kakatiya hills
-
కుప్పకూలిన భవనం : నలుగురికి గాయాలు
-
కుప్పకూలిన భవనం : నలుగురికి గాయాలు
హైదరాబాద్: మాదాపూర్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక కాకతీయ హిల్స్లో నిర్మాణంలో ఉన్న నూతన భవనం పిల్లర్ ఒక్కసారిగా కుప్పకూలింది. అదే సమయంలో అక్కడ పని చేస్తున్న నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కల కారణాలతో పాటు క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.