కడియం రాజీనామా చేయాలి : బీజేపీ
Published Fri, Aug 5 2016 12:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
ములుగు : ఎంసెట్–2 లీకేజీకి నైతిక బా ధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి, డి ప్యూటీ సీఎం కడియం శ్రీహరి తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ చింతలపూడి భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎంసెట్–2 లీకేజీతో 60 వేల మంది విద్యార్థులు ఆగమయ్యారని మండిపడ్డారు. గతంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిlచేసిన టి.రాజయ్యను ఎలాంటి అవినీతికి పాల్పడ్డాడో చెప్పకుండా మంత్రివర్గం నుంచి తొలగించారన్నారు. ఎంసెట్–2లో ఇంత పెద్ద అవినీతి జరిగినా ఆ శాఖకు సంబంధించిన మం త్రిని సీఎం ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ఈ నెల 7న హైదరాబాద్‌లో జరిగే బూత్ కమిటీ సభ్యుల మహాసమ్మేళానికి జిల్లా నుంచి 10వేల మందితో తరలివెళ్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కొత్త దశరథం, ప్రధాన కార్యదర్శి టి.కుమారస్వామి, మండల అధ్యక్షుడు బి.రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి చిన్నకొండారెడ్డి, డి.కిషన్‌రావు, కె.రామన్న, జితేందర్‌రావు, అభిషేక్, రాధమ్మ, బి.సతీశ్, వై.మొగిలి, ఎ.సాంబయ్య, ప్ర శాంత్‌రెడ్డి, గోవర్థన్‌రెడ్డిలు పాల్గొన్నారు.
Advertisement