Justice P. Sathasivam
-
జయ ఆశలపై సుప్రీం నీళ్లు
రాజీవ్ హంతకుల విడుదలకు బ్రేక్ న్యూఢిల్లీ: రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషుల తక్షణ విడుదలకు సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో బ్రేక్ పడింది. దోషుల విడుదలకు తమిళనాడు ప్రభుత్వం అనుసరించిన విధానపరమైన లోపాలను ఎత్తిచూపిన చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. తాము శిక్ష తగ్గించిన ముగ్గురు దోషులు మురుగన్, శంతన్, పెరారి వాలన్ విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వంతో పాటు జైలు ఉన్నతాధికారులు, ఇతరులకు ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్ హత్య కేసులో ముగ్గురు దోషులకు పడిన మరణశిక్షను జీవితఖైదుకు తగ్గిస్తూ సుప్రీం తీర్పు వెలువరించిన 24 గంటల్లోగానే ఈ కేసుకు సంబంధించిన మొత్తం ఏడుగురు దోషులను జైలు నుంచి విడుదల చేయూలని జయలలిత సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనిపై స్టే కోరుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టును ఆశ్రరుుంచింది. ఈ నేపథ్యంలో స్టే మంజూరు చేసిన బెంచ్ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్లో కేవలం ముగ్గురు పేర్లను మాత్రమే పేర్కొన్నందున శిక్ష మాఫీ పొందిన మిగతా న లుగురి విషయంలో తాజాగా మరో పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. దీంతో మొత్తం ఏడుగురు దోషుల విడుదలకు బ్రేక్ పడినట్టరుుంది. తదుపరి విచారణను మార్చి 6కు వారుుదా వేసింది. సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత ఒక్కరోజులోనే తమిళనాడు ప్రభుత్వం విధానపరమైన చర్యలన్నిటినీ ఎలా పూర్తి చేయగలిగిందని న్యాయమూర్తులు రంజన్ గొగోయ్, ఎన్.వి.రమణలతో కూడిన బెంచ్ విస్మయం వ్యక్తం చేసింది. దేశ అంతరాత్మపై దాడి: ప్రధాని రాజీవ్ హత్య భారతదేశ అంతరాత్మపై జరిగిన దాడిగా ప్రధాని మన్మో హన్‌సింగ్ అభివర్ణించారు. రాజీవ్ హంతకుల విడుదల అన్ని న్యాయ సూత్రాలకూ విరుద్ధమన్నారు. న్యాయపరంగా సమర్థనీయం కాని విషయంలో ముందుకువెళ్లరాదని తమిళనాడు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. -
స్వతంత్ర కుమార్‌పై సుప్రీంకు ఫిర్యాదు
న్యూఢిల్లీ: మాజీ జడ్జి స్వతంత్ర కుమార్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయన వద్ద పనిచేసిన న్యాయ విద్యార్థిని నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్వతంత్ర కుమార్‌పై విచారణ జరపాలని న్యాయస్థాన్ని ఆమె కోరింది. ప్రధాన న్యాయమూర్తి పి. సదాశివం నేతృత్వంలోని బెంచ్ దీన్ని త్వరితగతిన విచారించేందుకు స్వీకరించింది. ఈనెల 15న దీనిపై విచారణ జరపాలని నిర్ణయించింది. మాజీ జడ్జిలపై వచ్చిన ఫిర్యాదులను విచారణకు స్వీకరించకూడని గతేడాది డిసెంబర్ 5న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా ఆమె సవాల్ చేశారు. ఇటువంటి కేసుల విచారణకు సరైన వేదిక ఏర్పాటు చేయాలని ఆమె పిటిషన్లో కోరింది. జస్టిస్ స్వతంత్ర కుమార్ ప్రస్తుతం జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. -
సవరణ చేయాల్సింది చట్టసభలే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరినీ ఓటరు తిరస్కరించేందుకు వీలుగా కొత్తగా ప్రవేశపెట్టిన ‘పైవారెవరూ కాదు (నోటా)’కు మెజారిటీ ఓట్లు పోలైనపక్షంలో.. ఆ ఎన్నిక ఫలితాలను నిలిపివేసి తిరిగి ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నిర్దేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. అలాంటి ఆదేశాలు ఇవ్వటం ఇప్పుడు తొందరపాటు అవుతుందని, చట్టాన్ని సవరించాల్సింది చట్టసభేనని.. చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉంటుందనిచ, అందుకోసం ఈవీఎంలలో ‘నోటా’ మీట ఏర్పాటు చేయాలని నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తీర్పు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నుంచే ‘నోటా’ను అమలులోకి తెచ్చింది. మెజారిటీ ఓటర్లు ‘నోటా’ ఓట్లు వేసినట్లయితే ఆ ఎన్నికను రద్దు చేయాలంటూ జగన్నాథ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. నోటాను తాజాగా ప్రవేశపెట్టినందున.. దానికి ప్రజలు ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంటుందని పేర్కొంటూ పిల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా, రాజకీయాలు నేరపూరితం కాకుండా చూడటానికి అవసరమైన చట్టసవరణలను సిఫారసు చేయటం కోసం.. న్యాయ కమిషన్‌కు నిర్దేశించిన విధివిధానాలను తమకు తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది.