'బాబు నిజస్వరూపం మరోసారి బయటపడింది' | minister harish rao fire on chandra babu on kalwakurthy lift irrigation issue | Sakshi
Sakshi News home page

'బాబు నిజస్వరూపం మరోసారి బయటపడింది'

Published Wed, Nov 18 2015 11:27 AM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM

minister harish rao fire on chandra babu on kalwakurthy lift irrigation issue

హైదరాబాద్ : లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న అక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహించ తలపెట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం దారుణమని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. హైదరాబాద్లో బుధవారం హరీష్రావు మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజస్వరూపం మరోసారి బయటపడిందని ఆయన వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు అన్న చంద్రబాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుపై టీటీడీపీ నేతలు స్పందించాలని మంత్రి హరీష్ ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement