున్నారు. ప్రజలకు బోలెడు హామీలిచ్చి అధికారంలో వచ్చిన చంద్రబాబు సర్కారు ఒక్కహా మీని కూడా నిలబెట్టుకోలేకపోయింది. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు బాబు హామీ ఇచ్చారు. అధికారం దక్కిన తర్వాత సవాలక్ష ఆంక్షలు విధించి రూ.1.50లక్షల వరకూ మాత్రమే మాఫీ చేస్తామన్నారు. కనీసం ఈ హామీనైనా నిలబెట్టుకున్నారా? అంటే అదీ లేదు. దీంతో కొత్త రుణాలు అందక రైతులు తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటసాగుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జన్మభూమి పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులు పల్లెల్లోకి వెళితే ప్రజల నుంచి నిరసనలు, ప్రతిఘటనలు అనివార్యమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. పింఛన్ల తొలగింపుపై నిలదీత జన్మభూమిలో ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని తీసుకోవాలని సీఎం సూచించారు. అయితే తీసుకున్న అర్జీలకు న్యాయం జరిగే పరిస్థితులు కన్పించడం లేదు. తనిఖీల పేరుతో జిల్లా వ్యాప్తంగా 34,459 మందికి పింఛన్లు తొలగిం చారు. మరో 10 వేల మంది తీసివేత జాబితా లో చేరనున్నారు. వీరిలో సింహభాగం అర్హులే ఉన్నారు. అక్టోబర్ 2 నుంచి పెంచిన పింఛను సొమ్ము అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే ఇప్పటికీ పింఛనుదారుల జాబితా సిద్ధం కాలేదు. ఈ క్రమంలో నామమాత్రంగా ఒకరిద్దరికి పెంచిన పింఛను ఇవ్వడం మినహా అర్హులందరికీ పింఛన్ అందే పరిస్థితులు లేవు. అలాగే జిల్లావ్యాప్తంగా 1846 మంది ఆదర్శరైతులను తొలగించారు. ‘బాబు వస్తే జాబు’ అని ఉన్న ఉద్యోగాలను తీసేయడంపై ఆదర్శరైతులు జన్మభూమిని అడ్డుకోనున్నారు. అలాగే ఇందిర్మబిల్లులు చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిపై కూడా ప్రశ్నాస్త్రాలను సంధిం చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని మహిళలు నిలదీయనున్నారు. ప్రతీ ‘సారీ’ మాట తప్పడం ఏంటీ ‘బాబూ..!’ జిల్లాలో ప్రతిగ్రామానికీ అక్టోబర్ 2 నుంచిస్వచ్ఛమైన తాగునీటి అందిస్తామని రాష్ట్ర కేబినెట్ రెండు నెలల కిందట ప్రకటించింది. అయితే ప్రభుత్వం కాకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో నడపాలని నిర్ణయించడంతో ఎవరూ ముందుకు రాక ‘సుజల’ ఆరంభశూరత్వమైంది. చివరకు నియోజకవర్గంలో ఒక్క గ్రామంలో అయినా ప్రారంభించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇదికూడా సాధ్యం కాక అధికారులు చేతులెత్తేశారు. కేవలం కుప్పం, తంబళ్లపల్లె, శ్రీకాళహస్తి, చిత్తూరు మండలాల్లోని ఒక్కొక్క గ్రామం చొప్పున పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అలాగే అక్టోబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల కరెంటు సరఫరా చేస్తామని ప్రకటించారు. అయితే తిరుపతి కార్పొరేషన్‌కు మాత్రమే పరిమితం చేశారు. దీంతో తక్కిన ప్రాంతాల్లో కోతలు యాథావిధిగా ఉండే పరిస్థితి. మొత్తానికి అరచేతిలో స్వర్గం చూపించేలా మాటలు కోటలు దాటేలా చెప్పి ప్రతి అంశంలోనూ మాట తప్పుతున్న చంద్రబాబు సర్కారు జన్మభూమిలో ఊరు దాటి రావడం కత్తిమీద సామే! -
ముంపు గ్రామాల విలీనంపై 15న గెజిట్
-
ముంపు గ్రామాల విలీనంపై 15న గెజిట్
ఏపీ సర్కారు ఉత్తర్వులు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనం హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాలను ఏపీలో విలీనం చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15న గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఈమేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఏపీ జిల్లా ఫార్మేషన్ యాక్ట్ 1974 ప్రకారం కుకునూరు, వేలేరుపాడు రెవెన్యూ మండలాలతో పాటు బూర్గంపాడు మండలం పరిధిలోని సీతారామనగరం, శ్రీధర వేలేరు, గుంపనపల్లి, గణపవరం, ఇబ్రహీంపేట్, రవిగూడెం గ్రామాలను పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లో విలీనం చేస్తున్న ట్టు పేర్కొన్నారు. భద్రాచలం (భద్రాచలం రెవె న్యూ గ్రామం మినహాయింపు), కూనవరం, చిం తూరు, వర రామచంద్రాపురం రెవెన్యూ మండలాలను తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెవెన్యూ మండలాలు, గ్రామాల విలీనం, దీనివలన నష్టపోతున్న ప్రజలపై తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు నివేదికలు ఇచ్చారని, వాటిని భూపరిపాలన శాఖ (సీసీఎల్ఏ) క్షుణ్ణంగా పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా పరిపాలన సౌలభ్యం కోసం ఈ మండలాలు, గ్రామాలను తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనం చేస్తూ 15న అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ ఇస్తున్నట్టు చెప్పారు. -
అమలాపురం ఆర్డీఓ ప్రియాంక బదిలీ
అమలాపురం :అమలాపురం ఆర్డీఓ సీహెచ్.ప్రియాంక బదిలీ అయ్యారు. చిత్తూరు జిల్లా పుత్తూరు ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ కలెక్టర్‌గా ఆమెను బదిలీ చేస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ కలెక్టర్‌గా వెళుతున్న ఆమెకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం స్పెషల్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అధికారుల ప్రశంసలు వారం పదిరోజులుగా ఆర్డీఓ బదిలీపై జోరుగా ఊహాగానాలు వినిపించిన క్రమంలో ఆమె బదిలీపై రెవెన్యూ అధికారులు పెద్దగా ఆశ్చర్చపోవడంలేదు. గత ఏడాది పైలీన్ తుపాను సమయంలో ఆమె ఇక్కడ ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించారు. కోనసీమను అతలాకుతలం చేసిన హెలెన్ తుపాను సమయంలో - మిగతా 2లోఠ అనుభవం లేకపోయినా సమర్ధవంతంగా పనిచేశారు. అనంతరం వచ్చిన స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలోనే రెండు నెలల క్రితం ఐఏఎస్ అధికారి కర్నన్‌ను వివాహం చేసుకున్నారు. కొత్త ఆర్డీవోగా గణేష్‌కుమార్ ప్రియాంక స్థానంలో శ్రీకాకుళం ఆర్డీఓ జి.గణేష్‌కుమార్ బదిలీపై ఇక్కడకు రానున్నారు. అంతకుముందు రంపచోడవరం రెవెన్యూ డివిజనల్ అధికారిగా, కడప ఉప ఎన్నికల నిర్వహణాధికారిగా పనిచేసిన గణేష్‌కుమార్ 2009లో ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికై గ్రూప్-1 అధికారిగా నియమితులయ్యారు. శ్రీకాకుళం ఆర్డీవోగా పలు భూవివాదాలు పరిష్కరించారనే పేరుంది. సవాళ్లు... సంతృప్తి ఆర్డీఓగా తొలిపోస్టింగ్ అమలాపురంలో రావడంతో మొదట్లో కంగారు పడ్డాను. అమలాపురం లాంటి చోట పనిచేయడం ఏ అధికారికైనా సవాలే. నేను బాధ్యతలు స్వీకరించిన వెంటనే రెండు తుపానుల ఎదుర్కొనాల్సి వచ్చింది. మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. అతి సమస్యాత్మక మత్స్యకార గ్రామాల్లో సైతం ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించగలగడం పూర్తి సంతృప్తినిచ్చింది. - సీహెచ్.ప్రియాంక