kalwakurthy lift irrigation
-
'కేఎల్ఐ ప్రాజెక్టుపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదు'
హైదరాబాద్: టీఆర్ఎస్ మేనిఫెస్టో మొదటి అబద్ధాల పుస్తకం అయితే.. రాష్ట్ర బడ్జెట్ రెండో అబద్ధాల పుస్తకమని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పేర్కొన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 2017 ఖరీఫ్ కల్లా పూర్తిస్థాయి ఆయకట్టుకు నీళ్లు అందిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులు పదే పదే చెబుతూ మోసగిస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. హామీ నెరవేరాలంటే బడ్జెట్ లో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు ఆ మేరకు ఎందుకు నిధుల కేటాయింపు జరపలేదని.. దీంతో కేఎల్ఐ పూర్తి చేయడంపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని తెలుస్తుందన్నారు. చిత్తశుద్ధి ఉంటే రూ.1,772 కోట్లు బడ్జెట్ లో కేటాయింపు చేయాల్సింది.. కానీ కేవలం వెయ్యి కోట్లే కేటాయించారు. రాష్ట్ర బడ్జెట్ రైతులను ఉరికంబం ఎక్కించేలా ఉందని, మొత్తం బడ్జెట్ లో నాలుగు శాతం నిధులు మాత్రమే కేటాయించడంపై అనుమానాలు వ్యక్తంచేశారు. 'ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయంలో పూర్తి చేయకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తాం. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ ఉత్పత్తులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ వ్యవసాయంపై చూపుతున్న నిర్లక్ష్యమే దీనికి కారణం. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మార్చి 8, 2017 వరకు 2,722 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా కేసీఆర్ వ్యవసాయానికి బడ్జెట్ లో కేటాయింపులు తగ్గించారు. కేవలం కమీషన్లు వచ్చే పనులకే అధిక కేటాయింపులు చేశారు. పాలకు ప్రోత్సహకాలను నాలుగు రూపాయలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు అది అమలు చేయకపోవడం దారుణం. హరీష్ రావు చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలు. బూటకపు మాటలు చెబుతున్నారు. ప్రతిసారి ప్రజలను మోసం చేయలేరు. జనం తిరగబడి మీ భరతం పట్టె సమయం దగ్గర పడుతోంది' అని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అన్నారు. -
8న కల్వకుర్తి ఆయకట్టుకు నీటి విడుదల
- 1.50లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక సాక్షి, హైదరాబాద్ పాలమూరు జిల్లాలో ఇప్పటి కే నిర్మాణంలో ఉన్న నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేసిన ప్రభుత్వం ఈ నెల 8 నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింది ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. కల్వకుర్తి లిఫ్టు-3 కింద నీటిని విడుదల చేయడం ద్వారా మొత్తంగా 1.50లక్షల ఎకరాలకు నీరందించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది కృష్ణా జలాల్లో ఆశాజనకంగా నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో జులై నుంచి జూరాల ప్రాజెక్టు నీటిపై ఆధారపడ్డ నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌లకు నీటిని మళ్లిస్తోంది. ఇప్పటికే ఈ మూడు ప్రాజెక్టు లపరిధిలో 12 టీఎంసీల వరకు నీటిని మళ్లించి 1.50లక్ష లనుంచి 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించింది. నీటి విడుదల కొనసాగుతోంది. మొత్తంగా కల్వకుర్తి కింద 1.50లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 1.50లక్షలు, భీమా ద్వారా 1.40లక్షలు, కోయిల్‌సాగర్ ద్వారా 20వేల ఎకరాలకు కలిపి మొత్తంగా 4.60లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించగా, ఇందులో ఇప్పటికే సగం అంచనాకు చేరుకుంది. తాజాగా కల్వకుర్తిలోని గుడిపల్లి వద్ద మూడో లిఫ్టులోని రెండు మోటార్లను ఈ నెల 8న ఆరంభించి ఆయకట్టుకు నీరిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే మూడో లిఫ్టులోని మిగతా మూడు మోటార్లను విడతల వారీగా ఆరంభించేందుకు కసరత్తు చే స్తోంది. కృష్నా జలాల్లో తమకున్న నీటి వాటా 299 టీఎంసీల్లోంచే ఈ నీటిని వాడుకుంటున్నందున దీనికి ఎవరి అభ్యంతరం ఉండబోదని తెలంగాణ భావిస్తోంది. -
'బాబు నిజస్వరూపం మరోసారి బయటపడింది'
హైదరాబాద్ : లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న అక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించ తలపెట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం దారుణమని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో బుధవారం హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజస్వరూపం మరోసారి బయటపడిందని ఆయన వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు అన్న చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుపై టీటీడీపీ నేతలు స్పందించాలని మంత్రి హరీష్ ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేశారు.