Kadiam
-
రాజమండ్రి: రూట్ మార్చిన చిరుత
రాజమహేంద్రవరం రూరల్/కడియం: దివాన్ చెరువు అభయారణ్యంలో సంచరించిన చిరుత పులి కడియం నర్సరీ ప్రాంతానికి చేరినట్టు అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. కడియం – వీరవరం రోడ్డు మధ్యలోని దోసాలమ్మ కాలనీలో చిరుత జాడలు కనిపించాయి. దీంతో కాలనీ వాసులందరూ భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న దివాన్ చెరువు ఫారెస్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పద్మావతి, రేంజర్ శ్రీనివాస్, స్క్వాడ్ డీఆర్వో రాజా అండ్ టీమ్, రేంజ్ పరిధిలోని సిబ్బంది ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అవి చిరుత పాదముద్రలే అని గుర్తించారు. అయితే అది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందనే విషయం అంతుపట్టడం లేదు. కొన్ని నర్సరీలలో సీసీ కెమెరాలు ఉంటాయి. పులి భయంతో నర్సరీల్లో రైతులెవ్వరూ ఉండడం లేదు. చిరుత ఈ ప్రాంతంలోనే ఉందా, ఎక్కడికైనా వెళ్లిందా అన్న విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు, కూలీలకు బుధవారం నర్సరీలకు వెళ్లవద్దని సూచించారు. -
‘దృశ్యం’ సినిమాను తలపించిన ప్రీప్లాన్డ్ కిడ్నాప్ డ్రామా..
కడియం(తూర్పుగోదావరి): దృశ్యం సినిమా మాదిరిగా ‘కడియంలో కిడ్నాప్ కలకలం’ ముందస్తు ప్లాన్‌గా తేలింది. కడియంలోని ఓ ప్రైవేటు స్కూలులో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను గుర్తు తెలియని యువకులు ఆటోలో వచ్చి కిడ్నాప్ చేశారంటూ సోమవారం కలకలం రేగిన విషయం విదితమే. అయితే ఈ కిడ్నాప్ కథ మొత్తం పథకం రచన చేసింది కడియం గ్రామానికి చెందిన జి.సాయి దుర్గాప్రసాద్ అనే యువకుడేనని పోలీసులు తేల్చారు. అపహరణకు గురైన బాలికకు దుర్గాప్రసాద్ వరుసకు సోదరుడు. తనపై ఉన్న పోక్సో కేసుకు ప్రతీకారంగానే అతడు ఈ కథంతా నడిపిన విషయం బట్టబయలైంది. చదవండి: రూటు మార్చింది.. అనకాపల్లిలో ప్రవేశించిన పెద్దపులి ఈ వివరాలను కడియం పోలీస్ ఇన్స్పెక్టర్ డి.రాంబాబు మంగళవారం స్థానిక విలేకర్లకు తెలిపారు. ఒక బాలికను ట్రాప్ చేయడంతో జి.సాయి దుర్గాప్రసాద్‌పై గతంలో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై ఈ కేసు పెట్టడానికి కారకుడని ఒక యువకుడిపై దుర్గాప్రసాద్ కక్ష పెంచుకున్నాడు. ఆ యువకుడిని ఎలాగైనా ఇటువంటి కేసులోనే ఇరికించాలని మరికొందరితో కలిసి పథక రచన చేశాడు. ఈ నేపథ్యంలోనే కిడ్నాప్ నాటకానికి తెర తీశారు. అపహరణకు గురైనట్టు చెబుతున్న బాలిక కూడా ఇందుకు సహకరించడంతో అందరూ నిజమేనని నమ్మారు. అలాగే ఆటోలో వచ్చిన ముగ్గురు యువకులు.. బాలికను తమ ఎదురుగానే కిడ్నాప్ చేశారంటూ కొందరు మైనర్లు కూడా గట్టిగా చెప్పడంతో అటు గ్రామస్తులు, ఇటు పోలీసులు కూడా నమ్మారు. దీంతో బాలికను తీసుకువెళుతున్న ఆటోను, అందులోని యువకులను పట్టుకోవాలన్న ఉద్దేశంతో అందరూ పరుగులు పెట్టారు. అయితే తాను ఊహించిన దానికి భిన్నంగా అందరూ అప్రమత్తం కావడంతో ఈ నాటకానికి ముగింపు పలకాలని దుర్గాప్రసాద్ నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ధవళేశ్వరం సాయిబాబా ఆలయం వద్ద ఆటోలో నుంచి బాలికను దింపేశాడు. కిడ్నాప్‌నకు ప్రయత్నించిన వారు పరారయ్యారని, అడ్డుకోబోయిన తనను గాయపరిచారని నమ్మించాడు. అయితే ఆ గాయాన్ని కూడా అతడే చేసుకున్నాడని తేలింది. దుర్గాప్రసాద్, బాలిక చెబుతున్న విషయాలకు పొంతన కుదరకపోవడంతో ఇన్స్పెక్టర్ రాంబాబు, ఎస్సై షేక్ అమీనాబేగం వారిని తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం బయట పడింది. సోమవారం అర్ధరాత్రి సమయానికి వారి నుంచి పోలీసులు నిజాన్ని రాబట్టారు. కిడ్నాప్ మొత్తం కట్టుకథేనని తేల్చారు. ఆటోలో రావడం, బలవంతంగా తీసుకుపోవడం కూడా ఉత్తదేనని, సదరు బాలికను దుర్గాప్రసాదే మోటార్ సైకిల్‌పై తీసుకువెళ్లాడని నిర్ధారించారు. అయితే ఆటోను వెంబడిస్తున్నానంటూ పోలీసులను తప్పుదారి పట్టించినట్టు పోలీసు విచారణలో దుర్గాప్రసాద్ బయట పెట్టాడు. ఈ మొత్తం డ్రామాకు దుర్గాప్రసాదే కారణమని, అతడికి బాలికతో పాటు, మరికొందరు మైనర్లు సహకరించారని పోలీసులు తేల్చారు. కిడ్నాప్ నాటకంలో భాగస్వాములైన వారి కుటుంబ సభ్యులను మంగళవారం స్టేషన్‌కు పిలిపించారు. వారి సమక్షంలోనే వారందరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలకు సమాయత్తమవుతున్నారు. ఇంత మందిని హడలెత్తించింది ఒక యువకుడు, కొందరు మైనర్లు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. -
తూర్పుగోదావరి: ఆడుకోడానికి వెళ్లిన మైనర్ బాలికపై అత్యాచారం
సాక్షి, తూర్పుగోదావరి: కడియం మండలంలోని కడియపులంక పంచాయతీ పరిధఙలోని బుర్రిలంకలో మైనర్ బాలికపై ఒక కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒక నర్సరీలో పనిచేసేందుకు విశాఖ జిల్లా వి. మాడుగుల మండలం, వీరనారాయణపురానికి చెందిన భార్యభర్తలు, తమ ఇద్దరు కుమార్తెలతో వచ్చారు. వీరు ఉండే ఇంటికి సమీపంలోనే నివాసం ఉండే మారాజు కన్నంనాయుడు వీరి అయిదేళ్ల కుమార్తెలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంటి ముందు ఆడుకునేందుకు వెళ్లిన కుమార్తె ఇంతకీ రాకపోవడంతో ఆమెను వెతుక్కుఉంటూ వెళ్లిన తల్లి కన్నంనాయుడు ఇంట్లో గుర్తించింది. బాలికపై అత్యాచారం జరిగినట్లు గమనించిన తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడియం ఎస్సై షేక్ అమీనా బేగం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దిశ డీఎస్పీ కె. తిరుమలరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి తల్లిదందడ్రుతో మాట్లాడారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: తగ్గిస్తే పోయేది.. కుదరదన్నాడు.. చివరికి ప్రాణమే పోయింది బంధువుల ఇంట్లో గృహ ప్రవేశం.. పెరుగు తెస్తానని వెళ్లి -
ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు
కడియం: కుటుంబ కలహాలు ముగ్గురి ప్రాణాలు బలిగొన్నాయి. ఇంట్లో ఒకే గదిలో నిద్రిస్తున్న ఆరుగురిపై మేనల్లుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్లలో మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో చోటు చేసుకుంది. పెట్రోల్ పోసి నిప్పంటించాక, బయట తలుపునకు గొళ్లెం పెట్టేయడంతో ఒకే గదిలో ఉన్న వీరంతా బయటకు రాలేకపోయారు. తల్లి కోట్ని సత్యవతి (50), ఆమె కుమారుడు కోట్ని రాము (18), మనుమరాలు గంటా విజయలక్ష్మి (8) మృతి చెందారు. సత్యవతి కుమార్తె దుర్గాభవానీ, మనుమలు దుర్గామహేష్, ఏసుకుమార్ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దుర్గాభవానీకి 90 శాతానికి పైగా కాలిన గాయాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. మృతురాలు సత్యవతి భర్త అప్పారావు చెల్లెలి కొడుకు మాసాడ శ్రీను ఈ ఘటనకు బాధ్యుడిగా పోలీసులు భావిస్తున్నారు. మేనమామ కూతురినిచ్చి వివాహం చేస్తానని చెప్పి, అతడి వద్ద నుంచి ఆర్థిక సాయాన్ని పొందినట్టుగా చెబుతున్నారు. అయితే వివాహం చేయలేదు. మూడేళ్ల కిందట వేర్వేరు వివాహాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాను ఇచ్చిన డబ్బును తిరిగిచ్చేయాలని శ్రీను కొద్దిరోజులుగా మేనమామ కుటుంబంతో గొడవకు దిగుతున్నాడు. ఆరేళ్ల నుంచి ఈ ఘర్షణ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 17న పోలీసు కేసు కూడా నమోదైంది. కేసు విచారణలో ఉండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, మంటల తీవ్రతకు వీరు అద్దెకు ఉంటున్న పెంకుటింటికి నిప్పంటుకుని కాలిపోయింది. రాయవరంలో జరుగుతున్న తీర్థానికి వెళ్తున్న కొందరు యువకులు ఇల్లు కాలుతుండడాన్ని గమనించి తలుపు గొళ్లెం తొలగించి గదిలో ఉన్నవారిని, పక్కగదిలోనే ఉంటున్న ఇంటి యజమాని కానూరి రామాయమ్మను బయటకు తీసుకొచ్చారు. బాధితులను అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కాగా, ఘటన జరిగిన సమయంలో అప్పారావు ఇంట్లో లేరు. వాచ్‌మెన్‌గా పని చేస్తున్న ఆయన నైట్ డ్యూటీకి వెళ్లారు. -
ఈ పొదరిల్లు..ఎండలపై ఎక్కుపెట్టిన విల్లు..
కడియం (రాజమహేంద్రవరం రూరల్) : ఎండలు రోజురోజుకీ ముదురుతున్నాయి. గాలి సూర్యుడు నిశ్వాసలా వేడెక్కుతోంది. తరువుల నీడ తల్లుల చల్లని స్పర్శలా అనిపిస్తోంది. అలాంటిది సూర్యకిరణాన్ని కనీసంగానైనా చొరబడనివ్వనంత దట్టంగా లతలు అల్లుకున్న పొదరిల్లు ఇంకెంత హాయిగా ఉంటుంది! వినూత్నంగా ఆలోచించడంలో ఎప్పుడూ ముందుండే కడియం ప్రాంత నర్సరీ రైతులు వేసవి తీవ్రత కాచుకునేందుకు కూడా కొత్త కవచాలను కనిపెడుతుంటారు. వేసవిలో ఎండలను తట్టుకోలేని సున్నితమైన మొక్కలను కాపాడుకునేందుకు వాటికి నీడను ఇచ్చేందుకు అవిసె, మొక్కజొన్న వంటి మొక్కలను ఇప్పటికే వేసారు. నర్సరీల్లో విశ్రాంతి తీసుకునేందుకు నిర్మించిని షెడ్ల మీదికి క్రీపర్జాతి మొక్కల లతలను పాకించి, దట్టమైన, పచ్చని పైకప్పులా అల్లుకునేలా చేస్తున్నారు. కడియం మండలం బుర్రిలంకలోని శ్రీ శేషాద్రి నర్సరీలోని షెడ్డు.. పైన మొత్తం క్రీపర్ జాతి మొక్క అల్లుకోవడంతో చల్లని పొదరిల్లులా మారింది. ఎండ మండే వేళ ఈ షెడ్లో చేరితే.. భూమితల్లి పచ్చని చీరకొంగు కప్పిన అనుభూతి కలుగుతుంది. జాతీయ రహదారిపై ప్రయాణించే వారిని ఈ పచ్చని పర్ణశాల ఆకట్టుకుంటోంది. -
ఢిల్లీ బయలుదేరిన డిప్యూటీ సీఎం కడియం
హైదరాబాద్: తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సోమవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. తన అధ్యక్షతన ఏర్పాటైన బేటీ బచావో పథకం ఉపకమిటీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా బాలికలకు మరింత మెరుగైన విద్యావకాశాలు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పకడ్బందీగా అమలుచేస్తున్నది. ఇప్పటికే ఈ కమిటీ రెండుసార్లు భేటీ కాగా ఇప్పుడు మూడో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వంలోని మహిళా శిశు సంక్షేమం, పాఠశాల విద్యావిభాగం, వైద్య, ఆరోగ్యం తదితర మంత్రిత్వశాఖల నుంచి కూడా ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. బాలికల్లో విద్యావకాశాలు పెంపొందించడం, ఉత్తీర్ణతాశాతం పెంచడం, లింగవివక్షకు తావులేకుండా విధానాలు రూపొందించడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. -
