- 1.50లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్
పాలమూరు జిల్లాలో ఇప్పటి కే నిర్మాణంలో ఉన్న నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేసిన ప్రభుత్వం ఈ నెల 8 నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింది ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. కల్వకుర్తి లిఫ్టు-3 కింద నీటిని విడుదల చేయడం ద్వారా మొత్తంగా 1.50లక్షల ఎకరాలకు నీరందించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు నీటి పారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది కృష్ణా జలాల్లో ఆశాజనకంగా నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో జులై నుంచి జూరాల ప్రాజెక్టు నీటిపై ఆధారపడ్డ నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌లకు నీటిని మళ్లిస్తోంది. ఇప్పటికే ఈ మూడు ప్రాజెక్టు లపరిధిలో 12 టీఎంసీల వరకు నీటిని మళ్లించి 1.50లక్ష లనుంచి 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించింది. నీటి విడుదల కొనసాగుతోంది. మొత్తంగా కల్వకుర్తి కింద 1.50లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 1.50లక్షలు, భీమా ద్వారా 1.40లక్షలు, కోయిల్‌సాగర్ ద్వారా 20వేల ఎకరాలకు కలిపి మొత్తంగా 4.60లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించగా, ఇందులో ఇప్పటికే సగం అంచనాకు చేరుకుంది. తాజాగా కల్వకుర్తిలోని గుడిపల్లి వద్ద మూడో లిఫ్టులోని రెండు మోటార్లను ఈ నెల 8న ఆరంభించి ఆయకట్టుకు నీరిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే మూడో లిఫ్టులోని మిగతా మూడు మోటార్లను విడతల వారీగా ఆరంభించేందుకు కసరత్తు చే స్తోంది. కృష్నా జలాల్లో తమకున్న నీటి వాటా 299 టీఎంసీల్లోంచే ఈ నీటిని వాడుకుంటున్నందున దీనికి ఎవరి అభ్యంతరం ఉండబోదని తెలంగాణ భావిస్తోంది.
8న కల్వకుర్తి ఆయకట్టుకు నీటి విడుదల
Published Sun, Sep 4 2016 7:52 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement