kaaleshvaram
-
నీళ్లలా ఇంత ఖర్చా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై తీవ్ర అభ్యంతరాలతో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు ఆర్థిక సుస్థిరత, భవిష్యత్తు మనుగడపై కాగ్ తీవ్ర సందేహాలను వ్యక్తం చేసినట్లు నీటిపారుదల శాఖ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో భాగంగా ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడం ద్వారా అనవసర భారం పడినట్లు ఆక్షేపించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుపై రెండేళ్లపాటు సుదీర్ఘ ఆడిట్ నిర్వహించిన తర్వాత కాగ్ ఈ మేరకు ప్రాథమిక నివేదికను రూపొందించింది. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న రుణాలకు వడ్డీలతో కలపి చెల్లింపులకు ఏటా రూ. 13 వేల కోట్లు, ప్రాజెక్టు విద్యుత్ చార్జీలకు ఏటా మరో రూ. 12 వేల కోట్లు, ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులకు రూ. 270 కోట్లు కలిపి ఏటా సుమారు రూ. 25 వేల కోట్ల వ్యయం కానుందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎకరం ఆయకట్టు సాగుకు కాళేశ్వరం పెట్టుబడి వ్యయం రూ. 6.4 లక్షలు కానుందని స్పష్టం చేసినట్లు తెలియవచ్చింది. ప్రాజెక్టు 12 శాతమే పూర్తి... కాళేశ్వరం ప్రాజెక్టులోని 56 పనుల్లో ఇప్పటివరకు 12 మాత్రమే పూర్తయ్యాయని, మరో 40 పనులు 3 శాతం నుంచి 99 శాతం వరకు, మిగిలిన 4 పనులు ఇంకా ప్రారంభం కాలేదని నివేదికలో కాగ్ వివరించినట్లు తెలిసింది. ప్రాజెక్టు భూసేకరణ కోసం 98,110 ఎకరాలకుగాను 63,972 ఎకరాలనే సేకరించారని తప్పుబట్టింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించిన అప్పుల్లో రూ. 1,700 కోట్లను ఇతర అవసరాలకు దారి మళ్లించినట్లు ఆరోపించింది. ఉన్నతాధికారుల భేటీ... కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ మేరకు కాగ్ తీవ్ర సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివరణలు ఇచ్చేందుకు రాష్ట్ర నీటిపారు దల శాఖ మల్లగుల్లాలు పడుతోంది. కాగ్ ని వేదికపై బుధవారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు చర్చించారు. దీనిపై ప్రభుత్వం నుంచి వివరణలను తీసుకున్నాక తుది నివేదిక సమర్పించే అవకాశం ఉంది. రుణాలు, వడ్డీల భారం.. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 6 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కలిపి 15 భారీ రుణాల రూపంలో మొత్తం రూ. 97,449 కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభు త్వం తీసుకుంది. వార్షిక వడ్డీ రేట్లు 8.25 శాతం నుంచి 10.9 శాతం వరకు ఉన్నాయి. 2023–24 నుంచి 2034–35 మధ్యకాలంలో ఏటా రూ. 13 వేల కోట్లను వడ్డీలతో సహా రుణాల తిరిగి చెల్లింపుల కోసం కట్టాల్సి ఉండనుంది. ఇప్పటివరకు పొందిన రుణాల తిరిగి చెల్లింపులు 2039–40 వరకు కొనసాగనున్నాయి. దీని నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 85 వేల కోట్లకుపైగా ఖర్చు చేయగా నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ. 1.50 లక్షల కోట్లకు ఎగబాకనుందని కాగ్ అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కింద ఎకరా ఆయకట్టు సాగుకు రూ. లక్ష వరకు కరెంట్ బిల్లు కానుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
మహాశివరాత్రికి ముస్తాబవుతున్న ఆలయాలు
శివరాత్రికి విద్యుదీపాలంకరణలో ముస్తాబు కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరాలయంలో ఈ నెల 20 నుంచి 22 వరకు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కాళేశ్వరాలయం విద్యుత్‌దీపాలతో జిగేల్‌మంటోంది. మంగళవారం రాత్రి ఆలయంలోని ప్రధాన గర్భగుడిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో కాళేశ్వరాలయం ముస్తాబు కావడంతో శివరాత్రి శోభను సంతరించుకుంది. శివకేశవుల నిలయం పాలకుర్తి పుణ్యక్షేత్రం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో(క్షీరగిరి)పై వెలసిన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నర్సింహస్వామి లింగము స్వయంభువు. ఆలయ గుహల నుంచి∙ఓంకార ప్రణవనాదం వినిపిస్తుందని భక్తుల విశ్వాసం. అదృశ్య రూపంలో ఉన్న సిద్ద పురుషులు అర్ధ రాత్రి వేళల్లో స్వామి వారిని అర్చించడానికి వస్తారని ప్రతీతి. ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారికి లక్ష రెట్లు అధిక ఫలితంతో పాటు మోక్షం లభిస్తుందని నమ్మిక. పక్కనే మరొక గుహలో శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి వెలసి శివ కేశవులకు భేదం లేదని ప్రభోదిస్తున్నాడు. ఈ శివ పంచాయతన క్షేత్రంలో శివుడు శ్రీ సోమేశ్వరుడిగా, విష్ణువు లక్ష్మీనర్సింహుడిగా వేర్వేరు గుహల్లో స్వయంభువులుగా వెలసి ఉన్నారు. పూర్వ కాలంలో సూర్యభగవానుని ఆల యం ఉండగా.. ఇప్పుడు కూడా ఆనవాళ్లు కనిపిస్తాయి. స్వామిపై విశ్వాసం సడలినా, కొండకు పరిశుద్దులై రాకపోయినా స్వామి రక్షక భటులైన తేనేటీగలు వెంటపడి కొండను దిగేలా చేస్తాయి. ఇక్కడ శైవాగం, వైదికాగం ప్రకారంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. గిరిజనులు సంప్రదాయ బద్ధంగా నృత్యాలు చేస్తూ కోలాటాలతో ఎడ్ల బండ్లతో ప్రదర్శనగా రావడం జాతర ప్రత్యేకత. గ్రామంలో పంచగుళ్ల వద్ద ఉన్న కోనేరులో స్నానం చేసిన భక్తులు పంచగుళ్లు దర్శించుకుని సోమేశ్వర ఆలయానికి రావడానికి ఏర్పాట్లుచేశారు. పాలకుర్తి టౌన్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన పాలకుర్తిలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హరిహరులు స్వయంభువులుగా ఒకే గుట్టపై వెలసిన దివ్య క్షేత్రంగా పాలకుర్తి వెలుగొందుతుంది. ఏటా మహా శివరాత్రి సందర్బంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈనెల 20 నుంచి 24 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు ఇతర జిల్లాల నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుండి భక్తులు తరలి రానున్నారు. 21న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి వారి కల్యాణం నిర్వహించనుండగా.. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల కొంగుబంగారం కురవి వీరన్న కురవి: భక్తుల కల్పతరువుగా, నమ్మిన వారి కొంగు బంగారంగా కురవిలోని వీరభద్రస్వామి విలసిల్లుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన శైవ పుణ్యక్షేత్రమైన భద్రకాళి సమేత శ్రీవీరభద్రస్వామి ఆలయంలో కల్యాణ బ్రహోత్సవాలు ఈనెల 20న గురువారం అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. ఈనెల 21వ తేదీన(శుక్రవారం) మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని కల్యాణమహోత్సవం కన్నుల పండువగా జరగనుంది. ఈనెల 20వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు శ్రీ స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయచరిత్ర... క్రీ.శ. 850 ప్రాంతంలో వేంగి రాజధానిగా పాలించు చాళుక్యుల సామంతులైన రాష్ట్రకూట రాజు భీమరాజు కురవిని రాజధానిగా చేసుకుని పాలించేవాడు. అప్పుడే వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అనంతరం కాకతీయ తొలి స్వతంత్ర రాజు ఒకటో బేతరాజు ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. రెండో బేతరాజు కురవి పక్కనే పెద్ద తటాకం(చెరువు)ను తవ్వించినట్లు చెబుతారు. కాకతీయ రాణి రుద్రమదేవి ఆలయాన్ని సందర్శించి ఏకశిల రాతి స్తంభ దీపాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇప్పటికి ఆ స్తంభం దర్శనమిస్తుంది. రాజగోపురం దాటి లోనికి వెళ్లగానే ఏకశిలపై నందీశ్వరుడు దర్శనమిస్తాడు. స్వామివారి ప్రాశస్త్యం సకల క్తిమూర్తివరాల ప్రదాత అయిన వీరభద్రస్వామి పడమటముఖుడై దశహస్తుడై, త్రినేత్రుడై రౌద్రపరాక్రమములతో విలసిల్లుతున్నాడు. భక్తులను ఆదుకునే పరమభోళామూర్తిగా దర్శనమిస్తున్నాడు. క్షుద్రగణాలకు వీరభద్రుడంటే భయం. అందుకే ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకునే భక్తులకు ఆయురారోగ్యాలు, సిరిసంపదలను అందుతాయని భక్తుల నమ్మిక. స్వామివారికి ఎడమవైపు చతుర్భుజములు కలిగి ఉండి శ్రీ భద్రకాళీ అమ్మవారు వెలసి ఉన్నారు. స్వామి వారికి ఇరువైపులా శివుడు(లింగాకారంలో) దర్శనమిస్తాడు. ఆలయానికి దక్షిణ దిశలో భద్రకాళి అమ్మవారు స్వయంశక్తిమూర్తిగా వెలిసి పూజలందుకుంటోంది. ఉత్సవాల్లో ముఖ్యఘట్టాలు.. జాతర ఉత్సవాల్లో భాగంగా ఈనెల 20న ఉదయం 9గంటలకు పసుపు, కుంకుమలు అర్చకులు ఆలయానికి తీసుకొస్తారు. సాయంత్రం 7గంటలకు అంకురార్పణ, అఖండకలశస్థాపన, ధ్వజారోహనం, రాత్రి 10గంటలకు బసవ ముద్ద కార్యక్రమం ఉంటుంది. 