బుద్ధభవన్‌తో మూడు దశాబ్దాల అనుబంధం
► ఉప ముఖ్యమంత్రి కడియం ► జ్థాననిధి బుద్దభవన్ : ఎంపీ సీతారాంనాయక్ ► ముగిసిన బుద్ధభవన్ 60 వసంతాల వేడుకలు హన్మకొండ : తాను రాజకీయాల్లోకి వచ్చిన 1987 నుంచి బుద్ధభవన్‌తో పరిచయం ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మూడు రోజులుగా జరుగుతున్న హన్మకొండ కుమార్‌పల్లిలోని బుద్ధభవన్ 60వసంతాల ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన కడియం మాట్లాడుతూ అప్పుడప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో బద్ధభవన్లో జరిగే అన్ని సామాజిక సమావేశాలకు, అధికార పక్షంతో ఎలాంటి పోరాటాలు చేయాలనే సమాలోచనలు చేసే క్రమంలో బుద్దభవన్ పాత్ర అనిర్వచనీయమన్నారు. అప్పుడే భగవాన్‌దాస్‌తో పరిచయం ఏర్పడిందన్నారు. ప్రభుత్వ సాయం లేకుండా యజ్ఞం లా పనిచేస్తూ బుద్దభవన్ నిర్మాణం చేసుకోవడం గొప్ప విషయం అన్నారు. విశిష్ట అతిధిగా హాజరైన కరీంనగర్ ఎంపి బోయినపెల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతు తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడు జరిగిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు బుద్దభవన్తో మంచి సం బందాలు ఏర్పడ్డాయని విద్యార్థి దశను గుర్తుచేసుకున్నారు. కాకతీయకెనాల్ ద్వారా కాలనీల కు నీరు తెచ్చిన ఘనత కమ్యూనిస్టుల ఉద్యమానిదే అన్నారు. నాడు కష్టాన్ని స్పూర్తిగా తీసుకుని నేటి తరం భవిష్యత్తులో ఉన్నత శిఖరాల ను చేరుకోవాలని అన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యమ నేతగా పేదల సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నాడన్నారు. బుద్దభవన్ పునః నిర్మానాణికి తన ఎంపీ నిధుల నుంచి 10లక్షలు మంజూరి చేయిస్తానని హామీ ఇచ్చారు. లైబ్రరీ, హాల్, పార్కింగ్తో బ్రహ్మాండంగా బుద్దభవన్ పునర్మిద్దామన్నారు. మహబూ బా బ్బాద్ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడు తు తన విద్యార్థి దశలో బుద్దభవన్ ప్రాంతంలో పదేళ్లు అద్దెకు తీసుకుని ఉన్నానని అన్నారు. అప్పుడు ఇప్పుడూ బుద్దభవన్ లో కూర్చుంటే తెలిరూ. యని మనశ్శాంతి లబిస్తుందని అన్నా రు. భూమి తవ్వితే నిధులు దొరుకుతాయో లేదో కాని బుద్దభవన్లో జ్ఞానినిధి మాత్రం లబిస్తుందని అన్నారు. బుద్దభవన్ అభివృద్దిలో తన వంతు సాయం చేస్తానని అన్నారు. ఈ సందర్బంగా బుద్దభవన్ ప్రాంత పెద్దలను సత్కరించారు. అంతకుముందు ఉదయం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు, క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు వీరగంటి రవీందర్, మిర్యాల్‌కార్ దేవేం దర్, బోడ డిన్నా, జోరిక రమేష్ ఉత్సవ కమిటీ సభ్యులు రాంచందర్, బీంరావ్ అంబేద్కర్, లెనిన్, రాజ్సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు. -
మా నాయకుడే బాహుబలి
హన్మకొండ: మా నాయకుడు సీఎం కేసీఆరే బాహుబలి అని, మా బాహుబలికి ఎదురెవరని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలో ఆదివారం జరిగిన టీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సమావేశంలో నియోజకవర్గ నివాసిగా ఆయన క్రీయాశీల సభ్యత్వం తీసుకుని పార్టీ సభ్వత్వ నమోదును ప్రారంభించారు. అంతకుముందు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎజెండా అంటూ లేదని దుయ్యబట్టారు. నాయకత్వం లేని ఆ పార్టీకి బాహుబలి ఎక్కడి నుంచి వస్తారని ప్రశ్నించారు. కమ్యూనిస్టులను ప్రజలు విశ్వసించరన్నారు. టీడీపీ తెలంగాణలో కనుమరుగైన పార్టీ అని తూర్పారబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులను పట్టించుకోలేదని, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో ముందుకు పోతుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు జరగకుండా గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి అడ్డంకులు సృష్టించిందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో పడి చౌకబారు విమర్శలు చేస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా ఎస్సీ, ఎస్టీల అభివృద్ది, సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చిందని తెలిపారు. ఈ ఫండ్‌కు అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. 2013 భూసేకరణ చట్టానికి రైతులకు మేలు చేకూర్చేలా సవరణలు చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపితే ఆమోదించొద్దని కాంగ్రెస్ పార్టీ వేయి దరఖాస్తులు ఇప్పించి దుర్మార్గంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అభివృద్ది పనులకు ఆటంకాలు కల్గిస్తోందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్ళపల్లి రవీందర్రావు, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, చైర్మన్ మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు. -
కడియం రాజీనామా చేయాలి : బీజేపీ
ములుగు : ఎంసెట్–2 లీకేజీకి నైతిక బా ధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి, డి ప్యూటీ సీఎం కడియం శ్రీహరి తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ చింతలపూడి భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎంసెట్–2 లీకేజీతో 60 వేల మంది విద్యార్థులు ఆగమయ్యారని మండిపడ్డారు. గతంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిlచేసిన టి.రాజయ్యను ఎలాంటి అవినీతికి పాల్పడ్డాడో చెప్పకుండా మంత్రివర్గం నుంచి తొలగించారన్నారు. ఎంసెట్–2లో ఇంత పెద్ద అవినీతి జరిగినా ఆ శాఖకు సంబంధించిన మం త్రిని సీఎం ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ఈ నెల 7న హైదరాబాద్‌లో జరిగే బూత్ కమిటీ సభ్యుల మహాసమ్మేళానికి జిల్లా నుంచి 10వేల మందితో తరలివెళ్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొత్త దశరథం, ప్రధాన కార్యదర్శి టి.కుమారస్వామి, మండల అధ్యక్షుడు బి.రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి చిన్నకొండారెడ్డి, డి.కిషన్‌రావు, కె.రామన్న, జితేందర్‌రావు, అభిషేక్, రాధమ్మ, బి.సతీశ్, వై.మొగిలి, ఎ.సాంబయ్య, ప్ర శాంత్‌రెడ్డి, గోవర్థన్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
కడియం ఇంటివద్ద ఎంఎస్ఎఫ్ భిక్షాటన
విద్యారణ్యపురి : ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధన కోసం జాతి కోసం మేము సైతం అం టూ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) కేయూ కమిటీ ఆధ్వర్యంలో గురువారం మాదిగ విద్యార్థులు మహాభిక్షాటన కార్యక్రమంను నిర్వహించారు. వర్గీకరణ చట్టబద్ధతకు ఈనెల 10న ఢిల్లీలో జరిగే మహాదీక్షకు తరలివెళ్లడం కోసం డిప్యూటీ సీఎం కడియంశ్రీహరి, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ ,నగర మేయర్ నన్నపనేని నరేందర్‌లను ఆ కమిటీ బాధ్యులు కలిసి చలో ఢిల్లీకోసం బిక్షాటన చేస్తూ విరాళాలు సేకరించారు. ఎమ్మార్పీఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొడ్డు దయాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అనేది న్యాయపరమైన డిమాండ్ అన్నారు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని వర్గీకరణపై స్పష్టమైన వైఖరిని ప్రకటిస్తూ పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టాలని లేనిపక్షంలో పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ కేయూ ఇన్చార్జి మంద భాస్కర్, బాధ్యులు ఎర్రోళ్ల పోచయ్య, బుర్రి సతీష్ మాదిగ, రాగళ్ల ఉపేందర్ మాదిగ, రవీందర్, గంగారపు శ్రీనివాస్, సుకుమార్, భిక్షపతి, భాస్కర్, రాజు, ప్రశాంత్ మాదిగ, శ్రీను, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. -
ఒరిగిన పాత బ్రిడ్జి: తప్పిన ప్రమాదం
కడియం (తూర్పుగోదావరి జిల్లా) : ఎనిమిది దశాబ్దాల క్రితం నిర్మించిన బ్రిడ్జి ఉన్నట్టుండి పక్కకు ఒరిగిపోయింది. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా కడియం శివారులో జరిగింది. పదేళ్లుగా ఈ బ్రిడ్జి వినియోగంలో లేదు. ద్విచక్రవాహనాలు, పాదచారులే వినియోగిస్తున్నారు. అయితే శ్రీఆంజనేయస్వామి జయంతి సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం భక్తులు ఈ బ్రిడ్జిపై సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేసుకున్నారు. భక్తులు భోజనాలు చేస్తుండగా బ్రిడ్జి పక్కకు ఒరిగిపోయింది. అయితే గమనించిన భక్తులు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ బ్రిడ్జిని 1935లో నిర్మించారు. -
రోడ్డుపై తెగిపడిన హైటెన్షన్ తీగ
కడియం (తూర్పు గోదావరి) : హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడిన ఘటనలో కొద్దిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. కడియం మండలం వేమగిరి వద్ద విశాఖ- విజయవాడ రహదారిపై శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో 132 కెవి విద్యుత్ తీగ ఒక్కసారిగా తెగిపడింది. అయితే తీగ నేలను తాకిన వెంటనే విద్యుత్ ట్రిప్ అయ్యే ఏర్పాటు ఉండటంతోపాటు ఆ సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న స్థానిక ఏఈ శ్రీనుబాబు సిబ్బందితో అక్కడికి చేరుకుని విద్యుత్ తీగను తొలగించే పని చేపట్టారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. విద్యుత్ తీగను తొలగించిన అనంతరం రాకపోకలను పునరుద్ధరించనున్నారు. -
స్నేహబంధం.. ఎంత అందం
పండుగలకు, పబ్బాలకు- ఇళ్లలో విందు భోజనం ఎంత సాధారణమో.. కడియం నర్సరీల్లో కనువిందూ అంతే సాధారణం. ప్రత్యేకంగా జరుపుకొనే ప్రతి వేడుకకూ వన్నెలద్దడం అక్కడి నర్సరీల వారికి వెన్నతో పెట్టిన విద్య. ‘ఫ్రెండ్షిప్ డే’ని పురస్కరించుకునీ వారు ఆ రివాజును పాటించారు. స్నేహంలోని గుబాళింపును ‘కళ్లకు కట్టిస్తున్న’ ఈ కూర్పు పరిమళం స్థానిక పల్ల వెంకన్న నర్సరీలోనిది. సందర్శకుల కోసం ఈ ఏర్పాటు చేసినట్టు నర్సరీ రైతులు పల్ల సత్తిబాబు, సుబ్రహ్మణ్యం, గణపతి, వెంకటేష్ చెప్పారు.