kandikunta vekata prasad
-
ఆఫీస్‌కు వచ్చి కొడతాను: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట
-
టీడీపీ నేత కందికుంటకు శిక్ష పడేనా..?
కదిరి: టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్‌కు సంబంధించిన నకిలీ డీడీల కుంభకోణం కేసు మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణకు రానుంది. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో డీడీలను అపహరించి రూ.8.29 కోట్లు కాజేశారనే ఆరోపణలు రుజువు కావడంతో ఆయనకు నాంపల్లి సీబీఐ కోర్టు గతంలో ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.13 లక్షల జరిమానా విధించింది. అలాగే హైదరాబాద్‌లోనే ఓల్డ్ సిటీలో ఉన్న ఎస్బీఐ హుస్సేన్ ఆలంఖాన్ బ్రాంచ్‌లో కూడా డీడీల కుంభకోణం చేసి రూ.3.20 కోట్లు మోసం చేశారనే మరో కేసులో ఆయనకు రెండేళ్ల క్రితం సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులను సవాల్ చేస్తూ ఆయన అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు కేసుల్లో ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈయనపై నమోదైన ఈ రెండూ వేర్వేరు కేసులైనప్పటికీ హైకోర్టు ఒకటిగా పరిగణించి ఈనెల 18న విచారించనుంది. కోర్టులో శిక్ష పడిన కందికుంట వెంకట ప్రసాద్ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారంటూ 2019 ఎన్నికల సమయంలో కొందరు అభ్యంతరం తెలిపారు. అయితే కోర్టు అనుమతివ్వడంతోనే ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు అప్పటి కదిరి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింట్ అధికారి అజయ్‌కుమార్ తెలియజేశారు. కోర్టులో శిక్ష పడిన ఖైదీ కందికుంటకు టీడీపీ అధినేత చంద్రబాబు కదిరి టికెట్ ఇచ్చారని, అలాంటి వ్యక్తిని చిత్తుగా ఓడించాలని వైఎస్సార్సీపీ ఎన్నికల సమయంలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీన్ని ప్రజలు నమ్ముతూ 2019 ఎన్నికల్లో కందికుంటను ఓడించి వైఎస్సార్సీపీ అభ్యర్థి డా.పీవీ సిద్దారెడ్డిని సుమారు 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఈ తరుణంలో కందికుంటపై నమోదైన రెండు వేర్వేరు బ్యాంకులకు సంబందించి నకిలీ డీడీల కేసు 18న విచారణకు రానుందని తెలిసి ఆ పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. -
‘రేపో మాపో మళ్లీ జైలు కెళ్తావ్.. గుర్తుంచుకో’
కదిరి(అనంతపురం జిల్లా): ‘పంజాబ్ నేషనల్ బ్యాంకులో సుమారు రూ. 9 కోట్ల నకిలీ డీడీల కుంభకోణంలో నువ్వు ఏ 2 ముద్దాయి. ఈ కేసులో నీకు జైలు శిక్షతోపాటు రూ.13 లక్షల జరిమానా కూడా పడింది. శిక్షపడిన ఖైదీ నువ్వు విమర్శించడమా’ అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌పై కదిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి మండిపడ్డారు. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఆదివారం కందికుంట తనపై చేసిన వ్యక్తిగత విమర్శలకు ఘాటుగా స్పందించారు. మంగళవారం సిద్ధారెడ్డి తన ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడుతూ కందికుంటపై నిప్పులు చెరిగారు. ‘నన్ను మూడు పార్టీలు మారావని విమర్శించే ముందు మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని పార్టీలు మారారో వెళ్లి బాబునడుగు? కదిరి మున్సిపాలిటీతోపాటు అన్ని మండలాల్లో టీడీపీ జెండా ఎగురవేస్తామని నీవు చెబుతున్నావ్. అందాకా ఎందుకు. మా పార్టీని వీడి మీ పార్టీలోకి వచ్చిన కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా చేత రాజీనామా చేయించు. అప్పుడు మా పార్టీ తరపున నేను నిలబడతాను. మీ పార్టీ తరపున నువ్వు నిలబడతావో..లేక చాంద్‌బాషాను నిలబెడతారో తేల్చుకోండి. ఎవరు గెలుస్తారో తేలిపోతుంది’ అని సవాల్ విసిరారు. ‘ఎస్బీఐ డీడీల స్కాం కేసులో రేపో, మాపో మీరు మళ్లీ జైలుకు వెళ్లబోతున్నారు. ఇప్పటికే మీరు శిక్ష పడిన ఖైదీ. రాబోయే రోజుల్లో మీరు కనీసం వార్డు మెంబర్‌గా కూడా పోటీ చేయడానికి అర్హుడు కాదన్న విషయం గుర్తుంచుకుంటే మంచిది’ అని హితవు పలికారు. నిజాయితీ, నిబద్దతతో ప్రజలకు సేవచేయడం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, పార్టీ టికెట్ రాకపోతే సొంత పార్టీ బలపరిచిన వ్యక్తిని ఓడించడానికి ఆయనలాగా రెబెల్‌గా పోటీ చేయలేదని, సొంత పార్టీ నేతలపై చెప్పులు విసరలేదు’ అని ఘాటుగా విమర్శించారు.