21న మహాశివరాత్రి రోజున స్వామి వారి ఆలయంలో సేవలు, రాత్రి 1.20గంటలకు(తెల్లవారితే శనివారం) స్వామి వారి కల్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇక 26వ తేదీన రథోత్సవం, 27వ తేదీన బండ్లు తిరుగుట, మార్చి 5వ తేదీన శ్రీ పార్వతీరామలింగేశ్వరస్వామి కల్యాణం, 6వ తేదిన పదహారు రోజుల పండుగతో ఉత్సవాలు ముగుస్తాయి. ముమ్మరంగా సాగుతున్న ఏర్పాట్లు కురవిలోని భద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి కల్యాణ మహోత్సవ జాతరకు ఆలయ అధికారులు, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బుధవారం నాటికి ఏర్పాట్లు పూర్తికానున్నాయి. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు ఏర్పాటుచేయగా... స్వామి కల్యాణ మహోత్సవం జరిగే నాగేంద్రస్వామి ఆలయ ఆవరణలో బారికేడ్లను ఆర్అండ్బీ అధికారులు నిర్మిస్తున్నారు. స్నాన ఘట్టాల వద్ద షవర్లు, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కావొస్తున్నాయి. మొత్తంగా జాతర ఏర్పాట్లు 95శాతం పూర్తి అయ్యాయి. ఈ మేరకు ఏర్పాట్లను మహబూబాబాద్ డీఎస్పీ నరేష్కుమార్ మంగళవారం పరిశీలించి పలు సూచనలు చేశారు. జాతర పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లపై కురవి ఎస్సై జక్కుల శంకర్రావుతో చర్చించారు. మహిమాన్వితుడు.. అగస్తీశ్వర స్వామి మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారు కొండపై స్వయంభూగా వెలసిన అగస్తీశ్వర స్వామి మహిమాన్వితుడిగా భక్తులతో పూజలు అందుకుంటున్నాడు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 21, 22, 23వ తేదీల్లో నిర్వహించే మహాజాతర మహోత్సవానికి మూడు జిల్లాల నుంచి భక్తులు హాజరుకానుండగా.. నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు.. సిద్ధేశ్వరా నమోనమః! బచ్చన్నపేట: ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన జనగామ జిల్ల బచ్చన్నపేట మండలంలోని కొడ్వటూరు గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వర ఆలయం మహా శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు గంగపూజ, ఋత్వికరణం, అవాహన దేవత పూజ, 20న ఏకదశరుద్రాభిషేకం, రుద్రహోమం, శతరుద్రాభిషేకం, 21వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన శ్రీ భద్రకాశి వీరభద్రేశ్వరస్వామి ఆహ్వానం, రాత్రి శివపార్వతుల కల్యాణం, లింగోద్భవ పూజ ఉంటాయి. 22న ఉదయం అగ్నిగుండ ప్రవేశం, గెలుపు ఆశీర్వాదంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. స్వామి కల్యాణానికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. -
తెరపైకి సాగునీటి ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కింద కోటి ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రక్రియ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో నీటి పారుదల వ్యవస్థ యాజమాన్యంలో రైతులకు భాగస్వామ్యం కల్పించే చర్యలు చేపట్టాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతుండటం, వాటి కింద నిర్మిస్తున్న కాల్వల ద్వారా సాగునీటిని అందిస్తున్న పరిస్థితుల్లో నీటి పారుదల వ్యవస్థ సక్రమ నిర్వహణ, సమర్ధ నీటి పంపిణీకి సాగునీటి సంఘాలను పునర్వ్యవస్థీకరించాలని యోచిస్తోంది. ఈ వ్యవస్థల సమగ్ర అభివృధ్ధికి వీలుగా ఈ సంఘాలకు గతంలోమాదిరి ఎన్నికలు నిర్వహించడమా లేక గ్రామ కమిటీలను నియమించడమా లేక లాటరీ పద్ధతిన ఉత్సాహవంతులను ఎంపికచేయడమా? అన్న అంశాలను పరిశీలిస్తోంది. 2014 వరకే పనిచేసిన సంఘాలు.. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి వినియోగదారులను సంఘటిత పరచడం, నీటి యాజమాన్యంలో రైతులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా 1997లో అప్పటి ప్రభుత్వం సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసింది. సాగునీటి వినియోగ సంఘాలు (డబ్ల్యూయూఏ), డిస్ట్రిబ్యూటరీ సంఘాలు(డీసీ), ప్రాజెక్టు కమిటీ(పీసీ)లను ఏర్పాటు చేసింది. 2014కు ముందు తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టుల్లో మేజర్ ప్రాజెక్టుల కింద నీటి వినియోగ సంఘాలు 744, డీసీలు 97, పీసీలు 8 వరకు ఉండేవి. ఇక మైనర్ కింద 3,876 వరకు నీటి సంఘాలు ఉండేవి. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వీటి ఎన్నికల్లో మార్పులు చేసింది. రొటేషన్‌లో ఈ సంఘాల కార్యవర్గాలు పనిచేసేలా చర్యలు తీసుకుంది. ప్రతి రెండేళ్లకోమారు మూడో వంతు సభ్యులకు ఎన్నికలు జరిపి రెండేళ్ల పదవీకాలం ముగిసే సభ్యులను మాజీలు చేయాలని సూచించింది. ఈ పద్ధతిలో 2006, 2008 సంవత్సరాల్లో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తూ వచ్చింది. ఈ సంఘాలే 2014 జనవరి వరకు ఉన్నా, తర్వాత ఎన్నికలు నిర్వహించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం సైతం రైతు సంఘాల జోలికి వెళ్లలేదు. -
కూటమికి ఓటేస్తే శనేశ్వరమే.. టీఆర్ఎస్ను గెలిపిస్తే కాళేశ్వరం
సాక్షి, బొమ్మలరామారం : ‘‘టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కాళేశ్వరం.. కూటమికి ఓటేస్తే శనేశ్వరం వస్తుంది.. ఏది కావాలో మీరే నిర్ణయించుకోవాలి’’ అని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. బొమ్మలరామారం, భువనగిరిలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభ, రోడ్‌షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ద్రోహులకు, ఉద్యమకారులకు జరుగుతున్న ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టాలో ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. పైళ్ల శేఖర్‌రెడ్డి, సునీత గెలుపును ఏ శక్తీ ఆపలేదన్నారు. టీఆర్ఎస్ను గెలిపిస్తే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తామని, కూటమికి ఓటేస్తే శనేశ్వరమే గతని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం పొందిన ఆలేరు అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డిని బంపర్ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత పాలకుల హయాంలో రైతులకు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల బాధ ఉండేదన్నారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. రైతు పక్షపాతిగా కేసీఆర్ రైతు బీమా పథకం లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. 90 శాతం పూరైన కొండ పోచమ్మ ప్రాజెక్ట్ ద్వారా కాలేశ్వరంకు అక్కడి నుంచి షామీర్పేట్ రిజర్వాయర్ నింపి లక్షా 57 ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆసరా పింఛన్ డబ్బులను డబుల్ చేస్తామని, ప్రతి బీడీ కార్మికురాలికి పీఎఫ్ కార్డుతో నిమిత్తం లేకుండా రెండు వేల పింఛన్ ఇస్తామన్నారు. భిక్షమయ్యగౌడ్‌పై భూ కబ్జా కేసులుంటే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డిపై తెలంగాణ ఉద్యమ కేసులున్నాయన్నారు. తెలంగాణ ద్రోహులకు ఉద్యమకారులకు జరిగే ఎన్నికల్లో ఎవరికి పట్టంకట్టాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఏ శక్తీ సునీత గెలుపును ఆపలేదని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే యాదగిరిగుట్టకు వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఫొటో ఉంటే ఓట్లు రావని పత్రిక ప్రకటనల్లో ఆయన చిత్రాన్ని తొలగించారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అడ్డుకున్న ఆంధ్రాబాబు తెలంగాణకు మేలు చేస్తాడని కోదండరామ్ అనడం దారుణమన్నారు. ఆలేరు అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆలేరుకు సాగు నీరు తేవడమే తన ముందున్న లక్ష్యమన్నారు. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని పోరాటం చేశామని, ఆ కలలు సాకారం కావాలంటే టీఆర్ఎస్ గెలుపే శరణ్యమన్నారు. ఆలేరులో మిషన్ కాకతీయ ద్వారా 590 చెరువులకు మరమ్మతులు జరిగాయన్నారు. మండలం లో మునీరాబాద్, ఖాజీపేట్ వద్ద చెక్ డ్యాం నిర్మి స్తామన్నారు. షామీర్పేట్ ద్వారా సాగు నీరు అం దించి మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని హా మీ ఇచ్చారు. అంతకు ముందు మండల కేం ద్రం లోని గుడిబావి చౌరస్తా నుంచి సభాస్థలి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మం డలంలోని పలు పార్టీల నుంచి పెద్ద సంఖ్య లో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, ఆల్ధా చైర్మన్ మోతే పిచ్చిరెడ్డి, ఆలేరు మర్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్, ఎంపీపీలు తిరుపతిరెడ్డి, గడ్డమీది స్వప్న, రామకృష్ణారెడ్డి, జెడ్పీటీసీలు జయమ్మ, రాజిరెడ్డి, ఉమరాణి, శ్రీశైలం, మన్నె శ్రీధర్, లక్ష్మి పాల్గొన్నారు. శేఖర్‌రెడ్డి గెలిస్తేనే కాళేశ్వరం ఏర్పాటు భువనగిరి : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు రావాలంటే పైళ్ల శేఖర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శనివారం రాత్రి భువనగిరిలో జరిగిన రోడ్‌షోలో పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పైళ్ల శేఖర్‌రెడ్డి లాంటి మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా రావడం నియోజకవర్గ ప్రజల అదృష్టం అన్నారు. కాంగ్రెస్ పార్టీతో తెలంగాణకు న్యాయం జరగలేదన్నారు. గత ప్రభుత్వాలు రూ.200 పింఛన్ ఇస్తే టీఆర్ఎస్ రూ.1000 ఇచ్చిందన్నారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే దానిని రూ.2,016కు పెంచుతామన్నారు. ప్రతి రైతుకు ఎకరానికి సంవత్సరంలో రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని పేర్కొన్నారు. పెట్టుబడి సాయం రావాలంటే కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను సాధించిన ఘనత కేసీఆర్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. భువనగిరి అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని దివంగత మంత్రి మాధవరెడ్డి తర్వాత ఆ విధంగా అభివృద్ధి చేస్తున్న వ్యక్తి పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఈనెల 7న జరిగే ఎన్నికల్లో పైళ్ళ శేఖర్‌రెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. మళ్లీ ఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తా 2014 ఎన్నికల మాదిరిగా మళ్లీ ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఆదరిస్తే భువనగిరి నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో భువనగిరి నియోజకవర్గంలో సాగు నీటి వనరులతోపాటు రోడ్లను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.2,016 పింఛన్ ఇస్తామన్నారు. బీబీనగర్ నిమ్స్‌లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిమ్స్ ఆసుపత్రిని ఎయిమ్స్‌గా మార్చేందుకు చేసిన కృషి టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, అందెల లింగం యాదవ్, ఎలిమి నేటి సందీప్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నువ్వుల ప్రసన్న, వైస్ చైర్పర్సన్ బర్రె మహాలక్ష్మి, చందుపట్ల వెంకటేశ్వర్రావు, పంతులు నాయక్, గోమారి సుధాకర్‌రెడ్డి, జనగాం పాండు, సత్తిరెడ్డి, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
కాళేశ్వరంలో ప్రముఖుల స్నానాలు
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరముక్తీశ్వర క్షేత్రంలో ఆదివారం సాయంత్రం పలువువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు. తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదనాచారితోపాటూ మాజీ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు పుణ్యస్నానాలు చేశారు. మరో వైపు కాళేశ్వరం వద్ద గోదావరి పుష్కరాల్లో రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 3 గంటల సమయానికి 3.5 లక్షల మంది స్నానాలు చేశారని అధికారులు చెబుతున్నారు. అయితే, కాళేశ్వరం- మహదేవపూర్ మార్గంలో దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.