స్వతంత్ర కుమార్పై సుప్రీంకు ఫిర్యాదు
న్యూఢిల్లీ: మాజీ జడ్జి స్వతంత్ర కుమార్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయన వద్ద పనిచేసిన న్యాయ విద్యార్థిని నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్వతంత్ర కుమార్పై విచారణ జరపాలని న్యాయస్థాన్ని ఆమె కోరింది. ప్రధాన న్యాయమూర్తి పి. సదాశివం నేతృత్వంలోని బెంచ్ దీన్ని త్వరితగతిన విచారించేందుకు స్వీకరించింది. ఈనెల 15న దీనిపై విచారణ జరపాలని నిర్ణయించింది.
మాజీ జడ్జిలపై వచ్చిన ఫిర్యాదులను విచారణకు స్వీకరించకూడని గతేడాది డిసెంబర్ 5న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా ఆమె సవాల్ చేశారు. ఇటువంటి కేసుల విచారణకు సరైన వేదిక ఏర్పాటు చేయాలని ఆమె పిటిషన్లో కోరింది. జస్టిస్ స్వతంత్ర కుమార్ ప్రస్తుతం జాతీయ హరిత ట్రిబ్యునల్కు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు.